thinking
-
మార్పు కోసం.. ఆటో డ్రైవర్ ఆలోచన..
సాక్షి, హైదరాబాద్: ఆయనో ఆటో డ్రైవర్.. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఉరుకులు పరుగుల జీవితం.. ఎంతో కష్టపడితే కానీ ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లవు. కానీ ఆయన ఆలోచనలు మాత్రం ప్రతిక్షణం సమాజం గురించే.. సమాజంలో ఉన్న సమస్యలు.. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న విపరీత ధోరణులపై అనుక్షణం ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే యువతలో, సమాజంలో మార్పు తీసుకురావాలని సంకల్పించాడు. అయితే ఓ ఆటోడ్రైవర్.. తాను ఏదో ఒకటి చేయాలని సంకల్పించాడు. తన పరిధిలో ఏం చేయగలనో ఆలోచించాడు. కూడళ్లు, విద్యుత్ స్తంభాలు, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మనం మారాలి.. మార్పు రావాలి.. అంటూ కొటేషన్స్ రాయడం ప్రారంభించారు. ఆయన పేరు దాడే శ్రీనివాస్.. అంబర్‌పేటకు చెందిన శ్రీనివాస్.. రెండున్నరేళ్లకు పైగా ఈ వినూత్న కార్యక్రమాన్ని చేపడుతున్నారు.రోజుకో కొటేషన్..వివేకానంద సూక్తులు, వాక్యాలు తనకు ఎంతో స్ఫూర్తినిస్తాయని చెబుతున్నాడు 45 ఏళ్ల శ్రీనివాస్. ఈయనకు దేశ భక్తి కూడా ఎక్కువే. తన ఆటోలో ప్రయాణించే వారు తమ సమస్యలు చెప్పుకొంటుంటే ఎంతో బాధ అనిపించేదని, వీటన్నింటికీ కారణం సమాజంలో పెరుగుతున్న విపరీత ధోరణులే కారణమని పేర్కొంటున్నాడు. ఇక, తల్లిదండ్రులను ఆస్తుల కోసం హింసించడం.. పెద్ద వారిపై గౌరవం లేకుండా ఉండటం వంటివి ఎన్నో ఉదంతాలు చూసి ఆవేదనకు గురయ్యేవాడినని గుర్తు చేసుకున్నాడు. ఇక, యువత చెడు అలవాట్లకు బానిసై విలువలు లేని జీవితం గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇలాంటి వారిలో చిన్న మార్పు అయినా వస్తుందనే నమ్మకంతో ఇలా కొటేషన్లు రాస్తున్నానని చెప్పాడు. అలాగే తన ఆటోపై కూడా ప్రతి రోజూ కొత్త కొటేషన్లు రాస్తుంటానని వివరించాడు.చిన్నతనంలోనే నగరానికి.. షాద్‌నగర్ కుర్వగూడకు చెందిన శ్రీనివాస్ చిన్నతనంలోనే నగరానికి వలస వచ్చాడు. ఇంటరీ్మడియెట్లోనే చదువు ఆపేసిన శ్రీనివాస్.. ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిని కూడా చిన్నప్పటి నుంచే మంచి మార్గంలో నిలపాలనే ఉద్దేశంతో ఇంట్లో చిన్న బోర్డు ఏర్పాటు చేసి, దానిపై మంచి సూక్తులు రాసేవాడట. దీంతో వారు కూడా పెద్ద చదువులు చదువుకొని.. మంచి ఉద్యోగాలు చేసుకుంటున్నారని ఆనందం వ్యక్తం చేశారు. ధర్మబద్ధంగా, సహనంతో ప్రతి ఒక్కరూ జీవిస్తే సమాజంలో ఉన్న అనేక సమస్యలు రూపుమాపుతాయనేది తన నమ్మకమని చెబుతున్నాడు. -
Uttar Pradesh: నక్కను తోడేలు అనుకొని..
సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో జరిగిన తోడేళ్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రభుత్వం తోడేళ్ల వేటలో పడింది. తాజాగా రాష్ట్రంలోని సీతాపూర్‌లో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగు చూసింది. ఓ యువకుడు నక్కను తోడేలుగా భావించి చంపేశాడు. ఈ ఘటన సిధౌలీ తహసీల్‌లోని అసోధన్ గ్రామంలో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే యూపీలోని సీతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఓ యువకుడిపై నక్క దాడి చేసింది. ఆ యువకుడు దానితో పెనుగులాడాడు. ఈ దాడిలో ఆయువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ నక్కను తోడేలుగా భావించిన యువకుడు దానిని కాళ్లతో తన్నిచంపేశాడు.యువకుని కేకలు విన్న గ్రామస్తులు కర్రలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు టార్చ్ లైట్ వెలుగులో దానిని చూసి, అది తోడేలు కాదని, నక్క అని గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బాధితుడిని ఇంటికి పంపించారు. -
ఈ 5 ఎక్సర్‌సైజ్‌లతో.. మీ ఓవర్ థింకింగ్‌కి చెక్!
‘మీకున్న అతి పెద్ద సమస్య ఏమిటి?’ అని ప్రశ్నిస్తే పదిమందిలో ఏడుగురు ‘అతిగా ఆలోచించడం’ అని సమాధానమిస్తారు. ఇది ఒత్తిడిని, ఆందోళనను పెంచుతుంది, త్వరగా అలసిపోయేలా చేస్తుంది. ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ‘ఓవర్ థింకింగ్’కి చెక్ పెట్టవచ్చు.ఎప్పడు అతిగా ఆలోచిస్తున్నారో గుర్తించాలి..రోజులో ఏ సమయంలో, దేని గురించి అతిగా ఆలోచిస్తున్నారో, ఆ సమయంలో మీ శరీరంలో ఏయే భాగాలు బిగుసుకుని ఉంటున్నాయో గమనించాలి. అలాంటి పరిస్థితుల్లోనూ ఏ పని చేస్తున్నప్పుడు మీకు తక్కువ నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయో కూడా గుర్తించాలి. ఉదాహరణకు మీరు జిమ్‌కి వెళ్లినప్పుడు లేదా ఫన్నీ పాడ్‌కాస్ట్ వింటున్నప్పుడు ఆందోళన చెందకపోవచ్చు. ఇలాంటి వాటిని గుర్తించడం, ఆచరించడం ఓవర్ థింకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి సహాయ పడుతుంది.‘మీ ఆలోచనలకు’ దూరంగా జరగాలి..మీరు ఆలోచనల సుడిగుండంలో పడి మునిగిపోతున్నప్పుడు దానికి దూరంగా జరగాలి. గోడ మీది ఈగలా లేదా జడ్జిలా మీ ఆలోచనలకు దూరంగా జరిగి వాటిని గమనించాలి. ఇలా ఒక అడుగు వెనక్కు వేసి మీ ఆలోచనలను మీరు గమనించడం ద్వారా మీ భావోద్వేగాల తీవ్రత తగ్గిందని మీకు అర్థమవుతుంది. అంతే కాదు, మీ ఆలోచనల చానెల్‌ను మార్చే శక్తి మీకుందని మీరు గుర్తిస్తారు.‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారాలి..ప్రతికూల ఆలోచనలను నిర్మాణాత్మక ఆలోచనతో భర్తీ చేయడానికి సులభమైన మార్గం ‘ఎందుకు’ నుంచి ‘ఎలా’కు మారడం. అంటే ‘నాకే ఎందుకిలా జరిగింది?’, ‘నేనే ఎందుకు చేయాలి?’ లాంటి ప్రశ్నల నుంచి దారి మళ్లించుకుని ‘నేను ఎలా ముందుకు వెళ్ళగలను?’ అని ప్రశ్నించుకోవాలి. ఉదాహరణకు, మీ ఫ్రెండ్ మీకు చెప్పిన సమయానికి రాకపోతే, మెసేజ్‌కి స్పందించకపోతే.. ఎందుకలా చేశారని అతిగా ఆలోచించి మనసు పాడుచేసుకోకుండా, ఆ సాయంత్రాన్ని ఆనందంగా ఎలా మార్చుకోవచ్చనే దానిపై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం ద్వారా, మీరు నెగెటివ్ ఓవర్ థింకింగ్ నుంచి మంచి ప్లానింగ్‌కి మారతారు.రీషెడ్యూల్ చేయాలి..అతిగా ఆలోచించడానికి రోజులో పది, పదిహేను నిమిషాలు ప్రత్యేకంగా కేటాయించుకోవాలి. ప్రతిరోజూ అదే సమయంలో కూర్చుని దానిపై ఆలోచించాలి . రోజూ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల మిగతా సమయాల్లో ఆ అతి ఆలోచనలు మీ మనసును చుట్టుముట్టవు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.పేపర్ పై పెట్టండి..ఒక అనుభవం లేదా ఫీలింగ్స్‌ని ప్రాసెస్ చేయాల్సి వచ్చినప్పుడు ఊరికే దాని గురించి అతిగా ఆలోచించకుండా, వాటిని పేపర్ పై రాసుకోవాలి. మొదటి రోజు: మిమ్మల్ని వేధిస్తున్న విషయం గురించి రాయడానికి 15 నుంచి 20 నిమిషాలు వెచ్చించాలి.రెండో రోజు: ఆ అనుభవం మిమ్మల్ని ఎలా ప్రభావితం చేసిందో రాసుకోవాలి.మూడో రోజు: ఆ అనుభవం మీ ప్రస్తుత జీవితానికి ఎలాంటి సంబంధం కలిగి ఉందో, భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నారో కూడా రాసుకోవాలి. ఇలా రాయడం మీ భావోద్వేగాల లోతుల్లోకి వెళ్లడానికి సహాయపడుతుందని, క్రమేమీ మిమ్మల్ని డిప్రెషన్‌కి దూరం చేస్తుందని పరిశోధకులు చెప్తున్నారు.ఈ ఐదు ఎక్సర్‌సైజ్‌లను రోజూ క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఓవర్ థింకింగ్ నుంచి తప్పించుకోవచ్చు. అప్పటికీ తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్ట్‌ని సంప్రదించాలి. – డా. విశేష్, సైకాలజిస్ట్ -
అతిగా ఆలోచిస్తున్నారా?
మిత్ర ఒక ప్రముఖ ఎంఎన్సీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. తన పనితీరుతో రెండేళ్లలోనే టీమ్ లీడర్‌గా, నాలుగేళ్లలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా ఎదిగాడు. ఆ తర్వాతే అసలు సమస్య మొదలైంది. ప్రతి ప్రాజెక్ట్ గురించీ ఒకటికి పదిసార్లు ఆలోచించేవాడు. పదే పదే మీటింగ్‌లు పెట్టేవాడు. కానీ ఏ నిర్ణయమూ తీసుకునేవాడు కాదు. దాంతో ప్రాజెక్టులు ఆలస్యమయ్యేవి. దీంతో మేనేజ్మెంట్ అతని పనితీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేయసాగింది. ఆలోచనల నుంచి తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా మిత్రకు సాద్యం కావడంలేదు. ఆఖరుకు కాఫీ తాగాలా, టీ తాగాలా అనే విషయం మీద కూడా అతిగా ఆలోచించడం అతనికే చిరాకు కలిగిస్తోంది.మిత్రలా అతిగా ఆలోచించడం ఎవరినైనా ఇబ్బంది పెడుతుంది ఎప్పుడో ఒకసారి! ఆ సమయంలో ఎంత ప్రయత్నించినా మనసు చేసే ఆ అతి వాగుడును ఆపలేం. అది అప్పుడప్పుడయితే ఫర్వాలేదు. కానీ అది అలవాటుగా మారితేనే సమస్య. ఆ అతి ఆలోచన.. పనులకు అడ్డుపడుతుంది, మానసిక ప్రశాంతతను దెబ్బతీస్తుంది. ఇంకా చాలారకాలుగా చికాకు పెడుతుంది. ఎందుకలా ఆలోచిస్తారు?అతిగా ఆలోచించడానికి అనేక కారణాలున్నాయి. అందులో ప్రధానమైనవి.. తప్పులు చేయకూడదనే భయం, అన్నీ పర్ఫెక్ట్గా చేయాలనే తపన, ఆత్మవిశ్వాసం లోపించడం. ఇంకా ఆందోళన (యాంగ్జయిటీ), ఆత్మగౌరవలోపం (లో సెల్ఫ్ ఎస్టీమ్), గతకాలపు గాయాలు కూడా.ప్రాక్టికాలిటీకి అతీతంగా ఉన్నత ప్రమాణాలను సెట్ చేసుకున్నప్పుడు ప్రతి నిర్ణయం ఒత్తిడికి కారణమవుతుంది.అది ఎప్పటికీ అంతంకాని ఆలోచనలతో అనాలసిస్ పెరాలసిస్‌కు కారణమవుతుంది. మిత్ర చేస్తున్న తప్పు ఇదే. తప్పులు చేయకూడదనే, ఫెయిల్యూర్ కాకూడదనే భయమే మిత్ర ఎక్కువగా ఆలోచించడానికి కారణం. అలాగే ప్రతికూల ఫలితాలు వస్తాయేమోననే ఆందోళనా అతను అతిగా ఆలోచించేలా చేస్తోంది. ఆత్మవిశ్వాసం లోపించించడం, ఆత్మగౌరవం తగ్గడం అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోస్తుంది. తన సామర్థ్యం, నిర్ణయాలను సందేహిస్తూ అతిగా ఆలోచించేలా చేస్తాయి.ఆందోళన చెందేటప్పుడు మన చింతలను నియంత్రించుకునేందుకు కొంచెం అతిగా ఆలోచించడం సహజం. కానీ అది పరిస్థితిని మరింత దిగజారుస్తుంది. గతంలో తీవ్రమైన.. బాధాకరమైన అనుభవాలకు లోనైనవారు దానికి సంబంధించిన మానసిక వ్యథను ఎదుర్కోవడానికి అతిగా ఆలోచిస్తుంటారు. నష్టాలు.. కష్టాలు..ఎవరైనా చెవి పక్కన చేరి నసపెడుతుంటే మీరు భోజనాన్ని ఎంజాయ్ చేయగలరా? అతిగా ఆలోచించడం కూడా అలాంటిదే. అది మనసుకు మాత్రమే పరిమితం కాదు. జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రభావితం చేస్తుంది. నిరంతరం నెగెటివ్‌గా ఆలోచించడం మన ఎమోషనల్ వెల్–బీయింగ్‌ను దెబ్బతీస్తుంది. మన శక్తిని హరించివేస్తుంది. మానసిక ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌కు కారణమవుతుంది. గత సంఘటనలకు సంబంధించిన ఆలోచనలు, విశ్లేషణలు పదే పదే మనసులో పరుగెడుతున్నప్పుడు, భవిష్యత్తు గురించి పదే పదే భయపడుతున్నప్పుడు చేతిలో ఉన్న పనిపై లేదా చదువుపై దృష్టిపెట్టడం కష్టం. దాంతో వాయిదా వేస్తారు. అలా అలా చదువులు రోడ్డున పడతాయి. ఉద్యోగం అటకెక్కుతుంది. వ్యాపారం నష్టాల పాలవుతుంది. మానవ సంబంధాలూ దెబ్బతింటాయి. విముక్తి పొందడం ఇలా..మిత్రలా అతిగా ఆలోచించేవారు అతనిలాగే బాధపడాల్సిన అవసరం లేదు. ఆలోచనలపై నియంత్రణ సాధించేందుకు చేయగలిగేవి చాలా ఉన్నాయి. అంకితభావంతో ప్రయత్నిస్తే మనసులోని చాటర్ బాక్స్ నోరు మూయించవచ్చు. మితిమీరిన ఆలోచనలు మనసును కమ్మేసినప్పుడు మీరు నెగెటివ్ ట్రాప్‌లో పడ్డారని గుర్తించండి. ఇదే మీరు వేయాల్సిన తొలి అడుగు. ఆ తర్వాత నెగెటివ్ ఆలోచనలను సవాలు చేయండి. వాటిలో వాస్తవావాస్తవాలను విశ్లేషించండి.ఆలోచిస్తూ ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనమూ ఉండదని గుర్తించి, వాస్తవిక లక్ష్యాలను నిర్దేశించుకుని అడుగు వేయండి. మనసును ఇబ్బంది పెడుతున్న పని లేదా చదువులకు దూరంగా ఉండండి. మనసుకు ఆహ్లాదం లేదా విశ్రాంతి కలిగించే కార్యకలాపాలలో పాల్గొనండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. ప్రతి రాత్రి 7–8 గంటలనిద్రను లక్ష్యంగా పెట్టుకోండి.మీ ఆందోళనల గురించి స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడండి. శ్వాసను లేదా ఆలోచనలను గమనించడం, ధ్యానం ద్వారా మనసును మళ్లించవచ్చు. ఇవన్నీ చేసినా ఆలోచనలు తగ్గకపోతే ఆలస్యం చేయకుండా సైకాలజిస్టును కలవండి.కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలోని కాగ్నిటివ్ రీస్ట్రక్చరింగ్ ద్వారా సైకాలజిస్ట్ మీకు సహాయపడగలరు.దీని ద్వారా అతిగా ఆలోచించడానికి ఆజ్యం పోసే కాగ్నిటివ్ డిస్టార్షన్స్‌ను గుర్తించవచ్చు, వాటిని సవాలు చేసి మరింత వాస్తవిక, సానుకూల ఆలోచనలతో భర్తీ చేయవచ్చు. దీనివల్ల చీకటి నుంచి కాంతికి మారినట్లు మనం విషయాలను మరింత స్పష్టంగా చూడగలం. సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com -
సొంతింటి రుణానికి ప్రభుత్వ వడ్డీ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సొంతిల్లు లేని కుటుంబం ఉండకూడదనేదే బీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీ రామారావు అన్నారు. డబుల్ బెడ్రూమ్, గృహలక్ష్మి పథకాలతో సమాంతరంగా మధ్యతరగతి వారి కోసం ఓ సరికొత్త పథకానికి సీఎం కేసీఆర్ ఆలోచన చేస్తున్నారని తెలిపారు. బ్యాంకు రుణంతో 1,200 నుంచి 1,500 చదరపు అడుగుల మధ్య ఇల్లు కొనుగోలు చేసే వారి బ్యాంకు వడ్డీని ప్రభుత్వమే కట్టేలా ఈ పథకం ఉండే అవకాశం ఉందని వివరించారు. శుక్రవారం కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) హైదరాబాద్ ఆధ్వర్వంలో మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో జరిగిన రియల్ ఎస్టేట్ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేళ్ల కాలంలో రెండేళ్లు కరోనాతో, ఎన్నికలకు మరొక ఏడాది పోగా నికరంగా ఆరున్నరేళ్లు మాత్రమే పరిపాలించామని.. ఈ తక్కువ సమయంలో ప్రజలకు కనీస అవసరాలు మాత్రమే తీర్చగలిగామని కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి ప్రణాళికలు సృజనాత్మకత కార్యక్రమాల అమలులో చిన్న చిన్న సమస్యలు ఎదురవడం సర్వసాధారణమేనని, అలాంటిదే ధరణి అని కేటీఆర్ చెప్పారు. గతంలో లంచం ఇవ్వకుండా రిజి్రస్టేషన్ జరిగేది కాదని, కానీ, ఇప్పుడు ధరణితో పారదర్శకంగా ఒకే రోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ జరుగుతున్నాయని తెలిపారు. ధరణికి సమస్యలను పరిష్కరించేందుకు నిపుణుల కమిటీ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. హైదరాబాద్ సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేశామని మంత్రి చెప్పారు. తెలంగాణలో ఏ ప్రాంతం నుంచి అయినా ఒక గంటలో హైదరాబాద్ చేరుకునేలా ఒక రవాణా ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. హరిత భవనాలు, పునరుత్పాదక విద్యుత్‌కు ప్రాధాన్యతను ఇవ్వడంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల షటిల్ సరీ్వస్‌లతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అర్బన్ పార్క్‌లను పెంచుతామన్నారు. అహంకారం కాదు.. చచ్చేంత మమకారం ప్రతిపక్షాలు మాకు అహంకారం అంటూ ప్రజలకు సంబంధం లేని అంశాలను చూపి తిడుతున్నాయని, తెలంగాణపై తమకుంది అహంకారం కాదని, చచ్చేంత మమకారమని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్‌ది సోషల్ మీడియాలో హడావుడే తప్ప క్షేత్రస్థాయిలో ఏమీ లేదని విమర్శించారు. డిసెంబర్ 3న మళ్లీ బీఆర్ఎస్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. జాతీయ పారీ్టల్లో నిర్ణయాలు ఢిల్లీలో తీసుకోవాల్సి ఉంటుందని, సీఎం పీఠం కోసం కొట్లాడకుండా, సొంతంగా నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వంతో నే అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. రెండున్నర దశాబ్దాలలో తెలంగాణ ప్రాంతంపై ప్రభావం చూపిన నేతలు చంద్రబాబు, వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, కేసీఆర్ అని అన్నారు. బాబు ఐటీ అభివృద్ధికి, రాజశేఖర్ రెడ్డి పేదల అభ్యు న్నతి కోసం కృషి చేశారని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఐటీ సహా పేదల వరకు అన్ని రంగాల వృద్ధికి కృషి చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ పాలనలో పల్లెలు, పట్టణాలు సమాంతరంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. -
ఆంగ్లంలో సుశిక్షిత సైన్యం
విశాఖ విద్య: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు ప్రపంచ స్థాయిలో పోటీపడేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఈ నేపథ్యంలోనే ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం ఇస్తోంది. 2023–24 విద్యా సంవత్సరానికి మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మటివ్ పరీక్షలతో అదనంగా ఇంగ్లిష్ లో విద్యార్థుల నైపుణ్యాన్ని తెలుసుకునేందుకు ‘టోఫెల్’ పరీక్షను సైతం నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు మేలు చేయాలనే ఉన్నతాశయంతో ఇలాంటి ప్రయోగాలకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతుండగా.. వీటిని క్షేత్రస్థాయిలో విజయవంతం చేసేందుకు విశాఖ జిల్లా అధికారులు సైతం చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు. దీనిలో భాగంగానే జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3 నుంచి 10వ తరగతి వరకు బోధించే ఇంగ్లిష్ సబ్జెక్టు టీచర్లకు రోజుకు 50 మంది చొప్పున జిల్లాలోని మొత్తం 500 మందికి శిక్షణ ఇప్పించేలా ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు అంతర్జాతీయ స్థాయి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చే ఐడియల్ లెర్కింగ్ సంస్థతో ఒప్పందం చేసుకున్నారు. జిల్లా విద్యాశాఖాధికారుల ప్రతిపాదనలకు కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సానుకూలంగా స్పందించి, శిక్షణకు అయ్యే మొత్తాన్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ(సీఎస్ఆర్) కింద చెల్లించేందుకు ముందుకొచ్చారు. ఈ నెల 28న ప్రారంభమైన శిక్షణ మూడు నెలల పాటు కొనసాగనుంది. విదేశాలకు వెళ్లి చదువుకుంటామనే పేద విద్యార్థులకు తోడ్పాటుగా నిలిచేలా జగనన్న విదేశీ విద్యా కానుక అందజేస్తోంది. అయితే విదేశాల్లో చదువులకు జీఆర్ఈ, కాట్, ఐల్ట్సŠ, క్లాట్, టోపెల్, సాట్ వంటి అంతర్జాతీయ స్థాయి ఎంట్రన్స్ పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ స్కూళ్లలో చదువుకునే విద్యార్థులకు ఇలాంటి పోటీ పరీక్షలపై అవగాహనలేక వెనుకబడిపోతున్నారు. ఉపాధ్యాయులకు ఇలాంటి శిక్షణతో ఆ లోటు భర్తీ కానుంది. పట్టుసాధించేలా ఇంగ్లిష్ మీడియం చదువులకు ప్రాధాన్యం పెరిగింది. ఉపాధ్యాయులకూ సబ్జెక్టుపై పట్టుండాలి. కలెక్టర్ డాక్టర్ మల్లికార్జున సహకారంతో విశాఖ జిల్లాలో తొలిసారిగా ఇలాంటి శిక్షణ ఇస్తున్నాం. – బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష, ఏపీసీ, విశాఖపట్నం మెలకువలు నేర్పుతున్నాం.. ఇంగ్లిష్ భాషలో మెలకువలు తెలిస్తే.. విద్యార్థులను ఆకట్టుకునే రీతిలో బోధించవచ్చు. అలాంటి మెలకువలనే వారికి నేర్పుతున్నాం. ప్రతి ఉపాధ్యాయుడు కనీసం 30 గంటలైనా శిక్షణలో పాల్గొంటే మంచి ఫలితాలొస్తాయి. విద్యాశాఖాధికారులు ఈ విషయంలో చొరవ తీసుకోవాలి. – ఫిలిప్, ట్రైనర్,ఐడియల్ లెర్కింగ్ సంస్థ, విశాఖపట్నం ఉపయోగకరంగా ఉంది.. నా 23 ఏళ్ల సరీ్వసులో ఇలాంటి శిక్షణ ఇదే తొలిసారి. ఇంగ్లిష్ మీడియం బోధన అమలు చేస్తున్నందున ఇలాంటి శిక్షణ ఉపాధ్యాయులకు ఉపయోగకరంగా ఉంటుంది. – రామలక్ష్మి, ఉపాధ్యాయురాలు, జెడ్పీ హైస్కూల్, గిరిజాల, విశాఖపట్నం అలా ఉంటేనే మెరుగైన ఫలితాలు విద్యార్థులకు పాఠాలు చెప్పే మేము, మళ్లీ విద్యార్ది గా మారి శిక్షణకు హాజరవుతున్నాం. ఉపాధ్యాయుడైనా నిత్య విద్యార్ది గా ఉంటేనే ఉత్తమ ఫలితాలు వస్తాయి. నిరంతరం నేర్చుకోవాలి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం బోధన రీత్యా శిక్షణ ఎంతో మేలు చేస్తుంది. – ఆర్.విజేత, జీవీఎంసీ హైస్కూల్, మల్కాపురం, విశాఖపట్నం -
మంచి మాట: ఏదో.. ఏవో అనుకుంటూ...
ఒక పున్నమి రాత్రిలో తిక్కలోడు ఒకడు దారి వెంబడి నడుస్తూ పోతున్నాడు. కాసేపయ్యాక సేదతీరడం కోసం ఓ చెట్టు కింద నుంచున్నాడు. ఆ చెట్టుకు దగ్గరలో ఓ పెద్ద బావి కనిపిస్తే ఆ బావిలోకి తొంగి చూశాడు. ఆ బావి నీళ్లలో జాబిల్లి ప్రతిబింబం కనిపించింది. జాబిల్లి బావిలో పడిపోయింది అని అనుకున్నాడు. అయ్యో ఇప్పుడు నేనేం చెయ్యగలను? ఎలా ఈ జాబిల్లిని కాపాడగలను? ఇక్కడెవరూ లేరే, ఇప్పుడు ఈ జాబిల్లిని నేను కాపాడకపోతే అది చచ్చిపోతుంది కదా అని అనుకున్నాడు. అంతటితో ఊరుకోలేదు. అక్కడా ఇక్కడా వెతికి ఓ తాడును తీసుకుని దాన్ని బావిలోకి విసిరేశాడు జాబిల్లిని ఆ తాడుతో కట్టి బయటకు తియ్యచ్చని అనుకుని. ఆ బావిలో ఏదో ఓ రాయికి ఆ తాడు చిక్కుకుపోయింది. ఆ వ్యక్తి చాలబలంగా ఆ తాడును లాగాడు. కానీ రాయికి చిక్కుకుపోయిన తాడు రాలేదు. జాబిల్లి చాల బరువుగా ఉందే, పైగా నేనిక్కడ ఒంటరిగా ఉన్నానే, నేనెలా జాబిల్లిని బయటకు తియ్యగలను? ఈ జాబిల్లి ఎప్పటి నుండి ఈ బావిలో ఉందో తెలియడం లేదు, జాబిల్లి అసలు బతికి ఉందా, చచ్చిపోయిందా కూడా తెలియడం లేదు అని అనుకుంటూ ఆ వ్యక్తి తాడును బలంగా లాగుతున్నాడు. అలా లాగుతూ ఉండగా ఆ తాడు తెగిపోయి అతడు వెల్లకిలా నేలపై పడిపోయాడు. పడిపోవడంవల్ల అతడి కళ్లు మూసుకుపోయాయి. తలకు దెబ్బ తగిలింది. కొద్దిసేపు తరువాత అతడు కళ్లు తెరిచినప్పుడు జాబిల్లి ఆకాశంలో కనిపించింది. దాన్ని చూసి తను జాబిల్లిని కాపాడేశాడనీ, తనకు మాత్రమే కొంచెం దెబ్బ తగిలిందనీ అయినా పరవాలేదనీ తనవల్ల జాబిల్లి కాపాడబడిందనీ తనకు తాను చెప్పుకున్నాడు. ఆ వ్యక్తిని చూసి మనం నవ్వుకుంటాం. ఒక సందర్భంలో ఓషో చెప్పిన కథ ఇది. కథలోని వ్యక్తి ఎక్కడ తప్పు చేశాడు? అతడు తన తత్త్వంతో ఏదో అనుకున్నాడు. ఆ అనుకున్నది సరికాదు. మనం కూడా ఇలాగే ఏదో, ఏవో అనుకుంటూ ఉంటాం. చాలసందర్భాల్లో మనం అనుకునేవి సరైనవి కావు. ఈ తీరు మన సమస్యల్లో ప్రధానమైంది. అనుకోవడానికి అతీతంగా మనం బతకగలం అన్న చింతన కూడా మనలో చాలమందికి లేదు. ఎప్పడూ ఏదో ఒకటి అనుకుంటూ ఉండాల్సిందే అన్న స్థితిలో మనం కొట్టుమిట్టాడుతున్నాం. తిక్కవ్యక్తి, జాబిల్లి బావిలో పడిపోయిన ఈ కథలాగానే మానవజాతి మొత్తం ఇలాంటి సమస్యలో ఇరుక్కుపోయి ఉంది. ఈ ప్రపంచమంతా ఈ సమస్య ఉంది అని అంటారు ఓషో. దేన్నో అనుకుంటూ ఉండడమూ, దేన్ని పడితే దాన్ని అనుకుంటూ ఉండడమూ మనలోని సమస్యలు మాత్రమే కాదు మనం దిద్దుకోవాల్సిన తప్పులు. అభిప్రాయపడడంలాగా అనుకోవడం కూడా మనుషుల రుగ్మతే; కాకపోతే బలమైన బలహీనత. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడంవల్ల మనుషులకు నష్టం, కష్టం, హాని కలుగుతూ ఉంటాయి. ఏదో, ఏవో అనుకుంటూ ఉండడం కాదు పరిస్థితులు, సంఘటనలపై సమగ్రమైన, సరైన అవగాహనను పొందేందుకు పూనుకోవాలి. అలాంటి అవగాహన మాత్రమే మనకు కావాల్సిన మేలు చేస్తుంది. అనుకోవడం అనేది ప్రతి వ్యక్తికీ ఉండే లక్షణమే. అనుకోవడం అన్న లక్షణం లేని మనుషులు ఉండరు. అయితే మనలో పలువురికి ఏం అనుకుంటున్నాం, ఎందుకు అనుకుంటున్నాం, అనుకునేది సరైందేనా? వంటివాటిపై ఉండాల్సిన పరిణతి, కచ్చితత్వం ఉండవు. ఈ తీరు పలు సమస్యలకు మూలం అవుతోంది. – రోచిష్మాన్ -
మంచి మాట: సంతోషం సమగ్ర బలం
సంతోషం సగం బలం‘ అన్నది మనకు బాగా తెలిసిన మాటే. నిజానికి మనిషికి సంతోషం సమగ్ర బలం. అంతేకాదు మనిషికి సంతోషం సహజమైన బలం కూడా. ఎంత బలవంతుడికైనా సంతోషం లేనప్పుడు అతడు బలహీనుడిగా అయిపోతాడు. సంతోషం కరువైపోయిన మనుషులు మనోవ్యాధులతో శుష్కించిపోవడమూ, నశించిపోవడమూ మనకు తెలిసిన విషయమే. బావుండాలంటే మనిషికి సంతోషం ఎంతో ముఖ్యం. వర్తమానంలో మనం సంతోషంతో ఉంటే లేదా మనం వర్తమానాన్ని సంతోష భరితంగా చేసుకోగలిగితే మన భవిష్యత్తు సంతోషమయంగా ఉంటుంది. ‘సంతోషానికి మార్గం లేదు, సంతోషమే మార్గం‘ ఇది గౌతమ బుద్ధుడి ఉవాచ. సంతోషం అనేది సంపాదించుకోగలిగేదీ, సాధించుకోగలిగేదీ కాదు. సంతోషం మనలో ప్రవహించే రక్తంలాంటిది. బయటనుంచి వచ్చేది కాదు. మనలోంచి మన కోసం మనమై కలిగేది. ‘మనం మన ఆలోచనలవల్ల నిర్మితం అయ్యాం; మనం మన ఆలోచనలకు అనుగుణంగా రూపొందుతాం; మన మెదడు నిర్మలంగా ఉంటే సంతోషం వీడని నీడలా అనుసరిస్తుంది’ అని చెప్పాడు బుద్ధుడు. మనిషి సంతోషంగా ఉండడం అతడి ఆలోచనావిధానంపై ఆధారపడి ఉంటుంది. ఆలోచన ఆధారంగా కలిగే అనుభూతి సంతోషం. ఒకరికి సంతోషాన్ని ఇచ్చేది మరొకరికి సంతోషాన్ని ఇచ్చేది కాకపోవచ్చు. ‘సూర్యుడి కాంతి మనుషులకు వెలుగును ఇస్తూ ఉంటే గుడ్లగూబలకు చీకటి అవుతోంది. నీటిలో మునిగినప్పుడు మనుషులకు, పశువులకు ఆ నీరు శ్వాసకు ప్రతిబంధకం అవుతోంది. ఆ నీరే చేపల శ్వాసకు ఆటంకం అవడం లేదు. మనుషులు హాయిగా గాలి పీల్చుకునే తీరప్రదేశంలో చేపలు గాలి పీల్చుకోలేవు. అగ్ని అన్నిటినీ దహిస్తుంది. కానీ అత్తిరిపక్షులు అగ్నికణాల్ని తింటాయి. నీళ్లవల్ల నిప్పు నశిస్తుంది. కానీ బడబాగ్ని సముద్రం మధ్యలో జ్వలిస్తూ ఉంటుంది. ఇట్లా జగత్తులో విషయాలన్నీ ద్వైరూప్యంతో ఉన్నాయి అని భారతీయ తత్త్వసాహిత్యంలో అత్యున్నతమైన త్రిపురారహస్యంలో చెప్పబడింది. విషయాలనుబట్టి కాదు మనల్ని బట్టి మనకు తృప్తి కలుగుతూ ఉంటుంది లేదా మన తనివి తీరుతూ ఉంటుంది. కాబట్టి మన సంతోషానికి మనమే మూలంగా ఉన్నాం, ఉంటాం. ‘శరీరాన్ని శుష్కింపజెయ్యడంలో చింత లేదా విచారానికి సమానమైంది లేదు’ అని హితోపదేశం ఎన్నో యేళ్ల క్రితమే మనకు చెప్పింది. ‘చితి, చింత ఈ రెండిటిలో చింత ఎక్కువ దారుణమైంది. చితి నిర్జీవమైన శరీరాన్నే దహిస్తుంది కానీ చింత సజీవంగా ఉన్న శరీరాన్ని దహిస్తూ ఉంటుంది’ అని ఒక సంస్కృత శ్లోకం తెలియజేస్తోంది. నిజానికి చింత అనేది శరీరాన్ని మాత్రమే కాదు ఆలోచనా విధానాన్ని, వ్యక్తిత్వాన్ని, ప్రగతిని, జీవితాన్ని కూడా శుష్కింపజేస్తుంది. కాబట్టి మనకు కలిగిన చింతను వీలైనంత త్వరగా వదిలించుకోవాలి. మనకు కలిగిన చింత నుంచి మనం వీలైనంత త్వరగా విముక్తం అవ్వాలి. ‘మానవజాతిలోని చింత అంతా మనసువల్ల వచ్చిన జబ్బు’ అని తమిళకవి కణ్ణదాసన్ చెప్పారు. ఈ స్థితికి అతీతంగా మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే అందుకు మనసే కీలకం. మనసువల్ల వచ్చిన చింతను ఆ మనసువల్లే తొలగించుకోవాలి.‘గాలి తనతో తీసుకు వచ్చిన మేఘాలను తానే చెదరగొడుతుంది.’ అని ఒక సంస్కృత శ్లోకం చెబుతోంది. ఆ విధంగా మనసువల్ల వచ్చిన చింతలను మనం మనసువల్లే పోగొట్టుకోవాలి. సంతోషం మనిషిలోనే నిక్షిప్తం అయి ఉంది. దుఃఖాన్ని తొలగించుకునేందుకు తనను తాను చెక్కుకోవడం నేర్చుకుంటే మనిషి సంతోషశిల్పం అవుతాడు; మనిషి ‘సంతోషంగా’ ఉంటాడు. – శ్రీకాంత్ జయంతి -
అంతా బానే ఉంది!
చింతనాపరుడైన ఒక బాటసారి ఏవో యాత్రలు చేస్తూ మార్గమధ్యంలో అలసి కాసేపు విశ్రమిద్దా మనుకున్నాడు. అడవిలోని పిల్ల బాట అది. దగ్గరలోనే పుచ్చకాయల తీగ ఒకటి కనబడి, ఆకలి కూడా పుట్టించింది. మోయలేనంత పెద్ద కాయను ఒకదాన్ని తెంపుకుని, అక్కడే ఉన్న మర్రిచెట్టు నీడన కూర్చున్నాడు. ఏ పిట్టలు కొరికి వదిలేసినవో అంతటా మర్రిపండ్లు పడివున్నాయి. ‘‘ఈ తమాషా చూడు! అంత సన్నటి తీగకేమో ఇంత బరువైన కాయా? ఇంత మహావృక్షానికేమో ఇంతింత చిన్న పండ్లా? ఈ సృష్టి లోపాలకు అంతం లేదు కదా! పరిమాణం రీత్యా ఆ తీగకు మర్రి పండ్లు, ఈ చెట్టుకు పుచ్చకాయలు ఉండటం సబబు’’ అనుకున్నాడు. ఆలోచిస్తూనే ఆ కాయను కడుపునిండా తిన్నాడేమో, ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండ తన మీద పడకుండా చెట్టు కాపు కాస్తున్న దేమో, అటే నిద్ర ముంచుకొచ్చింది. మర్రిపండు ఒకటి ముఖం మీద టప్పున రాలినప్పుడు గానీ మెలకువ రాలేదు. ‘‘ఆ, నేను తలపోసినట్టుగానే ఆ కాయ దీనికి కాసి ముఖం మీద పడివుంటే ఏమయ్యేది నా పరిస్థితి? ఔరా, ఈ సృష్టి విలాసం!’’ అనుకుని చక్కా పోయాడు బాటసారి. ఏ దేశపు జానపద గాథో! ఏది ఎలా ఉండాలో అది అలాగే ఉందని సృష్టి క్రమాన్ని అభినందిస్తుంది. పాలగుమ్మి పద్మరాజు రాసిన ఓ కథలో కూడా ఇంకా సున్నితం కోల్పోని కాంట్రాక్టర్ అయిన కథా నాయకుడికి ఇలాంటి సందేహమే వస్తుంది. ఆ కూలీలు ఎర్రటి ఎండలో ఆ ఇంటి నిర్మాణం కోసం చెమటలు కక్కడమూ, వారి తిండీ, వారి బక్కటి శరీరాలూ, వారి మోటు సరసాలూ, అరుపులూ, ఇవన్నీ చూశాక అతడికి ఊపిరాడదు. సాయంత్రం పని ముగించి, తిండ్లు తినేసి, ఎక్కడివాళ్లక్కడ ఆదమరిచి నిద్రలోకి జారుకుంటారు. కలత నిద్రలో ఉన్నాడేమో, ఆ రాత్రి వీస్తున్న చల్లటి గాలి ఎందుకో అతడిని ఉన్నట్టుండి నిద్రలేపుతుంది. దూరంగా ఆ వెన్నెల కింద తమదైన ఏకాంతాన్ని సృష్టించుకుని ఆనంద పరవశపు సాన్నిహిత్యంలో ఉన్న ఒక కూలీల జంటను చూడగానే అతడిలోని ఏవో ప్రశ్నలకు జవాబు దొరికినట్టు అవుతుంది. ప్రపంచం మనం అనుకున్నంత దుర్మార్గంగా ఏమీ లేదు అనుకుంటాడు. అసలైనదీ, దక్కాల్సినదీ ఈ భూమ్మీద అందరికీ దక్కితీరుతుందన్న భావన లోనేమో అతడు తిరిగి హాయిగా నిద్రలోకి జారుకుంటాడు. ఈ భూమండలం నిత్య కల్లోలం. మూలమూలనా ఏదో అలజడి, ఏదో ఘర్షణ, ఏదో సమస్య, ఏదో దారుణం. శ్రీలంకలో బాలేదు, పాకిస్తాన్లో బాలేదు, ఉక్రెయిన్‌లో అంతకంటే బాలేదు. రష్యాలో మాత్రం బాగుందని చెప్పలేం. ఇక్కడ మనదేశంలో మాత్రం? ఇన్ని యుద్ధాలు, ఇన్ని సంక్షో భాలు చుట్టూ చూస్తూ కూడా ఈ లోకం బానేవుంది అని ఎవరూ అనే సాహసం చేయరు. కానీ ఎప్పుడు ఈ ప్రపంచం బాగుందని! కనీసం ఎప్పుడు మనం అనుకున్నట్టుగా ఉందని! ప్రపంచం దాకా ఎందుకు? వ్యక్తిగత జీవితంలో మాత్రం నేను బాగున్నానని గట్టిగా చెప్పగలిగేవాళ్లు ఎందరు? ‘నా ప్రపంచంలో అంతా బాగానే ఉంది’ అని అనుకోగలిగే వాళ్లెవరు? దీనివల్లే అసంతృప్తులు, కొట్లాటలు, చీకాకులు, ఇంకా చెప్పాలంటే అనారోగ్యాలు. అవును, అనారోగ్యం! ఇదొక్కటే ప్రపంచంలో అసలైన సమస్య. దీని ప్రతిఫలనాలే మిగిలినవన్నీ! మానసికంగా ఆరోగ్యంగా ఉన్నవాడు ఏ ప్రతికూలతకూ కారణం కాలేడు– అది ప్రపంచంలోనైనా, ఇంట్లోనైనా. అందుకే మనిషికి సర్వతో ముఖ ఆరోగ్యం కావాలి. ఆ ఆరోగ్యంతో సంతోషం కలుగుతుంది, ఆ సంతోషంతో ప్రపంచం బాగుంటుంది. ప్రపంచం బాగుంటే మనంబాగుంటాం. మనం బాగుంటే ప్రపంచం బాగుంటుంది. ‘‘అనారోగ్యంగా పిలవబడే ప్రతిదాన్నీ మన శరీరంలో మనమే సృష్టించుకుంటాం,’’ అంటారు తొలితరం కౌన్సిలర్ లూయిస్ హే. బలమైన సంకల్పం, సానుకూల ఆలోచనలు తేగలిగే అనూహ్య మార్పులను గురించి ఆమె ఎన్నో పుస్తకాలు రాశారు. మన సమస్యలన్నీ మన అంతర్గత ఆలోచన విధానాల వల్ల కలిగే బాహ్య ప్రభావాలు మాత్రమేనని చెబుతారామె. నెగెటివ్ థింకింగ్ వల్ల బ్రెయిన్లో ఆటంకాలు ఏర్పడుతాయి; అక్కడ ఫ్రీగా, ఓపెన్‌గా సంతోష ప్రవాహం ముందుకు సాగ డానికి అవకాశం ఉండదంటారు. ఏ రకమైన ఆలోచనా విధానం ఏయే రకమైన జబ్బులకు కారణ మవుతుందో... దురద, చర్మవ్యాధులు, మోకాళ్ల నొప్పులు, సైనస్, మలబద్ధకం, చిగుళ్ళ సమస్యలు, మైగ్రేన్... ఇలా పెద్ద జాబితా ఇస్తారు. అయితే ఏ రకమైన వ్యాధికైనా భయం, కోపం– ఈ రెండు మెంటల్ పాటరన్స్ మాత్రమే మూలకారకాలుగా ఉంటాయంటారు. మనల్ని మనం నిజంగా ప్రేమించుకోవడం, ఎదుటివాళ్లను నిందించి మన శక్తిని అంతా వదిలేసుకునే బదులు ఇవ్వాల్సిన ‘క్షమాపణ’ ఇచ్చేయడం, ఆమె సూచించే మార్గాలు. ఈ ప్రేమకు సమస్త భూగోళాన్నీ హీల్ చేయగల శక్తి ఉందని ఆమె స్థిర విశ్వాసం. ‘‘మనం ఏది ఆలోచించాలనుకుంటామో, ఏది నమ్మాలనుకుం టామో, ఆ ప్రతి ఆలోచననీ, నమ్మకాన్నీ విశ్వం పూర్తిగా సమర్థిస్తుంది, అవి జరగడానికి సహకరి స్తుంది’’ అంటారు. ఈ సృష్టి మనకోసం మన జీవితాన్ని దాని సర్వశక్తితో డిజైన్ చేసేవుంటుంది. మనం సమస్యలు అనుకునేవి సృష్టి విన్యాసంలో అసలు సమస్యలే కాకపోవచ్చు. కానీ మన ప్రాణాలకు అవన్నీ నిజమే. ‘గజం మిథ్య, ఫలాయనం మిథ్య’ అని మన సాధారణ చూపుతో అనుకోలేక పోవచ్చు. కానీ ఈ సృష్టి అశాశ్వతత్వంపై ఒక ఎరుక ఉంటే, జీవితాన్ని చూసే తీరు మారిపోవచ్చు. జీవితంతో కొనసాగిస్తున్న ఒక ఘర్షణ ఏదో తొలగిపోవచ్చు. ఎక్కడో ఒకరు మరణిస్తున్నప్పుడు కూడా ఇంకెక్కడో ఎవరో పుడుతూనే ఉన్నారు! -
ఐడియా అదుర్స్.. ఆ ఆలోచన ఎలా పుట్టిందంటే..?
సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ: అవసరం అన్నీ నేర్పుతుంది అనడానికి ఉదాహరణ ఈ చిత్రం. వేలకు వేలు అద్దెలు చెల్లించి షాప్ పెట్టుకునే ఆర్థిక స్తోమత లేదు. పోనీ ఏ రోడ్డు పక్కనో చిన్న బడ్డీ పెట్టుకుందామా అంటే మున్సిపల్ సిబ్బంది ఎప్పుడు ఖాళీ చేయిస్తారో తెలియదు. జనానికి అందుబాటులో ఉంటూ రహదారి పక్కనే పని చేసుకోవడం ఎలాగబ్బా అన్న ఆలోచన నుంచి పుట్టిందే ఈ తోపుడు బండి టైలరింగ్ షాప్ ఐడియా. చదవండి: అక్కా.. బా.. అంటూ.. గోదారోళ్ల కితకితలు.. మామూలుగా లేదుగా మరి.. విజయవాడ మొగల్రాజపురం ప్రాంతానికి చెందిన దర్జీ కోటేశ్వరరావు స్థానిక అమ్మ కల్యాణ మండపం సమీపంలో ఇలా తోపుడు బండిపై కుట్టు మెషిన్ ఏర్పాటు చేసుకుని రోజంతా బట్టలు కుడుతుంటాడు. రాత్రికి ఎంచక్కా ఈ రిక్షా బండితో సహా ఇంటికి వెళ్తుంటాడు. ఐడియా అదిరింది కదూ. -
ఆలోచనా లోచనం
ఆలోచన మెదడుకు సంబంధించినది, ప్రేమ హృదయానికి సంబంధించినది. ఆలోచన, ప్రేమ రెండూ మనిషి ప్రగతి కి అత్యంత ఆవశ్యకమైనవి. ఆలోచన (వివేకం) పరిపక్వ స్థితికి చేరితే ప్రేమ ప్రకాశిస్తుందంటారు. అందుకే జ్ఞానోదయమైనవారు – వారు ఏ దేశానికి చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా ప్రేమ మూర్తులై ఉంటారు. వారు మాట్లాడినా, మౌనంగా ఉన్నా, ఏమైనా పని చేసినా, ఏమీ చేయక ఊరకే ఉన్నా వారికి, ఇతరులకూ మంచే జరుగుతుంది. వారు ఏ మత ఆచారాలను పాటిస్తూ ఉండకపోవచ్చు. ఏ మతాన్ని ప్రత్యేకంగా ప్రచారం చేస్తూ ఉండకపోవచ్చు. మతాలకు అతీతంగా ప్రేమ, జ్ఞానాలను వారు ధారాళంగా పంచుతూ ఉంటారు. ఆలోచించగలిగే శక్తి గానీ, ఆలోచించాలన్న తపన గాని లేని మనిషి జీవించి ఉన్నట్టా? అసలు ఆలోచించని మనిషికి, జంతువుకు తేడా ఏమిటి? జంతువులు కూడా వాటికున్న సహజ జ్ఞానాన్ని ఆధారం చేసుకుని కొంత ఆలోచించటాన్ని గమనిస్తాము. మరి మనిషన్నవాడు ఆలోచనా రహితంగా, వివేకహీనుడై జీవిస్తే ఎలా? ప్రపంచంలోని అన్ని మత గ్రంథాల లక్ష్యం మనిషిలో ఆలోచనా శక్తిని రేకెత్తించాలనే. ఎప్పుడైతే ఆలోచనా శక్తి, వివేకం వృద్ధి అవుతాయో మంచి ఏదో, చెడు ఏదో సత్యమేదో, అసత్యమేదో, నిత్యమేదో, అనిత్యమేదో అతడే తెలుసుకోగలడు. సరైన ఎంపిక చేసుకుని చక్కగా జీవించగలడు. ఇతర జీవులను సంతోషంగా జీవింపజేయగలడు. భగవంతుడున్నాడని నమ్మటమో, నమ్మకపోవటమో అంత ముఖ్యం కాదు. పునర్జన్మ ఉందనో, లేదనో భావించటమూ అంత ముఖ్యం కాదు; స్వర్గ నరకాలు ఉన్నాయని విశ్వసించటమో, విశ్వసించకపోవటమో అదీ అంత ముఖ్యం కాదు. మరి ఏది ముఖ్యం? మనిషిగా జన్మించాము కాబట్టి మనుషుల మధ్య జీవించాలి. అది తప్పదు. అయితే ఎలా జీవించాలి? ఎలా జీవిస్తే సుఖంగా, సంతోషంగా మనశ్శాంతితో జీవించగలమో తెలుసుకుని అలా జీవించాలి. అలా జీవించాలంటే వివేకం కావాలి. ఆ వివేకాన్ని కల్గించటమే శాస్త్రాల, మతాల ఉద్దేశం. మన తల్లిదండ్రుల పట్ల, భార్యా పిల్లల పట్ల, బంధుమిత్రుల పట్ల, ఇరుగుపొరుగు వారి పట్ల మనం ఎలా నడుచుకుంటే సుఖంగా, సంతోషంగా, సంతృప్తిగా ఉండగలమో తెలుసుకోవాలంటే వివేకం తప్పక ఉండాల్సిందే. చీకట్లో నడవాలంటే దీపపు కాంతి ఉండాల్సిందే. లేకపోతే ఏదో ఒక గుంటలో పడి చస్తాము. అదేవిధంగా వివేకమనే వెలుగు లేక అంధకారమయమైన (ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని) జీవితంలో పయనిస్తే కష్టనష్టాలు తప్పవు. పతనం తప్పదు. మనలో వివేక జ్యోతి వెలగాలంటే మనలో ప్రశ్నించే తత్వం వృద్ధి చెందాలి. ఆలోచించే గుణం అధికమవ్వాలి. అంటే గుడ్డిగా విశ్వసించటాన్ని మానుకోవాలి. ఏకాంతంగా ప్రశాంతంగా మౌనంగా కాలాన్ని గడపటాన్ని చేర్చుకోవాలి. అప్పుడే ఆలోచించటానికి అవకాశమేర్పడుతుంది. దేవుడు–దయ్యం, స్వర్గం– నరకం, పుణ్యం, పాపం వీటన్నిటినీ గూర్చి యోచించి, ఆలోచించిన పాశ్చాత్య తత్వవేత్త (ఫ్రెంచ్ ఫిలాసఫర్) వాటి ఉనికిని సందేహించాడు. ఆయన అన్నాడు. ‘...అంటే నేను యోచిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను’ అని అన్నాడు. అంటే యోచన ఆలోచన అన్నది ఒకటుంది నాలో. కాబట్టి నేను కూడా ఉన్నట్టే అని ధ్రువీకరించాడు. దాన్ని బట్టి ఆలోచనా శక్తికున్న ప్రాధాన్యతను మనం ఇట్టే గుర్తించవచ్చు. అందుకే ....‘‘మనిషి ఆలోచనా శక్తి గల ప్రాణి’’ అంటారు. వివేకం, ఆలోచనా శక్తి లేకపోతే మంచి చేయాలనుకున్నా కీడే కలుగుతుంది. ఒరే! కాస్త విశ్రాంతి తీసుకుంటాను. నీవు విసనకర్రతో విసురుతూ నా పక్కన కూర్చో అన్నాడట గురువుగారు. శిష్యుడు విసురుతూ ఉన్నపుడు ఒక ఈగ పదే పదే గురువుగారి తలపై వాలింది. శిష్యునికేమో గురువుగారి పట్ల అమిత భక్తి ఉంది. ఈగపై విపరీతమైన కోపం వచ్చింది. దగ్గరలో ఉన్న రోకలి ని రెండు చేతులతో ఎత్తి పట్టుకుని ఈసారి మా గురువు గారికి నిద్రాభంగం చెయ్, నీ కథ చెబుతా అనుకుంటూ వేచి ఉన్నాడు. ఈగ గురువు గారి గుండుపై కూర్చుంది. శిష్యుడు శక్తి కొద్దీ రోకలితో కొట్టాడు. ఈగ ఎగిరిపోయింది, గురువుగారి గుండు బద్దలైంది. సరైన ఆలోచన లేకపోతే జరిగేది అదే అంటారు స్వామి వివేకానంద. నిజమే. మంచిగా జీవిస్తూ, ఇతరులకు మంచి చేయటమే సర్వమత సారం. కాని మంచి అంటే ఏమిటో తెలియాలిగా? అదీ తెలీకనే కదా మతాలన్నీ మారణ హోమాలు చేసింది, మానవత్వాన్ని మంట కలిపింది. నేను ఆలోచిస్తున్నాను కాబట్టి నేనున్నాను అని రేనే డెక్టార్, అంటే నేను ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఉన్నాను అని ఇంకొక తత్వవేత్త అంటారు. ప్రేమ ఉంది కాబట్టి నేను ఉన్నట్టే అని అంటే ప్రేమకు పెద్ద పీట వేసినట్టే. – రాచమడుగు శ్రీనివాసులు -
ఊహిస్తే చాలు... ఆలోచనలు మారతాయి!
‘‘నువ్వు తలచుకోవాలేగానీ.. ఏదైనా సాధ్యమే’’ అని వ్యక్తిత్వ వికాస నిపుణులు చెబుతూంటారు. ఆత్మవిశ్వాసాన్ని పెంచేందుకు ఇలాంటివి ఉపయోగపడతాయి గానీ.. ఎంత మనం అనుకున్నా ఐన్‌స్టీన్‌లా మారిపోగలమా అనే అనుమానం మనకూ వస్తుంది. ఇందులో కొంత నిజం లేకపోలేదని అంటున్నారు బార్సిలోనా యూనివర్శిటీ శాస్త్రవేత్తలు. ఫ్రాంటియర్స్ ఇన్ సైకాలజీ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం ప్రకారం... ఐన్‌స్టీన్‌లా అనుకునేవారి ఆలోచనలు క్రమేపీ మెరుగైన దిశగా మార్పు చెందుతాయి. వర్చువల్ రియాలిటీ ఆధారంగా తాము కొందరిపై ఒక పరిశోధన నిర్వహించామని, ఇందులో ఐన్‌స్టీన్ మాదిరి శరీరం ఉన్నట్టు ఊహించుకోవలసిందిగా సూచించినవారు కొంత సమయానికి ఆత్మవిశ్వాస పరీక్షలో మెరుగైన ఫలితాలు సాధించారని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త మెల్ స్లేటర్ అంటున్నారు. వర్చువల్ రియాలిటీ ప్రయోగాల్లో ఇతరుల శరీరం, కదలికలను ఊహించుకోవడం వల్ల తమ అసలు శరీరం, ఆలోచనలను ప్రభావితం చేస్తుందని గతంలోనే కొన్ని ప్రయోగాలు నిరూపించాయని ఆయన అన్నారు. తెల్ల రంగు వారు నల్లటి రంగు శరీరాలను ఊహించుకుని వర్చువల్ రియాలిటీలో చూసుకున్న తరువాత వారికి అప్పటివరకు నల్ల రంగు వారిపై ఉన్న భేదభావం తగ్గిందని చెప్పారు. ఇదే తరహాలో ఐన్‌స్టీన్‌లా ఊహించుకున్నప్పుడు వారి ఆలోచనల్లోనూ మార్పులు వచ్చినట్లు తమ తాజా అధ్యయనం చెబుతోందని వివరించారు. -
తలచుకుంటే చాలు గీసేస్తుంది!
టోరెంటో : మనసులో తలచుకునే దానిని చిత్ర రూపంలో చూపించే నూతన టెక్నాలజీని టోరెంటో యూనివర్సిటీకి చెందిన డాన్ నెమ్రోదేవ్ అనే పరిశోధకుడు అభివృద్ధి చేశారు. మెదడులోని తరంగాల కదలికల ఆధారంగా ఇది ముఖ చిత్రాన్ని గీస్తుందన్నారు. ఎలక్ట్రో ఎన్సెఫాలోగ్రఫీ(ఈఈజీ) డేటా ఆధారంగా ఇది పనిచేస్తుందని చెప్పారు. మనం దేనినైనా చూసినప్పుడు మెదడులో ఓ ఊహాచిత్రం ఏర్పడుతుందని, దీనిని ఈఈజీ సాయంతో బంధించి చిత్రం రూపంలోకి తీసుకురాగలమని పేర్కొన్నారు. నాడీ తరంగాల ఆధారంగా మనసులో గుర్తుంచుకున్న, ఊహించుకునే అంశాలను కూడా ఇది చిత్రీకరించగలదని వర్సిటీకి చెందిన ఆడ్రియాన్ నెస్టర్ తెలిపారు. ఇది విజయవంతమైతే నేరాల్లో ప్రత్యక్ష సాక్షుల మెదడు కదలికల ఆధారం గా నేరస్థుల చిత్రాలను గీయగలదని చెప్పా రు. మాట్లాడలేని వారి మనసులో ఏముం దో కూడా గుర్తించగలదన్నారు. అయితే దీనిని మరింత అభివృద్ధి చేయాల్సి ఉందన్నారు. పరిశోధన వివరాలు ఈన్యూరో జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
అధికార పార్టీలో అంతర్మథనం
► ఎమ్మెల్యేలకే అధికారమంటూ ప్రచారం ► ఆందోళనలో పాత నేతలు ► కరణంకు కార్పొరేషన్ పదవి, గొట్టిపాటికి నియోజకవర్గ బాధ్యతలు..? ► అన్నా, దివి శివరాంల పరిస్థితి అయోమయం ► అమీతుమీకి సిద్ధమవుతున్న పాత నేతలు ► పజా క్షేత్రంలోనే తేల్చుకోవాలని నిర్ణయం సాక్షి ప్రతినిధి, ఒంగోలు : ఒక పక్క టీడీపీ పాత నేతలు.. కొత్తగా పార్టీలో చేరిన శాసనసభ్యుల పట్ల ఆ పార్టీ అధిష్టానం పూటకో తీరున వ్యవహరిస్తుండటంతో పాత నేతల్లో అంతర్మథనం మొదలైంది. తాజాగా ఎమ్మెల్యేలకే నియోజకవర్గ బాధ్యతలు అంటూ అధిష్టానం నిర్ణయించినట్లు ప్రచారం జరగడం పాత నేతలకు పుండు మీద కారం చల్లినట్లయింది. అధిష్టానం వైఖరిపై పాత నేతలు మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే జరిగితే అమీతుమీకి సిద్ధపడాలని, ప్రజాక్షేత్రంలోనే తేల్చుకోవాలని వారు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే చంద్రబాబు మాత్రం పాత నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పదవులు ఎర వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అద్దంకి నియోజకవర్గానికి చెందిన సీనియర్ నేత కరణం బలరాంకు ఆర్టీసీ లేదా మరో ఇతర కార్పొరేషన్ పదవులు అప్పగించనున్నట్లు సమాచారం. కార్పొరేషన్ పదవి ఇస్తానంటూ గతంలోనే చంద్రబాబు తనకు చెప్పారని ఇటీవల కరణం సైతం విలేకర్ల సమావేశంలో వెల్లడించారు. కరణంకు కార్పొరేషన్ పదవి అప్పగించి అద్దంకి నియోజకవర్గ బాధ్యతలను కొత్తగా పార్టీలో చేరిన గొట్టిపాటికి అప్పగిస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే జరిగితే ప్రస్తుతం అద్దంకి టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న కరణం వెంకటేష్ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. వెంకటేష్ దీనికి అంగీకరిస్తాడా... అన్నది అనుమానమే. చిన్న వయస్సులోనే వెంకటేష్ రాజకీయ భవిష్యత్తుకు గండి పడుతుంటే కరణం బలరాం చూస్తూ ఊరుకుంటారా..? అదే జరిగితే తండ్రి, కొడుకులు టీడీపీ అధిష్టానంతో అమీతుమీకి సిద్ధపడే పరిస్థితి ఉంటుందన్న ప్రచారం ఉంది. ఇక గిద్దలూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబును పక్కనపెట్టి ఎమ్మెల్యే అశోక్‌రెడ్డికే పూర్తి బాధ్యతలు అప్పగించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు సమాచారం. పార్టీలో చేర్చుకునే సమయంలోనే అశోక్‌రెడ్డికి చంద్రబాబు, చినబాబు లోకేష్‌లు ఈ మేరకు హామీ ఇచ్చినట్లు ప్రచారం ఉంది. అందులో భాగంగానే అన్నా రాంబాబును మెల్లగా గిద్దలూరు రాజకీయాల నుంచి తప్పించే ప్రయత్నానికి దిగినట్లు తెలుస్తోంది. అయితే రాంబాబును బుజ్జగించేందుకు ఏదైనా నామినేటెడ్ పోస్టు ఇస్తారా... లేదా... అన్నది వేచి చూడాల్సిందే...? ప్రాధాన్యతనివ్వకపోతే రాంబాబు తన వర్గీయులతో కలిసి అధిష్టానంతో తేల్చుకునేందుకు వెనుకాడే పరిస్థితి లేదు. ఇక కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పోతుల రామారావును పార్టీలో చేర్చుకొని ఇప్పటికే పాత నేత దివి శివరాంకు అధిష్టానం ప్రాధాన్యత తగ్గించింది. పోతుల రామారావు, దివి శివరాంల మధ్య విభేదాలు పూర్తిగా సమసిపోలేదు. శివరాం వర్గీయులను తన వైపు తిప్పుకునేందుకు పోతుల అన్ని విధాలా ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇప్పటికే కొందరు నేతలు పోతుల వైపు మళ్లారు. పోతులను బలోపేతం చేసి శివరాంను బలహీనుడ్ని చేసి ప్రాధాన్యత తగ్గించే ప్రయత్నంలో అధిష్టానం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో శివరాంకు నామినేటెడ్ పోస్ట్ ఇస్తారా... లేదా... అన్నది ప్రశ్నార్థకమే. ఒక వేళ నామినేటెడ్ పదవి కట్టబెట్టకపోతే శివరాం పార్టీలో కొనసాగుతారా అన్నదీ సందేహమే. జిల్లా స్థాయిలో ముగ్గురు నేతలకు ప్రాధాన్యత ఉన్న నామినేటెడ్ పదవులు అధిష్టానం కట్టబెడుతుందా... అన్నది అనుమానమే. నాయకుల సంగతి పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం క్షేత్రస్థాయిలో కార్యకర్తలకు ఏ మాత్రం ఇష్టం లేదు. దశాబ్దాల పాటు పార్టీ జెండాలు మోసిన తమకు ఇప్పుడు కొత్తగా పార్టీలో చేరిన వారు అడ్డు తగులుతుంటే కార్యకర్తలు సహించే పరిస్థితి ఉండదు. అయితే ఎమ్మెల్యేలు పార్టీలో చేరడంతో క్షేత్రస్థాయిలో పాత నాయకులు, కార్యకర్తలకు ఎమ్మెల్యే వర్గీయులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల్లో తమకే ప్రాధాన్యతనివ్వాలంటూ పోటీ పడి గొడవలకు దిగుతున్నారు. దీంతో జిల్లాలోని గిద్దలూరు, అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్లో ఇరు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో పాత నేతలకు పార్టీ అధిష్టానం ప్రాధాన్యత తగ్గిస్తే అది క్షేత్ర స్థాయిలోనూ తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఇదే జరిగితే కార్యకర్తల పక్షాన నిలిచి అధిష్టానంతో అమీతుమీ తేల్చుకునేందుకు పాత నేతలు సిద్ధపడనున్నట్లు సమాచారం. -
ఆలోచనామృతం
మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలసి పొందికగా ఐదు నిమిషాలు పనిచేయలేం. ప్రతి వ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్థ చెడిపోతోంది. ఉత్తమ ఆలోచనా మార్గాన్ని అనుసరించేవారు ఆదరణీయులు. కుటిల ఆలోచనా మార్గాన్ని అనుసరించేవారు నిందనీ యులు. దుర్జనుల స్నేహం మానవుని పతనావస్థకు చేర్చుతుంది. ఒక్కసారి అందులో దిగితే మరలా పైకి రావడం చాలా కష్టం. ఈ చెడు ఆలోచనా మార్గం ప్రారంభంలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతిమ పరిణామం మాత్రం దుఃఖదాయకమవుతుంది. సాధనలో ఉంటే చైతన్యం సిద్ధిలో ఉండదు. భావుకుడికి ప్రేమ సాధనే కానీ, సిద్ధి కనిపించదు. అతడు ఆరాధించే ప్రేమకానీ, సౌందర్యం కానీ లౌకికం కాదు. అతీంద్రియాలైన ప్రేమ-సౌందర్యాల్ని అందుకోవడానికి భావుకుడు సాధన చేస్తాడు. భావు కుడు స్త్రీలో మాతృత్వాన్ని, సజీవత్వాన్ని దర్శిస్తాడు. ఆలోచించేకొద్దీ - జీవితం ఒక అవకాశం. దాని నుంచి లాభాన్ని పొందవచ్చు. అలా అది అందమైతే అస్వాదించవచ్చు. ఒక కల అయితే నెరవేర్చుకోవచ్చు. అదే ఒక సమస్య అయితే ఛేదించుకోవచ్చు. అదొక బాధ్యత అయితే నిర్వహించు కోవచ్చు. ఒక ఆట అయితే తనివి తీరా ఆడుకోవచ్చు. ఒక హామీ అయితే తీర్చుకోవచ్చు, ఒక దుఃఖం అయితే అధిగమించవచ్చు. ఒక పాట అయితే హాయిగా పాడు కోవచ్చు. ఒక పోరాటం అయితే ఆమోదించుకోవచ్చు. ఒక విషాదం అయితే ఎదుర్కోవచ్చు. ఒక సాహసం అయితే ధైర్యం చేయవచ్చు. ఒక అదృష్టం అయితే అనుభవించవచ్చు. అందుకే జీవితం అమూల్యమైంది. కాబట్టి అనాలోచి తంగా నాశనం చేసుకోవద్దు. విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియవు. భూమిని చీల్చుకుని మొలకగా మారినా నిన్నెవరూ పట్టించుకోరు. ఓపికపట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరూ గమనించరు. ఎండవానలకోర్చి చెట్టుగా మారిన ప్పుడు నిన్ను గుర్తిస్తుందీ లోకం. కాయలు కాచి పళ్లని స్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం. మహా వృక్షమై ఎదిగిననాడు నీ నీడకై ఈ ప్రపంచం పరిత పిస్తుంది. చక్కని ఆలోచనా విధానంతో జీవితాన్ని సక్ర మంగా మలచుకోగలగాలి. తెలియని విషయాలను లేదా సమస్యాత్మకంగా ఉండే విషయాలను తన తోటి దగ్గరగా ఉండే వ్యక్తులతో పంచుకోవడం ద్వారా అవసరమైన జీవితానుభవ నైపుణ్యంగల పెద్దల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయడం ఎటువంటి బాధ కలిగే విషయాలనైనా తన అనే వారితో చెప్పుకో వటమనేదే ఆవేశాన్ని అధిగమించడానికి పరిష్కారం. ఒక మాట పడడం వలన మన విలువ తగ్గిందేమీ లేదు. పడ్డవాళ్లం చెడ్డవాళ్లం కానేకాదు. సరైన సమయం చూసి అవసరాన్ని గుర్తించి, మన ప్రేమ విలువ తెలియజేయాలి. ద్వేషించే వారిని కూడా ప్రేమగా మనవైపు తిప్పుకోవాలి. ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ లేవు. ఉన్న బంధాలలోని అనుబంధాలనైనా నిలుపుకుంటూ, రక్త సంబంధంలోని విలువను కాపా డుకోవడమే ఉత్తమ ఆలోచన. ఆ ఆలోచనే అమృత మౌతుంది. - యస్.ఆర్. భల్లం -
ఓ యువకుని ఆలోచన అంపశయ్య
ఆశలు, ఆశయాలు, ఆకాంక్షలు, ఆనందాలు, ఆవేశాలు, ఆవేదనలు.. అణువణువునా ఆక్రమించుకున్న యువకుడి మనసెంత అల్లకల్లోలం? ఉస్మానియా యూనివర్సిటీ హాస్టల్లో పీజీ చేసిన ఆ విద్యార్థి అంతరంగమే దానికి సాక్ష్యం. నవల పేరునే ఇంటిపేరుగా మార్చుకున్న సుప్రసిద్ధ రచయిత అంపశయ్య నవీన్ తీర్చిదిద్దిన ఏళ్లనాటి కథను సాహసోపేతంగా తెరకెక్కిస్తున్నారు సిటీకి చెందిన దర్శకుడు ప్రభాకర్ జైని. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత ఓయూలో షూటింగ్ చేసిన ఈ ఏకైక చిత్రంలో సినీరంగానికి చెందని నగర ప్రముఖులూ పాలుపంచుకోవడం విశేషం. - ఎస్.సత్యబాబు ‘అమ్మా నీకు వందనం’ చిత్రం ద్వారా అద్దె తల్లుల (సరొగేట్ మదర్స్) హృదయ వేదనను తెరకెక్కించిన దర్శకుడు ప్రభాకర్ పలు పురస్కారాలు దక్కించుకున్నారు. ప్రభుత్వాధికారిగా పదవీ విరమణ చేసిన ఈయన తనకు ఎంత మాత్రం పరిచయం లేని సినీరంగాన్ని ఎంచుకోవడం మాత్రమే కాదు.. పూర్తి వైవిధ్య భరిత చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. అదే కోవలో ప్రస్తుతం అంపశయ్యకి చిత్ర రూపమిస్తున్న ప్రభాకర్ జైని పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే.. ఓయూలోని హాస్టల్ గదిలో షూటింగ్.. దశాబ్దాల క్రితం నాటి కథ ఇది. చాలా ప్రాచుర్యం పొందిన అంపశయ్య నవలను గతంలో పలువురు సినిమాగా రూపొందించాలనుకున్నా సాధ్యం కాలేదు. అయితే యువకుడిగా ఉన్నప్పుడు ఈ నవల చదివి ఎంతో ప్రభావితమైన నేను ఎలాగైనా ఈ కథను తెరకెక్కించాలని చాలెంజ్‌గా తీసుకొని చిత్రం రూపొందించా. సిటీలోని పలు చోట్ల సినిమా షూటింగ్ చేశాం. గత 50 ఏళ్లలో లేని విధంగా ఓయూలో ఈ సినిమా షూటింగ్ చేయగలిగాం. కథకు అనుగుణంగా 1970 నాటి పరిస్థితులను యథాతథంగా పునఃప్రతిష్టించాం. సిటీ వేదికగా.. జాతీయ అవార్డు లక్ష్యంగా.. అంపశయ్యలో అచ్చ తెలుగమ్మాయి, నగరవాసి పావని హీరోయిన్గా, శ్యామ్ హీరోగా నటించారు. పొట్టి శ్రీరాములు వర్సిటీలోని థియేటర్ ఆర్ట్స్ కోర్సు విద్యార్థులు పాత్రలు పోషించారు. ఐఏఎస్ అభ్యర్థులకు వ్యక్తిత్వ వికాస శిక్షణ తరగతులు చెప్పే సిటీకి చెందిన ఆకెళ్ల రాఘవేంద్ర హీరోకి కర్తవ్య బోధ చేసే పాత్రలో సినీరంగానికి పరిచయమవుతున్నారు. తెలంగాణ ప్రజా కళాకారుడు కిన్నెర మొట్ల మొగిలయ్య కూడా ఒక పాటలో తొలిసారి కనిపించనున్నారు. స్వాతి నాయుడు, యోగి దివాన్, కమెడియన్‌గా రాధాకృష్ణ, వాల్మీకి (సాక్షి-పూరి జగన్నాథ్ షార్ట్ ఫిలిం పోటీ విజేత), మోడల్ మోనికా థాంప్సన్.. అలాగే మరికొందరు సినీ రంగానికి చెందిన నగరవాసులు ఈ సినిమాలో నటనతో పాటు పలు అంశాల్లో పాలుపంచుకున్నారు. కొన్ని పాత్రల్లో నేను, నా భార్య కూడా నటించాం. ఈ చిత్రం ప్రస్తుతం ఎడిటింగ్ దశలో ఉంది. కథ మీద ఉన్న నమ్మకంతో జాతీయ అవార్డు లక్ష్యంగా ఈ సినిమా తీస్తున్నాం. -
ఆత్మవిశ్వాసానికి... దారి ఇది!
ఆత్మవిశ్వాసం తోడుంటే అపజయాన్ని ఎదుర్కొనే బలమైన ఆయుధం మన చేతిలో ఉన్నట్లే. అన్నీ ఉన్నా... ఆత్మవిశ్వాసం లేకపోతే విజయం సిద్ధించదు. ఆత్మవిశ్వాసాన్ని మీలో ప్రోది చేసుకోవడానికి అవసరమైన కొన్ని విషయాలు... ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉండండి. మన ఆలోచన మీదే మన అడుగు ఆధారపడి ఉంటుంది. ప్రతి విషయాన్నీ ప్రతికూలంగా ఆలోచిస్తే, పడే అడుగు సరియైన మార్గంలో పడదు. మీకు మీరుగా సొంత నియమాలు రూపొందించుకోండి. వాటిని పాటించండి. అంతే తప్ప, ఆ నియమాలను బ్రేక్ చేసే ప్రయత్నం చేయకండి. చదువుకు సంబంధించి ప్రణాళికలకు ప్రాధాన్యం ఇవ్వండి. కాలాన్ని వృథా చేయకండి. ఉత్తేజపరిచే జీవితచరిత్రలను చదవండి. మిమ్మల్ని ఆకట్టుకున్న వాక్యాలను పేపర్‌పై పెద్ద అక్షరాలలో రాసి గోడకు అంటించండి. వాటిని చదివినప్పుడల్లా ఒక కొత్త శక్తి వస్తుంది. ఎప్పుడూ నిరాశగా ఉండే వాళ్లతో, నిరాశగా మాట్లాడే వాళ్లతో కాకుండా చురుగ్గా ఉండేవాళ్లు, నాలుగు విషయాలు తెలిసినవాళ్లతో స్నేహం చేయండి. గెలుపే అంతిమం కాదు... దాని తరువాత ఓటమి రావచ్చు. ఓటమే అంతిమం కాదు... దాని తరువాత గెలుపు కూడా వస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఓటమికి భయపడాల్సిన అవసరం లేదు. మీలో ఉన్న బలాలనూ, బలహీనతలనూ గుర్తించండి. బలాల్ని మరింత మెరుగుపరుచుకోండి. బలహీనతలను సరిదిద్దుకోండి. ఔట్‌డోర్ గేమ్స్ ఆడండి. దీని ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. మిమ్మల్ని మీరు విజయం దిశగా ప్రేరేపించుకోండి. ఉత్తేజాన్నీ, ప్రేరణనూ నింపే ఉపన్యాసాలను వినండి.