every day
-
యమునా హారతికి పోటెత్తిన జనం
యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగే గంగా హారతి మాదిరిగా ఢిల్లీలోని వాసుదేవ్ ఘాట్‌పై యుమునా హారతి ప్రారంభమయ్యింది. ఢిల్లీ ప్రజలకు యమునా నదిపై ఉన్న ఆరాధనా భావాన్ని ఇది మరింత పెంపొందించనుంది. మార్చి 20న సాయంత్రం వేళ వాసుదేవ్ ఘాట్‌పై తొలిసారిగా యమునా హారతి కార్యక్రమం జరిగింది. దీనిని తిలకించేందుకు భారీ సంఖ్యలో జనం తరలివచ్చారు. ప్రస్తుతానికి యమునా నది ఒడ్డున వారానికి రెండు రోజులు అంటే మంగళవారం, ఆదివారం సాయంత్రం వేళల్లో హారతి కార్యక్రమం నిర్వహించనున్నారు. తరువాత క్రమంగా మిగిలిన రోజుల్లోనూ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. యమునా నది ఒడ్డున నిర్మించిన వాసుదేవ్ ఘాట్ ఇప్పుడు కాశీలోని ఘాట్లను తలపిస్తోంది. ప్రజలు కూడా ఈ ఘాట్‌ను వీక్షించేందుకు తరలివస్తున్నారు. యమునా నది ఒడ్డున సంప్రదాయబద్ధంగా నిర్వహించిన తొలి హారతి కారక్రమం విజయవంతంగా జరిగింది. మరోవైపు ఈ వాసుదేవ్ ఘాట్‌ను పరిశుభ్రంగా ఉంచేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి యమునా హారతి వీక్షించేందుకు వచ్చే భక్తుల నుంచి ఎటువంటి రుసుము వసూలు చేయడం లేదు. -
ఆర్మీలో ‘జై శ్రీరామ్’, ‘జై బజరంగబలి’ నినాదాలు ఎందుకు?
ప్రపంచంలోని ఐదు అత్యంత శక్తివంతమైన సైన్య బలగాలలో భారత సైన్యం ఒకటిగా గుర్తింపు పొందింది. ఇండియన్ ఆర్మీలో అనేక రెజిమెంట్లు ఉన్నాయి. ప్రతి రెజిమెంట్‌కు దాని సొంత యుద్ధ నినాదాలు ఉన్నాయి. ‘వార్ క్రై’ అంటే యుద్ధ సమయంలో సైనికునికి స్ఫూర్తినిచ్చే, ఉత్సాహభరితమైన నినాదాలు. అవి శత్రువును తరిమికొట్టేందుకు ప్రేరణ కల్పిస్తాయి. సైనికులలో ఉత్సాహాన్ని నింపడానికి పలు రెజిమెంట్లు జై శ్రీ రామ్, బజరంగబలి కీ జై, దుర్గా మాతా కీ జై అంటూ నినాదాలు చేస్తాయని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రెజిమెంట్లలో బ్రిటీష్ కాలం నుంచి ‘జై శ్రీరామ్’ అనే యుద్ధ నినాదం వినిపిస్తే వస్తోంది. నాడు బ్రిటిషర్లుకూడా దీనికి అభ్యంతరం చెప్పలేదు. మతపరమైన యుద్ధ నినాదాలు సైనికులలో మరింత ఉత్సాహాన్ని నింపుతాయని బ్రిటీషర్లు కూడా భావించారు. భారత సైన్యం (ఆర్మీ), వైమానిక దళం, నావికాదళాల యుద్ధ నినాదం ఒకటే. అదే ‘భారత్ మాతా కీ జై’.. అయితే ప్రతి రెజిమెంట్‌కు ఒక్కో ప్రత్యేక నినాదం ఉంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. రాజ్‌పుతానా రైఫిల్స్ రాజ్‌పుతానా రైఫిల్స్ సైన్యంలోని పురాతన రైఫిల్ రెజిమెంట్. ఇది 1921 సంవత్సరంలో ఏర్పడింది. ఆ సమయంలో ఇది బ్రిటిష్ ఇండియన్ ఆర్మీ పరిధిలో ఉంది. ‘రాజా రామచంద్ర కీ జై’ అనేది ఈ రెజిమెంట్ నినాదం. టెరిటోరియల్ ఆర్మీ టెరిటోరియల్ ఆర్మీ అనేది భారత సైన్యానికి సహాయక సైనిక సంస్థ. భారత సైన్యానికి సేవలను అందించడం దీని పని. ఇది 1949, అక్టోబర్ 9న ఏర్పడింది. ‘జై శ్రీరామ్’ అనేది టెరిటోరియల్ ఆర్మీ నినాదం. కుమావూ రెజిమెంట్ కొన్ని రెజిమెంట్లు ‘బజరంగబలి’ పేరుతో యుద్ధ నినాదాలు చేస్తాయి. వాటిలో ఒకటి కుమావూ రెజిమెంట్. ఇది 1922లో ఏర్పాటయ్యింది. ‘కాళికా మాతా కీ జై, బజరంగబలి కీ జై, దాదా కిషన్ కీ జై’ అనేవి కుమావూ రెజిమెంట్ యుద్ధ నినాదాలు. బీహార్ రెజిమెంట్ బీహార్ రెజిమెంట్ సైన్యంలోని పురాతన పదాతిదళ రెజిమెంట్. ఇది 1941లో ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం బీహార్‌లోని దానాపూర్‌లో ఉంది. ఈ రెజిమెంట్ 2020లో గాల్వాన్ వ్యాలీలో చైనీస్ ఆర్మీని మట్టి కరిపించింది. ‘జై బజరంగబలి’ అనేది బీహార్ రెజిమెంట్ నినాదం. జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ భారత సైన్యానికి చెందిన సైనిక బృందం. ఇది 1821లో ఏర్పడింది. ‘దుర్గా మాతా కీ జై' అంటూ జమ్మూ కాశ్మీర్ రైఫిల్స్ యుద్ధ నినాదాలు చేస్తుంటుంది. గర్వాల్ రైఫిల్స్ గర్వాల్ రైఫిల్స్ బెంగాల్ ఆర్మీ ఆధ్వర్యంలో 1887లో స్థాపితమయ్యింది. ఇది బెంగాల్ ఆర్మీకి చెందిన 39వ రెజిమెంట్. ఆ తర్వాత ఇది బ్రిటిష్ ఆర్మీలో భాగమైంది. స్వాతంత్య్రానంతరం ఇది ఇండియన్ ఆర్మీ రెజిమెంట్‌గా మారింది.దీని యుద్ధ నినాదం ‘బద్రీ విశాల్ కీ జై’. జాట్ రెజిమెంట్ జాట్ రెజిమెంట్ ఒక పదాతిదళ రెజిమెంట్. స్వాతంత్ర్యం తరువాత ఈ రెజిమెంట్‌కు ఐదు యుద్ధ గౌరవాలు లభించాయి. ఈ రెజిమెంట్ ఎనిమిది మహావీర్ చక్ర, ఎనిమిది కీర్తి చక్ర, 39 వీర్ చక్ర, 170 సేన పతకాలను అందుకుంది. ‘జాట్ బల్వాన్, జై భగవాన్’అనేది దీని యుద్ధ నినాదం. డోగ్రా రెజిమెంట్ డోగ్రా రెజిమెంట్ 1922లో ఏర్పడింది. డోగ్రా రెజిమెంట్‌కు చెందిన నిర్మల్ చందర్ విజ్ జనవరి 1, 2003న ఆర్మీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2005 వరకు ఈ పదవిలో కొనసాగారు. ‘జ్వాలా మాతా కీ జై’ అనేది ఈ రెజిమెంట్ యుద్ధ నినాదం. ఇదే కాకుండా పంజాబ్ రెజిమెంట్, సిక్కు రెజిమెంట్, సిక్కు లైట్ పదాతిదళాల 'జో బోలే సో నిహాల్, సత్ శ్రీ అకల్’అనే నినాదాలు చేస్తాయి. దీనితో పాటు పంజాబ్ రెజిమెంట్ ‘బోలో జ్వాలా మాతా కీ జై’ అనే నినాదాన్ని అందుకుంటుంది. -
వ్యాయామం రోజూ ఒకే టైంలో చేస్తున్నారా? వెలుగులోకి షాకింగ్ విషయాలు
మనం కొత్తగా ఏదైన డైట్ లేదా వ్యాయామాలకు సంబంధించి మార్పులు తీసుకునేటప్పుడూ సమయపాలనే అనేది ముఖ్యం. అంటే.. ఇక్కడ రోజూ ఒకే టైంలోనే ఏదైనా చేయమని నొక్కి చెబుతుంటారు నిపుణులు. మన చిన్నప్పుడూ కూడా ఈ టైం కల్లా చదువుకోవడం పూర్తి చేసుకుని నిద్రపోండి అని మన పెద్దవాళ్లు పదేపదే చెబుతుంటారు. ఇలానే ఎందుకు? ఇది మన శరీరాన్ని ఏవిధంగా ప్రభావితం చేస్తుంది తదితరాల గురించి తాజా అధ్యయనాల్లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందుకు గల కారణాలకు సరైన సమాధానం కూడా దొరికింది. మనం చేసే వ్యాయామం లేదా ఏదైన పని రోజూ ఒకే టైంలో చేస్తే చక్కటి ఫలితం ఉంటుందట. ఈ మేరకు మాంచెస్టర్ విశ్వ విద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనల్లో..ఏ వ్యక్తి అయినా వ్యాయామాన్ని ఇష్టారీతిలో తనకు కుదిరిన సమయంలో చేసిన వారి కంటే ఒక నిర్దేశిత టైంలో చేసిన వారిలోనే మెరుగైన పలితాలు కనపడటం గుర్తించారు. దీనికి గల కారణాల గురించి సాగిన పరిశోధనలో చాలా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. మానవుని శరీరం బాహ్య వాతావరణంతో ప్రభావితవుతుంది. అందుకు తగ్గట్టుగా మన అంతర్గత శరీరీం స్కిరాడియన్ గడియారాన్ని సెట్ చేసుకుంటుందట. ఇక్కడ స్కిరాడియన్ గడియారం అంటే జీవక్రియ గడియారం. దీని అర్థం ఉదయం మేల్కోనగానే కాసేపు బద్ధకంగా అనిపించటం, తర్వాత ఆకలి.. ఆ తర్వాత రోజూవారి పనుల్లో నిమగ్నమవ్వడం ఒక లయబద్ధంగా మన మెదడు సిగ్నల్స్ పాస్ చేయడంతో ఆటోమెటిక్‌గా చేసుకుంటూ పోతున్న విధానాన్నే జీవగడియారం అంటారు. అంటే..ఇక్కడ మన జీవక్రియ గడియారానికి మన శరీర భాగాలకు మధ్య మెదడు అనే సెంట్రల్ గడియారం సమన్వయంతోనే ఇదంతా సాధ్యమవుతుంది. అందువల్ల సాయంత్రం చీకటి పడగానే ఆటోమెటిక్ నిద్రకు ఉపక్రమించడం, వెలుగు అనగానే బాడీ సెట్ రైట్ అయిపోయి లేవాలనే ఫీల్ కలగడం జరుగుతుంది. కాబట్టి మనిషి ఏదైనా డైట్ లేదా వ్యాయామం చేయాలనుకుంటే..రోజూ ఒక నిర్దేశిత టైంలో చేస్తే రిజల్ట్ బాగుండటమే గాక అనారోగ్యాల బారిన పడకుండా ఫిట్‌గా ఉండగలుగుతారని శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడయ్యింది. అంతేగాదు రోజులో 24 గంటలు అనే రోజు చక్రానికి అనుగుణంగా మన బాడీ ప్రతిస్పందిస్తుంది. అదే శరీరంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రత మారడం, రక్తంలో స్థాయిలు మార్పులు, తదితరాలకు కారణం అని పరిశోధకులు పేర్కొన్నారు. మన శరీరంలోని ఇతర భాగాలు గనుక మన జీవ గడియారం, సెంట్రల్ గడియారానికి అనుగుణంగా పనిచేయకపోయినప్పుడే అనారోగ్య సమస్యలు ఉత్ఫన్నమవుతాయని చెబుతున్నారు. ఈ పరిస్థితే మన శరీరంలో చెడు కొలస్ట్రాల్‌కు కారణమని అన్నారు. అలాగే పగటిపూట మాగ్జిమమ్ తిరుగుతూ ఏదో ఒక పని చేస్తుంటాం. అందువల్ల మన వెన్నెముకలోని ఇంటర్వర్టెబ్రల్ డిస్క్‌ల నుంచి తుంటి, మోకాళ్లలోని మృదులాస్థి నుంచి నీరు బయటకు వచ్చి రోజూ ముగిసే సమయానికి కాస్త పొట్టిగా కనిపిస్తాం. ఇది రోజు ముగిసే సమయానికి మనల్ని కొంచెం పొట్టిగా కనిపించేలా చేస్తుంది. అదే రాత్రి విశ్రాంత తీసుకునే సమయంలో నీరు తిరిగి మన బాడీకి వస్తుంది మనం యథావిధిగా కనిపిస్తాం అని చెప్పారు. అందుకోసం తాము ఎలుకలపై అధ్యయనం చేయగా.. ఈ ఫలితాలను గుర్తించామని అన్నారు. మన డైట్‌కి సంబంధించి లేదా వ్యాయామం వంటివి చేసేటప్పుడూ వీలు కుదరినప్పుడల్లా చేస్తే డీసింక్రోనైజేషన్కి గురయ్యి ఫలితం సరిగా ఉండదు. పైగా మన ఇతర వ్యవస్థలపై ప్రభావం ఏర్పడి అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని అన్నారు. కాబట్టి మనం రోజూ శారీరక శ్రమకు సంబంధించి(వ్యాయామం తదితర పనులు) ఒకే సమయానికి చేయడం వల్ల శరీరంలోని ఇతర వ్యవస్థలన్ని సమన్వయం అయ్యి, గాయాల బారినపడకుండా ఉండటమే గాక వయసు రీత్య వచ్చే కీళ్ల సంబంధ వ్యాధుల బారినపడే ప్రమాదం కూడా తగ్గుతుందని చెప్పుకొచ్చారు మాంచెస్టర్ పరిశోధకులు. (చదవండి: సరికొత్త ఔషధం..ఒక్క డోసు తీసుకుంటే చాలు.. దెబ్బకు కొలస్ట్రాల్ మాయం!) -
చదువు ఎలా మొదలయ్యింది? ఎందుకు అవసరమయ్యింది?
నేటి యుగంలో ప్రతి ఒక్కరికీ విద్య అనేది చాలా ముఖ్యం. మనిషి ఆకలితో ఉండగలడు కానీ చదువు లేకుండా ఉండలేడని కొందరు అంటారు. నేటి రోజ్లులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏదైనా ఉందంటే అది విద్యే అవుతుంది. ఇప్పుడు మనం అసలు ప్రశ్నలోకి వస్తే ఈ పఠన కళ మనుషులలో ఎలా అభివృద్ధి చెందింది? మనిషిని విద్యలో ముందుకు నడిపించిన విషయం ఏమిటనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. చదువుకు సంబంధించిన చరిత్ర శతాబ్దాల క్రితం నాటిది. అయితే విద్య విషయంలో సైన్స్ భిన్నమైన వాదనలను వినిపిస్తుంది. బీబీసీ నివేదిక ప్రకారం రీసెర్చ్ స్కాలర్ మరియాన్ వోల్ఫ్ మాట్లాడుతూ, అధ్యయనం అనేది ఆరు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైన కళ. ఎన్ని మద్యం పాత్రలు లేదా గొర్రెలు ఉన్నాయో లెక్కించడం కోసం ఇది మొదలయ్యిందని ఆమె తెలిపారు. వర్ణమాల ఏర్పరిచిన తరువాత దాని సాయంతో మనుషులు ఏదైనా చదవడం ద్వారా సమాచారాన్ని గుర్తుంచుకోవడం, అవగాహన కల్పించుకోవడం మొదలైనవి చేసేవారు. చదువులో ఎవరైనా రాణించినప్పుడు వారిని చురుకైనవారని అంటారు. చదువులో వెనుకబడినవారిని మందబుద్ధి గలవారని అభివర్ణిస్తారు. నిజానికి విద్యకు, మనసుకు చాలా దగ్గరి సంబంధం ఉంది. చదవడం లేదా నేర్చుకోవడం అనేది మనసు ద్వారానే జరుగుతుంది. మెదడులో పది బిలియన్లకు మించిన న్యూరాన్లు ఉన్నాయి. వాటి ద్వారా మెదడు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకుంటుంది. విషయాలను అధ్యయనం చేయడంలో, గుర్తుంచుకోవడంలో ఈ న్యూరాన్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఇది కూడా చదవండి: ఐక్యరాజ్య సమితిలో ఓటింగ్ ఎలా జరుగుతుంది? -
Niharika Konidela Latest Photos: దసరా నవరాత్రులు.. తొమ్మిది అవతారాల్లో ముస్తాబైన నిహారిక (ఫోటోలు)
-
ఇసుకపై పదేపదే వక్రీకరణలు
సాక్షి, అమరావతి : ఒక అబద్ధాన్ని పదే పదే చెబితే దాన్నే నిజమని ప్రజలు నమ్ముతారనే భ్రమలో ఈనాడు రామోజీరావు ప్రతిరోజూ పని గట్టుకుని రాష్ట్రంలో ఇసుక ఆపరేషన్స్‌పై బురద జల్లుతున్నారు. ఇసుక కొరత లేకపోయినా ఉన్నట్లు.., స్టాక్ యార్డుల్లో నిల్వ చేసిన ఇసుకను అక్రమ నిల్వలుగా పేర్కొంటూ ఇష్టానుసారం అవాస్తవాలు ప్రచురిస్తున్నారు. రాజధాని లావాదేవీల్లో చంద్రబాబుకు ఐటీ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో దాని గురించి ఒక్క ముక్క రాయని ఈనాడు.. దాన్ని కప్పిపుచ్చేందుకు ఇసుక, ఇతర వ్యవహారాలపై కట్టు కథలు రాస్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నిస్తోంది. చంద్రబాబును రక్షించేందుకు, ఆయన అవినీతిని కప్పిపుచ్చేలా ఈనాడు ఇలా ప్రతిసారీ ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా పెట్టుకొంది. ఇదే విధంగా ఇసుక పైనా ఓ అసత్య కథనాన్ని ప్రచురించింది. ‘ఇది ఇసుక దోపిడీ కాదా‘ అనే శీర్షికతో శనివారం ప్రచురించిన కథనం పూర్తి అవాస్తవమని రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ వీజీ వెంకటరెడ్డి తెలిపారు. డ్రెడ్జింగ్ రీచ్‌లు, స్టాక్ యార్డుల్లోనే ఇసుక విక్రయాలు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. దాన్ని వక్రీకరిస్తూ అక్రమ మైనింగ్గా చిత్రీకరించడం హాస్యాస్పదంగా ఉందని చెప్పారు. దీనిపై వివరంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినా పనిగట్టుకుని మళ్లీ అవాస్తవాలు రాయడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో నిర్మాణ రంగానికి వర్షాకాలంలో ఇసుక కొరత లేకుండా ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుందని తెలిపారు. దీనివల్లే వర్షాలు ప్రారంభం కాకుండానే పలు చోట్ల స్టాక్ యార్డుల్లో ఇసుక నిల్వలు ఉంచామన్నారు. వర్షాలు పడుతున్నా ఇసుక లభించేలా ఏర్పాట్లు చేశామని, ఇసుక కొరత అనేది రాష్ట్రంలో లేదన్నారు. రాష్ట్రంలో ఇసుక పరిస్థితిపై ఆయన చెప్పిన వివరాలు.. అక్రమ మైనింగ్ చేయాల్సిన అవసరం ఏంటి? రాష్ట్రవ్యాప్తంగా 136 ఇసుక స్టాక్ పాయింట్లు ఉన్నాయి. వాటిలో 64 లక్షల టన్నుల నిల్వలు ఉన్నాయి. వినియోగదారులు స్టాక్ పాయింట్లలోని ఇసుక కొని, తీసుకెళ్ళేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. ఇసుక స్టాక్ యార్డ్ ఫోటోలు తీసి అక్రమ ఇసుక తవ్వకాలు అంటూ ఈనాడు పత్రిక వక్రీకరణలతో తప్పుడు కథనాలు రాయడం దారుణం. రాష్ట్రంలో పర్యావరణ అనుమతులు ఉన్న 110 రీచ్‌లలో 77 లక్షల టన్నుల ఇసుక తవ్వకాలకు అనుమతి ఉంది.అలాగే 42 డీసిల్టింగ్ పాయింట్ల ద్వారా 90 లక్షల ఇసుక తవ్వకాలకు అనుమతులు ఉన్నాయి. ఇసుక కొరత లేకుండా డీసిల్టింగ్ పాయింట్ల నుంచి కూడా తవ్వుతున్నాం. అన్ని చోట్లా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే ఇసుక లభిస్తోంది. అటువంటప్పుడు అక్రమ మైనింగ్ ఎవరు చేస్తారు? ఎక్కువ రేటుకు ఎవరైనా ఎందుకు కొంటారు? రాష్ట్రంలో జేపీ సంస్థ ద్వారానే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. కొన్ని రీచ్‌లలో సమీపంలోనే స్టాక్ యార్డులు ఉన్నాయి. నదీ తీరంలో ఏర్పాటు చేసిన యార్డ్‌లో నిల్వ చేసిన ఇసుకను కూడా రీచ్ అని చిత్రీకరిస్తారా? పారదర్శక ఇసుక విధానంపై చాలా స్పష్టంగా వివరించినప్పటికీ ఇటువంటి వార్తలు రాయడం తగదు. గతంలో ఉచిత ఇసుక ఎవరికి ఇచ్చారు! గత ప్రభుత్వ హయాంలో ఏ నియోజకవర్గంలో ఇసుక ఉచితంగా ప్రజలకు అందింది? ఉచిత ఇసుక పేరుతో ప్రజలు ఎక్కువ రేటుకు కొనుక్కోవాల్సిన దుస్థితి తెచ్చారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియని అయోమయ స్థితి ప్రజలకు కల్పించారు. తప్పులు చేసిన వారిని దండించలేదు. జరిమానాలు విధించలేదు. మెరుగైన ఇసుక విధానంతో మా ప్రభుత్వం ఇసుక అక్రమాలపై ఉక్కుపాదం మోసింది. ప్రజలకు నియోజకవర్గాల్లో డిపోల వద్ద ఎంత ధరకు ఇసుక విక్రయిస్తున్నారో అత్యంత పారదర్శకంగా పత్రికల్లో ప్రకటనల ద్వారా తెలియచేస్తోంది. అంతకంటే ఎక్కవ రేటుకు ఎవరైనా ఆమ్మితే తక్షణం ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్‌ను తెచ్చింది.ఎవరైనా అక్రమాలకు పాల్పడితే రెండు లక్షల రూపాయల జరిమానా, రెండేళ్ళ వరకు జైలు శిక్ష విధించేలా చట్టాల్లో మార్పులు తెచ్చింది. స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోను ఏర్పాటు చేసింది. దాదాపు 18 వేల కేసులు ఈ బ్యూరో నమోదు చేసింది. 6.36 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుకను సీజ్ చేసింది. ఈ కేసుల్లో చాలా మందికి శిక్షలు కూడా పడ్డాయి. కట్టుదిట్టంగా నిబంధనలను అమలు చేస్తున్నాం. పట్టా భూముల్లో ఇసుక తవ్వకాలను నిలిపివేశాం. ఓపెన్ రీచ్‌ల ద్వారా నాణ్యమైన ఇసుకను అందిస్తున్నాం. గత ప్రభుత్వంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటి తీవ్రంగా స్పందించింది. ఏకంగా రూ.100 కోట్లు జరిమానా విధించింది. ఇది కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే. ప్రస్తుత వైఎస్ జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను పరిశీలించి సంతృప్తి చెందిన ఎన్జీటీ ఆ జరిమానాను రద్దు చేసింది. రీచ్‌లకు ఎవరైనా వెళ్లవచ్చు ఓపెన్ రీచ్‌లు, ఇసుక శాండ్ డిపోలకు ఎవరైనా స్వేచ్ఛగా వెళ్ళవచ్చు. అవసరమైనంత ఇసుక కొనుక్కోవచ్చు. ఇలాంటి చోట ఎవరైనా ఆంక్షలు పెడతారా? ఎవరూ రాకుండా కాపలా పెడతారా? ఈనాడు ప్రతినిధులను అడ్డుకున్నారని వార్తలు రాయడం కేవలం అభాండాలు వేయడం తప్ప మరొకటి కాదు. పారదర్శకంగా జరుగుతున్న చోట ఏదో జరిగిపోతోందనే భ్రమలు కల్పించడమే ఈనాడు లక్ష్యం. దీనిని మినీ కేజిఎఫ్ అంటూ చిత్రీకరించడం ఈనాడు పత్రిక దివాళాకోరుతనానికి నిదర్శనం. కాంట్రాక్ట్ వ్యాల్యూ పైన కాంట్రాక్టింగ్ ఏజెన్సీ జీఎస్టీ చెల్లిస్తోంది. ఏటా రెండు కోట్ల టన్నుల ఇసుక విక్రయాలకు నిబంధనల ప్రకారం ఎంత జీఎస్టీ చెల్లించాలో అంతా చెల్లిస్తోంది. దీనిపైనా అసత్య ప్రచారం చేస్తున్నారు. వర్షాకాలంలో ఓపెన్ రీచ్‌ల నుంచి తవ్వకాలు జరగడంలేదు. అయితే స్టాక్ చేసిన యార్డ్‌లోని ఇసుకను విక్రయిస్తున్నాం. చిత్తూరు జిల్లా నాగలాపురం మండలం అరణియార్‌లో ఇసుక తవ్వకాలు గతంలోనే నిలిపివేశారు. పాత ఫోటోలతో అక్కడ ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయంటూ తప్పుడు కథనాలను ప్రచురించారు. ఇసుక మాఫియాకు చెక్ పెట్టాం ఈ ప్రభుత్వం గతంలో జరిగిన ఇసుక మాఫియా ఆగడాలకు చెక్ పెట్టింది. నూతన ఇసుక విధానాన్ని తీసుకువచ్చింది. ప్రజలకు అందుబాటు ధరలో ఇసుక లభించేలా చర్యలు తీసుకుంటోంది. పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేస్తూ, నూతన ఇసుక పాలసీని ప్రకటించింది. దానిలో భాగంగా 2019 ఏప్రిల్ 9న రాష్ట్ర ప్రభుత్వం జీవో 70, 71 జారీ చేసింది. అనంతరం ఇసుక విధానంలోని లోటుపాట్లను సవరించేందుకు మంత్రుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ప్రజల అభిప్రాయాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించింది. దీనిపై 2020 నవంబరు 12న జీవో 78 జారీ చేసింది. అలాగే ఈ విధానంలోని కొన్ని నిబంధనల్లో మార్పు చేస్తూ 2021 ఏప్రల్ 16న జీవో 25ని జారీ చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. పారదర్శకంగా ఇసుక తవ్వకాలు జరగాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎంఎఎస్టీసీ ద్వారా, వారి పర్యవేక్షణలో టెండర్లు నిర్వహించాం. జేపీ పవర్ వెంచర్స్ ఈ టెండర్లు దక్కించుకుంది. వారి ద్వారానే ఇప్పటివరకు ఇసుక ఆపరేషన్స్ జరుగుతున్నాయి. ఇంత పారదర్శకంగా టెండర్లు నిర్వహిస్తే తప్పుడు ఆరోపణలా? టెండర్ దక్కించుకున్నది జేపీ పవర్ వెంచర్స్ కంపెనీ ఒక్కటే. అన్ని అనుమతులతోనే ఎక్కడైనా ఆ సంస్థే తవ్వకాలు చేస్తుంది. అలాంటప్పుడు ఆ సంస్థ అక్కడ తవ్వుతోంది, ఇక్కడ తవ్వుతోందంటూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. వారు టెండర్ నిబంధనల ప్రకారం వారికి అనుకూలమైన సంస్థను సబ్ కాంట్రాక్టర్ గా తీసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆ సంస్థ సొంత వ్యవహారం. కాంట్రాక్టు సంస్థ టన్నుకు రూ.375 చొప్పున ప్రభుత్వానికి చెల్లిస్తోంది. దీనిపై మరో వంద రూపాయలు వేసుకుని టన్ను రూ.475 కు అమ్ముకుంటోంది. ఆ వంద రూపాయల్లోనే కంపెనీ కార్యకలాపాలు నిర్వహించుకోవాలి. ఇసుక టెండర్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏటా రూ.765 కోట్లు ఆదాయం లభిస్తోంది. అంటే అయిదేళ్ళలో రూ.3,825 కోట్ల ఆదాయం వస్తుంది. గత ప్రభుత్వ పాలనలో ఇన్ని వేల కోట్లు ఎక్కడికి వెళ్లాయి? ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ప్రస్తుతం రాష్ట్ర ప్రజలు ఎక్కడైనా ఇసుక కొనుక్కోవచ్చు. నాణ్యతను పరిశీలించుకోవచ్చు. అలాంటప్పుడు బ్లాక్ లో ఎక్కువ రేటుకు ఇసుకను కొనాల్సిన అవసరం ఎలా ఉంటుంది? -
‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!
ఎక్కడైనా ప్రేమికుడు లేదా భర్త తన భాగస్వామితో ‘నువ్వు కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తానని’ అంటాడు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ దీనికి భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని ఎనిమిదిమంది భార్యలు అతనిని సిక్స్ ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారు. జిమ్‌లో చెమటలు చిందిస్తూ.. తాజాగా బ్రెజీలియన్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్థర్ ఓ ఉర్సో వార్తల్లోకి ఎక్కాడు. అతని 8 మంది భార్యలు సామూహికంగా తన ముందు ఒక విచిత్రమైన డిమాండ్ ఉంచారని, దానితో తనకు తలనొప్పులు ఎదురయ్యాయని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. తన ఎనమండుగురు భార్యలు తనను సిక్స్‌ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారని, దీంతో తాను జిమ్‌లో చెమటలు చిందించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో పాటు ఆర్థర్ తన వైవాహిక జీవితం గురించి కూడా వెల్లడించాడు. తన భార్యలు ప్రతిరోజూ తన అండర్వేర్ చెక్ చేస్తారని తెలిపాడు. ఇందుకు వారికున్న ప్రత్యేక శ్రద్ధనే కారణమని తెలిపాడు. ఒకరితో విడాకులు 2022లో ఆర్థర్ 9 మంది యువతులను వివాహం చేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే వీరిలో ఒక మహిళ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పడు ఆర్థర్ తన 8 మంది భార్యల డిమాండ్ మేరకు సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ఆర్థర్ తనను తాను జిమ్‌కు సమర్పించుకున్నాడు. తన శరీరపు కొలతల్లో మార్పు వచ్చిదోలేదో తెలుసుకునేందుకు తన భార్యలు ప్రతీరోజూ తన అండర్‌వేర్‌ను కొలుస్తుంటారని ఆర్థర్ వెల్లడించాడు. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ వివాదాస్పదం సిక్స్‌ప్యాక్ కోసం ఆర్థర్ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం మానివేశాడు. చివరికి బ్రెడ్, పాస్తా కూడా తినడంలేదని తెలిపాడు. ఒలింపిక్ ఎథలెట్స్ కోసం డిజైన్ చేసిన వ్యాయామాలను ఆర్థర్ అనుసరిస్తున్నాడు. కాగా ఆర్థర్ 9 మంది భార్యలతో ఉన్నప్పుడు తాను పిల్లలను కనాలనుకుంటే ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ పాటిస్తానని తెలిపాడు. అప్పట్లో ఆర్థర్ చేసిన ఈ వ్యాఖ్యానం పెద్ద దుమారమే రేపింది. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! -
మంచి మాట: విడదియ్యరాని శ్రమ
శ్రమ నుంచి శ్రామికుల్ని, శ్రామికుల నుంచి శ్రమను ఎలా అయితే విడదియ్యలేమో అలా ప్రపంచం నుంచి శ్రమను, శ్రామికులను విడదియ్యలేం. శ్రమలేందే శ్రామికులు లేరు; శ్రామికులు లేందే శ్రమలేదు; శ్రమ, శ్రామికులు లేందే ప్రపంచం లేదు. మనిషికి ప్రపంచం ఆధారం; ప్రపంచానికి శ్రామికుడు ఆధారం. ప్రతి మనిషికి శ్రామికుడి అవసరం ఉంది; ప్రతిమనిషీ శ్రామికుడు అవ్వాల్సిన అవసరం ఉంది. మన ఈ ప్రపంచం మనకు ఇవాళ ఇలా ఉందీ అంటే అది శ్రామికులు శ్రమిస్తూనే ఉన్నందువల్ల వచ్చిన ఫలితమే. శ్రమతో శ్రామికులు సృజించిన ఆకృతి ప్రపంచం. శ్రమతో, శ్రమలో శ్రామికుడు జీవనం చేస్తున్నందువల్లే ప్రపంచానికి స్థితి, ద్యుతి ఉన్నాయి. అవి మనకు ఆలవాలమూ అయినాయి. మన మనుగడ సాగేందుకు అవి మనతో, మనకై ఉన్నాయి. ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది లేనేలేదు’ అని కవి శ్రీశ్రీ అన్నారు. శ్రమైకజీవనం సౌందర్యమై ప్రపంచం మొత్తానికి సౌందర్యాన్ని తీసుకు వచ్చింది! శ్రమ అన్నదాన్ని లుప్తం చేసి ఊహించుకుంటే ప్రపంచం వికృతంగా ఉంటుంది. శ్రమైక జీవనం అన్నది సౌందర్యం మాత్రమేనా? కాదు. శ్రమైకజీవనం ఈ ప్రపంచానికి లభించిన సౌభాగ్యం కూడా. అనాది గా ప్రపంచం పొందిన ప్రగతికి కారణం శ్రామికుడు. శ్రామికుడు ప్రపంచానికి సౌందర్యప్రదాత. శ్రామికుడు ప్రపంచానికి సౌభాగ్యప్రదాత. అటువంటి శ్రామికుడికి, అతడి శ్రమకు న్యాయం జరుగుతోందా? అనాదిగానే అది లేదు అన్నది క్షేత్ర వాస్తవంగా మనకు ప్రస్ఫుటంగా తెలుస్తూనే ఉంది.‘మన ప్రపంచంలో చాలా విషయాలు అన్యాయం; / పత్తిని నాటని వాళ్లు శ్రేష్ఠమైన పత్తి బట్టలు కట్టుకుంటారు. / అంతే కాదు పొలంలో పని చెయ్యని వాళ్లు తెల్లటి బియ్యం తింటారు’ అని అంటూ చైనాలోని ఒక అజ్ఞాత యూనాన్ జానపద కవి వందలయేళ్ల క్రితమే ఆవేదనను వ్యక్తపరిచాడు. చిందిన చెమట కు అందిన ఫలం చాలని స్థితి ఎప్పటి నుంచో ఉంది. ఈ పరిస్థితి ఇకనైనా మారాలి. శ్రమకు, శ్రామికుడికి తగిన ఫలం దక్కాలి. ‘మేఘాలు తియ్యటి నీరును ఇచ్చినట్టుగా, తేనెటీగలు తేనెను ఇచ్చినట్టుగా నువ్వు పశువుల్లో పాలను సృష్టించావు. అదే విధంగా పగలంతా శ్రమించిన శ్రామికుడికి ధాన్యాదిరూపంలో సంపదను ఇవ్వు’ అంటూ వేదంలో ఒక దైవ ప్రార్థన ఉంది. శ్రామికుడికి న్యాయం జరగాలన్న ఆకాంక్ష కూడా ఎప్పటినుంచో వస్తూనే ఉంది. ఇకనైనా శ్రమకు, శ్రామికులకు న్యాయం సాకారం కావాలి. ఏడాదిలో ఏ ఒక్కరోజునో శ్రామికుల రోజు అనీ, ఆ రోజున ఏదో హడావిడి చేసేసి, ఉపన్యాసాలు ఇచ్చేసి ఆ తరువాత శ్రామికుల్ని నిర్లక్ష్యం చెయ్యడం ఇక చాలు. ప్రతిరోజూ శ్రామికులకు, శ్రమకు న్యాయం చేస్తూ మనం మన మనుగడను సౌందర్యవంతమూ, సౌభాగ్యవంతమూ చేసుకుందాం. శ్రామికులకు, శ్రమకు గౌరవాన్ని, మన్నను ఇస్తూ మనల్ని మనం గౌరవించుకుందాం; మనకు మనం మన్ననను కలిగించుకుందాం. ఏ ఒక్కరోజో శ్రామికుల రోజు అవదు. ప్రతిరోజూ శ్రామికుల రోజే. సూర్యోదయంతో మొదలయ్యే ప్రతి దినమూ శ్రామికుల దినమే! శ్రమ అన్నది చిందే దినమే! శ్రమ చిందనిదే, శ్రామికులు పని చెయ్యనిదే ఏ దినమూ గడవదు కదా? ఆది, సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని అంటూ ఒక్కో పేరుతో ఒక్కో దినం ఉంది. ఏ పేరుతో ఉన్న దినమైనా శ్రమ, శ్రామికుల అభినివేశంతోనే అది దినంగా నడుస్తుంది, గడుస్తుంది. ప్రతిదినమూ శ్రామికుల దినమే! – రోచిష్మాన్ -
నిత్యం ఉద్యోగుల వెంట
ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మ¯ŒS బొప్పరాజు కాకినాడ సిటీ : ఏపీజేఏసీ అమరావతి నిత్యం ఉద్యోగుల వెన్నంటి ఉంటుందని రాష్ట్ర చైర్మ¯ŒS బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీజేఏసీ అమరావతి జిల్లా శాఖ ఆవిర్భావ సభ శుక్రవారం రాత్రి కాకినాడ అంబేడ్కర్ భవ¯ŒSలో జరిగింది. ముందుగా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు స్థానిక రెవెన్యూ భవ¯ŒS నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ఆవిర్భావ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడానికే జేఏసీ అమరావతి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో పలు శాఖల జిల్లా, రాష్ట్ర ప్రతినిధులు ఎంతో మదనపడ్డారని తద్వారా ఈ సంఘం ఏర్పడిందన్నారు. సీపీఎస్ విధానం రద్దు, పీఆర్సీ ఎరియర్స్ సాధన తదితర డిమాండ్ల సాధనకు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ ఫణిపేర్రాజు మాట్లాడుతూ జేఏసీ అమరావతి రాష్ట్ర, జిల్లా యూనిట్లతో పాటు ప్రతి మండలానికి ఒక యూనిట్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఏపీ జేఏసీ అమరావతి పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను, మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురా>నున్నామన్నారు. ఈ సమావేశంలో చివరిగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మ¯ŒS బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఫణి పేర్రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను జిల్లా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేష¯ŒS కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి వీరబాబు, డి.కృష్ణ, కాకినాడ డివిజ¯ŒS అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాస్, తాతారావు, కో–ఆపరేటివ్ యూనిట్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, డ్రైవర్స్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షులు సంసాని శ్రీనివాస్, గెజిటెడ్ అధికారుల జిల్లా అధ్యక్షులు వీఎస్ వర్మతో పాటు 48 శాఖలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు పాల్గొన్నారు. -
బడికెళ్లాలంటే.. 10 కి.మీ. నడవాల్సిందే..
వారికి చదువంటే చాలా ఇష్టం.. కానీ తమ గ్రామం నుంచి మండలకేంద్రంలోని పాఠశాలకు చేరుకోవాలంటే సుమారు పది కిలోమీటర్లు నడవాల్సిందే.. ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో ఆ విద్యార్థులు కాలినడకనే పాఠశాలకు వెళుతున్నారు.. ఎండకు, వానకు తట్టుకుని చదువుపై మక్కువతో నిత్యం కాలినడక సాగిస్తున్నారు.. ఇన్ని ఇబ్బందులు పడుతున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదు.. మద్నూర్ : మండలంలోని మొగా, పెద్ద శక్కర్గా, మారెపల్లి, శేఖాపూర్, హండేకేలూర్, అవాల్గావ్, చిన్న ఎక్లార తదితర గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు నిత్యం సుమారు 10 కి.మీ. కాలినడకన పాఠశాలకు వెళ్తున్నారు. ప్రై వేట్ వాహనాలున్నా కొన్నిసార్లు అవి కూడా అందుబాటులో ఉండకపోవడంతో వారికి కాలినడక తప్పడంలేదు.. మొగా, శేఖాపూర్, మారెపల్లి, లచ్మాపూర్ గ్రామాల విద్యార్థులు మేనూర్‌లోని ఉన్నత పాఠశాలకు, పెద్ద శక్కర్గా, చిన్న శక్కర్గా, హండేకేలూర్, అవాల్గావ్ గ్రామాల విద్యార్థులు మండల కేంద్రంలోని పాఠశాలకు, దన్నూర్, సోమూర్, ఖరగ్, చిన్న తడ్గూర్, కొడిచెర, అంతాపూర్ గ్రామాల విద్యార్థులు పెద్ద తడ్గూర్ ఉన్నత పాఠశాలకు వస్తారు. చిన్న ఎక్లార, రూపేగావ్, లచ్చన్, సుల్తాన్‌పేట్ విద్యార్థులు పెద్ద ఎక్లారలోని ఉన్నత పాఠశాలకు వస్తారు. దీంతో ప్రతిరోజు పాఠశాలకు ఆలస్యంగా వెళ్లాల్సి వస్తోందని, రోజూ నడుచుకుంటూ వెళ్లిరావడంతో అలసిపోతున్నామని ఆ విద్యార్థులు వాపోతున్నారు. కొందరు విద్యార్థులు మధ్యలోనే చదువు మానేస్తున్నారు. ఆడపిల్లలను బడికి పంపాలంటే తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. సమస్య పరిష్కరించాలని సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులను విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
నగరంలో ప్రతి రోజు 20 మంది పిల్లలు మాయం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిగా కీర్తి పొందుతున్న నగరంలో ప్రజలు, మహిళలు, పిల్లలకు రక్షణ కరువైంది. మొన్నటిదాకా మహిళలపై జరుగుతున్న అత్యాచారాలతో అప్రతిష్ట మూటకట్టుకున్న ఢిల్లీలో మరో కోణం బయటపడింది. నగరంలో ప్రతిరోజూ సగటున 20 మంది పిల్లలు ఇంటి నుంచి మాయమవుతున్నారు. ఈ సంవత్సరం మొదటి మూడు నెలలు ఇంకా పూర్తికాకముందే.. ఇప్పటికే 1,120 మంది పిల్లలు తప్పిపోయినట్లు పోలీస్ స్టేషన్లలో మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. తప్పిపోయిన వారిలో 621 మంది బాలికలుండటం గమనార్హం. గత సంవత్సరం 7,572 పిల్లలు తప్పిపోయినట్లు పోలీసు రికార్డులు చెబుతున్నాయి. వారిలో కూడా ఎక్కువ మంది ఆడపిల్లలే. నిరుడు ఇంటి నుంచి మాయమైన పిల్లల్లో 4,166 మంది బాలికలున్నారు. 2013లో 5,809 మంది, 2012లో 3,686 మంది పిల్లలు తప్పిపోయారు. పిల్లలు ఇంటి నుంచి మాయం కావడానికి అనేక కారణాలు ఉన్నాయని పోలీసు అధ్యయనం తేల్చింది. కొందరు తమంతట తామే ఇంటి నుంచి పారిపోగా, మరికొందరు నేరగాళ్ల చేతికి చిక్కి తల్లిదండ్రులకు దూరమవుతున్నారని అధ్యయనం తెలిపింది. పిల్లల ఆచూకీ కోసం ఎంతగానో శ్రమిస్తున్న పోలీసులు ఇంత జరుగుతున్నా పిల్లలను ఎత్తుకుపోయే మూఠాలు, నేరగాళ్ల ఆచూకీ తీయడం పోలీసులకు శక్తికి మించిన పనిగానే ఉంది.తప్పిపోయిన పిల్లలను ఇంటికి చేర్చడం కోసం ఢిల్లీ పోలీసులు ఎంతగానో శ్రమిస్తున్నారు. పిల్లల ఆచూకీ తీయడం కోసం అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తాయని, ముఖ్యంగా క్రైమ్ బ్రాంచ్‌లో అధికారుల బృందం ఒకటి ఈ పనిపైనే ఉంటుందని పోలీసు అధికారులు అంటున్నారు. అయితే తప్పిపోయినవారిలో సగం మందిని మాత్రమే వారు ఇంటికి తిరిగి చేర్చగలుగుతున్నారు. త ప్పిపోయిన పిల్లలను వారి కుటుంబాలతో కలపడం కోసం పోలీసులు ఆపరేషన్ మిలాప్‌ను కూడా నిర్వహిస్తున్నారు. పోలీసుల అధ్యయనంలో ఏముందంటే... మాయమైన పిల్లల్లో 11 శాతం మంది ప్రేమించిన వ్యక్తితో ఇంటి నుంచి పారిపోగా, కుటుంబ ఒతిళ్లు, ఘర్షణలను తట్టుకోలేక 10 శాతం పిల్లలు, ఇంటి దారి తెలియక 9 శాతం, స్నేహితుల బలవంతంతో 15శాతం మంది, పాఠశాల భయంతో 11శాతం, కుటుంబసభ్యులు తిట్టడంతో 8 శాతం మంది ఇంటి నుంచి పారిపోయారని, 36 శాతం మంది కిడ్నాప్, లైంగిక నేరాల వంటి ఇతర నేరాలకు పాల్పడేవారి చేతికి చిక్కి కనుమరుగుయ్యారని పోలీసు అధ్యయనం తెలిపింది. -
అత్యాచార భారత్.. రోజూ 93 మంది అబలలు బలి
చెన్నై: ఎన్ని కఠిన చట్టాలు రూపొందించినా.. నిరసనలు, ఆందోళనలు చేసినా.. ప్రభుత్వాలు మారినా.. మన దేశంలో మహిళలకు ఇప్పటికీ తగిన భద్రత లేదు. రోజురోజుకూ మహిళలపై ఆగడాలు పెరిగిపోతున్నాయి. ప్రతి రోజూ సగటున 93 మంది మహిళలు అత్యాచారాలకు బలవుతున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తాజా నివేదికలో ఈ నివ్వెరపరిచే విషయం వెల్లడైంది. 2012 సంవత్సరలో మన దేశంలో 24,923 అత్యాచారాలు జరగగా.. 2013లో ఆ సంఖ్య మరింత పెరగడం ఆందోళన కలిగించే విషయం. 33,707 మంది మహిళలు అత్యాచారానికి గురయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఉదంతం అనంతరం కఠిన చట్టం రూపొందించినా మహిళలకు రక్షణ లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2012లో ఢిల్లీలో 585 అత్యాచార కేసులు నమోదు కాగా, 2013లో 1441 కేసులు అంటే క్రితం ఏడాది కంటే రెట్టింపు కావడం గమనార్హం. మనదేశంలో మహిళలకు భద్రత లేని నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబై, జైపూర్, పుణె ఉన్నాయి. రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే గతేడాది మధ్యప్రదేశ్ లో అత్యధికంగా 4,335 రేప్ కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత రాజస్థాన్ (3285), మహారాష్ట్ర (3063), ఉత్తరప్రదేశ్ (3050) రాష్ట్రాలలో అత్యధిక కేసులు వెలుగుచూశాయి. బాధితుల్లో ఎక్కువగా 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉన్నవారు ఉన్నారు. నేరాలకు పాల్పడుతున్నవారిలో 94 శాతం మంది పరిచయం ఉన్నవారే. తెలిసినవారు, ఇంటిపక్కన ఉన్నవారు ఎక్కువగా అత్యాచారాలకు పాల్పడుతుండగా, బంధువులు కూడా నేరాలకు ఒడిగడుతున్నారు.