లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రెయిచ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో తోడేళ్ల వరుసదాడులతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. దీంతో తోడేళ్లు కనిపిస్తే చంపేసేందుకు గస్తీ కాస్తున్నారు. అయితే శుక్రవారం రాత్రి మహ్సీ తహసీల్‌లోని ఓ గ్రామంలో తోడేలు అనుకుని కుక్కను చంపారు గ్రామస్తులు.
చనిపోయిన కుక్క ముగ్గురిపై దాడి చేసిందని చెబుతున్నారు. గ్రామంలోని పలువురిపై తోడేలు దాడి జరిగిందని సమాచారమందడంతో ఫారెస్ట్ అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే గ్రామస్తులు తమపై దాడి చేసిన జంతువును చంపేశారు. ఫారెస్ట్ అధికారులు వెళ్లి చూసి చనిపోయిన జంతువు కుక్క అని తేల్చారు.
మరోవైపు కుక్కదాడిలో గాయపడ్డవారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మహ్సీ, బహ్రెయిచ్‌లో ఈ ఏడాది మార్చ్ నుంచి జరుగుతున్న తోడేళ్ల దాడుల్లో ఇప్పటివరకు 8 మంది చనిపోగా 30 మంది దాకా గాయపడ్డారు. వీరిలో 20 మందిదాకా తీవ్రంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment