మనలో ఉన్న పెద్ద లోపమేమిటంటే ముగ్గురం కలసి పొందికగా ఐదు నిమిషాలు పనిచేయలేం. ప్రతి వ్యక్తీ పెత్తనం కోసం పాకులాడుతుంటాడు. అందువల్లే మొత్తం పని, వ్యవస్థ చెడిపోతోంది. ఉత్తమ ఆలోచనా మార్గాన్ని అనుసరించేవారు ఆదరణీయులు. కుటిల ఆలోచనా మార్గాన్ని అనుసరించేవారు నిందనీ యులు. దుర్జనుల స్నేహం మానవుని పతనావస్థకు చేర్చుతుంది. ఒక్కసారి అందులో దిగితే మరలా పైకి రావడం చాలా కష్టం. ఈ చెడు ఆలోచనా మార్గం ప్రారంభంలో చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. అంతిమ పరిణామం మాత్రం దుఃఖదాయకమవుతుంది.
సాధనలో ఉంటే చైతన్యం సిద్ధిలో ఉండదు. భావుకుడికి ప్రేమ సాధనే కానీ, సిద్ధి కనిపించదు. అతడు ఆరాధించే ప్రేమకానీ, సౌందర్యం కానీ లౌకికం కాదు. అతీంద్రియాలైన ప్రేమ-సౌందర్యాల్ని అందుకోవడానికి భావుకుడు సాధన చేస్తాడు. భావు కుడు స్త్రీలో మాతృత్వాన్ని, సజీవత్వాన్ని దర్శిస్తాడు.
ఆలోచించేకొద్దీ - జీవితం ఒక అవకాశం. దాని నుంచి లాభాన్ని పొందవచ్చు. అలా అది అందమైతే అస్వాదించవచ్చు. ఒక కల అయితే నెరవేర్చుకోవచ్చు. అదే ఒక సమస్య అయితే ఛేదించుకోవచ్చు. అదొక బాధ్యత అయితే నిర్వహించు కోవచ్చు. ఒక ఆట అయితే తనివి తీరా ఆడుకోవచ్చు. ఒక హామీ అయితే తీర్చుకోవచ్చు, ఒక దుఃఖం అయితే అధిగమించవచ్చు. ఒక పాట అయితే హాయిగా పాడు కోవచ్చు. ఒక పోరాటం అయితే ఆమోదించుకోవచ్చు. ఒక విషాదం అయితే ఎదుర్కోవచ్చు. ఒక సాహసం అయితే ధైర్యం చేయవచ్చు. ఒక అదృష్టం అయితే అనుభవించవచ్చు. అందుకే జీవితం అమూల్యమైంది. కాబట్టి అనాలోచి తంగా నాశనం చేసుకోవద్దు.
విత్తుగా ఉన్నప్పుడు నువ్వు ఎవరికీ తెలియవు. భూమిని చీల్చుకుని మొలకగా మారినా నిన్నెవరూ పట్టించుకోరు. ఓపికపట్టి మొక్కవై ఎదిగినా నిన్నెవరూ గమనించరు. ఎండవానలకోర్చి చెట్టుగా మారిన ప్పుడు నిన్ను గుర్తిస్తుందీ లోకం. కాయలు కాచి పళ్లని స్తున్నప్పుడు నీ వెంట పడుతుంది సమాజం. మహా వృక్షమై ఎదిగిననాడు నీ నీడకై ఈ ప్రపంచం పరిత పిస్తుంది.
చక్కని ఆలోచనా విధానంతో జీవితాన్ని సక్ర మంగా మలచుకోగలగాలి. తెలియని విషయాలను లేదా సమస్యాత్మకంగా ఉండే విషయాలను తన తోటి దగ్గరగా ఉండే వ్యక్తులతో పంచుకోవడం ద్వారా అవసరమైన జీవితానుభవ నైపుణ్యంగల పెద్దల ద్వారా పరిష్కారం కనుగొనే ప్రయత్నం చేయడం ఎటువంటి బాధ కలిగే విషయాలనైనా తన అనే వారితో చెప్పుకో వటమనేదే ఆవేశాన్ని అధిగమించడానికి పరిష్కారం.
ఒక మాట పడడం వలన మన విలువ తగ్గిందేమీ లేదు. పడ్డవాళ్లం చెడ్డవాళ్లం కానేకాదు. సరైన సమయం చూసి అవసరాన్ని గుర్తించి, మన ప్రేమ విలువ తెలియజేయాలి. ద్వేషించే వారిని కూడా ప్రేమగా మనవైపు తిప్పుకోవాలి. ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ లేవు. ఉన్న బంధాలలోని అనుబంధాలనైనా నిలుపుకుంటూ, రక్త సంబంధంలోని విలువను కాపా డుకోవడమే ఉత్తమ ఆలోచన. ఆ ఆలోచనే అమృత మౌతుంది.
- యస్.ఆర్. భల్లం