
భోపాల్: తోటి వారితో సమస్య ఏదైనా తలెత్తితే స్థానికంగా పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపేవారు కొందరైతే.. చిన్న కారణాలకే పోలీస్ స్టేషన్ మెట్లక్కేవారు మరికొందరు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన కృష్ణకుమార్ దుబే (46) రెండో రకానికి చెందినవాడిగా తెలుస్తోంది. స్థానికంగా ఉండే టైలర్ తనకు సరిపడా నిక్కరు కుట్టివ్వలేదని అతడు ఏకంగా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. రెండు మీటర్ల వస్త్రం ఇచ్చినా నిక్కరు సైజు బాగా తగ్గించి తయారు చేశాడని ఆరోపించాడు. అంతేకాకుండా నిక్కరు సైజును తిరిగి సరిచేసి ఇవ్వుమంటే స్పందించడం లేదని పేర్కొన్నాడు. అందుకనే స్టేషన్ గడపతొక్కాల్సి వచ్చిందని చెప్తున్నాడు. నిక్కరు కుట్టడానికి టైలర్‌కి రూ.70 చెల్లించానని దుబే తెలిపాడు. లాక్‌డౌన్ కారణంగా రెండు పూటలా తిండిలేక ఇబ్బందులు పడుతుంటే.. టైలర్ పనివల్ల తాను మరింత నష్టపోయానని, న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. దుబే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని స్థానిక కోర్టుకు హాజరు కావాలని సూచించారు.
(‘నీళ్లు అడుగుతున్న ఉడత’)
Comments
Please login to add a commentAdd a comment