చెన్నూర్/మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు దర్జీలకు చేతినిండా పని ఉండే ది. దీంతో వారంతా దర్జాగా జీవించేవారు. ఒ క్కో దుకాణంలో పది నుంచి పదిహేను మంది వర్కర్లు ఉండేవారు. వారందరికీ ఉపాధి లభిం చేంది. పెళ్లి, పండుగలు, ఇతర శుభకార్యాల స మయంలో కొత్త బట్టలు కుట్టించుకోవడానికి ప్ర జలు బారులు తీరేవారు. దసరా, బతుకమ్మ పండుగ, దీపావళి వంటి పెద్ద పండుగల సమయాల్లో దర్జీలు తినడానికి కూడా తీరిక ఉండేది కాదు.
రాత్రింబవళ్లు బట్టలు కుడుతూనే ఉండేవారు. జిల్లాలో మూడు వేలకు పైగా టైలర్‌షాప్ లు, పది వేల మందికి పైగా వర్కర్లు ఉన్నారు. ఉన్నత విద్య అభ్యసించినా ఉద్యోగం దొరకకపోవడంతో టైలర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారూ ఉన్నారు. కాలక్రమంలో వస్త్ర ప్రపంచం, ఫ్యాషన్ రంగంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావం నేడు దర్జీలపై విపరీతంగా పడుతూ వస్తోంది. రోజు రోజుకు దర్జీలకు గిరాకీ తగ్గు తూ వస్తోంది. రెడీమేడ్ దుస్తుల రంగ ప్రవేశం తో దర్జీల వృత్తిపై భారీగా దెబ్బ పడింది. చాలామంది రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తున్నా రు. బట్టలు దీంతో టైలర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తోం ది. కుట్టించుకునేవారు కరువు కావడంతో ఖాళీ కూర్చుంటున్నారు. మరికొందరు వృత్తిని వదిలి జీవనోపాధి కోసం ఇతర వృత్తుల్లో స్థిరపడుతున్నారు. దుకాణాల అద్దె చెల్లించలేక కొన్ని మూ తపడ్డాయి. కూలీగిట్టుబాటు కాకపోవడంతో కొందరు దర్జీలు ఇతర పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు.
అమలు కాని పథకాలు..
టైలర్ పితామహుడు విలియమ్స్ హో, విలీస్‌జీ న్స్‌లను స్మరిస్తూ ఫిబ్రవరి 28న టైలర్స్‌డే నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో 2009లో టైలర్స్ కో ఆపరేటివ్ ఫెడరేషన్(సహకార సమాఖ్య) ఏర్పడింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం కింద టైలర్ల జీవనోపాధి కోసం పావలా వడ్డీకే రుణాలివ్వడం, వృత్తి పన్ను మినహాయిం పు, టైలర్ దుకాణాలకు సబ్సిడీపై కరెంటు సరఫరా, శిక్షణ తరగతుల నిర్వహణ వంటివి అమ లు చేయాల్సి ఎక్కడా అమలు కావడం లేదు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు టైలర్లకు వర్తింపజేయాలని ఉత్తర్వులు ఉన్నా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
దర్జీపై ‘రెడీమేడ్’ దెబ్బ
Published Fri, Feb 28 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement
Advertisement