Shocking Case: Killing Pet Dog Owner Throw Dead Body In Pond Dead - Sakshi
Sakshi News home page

పెంపుడు కుక్కును చంపి, పడేద్దామని వెళ్లి..అనుహ్యంగా యజమాని దుర్మరణం

Jan 8 2023 1:41 PM | Updated on Jan 8 2023 3:08 PM

Shocking Case: Killing Pet Dog Owner Throw Dead Body In Pond Dead - Sakshi

చెరువులో పడేస్తానంటూ.. వెళ్లి ఎంతకీ తిరిగి రాకపోవడతో...

ఉత్తరప్రదేశ్‌ రాజధానిలో వింత ఘటన చేసుకుంది. పెంపుకుక్క దాడి చేస్తోందని హతమార్చి చెరువు వద్దకు వెళ్లి యజమానురాలు అనుహ్యంగా చనిపోయింది. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..రూబీ అనే మహిళ, భర్త ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. వారి తోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంటోంది. ఐతే శనివారం రాత్రి అనుహ్యంగా రూబీపై పెంపుడు కుక్క దాడి చేసింది.

కానీ అది ఇలా దాడి చేయడం మొదటి సారి కాదు. అంతకుముందు తన కొడుకుపై కూడా దాడి చేసింది. దీంతో దానిపై కోపం వచ్చి చంపేసింది. ఆ తర్వాత ఆ కుక్క మృతదేహాన్ని చెరువులో పడేస్తానంటూ.. వెళ్లి ఆమె అనుహ్యంగా చెరువలో మునిగిపోయి చనిపోయింది. ఐతే ఆమె భర్త చెరువ వద్దకు వెళ్లి రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి.. చెరువ వద్దకు వెళ్లగా అక్కడ రూబీ చెప్పులు మాత్రమే ఉన్నాయి గానీ ఆమె కనిపించలేదు.

దీంతో రూబీ భర్త ఆమె చెరువులో పడిపోయిందేమోనన్న భయంతో గ్రామస్తుల సాయం కోరగా..వారిలో కొందరూ గాలించి రూబీ మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు రూబీ మృతదేహ్నాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు  చేసుకుని, ఆమె భర్త నుంచి వాగ్ములం సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

(చదవండి: హిమాచల్‌ప్రదేశ్‌లో కేబినేట్‌ విస్తరణ..7గురు మంత్రుల చేరికతో..)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement