tailor shop
-
Photo Feature: దర్జీ సంతసం
రడీమేడ్ దుస్తులు వచ్చిన తర్వాత చాలా మంది దర్జీలకు ఉపాధి కరువైంది. దీంతో వారంతా ఇతర వృత్తుల వైపు వెళ్లకుండా.. ఆదాయం పొందే మార్గాలను అన్వేషించారు. కొందరు సంచార దర్జీలుగా మారారు. అందులో భాగంగానే వారపు సంతల్లో కుట్టుమిషన్లు పెట్టుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పాడేరు, చింతపల్లి, అరకులోయ యూత్ శిక్షణ కేంద్రాల ద్వారా వందలాది మంది గిరిజన మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించారు. 2006 నుంచి 2009 వరకు శిక్షణ పొందిన గిరిజన మహిళలందరికీ ప్రభుత్వమే ఉచితంగా నాణ్యమైన కుట్టు మిషన్లు పంపిణీ చేసింది. ప్రస్తుతం ఏజెన్సీలోని వారపు సంతలతో పాటు గిరిజన గ్రామాల్లో ఈ మహిళలంతా కుట్టు మిషన్ల ద్వారా స్వయం ఉపాధి పొందుతున్నారు. సిమిలిగుడకు చెందిన పాంగి మిధుల అనే మహిళ అరకులోయ మండలం మారుమూల లోతేరు వారపు సంతలో దుస్తులు కుడుతున్న చిత్రం ఇక్కడ చూడొచ్చు. –సాక్షి, పాడేరు -
టైలర్ దుకాణానికి వెళ్లి యువతి అదృశ్యం
హైదరాబాద్: ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన జీడిమెట్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతల్ డివిజన్ వివేకానంద నగర్‌కు చెందిన నర్సప్ప కుమార్తె బి.సరిత(18) ఇంటి వద్దనే ఉంటుంది. మంగళవారం ఉదయం బట్టలు కుట్టించుకోవడానికి ఇంటి నుంచి టైలరింగ్ దుకాణానికి వెళ్లిన సరిత రాత్రయినా తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఫలితం లేకపోవడంతో తండ్రి నర్సప్ప బుధవారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఇంటి నుంచి వెళ్లిన యువతి అదృశ్యం
హైదరాబాద్: టైలర్ షాపునకు వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి వెళ్లిన యువతి తిరిగి రాలేదు. ఈ ఘటన లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...లాలాగూడలోని సూపర్‌స్టార్ హోటల్ సమీపంలో నివసించే శంషుద్దీన్ కూతురు నాజియా(19) ఇంట్లోనే ఉంటోంది. అయితే ఈ నెల 4వ తేదీన ఉదయం 11 గంటల సమయంలో టైలర్ షాపునకు వెళ్లొస్తానని చెప్పి ఇంట్లో నుంచి వెళ్లిన నాజియా రాత్రయిై నా ఇంటికి తిరిగి రాలేదు. దీంతో భయాందోళనకు గురైన కుటుంబసభ్యులు స్నేహితులను, బంధువులను, తెలిసిన వారిని నాజియా గురించి వాకబు చేశారు. ఫలితం కనిపించకపోవడంతో శనివారం స్థానిక లాలాగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
దర్జీపై ‘రెడీమేడ్’ దెబ్బ
చెన్నూర్/మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : ఒకప్పుడు దర్జీలకు చేతినిండా పని ఉండే ది. దీంతో వారంతా దర్జాగా జీవించేవారు. ఒ క్కో దుకాణంలో పది నుంచి పదిహేను మంది వర్కర్లు ఉండేవారు. వారందరికీ ఉపాధి లభిం చేంది. పెళ్లి, పండుగలు, ఇతర శుభకార్యాల స మయంలో కొత్త బట్టలు కుట్టించుకోవడానికి ప్ర జలు బారులు తీరేవారు. దసరా, బతుకమ్మ పండుగ, దీపావళి వంటి పెద్ద పండుగల సమయాల్లో దర్జీలు తినడానికి కూడా తీరిక ఉండేది కాదు. రాత్రింబవళ్లు బట్టలు కుడుతూనే ఉండేవారు. జిల్లాలో మూడు వేలకు పైగా టైలర్‌షాప్ లు, పది వేల మందికి పైగా వర్కర్లు ఉన్నారు. ఉన్నత విద్య అభ్యసించినా ఉద్యోగం దొరకకపోవడంతో టైలర్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న వారూ ఉన్నారు. కాలక్రమంలో వస్త్ర ప్రపంచం, ఫ్యాషన్ రంగంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావం నేడు దర్జీలపై విపరీతంగా పడుతూ వస్తోంది. రోజు రోజుకు దర్జీలకు గిరాకీ తగ్గు తూ వస్తోంది. రెడీమేడ్ దుస్తుల రంగ ప్రవేశం తో దర్జీల వృత్తిపై భారీగా దెబ్బ పడింది. చాలామంది రెడీమేడ్ దుస్తులు కొనుగోలు చేస్తున్నా రు. బట్టలు దీంతో టైలర్లు ఉపాధి కోల్పోవాల్సి వస్తోం ది. కుట్టించుకునేవారు కరువు కావడంతో ఖాళీ కూర్చుంటున్నారు. మరికొందరు వృత్తిని వదిలి జీవనోపాధి కోసం ఇతర వృత్తుల్లో స్థిరపడుతున్నారు. దుకాణాల అద్దె చెల్లించలేక కొన్ని మూ తపడ్డాయి. కూలీగిట్టుబాటు కాకపోవడంతో కొందరు దర్జీలు ఇతర పనులు చేస్తూ బతుకీడుస్తున్నారు. అమలు కాని పథకాలు.. టైలర్ పితామహుడు విలియమ్స్ హో, విలీస్జీ న్స్‌లను స్మరిస్తూ ఫిబ్రవరి 28న టైలర్స్డే నిర్వహిస్తుంటారు. రాష్ట్రంలో 2009లో టైలర్స్ కో ఆపరేటివ్ ఫెడరేషన్(సహకార సమాఖ్య) ఏర్పడింది. ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇందిరా క్రాంతి పథం కింద టైలర్ల జీవనోపాధి కోసం పావలా వడ్డీకే రుణాలివ్వడం, వృత్తి పన్ను మినహాయిం పు, టైలర్ దుకాణాలకు సబ్సిడీపై కరెంటు సరఫరా, శిక్షణ తరగతుల నిర్వహణ వంటివి అమ లు చేయాల్సి ఎక్కడా అమలు కావడం లేదు. బడుగు, బలహీన వర్గాల ప్రజలకు ప్రభుత్వం ఇచ్చే అన్ని రాయితీలు టైలర్లకు వర్తింపజేయాలని ఉత్తర్వులు ఉన్నా అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.