Tailor
-
స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో
నెల్లూరు(క్రైమ్): స్నేహితురాలు దూరం పెట్టిందన్న మనస్తాపంతో ఓ టైలర్ తన దుకాణంలోనే ఆత్మహత్య చేసుకున్న విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతదేహం కుళ్లి నీచునీరు బయటకు రావడం, దుర్ఘందం వెదజల్లుతుండటాన్ని గుర్తించిన స్నేహితురాలు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని షర్టర్ పగులగొట్టి మృతదేహాన్ని వెలికితీశారు. పోలీసులు, బాధితుల సమాచారం మేరకు.. పోస్టల్‌కాలనీ ఆరోవీధికి చెందిన పచ్చియప్పన్ రామస్వామి(48) – రాజేశ్వరి దంపతులు. వారికి సంతోష్‌కుమార్, ఐశ్వర్య సంతానం. ఆయన టైలరింగ్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతను కరెంటాఫీస్ సెంటర్లో టైలరింగ్ దుకాణం నిర్వహిస్తున్నప్పుడు చంద్రమౌళినగర్‌కు చెందిన కె.సుభాషిణి ఆయన వద్ద పనికి చేరారు. ఆమె భర్త నుంచి విడిపోయి దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఇద్దరూ సహజీవనం చేయసాగారు. ఈ విషయమై రామస్వామికి, భార్య రాజేశ్వరికి మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. అయినా రామస్వామి ఇవేమీ పట్టించుకోలేదు. స్నేహితురాలి వద్దనే ఎక్కువ సమయం గడిపేవాడు. అప్పుడప్పుడు భార్య, పిల్లల వద్దకు వచ్చివెళ్లేవాడు. స్నేహితురాలికి విద్యుత్‌భవన్ వద్ద పండ్ల వ్యాపారం పెట్టించాడు. దాని పక్కనే ఆయన టైలరింగ్ షాపు నిర్వహిస్తున్నాడు. స్నేహితురాలి కుమారుడు, కోడలు ఆమంచర్లలో ఉంటున్నారు. వారు ఆర్థికంగా నష్టపోయి ఇటీవల తల్లి వద్దకు వచ్చారు. రామస్వామి సైతం వారికి చేదోడువాదోడుగా ఉండేవాడు. అయితే గత కొద్దిరోజులుగా వారిని ఇంటి నుంచి పంపివేయాలని రామస్వామి స్నేహితురాలిపై ఒత్తిడి తేవడంతోపాటు విపరీతంగా కొట్టేవాడు. దీంతో ఆమె దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా అతని ప్రవర్తనలో మార్పురాలేదు. దీంతో సుభాషిణి అతనిని దూరం పెట్టింది. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన రామస్వామి తన స్నేహితుడి ద్వారా సుభాషిణితో రాజీప్రయత్నాలు చేశాడు. అయినా ఆమె పట్టించుకోలేదు. శనివారం భార్య, పిల్లల వద్దకు వెళ్లి కొంతసేపు వారితో గడిపి అనంతరం షాపునకు వచ్చాడు. షాపులోనే మద్యం తాగి స్నేహితురాలి కోడలితో గొడవపడ్డాడు. షట్టర్ లోపల గడియపెట్టుకుని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. భర్త ఇంటికి రాకపోవడంతో స్నేహితురాలి వద్దకు వెళ్లి ఉంటాడని రాజేశ్వరి, తాను దూరం పెట్టడంతో భార్య వద్దనే ఉంటాడని స్నేహితురాలు భావించారు. సోమవారం సుభాషిణి పండ్ల షాపునకు వచ్చింది. రామస్వామి టైలరింగ్ షాపులో నుంచి నీచునీరు బయటకు రావడం, దుర్ఘంధం వస్తుండడాన్ని గమనించిన ఆమె దర్గామిట్ట పోలీసులకు సమాచారం ఇచ్చింది. దర్గామిట్ట ఏఎస్సై బుజ్జయ్య, హెడ్‌కానిస్టేబుల్ భాస్కర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే రామస్వామి భార్య, కుటుంబసభ్యులు కూడా అక్కడకు చేరుకున్నారు. కుటుంబసభ్యులు, స్థానికుల సహకారంతో పోలీసులు షట్టర్ పగులగొట్టి చూడగా రామస్వామి ఉరేసుకుని ఉన్నాడు. మృతదేహం కుళ్లి తీవ్ర దుర్ఘంధం వెదజల్లుతూ ఉండడంతో శవపరీక్ష నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. స్నేహితురాలే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని రామస్వామి భార్య ఆరోపించింది. తన భర్త మృతిపై విచారణ జరిపి అందుకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉదయ్‌పూర్ టైలర్ హత్యకేసులో హైదరాబాద్‌కు లింకులు?
సాక్షి, హైదరాబాద్: ఉదయ్‌పూర్ టైలర్ కన్హయ్య హత్య కేసులో ఎన్ఐఏ దర్యాప్తు ముమ్మరం చేసింది. హత్య కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు హైదరాబాద్‌లో షెల్టర్ తీసుకున్నారనే సమాచారంతో ఎన్ఐఏ మంగళవారం సోదాలు చేసింది. సంతోష్‌నగర్‌లో తావీద్ సెంటర్ నిర్వహిస్తున్న.. బిహార్‌కు చెందిన మహ్మద్ మున్వార్ హుస్సేన్ అశ్రఫి అనే వ్యక్తి అదుపులోకి తీసుకొని ఎన్ఐఏ విచారించింది. ఈ నెల 14న జైపూర్‌లోని ఎన్ఐఏ ఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు ఇచ్చింది. చదవండి: (ఉదయ్‌పూర్ హత్య కేసు.. మరో కీలక విషయం వెలుగులోకి..) -
ఉదయ్‌పూర్ ఘటన; భయపడినట్టుగానే జరిగింది
ఉదయ్‌పూర్: తన భర్త భయపడినట్టుగానే జరిగిందని రాజస్థాన్ టైలర్ కన్హయ్యా లాల్ తెలి భార్య జశోద తెలిపారు. ప్రాణభయంతో గత వారం రోజుల నుంచి తన భర్త దుకాణానికి వెళ్లడం లేదని వెల్లడించారు. అంత్యక్రియలకు ముందు బుధవారం ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఏడు రోజుల తర్వాత తిరిగి షాపునకు వెళ్లిన తన భర్తను దుండగులు దారుణంగా హత్యచేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 18, 21 వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారని, వారి భవిష్యత్‌పై బెంగగా ఉందని జశోద వాపోయారు. 48 ఏళ్ల కన్హయ్యా లాల్ మంగళవారం ఉదయ్‌పూర్‌లోని తన దుకాణంలో దారుణ హత్యకు గురయ్యారు. కస్టమర్లలా వచ్చిన ఇద్దరు వ్యక్తులు అతడిని చంపేశారు. మహ్మద్ ప్రవక్తపై బహిష్కృత బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను సమర్థించినందుకు కన్హయ్యా లాల్‌ను హత్య చేశారు. అయితే ఈ వివాదంలో కన్హయ్యా లాల్‌ను జూన్ 10న అరెస్ట్ చేసినట్టు రాజస్థాన్ పోలీసులు తెలిపారు. చంపేస్తామంటూ తనకు బెదిరింపులు వస్తున్నాయని అతడు జూన్ 15న స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కాగా, కన్హయ్యా లాల్‌పై ఫిర్యాదుచేసిన వారితో పోలీసులు చర్చలు జరపడంతో పరిస్థితి సద్దుమణిగినట్టు కనబడింది. దీంతో తనకు పోలీసుల సహాయం అవసరం లేదని కన్హయ్యా లాల్ రాతపూర్వకంగా పేర్కొన్నాడు. నాకూ బెదింపులు వస్తున్నాయి: జిందాల్ తనకు కూడా దుండగుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని బీజేపీ బహిష్కృత నాయకుడు నవీన్ కుమార్ జిందాల్ బుధవారం వెల్లడించారు. ‘ఈ ఉదయం 6.43 గంటలకు నాకు మూడు ఈమెయిల్స్ వచ్చాయి. కన్హయ్య లాల్ గొంతు కోసిన వీడియో కూడా అందులో జతచేశారు. నన్ను, నా కుటుంబాన్ని బెదిరించారు. పోలీసులకు సమాచారమిచ్చాన’ని నవీన్ కుమార్ జిందాల్ హిందీలో ట్వీట్ చేశారు. (క్లిక్: ఉదయ్‌పూర్ టైలర్ హత్యలో ఉగ్రకోణం?) -
ఉదయ్‌పూర్ ఘటనలో ఉగ్రకోణం?.. హోం శాఖ కీలక ఆదేశాలు
Udaipur Tailor Murder: రాజస్థాన్ ఉదయ్‌పూర్ టైలర్ హత్య కేసుపై దేశవ్యాప్తంగా స్పందన పెరిగిపోతుండగా.. మరోవైపు చర్చ కూడా విపరీతంగా నడుస్తోంది. ఈ తరుణంలో.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ స్పందించింది. బుధవారం ఉదయం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ ఘటనలో ఉగ్రకోణం అనుమానాలు వ్యక్తం అవుతున్నందున.. జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) విచారణకు ఆదేశించింది. టైలర్ కన్హయ్య లాల్ హత్యోదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కస్టమర్లలాగా నటిస్తూ కొలతలు ఇస్తుండగానే.. కన్హయ్య గొంతు కోసి హత్య చేస్తూ వీడియో వైరల్ చేయడం, ఆపై ప్రధానికి సైతం హెచ్చరికలు జారీ చేసిన వీడియోలు వైరల్ కావడం తెలిసిందే. ప్రవక్తపై నూపర్ కామెంట్ల వివాదం తర్వాత.. నూపుర్‌కు మద్ధతుగా కన్హయ్య పోస్టులు పెట్టినందుకే ఈ హత్య జరిగనట్లు నిందితుల వీడియో ద్వారా స్పష్టమైంది. మరోవైపు .. సదరు వీడియోలను తొలగించాలంటూ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఇంకోవైపు ఉగ్ర కోణం నేపథ్యంలోనే కేంద్ర హోం శాఖ ఎన్ఐఏ దర్యాప్తునకు ఆదేశించినట్లు స్పష్టం అవుతోంది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ట్విటర్లో ప్రకటించింది కూడా. ఏదైనా సంస్థ ప్రమేయం, అంతర్జాతీయ లింకులు క్షుణ్ణంగా పరిశోధించబడతాయి అని ట్వీట్లో పేర్కొంది. ఇక ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే డిప్యూటీ ఐజీ స్థాయి అధికారితో పాటు ఎన్ఐఏ బృందం ఒకటి మంగళవారమే ఉదయ్‌పూర్‌కు చేరుకుని పరిశీలించింది. తాజా సమాచారం ప్రకారం.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద ఉదయ్‌పూర్ ఘటనపై ఎన్ఐఏ బృందం కేసు నమోదు చేయొచ్చని తెలుస్తోంది. MHA has directed the National Investigation Agency (NIA) to take over the investigation of the brutal murder of Shri Kanhaiya Lal Teli committed at Udaipur, Rajasthan yesterday. The involvement of any organisation and international links will be thoroughly investigated. — गृहमंत्री कार्यालय, HMO India (@HMOIndia) June 29, 2022 చదవండి: అచ్చం ఐసిస్ తరహాలో క్రూరంగా కన్హయ్య గొంతు కోశారు -
ఉదయ్‌పూర్ హత్య: రాజస్థాన్‌లో నెలపాటు 144 సెక్షన్
జైపూర్: మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలను సమర్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన ఓ టైలర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇద్దరు వ్యక్తులు పట్టపగలే కన్హయ్య లాల్ అనే వ్యక్తిపై.. అతని దుకాణంలోనే ఘాతుకానికి పాల్పడ్డారు. అచ్చం ఉగ్ర సంస్థ ఐసిస్ దుండగులను తలపించేలా గొంతు కోసి క్రూరంగా పొట్టన పెట్టుకున్నారు. పైగా దాన్ని రికార్డు చేసి వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేశారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ మాల్దాస్‌లో మంగళవారం జరిగిన ఈ దారుణం.. దేశవ్యాప్తంగా కలకలం సృష్టించింది. బీజేపీ సస్పెండ్ నేత నూపుర్ శర్మ వ్యాఖ్యలను సమర్థించినందుకే హత్య చేశామంటూ హంతకులు మరో వీడియో పోస్టు చేశారు. పైగా ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఇలాగే చంపుతామని హెచ్చరించారు. ప్రవక్త వివాదం తాలూకు జ్వాలను రగిలించింది ఆయనేనని ఆరోపించారు. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ, ‘ఇది మోదీ(ప్రధానిని ఉద్దేశిస్తూ) మెడ దాకా కూడా చేరుతుంది’ అంటూ బెదిరించారు. నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మొహమ్మద్‌గా గుర్తించారు. రియాజ్ గొంతు కోయగా.. గౌస్ ఆ ఉదంతం అంతా రికార్డు చేశాడు. ఈ ఇద్దరినీ పోలీసులు గంటల వ్యవధిలోనే అరెస్టు చేశారు. మరోవైపు సీఎం అశోక్‌గెహ్లాట్ సహా పోలీస్ శాఖ నిందితుల వీడియోలను వైరల్ చేయొద్దంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. తద్వారా శాంతిభద్రతలను పరిరక్షించాలంటూ కోరుతున్నారు. ఈ ఉదంతంపై నిరసనలు, మతపరమైన ఉద్రిక్తతలతో ఉదయ్‌పూర్‌తో పాటు రాజస్తాన్ అంతా అట్టుడికింది. పలు ప్రాంతాల్లో ఆస్తుల ధ్వంసం, వాహనాలకు నిప్పంటించడం లాంటి ఘటనలు జరిగాయి. ఉద్రిక్తతలు పెరగడంతో నగరంలో కర్ఫ్యూ విధించారు. ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. బుధవారం మొత్తం ఇంటర్నెట్ పని చేయదని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నెలపాటు 144 సెక్షన్ విధించారు. ఘటనకు సంబంధించిన వీడియో సర్క్యులేట్ కాకుండా చూస్తున్నారు. సంయమనం పాటించాలంటూ సీఎం అశోక్ గెహ్లాట్ విజ్ఞప్తి చేశారు. విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ఉదయ్‌పూర్‌కు కేంద్ర హోం శాఖ హుటాహుటిన ఎన్ఐఏ బృందాన్ని పంపింది. కస్టమర్లలా వచ్చి... మృతుడు కన్హయ్యా లాల్ ఉదయ్‌పూర్‌లో టైలర్. హంతకులు రియాజ్ అక్తరీ, మహ్మద్ గౌస్ బట్టలు కుట్టించుకునే సాకుతో మంగళవారం మధ్యాహ్నం మాల్దాస్‌లోని దాన్ మండీలో ఉన్న అతని దుకాణంలోకి ప్రవేశించారు. కొలతలు తీసుకుంటుండగా రియాజ్ కత్తి తీసి కన్హయ్య మెడపై వేట్లు వేశాడు. దీన్నంతా గౌస్ తన మొబైల్లో వీడియో తీశాడు. వెంటనే ఇద్దరూ అక్కణ్నుంచి పారిపోయారు. ఈ దారుణంపై స్థానిక దుకాణదారుల్లో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. నిరసనగా వారంతా దుకాణాలు మూసేశారు. మృతదేహాన్ని తరలించకుండా అడ్డుకున్నారు. మృతుని కుటుంబానికి రూ.50 లక్షల పరిహారం, ప్రభుత్వోద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే యూఐటీ ప్రకారం.. కన్హయ్య లాల్ ఇంట్లో ఒకరికి ఉద్యోగం, ఐదు లక్షల నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెప్తున్నారు. నూపుర్ శర్మ వ్యాఖ్యలకు మద్దతుగా కన్హయ్య ఎనిమిదేళ్ల కుమారుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టగా దాన్ని కన్హయ్య సమర్థించినట్టు చెబుతున్నారు. ఈ ఉదంతంలో ఆయనను ఇటీవలే పోలీసులు అరెస్టు చేశారు. కన్హయ్యను చంపుతామంటూ జూన్ 17న తీసిన వీడియోను కూడా హంతకులు మంగళవారమే సోషల్ మీడియాలో పెట్టారు. తమ వర్గం వారు ఇలాంటి దాడులను ఉధృతంగా కొనసాగించాలని పిలుపునిచ్చారు. అక్తర్ స్థానిక మసీదులో పని చేస్తుండగా.. గౌస్ కిరాణా దుకాణం నడుపుతున్నట్టు పోలీసులు చెప్పారు. ఇది పక్కా పథకం ప్రకారం చేసిన హత్యేనని ఉదయ్‌పూర్ ఎస్పీ మనోజ్‌కుమార్ చెప్పారు. రక్షణ కోరినా పట్టించుకోలేదు.. మృతుడు పోలీసు రక్షణ కోరినా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ ఆరోపించింది. రాజస్తాన్‌లో హిందువులకు రక్షణ లేకుండా పోయిందని రాష్ట్ర బీజేపీ చీఫ్ సతీశ్ పునియా ఆరోపించారు. ‘‘హంతకులు కత్తులు చేతబట్టి నేరుగా ప్రధానినే చంపుతామని బెదిరిస్తూ వీడియోలు పోస్టు చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఇది దేశ సార్వభౌమత్వానికి, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు పెను సవాలు’’ అని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్‌కుమార్ అన్నారు. మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ మొదలుకుని పలువురు నేతలు హత్యను ఖండించారు. హంతకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. సంబంధిత వార్త: షాకింగ్ ఘటన.. అందరూ చూస్తుండగానే.. -
దుస్తులు సరిగా కుట్టలేదని హత్య
సాక్షి, విశాఖపట్నం, పీఎంపాలెం (భీమిలి): కొత్త దుస్తులు సరిగా కుట్టలేదని ఆగ్రహించిన ఇద్దరు వ్యక్తులు ఓ టైలర్‌పై దాడి చేయగా మృతి చెందిన ఘటన విశాఖ జిల్లాలో చోటుచేసుకుంది. పీఎం పాలెం పోలీసులు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఒడిశా రాష్ట్రం పర్లాకిమిడికి చెందిన బుడు లిమా భార్య లక్ష్మి, కుమార్తె సుమంత, కొడుకు సుమన్‌తో మారికవలసలోని రాజీవ్ గృహకల్ప జీఎఫ్–1 బ్లాక్ నంబర్ 104లో నివసిస్తున్నాడు. ఇంటివద్దనే లిమా టైలరింగ్ చేస్తుంటాడు. మిగతా కుటుంబ సభ్యులు కూలి పనులకు వెళుతుంటారు. ఇదిలా ఉండగా కాలనీకి చెందిన గణేష్ లిమా వద్ద కొత్త దుస్తులు కుట్టించుకున్నాడు. కొలతలు ప్రకారం సరిగా కుట్టకపోవడంతో సరిచేసి ఇవ్వాల్సిందిగా కోరాడు. అయితే అనుకున్న సమయానికి దుస్తులు సరిచేసి ఇవ్వకపోవడంతో టైలర్‌ను గట్టిగా ప్రశ్నించాడు. ఆ సమయంలో టైలర్ కుమార్తె, అల్లుడు సుశాంత్ ఇంట్లోనే ఉండడంతో గణేష్ వెళ్లిపోయాడు. అయితే గణేష్ తన మిత్రులు క్లింటన్, సూర్యనారాయణ మరికొందరిని వెంట తీసుకుని తిరిగొచ్చాడు. టైలర్ లిమాను విచక్షణారహితంగా గుండెలపై పిడిగుద్దులు గుద్దడంతో స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం కేజీహెచ్‌కు తీసుకువెళ్లాలని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు 108 వైద్య సిబ్బంది తెలిపారు. చదవండి: (కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యం.. ఇంటర్ విద్యార్థిని మృతి..!) -
ఐడియా అదుర్స్.. ఆ ఆలోచన ఎలా పుట్టిందంటే..?
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: అవసరం అన్నీ నేర్పుతుంది అనడానికి ఉదాహరణ ఈ చిత్రం. వేలకు వేలు అద్దెలు చెల్లించి షాప్ పెట్టుకునే ఆర్థిక స్తోమత లేదు. పోనీ ఏ రోడ్డు పక్కనో చిన్న బడ్డీ పెట్టుకుందామా అంటే మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు ఖాళీ చేయిస్తారో తెలియదు. జనానికి అందుబాటులో ఉంటూ రహదారి పక్కనే పని చేసుకోవడం ఎలాగబ్బా అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ తోపుడు బండి టైలరింగ్ షాప్ ఐడియా. చదవండి: అక్కా.. బా.. అంటూ.. గోదారోళ్ల కితకితలు.. మామూలుగా లేదుగా మరి.. విజయవాడ మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన దర్జీ కోటేశ్వరరావు స్థానిక అమ్మ కల్యాణ మండపం సమీపంలో ఇలా తోపుడు బండిపై కుట్టు మెషిన్ ఏర్పాటు చేసుకుని రోజంతా బట్టలు కుడుతుంటాడు. రాత్రికి ఎంచక్కా ఈ రిక్షా బండితో సహా ఇంటికి వెళ్తుంటాడు. ఐడియా అదిరింది కదూ. -
భర్తను చంపి ఫ్రిజ్‌లో పెట్టి.. పుట్టింటికి వెళ్లింది
సాక్షి: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్లో జరిగిన టైలర్ హత్య కేసును పోలీసులు చేధించారు. సాధిక్‌ను హత్య చేసింది భార్య రుబినా అని పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల విషయంలోభార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో రుబినా తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి తల్లిగారింటికి వెళ్లింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధిక్ తొలుత అమీర్‌పేట్‌లో టైలర్ షాపు నడిపేవాడు. కానీ లాక్డౌన్ కారణంగా షాప్ మూతపడింది. ఈ క్రమంలో ఇటీవలే కూకట్పల్లి ప్రాంతంలో మరో షాప్ ఓపెన్ చేశాడు. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ కోపంలో రుబినా భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం గురించి తెలిసి కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చేధించారు. ప్రస్తుతం రుబినాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చదవండి: స్కూటీపై వెళ్తుండగా వెంబడించి దారుణం -
జూబ్లీహిల్స్‌లో దారుణం: చంపి ఫ్రిజ్‌లో పెట్టారు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. దుండగులు ఓ వ్యక్తిని హత్య చేసి ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధి రహ్మత్ నగర్ డివిజన్ కార్మిక నగర్లో ఈ దారుణం వెలుగు చూసింది. మహమ్మద్ సిద్ధిక్ (35) అనే వ్యక్తి కార్మిక నగర్‌లోని ఓ భవంతిలో టైలరింగ్ పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు సిద్ధిక్‌ని దారుణంగా హత్య చేసి అతడి ఇంటిలోని ఫ్రిజ్‌లో దాచి పెట్టారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేపట్టారు. చదవండి: జూబ్లీహిల్స్: ఇంటికి పిలిచి డిగ్రీ విద్యార్థినిపై అత్యాచారం -
స్కూటీపై వెళ్తుండగా వెంబడించి దారుణం
భామిని/శ్రీకాకుళం: నడిరోడ్డుపై దారుణం జరిగింది. భర్త, భార్య, పిల్లలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఇద్దరు దుండగులు బైక్‌పై వెంబడించి నిర్మానుష్య ప్రదేశంలో వారిపై దాడి చేశారు. ఇంటి పెద్దను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి ఉడాయించారు. సోమవారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో భామిని మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనమైంది. ఎలా జరిగిందంటే.. లోహరిజోల గ్రామానికి చెందిన నల్లకేవటి కుమార్ (35)కు భార్య మాలతి, కుమారులు దీక్షిత్, ప్రణయ్ ఉన్నారు. మత్స్యకార కుటుంబానికి చెందిన ఈయన కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉంటూ టైలర్ పని చేస్తుండేవారు. ఇటీవల స్వగ్రామం వచ్చి అదే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి లోహరిజోల నుంచి స్కూటీపై భామిని మీదుగా పర్లాకిమిడిలో ఉంటున్న కుమార్ అక్కగారింటికి వెళ్తున్నారు. వీరిని హెల్మెట్లు, మాస్‌్కలు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. బాలేరు–దిమ్మిడిజోల గ్రామాల మధ్య ఏబీ రోడ్డు వద్దకు చేరుకోగానే కుమార్ వాహనాన్ని అడ్డగించారు. అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. రక్తపుమడుగులో పడి ఉన్న భర్తను చూసి భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదించారు. కుమార్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న ఈ ప్రాంతీయులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. దుండగులను పట్టుకొంటాం:డీఎస్పీ శ్రావణి కుమార్ హత్యకు గురైన ప్రాంతాన్ని పాలకొండ డీఎస్పీ ఎం. శ్రావణి కొత్తూరు సీఐ మజ్జి చంద్రశేఖర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నిందితులు ఎక్కడకీ తప్పించుకోలేరని..త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఘటనపై బత్తిలి ఎస్సై కరణం వెంకట సురేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతుని భార్య మాలతి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హత్య ఎలా జరిగిందో ఆమె నుంచి వివరాలు సేకరించారు. ప్రమాద స్థలంలో చిన్నచాకును పోలీసులు గుర్తించారు. రక్తంతో నిండిన కత్తి మాత్రం కనిపించలేదు. క్లూస్‌టీంను, డాగ్‌స్కా్వడ్‌ను కూడా అధికారులు రంగంలోకి దింపారు. కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోమవారం సాయంత్రం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
సోనుసూద్ టైలర్ షాప్.. ప్యాంట్ కాస్త నిక్కర్ కావొచ్చు
వెండితెరపై విలన్‌గా ఆకట్టుకున్న సోనూసూద్ కరోనా లాక్డౌన్ సమయంలో ‘రియల్ హీరో’ అయిపోయాడు. ఎక్కడ ఏ ఆపద ఉన్నా.. నేనున్నాను అంటూ ముందుకు వచ్చి సాయం అందిస్తున్నాడు. వలస కార్మికులు మొదలు.. రైతులు, నిరుద్యోగులు ఇలా ప్రతి ఒక్కరికి అడిగిన సాయం చేస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఫలానా చోట.. ఫలానా సమస్య ఉందన్న విషయం తన దృష్టికి వస్తే చాలు.. వెంటనే తనకు చేతనైనా సాయం అందిస్తూ తన ఊదారతను చాటుకుంటున్నాడు. (చదవండి : పాతిపెట్టిన పిల్లిని తీసి కూర వండేసింది!) ఇక ఈ రియల్ హీరో సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటాడు. సోషల్ మీడియా ద్వారనే సమస్యలు తెలుసుకొని సహాయం అందిస్తుంటాడు. ఇక తాజాగా ఈ రియల్ హీరో కాస్త టైలర్‌గా మారాడు. కుట్టు మిషిన్ సాయంతో దుస్తులు కుడుతున్న వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ‘సోనూసూద్ టైలర్ షాపు. ఇక్కడ ఉచితంగా దుస్తులు కుట్టబడును. కానీ ప్యాంట్ కాస్త నిక్కర్గా కూడా మారే అవకాశాలు ఉన్నాయి’ అంటూ ఫన్నీ క్యాప్షన్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలీలో స్పందించారు. ‘నా దుస్తులు ఇక్కడ కుట్టించుకోవాడానికి నేను ఏం చెయ్యాలి’ అని ఒక నెటిజన్ కామెంట్ చేయగా, ‘సోనూ అన్న.. ఫ్యాంట్ నిక్కర్ అవుతుందా.. ఏం పర్లేదు’అంటూ లాఫింగ్ ఎమోజీ పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. Sonu Sood tailor shop. यहां मुफ्त में सिलाई की जाती है। पैंट की जगह निकर बन जाए, इसकी हमारी गारंटी नहीं 😂 pic.twitter.com/VCBocpUSum — sonu sood (@SonuSood) January 16, 2021 -
నిక్కరు సైజులో తేడా, పోలీసులకు ఫిర్యాదు!
భోపాల్: తోటి వారితో సమస్య ఏదైనా తలెత్తితే స్థానికంగా పరిష్కరించుకునేందుకు మొగ్గు చూపేవారు కొందరైతే.. చిన్న కారణాలకే పోలీస్ స్టేషన్ మెట్లక్కేవారు మరికొందరు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌కు చెందిన కృష్ణకుమార్ దుబే (46) రెండో రకానికి చెందినవాడిగా తెలుస్తోంది. స్థానికంగా ఉండే టైలర్ తనకు సరిపడా నిక్కరు కుట్టివ్వలేదని అతడు ఏకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. రెండు మీటర్ల వస్త్రం ఇచ్చినా నిక్కరు సైజు బాగా తగ్గించి తయారు చేశాడని ఆరోపించాడు. అంతేకాకుండా నిక్కరు సైజును తిరిగి సరిచేసి ఇవ్వుమంటే స్పందించడం లేదని పేర్కొన్నాడు. అందుకనే స్టేషన్ గడపతొక్కాల్సి వచ్చిందని చెప్తున్నాడు. నిక్కరు కుట్టడానికి టైలర్‌కి రూ.70 చెల్లించానని దుబే తెలిపాడు. లాక్డౌన్ కారణంగా రెండు పూటలా తిండిలేక ఇబ్బందులు పడుతుంటే.. టైలర్ పనివల్ల తాను మరింత నష్టపోయానని, న్యాయం చేయాలని పోలీసులను వేడుకున్నాడు. దుబే ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు అతన్ని స్థానిక కోర్టుకు హాజరు కావాలని సూచించారు. (‘నీళ్లు అడుగుతున్న ఉడత’) -
టైలర్ కొడుకు.. సీఏ టాపర్!
కోటా: లక్షల రూపాయల ఫీజు కట్టి, మంచి కోచింగ్ సెంటర్లో చేర్పిస్తేనే ర్యాంకులు వస్తాయా? అవసరం లేదని నిరూపించాడు రాజస్థాన్ విద్యార్థి షాదాబ్ హుస్సేన్. ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా ప్రకటించిన సీఏ ఫలితాల్లో హుస్సేన్ మొదటి స్థానంలో నిలిచాడు. ర్యాంకులకు కోచింగ్ సెంటర్లతో పనిలేదని, పట్టుదల, కృషి, ప్రణాళిక ఉంటే ఫలితం తప్పకుండా ఉంటుందని మరోసారి నిరూపించాడు. కోటాలో ఒక చిన్న టైలరింగ్ దుకాణాన్ని నడిపే హుస్సేన్ తండ్రి 10వ తరగతి వరకే చదవగా.. తల్లి మధ్యలోనే చదువు ఆపేసింది. వీరికి నలుగురు కూతుళ్లు, ఒక కొడుకు. తాము చదువుకోకపోయినా పిల్లల్ని బాగా చదివించాలనుకున్నారు ఆ తల్లిదండ్రులు. చాలీచాలని ఆదాయంతో పిల్లల్ని చదివించడం ఏ తల్లిదండ్రులకైనా కష్టమే. ఇలాంటి పరిస్థితుల్లో కూడా షాదాబ్ హుస్సేన్ కోటా యూనివర్సిటీ నుంచి బీకామ్ డిగ్రీ పూర్తి చేశాడు. చార్టర్డ్ అకౌంటెన్సీ చదవాలనుకున్నాడు. సీఏ చదవడం అంటే అంత సులువు కాదని తెలిసినా పట్టుదలతో చదివి, తొలి ప్రయత్నంలోనే టాపర్‌గా నిలిచాడు. తాను ఈ ఘనత సాధించడానికి తన తండ్రి, కుటంబ ప్రోత్సాహమే కారణమని హుస్సేన్ సగర్వంగా చెబుతున్నాడు. -
33 మందిని చంపిన సీరియల్ కిల్లర్
భోపాల్: మధ్యప్రదేశ్‌లోని మండీదీప్ పట్టణానికి చెందిన ఆదేశ్ ఖమ్రా(48) టైలర్‌గా పనిచేస్తూ జీనవం సాగిస్తున్నాడు. పగటిపూట టైలరింగ్ చేసే ఆదేశ్.. రాత్రయితే చాలు నరరూప రాక్షసుడిగా మారిపోయేవాడు. రోడ్డున పోయే లారీలను లిఫ్ట్ అడిగే అతను, డ్రైవర్, క్లీనర్లను లక్ష్యంగా చేసుకొని కిరాతకంగా చంపేసేవాడు. అనంతరం లారీలోని సొత్తు, నగదుతో ఉడాయించేవాడు. ఇలా ఒకరు ఇద్దరు కాదు.. ఏకంగా 33 మందిని ఆదేశ్ కిరాతకంగా చంపేశాడు. దీంతో ఈ హత్యలపై దృష్టి సారించిన పోలీసులు.. యూపీలోని ఓ అటవీప్రాంతాన్ని 3 రోజుల పాటు జల్లెడ పట్టి ఆదేశ్‌ను పట్టుకున్నారు. విచారణలో నిందితుడితో పాటు అతని అనుచరులు చెబుతున్న విషయాలు విని పోలీసులకు దిమ్మతిరిగిపోయింది. 2010 నుంచి మొదలైన హత్యాకాండ.. ఈ ఆపరేషన్‌లో ఆదేశ్‌ను పట్టుకున్న పోలీస్ అధికారిణి, భోపాల్ ఎస్పీ బిట్టూ శర్మ కేసు వివరాలను మీడియాకు తెలిపారు. ‘2010లో తొలిసారి మహారాష్ట్రలోని అమ్రావతి, నాసిక్ జిల్లాల్లో లారీ డ్రైవర్, క్లీనర్ల హత్యలు చోటుచేసుకున్నాయి. ఆ తర్వాత మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బిహార్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలకు విస్తరించాయి. తాజాగా కొన్నిరోజుల క్రితం ఇదే తరహాలో మధ్యప్రదేశ్‌లో రెండు హత్యలు జరిగాయి. అన్నింటిలో పోలీసులకు ఒక్క ఆధారమూ లభించలేదు. చనిపోయినవారందరూ లారీ డ్రైవర్లు, క్లీనర్లే కావడంతో ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాం. పక్కా సమాచారంతో ముఠా నాయకుడు ఆదేశ్‌తో పాటు అనుచరులు ప్రజాపతి, తుకారాంలను యూపీలోని సుల్తాన్పూర్ అడవులను 3 రోజు ల పాటు గాలించి పట్టుకున్నాం’ అని చెప్పారు. కుదిరితే మత్తుమందు లేదంటే విషం.. ఆదేశ్ రాత్రి కాగానే ఇద్దరు అనుచరులతో కలసి రోడ్డుపైకి వచ్చి లారీలను లిఫ్ట్ అడిగేవాడని ఎస్పీ బిట్టూశర్మ తెలిపారు. ‘లారీ ఎక్కగానే వారితో కలుపుగోలుగా మాట్లాడుతూ తనను డ్రైవర్, క్లీనర్ నమ్మేట్లు చేసేవాడు. అనంతరం తాను పార్టీ ఇస్తానంటూ డ్రైవర్, క్లీనర్‌కు మద్యం ఇప్పించేవాడు. వాటిలో ఈ ముఠా సభ్యులు ప్రజాపతి, తుకారాంలు మత్తుమందు కలిపేవారు. ఇది తాగిన కొద్దిసేపటికి వీరు స్పృహ కోల్పోగానే వెంట తెచ్చుకున్న పొడవైన తాడుతో గొంతుకు ఉరివేసి చంపేసేవాడు. ఎందుకు చంపుతున్నావని అనుచరులు అడిగితే వీరంతా కష్టాల్లో ఉన్నారనీ, వారికి తాను విముక్తి ప్రసాదిస్తున్నట్లు చెప్పేవాడు. అప్పుడప్పుడు అనుచరులు బాధితులకు మద్యంలో మత్తు మందుకు బదులుగా విషం కూడా ఇచ్చేవారు’ అని శర్మ చెప్పారు. మృతుల వివరాలు తెలియకుండా ఉండేందుకు వారిని నగ్నంగా ఎత్తయిన కొండప్రాంతాల్లో, బ్రిడ్జీల సమీపంలో పడేసేవాడన్నారు. దయ్యం కథలతో... ఈ ముఠా నుంచి నిజాలను రాబట్టేందుకు పోలీసులు దయ్యాలు, భూతాల గురించి చెబుతున్నారు. ఈ విషయమై ఎస్పీ రాహుల్ కుమార్ మాట్లాడుతూ.. ‘తొలుత ఆదేశ్‌ను విచారించడం కష్టమవుతుందనే భావిం చాం. అయితే అతను చంపిన వ్యక్తులు ఆత్మలు, భూతాలుగా మారి అతని కుటుంబాన్ని పీడిస్తున్నాయని చెప్పాం. గత 4 నెలల్లో రెండుసార్లు అతని కుమారుడు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడని తెలిపాం. చేసిన తప్పులను ఒప్పుకుని ప్రాయశ్చిత్తంగా ఆ ఆత్మలను క్షమాపణలు కోరుకోకుంటే అతని కుటుంబం తీవ్రంగా ఇబ్బంది పడుతుందని హెచ్చరించాం. దీంతో మేం అనుకున్నట్లే అతను పశ్చాత్తపపడటంతో పాటు తాను 33 హత్యలు చేశానని అంగీకరించాడు’ అని తెలిపారు. -
సంకల్పంతో గెలుపు
సాఫీగా సాగిపోతున్న జీవితంలో కల్లోలం ఎదురైంది. అది కకావికలం చేసేసింది. కులాసాగా ఉన్న వ్యక్తి ఒక్కసారిగా మంచపట్టాడు. అయ్యో ఎందుకిలా జరిగింది అని రోజుల తరబడి ఆవేదనతో కుమిలిపోయాడు. అంతలోనే ఆయనలోని సంకల్పం ఓటమిని అంగీకరించనివ్వలేదు. ఆత్మవిశ్వాసంతో అడుగు ముందుకేశాడు. చక్రాల కుర్చీనుంచే పెద్ద కుటుంబానికి అండగా నిలిచాడు. గౌరిబిదనూరు: గౌరిబిదనూరు పట్టణంలో ఉండే టైలర్ రమేష్‌ను చూస్తే ఎవరైనా పెద్ద ఆఫీసరేమో అనుకుంటారు. ఒకప్పుడు ఆయన అలాగే ఉండేవారు. కానీ విధి ఆడిన వింత నాటకంలో పావుగా మారారు. అనారోగ్యంతో జీవితం చీకటిమయమైనా చలించలేదు. అంగ వైకల్యం పీడిస్తున్నా శ్రమనే నమ్ముకుని సాగుతున్నారు. 53 సంవత్సరాల రమేష్ బి.కాం. డిగ్రీ పూర్తీ చేశారు. హిందీలో విశారద పాసయ్యారు. చార్టెడ్ అకౌంటెన్సీ (సీఏ)లో 3 సంవత్సరాల శిక్షణ పొందారు. అనంతపురం జిల్లా హిందూపురం సమీపంలోని సూపర్ స్పిన్నింగ్ మిల్లులో గోడౌన్ ఇన్చార్జ్గా ఉద్యోగం చేసేవారు. 1992లో... ఆయనకు 27 ఏళ్ల వయసులో విధి చిన్నచూపు చూసింది. వెన్నపూసకు అంతుతెలియన జబ్బు సోకింది, నడుము కింది భాగం స్పర్శ లేకుండా పోయింది. కాళ్లలో కదలిక శూన్యమైంది. కూర్చోవడం, లేవడం కూడా చేతనయ్యేది కాదు. మంచమే నేస్తమైంది. నాన్ కంప్రెసివ్ మైలోపతి విత్ ప్యారాప్లీగియా అనే నరాల జబ్బుతో కలిపి మొత్తం 8 నాడీ జబ్బులు సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. ఇవి నయం కాదని, చికిత్స లేదంటూ వైద్యులు సైతం చేతులెత్తేశారు. టైలరింగ్‌పై దృష్టి దీంతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పుడే రమేష్‌లో పట్టుదల, దీక్ష, సంకల్పంగా మారింది. తన తండ్రితో పాటు 4 తరాలుగా కుటుంబపోషణకు జీవనాధారమైన టైలరింగ్‌పై మమకారం కలిగింది. మంచం మీద నుంచే టైలరింగ్‌కు శ్రీకారం చుట్టారు. గుడ్డలను కొలతలకు తగినట్లు కత్తిరించడంలో నైపుణ్యం పొందారు. అంతలోనే కుటుంబాన్ని పోషిస్తున్న తండ్రి మరణం మరో పిడుగుపాటు మాదిరిగా తాకింది. కుటుంబం ఆకలి తీర్చడం తనపై పడింది. రోజుకు 14 గంటలపాటు కూర్చొని గుడ్డలు కత్తిరిస్తూ ఉంటారు. ఆ గుడ్డలను వేరే టైలర్లు షర్టులుగా కుడితే రమేష్ వాటికి కాజాలు వేసి ఇస్త్రీ చేసి సిద్ధం చేస్తారు. ఇలా సుమారు 20 మంది టైలర్లకు ఆయనే గుడ్డలు పంపి షర్టులు, ఫ్యాంట్లు కుట్టిస్తారు. పాఠశాలల యూనిఫారంలు ఆర్డర్లు తీసుకొని గుడ్డలను కత్తిరించి టైలర్లకు కుట్టడానికి ఇస్తూన్నారు. దీనితో నెలకు రూ. 6–7 వేల వరకు ఆదాయం వస్తూ ఉంది. ఆక్సిజన్ తీసుకొంటూ పనిలో నిమగ్నం :అదొక్కటే సమస్య కాదు రమేష్ చికిత్స కోసం 15 రోజుల కొకసారి బెంగుళూరుకు వెళ్లి రావడం తప్పనిసరి. ఈ మధ్యలో తన రెండు ఊపిరితిత్తుల్లో ఒకటి పని చేయడం మానేసింది.రాత్రి వేళల్లో, చలికాలంలో ఆక్సిజన్ తీసుకోవడం తప్పనిసరి అయ్యింది. అయినా రమేష్ వెనుకంజ వేయరు. ఇంట్లోని తన తల్లి, సోదరిలు, వారి పిల్లలు అంతా 8 మంది పోషణ ఆయనపైనే ఉంది. ఆక్సిజన్‌కే ఎక్కువ ఖర్చు అవుతూ ఉంది. రమేష్ పెళ్లి చేసుకోలేదు. వీల్ చైర్ సహాయంతో తిరుగుతూ ఉంటారు. ఆయన శ్రమను గుర్తించి ప్రభుత్వం తాలూకా స్థాయిలో రాజ్యోత్సవ ప్రశస్తి, కన్నడ సాహిత్య పరిషత్తు ప్రశస్తిలను బహూకరించడం విశేషం. -
టైలర్ మహారాజా..! భారీ నగదు, బంగారం
చండీఘడ్: పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా అక్రమ నగదు, బంగారం భారీగా పట్టుబడుతోంది. పంజాబ్ రాష్ట్రంలో కూడా అక్రమ లావాదేవీలు భారీగానే చోటు చేసుకుంటున్న ఘటనలు నమోదువుతున్నాయి. తాజాగా ఈడీ చండీఘడ్ లో ప్రముఖ టైలర్ యజమాని వద్ద భారీ ఎత్తున కొత్త నగదును, బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. మొహాలీలోని బిజినెస్ సెంటర్ లో జరుగుతున్న అక్రమ లావాదేవీలపై కన్నేసిన ఈడీ అధికారులు 30 లక్షల నగదు, రెండున్నర కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. రూ. 18 లక్షల విలువ గల రెండు వేల రూపాయల నోట్లు, మిగిలినవి 100, 50 రూపాయల నోట్లుగా గుర్తించినట్టు తెలిపారు. పంజాబ్ చండీగఢ్ లోని మొహాలీ 22 సెక్టార్ మహారాజా టైలర్ ప్రాంగణంలో అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయన్న సమాచారంతో ఈడీ దాడులు చేపట్టింది. చండీగడ్ మొహాలీలోని ప్రయివేటు బ్యాంకు సీనియర్ ఉద్యోగి పెద్ద ఎత్తున నగదు మార్పిడికి పాల్పడుతున్నారన్న ఆరోపణలపై దర్యాప్తు చేపట్టిన అధికారులు.. టైలర్ దగ్గర పట్టుబడ్డ నగదు, బంగారం చూసి విస్తుపోయారు. డీమానిటైజేషన్ తరువాత టైలరింగ్ షాప్ యజమాని 10 గ్రాముల బంగారం 44,000 వేల రూ చొప్పున 2.5 కిలోల బంగారం కొనుగోలు చేశాడు. విచారణలో భాగంగా షాప్ బిల్లు పుస్తకాల పరిశీలనలో ఈ విషయం వెలుగు చూసింది. దీంతో కేసు నమోదు చేసిన అధికారులు బంగారం ఏ దుకాణంలో కొనుగోలు చేసింది, నగదు మార్పిడి తదితర అంశాలపై విచారణ మొదలుపెట్టారు. కాగా పెద్ద నోట్ల రద్దుతర్వాత ఇటీవల మొహాలీ లోని దుకాణాల్లో కమిషన్ పద్ధతిలో నగదు మార్పిడికి పాల్పడుతున్న ఓ సీనియర్ బ్యాంకు ఉద్యోగిని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ క్రమంలో ఓ వస్త్ర వ్యాపారినుంచి రూ.2.19 కోట్లను స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. -
ఆ శవం టైలర్‌ది
-గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యం – విషాదంలో కుటుంబసభ్యులు పత్తికొండ టౌన్: మద్దికెర సమీపంలో హంద్రీనదిలో తేలిన గుర్తుతెలియని మృతదేహం ఆచూకీ లభ్యమైంది. నాలుగురోజుల క్రితం హంద్రీకాలవలో దూకి ఆత్మహత్య చేసుకున్న పత్తికొండకు చెందిన టైలర్ రామకృష్ణగా గుర్తించారు. పత్తికొండ పట్టణం సవారమ్మ కాలనీకి చెందిన ముద్దన్న, చెన్నమ్మల రెండవ కుమారుడైన రామకృష్ణ (38) స్థానికంగానే పవన్‌టైలర్స్ పేరుతో సొంతంగా షాప్ పెట్టుకున్నాడు. ఇతనికి భార్య హనుమంతమ్మ, నలుగురు కుమార్తెలు సంతానం. టైలర్‌గా పనిచేస్తూనే వారిని బాగా చూసుకునేవాడు. అయితే, గత కొన్నాళ్ల నుంచి రామకృష్ణ తాగుడుకు బానిస అయ్యాడు. పని వదిలివేసి, ప్రతిరోజు తాగివచ్చి ఇంట్లో గొడవ పడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గత 15వ తేదీన శనివారం రాత్రి ఫుల్‌గా మద్యం తాగివచ్చిన రామకృష్ణ అకారణంగా గొడవ పెట్టుకుని భార్య హనుమంతమ్మను చితకబాదాడు. ఆమె సృహ తప్పిపడిపోవడంతో ఇంట్లో నుంచి వెళ్లిపోయిన రామకృష్ణ ఆదోని రోడ్డులో ఉన్న హంద్రీకాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కాలువలో నీటిప్రవాహం అధికంగా ఉండటంతో మృతదేహం కొట్టుకుపోయి 2రోజుల తర్వాత సోమవారం మద్దికెర మండలం హంప వద్ద తేలింది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడకు చేరుకుని గుర్తు తెలియని శవంగా కేసు నమోదు చేసుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న రామకృష్ణ బంధువులు అనుమానంతో మద్దికెరకు వెళ్లి గుర్తుతెలియని శవాన్ని గుర్తించారు. మృతుడి తండ్రి ముద్దన్న ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకున్న మద్దికెర ఎస్ఐ అబ్దుల్‌జహీర్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పత్తికొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఇంట్లో గొడవపడి వెళ్లిన రామకృష్ణ బంధువుల ఊరికి వెళ్లి ఉంటాడని భావించిన కుటుంబసభ్యులకు ఊహించని విధంగా శవమై కనిపించడంతో వారంతా తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని టైలర్స్ అసోసియేషన్ తాలుకా అధ్యక్షుడు ఇస్మాయిల్ శరీఫ్, కార్యదర్శి తిక్కస్వామి, ఉపాధ్యక్షుడు వెంకటేశ్వరరెడ్డి విజ్ఞప్తి చేశారు. -
శ్రీవారికి పరదాలు సమర్పించిన టైలర్
-
కొప్పెరకు ‘కొత్త’ కళ!
విధుల్లో చేరిన దర్జీ.. సిద్ధమవుతున్న శ్రీవారి కొప్పెర కొత్త వస్త్రాలు సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలోని కొప్పెర(హుండీ)కు కొత్త వస్త్రాలు కుట్టే దర్జీ ఎట్టకేలకు గురువారం నుంచి విధులకు హాజరయ్యాడు. ‘‘శ్రీవారి కొప్పెరకు కొత్త వస్త్రాలేవ్!’’ అన్న శీర్షికతో ఈనెల 14న ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) వెంటనే స్పందించింది. ఈవో డాక్టర్ దొండపాటి సాంబశివరావు ఆదేశాల మేరకు గతేడాది మార్చిలో తొలగించిన దర్జీ కె.దేవదాస్‌ను తిరిగి నియమించారు. బుధవారం ఉదయం ఫోన్ ద్వారా ఉత్తర్వులందుకున్న దేవదాస్ గురువారం నుంచి విధులకు హాజరయ్యాడు. కొప్పెరకు అవసరమైన కొత్త వస్త్రాలు సిద్ధం చేసే పని తిరిగి చేపట్టాడు. గతంలో ఈయనకు రూ.6,400 నగదు, తిరుపతి-తిరుమల మధ్య ఉచిత ఆర్టీసీ బస్‌పాస్ ఇచ్చేవారు. తాజాగా ఈవో ఆదేశాలతో ఆయనకు ఉచిత బస్‌పాస్ గురువారంనుంచి అమల్లోకి వచ్చింది. పనికి తగిన వేతనం కూడా నిర్ణయించి ఇవ్వనున్నారు. కొప్పెరకు అవసరమైన వస్త్రాలకు ఏ లోటు లేకుండా ఉండేందుకు ఏడాదికి సరిపడా సిద్ధం చేస్తామని టీటీడీ ఈవో ‘సాక్షి’కి తెలిపారు. దేవుడే తిరిగి రప్పించాడు ‘‘భక్తులు తమ మొక్కులు, ముడుపులు, కానుకలు వేసే కొప్పెరకు వస్త్రాలు కుట్టడాన్ని పనికన్నా.. సేవగాను, ైదైవకార్యంగా భావిస్తాం. గతంలో ఉద్యోగిగా ఆ పని చేశాను. తిరిగి రెండేళ్లపాటు కాంట్రాక్టు పద్ధతిన పనిచేశాను. మళ్లీ రమ్మని ఉత్తర్వులిచ్చారు. తొమ్మిది నెలల తర్వాత మళ్లీ కొప్పెర వస్త్రాలు కుట్టే అవకాశం ఆ దేవదేవుడే కల్పించారు. చాలా ఆనందంగా ఉంది. నాలో శక్తి ఉన్నంతకాలం ఈ విధులు కొనసాగిస్తాను.’’ - దేవదాస్, కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ -
శ్రీవారి కొప్పెరకు కొత్త వస్త్రాల్లేవ్!
-
శ్రీవారి కొప్పెరకు కొత్త వస్త్రాల్లేవ్!
* ఉద్యోగ విరమణ పొందిన దర్జీ * ఖాళీపోస్టును భర్తీ చేయని వైనం * ఆగిన హుండీ వస్త్రాల కుట్టు పని సాక్షి, తిరుమల: భక్తుల కొండంత కోరికలను నెరవేర్చే కోనేటిరాయుడికి కొప్పెర కష్టం వచ్చింది. భక్తులు కానుకలు సమర్పించుకునేం దుకు కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ కరువైపోయాడు. ఉద్యోగ విరమణ చేసిన దర్జీ స్థానంలో కొత్తవారిని నియమించకపోవడంతో కొప్పెర వస్త్రాలు కుట్టే పని నిలిచిపోయింది. అపర కుబేరుడికి దర్జీ కరువే తిరుమలేశుడికే దర్జీ కరువైపోవడం సంబంధిత అధికారుల పనితీరుకు దర్పణం పడుతోంది. కొప్పెర(హుండీ) కోసం వాడే కేస్‌మెట్ వస్త్రాన్ని కుట్టేందుకు గతంలో ప్రత్యేకంగా అనుభవం గడించిన దర్జీ ఉండేవారు. ఐదారేళ్ల క్రితం ఆయన ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో కొంతకాలంగా టీటీడీ ఆరోగ్య శాఖలోని ఓ మల్టిపుల్ వర్కర్ చేత ఈ దర్జీ పనిచేయించారు. ఆయన కూడా రెండు నెలల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. కానీ, ఆయన స్థానంలో కొత్తవారిని నియమించలేదు. దీంతో కొప్పెరతయారు చేసేందుకు మార్కెటింగ్ విభాగం కొనుగోలు చేసిన వస్త్రాలు సంబంధిత కార్యాలయంలో కుప్పలుతెప్పలుగా పేరుకుపోయాయి. దర్జీలేని కారణంగా ఆలయంలో కొప్పెరకు కొత్త వస్త్రాల కొరత ఏర్పడింది. ఆలయ నిబంధనల ప్రకారం ఒకసారి గంగాళం లేదా పాత్రకు కట్టిన వస్త్రా న్ని మరోసారి వాడకూడదు. కానీ, ఒకసారి ఉపయోగించిన వస్త్రాలనే మళ్లీ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ విషయాన్ని ఆలయ అధికారులు ధ్రువీకరించడం లేదు. తమ వద్ద స్టాకు ఉందని చెబుతున్నారు. కొప్పెర కొలతలేమిటి? హుండీ ఎత్తు 9 అడుగులు, వెడల్పు మూడు అడుగులు. మూడు అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళాన్ని నేల నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో సిద్ధం చేసిన దళసరి కేస్‌మెట్ వస్త్రంలో ఉంచి హుండీ రూపొందిస్తారు. భక్తులు చేయి ఎత్తి కానుకలు వేస్తే అవి సరిగ్గా రాగి గంగాళంలో పడేవిధంగా నాలుగు వైపులా ఆంగ్ల అక్షరం ‘వి’ ఆకారంలో రంధ్రాలు వేస్తా రు. హుండీ మధ్యలో చుట్టిన తాడుపై ఏడు టీటీడీ సీళ్లు, మరో ఆరు జీయంగార్ సీళ్లు వేస్తారు. 3 అడుగుల ఎత్తు కలిగిన రాగి గంగాళంతోపాటు మరో 2 అడుగుల వరకు కానుకలు నిండాక, హుండీ పైకప్పు తాళ్లను విప్పి సీలు వేసి పరకామణికి తరలిస్తారు. తర్వాత అదేస్థానంలో కొత్త దానిని ఏర్పాటు చేస్తారు. పదవీ విరమణ చేసిన దర్జీతో కుట్టిస్తాం ‘‘దర్జీ ఉద్యోగ విరమణ చేశారు. ఆయన స్థానంలో ఔట్సోర్సింగ్ కింద ఒకరిని తీసుకునేందుకు ఉన్నతాధికారులు అనుమతి ఇచ్చా రు. హుండీ వస్త్రాలను కుట్టి కొరత లేకుండా సరఫరా చేసేందుకు అవసరమైతే ఉద్యోగ విరమణ చేసిన దర్జీనే కాంట్రాక్ట్ విధానం కింద కొనసాగిస్తాం’’ అని అధికారులు చెప్పారు. కొప్పెర (హుండీ) అంటే? భక్తులు కానుకలు వేసే పాత్ర లేదా రాగి గంగాళాన్ని కొప్పెర(హుండీ) అం టారు. చెన్నైలోని ఆర్కియాలజీ విభాగం నుంచి సేకరించిన ఆధారాల ప్రకారం క్రీ.శ.17 శతాబ్దం ముందు నుంచే తిరుమల ఆలయంలో ఈ కొప్పెర ఉన్నట్లు తేల్చారు. టీటీడీ వద్ద అప్పటి నుంచి హుండీ లెక్కలున్నాయి. అయితే, ఈస్టిండియా కంపెనీ పాలన కాలంలో 1821 జూలై 25న కొప్పెర (హుండీ)ని ఏర్పాటు చేశారని ఆలయ పరి పాలనా విధానాలను నిర్దేశించే చట్టం బ్రూస్‌కోడ్-12 ఆధారం కూడా ఉంది. అప్పట్లో ఆలయ పోషణకు హుండీ తప్ప మరొక ఆదాయమార్గంలేదు. కొప్పెరను తిరుమల ఆలయంలోని తిరుమామణి మండపం (ఘంటా మండపం)కు ఉత్తర పార్శ్వంలో నాలుగు రాతి స్తంభాల నడుమ ఏర్పాటు చేశారు. ఇక్కడ జగద్గురు ఆది శంకరాచార్యులవారు ‘శ్రీచక్రం’ ప్రతిష్టించారని.. అందువల్లే అంతులేని ధన, కనక, వస్తు, ద్రవ్య కానుకలతో హుండీ నిండుతోందని భక్తుల విశ్వాసం. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా హుండీ స్థలం ఎత్తు పెంచేందుకు అక్కడి నేలను తవ్వినప్పుడు కొందరు శ్రీచక్రాన్ని ప్రత్యక్షం గా దర్శించారని టీటీడీ రికార్డుల్లో పొందుపరిచారు. ఉత్తర్వులిచ్చాం... అమలు చేయలేదు ‘‘కొప్పెర వస్త్రాలు కుట్టే దర్జీ ఉద్యోగ విరమణ చేశాక కూడా అతడినే కొనసాగించాలని గతంలోనే ఉత్తర్వులు ఇచ్చాం. అయినా సంబంధిత విభాగం అమలు చేయలేదు. సమస్యను తక్షణమే పరిష్కరిస్తాం. కొప్పెర వస్త్రాలకు లోటు లేకుండా చూస్తాం’’- డి.సాంబశివరావు, ఈవో, టీటీడీ -
దర్జీపై ‘రెడీమేడ్’ దెబ్బ
చెన్నూర్/మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు దర్జీలకు చేతినిండా పని ఉండే ది. దీంతో వారంతా దర్జాగా జీవించేవారు. ఒ క్కో దుకాణంలో పది నుంచి పదిహేను మంది వర్కర్లు ఉండేవారు. వారందరికీ ఉపాధి లభిం చేంది. పెళ్లి, పండుగలు, ఇతర శుభకార్యాల స మయంలో కొత్త బట్టలు కుట్టించుకోవడానికి ప్ర జలు బారులు తీరేవారు. దసరా, బతుకమ్మ పండుగ, దీపావళి వంటి పెద్ద పండుగల సమయాల్లో దర్జీలు తినడానికి కూడా తీరిక ఉండేది కాదు. రాత్రింబవళ్లు బట్టలు కుడుతూనే ఉండేవారు. జిల్లాలో మూడు వేలకు పైగా టైలర్‌షాప్ లు, పది వేల మందికి పైగా వర్కర్లు ఉన్నారు. ఉన్నత విద్య అభ్యసించినా ఉద్యోగం దొరకకపోవడంతో టైలర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారూ ఉన్నారు. కాలక్రమంలో వస్త్ర ప్రపంచం, ఫ్యాషన్ రంగంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావం నేడు దర్జీలపై విపరీతంగా పడుతూ వస్తోంది. రోజు రోజుకు దర్జీలకు గిరాకీ తగ్గు తూ వస్తోంది. రెడీమేడ్ దుస్తుల రంగ ప్రవేశం తో దర్జీల వృత్తిపై భారీగా దెబ్బ పడింది. చాలామంది రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తున్నా రు. బట్టలు దీంతో టైలర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తోం ది. కుట్టించుకునేవారు కరువు కావడంతో ఖాళీ కూర్చుంటున్నారు. మరికొందరు వృత్తిని వదిలి జీవనోపాధి కోసం ఇతర వృత్తుల్లో స్థిరపడుతున్నారు. దుకాణాల అద్దె చెల్లించలేక కొన్ని మూ తపడ్డాయి. కూలీగిట్టుబాటు కాకపోవడంతో కొందరు దర్జీలు ఇతర పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు. అమలు కాని పథకాలు.. టైలర్ పితామహుడు విలియమ్స్ హో, విలీస్జీ న్స్‌లను స్మరిస్తూ ఫిబ్రవరి 28న టైలర్స్డే నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో 2009లో టైలర్స్ కో ఆపరేటివ్ ఫెడరేషన్(సహకార సమాఖ్య) ఏర్పడింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం కింద టైలర్ల జీవనోపాధి కోసం పావలా వడ్డీకే రుణాలివ్వడం, వృత్తి పన్ను మినహాయిం పు, టైలర్ దుకాణాలకు సబ్సిడీపై కరెంటు సరఫరా, శిక్షణ తరగతుల నిర్వహణ వంటివి అమ లు చేయాల్సి ఎక్కడా అమలు కావడం లేదు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు టైలర్లకు వర్తింపజేయాలని ఉత్తర్వులు ఉన్నా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.