Every Day My Underwear Was Checked, Says Brazil Model - Sakshi
Sakshi News home page

‘ప్రతిరోజూ నా అండర్‌వేర్‌ చెక్‌ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!

Published Wed, Aug 16 2023 8:24 AM | Last Updated on Wed, Aug 16 2023 8:58 AM

Every Day my Underwear is Checked says Brazil Model - Sakshi

ఎక్కడైనా ప్రేమికుడు లేదా భర్త తన భాగస్వామితో ‘నువ్వు కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తానని’ అంటాడు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్‌ దీనికి భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని ఎనిమిదిమంది భార్యలు అతనిని సిక్స్‌ ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారు. 

జిమ్‌లో చెమటలు చిందిస్తూ..
తాజాగా బ్రెజీలియన్‌ మోడల్‌, సోషల్‌ మీడియా ఇన్ఫ్లుయెన్సర్‌ ఆర్థర్‌ ఓ ఉర్సో వార్తల్లోకి ఎక్కాడు. అతని 8 మంది భార్యలు సామూహికంగా తన ముందు ఒక విచిత్రమైన డిమాండ్‌ ఉంచారని, దానితో తనకు తలనొప్పులు ఎదురయ్యాయని ఆర్థర్‌ చెప్పుకొచ్చాడు. తన ఎనమండుగురు భార్యలు తనను సిక్స్‌ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారని, దీంతో తాను జిమ్‌లో చెమటలు చిందించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో పాటు ఆర్థర్‌ తన వైవాహిక జీవితం గురించి కూడా వెల్లడించాడు. తన భార్యలు ప్రతిరోజూ తన అండర్‌వేర్‌ చెక్‌ చేస్తారని తెలిపాడు. ఇందుకు వారికున్న ప్రత్యేక శ్రద్ధనే కారణమని తెలిపాడు. 

ఒకరితో విడాకులు
2022లో ఆర్థర్‌ 9 మంది యువతులను వివాహం చేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే వీరిలో ఒక మహిళ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పడు ఆర్థర్‌ తన 8 మంది భార్యల డిమాండ్‌ మేరకు సిక్స్‌ప్యాక్‌ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ఆర్థర్‌ తనను తాను జిమ్‌కు సమర్పించుకున్నాడు. తన శరీరపు కొలతల్లో మార్పు వచ్చిదోలేదో తెలుసుకునేందుకు తన భార్యలు ప్రతీరోజూ తన అండర్‌వేర్‌ను కొలుస్తుంటారని ఆర్థర్‌ వెల్లడించాడు.

‘ఫస్ట్‌ కమ్‌, ఫస్ట్‌ సర్వ్‌’ రూల్‌ వివాదాస్పదం
సిక్స్‌ప్యాక్‌ కోసం ఆర్థర్‌ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం మానివేశాడు. చివరికి బ్రెడ్‌, పాస్తా కూడా తినడంలేదని తెలిపాడు. ఒలింపిక్‌ ఎథలెట్స్‌ కోసం డిజైన్‌ చేసిన వ్యాయామాలను ఆర్థర్‌ అనుసరిస్తున్నాడు. కాగా ఆర్థర్‌ 9 మంది భార్యలతో ఉన్నప్పుడు తాను పిల్లలను కనాలనుకుంటే ‘ఫస్ట్‌ కమ్‌, ఫస్ట్‌ సర్వ్‌’ రూల్‌ పాటిస్తానని తెలిపాడు. అప్పట్లో ఆర్థర్‌ చేసిన ఈ వ్యాఖ్యానం పెద్ద దుమారమే రేపింది.  
ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement