భామిని/శ్రీకాకుళం: నడిరోడ్డుపై దారుణం జరిగింది. భర్త, భార్య, పిల్లలతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న వారిని ఇద్దరు దుండగులు బైక్‌పై వెంబడించి నిర్మానుష్య ప్రదేశంలో వారిపై దాడి చేశారు. ఇంటి పెద్దను కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేసి ఉడాయించారు. సోమవారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో భామిని మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటన సంచలనమైంది. ఎలా జరిగిందంటే.. లోహరిజోల గ్రామానికి చెందిన నల్లకేవటి కుమార్ (35)కు భార్య మాలతి, కుమారులు దీక్షిత్, ప్రణయ్ ఉన్నారు.
మత్స్యకార కుటుంబానికి చెందిన ఈయన కొన్నాళ్లు హైదరాబాద్‌లో ఉంటూ టైలర్ పని చేస్తుండేవారు. ఇటీవల స్వగ్రామం వచ్చి అదే వృత్తిని కొనసాగిస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కలిసి లోహరిజోల నుంచి స్కూటీపై భామిని మీదుగా పర్లాకిమిడిలో ఉంటున్న కుమార్ అక్కగారింటికి వెళ్తున్నారు. వీరిని హెల్మెట్లు, మాస్‌్కలు ధరించిన ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వెంబడించారు. బాలేరు–దిమ్మిడిజోల గ్రామాల మధ్య ఏబీ రోడ్డు వద్దకు చేరుకోగానే కుమార్ వాహనాన్ని అడ్డగించారు. అతనిపై దాడి చేసి కత్తులతో పొడిచి కిరాతకంగా హత్య చేసి పరారయ్యారు. రక్తపుమడుగులో పడి ఉన్న భర్తను చూసి భార్య, పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదించారు. కుమార్ అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. విషయం తెలుసుకున్న ఈ ప్రాంతీయులు సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు.
దుండగులను పట్టుకొంటాం:డీఎస్పీ శ్రావణి
కుమార్ హత్యకు గురైన ప్రాంతాన్ని పాలకొండ డీఎస్పీ ఎం. శ్రావణి కొత్తూరు సీఐ మజ్జి చంద్రశేఖర్‌తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..నిందితులు ఎక్కడకీ తప్పించుకోలేరని..త్వరలోనే పట్టుకుంటామన్నారు. ఘటనపై బత్తిలి ఎస్సై కరణం వెంకట సురేష్ ఆధ్వర్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ఆరంభించారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న మృతుని భార్య మాలతి నుంచి సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. హత్య ఎలా జరిగిందో ఆమె నుంచి వివరాలు సేకరించారు. ప్రమాద స్థలంలో చిన్నచాకును పోలీసులు గుర్తించారు. రక్తంతో నిండిన కత్తి మాత్రం కనిపించలేదు. క్లూస్‌టీంను, డాగ్‌స్కా్వడ్‌ను కూడా అధికారులు రంగంలోకి దింపారు. కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సోమవారం సాయంత్రం పాలకొండ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment