- ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మ¯ŒS బొప్పరాజు
నిత్యం ఉద్యోగుల వెంట
Published Sat, May 6 2017 12:30 AM | Last Updated on Tue, Sep 5 2017 10:28 AM
కాకినాడ సిటీ :
ఏపీజేఏసీ అమరావతి నిత్యం ఉద్యోగుల వెన్నంటి ఉంటుందని రాష్ట్ర చైర్మ¯ŒS బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఏపీజేఏసీ అమరావతి జిల్లా శాఖ ఆవిర్భావ సభ శుక్రవారం రాత్రి కాకినాడ అంబేడ్కర్ భవ¯ŒSలో జరిగింది. ముందుగా జిల్లావ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఉద్యోగులు స్థానిక రెవెన్యూ భవ¯ŒS నుంచి సభా ప్రాంగణం వరకు ర్యాలీ చేపట్టారు. ఈ ఆవిర్భావ సభకు ముఖ్యఅతిథిగా పాల్గొన్న బొప్పరాజు మాట్లాడుతూ ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడడానికే జేఏసీ అమరావతి ఆవిర్భవించిందని పేర్కొన్నారు. ఆ పరిస్థితుల్లో పలు శాఖల జిల్లా, రాష్ట్ర ప్రతినిధులు ఎంతో మదనపడ్డారని తద్వారా ఈ సంఘం ఏర్పడిందన్నారు. సీపీఎస్ విధానం రద్దు, పీఆర్‌సీ ఎరియర్స్ సాధన తదితర డిమాండ్ల సాధనకు త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తామని ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీవీ ఫణిపేర్రాజు మాట్లాడుతూ జేఏసీ అమరావతి రాష్ట్ర, జిల్లా యూనిట్లతో పాటు ప్రతి మండలానికి ఒక యూనిట్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఏపీ జేఏసీ అమరావతి పేరిట ప్రత్యేక వెబ్‌సైట్‌ను, మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురా>నున్నామన్నారు. ఈ సమావేశంలో చివరిగా ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మ¯ŒS బొప్పరాజు వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ఫణి పేర్రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులను జిల్లా ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అసోసియేష¯ŒS కలెక్టరేట్ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు కొత్తపల్లి వీరబాబు, డి.కృష్ణ, కాకినాడ డివిజ¯ŒS అధ్యక్ష, కార్యదర్శులు పి.శ్రీనివాస్, తాతారావు, కో–ఆపరేటివ్ యూనిట్ అధ్యక్షులు దుర్గాప్రసాద్, డ్రైవర్స్ అసోసియేష¯ŒS జిల్లా అధ్యక్షులు సంసాని శ్రీనివాస్, గెజిటెడ్ అధికారుల జిల్లా అధ్యక్షులు వీఎస్ వర్మతో పాటు 48 శాఖలకు చెందిన ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్లు పాల్గొన్నారు.
Advertisement