modal
-
కాలు జారిన మోడల్.. షూ కంపెనీదే తప్పంటోంది!
లండన్‌కు చెందిన ఒక మోడల్ ఊహకందని రీతిలో ప్రమాదం బారినపడింది. దీంతో ఆమె జీవితాంతం హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపధ్యంలో ఆ మోడల్ సదరు షూ కంపెనీపై £ 100,000 (సుమారు ఒక కోటి రూపాయలు) నష్టపరిహారం కోసం కేసు వేసింది. ఆ షూ కంపెనీకి చెందిన హీల్స్ ధరించడం కారణంగానే తాను ప్రమాదం బారినపడినట్లు ఆ మోడల్ తెలిపింది. న్యూస్ సైట్ ది మిర్రర్ నివేదిక ప్రకారం 31 ఏళ్ల క్లో మికెల్‌బరో 2018లో మిలన్లోని డిజైనర్ బేస్‌లో ప్రకటనల షూట్లో పాల్గొంది. వాక్‌వేపై నడుచుకుంటూ వెళ్తుండగా కాలు స్లిప్ అయి పడిపోయింది. ఈ ప్రమాదంలో ఆ మోడల్ కాలి మడమ విరిగింది. తీవ్రమైన నొప్పి, కాలు వాపుతో ఆమె చాలా రోజులు మంచం మీదనే రెస్ట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాగే ఆమెకు హీల్స్ ధరించలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో క్లో ఆ షూ కంపెనీ నుంచి పరిహారం పొందేందుకు కోర్టును ఆశ్రయించింది. తన ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా ఇకపై తాను ఎవరికీ డాన్స్ నేర్పించలేనని, తానూ డ్యాన్స్ చేయలేనని, పరిగెత్తలేనని కోర్టు ముందు మొరపెట్టుకుంది. అయితే స్టెల్లా మాక్కార్ట్నీ లిమిటెడ్ షూ కంపెనీ ఆమె వాదనను ఖండించింది. కంపెనీ తరపు న్యాయవాది మైఖేల్ పాట్రిక్ తెలిపిన వివరాల ప్రకారం ఆమెకు నడక మార్గంలో ప్రమాదం జరిగింది. ఆమె తన బరువును నియంత్రించుకోలేక పడిపోయింది. కాగా కేసు కోర్టు విచారణలో ఉంది. ఇది కూడా చదవండి: ఆ గ్రామం కేన్సర్ నిలయంగా ఎందుకు మారింది? -
‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!
ఎక్కడైనా ప్రేమికుడు లేదా భర్త తన భాగస్వామితో ‘నువ్వు కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తానని’ అంటాడు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ దీనికి భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని ఎనిమిదిమంది భార్యలు అతనిని సిక్స్ ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారు. జిమ్‌లో చెమటలు చిందిస్తూ.. తాజాగా బ్రెజీలియన్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్థర్ ఓ ఉర్సో వార్తల్లోకి ఎక్కాడు. అతని 8 మంది భార్యలు సామూహికంగా తన ముందు ఒక విచిత్రమైన డిమాండ్ ఉంచారని, దానితో తనకు తలనొప్పులు ఎదురయ్యాయని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. తన ఎనమండుగురు భార్యలు తనను సిక్స్‌ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారని, దీంతో తాను జిమ్‌లో చెమటలు చిందించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో పాటు ఆర్థర్ తన వైవాహిక జీవితం గురించి కూడా వెల్లడించాడు. తన భార్యలు ప్రతిరోజూ తన అండర్వేర్ చెక్ చేస్తారని తెలిపాడు. ఇందుకు వారికున్న ప్రత్యేక శ్రద్ధనే కారణమని తెలిపాడు. ఒకరితో విడాకులు 2022లో ఆర్థర్ 9 మంది యువతులను వివాహం చేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే వీరిలో ఒక మహిళ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పడు ఆర్థర్ తన 8 మంది భార్యల డిమాండ్ మేరకు సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ఆర్థర్ తనను తాను జిమ్‌కు సమర్పించుకున్నాడు. తన శరీరపు కొలతల్లో మార్పు వచ్చిదోలేదో తెలుసుకునేందుకు తన భార్యలు ప్రతీరోజూ తన అండర్‌వేర్‌ను కొలుస్తుంటారని ఆర్థర్ వెల్లడించాడు. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ వివాదాస్పదం సిక్స్‌ప్యాక్ కోసం ఆర్థర్ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం మానివేశాడు. చివరికి బ్రెడ్, పాస్తా కూడా తినడంలేదని తెలిపాడు. ఒలింపిక్ ఎథలెట్స్ కోసం డిజైన్ చేసిన వ్యాయామాలను ఆర్థర్ అనుసరిస్తున్నాడు. కాగా ఆర్థర్ 9 మంది భార్యలతో ఉన్నప్పుడు తాను పిల్లలను కనాలనుకుంటే ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ పాటిస్తానని తెలిపాడు. అప్పట్లో ఆర్థర్ చేసిన ఈ వ్యాఖ్యానం పెద్ద దుమారమే రేపింది. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! -
మోడల్ వయోజన విద్య కేంద్రం ప్రారంభం
సంగం : మండలంలోని సిద్దీపురానికి మంజూరైన మోడల్ వయోజన విద్యాకేంద్రాన్ని ఎంపీపీ దగుమాటి కామాక్షమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయంలు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ జయరామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ చదువుకోవాలనే ఉద్ధేశంతో ప్రభుత్వం మోడల్ వయోజన విద్యాకేంద్రాలను ఏర్పాటుచేసిందన్నారు. జిల్లాకు ఆరు కేంద్రాలు మంజూరు కాగా అందులో సిద్దీపురం ఒకటన్నారు. ఈ కేంద్రానికి రూ.2.50 లక్షలతో కంప్యూటర్, కుర్చీలు, వయోజనులకు అవసరమైన ఆటవస్తువులు, వేయింగ్ మిషన్, కుట్టుమిషన్ తదితర వస్తువులను అందజేశారన్నారు. ఎంపీపీ మాట్లాడుతూ నిరక్ష్యరాసులపై సాక్షరభారత్ కో–ఆర్డినేటర్లు ప్రత్యేకశ్రద్ధ పెట్టాలన్నారు. ప్రతి ఒక్కరూ చదువుకుని సిద్దీపురం గ్రామాన్ని సంపూర్ణ అక్షరాస్యత గ్రామంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. అనంతరం జెడ్పీటీసీ, అన్నారెడ్డిపాళెం సాగునీటి సంఘం అధ్యక్షుడు సూరా శ్రీనివాసులురెడ్డిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ వైస్ ప్రెసిడెంట్ వెంగళరెడ్డి, వెంగారెడ్డిపాళెం మాజీ సర్పంచ్ ఆనం ప్రసాద్‌రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.