ఐడియా అదుర్స్‌.. ఆ ఆలోచన ఎలా పుట్టిందంటే..? | Innovative Thinking Mobile Tailor | Sakshi
Sakshi News home page

ఏం ఐడియా గురూ.. ఆ ఆలోచన ఎలా పుట్టిందంటే..?

Published Mon, Dec 6 2021 6:21 PM | Last Updated on Mon, Dec 6 2021 8:10 PM

Innovative Thinking Mobile Tailor - Sakshi

సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: అవసరం అన్నీ నేర్పుతుంది అనడానికి ఉదాహరణ ఈ చిత్రం. వేలకు వేలు అద్దెలు చెల్లించి షాప్‌ పెట్టుకునే ఆర్థిక స్తోమత లేదు. పోనీ ఏ రోడ్డు పక్కనో చిన్న బడ్డీ పెట్టుకుందామా అంటే మున్సిపల్‌ సిబ్బంది ఎప్పుడు ఖాళీ చేయిస్తారో తెలియదు. జనానికి అందుబాటులో ఉంటూ రహదారి పక్కనే పని చేసుకోవడం ఎలాగబ్బా అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ తోపుడు బండి టైలరింగ్‌ షాప్‌ ఐడియా.

చదవండి: అక్కా.. బా.. అంటూ.. గోదారోళ్ల కితకితలు.. మామూలుగా లేదుగా మరి.. 

విజయవాడ మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన దర్జీ కోటేశ్వరరావు స్థానిక అమ్మ కల్యాణ మండపం సమీపంలో ఇలా తోపుడు బండిపై కుట్టు మెషిన్‌ ఏర్పాటు చేసుకుని రోజంతా బట్టలు కుడుతుంటాడు. రాత్రికి ఎంచక్కా ఈ రిక్షా బండితో సహా ఇంటికి వెళ్తుంటాడు. ఐడియా అదిరింది కదూ.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement