లండన్‌కు చెందిన ఒక మోడల్ ఊహకందని రీతిలో ప్రమాదం బారినపడింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆ మోడల్ సదరు షూ కంపెనీపై £ 100,000 (సుమారు ఒక కోటి రూపాయలు) నష్టపరిహారం కోసం కేసు వేసింది. ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ తెలిపింది.
న్యూస్ సైట్ ది మిర్రర్ నివేదిక ప్రకారం 31 ఏళ్ల క్లో మికెల్‌బరో 2018లో మిలన్‌లోని డిజైనర్ బేస్‌లో ప్రకటనల షూట్‌లో పాల్గొంది. వాక్‌వేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మోడల్ కాలి మడమ విరిగింది. తీవ్రమైన నొప్పి, కాలు వాపుతో ఆమె చాలా రోజులు మంచం మీదనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమెకు హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది.
దీంతో క్లో ఆ షూ కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇకపై తాను ఎవరికీ డాన్స్ నేర్పించలేనని, తానూ డ్యాన్స్ చేయలేనని, పరిగెత్తలేనని కోర్టు ముందు మొరపెట్టుకుంది. అయితే స్టెల్లా మాక్‌కార్ట్‌నీ లిమిటెడ్ షూ కంపెనీ ఆమె వాదనను ఖండించింది. కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్ పాట్రిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు నడక మార్గంలో ప్రమాదం జరిగింది. ఆమె తన బరువును నియంత్రించుకోలేక పడిపోయింది. కాగా కేసు కోర్టు విచారణలో ఉంది.
ఇది కూడా చదవండి: ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది?
Comments
Please login to add a commentAdd a comment