సీతాపూర్: ఉత్తరప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో జరిగిన తోడేళ్ల దాడిలో పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో అక్కడి ప్రభుత్వం తోడేళ్ల వేటలో పడింది. తాజాగా రాష్ట్రంలోని సీతాపూర్‌లో ఓ ఆశ్చర్యకర ఉదంతం వెలుగు చూసింది. ఓ యువకుడు నక్కను తోడేలుగా భావించి చంపేశాడు. ఈ ఘటన సిధౌలీ తహసీల్‌లోని అసోధన్ గ్రామంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే యూపీలోని సీతాపూర్‌లో ఆదివారం అర్థరాత్రి ఓ యువకుడిపై నక్క దాడి చేసింది. ఆ యువకుడు దానితో పెనుగులాడాడు. ఈ దాడిలో ఆయువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే ఆ నక్కను తోడేలుగా భావించిన యువకుడు దానిని కాళ్లతో తన్నిచంపేశాడు.
యువకుని కేకలు విన్న గ్రామస్తులు కర్రలతో సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వారు టార్చ్ లైట్ వెలుగులో దానిని చూసి, అది తోడేలు కాదని, నక్క అని గుర్తించారు. సమాచారం అందుకున్న అటవీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని నక్క మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. గాయపడిన యువకుడిని చికిత్స కోసం ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం బాధితుడిని ఇంటికి పంపించారు.
Comments
Please login to add a commentAdd a comment