underwear
-
మెన్స్ అండర్వేర్ విక్రయాలు ఎందుకు తగ్గాయి? మాంద్యంతో సంబంధం ఏమిటి?
అమెరికాతో సహా ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆర్థికమాంద్యం భయం చాలా కాలంగా వెంటాడుతోంది. చైనా సైతం ఇటీవల ఆర్థిక రంగంలో అనేక ఒడిదుడుకులను చవిచూసింది. అయితే ఇప్పటి వరకు భారత్‌లో మాద్యం తాలూకా లక్షణాలేమీ కనిపించలేదు. అయితే తాజాగా వెలువడిన ఓ సంకేతం ఆర్థిక నిపుణులను అప్రమత్తం చేసింది. బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు.. దేశంలో ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం లోదుస్తుల తయారీ కంపెనీలలో ఇన్వెంటరీ పెరిగింది. అమ్మకాలు తగ్గాయి. ఆర్థికవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం ద్రవ్యోల్బణం కారణంగా జనం తమ బడ్జెట్‌కు ఆటంకం ఏర్పడినప్పుడు వారు మొదట లోదుస్తుల కొనుగోలును వాయిదా వేస్తారు. దేశంలోని పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ ఇటీవలి కాలంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మందగమనంలో జాకీ బ్రాండ్ విక్రయాలు గత ఏడాదితో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో లోదుస్తుల విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. లోదుస్తుల అమ్మకాలు క్షీణించిన కారణంగా పలు కంపెనీలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. జాకీ బ్రాండ్ లోదుస్తుల తయారీ సంస్థ పేజ్ ఇండస్ట్రీస్‌కి ఆదాయం తగ్గడంతో పాటు అమ్మకాలు కూడా తగ్గాయి.గత కొన్ని నెలలుగా దేశంలో ద్రవ్యోల్బణం ఆర్బీఐ పరిమితులను మించిపోతోంది. ద్రవ్యోల్బణం సామాన్యుల బడ్జెట్‌ను అస్తవ్యస్తం చేస్తోంది. ఫలితంగా వినియోగదారుల సెంటిమెంట్ ప్రభావితమవుతుంది. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి.. నిపుణుల అభిప్రాయం ప్రకారం లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం ఆర్థిక వ్యవస్థకు మంచి సంకేతం కాదు. జనం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారనడానికి ఇది సంకేతం. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ మాజీ అధిపతి అలాన్ గ్రీన్‌స్పాన్.. ఆర్థిక వ్యవస్థను అంచనా వేయడానికి పురుషుల లోదుస్తుల సూచికను రూపొందించారు. దీని ప్రకారం ఒక దేశంలో పురుషుల లోదుస్తుల అమ్మకాలు క్షీణించడం అనేది ఆర్థిక వ్యవస్థలో మాంద్యానికి సంకేతం. 2007- 2009 మధ్య కాలంలో యూఎస్‌లో ఆర్థిక మాంద్యం తలెత్తినప్పుడు లోదుస్తుల విక్రయాలు క్షీణించాయి. 2007- 2009 మధ్య అమెరికాలో ఏం జరిగింది? ఆర్థిక నిపుణులు గ్రీన్‌స్పాన్ 1970లలో పురుషుల లోదుస్తుల సూచిక సిద్ధాంతాన్ని వెలువరించారు. పురుషుల లోదుస్తుల విక్రయ గణాంకాలు కీలక ఆర్థిక సూచికలు అని ఆయన అన్నారు. లోదుస్తులు అనేవి ప్రైవేట్ దుస్తులు. అవి పైనున్న దుస్తులలో దాగివుంటాయి. అందుకే ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారినప్పుడు, మనిషి చేసే మొదటి పని లోదుస్తులు కొనుగోలు చేయడం మానివేస్తాడు. ఇది రాబోయే కాలంలో మాంద్యం లేదా ఆర్థిక మందగమనాన్ని సూచిస్తుంది. 2007- 2009 మధ్య అమెరికా తీవ్ర మాంద్యం ఎదుర్కొంది. 2007 ప్రారంభం నుండి ఆ దేశంలో పురుషుల లోదుస్తుల విక్రయాలలో భారీ క్షీణత కనిపించింది. 2010 సంవత్సరంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు, పురుషుల లోదుస్తుల అమ్మకాలు ఆటోమేటిక్‌గా పెరిగాయి. ఇది కూడా చదవండి: ప్రపంచ జనాభాలో 1,280 మంది మాత్రమే మిగిలిన విపత్తు ఏది? నాడు ఏం జరిగింది? -
‘ప్రతిరోజూ నా అండర్వేర్ చెక్ చేస్తారు’.. 8 మందిని పెళ్లాడిన మోడల్‌కు వింత సమస్య!
ఎక్కడైనా ప్రేమికుడు లేదా భర్త తన భాగస్వామితో ‘నువ్వు కోరుకుంటే కొండ మీద కోతిని తెమ్మన్నా తెస్తానని’ అంటాడు. కానీ బ్రెజిల్‌కు చెందిన ఒక మోడల్ దీనికి భిన్నమైన సమస్యను ఎదుర్కొంటున్నాడు. అతని ఎనిమిదిమంది భార్యలు అతనిని సిక్స్ ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారు. జిమ్‌లో చెమటలు చిందిస్తూ.. తాజాగా బ్రెజీలియన్ మోడల్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆర్థర్ ఓ ఉర్సో వార్తల్లోకి ఎక్కాడు. అతని 8 మంది భార్యలు సామూహికంగా తన ముందు ఒక విచిత్రమైన డిమాండ్ ఉంచారని, దానితో తనకు తలనొప్పులు ఎదురయ్యాయని ఆర్థర్ చెప్పుకొచ్చాడు. తన ఎనమండుగురు భార్యలు తనను సిక్స్‌ప్యాక్‌లో చూడాలని కోరుకుంటున్నారని, దీంతో తాను జిమ్‌లో చెమటలు చిందించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీనితో పాటు ఆర్థర్ తన వైవాహిక జీవితం గురించి కూడా వెల్లడించాడు. తన భార్యలు ప్రతిరోజూ తన అండర్వేర్ చెక్ చేస్తారని తెలిపాడు. ఇందుకు వారికున్న ప్రత్యేక శ్రద్ధనే కారణమని తెలిపాడు. ఒకరితో విడాకులు 2022లో ఆర్థర్ 9 మంది యువతులను వివాహం చేసుకున్నప్పుడు వార్తల్లో నిలిచాడు. అయితే వీరిలో ఒక మహిళ అతని నుంచి విడాకులు తీసుకుంది. ఇప్పడు ఆర్థర్ తన 8 మంది భార్యల డిమాండ్ మేరకు సిక్స్‌ప్యాక్ కోసం ప్రయత్నిస్తున్నాడు. అలాగే శరీరంపై టాటూలు వేయించుకున్నాడు. పూర్తిస్థాయిలో ఫిట్‌గా ఉండేందుకు ఆర్థర్ తనను తాను జిమ్‌కు సమర్పించుకున్నాడు. తన శరీరపు కొలతల్లో మార్పు వచ్చిదోలేదో తెలుసుకునేందుకు తన భార్యలు ప్రతీరోజూ తన అండర్‌వేర్‌ను కొలుస్తుంటారని ఆర్థర్ వెల్లడించాడు. ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ వివాదాస్పదం సిక్స్‌ప్యాక్ కోసం ఆర్థర్ తనకు ఇష్టమైన ఆహార పదార్థాలను తినడం మానివేశాడు. చివరికి బ్రెడ్, పాస్తా కూడా తినడంలేదని తెలిపాడు. ఒలింపిక్ ఎథలెట్స్ కోసం డిజైన్ చేసిన వ్యాయామాలను ఆర్థర్ అనుసరిస్తున్నాడు. కాగా ఆర్థర్ 9 మంది భార్యలతో ఉన్నప్పుడు తాను పిల్లలను కనాలనుకుంటే ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ రూల్ పాటిస్తానని తెలిపాడు. అప్పట్లో ఆర్థర్ చేసిన ఈ వ్యాఖ్యానం పెద్ద దుమారమే రేపింది. ఇది కూడా చదవండి: శివుని కోసం మెడ నరుక్కున్నాడు.. ఇప్పుడతని పరిస్థితి ఇదే! -
వామ్మో.. లోదుస్తుల్లో బంగారం..
సాక్షి, తిరువొత్తియూరు(తమిళనాడు): పాదరక్షల్లో బంగారం దాచి తీసుకొచ్చిన ఆరుగురిని మీనంబాక్కం విమానాశ్రయంలో పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్ధరాత్రి శ్రీలంక నుంచి శ్రీలంకన్ ఎయిర్‌లైన్స్ ప్రత్యేక విమానం వచ్చింది. చెన్నైకి చెందిన ఆరుగురు ప్రయాణికులు ఒక బృందంగా వచ్చారు. అధికారులకు వారిపై అనుమానం రావడంతో క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇద్దరు ప్రయాణికుల పాదరక్షల్లో బంగారం, నలుగురి లోదుస్తుల్లో 928 గ్రాముల బంగారాన్ని గుర్తించారు. బంగారాన్ని స్వాధీనం చేసుకుని విచారణ చేస్తున్నారు. చదవండి: Tamilnadu: తల్లి వద్దు.. ప్రియుడే కావాలి.. -
ప్రాణం తీసిన డ్రాయర్ గొడవ
కాన్పూర్: లోదుస్తువు (అండర్వేర్) దొంగలించి సరదాగా వేసుకుని మిత్రుడిని ఆటపట్టిద్దామని భావించగా అది కాస్త అతడి ప్రాణం మీదకు వచ్చింది. అండర్వేర్ వేసుకున్నాడనే కోపంతో గొడవ జరిగి చివరకు ఆ యువకుడి హత్యకు దారి తీసింది. సరదాగా జరిగిన వాగ్వాదం కాస్త చివరకు కత్తితో పొడుచుకునే వరకు వెళ్లింది. క్షణికావేశంలో జరిగిన ఆ వాగ్వాదంలో ఓ యువకుడి ప్రాణం పోయి స్థాయికి చేరింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కాన్పూర్ దేహక్ జిల్లాలోని ఓ పారిశ్రామిక వాడలో అజయ్ కుమార్, వివేక్ శుక్లా ఒకే గదిలో ఉంటున్నారు.సరదాగా అజయ్‌ను ఆట పట్టిద్దామనే ఉద్దేశంతో వివేక్ అతడి అండర్వేర్ దొంగతనం చేశాడు. అయితే గదిలో అండర్వేర్ కోసం వెతకగా అజయ్‌కు కనిపించలేదు. దీంతో వివేక్‌ను అడగ్గా.. తాను వేసుకున్నానని వివేక్ సరదాగా ఆట పట్టించాడు. అయితే అజయ్ కోపంతో అతడితో వాగ్వాదం చేశాడు. ఈ సమయంలో కోపోద్రిక్తుడైన అజయ్ క్షణికావేశంలో కూరగాయలు కోసే కత్తితో వివేక్‌ను పొడిచాడు. పలుసార్లు పొడవడంతో వివేక్ తీవ్ర గాయాలపాలయ్యాడు. తీవ్ర రక్తస్రావం కావడంతో భయాందోళన చెందిన అజయ్ వెంటనే అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న తోటి కార్మికులు వెంటనే స్పందించి అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతిచెందినట్లు లాలా లజపతిరాయ్ ఆస్పత్రి వైద్యులు ధ్రువీకరించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు అజయ్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
నిక్కరు సైజులో తేడా, పోలీసులకు ఫిర్యాదు!
భోపాల్: తోటి వారితో సమస్య ఏదైనా తలెత్తితే స్థానికంగా పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపేవారు కొందరైతే.. చిన్న కారణాలకే పోలీస్ స్టేషన్ మెట్లక్కేవారు మరికొందరు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన కృష్ణకుమార్ దుబే (46) రెండో రకానికి చెందినవాడిగా తెలుస్తోంది. స్థానికంగా ఉండే టైలర్ తనకు సరిపడా నిక్కరు కుట్టివ్వలేదని అతడు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండు మీటర్ల వస్త్రం ఇచ్చినా నిక్కరు సైజు బాగా తగ్గించి తయారు చేశాడని ఆరోపించాడు. అంతేకాకుండా నిక్కరు సైజును తిరిగి సరిచేసి ఇవ్వుమంటే స్పందించడం లేదని పేర్కొన్నాడు. అందుకనే స్టేషన్ గడపతొక్కాల్సి వచ్చిందని చెప్తున్నాడు. నిక్కరు కుట్టడానికి టైలర్‌కి రూ.70 చెల్లించానని దుబే తెలిపాడు. లాక్డౌన్ కారణంగా రెండు పూటలా తిండిలేక ఇబ్బందులు పడుతుంటే.. టైలర్ పనివల్ల తాను మరింత నష్టపోయానని, న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. దుబే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని స్థానిక కోర్టుకు హాజరు కావాలని సూచించారు. (‘నీళ్లు అడుగుతున్న ఉడత’) -
విమానంలో ఏసీగాలికి అండర్వేర్ ఆరబెట్టింది!
-
ఫ్లయిట్లో అందరూ బిత్తరపోయేలా!
విమాన ప్రయాణంలో వింతలు, రోత పుట్టించే సంఘటనలు జరగడం అరుదేం కాదు. అప్పుడప్పుడు కొందరు తమ వికృత చేష్టలతో తోటిప్రయాణికులు బిత్తరపోయేలా చేసిన ఘటనలు కోకొల్లలు. తాజాగా రష్యాలోని మాస్కోకు వెళుతున్న ఓ విమానంలో ఓ మహిళ తన చర్యతో తోటి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. ప్రయాణికులతో నిండిపోయిన విమానంలో ఎంచక్కా సీటులో కూర్చొని.. ఆ మహిళ ఓ అండర్‌వేర్‌ను ఆరబెట్టింది. ప్రయాణికులందరికీ కనిపించేలా పైన ఉన్న ఏసీగాలి తగిలేలా అండర్‌వేర్‌ను ఎత్తిపట్టి.. దానిని తీరిగ్గా ఆరబెట్టింది. ప్రయాణికులందరూ ఈ వికృత చర్యను చూస్తూ మిన్నకుండిపోయారు. ఎవరూ ఇదేమిటని ఆమెను ప్రశ్నించలేదు. ఈ నెల 14న టర్కీలోని అంటల్యా నుంచి మాస్కోకు వెళుతున్న యూరల్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనను వెనకు సీటులో కూర్చున్న ప్రయాణికుడు రికార్డు చేసి.. రష్యాకు చెందిన ‘ఫస్ట్ టులా’ వెబ్‌సైట్‌కు ఇచ్చాడు. ఆ వెబ్సైట్ యూట్యూబ్‌లో పోస్టు చేయడంతో వెలుగులోకి వచ్చింది. ఏసీ వెంట్ నుంచి గాలి బాగా తగిలేలా పట్టుకొని ఆమె తెల్లరంగు అండర్‌వేర్‌ను ఆరబెట్టుకుంది. అయితే, ఆమె వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనను చూస్తూ విస్మయపోయానని తోటి ప్రయాణికులు మీడియాతో తెలిపారు. -
ఫస్ట్ లేడీ ‘లోదుస్తుల’ వివాదం.. జర్నలిస్టు అరెస్ట్
హరారే : దేశ ప్రథమ పౌరురాలిపై అసత్య కథనాలు రాసిన ఓ జర్నలిస్టు.. చివరికి జైలు ఊచలు లెక్కించే పరిస్థితిని కొనితెచ్చుకున్నాడు. జింబాబ్వేలో తీవ్ర వివాదాస్పదమైన ఆ కథనం వివరాల్లోకి వెళితే..అధ్యక్షుడు రాబర్ట్ ముగాబే పాలనలోని జింబాబ్వే.. తీవ్ర ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతోంది. ప్రజల కనీస అవసరాలకు కూడా సరుకులు దొరకని పరిస్థితి. ఈ నేపథ్యంలో అధికార జింబాబ్వే ఆఫ్రికన్ నేషనల్ యూనియన్ - పేట్రియాక్ ఫ్రంట్(జును-పీఎఫ్) పార్టీ.. దేశంలోని ఉన్నతవర్గాల నుంచి పాతదుస్తులను సేకరించే కార్యక్రమాన్ని చేపట్టింది. ఫస్ట్‌లేడీ గ్రేస్ ముగాబే (రాబర్ట్ సతీమణి) సైతం తన వంతు సాయంగా పాత దుస్తులను దానం చేశారు. అయితే, గ్రేస్ ఇచ్చిన దుస్తుల్లో ఆమె వాడిన లోదుస్తులు కూడా ఉన్నాయని, ఆ చర్య ద్వారా ఆమె పేదలను తీవ్రంగా అవమానించారని కెన్నెత్ న్యాంగాని అనే జర్నలిస్టు ఓ కథనం రాశారు. కానీ, కెన్నెత్ రాసినదాంట్లో ఏమాత్రం వాస్తవం లేదని, అధికార పార్టీపై దుష్ప్రచారం చేసేందుకే ఆ కథనాన్ని అల్లారని అధికారులు గుర్తించారు. ఈ మేరకు కెన్నెత్ పై కేసు నమోదుచేసి, అరెస్టు చేసినట్లు జింబాబ్వే మానవ హక్కుల సంఘం ప్రపంచ మీడియాకు వెల్లడించింది. త్వరలోనే ఈ కేసు కోర్టు విచారణకు వస్తుందని అధికారులు చెప్పారు. ఈ వివాదంపై అధికార జును-పీఎఫ్ పార్టీ కీలక నేత ఈసౌ ముఫుమి మాట్లాడుతూ.. గ్రేస్ ముగాబే ఇచ్చినవాటిలో గౌన్లు, నైట్ డ్రెస్సెస్, చెప్పులు మాత్రమే ఉన్నాయన్నారు. కాగా, జర్నలిస్టు కెన్నెత్ అరెస్టును అంతర్జాతీయ మానవహక్కుల వేదిక ఆమ్నెస్టీ ఖండించింది. జింబాబ్వే పాలకులు మీడియాను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, కెన్నెత్‌ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. దానితోపాటు మీడియా కూడా హద్దులు మీరుకుండా స్వీయ నియంత్రణతో పనిచేయాలని ఆమ్నేస్టీ సూచించింది. -
వింత దొంగను పట్టుకున్నారు...
టోక్యోః జపాన్ లోని టోక్యోలో ఓ వింత దొంగను పోలీసులు అరెస్టు చేశారు. ఓ మహిళ ఫేస్ బుక్ ఖాతాలోకి అక్రమంగా చొరబడి, ఆమె లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేసిన ఆరోపణలతో పోలీసులు ఆ వ్యక్తిని వలవేసి పట్టుకున్నట్లు తెలిపారు. వందలకొద్దీ అక్రమ ఖాతాలు, పాస్వర్డ్స్ సేకరించిన అతడి ఇంట్లో సోదాలు జరిపి డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు. ఓ మహిళ లో దుస్తుల ఫొటోలను అక్రమంగా దొంగిలించిన వ్యక్తిని పోలీసులు అరెస్లు చేశారు. జపాన్ కు చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగి, 25 ఏళ్ళ ర్యోసుకే కొగా.. బాధితురాలి ఫేస్ బుక్ ఖాతాలోకి చొరబడి, జనవరినుంచి మూడు నెలల సమయంలో సుమారు 17 సార్లు అక్రమంగా లాగిన్ అయ్యాడు. అంతేకాక ఆమె ఖాతానుంచి లోదుస్తుల ఫోటోలను డౌన్లోడ్ చేశాడని టోక్యో మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులు వెల్లడించారు. ఐటీ సంస్థలో పనిచేస్తున్నసదరు వ్యక్తి సుమారు 770 ఫేస్ బుక్, ఐ క్లౌడ్ ఐడీలు కలిగి ఉన్నట్లు, వాటినుంచీ సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు స్థానిక మీడియా సహా, జిజి ప్రెస్ విచారణలో వెల్లడైంది. అక్రమంగా సామాజిక మాధ్యమాల్లో చొరబడి, సమాచారాన్ని దొంగిలిస్తున్న కొగాకు మూడేళ్ళ జైలు శిక్షతోపాటు, సుమారు 5.5 లక్షల రూపాయల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. అయితే అన్ని వందల లాగిన్ ఐడీలను.. కొగా ఎలా సేకరించాడన్న విషయాలపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఓ మహిళ అండర్ వేర్ ఫొటోలను డౌన్లోడ్ చేసిన సందర్భంలో ఆ చోరాసురుడి అసలు బండారం బయట పడినట్లు ఓ వార్తా పత్రిక వెల్లడించిన సమాచారంద్వారా తెలుస్తోంది. ఇతరుల అకౌంట్లలో చొరబడ్డమే కాక, కొన్నిలైంగిక చిత్రాలను పోస్టు చేసిన కొగా ఇంట్లో... సోదాలు నిర్వహించిన పోలీసులు.... అతడు సేకరించిన ఐడీ, పాస్వర్డ్ డేటాను కూడ స్వాధీనం చేసుకున్నారు. -
మీరు 'వాటిని' పోగొట్టుకున్నారా?
న్యూజిల్యాండ్: ఇళ్ళల్లోకి చొరబడి బంగారం, నగలు ఎత్తుకుపోయేవాళ్ళను చూశాం. బ్యాంకుల్లో, కార్యాలయాల్లో డబ్బు, వస్తువులు చోరీ చేసేవాళ్ళను చూశాం. అయితే ఓ దొంగ విచిత్ర వస్తువుల చోరీకి పాల్పడుతోందట. తరచుగా ఇళ్ళల్లో మిస్సవుతున్న ఆ వస్తువులు ఎవరు దొంగిలిస్తున్నారో తెలియక అంతా తలలు పట్టుకుంటుంటే చివరికి ఆ దొంగే ఓరోజు వస్తువులన్నీయజమాని ఇంటికి తెచ్చి పెట్టేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చిందట. ఇంతకూ ఆ టక్కరి దొంగ ఏ వస్తువులను కొట్టేసిందనేగా మీరు తెలుసుకోవాలనుకుంటున్నది?... ఎందుకాలస్యం ఈ స్టోరీ చదివెయ్యండి.... న్యూజిల్యాండ్ హామిల్టన్ లో బర్గ్లర్ అనే ఓ పిల్లి.. తరచుగా అందరి ఇళ్ళల్లో చోరీకి పాల్పడుతోందట. అయితే పిల్లి చోరీ చేస్తోందంటే ఏ పాలో, పెరుగో అనుకునేరు. సాక్షాత్తూ ఆ ఇళ్ళల్లోని మగవాళ్ళ అండర్ వేర్లు, సాక్స్ లు తస్కరిస్తోందట. ఇళ్ళల్లో లో దుస్తులు అదృశ్యం అవుతుంటే ఇంట్లోవాళ్లకు అవి ఎలా పోతున్నాయో అర్థం కాకుండా పోయిందట. ఏ డబ్బో, బంగారమో అయితే కేసులు పెట్టడమో, ఫిర్యాదు చేయడమో చేస్తారు. ఈ చోరీ అటువంటిది కాదుకదా... పోతున్నది లో దుస్తులు కావడంతో ఏం చేయాలో పాలుపోక ఆలోచనలో పడ్డారట. రెండు నెలల్లో ఆరేళ్ళ వయసున్న ఆ టాంకినీస్ క్యాట్.. మొత్తం పదకొండు జతల అండర్ వేర్లు, ఏభై వరకూ సాక్స్ చోరీ చేసి, తిరిగి తెచ్చి యజమాని ఇంట్లో పెట్టేయడంతో చివరికి అసలు విషయం బయట పడింది. ఈ సరదా న్యూస్ ను 'మీరు అండర్ వేర్లు పోగొట్టుకున్నారా?' అన్న టైటిల్ తో ఫేస్ బుక్ వినియోగదారుడు సారా నాథన్ ఫొటోలతో సహా పోస్ట్ చేశాడు. ఆ దొంగ పిల్లిని గురించి జనాన్ని అప్రమత్తం చేసేందుకు తానా వివరాలను అందిస్తున్నట్లు చెప్పాడు. అందుకోసం వీధుల్లోని ప్రతి లెటర్ బాక్స్ లోనూ నోట్ పెట్టానని, జార్జి సెంటర్ ప్రాంతంలోని వారెవరైనా సదరు ఆస్తులు పోగొట్టుకుంటే తనకు తెలియజేయాలని ఫేస్ బుక్ లో రాశాడు. ఇంకెదుకాలస్యం మరి తమ తమ ... దుస్తులు పోగొట్టుకున్నవారు త్వర పడాల్సిందే... -
అండర్వేర్ లోనే అసలు పరీక్ష!
విశాలమైన పచ్చిక మైదానం.. అందులో వివిధ భంగిమల్లో కూర్చున్న యువజనం.. ఏ ఒక్కరికీ ఒంటినిండా దుస్తుల్లేవు. అందరికందరూ అండర్ వేర్లలో ఉన్నారు. చేతుల్లో పెన్ను, పేపర్లతో తెగరాసేస్తున్నారు. ఇదేదో గిన్నిస్ రికార్డు ఫీట్ లా ఉందనుకుని కాసేపుగమనించిన తర్వాతగానీ అప్పుడే అక్కడికి వెళ్లినవాళ్లకు అర్థంకాలేదు.. అదో అసలు సిసలు ఆర్మీ పరీక్ష అని!బిహార్ లోని ముజఫర్ పూర్ లో సోమవారం నిర్వహించిన ఆర్మీ రిక్రూట్ మెంట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులను చొక్కాలు, ప్యాంట్లు విప్పిన తర్వాతే అనుమతించారు అధికారులు. గత నెల నిర్వహించిన ఫిజికల్ టెస్ట్ లో మొత్తం 11 వేల మంది అభ్యర్థులు రిటన్ పరీక్షకు అర్హత సాధించారు. ఎంత ఆర్మీ పరీక్షైతే మాత్రం మరీ బట్టలిప్పించాలా? అనుకునేముందు అది బిహార్ అని మరోసారి గుర్తుచేసుకోవాలి మనం. పరీక్షల్లో కాపీ కొట్టడంలో ప్రపంచానికే పాఠాలు నేర్పిన చరిత్ర బిహారీలది. అయితే ఈసారి మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ చూచిరాతకు తావివ్వకూడదనుకున్న అధికారులు అభ్యర్థుల పరువును పణంగాపెట్టి ఇంతటిఘనకార్యం చేశారు.