
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో కాలుష్య నియంత్రణ చర్యలు(గ్రాప్) రెండో దశకు చేరుకున్నాయి. మంగళవారం(అక్టోబర్22) ఉదయం 8 గంటల నుంచి ఢిల్లీలో నిర్మాణరంగ పనులు,డీజిల్ జనరేటర్లపై నిషేధం అమలు చేయనున్నారు.
ఢిల్లీలో తాజాగా వాయు నాణ్యత 301-400 పాయింట్ల మధ్య పడిపోవడంతో గ్రాప్ రెండో దశ చర్యలు అమలు చేయాలని నిర్ణయించారు. గ్రాప్-2లో భాగంగా రోడ్లను వాక్యూమ్ క్లీనర్‌తో శుభ్రం చేయడంతో పాటు రోడ్లపై దుమ్ము లేవకుండా నీళ్లు చళ్లనున్నారు.
కాగా, ఢిల్లీ కాలుష్యానికి బీజేపీ డర్టీ పాలిటిక్సే కారణమని సీఎం అతిషి ఇప్పటికే ఆరోపించారు. బీజేపీ పాలిత రాష్ట్రాలైన హర్యానా,ఉత్తరప్రదేశ్‌లు ఢిల్లీని కాలుష్యమయంగా మారుస్తున్నాయని ఆమె మండిపడ్డారు. ఆమ్‌ఆద్మీపార్టీ అధికారంలో ఉన్న పంజాబ్ మాత్రం కాలుష్యం కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటోందని చెప్పారు.
ఇదీ చదవండి: కిలో ఉల్లికి రూ.35.. ఎక్కడంటే
Comments
Please login to add a commentAdd a comment