
సాక్షి: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కార్మిక నగర్‌లో జరిగిన టైలర్ హత్య కేసును పోలీసులు చేధించారు. సాధిక్‌ను హత్య చేసింది భార్య రుబినా అని పోలీసులు గుర్తించారు. ఆర్థిక లావాదేవీల విషయంలోభార్యాభర్తల మధ్య విబేధాలు తలెత్తడంతో రుబినా తన భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టి తల్లిగారింటికి వెళ్లింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధిక్ తొలుత అమీర్‌పేట్‌లో టైలర్ షాపు నడిపేవాడు. కానీ లాక్‌డౌన్ కారణంగా షాప్ మూతపడింది. ఈ క్రమంలో ఇటీవలే కూకట్‌పల్లి ప్రాంతంలో మరో షాప్ ఓపెన్ చేశాడు. ఇక అప్పటి నుంచి భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం ఇద్దరి మధ్య మాట మాట పెరిగింది. ఆ కోపంలో రుబినా భర్తను హత్య చేసింది. ఆ తర్వాత శవాన్ని ఫ్రిజ్‌లో పెట్టి పుట్టింటికి వెళ్లింది. ఈ విషయం గురించి తెలిసి కేసు నమోదు చేసిన పోలీసులు 24 గంటల వ్యవధిలోనే చేధించారు. ప్రస్తుతం రుబినాను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment