owner
-
ఫోన్లో భార్య సతాయింపులు.. భరించలేక భర్త బలవన్మరణం!
కట్టుకున్న భార్య రాచిరంపాన పెడుతుందని ఓ భర్త వాపోతే ఎలా ఉంటుంది?. నవ్వి ఊరుకుంటుంది ఈ సమాజం. కానీ, అతుల్ సుభాష్ అనే భార్యాబాధితుడి బలవన్మరణం దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి కేసులు.. వ్యక్తుల జీవితాలకు సంబంధించిన విచారణే కాకుండా చట్టాలను సవరించాల్సిన అవసరాన్ని గుర్తు చేసింది. ఇది ఇక్కడితో ఆగిపోలేదు. ఓ అతుల్.. కర్ణాటకలో ఓ కానిస్టేబుల్ తిప్పన్న.. రాజస్థాన్‌లో ఓ డాక్టర్ అజయ్ కుమార్ .. ఇలా రోజుకొక ఉదంతం ఈ చర్చలో భాగమవుతోంది. ఇదిలా ఉండగానే.. ఢిల్లీలో మరో అఘాయిత్యం వెలుగులోకి వచ్చింది.వుడ్‌బాక్స్(Woodbox) అనే పాపులర్ కేఫ్ నడిపిస్తున్న పునీత్ ఖురానా(40) బలవనర్మణానికి పాల్పడ్డాడు. కల్యాణ్ విహార్ ప్రాంతం మోడల్ టౌన్ నివాసంలో మంగళవారం సాయంత్రం ఉరేసుకుని చనిపోయాడు. పునీత్ అతని భార్య మానిక జగదీష్ పహ్వాకి మధ్య విడాకుల కేసు నడుస్తోంది. అయితే.. ఈ కేసులో భార్య సతాయింపుల కోణం బయటకు వచ్చింది.తన భార్య వేధింపులకు సంబంధించి 16 నిమిషాల ఫోన్‌కాల్ ఆడియో.. అలాగే ఆమె ఎలా వేధించిందో చెబుతూ 54 నిమిషాల సెల్ఫ్ వీడియో రికార్డింగ్.. రెండింటిని బయటపెట్టి మరీ సూసైడ్ చేసుకున్నాడతను. ఈ మేరకు కుటుంబ సభ్యులు కూడా మానికపై ఆరోపణలు గుప్పిస్తున్నారు.2016లో ఈ ఇద్దరికీ వివాహం జరిగింది. ఆపై వుడ్‌బాక్స్ కేఫ్‌ను ఆ భార్యాభర్తలిద్దరూ కలిసే ప్రారంభించారు. విడాకుల కేసు నేపథ్యంలో ఇద్దరూ దూరంగా ఉంటున్నప్పటికీ.. వ్యాపారంలో మాత్రం ఇద్దరూ భాగంగానే కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవలు ముదిరాయి. పునీత్ మరణం తర్వాత.. మానికతో జరిగిన జరిగిన ఫోన్ కాల్ సంభాషణ ఒకటి బయటకు వచ్చింది.మనం విడాకులు తీసుకున్నాం. అయినా కూడా నేను వ్యాపార భాగస్వామినే. కాబట్టి, నా బకాయిలు త్వరగా చెల్లించు అని మానిక, పునీత్‌తో వాగ్వాదం పెట్టుకుంది. పునీత్ ఎంత వేడుకుంటున్నా.. ఆమె మాత్రం కఠువుగానే మాట్లాడిందా ఆడియో క్లిప్‌లో. దీంతో.. చేసేది లేక ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మానికను విచారణ జరపాలని నిర్ణయించారు.ఇదిలా ఉంటే.. అతుల్ సుభాష్(Atul Subash) కోసం పుట్టుకొచ్చిన #JusticIsDue హ్యాష్‌ట్యాగ్ సోషల్ మీడియా నుంచి కనుమరుగు కాలేదు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న నిఖితా సింఘానియా బెయిల్ కోసం ప్రయత్నిస్తోంది. అయితే.. బిడ్డను సాకుగా చూపి బెయిల్ పొందలేరంటూ బెంగళూరు కోర్టు నిఖిత లాయర్‌కు స్పష్టం చేసింది. ఈ పిటిషన్‌పై తదుపురి వాదనలు జనవరి 4వ తేదీన వింటామంది. మరోవైపు.. బెంగళూరు హైకోర్టులోనూ నిఖితా సింఘానియా ఓ పిటిషన్ వేసింది. అదే టైంలో.. మనవడి సంరక్షణ కోరుతూ అతుల్ తల్లిదండ్రులు వేసిన పిటిషన్‌పైనా హైకోర్టు విచారణ జరపుతోంది. ఈ క్రమంలో నిఖితా సింఘానియా రిమాండ్‌లో ఉన్న విషయాన్ని సుప్రీం కోర్టు దృష్టికి తీసుకెళ్లాలని బెంగళూరు హైకోర్టు అతుల్ పేరెంట్స్‌కు సూచించింది.కొడుకును వంకగా పెట్టుకుని భార్య తన నుంచి డబ్బు గుంజుతోందని.. తప్పుడు కేసులతో కోర్టుల చుట్టూ తిప్పుతూ తనను వేధిస్తోందంటూ 90 నిమిషాల వీడియో.. పేజీలకొద్దీ మరణ వాంగ్మూలం రాసి బెంగళూరు మరాథాహల్లి నివాసంలో అతుల్ సుభాష్ ఆత్మహత్య చేసుకన్నాడు. ఆయన సోదరుడు బికాస్ కుమార్ ఫిర్యాదు మేరకు బీఎన్ఎస్ 108, రెడ్‌విత్ 3(5) కింద మారథాహల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటన తర్వాత పరారీలో ఉన్న నిఖితను, అటు ఆమె తల్లి సోదరుడ్ని పోలీసులు అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. అయితే.. తన భర్త అదనపు కట్నం కోసం తనను వేధించిన మాట వాస్తవమేనని, అతని మృతిలో తనకుగానీ, తన కుటుంబ సభ్యులకుగానూ ఎలాంటి ప్రమేయం లేదని నిఖిత మొదటి నుంచి వాదిస్తూ వస్తోంది. -
మా కుక్కను చంపేశారు వాళ్లకు శిక్ష పడాలి
-
కారు ఓనర్‌కి పోలీసుల షాక్.. అంబులెన్స్‌కి దారి ఇవ్వలేదని..
తిరువనంతపురం: కేరళలో అంబులెన్స్‌కి దారి ఇవ్వనందుకు ఓ కారు యజమానికి పోలీసులు షాక్ ఇచ్చారు. రూ.2.5 లక్షల జరిమానా విధించడంతో అతని లైసెన్స్‌ను కూడా పోలీసులు రద్దు చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో హల్ చల్ చేస్తోంది.ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్‌కు కారు యాజమాని దారి ఇవ్వలేదు. పేషెంట్‌ని అత్యవసరంగా ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో అంబులెన్స్ డ్రైవర్ సైరన్ మోగిస్తూనే ఉన్నారు. దాదాపు అన్ని వాహనాలు దారి ఇవ్వగా.. మారుతీ సియాజ్ కారు నడుపుతున్న ఓ వ్యక్తి మాత్రం దారి ఇవ్వలేదు. అయితే, కారు యజమాని ఉద్దేశపూర్వకంగానే అంబులెన్స్‌కు దారి ఇవ్వలేదని స్పష్టమవుతోంది.అయితే, అంబులెన్స్ ముందు కూర్చున్న వైద్య సిబ్బంది వీడియో రికార్డ్ చేయగా, ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పోలీసులు వెంటనే స్పందిస్తూ.. నేరుగా ఆ కారు యాజమాని ఆచూకీ తెలుసుకుని ఇంటికెళ్లారు. రూ.2 లక్షల జరిమానా విధించడంతో పాటు అతని డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఈ వీడియో గురించి ఎలాంటి అధికారిక ప్రకటన అందుబాటులో లేవు.A car owner in #Kerala has been fined ₹2.5 lakh, and their license has been canceled for failing to make way for an ambulance. 🚑🚨 #JusticeServed #RoadSafety pic.twitter.com/WehLiyUwNn— MDApp (@MDAppMDApp) November 17, 2024 -
‘జరూసలేం’గా మారిన ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్’
మంగళూరు: ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగున్న యుద్ధం రోజురోజుకూ మరింత ముదురుతోంది. ఇటీవల కొందరు పాలస్తీనాకు మద్దతుగా ఊరేగింపు చేపట్టి, తమ నిరసనను వ్యక్తం చేశారు. కర్నాటకలోని మంగుళూరులో కూడా ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది.కర్నాటకలోని మూడ్‌బిద్రి-కిన్నిగోలి-కటీల్-ముల్కి మధ్య నడుస్తున్న ‘ఇజ్రాయెల్ ట్రావెల్స్' పేరుతో ఒక ప్రైవేట్ బస్సును లెస్టర్ కటీల్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. 12 ఏళ్లపాటు ఆయన తన కుటుంబంతో కలిసి ఇజ్రాయెల్‌లో ఉన్నాడు. ఇటీవలే ఇక్కడికి వచ్చిన ఆయన మంగళూరులో ఒక పాత బస్సును కొనుగోలు చేసి, ముల్కి మూడ్‌బిద్రి మార్గంలో నడుపుతున్నాడు. ఆయన ఇజ్రాయెల్ పై తనకున్న ప్రేమను తెలియజేసేందుకు ఆ బస్సుకు 'ఇజ్రాయెల్ ట్రావెల్స్' అనే పేరు పెట్టాడు. కటీల్‌లో నివాసముంటున్న లెస్టర్ కుటుంబం ఆ బస్సు నిర్వహణను చూసుకుంటోంది. కాగా 'ఇజ్రాయెల్' పేరుతో ఉన్న ఆ బస్సును చూసి పాలస్తీనా మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధం చేస్తున్న ఉగ్రవాద దేశమని, అలాంటప్పుడు మంగళూరులో ఆ బస్సుకు ఇజ్రాయెల్ పేరు ఎందుకు పెట్టారని వారు ప్రశ్నిస్తున్నారు. బస్సు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, ట్రోల్ చేయడమే కాకుండా, ఈ వ్యవహారంపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు కూడా బస్సు పేరు మార్చాలని యజమానికి సూచించారు. దీంతో బస్సు పేరును‘జెరూసలేం ట్రావెల్స్'గా మార్చారు. ఇది కూడా చదవండి: ల్యాండవుతున్న విమానంలో మంటలు -
‘బాస్! నేనూ వస్తా..’! ఆంబులెన్స్ వెనక దౌడుతీసిన కుక్క, వైరల్ వీడియో
మనిషికి,కుక్కకు మధ్య ఉన్న బంధం ఈనాటిది కాదు. విశ్వాసానికి మరో పేరుగా , గ్రామసింహంగా మనుషులతో పరస్పర సాన్నిహిత్యాన్ని కలిగి ఉండే పెంపుడు జంతువు శునకం. కాసింత గంజిపోసినా, ఏంతో విధేయతగా ఉంటుంది. తనను ఆదరించిన యజమాని కొండంత ప్రేమను చాటుతుంది. అవసమైతే ప్రాణాలు కూడా ఇస్తుంది. ఇందులో ఎలాంటి సందేహంలేదు. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఈ వైరల్ వీడియో గురించి తెలుసుకుందాం పదండి! A dog was running after the ambulance that was carrying their owner. When the EMS realized it, he was let in. ❤️ pic.twitter.com/Tn2pniK6GW— TaraBull (@TaraBull808) September 12, 2024అనారోగ్యంతో ఉన్న ఒక వ్యక్తిని ఆంబెలెన్స్లో ఆసుపత్రికి తరలిస్తుంన్నారు. అలా వెళ్తున్న యజమానానిని చూసి కుక్క మనసు ఆగలేదు. అంబులెన్స్‌ను అనుసరిస్తూ పోయింది. చివరికి దాని ఆత్రం, ఆరాటాన్ని చూసిన ఆంబులెన్స్ డ్రైవర్కూడా చలిచించిపోయాడు. వెంటనే వెహికల్ ఆపి ఆగి దాన్ని కూడా ఎక్కించుకున్నాడు. దీనికి సంబంధించి వీడియో ఎక్స్‌లో తెగ వైరలవుతోంది. తారా బుల్ అనే ట్విటర్ యూజర్ షేర్ చేసిన 27 సెకన్ల వీడియో దాదాపు 80 లక్షల వ్యూస్‌ను దక్కించుకుంది. ఈ దృశ్యాలను ఒక ద్విచక్రవాహనదారుడు వీడియో తీశాడు. ఇది నెటిజన్ల మనసులకు బాగా హత్తుకుపోయింది. చాలామంది కుక్క ప్రేమను, యజమానిపై దానికున్న విధేయతను ప్రశంసించారు. మరి కొందరు మూగజీవి ఆవేదన అర్థం చేసుకున్నాడంటూ డ్రైవర్ మంచి మనసును మెచ్చుకోవడం విశేషం. (కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!)పెంపుడు జంతువుల్లో మేటి కుక్క. యజమానిని కాపాడటం కోసం, యజమాని ఇంట్లో పిల్లలకోసం ప్రాణలను సైతం లెక్క చేయకుండా పోరాడి, ప్రాణాలను సైతం కోల్పోయిన ఘటనలు కోకొల్లలు. ఒంటరి జీవులకు తోడుగా నిలుస్తుంది. ఆసరాగా ఉంటుంది. అసలు ఒక కుక్కను పెంచు కోవాలనే ఆలోచనలోని అర్థం పరమార్థం ఇదే. అంతేకాదు యజమానులు కూడా తమ డాగీ అంటే ప్రాణం పెట్టే వారే. ఎంత ప్రేమ అంటే దాన్ని కుక్క అనడం కూడా వాళ్లకి నచ్చదు. దానికి పెట్టిన పేరుతోనే పిలవాలి. ఇంట్లో మనిషిలాగా, చంటిపిల్లకంటే ఎక్కువగా సాదుకుంటారు. ఏ చిన్న అనారోగ్యం వచ్చినా అల్లాడి పోతారు. చనిపోతే భోరున విలపిస్తారు. అంత్యక్రియలు నిర్వహిస్తారు. అంతేకాదండోయ్.. డాగీలకు పుట్టినరోజులు, సీమంతాలు ఘనంగా చేసే వారూ ఉన్నారు. (ఎమిలి ఐడియా అదుర్స్, బనానా వైన్!) -
దేశంలో ఖరీదైన కారు ఈయన దగ్గరే.. ఇప్పుడు మరో కారు..
దేశంలో అత్యంత ఖరీదైన కార్లు ఉన్న వ్యాపారవేత్తల గురించి మాట్లాడేటప్పుడు ముఖేష్ అంబానీ, గౌతమ్ సింఘానియా, రతన్ టాటా వంటి పేర్లు మాత్రమే వినిపిస్తాయి. అయితే భారత్‌లో అత్యంత ఖరీదైన కారు వీఎస్ రెడ్డి అనే వ్యాపారవేత్త దగ్గర ఉంది.బెంట్లీ ముల్సానే ఈడబ్ల్యూబీ సెంటినరీ ఎడిషన్ దేశంలో అత్యంత ఖరీదైన కారు. దీని ధర రూ .14 కోట్లు. ముఖేష్ అంబానీ, రతన్ టాటా, గౌతమ్ సింఘానియా వంటివారి వద్ద ఉన్న రోల్స్ రాయిస్, ఫెరారీ కార్ల కంటే దీని ధర ఎక్కువ. దీని ఓనర్ వీఎస్ రెడ్డి ఇప్పుడు రూ .3.34 కోట్లు పెట్టి కొత్త మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680 కారు కొన్నారు.మెర్సిడెస్-మేబాచ్ ఎస్ 680.. మేబాచ్ ఎస్-క్లాస్ ప్రీమియం వెర్షన్. ఇందులో 6.0-లీటర్ టర్బోఛార్జ్డ్ వి12 ఇంజన్ ఉంది. ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్‌తో ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 610బీహెచ్పీ పవర్, 900ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేస్తుంది.ఎవరీ వీస్ రెడ్డి అంటే..ప్రముఖ న్యూట్రాస్యూటికల్ కంపెనీల్లో ఒకటైన బ్రిటిష్ బయోలాజికల్స్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ డైరెక్టరే వీఎస్ రెడ్డి. 'ది ప్రోటీన్ మ్యాన్ ఆఫ్ ఇండియా'గా పేరొందిన కర్ణాటకకు చెందిన వీఎస్ రెడ్డి పలు జాతీయ, అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. తాను ఆటోమోటివ్ ఔత్సాహికుడినని, దేశంలోని అన్ని బ్రాండ్ల కార్లు తన వద్ద ఉండాలనుకుంటానని ఈవీవో ఇండియా మ్యాగజైన్‌తో మాట్లాడుతున్న సందర్భంగా వీఎస్ రెడ్డి చెప్పారు. -
మేడ్చల్‌లో పట్టపగలే ముసుగు దొంగల బీభత్సం.. జ్యువెలరీ షాప్‌లో చొరబడి..
సాక్షి, మేడ్చల్: పట్టపగలే బంగారం షాపు యజమానిపై కత్తితో దాడి చేసిన ఘటన సంచలనం సృష్టించింది. జ్యువెలరీ షాపులోకి చొరబడిన ఇద్దరు దొంగలు షాప్ యజమానిని కత్తితో పొడిచి గల్లాపెట్టెలోని డబ్బులతో పరారయ్యారు. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా చోరుల ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు.మేడ్చల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని శేషారాం అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. మధ్యాహ్నం.. షాపులో కస్టమర్లు లేని సమయంలో ఇద్దరు దొంగలు చొరబడ్డారు. ఒక వ్యక్తి బుర్ఖా ధరించి ఉండగా.. మరో దుండగుడు హెల్మెట్ ధరించి ఉన్నాడు. యజమాని శేషారాంను కత్తితో పొడిచి నగదుతో ఉడాయించారు. ఈ ఘటన అంతా సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. శేషారాంను ఆస్పత్రికి తరలించగా, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
రాజ్‌కోట్ గేమ్‌జోన్: మిస్సింగ్ అనుకున్నారు.. ప్రకాశ్ కూడా మృతి
గాంధీనగర్: రాజ్‌కోట్‌లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనలో టీఆర్పీ గేమ్‌జోన్‌కు చెందిన ఒక సహ యజమాని మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. శనివారం టీఆర్పీ గేమ్‌జోన్‌లో చోటుచేసుకున్న భారీ అగ్ని ప్రమాదంలో 28 మంది మృతి చెందారు. అగ్ని ప్రమాదానికి సంబంధించి టీఆర్పీ గేమ్‌జోన్ ఓనర్లపై ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా యజమానుల్లో ఒకరైన ప్రకాశ్ హిరాన్ అదే అగ్ని ప్రమాదంలో మృతి చెందినట్లు పోలీసులు ధ్రువీకరించారు. అగ్ని ప్రమాదం జరిగినప్పటి నుంచి తన సోదరుడు కనిపించడం లేదని ప్రకాశ్ హిరాన్ సోదరుడు జితేంద్ర హిరాన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫోన్ నంబర్లు కూడా స్వీచ్ ఆఫ్ వస్తున్నాయిని చెప్పారు. అగ్ని ప్రమాదం జరిగిన స్థలంలోనే ప్రకాశ్ కారు ఉన్నట్లు జితేంద్ర పోలీసులకు తెలిపారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలో ప్రకాశ్ ఉన్న దృశ్యాలు కనిపించాయి. దీంతో డీఎన్ఏ టెస్ట్ చేసిన అగ్ని ప్రమాదంలో మృతి చెందినవారిలో తన సోదరుడిని కనిపెట్టాలని జీతేంద్ర పోలీసులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ తల్లి డీఎన్ఏను తీసుకుని మృతదేహాలతో పోల్చి ప్రకాశ్ హిరాన్ మృతి చెందినట్లు ప్రకటించారు. టీఆర్పీ గేమ్‌జోన్‌లో ప్రకాశ్ హిరాన్ ప్రధానమైన షేర్ హోల్డర్‌గా ఉన్నారు. టీఆర్పీ గేమ్‌జోన్‌ను నిర్వహిస్తున్న ధావల్ ఠాకూర్‌తోపాటు మరో ఐదుగురిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. అందులో రేస్‌వే ఎంటర్ప్రైజెస్ పార్ట్నర్లు యువరాజసింగ్, రాహుల్ రాథోడ్, టీఆర్పీ గేమ్ జోన్ మేనేజర్ నితిన్ జైన్ ఉన్నారు. -
నాడు నాలుగు రూపాయల జీతం.. నేడు 22 రెస్టారెంట్లకు యజమాని!
ఎవరైనా సరే జీవితంలో ఎదగాలని గట్టిగా నిర్ణయించుకుని, అందుకు అనుగుణంగా పనిలోకి దిగితే వారి విజయాన్ని ఎవరూ ఆపలేరని అంటుంటారు. అటువంటి వారిని ఆర్ధిక ఇబ్బందులు కూడా ఏమీ చేయలేవని చెబుతుంటారు. కర్ణాటకలోని ఓ కుగ్రామానికి చెందిన సురేష్ పూజారి తాను ఏదో ఒకరోజు 22 రెస్టారెంట్లకు యజమానిని అవుతానని ఎన్నడూ అనుకోలేదు. సురేష్‌ను బాల్యంలోనే కష్టాలు చుట్టుముట్టాయి. చదువు కొనసాగించేందుకు కుటుంబ పరిస్థితులు సహకరించలేదు. అవి 1950 నాటి రోజులు.. పదేళ్ల వయసులోనే సురేష్ పూజారి కూలీగా మారాడు. ఊరిలో పెద్దగా పనులు దొరకకపోవడంతో ముంబైకి తరలివచ్చాడు. అప్పట్లో సురేష్‌కు ముంబై గురించి ఏమీ తెలియదు. ఎలాగోలా ఓ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న చిన్న దాబాలో ఉద్యోగం సంపాదించాడు. రోజంతా అక్కడ పనిచేసినందుకు సురేష్‌కు నెలకు నాలుగు రూపాయలు అందేది.. అక్కడ రెండేళ్లు పనిచేశాడు. తర్వాత అతనికి తెలిసిన వ్యక్తి జ్యూస్ షాపులో ఉద్యోగం ఇప్పించాడు. జీతం పెద్దగా పెరగలేదు. కానీ అక్కడ పనిలో నైపుణ్యాలను నేర్చుకున్నాడు. కొద్ది రోజుల్లోనే సురేష్‌కు ఓ క్యాంటీన్లో ఉద్యోగం వచ్చింది. జీతం ఆరు రూపాయలకు పెరిగింది. చదువు లేకుండా ముందుకు సాగడం కష్టమని అర్థం చేసుకున్నాడు. దీంతో రాత్రిపూట పాఠశాలకు వెళుతూ 9వ తరగతి వరకు చదువుకున్నాడు. తన దగ్గరున్న కొద్దిపాటి సొమ్ముతో గిర్గామ్ చౌపటీ సమీపంలో సురేష్ ఒక చిన్న పావ్ భాజీ దుకాణాన్ని తెరిచాడు. నాటి ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు జార్జ్ ఫెర్నాండెజ్ ఒకసారి తన సురేష్ దుకాణంలో పావ్ భాజీ రుచి చూశారు. ఆ రుచి అతనికి బాగా నచ్చడంతో మళ్లీ మళ్లీ అక్కడికి రావడం మొదలుపెట్టారు. జార్జ్ ఫెర్నాండెజ్, సురేష్ పూజారి స్నేహితులు అయ్యారు. తదనంతర కాలంలో సురేష్ తయారు చేసే పావ్ భాజీకి జనం నుంచి అమితమైన ఆదరణ లభించింది. దీంతో ఆయన క్రమంగా తన వ్యాపారాన్ని విస్తరించారు. కొద్ది కాలంలోనే అతని దుకాణాలు దేశంలోని అనేక ప్రాంతాలకు విస్తరించాయి. నేడు సురేష్ పూజారి నెలకొల్పిన ‘సుఖ్ సాగర్’ రెస్టారెంట్ల గురించి తెలియనివారుండరు. దేశంలో 22కు మించిన సుఖ్ సాగర్ రెస్టారెంట్ బ్రాంచీలు ఉన్నాయి. సుఖ్ సాగర్ రెస్టారెంట్ దక్షిణ భారత ఆహారాలకు తోడు పావ్ భాజీ, పంజాబీ ఆహారాలకు ప్రసిద్ధి చెందింది. ఐస్‌క్రీమ్ పార్లర్, షాపింగ్ మాల్, త్రీస్టార్ హోటల్ యజమానిగా సురేష్ పూజారి మారారు. బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ సహా పలువురు స్టార్స్ సుఖ్ సాగర్ రెస్టారెంట్ రుచులను మెచ్చుకున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని దాటుకుంటూ, వ్యాపారంలో విజయం సాధించిన సురేష్ పూజారి యువతకు స్ఫూర్తిదాయకుడనడంలో ఏమాత్రం సందేహం లేదు. -
IPL 2024: ఫ్రాంఛైజీ ఓనర్ల పేర్లు తెలుసా? వీరు స్పెషల్ అట్రాక్షన్!
-
124 ఏళ్ల భవనం కూల్చివేతకు నోటీసు.. కోర్టును ఆశ్రయించిన యజమాని!
ముంబైలోని ‘సాత్ బంగ్లా’ అనే ప్రాంతం ఎంతో ప్రసిద్ధి చెందింది. సుమారు 124 సంవత్సరాల క్రితం ఇక్కడ ఏడు బంగ్లాలు నిర్మించారు. వాటిలో ఇప్పుడు రెండు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు వాటిలో ఒకదానిని కూల్చివేసేందుకు బీఎంసీ సిద్ధమవుతోంది. దీంతో భవన యజమాని కోర్టును ఆశ్రయించారు. సముద్రతీరానికి దగ్గరలో నిర్మించిన ఈ బంగ్లాలో పలు గదులు, గ్లాస్ వర్క్‌తో కూడిన హాలు, ఇటాలియన్ మార్బుల్ ఫ్లోరింగ్‌లు, బసాల్ట్ స్టోన్ ఫ్లోరింగ్ ఉన్నాయి. ఈ బంగ్లాను ‘1900 ఏడీ’లో నిర్మించినట్లు ఆధారాలున్నాయి. ఈ భవనం చరిత్రకు ఆనవాలుగా నిలిచింది. కాగా గత ఫిబ్రవరి 29న రతన్ కుంజ్ పేరుతో ఉన్న ఈ భవనాన్ని కూల్చివేయనున్నట్లు బీఎంసీ దాని యజమానికి నోటీసు జారీ చేసింది. ఈ భవనం శిథిలావస్థలో ఉందని, కూలిపోయే అవకాశం ఉందని ఆ నోటీసులో పేర్కొంది. అయితే ఈ ఆస్తి సహ యజమానులు షాలు రాహుల్ బరార్‌తో పాటు అతని ఇద్దరు కుమారులు ఈ నోటీసు వెనుక కుట్ర ఉందని ఆరోపిస్తూ కోర్టును ఆశ్రయించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ‘మా ఆడిట్, ఇన్‌టేక్ నివేదికలో ఈ ఆస్తిని భద్రంగా చూస్తామని పేర్కొన్నాం. భవనానికి మరమ్మతులు చేశాం. ఈ కూల్చివేత నోటీసు మాకు పెద్ద దెబ్బ లాంటిది. మా చివరి శ్వాస వరకూ ఈ బంగ్లాను కాపాడుకునేందుకు పోరాడుతాం’ అని పేర్కొన్నారు. ఒకప్పుడు ఈ బంగ్లాను ‘తలాటి బంగ్లా’ అని పిలిచేవారు. సొరాబ్జీ తలాటి పార్సీ కుటుంబం దీనికి ఈ పేరు పెట్టింది. 1896లో దేశంలో ప్లేగు వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ ‘ఏడు బంగ్లాలు’ నిర్మితమయ్యాయి. ఈ భవనం పూర్వ యజమానులు గ్వాలియర్ మహారాజా, కచ్ మహారాజా, దాదాభాయ్ నౌరోజీ, రుస్తమ్ మసాని, సొరాబ్జీ తలాటి, చైనాస్, ఖంబటాస్. ఇటువంటి వారసత్వ సంపదను కాపాడుకోవడం అవసరమని ఆ కుటుంబ సభ్యులు అంటున్నారు. దీనిని చారిత్రక భవనాలు జాబితాలో చేర్చాలని వారు కోరుతున్నారు. -
Rameshwaram Cafe Bomb Blast: రవ్వ ఇడ్లీ తీసుకుని, ‘బ్యాగు’ను వదిలి..
బెంగళూరులోని రామేశ్వరం కేఫ్‌లో బాంబు పేలుడుకు సంబంధించిన ఆసక్తికర మరో అప్డేట్ ముందుకు వచ్చింది. అనుమానితుడు తన బ్యాగ్‌ను రెస్టారెంట్లో ఉంచే ముందు, రవ్వ ఇడ్లీని తీసుకోవడం చూశానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు మీడియాకు తెలిపారు. రామేశ్వరం కేఫ్ వైట్‌ఫీల్డ్ అవుట్‌లెట్‌లో పేలుడుకు దారితీసిన సంఘటనల క్రమాన్ని దివ్య రాఘవేంద్రరావు వివరిస్తూ ‘పేలుడు జరిగినప్పుడు నా మొబైల్ ఫోన్ నా దగ్గర లేదు. నేను దానిని తీసుకోగానే, దానిలో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. నేను మా సిబ్బందికి కాల్ చేయగా, వారు రెస్టారెంట్లో పేలుడు జరిగిందని చెప్పారు. తొలుత వంటగదిలో ఏదో కారణంగా పేలుడు సంభవించిందని అనుకున్నాను. కానీ వంటగదిలో పేలుడుకు సంబంధించిన ఆనవాళ్లు లేవు. దీంతో కస్టమర్లున్న ప్రాంతంలో పేలుడు జరిగిందని గుర్తించాం. సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాక మాస్క్, మఫ్లర్ ధరించిన ఓ వ్యక్తి బిల్లింగ్ కౌంటర్ వద్దకు వచ్చి, రవ్వ ఇడ్లీ ఆర్డర్ చేసినట్లు కనిపించింది. Bengaluru cafe blast suspect caught on CCTV. Wearing a cap 👇#RameshwaramCafe#BengaluruBlast pic.twitter.com/NjlnEiAOzL — Stranger (@amarDgreat) March 2, 2024 అతను ఆర్డర్ తీసుకున్న తర్వాత ఒక మూలన కూర్చున్నాడు. ఆ ఇడ్లీలను తీనేశాక, రెస్టారెంట్ నుండి బయటకు వెళ్లే ముందు బ్యాగ్‌ను ఒక మూలన ఉంచాడు. ఇది జరిగిన కొద్ది సమయానికే పేలుడు సంభవించింది. అదృష్టవశాత్తూ పేలుడు జరిగిన చోట సిలిండర్లు లేవు. నేను ఇటీవలే బిడ్డకు జన్మనిచ్చాను. రామేశ్వరం కేఫ్, ఈమధ్యనే పుట్టిన నా బిడ్డ.. రెండింటిలో ఎలాంటి తేడా లేదు. మా అవుట్లెట్కు జరిగిన నష్టం తీవ్రంగా బాధిస్తోంది. రామేశ్వరం కేఫ్ త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి వస్తుంది. మరింత పటిష్టమైన భద్రతా వ్యవస్థతో పనిచేస్తుంది. కేఫ్ పేలుడులో ఎటువంటి ప్రాణ నష్టం జరగనందుకు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని కేఫ్ యజమాని దివ్య రాఘవేంద్రరావు పేర్కొన్నారు. -
ఉద్యోగం నుంచి పొమ్మన్న బాస్.. ప్రైవేట్ వీడియోతో ప్రతీకారం తీర్చుకున్న యువతి!
పంజాబ్‌లోని జలంధర్‌లో అశ్లీల వీడియో వైరల్ అయిన ఉదంతం ఒకటి చోటుచేసుకుంది. స్థానికంగా పిజ్జాషాప్ నిర్వహిస్తున్న ఒక జంటకు సంబంధించిన ప్రైవేట్ వీడియో వైరల్ అయిన నేపధ్యంలో దీనిపై పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయ్యింది. ఈ వీడియో ఫేక్ అని, దానిని ఎడిట్ చేశారని ఆ దంపతులు చెబుతున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఒక యువతిని పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ యువతి గతంలో ఇదే పిజ్జాషాపులో పనిచేసేది. ఆ యువతి యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇటువంటి పనిచేసిందని పోలీసులు తెలిపారు. మీడియాకు అందిన సమాచారం ప్రకారం కొన్ని నెలల క్రితం జలంధర్‌కు చెందిన ఒక జంట పిజ్జా షాప్ ప్రారంభించింది. అయితే ఇటీవల ఈ జంటకు సంబంధించిన ఒక ప్రైవేట్ వీడియో వైరల్ అయ్యింది. దీనిపై ఆ జంట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో దుకాణదారు తమ ప్రైవేట్ వీడియోను ఎవరో ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి, రూ. 20 వేలు డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ సొమ్ము ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపారు. ఈ మధ్య నాలుగు వీడియోలు వైరల్ చేశారని, వాటిలో ఒక వీడియో అభ్యంతరకరంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ ఉదంతంలో పోలీసులు ఒక యువతితోపాటు, ఒక అజ్ఞాత వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా పోలీసు అధికారి నిర్మల్ సింగ్ మాట్లాడుతూ ఈ కేసులో నిందితురాలిని తనీషాగా గుర్తించామని, ఆమెను అరెస్టు చేశామని తెలిపారు. ఆమె గతంలో ఒక పిజ్జా షాపులో పనిచేసేదని, ఆమె పనితీరు నచ్చకపోవడంతో యజమాని ఆమెను పనిలో నుంచి తీసేశారని, దీంతో ఆమె యజమానిపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేక్ ఐడీ క్రియేట్ చేసి, ఆ దుకాణయజమాని దంపతులకు చెందిన ప్రైవేట్ వీడియో వైరల్ చేసిందని తెలిపారు. అలాగే రూ. 20 వేలు కావాలంటూ డిమాండ్ చేసిందన్నారు. కేసు దర్యాప్లు చేస్తున్నామని తెలిపారు. ఇది కూడా చదవండి: ‘ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావ్’.. వంటలక్క చైనా తమ్ముడివా? -
బీబీసీ యజమాని ఎవరు? సంస్థకు సొమ్ము ఎలా వస్తుంది?
గత ఫిబ్రవరిలో ఆదాయపు పన్ను శాఖ బృందం ‘సర్వే’ కోసం బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) కార్యాలయాలను పరిశీలించింది. ఢిల్లీ, ముంబైలలోని బీబీసీ కార్యాలయాల్లో పరిశీలనలు మాత్రమే జరుగుతున్నాయని, సోదాలు చేయడం లేదని (సీబీడీటీ )సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ సీనియర్ అధికారి ఒకరు నాడు స్పష్టం చేశారు. అయితే ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అవకతవకలను తనిఖీ చేసేందుకు పన్ను అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నట్లు అప్పట్లో మరో అధికారి తెలిపారు. ‘ఇండియా: ది మోదీ క్వశ్చన్' అనే డాక్యుమెంటరీని బీబీసీ ప్రసారం చేసిన కొన్ని వారాల తర్వాత ఐటీ అధికారులు ఈ చర్యలు చేపట్టడం విశేషం. అలాగే భారత ప్రభుత్వం బీబీసీ వలసవాద మనస్తత్వం కలిగి ఉందని ఆరోపించింది. యజమాని ఎవరు? బీబీసీ 1922, అక్టోబరు 18 న ఒక ప్రైవేట్ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పట్లో దీనిని బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా పిలిచేవారు. ప్రారంభంలో ఈ వ్యాపారంలో తనను తాను నిరూపించుకోవడానికి బీబీసీ ఎన్నో కష్టాలు పడింది. 1926 సార్వత్రిక సమ్మె సమయంలో విస్తృతమైన కవరేజ్ అందించి, బీబీసీ బ్రిటిష్ ప్రజల ఆదరణను చూరగొంది. అదే సంవత్సరంలో, పార్లమెంటరీ కమిటీ సిఫార్సు ద్వారా బీబీసీ ప్రైవేట్ కంపెనీ నుండి పబ్లిక్ కార్పొరేషన్‌గా మార్పుచెందింది. దీనితో కంపెనీ.. పార్లమెంటుకు జవాబుదారీతనం కలిగివుండాలని నిర్ణయించారు. కానీ బీబీసీ దాని పని తీరు విషయంలో స్వతంత్రంగా వ్యవహరిస్తుంది. బీబీసీని జాన్ రీత్ (1889–1971) స్థాపించారు. 1922లో బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీగా సంస్థను స్థాపించినప్పుడు దాని మొదటి జనరల్ మేనేజర్‌గా, 1927లో పబ్లిక్ కార్పొరేషన్‌గా మారినప్పుడు దాని మొదటి డైరెక్టర్ జనరల్‌గా వ్యవహరించారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో నాజీ ప్రచార సాధనాలను ఎదుర్కొనేందుకు బ్రిటిష్ ప్రభుత్వం మరో సమాచార మంత్రిత్వ శాఖను సృష్టించింది. దీనికి జాన్ రీత్ను సమాచార మంత్రిగా నియమించింది. ఐరోపాలో హిట్లర్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేయడం, బ్రిటిష్ ప్రజలను మానసికంగా యుద్ధానికి సిద్ధం చేయడం అతని పనిగా ఉండేది. డబ్బు ఎక్కడ నుండి వస్తుంది? బీబీసికి వచ్చే నిధులలో ఎక్కువ భాగం వార్షిక టెలివిజన్ ఫీజు ద్వారా వస్తుంది. ఇదే కాకుండా, బ్రిటన్ పార్లమెంట్ కూడా బీబీసీకి గ్రాంట్ల ద్వారా నిధులు సమకూరుస్తుంది. బీబీసీకి ఇతర ఆదాయ వనరులు బీబీసీ స్టూడియోస్, బీబీసీ స్టూడియోవర్క్స్. భారతదేశంలో ఎప్పుడు ప్రారంభమైంది? బీబీసీ భారతదేశంలో రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1940 మే 11న ప్రారంభమైంది. విశేషమేమిటంటే, ఈ తేదీన విన్స్టన్ చర్చిల్ బ్రిటన్ ప్రధానమంత్రి అయ్యారు. భారతదేశంలో బీబీసీని ప్రారంభించడం వెనక ఉద్దేశ్యం భారత ఉపఖండంలోని సైనికులకు వార్తలను అందించడమే. బీబీసీ హిందీ డాట్ కామ్ 2001లో ప్రారంభమమైంది. ఇది కూడా చదవండి: అమేథీతో గాంధీ- నెహ్రూ కుటుంబానికున్న సంబంధం ఏమిటి? -
భార్యాపిల్లలపై ప్రేమ.. రూ. 90 కోట్ల అదృష్టం తెచ్చిపెట్టింది!
అతను ఉద్యోగ రీత్యా భార్యాపిల్లలకు దూరంగా ఉంటున్నాడు. దీంతో తరచూ అతనికి భార్యాపిల్లలు గుర్తుకురాసాగారు. ఈ నేపధ్యంలో అతను చేసిన ఒకపని అతనిని రాత్రికి రాత్రే కోటీశ్వరుడిని చేసింది. అదికూడా ఒకటో రెండో కాదు.. ఏకంగా 90 కోట్లకు యజమానిగా మారిపోయాడు. ఈ విషయాన్ని అతను కుటుంబ సభ్యులు అతనికి తెలియజేసినప్పుడు వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ ఉదంతం చైనాలోని హాంగ్ఝూలో చోటుచేసుకుంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం 30 ఏళ్ల ఈ వ్యక్తి ఇంటికి దూరంగా ఉంటూ జాబ్ చేస్తుంటాడు. అతను ఇంటికి రావడం కూడా తక్కువే. దీంతో అతనికి భార్యాపిల్లలు తరచూ గుర్తుకొస్తుంటారు. ఈ నేపధ్యంలో అతను తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబర్లతో లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేసేవాడు. ఈ వ్యవహారం చాలా రోజులుగా నడుస్తుండేది. అయితే ఇప్పుడు అతనికి అదృష్టం తన్నుకుంటూ వచ్చింది. ఆయన కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ ఇప్పుడు కోట్లు కొల్లగొట్టింది. ఆ అదృష్టవంతుని పేరు వెల్లడికానప్పటికీ హాంగ్ఝూకు చెందిన ఆ వ్యక్తి తన భార్యాపిల్లల డేట్ ఆఫ్ బర్త్ నంబరుతో కొనుగోలు చేసిన లాటరీ టిక్కెట్ సిరీస్.. 77 మిలియన్ల యువాన్లు(రూ. 90 కోట్లకు పైగా మొత్తం) గెలుచుకుంది. ఆ వ్యక్తి ఈ నెల మొదట్లో రూ. 300 వెచ్చించి 15 లాటరీ టిక్కెట్లు కొనుగోలు చేశాడు. 11న లాటరీ ఫలితాలు వెలువడగా, అతను 77.1 మిలియన్ల యువాన్లు గెలుచుకున్నాడు. ఈ ఉదంతానికి సంబంధించిన పోస్టు చూసిన నెటిజన్లు అదృష్టం ఎప్ప్పుడు, ఎవరిని ఎలా వరిస్తుందో ఎవరూ చెప్పలేరన్నారు. ఇది కూడా చదవండి: ఆ నీలి కళ్ల చాయ్‌వాలా.. మోడలింగ్ తర్వాత లండన్‌లో మొదలెడుతున్న పని ఇదే.. -
ప్రపంచంలో అతి పెద్ద నివాసం భారత్‌లోనే.. యజమాని ఈయనే..
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం భారత్‌లోనే ఉందన్న విషయం మీకు తెలుసా? గుజరాత్ రాష్ట్రంలోని వడోదరా ప్రాంతంలో ఉంది. బరోడా గైక్వాడ్స్ యాజమాన్యంలో ఉన్న లక్ష్మీ విలాస్ ప్యాలెస్ (Laxmi Vilas Palace) ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ నివాసం. ఇది ఇంగ్లండ్ రాజ కుటుంబీల నివాసమైన బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే చాలా రెట్లు పెద్దది. 500 ఎకరాల విస్తీర్ణం లక్ష్మీ విలాస్ ప్యాలెస్ బరోడా రాజ కుటుంబానికి చెందిన నివాసం. ఈ ప్యాలెస్ 500 ఎకరాల్లో విస్తరించి ఉంది. 19వ శతాబ్దపు ఇండో-సార్సెనిక్ కాలంలో రూ. 60 లక్షల వ్యయంతో నిర్మించారు. ఇప్పటి వరకు నిర్మించిన అతిపెద్ద ప్రైవేట్ నివాసాల్లో ఇదే అతి పెద్దది. ఇంగ్లండ్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ కంటే నాలుగు రెట్లు పెద్దది. ఆకట్టుకునే కళాకృతులు గుజరాత్‌లోని ఈ రాజ యుగం నాటి ప్యాలెస్‌లో విస్తృతమైన ఇంటీరియర్ డిజైన్లు ఆకట్టుకుంటాయి. మొజాయిక్లు, షాన్డిలియర్లు, కళాకృతులు, ఆయుధాలు, కళాకృతులు ఆకర్షిస్తాయి. అప్పటి బరోడా మహారాజు ప్రముఖ కళాకారుడు రాజా రవి వర్మను ప్రత్యేకంగా నియమించి పెయింటింగ్‌లు వేయించారు. విశాలమైన పార్క్ లాంటి మైదానాలు ఇందులో ఉన్నాయి. ఇందులో గోల్ఫ్ కోర్స్ కూడా ఉండటం విశేషం. ఈయనే యజమాని లక్ష్మీ విలాస్ ప్యాలెస్ యజమాని హెచ్ఆర్హెచ్ సమర్జిత్సిన్హ్ గైక్వాడ్ ( HRH Samarjitsinh Gaekwad). రంజిత్‌సిన్హ్ ప్రతాప్‌సిన్హ్ గైక్వాడ్, శుభంగినీరాజేల ఏకైక కుమారుడు. 1967 ఏప్రిల్ 25న జన్మించిన ఈయన మాజీ ఫస్ట్-క్లాస్ క్రికెటర్. డెహ్రాడూన్‌లోని ది డూన్ స్కూల్లో చదువుకున్నారు. సమర్జిత్సిన్హ్ తన తండ్రి మరణం తర్వాత 2012లో మహారాజుగా పట్టాభిషక్తుడయ్యారు. ఈ వేడుక లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో 2012 జూన్ 22న అట్టహాసంగా జరిగింది. 2013లో తన మామ సంగ్రామ్‌సింగ్ గైక్వాడ్‌తో పాత వారసత్వ వివాదాన్ని పరిష్కరించుకుని లక్ష్మీ విలాస్ ప్యాలెస్‌కు యజమాని అయ్యారు. రూ. 20,000 కోట్లకు పైగా ఆస్తి సంక్రమించింది. గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లోని బనారస్‌లో 17 దేవాలయాలను నిర్వహించే దేవాలయాల ట్రస్టు సమర్జిత్సిన్హ్ ఆధీనంలో ఉంది. 2014లో బీజేపీలో చేరిన ఈయన 2017 నుంచి రాజకీయాల్లో క్రియాశీలకంగా లేరు. సమర్జిత్సిన్హ్ వాంకనేర్ రాష్ట్ర రాజకుటుంబానికి చెందిన రాధికారాజేని వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు. -
ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!
M.A Yusuf Ali Car Collection: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' (Lulu Group International) అధినేత 'ఎమ్ఏ యూసఫ్ అలీ' (M.A Yusuf Ali) గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఈయన ఇండియాలోని సంపన్నుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే అనేక అన్యదేశ్యపు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో కూడా ఒకరు. యూసఫ్ అలీ గ్యారేజిలోని లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కేవలం సంపన్న వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ జాబితాలో యూసఫ్ అలీ ఉన్నారు. ఈయన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఘోస్ట్ కారుని కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఈయన గ్యారేజిలో ఉంది. యూసఫ్ అలీ కొనుగోలు చేసిన ఈ కారు వైట్ కలర్ పెయింట్ స్కీమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇతని వద్ద బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీటిని తన కుటుంబంతో పాటు ప్రయాణించడానికి ఉపయోగిస్తాడని తెలుస్తోంది. ఈ కార్లు కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండటం గమనార్హం. బెంట్లీ బెంటాయగా బెంట్లీ కంపెనీకి చెందిన బెంటాయగా వంటి విలాసవంతమైన SUV కూడా యూసఫ్ అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఇది కూడా కేరళ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. భారతదేశంలో మొట్ట మొదటి బెంట్లీ బెంటాయగా కొనుగోలు చేసిన వ్యక్తి యూసఫ్ అలీ కావడం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) రోల్స్ రాయిస్ కల్లినన్ ముఖేష్ అంబానీ వంటి కుబేరుల వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా యూసఫ్ అలీ గ్యారేజిలో ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే రోల్స్ రాయిస్ కార్లలో కల్లినన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఈ కారుని అతడు దుబాయ్‌లో ఉపయోగిస్తాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లతో పాటు యూసఫ్ అలీ మినీ కూపర్ కంపెనీకి చెందిన మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్-మేబ్యాక్ GLS, లెక్సస్ LX750, BMW 7-సిరీస్, మెర్సిడెస్-మేబ్యాక్ S600 వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజిలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే ధనవంతుల జాబితాలో యూసఫ్ అలీ ఖాన్ కూడా ఒకరుగా ఉన్నారు. -
గుజరాత్ టైటాన్స్ ఓనర్ ఎవరు ఆస్థి ఎన్ని లక్షల కొట్లో తెలుసా..!
-
ఓనర్ ఆస్తుల గురించి ఎవరికీ తెలియని విషయాలు..!
-
రూ.49 లక్షలు కళ్లజూడటంతో పట్టాలు తప్పిన బుద్ధి.. బ్యాంకులో వెయ్యమంటే
లక్నోకు చెందిన ఒక ఎలక్ట్రానిక్స్ కంపెనీ యజమాని తన డ్రైవరుకు రూ. 49 లక్షలు నగదునిచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయమని చెబితే ఆ డ్రైవర్ అతితెలివితేటలు ప్రదర్శించి డబ్బులతో సహా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో కంపెనీ యజమాని పోలీసులను ఆశ్రయించగా లక్నో పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టి హజరత్ గంజ్ లో నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. సినీ ఫక్కీలో చోరీకి ప్లాన్... ఆ మధ్య ఒక సినిమాలో హీరోని "నమ్మినవాడిని ఎలా మోసం చేశావ్?" అని అడిగితే, సదరు హీరో చాలా సింపుల్ గా నమ్మాడు కాబట్టే మోసం చేశానని అంటాడు. దీన్నే ఆచరణలో పెట్టి లక్నోకు చెందిన ఓ డ్రైవర్ తనను నమ్మిన యజమానిని మోసం చేసి డబ్బు చోరీ చేయాలని పథకం రచించాడు. రంగంలోకి పోలీసులు... ఒక పెద్ద ఎలక్ట్రానిక్స్ కంపెనీలో డ్రైవరుగా పనిచేస్తోన్న రాహుల్ కు ఆ కంపెనీ యజమాని రూ. 49 లక్షలు ఉంచిన రెండు బ్యాగులను ఇచ్చాడు. ఊహించని విధంగా భారీమొత్తంలో డబ్బు చేతికందడంతో ఆ డ్రైవరుకు బుద్ధి పట్టాలు తప్పింది. ఎంత కష్టపడినా ఇంత పెద్ద మొత్తంలో డబ్బుని సంపాదించడం కష్టం అనుకుని అప్పటికప్పుడు డబ్బుతో సహా ఊరు దాటే ప్రయత్నం చేశాడు. అంతలోనే కంపెనీ యజమాని పోలీసు కంప్లైంట్ ఇవ్వగా... రంగంలోకి దిగిన పోలీసులు సీసీ కెమెరాలను జల్లెడపట్టి లక్నో నడిబొడ్డున ఉన్న హజరత్ గంజ్ వద్ద పార్కింగ్ చేసి ఉన్న కారుని గుర్తించారు. పోలీసు బలగాలు హుటాహుటిన అక్కడికి చేరుకొని కారులోనే ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడు దోచుకున్న మొత్తం సొమ్మను రికవర్ చేసినట్లు తెలిపారు లక్నో డీసీపీ వినీత్ జైస్వాల్. బ్లాక్ మనీ కాబట్టి కంప్లైంట్ ఇవ్వరనుకున్నా... ఎలక్ట్రానిక్స్ కంపెనీ యజమాని పూర్వ భుగ్రా ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా హజరత్ గంజ్ పోలీస్ స్టేషన్లో యజమాని నమ్మకాన్ని వమ్ము చేసినందుకు IPC 408 సెక్షన్, నిజాయతీగా వ్యవహరించనందుకు IPC 411 సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు డీసీపీ. విచారణలో రాహుల్ చాలా ఆసక్తికరమైన విషయాలు బయటపెట్టాడు. నేను చాలా కాలంగా ఈ కంపెనీలో పనిచేస్తున్నాను. కంపెనీ టర్నోవర్ కోట్లలో ఉంది కాబట్టి నాకు ఇచ్చింది బ్లాక్ మనీ అయి ఉంటుందనుకున్నా. ఈ సొమ్మును దోచుకున్నా కూడా యజమాని ఎవ్వరికీ చెప్పుకోలేరనుకున్నానని అన్నాడు. కానీ యజమాని పోలీసులను ఆశ్రయించడంతో డ్రైవర్ ఖంగుతిన్నాడు. అత్యాశకు పోయినందుకు తగిన మూల్యం చెల్లించి కటకటాల పాలయ్యాడు. -
ఉద్యోగాలపై బారి వేటు అదిరి పోయే ప్యాకేజ్..
-
IPL 2023: గుజరాత్ టైటన్స్ ఓనర్ నెట్‌వర్త్ ఏకంగా రూ. 11 లక్షల కోట్లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2023 తుదిపోరులో హార్దిక్ పాండ్యా నేతృత్వంలోని గుజరాత్ టైటాన్స్,ఎంఎస్ ధోని నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో అహ్మదాబాద్, నరేంద్ర మోదీ స్టేడియంలో తలపడనున్నాయి. ఐపీఎల్ పదహారవ సీజన్ విజేత ఎవరనే ఉత్కంఠకు తోడు భారీ వర్షం మరింత టెన్షన్ రేపింది..చివరికి టైటిల్‌ను సీఎస్కే ఎగురేసుకపోయింది. ఇది ఇలా ఉంటే ఐపీఎల్లో 2022లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ ఓనరు ఎవరు, ఆదాయం ఎంత అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి. (ఐపీఎల్ ఫైనల్ విన్నర్ ఎవరంటే! ఆనంద్ మహీంద్ర కామెంట్, వైరల్ ట్వీట్) ఐపీఎల్ 2022 లక్నో ,అహ్మదాబాద్ టీమ్‌లు ఎంట్రీ ఇచ్చాయి. 25 అక్టోబర్ 2021 ఏర్పాటైన అహ్మదాబాద్ ఐపీఎల్ జట్టు గుజరాత్ టైటాన్స్ (జీటీ)ని యూరప్‌కు చెందిన ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ సీవీసీ క్యాపిటల్స్ రూ. 5625 కోట్లకు కొనుగోలు చేసింది. దీని చైర్మన్ స్టీవ్ కోల్ట్స్. స్టీవ్స్ స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకర్. ఈ కంపెనీ క్రీడలతో పాటు పెట్టుబడి బ్యాంకింగ్ , బ్రోకరేజ్ కార్యకలాపాలు నిర్వహిస్తుంది. (3 వేల ఉద్యోగాలు కట్: లగ్జరీ కార్‌మేకర్ స్పందన ఇది!) సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ పెద్ద అమెరికన్-ఫ్రెంచ్ ఈక్విటీ సంస్థ, 133 బిలియన్ యూరోల విలువైన ఆస్తులున్నాయి. దీని భారత కరెన్సీలో రూ. 11.98 లక్షల కోట్లకు పైగా ఉంది, ఇది క్రికెట్ లీగ్‌లోని మెజారిటీ ఐపీఎల్ జట్టు యజమానుల నికర విలువ కంటే చాలా పెద్దది. ఐపీఎల్ బిడ్ గెలిచిన తర్వాత, ముంబై ఇండియన్స్ మాజీ స్టార్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను కెప్టెన్‌గా ఎంచుకుంది. అలాగే స్టార్ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. (వదినా మరదళ్లతో అట్లుంటది: వారి హ్యాండ్ బ్యాగ్ ధర రూ. 21 లక్షలు) కాగా ఉత్కంఠభరితమైన ఫైనల్ మ్యాచ్‌లో సీఎస్కే గెలిచి అత్యధిక ఐపీఎల్ టైటిల్స్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌తో టై చేసింది.. 2022 అరంగేట్రంలో అదరగొట్టి అన్ని అంచనాలను అధిగమించి మరీ టైటిల్ దక్కించుంది జీటీ. -
Hyderabad: చికెన్ పకోడీలో కారం ఎక్కువైందన్నందుకు..
సాక్షి, హైదరాబాద్: చికెన్ పకోడీలో కారం ఎక్కువైందన్నందుకు వినియోగదారుడిపై పకోడి సెంటర్ నిర్వాహకుడు కత్తితో దాడికి పాల్పడిన సంఘటన బుధవారం రాత్రి కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన నాగార్జున బుధవారం రాత్రి 9వ ఫేజ్‌లోని జెఎస్ చికెన్ పకోడి సెంటర్‌కు వెళ్లి పకోడి తిన్నాడు. అయితే పకోడీలో కారం ఎక్కువగా ఉందంటూ నిర్వాహకుడు జీవన్‌కు చెప్పాడు. దీంతో అతను తింటే తిను లేదంటే వెళ్లిపో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అదే సమయంలో నాగార్జునను తీసుకెళ్లేందుకు అతని సోదరుడు ప్రణీత్ అక్కడికి వచ్చాడు. అప్పటికే ఇద్దరి మధ్య వివాదం ముదరడంతో పకోడీ సెంటర్ నిర్వాహకుడు జీవన్ కత్తితో నాగార్జునపై దాడికి యత్నించగా అడ్డుకోబోయిన ప్రణీత్ చేతి మణికట్టు పై భాగంలో తీవ్ర గాయమైంది. స్థానికులు ప్రణీత్‌ను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: పాక్‌లో కాల్పుల్లో 8 మంది టీచర్లు మృతి -
మందు తాగే మేక.. రోజూ మద్యం కోసం యాజమాని వద్ద నిలబడి
సాక్షి, యాదాద్రి జిల్లా: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం మోదుగకుంటకు చెందిన రైతు సోలిపురం రవీందర్ రెడ్డి పెంచుకుంటున్న ఓ మేకకు ఒకరోజు మద్యాన్ని పట్టించాడు. అప్పటినుంచీ ప్రతిరోజూ సాయంత్రంపూట రవీందర్ రెడ్డి మద్యాన్ని తాగినప్పుడల్లా మేక కూడా వచ్చి యజమాని వద్ద నిలబడుతుంది. దీంతో ప్రతిరోజూ మేకకు మద్యం తాగిస్తుండటంతో దానికి అలవాటుగా మారిపోయింది. మేక మద్యం తాగుతుండటాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. -
సావిత్రి గారి వల్లే నేను సక్సెస్ అయ్యాను: లలితా జువెల్లర్స్ ఎండీ
‘డబ్బులు ఊరికే రావు’ అనే డైలగ్‌తో తెలుగు రాష్ట్రాల్లో ఎంతో పాపులర్ అయ్యారు లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ కుమార్. తన బ్రాండ్‌కు తానే అంబాసిడర్‌గా వ్యవహరించి లలితా జ్యువెల్లరి ఆభరాలను ప్రమోట్ చేసుకున్నారు. వ్యాపారవేత్తగా సక్సెస్ అయి.. వేల కోట్లకు అధిపతి అయిన ఆయన మహానటి సావిత్రి గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. తాను ఇంత పెద్ద సెక్సెస్ అవ్వడానికి కారణం మహానటి సావిత్రి అని తాజాగా ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నారు. సావిత్రి ఇంట్లోనే వ్యాపారం ప్రారంభించానని, ఆమె వల్లే తాను సక్సెస్ అయ్యానన్నారు. చదవండి: యాంకర్ రష్మీ ఇంట తీవ్ర విషాదం కాగా ఆయన చెన్నైలోని మహానటి సావిత్రి ఇంటిని కొనుగోలు చేసి అక్కడ వ్యాపారం విస్తరించుకున్నారట. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సావిత్రిగారి ఇంటితో తనకు ఎమోషనల్ బాండింగ్ ఉందని, ఎంతో ఇష్టంతో సావిత్రి గారి ఆస్తిని కొన్నానని కిరణ్ కుమార్ తెలిపారు. సావిత్రి పేరు మీద ఆమె పిల్లలు అప్పట్లో ఒక కమర్షియల్ బిల్డింగ్ కట్టారని, అక్కడ షాప్ రెంట్‌కు తీసుకుని బంగారం షాప్ స్టార్ చేశానన్నారు. సావిత్రి గారి ఆశీర్వాదం వల్లే తన వ్యాపారం బాగా నడిచిందని, ఇప్పుడు తాను ఇంత పెద్ద సక్సెస్ అయ్యానని పేర్కొన్నారు. అందుకే ఇప్పటికీ ఆ ఇంటి పేరు ఆమెదే ఉందన్నారు. ఆ బిల్డింగ్ లలితా కార్పొరేట్ ఆఫీస్ అని రాశాము గానీ.. సావిత్రి గణేశన్ పేరు అలానే ఉంచామన్నారు. అయితే ఇటీవల ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించిన సావిత్రి కూతురు విజయ చాముండేశ్వరి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. అమ్మ ఆస్తి నుంచి వచ్చిన ఇల్లు అదేనని, దానిని పడగొట్టి ఓ కమర్షియల్ బిడ్డింగ్ కట్టామన్నారు. ‘దానిని లలితా జువెల్లర్స్ ఎండీ కిరణ్ రెంట్‌కు తీసుకుని షాప్ పెట్టారు. ఆయనకు బాగా కలిసి వచ్చింది. దాంతో మేం దానిని అమ్మాలకున్నప్పుడు తనకే ఇవ్వాలని కోరాడు. అందుకే ఆయనకు ఆ బిల్డింగ్ అమ్మేసి ప్రస్తుతం ఉంటున్న ఇంటిని కొనుక్కున్నాం’ అని చెప్పుకొచ్చారు. అనంతరం కిరణ్ కుమార్‌కే ఆ ఆస్తిని అమ్మడానికి ఓ కారణం ఉందని కూడా చెప్పారు. చదవండి: ‘మహానటి’ తర్వాత ఇంట్లో గొడవలు అయ్యాయి: సావిత్రి కూతురు ‘అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. కిరణ్ కుమార్‌ది బంగారం షాపే. అమ్మకు కార్ల పిచ్చి ఉన్నట్టే.. కిరణ్‌కి కూడా ఉంది. ‘‘అమ్మను ఆయన బాగా అభిమానిస్తారు. బిల్డింగ్ అమ్మిన తర్వాత ఎంట్రన్స్‌లో ఉన్న అమ్మ బొమ్మను తీసుకువెళ్తుంటే దానిని అక్కడే ఉంచాలని కోరాడు. ‘ఇది నేను కొన్నంత మాత్రానా ఈ ఆస్తి మీది కాకుండా పోదు. ఇక్కడి నుంచి ఏమైనా తీసుకువెళ్లండి. కానీ, సావిత్రి అమ్మ ఫొటో తీసుకు వెళ్లొద్దు’ అని కిరణ్ కోరాడు’ అని ఆమె చెప్పింది. అంతేకాదు తనని తమ్ముడిగా భావించమంటూ అక్కయ్య అని కిరణ్ అప్యాయంగా పిలుస్తారంటూ విజయ చాముండేశ్వరి తెలిపారు. -
కరుస్తోందని పెంపుడు కుక్కను చంపేసింది..ఆ తర్వాత పడేద్దామని వెళ్లి....
ఉత్తరప్రదేశ్ రాజధానిలో వింత ఘటన చేసుకుంది. పెంపుకుక్క దాడి చేస్తోందని హతమార్చి చెరువు వద్దకు వెళ్లి యజమానురాలు అనుహ్యంగా చనిపోయింది. ఈ ఘటన లక్నోలో తీవ్ర కలకలం రేపింది. వివరాల్లోకెళ్తే..రూబీ అనే మహిళ, భర్త ఇద్దరు పిల్లలతో కలిసి జీవిస్తోంది. వారి తోపాటు వారి పెంపుడు కుక్క కూడా ఉంటోంది. ఐతే శనివారం రాత్రి అనుహ్యంగా రూబీపై పెంపుడు కుక్క దాడి చేసింది. కానీ అది ఇలా దాడి చేయడం మొదటి సారి కాదు. అంతకుముందు తన కొడుకుపై కూడా దాడి చేసింది. దీంతో దానిపై కోపం వచ్చి చంపేసింది. ఆ తర్వాత ఆ కుక్క మృతదేహాన్ని చెరువులో పడేస్తానంటూ.. వెళ్లి ఆమె అనుహ్యంగా చెరువలో మునిగిపోయి చనిపోయింది. ఐతే ఆమె భర్త చెరువ వద్దకు వెళ్లి రూబీ ఎంతకు తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చి.. చెరువ వద్దకు వెళ్లగా అక్కడ రూబీ చెప్పులు మాత్రమే ఉన్నాయి గానీ ఆమె కనిపించలేదు. దీంతో రూబీ భర్త ఆమె చెరువులో పడిపోయిందేమోనన్న భయంతో గ్రామస్తుల సాయం కోరగా..వారిలో కొందరూ గాలించి రూబీ మృతదేహాన్ని చెరువులోంచి బయటకు తీశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు రూబీ మృతదేహ్నాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, ఆమె భర్త నుంచి వాగ్ములం సేకరించి దర్యాప్తు ప్రారంభించారు. (చదవండి: హిమాచల్‌ప్రదేశ్‌లో కేబినేట్ విస్తరణ..7గురు మంత్రుల చేరికతో..) -
శబరిమలైలో విడిచిపెట్టినా..తిరిగొచ్చిన పావురం..బిత్తరపోయిన యజమాని
సాక్షి, దొడ్డబళ్లాపురం: సమాచారాన్ని చేరవేసుకోవడానికి ఇప్పుడయితే మొబైళ్లు, ఈ మెయిళ్లు ఉన్నాయి. కొన్నేళ్లక్రితం ఉత్తరాలు, టెలిగ్రాంలు ఉండేవి. అయితే అంతకంటే ముందు మహారాజుల కాలంలో ఇవేవీ ఉండేవి కావు. అందుకే పావురాళ్లను ఉత్తరాలు చేరవేసే పోస్టుమ్యాన్లుగా ఉపయోగించేవారు. కాలం మారినా పావురాళ్ల తెలివిలో తేడా రాలేదు. ఇందుకు చక్కటి ఉదాహరణగా చిత్రదుర్గ జిల్లా మొళకాళ్మూరు తాలూకా మేగలహట్టి గ్రామంలో జరిగిన ఒక సంఘటన చెప్పుకోవచ్చు. మేళగట్టి గ్రామానికి చెందిన వెంకటేశ్ ఇటీవలే అయ్యప్ప మాల ధరించి అయ్యప్ప దర్శనం చేసుకుని వచ్చాడు. దర్శనం తరువాత తనతోపాటు తీసుకువచ్చిన పావురాన్ని గత డిసెంబరు 30న శబరిమలెలో వదిలేశాడు. ఆశ్చర్యంగా పావురం గురువారం గ్రామాన్ని చేరుకుని యజమాని వెంకటేశ్ ఒడిలో వాలిపోయింది. పెంచిన రుణాన్ని మర్చిపోలేని పావురం ఇలా గ్రామానికి తిరిగి రావడం పట్ల గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: తాగుబోతు భర్తకు గుణపాఠం..చైన్లతో కట్టేసి..) -
దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి..
ముంబై: మహారాష్ట్ర ముంబైలో దారుణం జరిగింది. ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్న నలుగురు వ్యక్తులు యజమానిని చితకబాదారు. ఆపై అతని నోట్లో పినాయిల్ పోశారు. దీంతో అతని పేగులు కాలి తీవ్ర కడపునొప్పితో ఇబ్బందిపడ్డాడు. కుటుంబసభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతని పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్యులు చెప్పారు. ముంబై శివాజినగర్‌లో మంగళవారం రాత్రి 7:30గంటల సమయంలో ఈ ఘటన జరిగింది. అయితే యజమానికి అతని ఇంట్లో అద్దెకుండే వాళ్లు డబ్బులిచ్చారు. చాలా రోజులైనా తిరిగి ఇవ్వకపోవడంతో వాళ్లు అతనితో తరచూ గొడవపడేవారు. ఈ క్రమంలో మంగళవారం మాటామాటా పెరిగింది. అద్దెకు ఉండే నలుగురు కలిసి అతన్ని గోడకు నెట్టేశారు. అనంతరం ఒకరు యజమాని నోట్లో బలవంతంగా పినాయిల్ పోశారు. ఈ ఘటనలో నలుగురు నిందితులపై హత్యాహత్నం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధితుడు సియాన్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నట్లు చెప్పారు. చదవండి: తల్లి హీరాబెన్ పాడె మోసిన ప్రధాని మోదీ -
నోయిడాలో పనిమనిషి మీద ఓనర్ దాష్టీకం
-
బలవంతంగా లాక్కొని వెళ్లి.. ఇదేం చర్య? వాళ్లూ మనుషులే కదా!
బుధవారం ఒక వీడియో వైరల్ అయ్యింది. ఢిల్లీ నోయిడాలోని ఒక సొసైటీలో 20 ఏళ్ల పనిమనిషిని ఆమె యజమాని బలవంతంగా లాక్కుని పోయే వీడియో అందరూ చూశారు. ‘పని చేయను మొర్రో’ అంటున్నా వినకుండా ఆ పనిమనిషిని తన ఇంటికి తీసుకెళ్లి హింసించింది ఆ యజమాని. ఇటీవల మనిమనుషులను హింసించి వార్తలకెక్కుతున్న యజమానులు ఎక్కువగా ఉన్నారు. పని మనుషులు స్త్రీలు. ఇంట్లో పని చేయించునేది స్త్రీలే. సమ దృష్టితో పని చేయించుకోకపోతే కేసుల్లో చిక్కుకోవాల్సి వస్తుంది. అశాంతితో గడపాల్సి వస్తుంది. ► పని మనుషులతో పని విధానం ఎలా ఉండాలి? లోకంలో పని మనుషుల మీద ఉన్నన్ని జోకులు మరెవరి మీదా ఉండవు. పని మనుషులు ‘డిమాండ్స్’ పెట్టడం గురించి ఈ జోకులన్నీ ఉంటాయి. వారి పని పద్ధతి గురించి కూడా జోకులుంటాయి. ‘పని మనుషులు’ కూడా ‘ఇంత పని మాత్రమే చేస్తాం’... ‘ఇంత జీతానికే చేస్తాం’ అని డిమాండ్ చేయడం ‘యజమానులకు’ వింతగా, నవ్వులాటగా, సహించలేని వ్యవహారంగా అనిపిస్తుంది. కాని ఈ యజమానులు లేదా వారి పిల్లలు ఉద్యోగాల్లో చేరేటప్పుడు తప్పనిసరిగా పని స్వభావం, పని గంటలు, జీతం తెలుసుకుని అందుకు అంగీకారమైతేనే చేరుతారు. పని మనుషులు మాత్రం తమ వద్ద అలా ఉండటాన్ని భరించలేరు. ► తాజా ఘటన పని మనుషులు ‘అతీగతీ’ లేని వారు అనే భావనతో వారితో ఎలాగైనా వ్యవహరించవచ్చని యజమానులు అనుకుంటే వారు పోలీసు కేసుల వరకూ వెళ్లాల్సి ఉంటుందని నోయిడాలో జరిగిన తాజా ఘటన తెలియచేస్తోంది. నోయిడా సెక్టర్ 120లో షెఫాలీ కౌల్ అనే మహిళ తన వద్ద పని చేసే 20 ఏళ్ల అనిత అనే అమ్మాయిని లిఫ్ట్‌లో నుంచి తన ఫ్లాట్‌కు ఈడ్చుకుంటూ వెళ్లే వీడియో వైరల్ అయ్యింది. ఆమె వద్ద పని చేసే ఒప్పందం అక్టోబర్‌తో ముగిసినా ఇంకా పని చేయవలసిందేనని ఆమె బలవంతం చేస్తున్నదని, ఇంట్లో నిర్బంధిస్తోందని, తిడుతోందని, కొడుతోందని అనిత తండ్రి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. వీడియో ఇందుకు సాక్ష్యం పలుకుతోంది. నేరం రుజువైతే షెఫాలీ కౌల్‌కు శిక్ష తప్పదు. దేశంలో ఇటీవల ఇలాంటి ఘటనలు ఎక్కువయ్యాయి. మనకు సేవ చేసేవారు మనకంటే తక్కువ అనే భావన పాతుకుపోవడం వల్లే ఇలా జరుగుతుంది. ► పని మనుషులు నిస్సహాయులు పనికి సంబంధించిన ఎటువంటి గ్యారంటీ లేని నిస్సహాయులుగానే పని మనుషులు వున్నారు. యజమానులు వారిని ఎప్పుడైనా తీసుకోవచ్చు. ఎప్పుడైనా తీసేయొచ్చు. వారికి కనీస వేతన చట్టం వర్తించదు. సెలవులు ఉండవు. ప్రసూతి సెలవులు చాలా పెద్ద మాట. రోజూ వచ్చిపోతూ పని చేసే పని మనుషుల కంటే ఇంట్లోనే ఉంటూ పని చేసే వారికి యజమానులు చెడ్డవాళ్లయితే నరకం కనిపిస్తున్న దాఖలాలు ఉన్నాయి. తమ వద్దే గతి లేకుండా ఉన్నారన్న ఉద్దేశంతో వీరి చేత చాకిరి విపరీతంగా చేయించడమే కాదు... ఏదైనా తప్పు జరిగినా/మాట వినకపోయినా దండన కూడా ఉంటుంది. ఆ దండన– ► జీతం ఆపడం ∙ ►ఆకలికి మాడ్చడం ► నిద్ర లేకుండా పని చేయించడం ► కొట్టడం ∙హింసించడం ► దొంగతనం నిందలు వేయడం కొన్ని సంఘటనల్లో లైంగిక దాడులు కూడా జరపడం. ఇవన్నీ శిక్షార్హమైన నేరాలని యజమానులు గుర్తుంచుకుంటే మంచిది. కాని యజమానుల ధోరణి అహంతో నిండి ఉంటోంది. కొంత కాలం క్రితం ముంబైలోని ఒక సొసైటీలో పని మనుషులందరూ తమకు జీతాలు తక్కువ ఉన్నాయని పనిలోకి రాబోమని ఈ సొసైటీ ఎదుట ధర్నా చేశారు. అప్పుడు యజమానులు తగ్గి జీతం పెంచారు. కాని కొన్ని నెలల్లోనే ఎవరైతే ఆ ‘విప్లవం’ లేవదీశారో వారందరి పని పోయింది. మెల్ల మెల్లగా తీసేశారు. మళ్లీ తక్కువ జీతానికి పని చేసే వాళ్లే పనిలో కుదరాల్సి వచ్చింది. ► పని మనుషులూ మనుషులే పని మనుషులూ మనుషులే. పని మనుషులుగా ఇళ్లల్లో పని చేసేది, చేయాల్సింది స్త్రీలే. వీరంతా నిరుపేద వర్గం నుంచి వచ్చినవారే అయి ఉంటారు. వారికి కుటుంబాలు ఉంటాయి... పిల్లలు ఉంటారు... బాధ్యతలు ఉంటాయి... అనారోగ్యాలు ఉంటాయి... భర్తల నుంచి ఏదో ఒక మేరకు వొత్తిళ్లు ఉంటాయి... సమస్యలు ఉంటాయి... అని గుర్తుంచుకోవాలి. ఎన్నో ఇబ్బందులు ఉండి ఆ ఇబ్బందుల్లో బతుకు గడవడానికి వారు పనిలో చేరుతారు. ఇంటికి సంబంధించిన ‘మురికి’ని శుభ్రం చేస్తారు. వారి సహాయం, శ్రమ లేకుండా ఇళ్లు శుభ్రపడవు. యజమానులు సౌకర్యంగా తమ పనులు చేసుకోలేరు. అందువలన వారితో స్నేహంగా, సమదృష్టితో వ్యవహరించడం అవసరం. వారి అవసరాలు అన్నీ తీర్చాల్సిన పని లేదు కాని ఒక్కోసారి వారి బాధను పట్టించుకోవడం కూడా అవసరమే. కుటుంబంలో ఒకరిగా మారి దశాబ్దాల పాటు పని చేసిన మనుషులు, పని మనిషిని కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకునే యజమానులు ఎందరో ఉన్నారు. కాని అలా కాకుండా ‘మనం అనేవాళ్లం... వాళ్లు పడేవాళ్లు’ అనే భావన ఉంటేగనక అలాంటి భావనను మార్చుకోక తప్పదు. కొందరి ఇళ్లల్లో పని మనుషులు నెలకు మించి నిలువరు. పని మనుషులను మార్చుతూ వెళతారు కాని తాము మారరు. ఇవి చేయండి ► మీకు ఎన్ని పని గంటలు కావాలో ముందే స్పష్టంగా చెప్పండి ఏమేమి పనులు చేయాలో తప్పనిసరిగా ముందే చెప్పండి వారానికి ఒకరోజు సెలవు (ఒక పూటైనా) ఇవ్వండి ∙ అనారోగ్యం ఉంటే బలవంతంగా పని చేయించకండి ∙ పండగలకు బక్షీసు ఇవ్వండి ∙ చీటికి మాటికి జీతం కోయకండి ∙పరుష పదజాలం ఉపయోగించకండి పని చేస్తుంటే వెంట ఉంటూ అజమాయిషీ చేయకండి ► మీరు తినలేనివి పెట్టకండి. -
ఉప్పు తిన్న విశ్వాసం అంటే ఇదేనేమో.. కుక్క తెలివికి ఫిదా..!
-
అబ్బా కారు భలే ఉందంటూ ఫోటోలు దిగుతున్నారు..సడెన్‌గా ఓనర్ వచ్చి...
అందరికీ కార్లు కొనుక్కునేంత స్తోమత ఉండొద్దు. ఐనా ఎక్కడైన మంచి ఖరీదైన కారు పార్కింగ్ వద్ద ఉంటే నేరుగా వెళ్లి ఫోటోలు తీసుకుని మురిసిపోతాం. ఔనా! చాలామంది అలానే చేస్తారు. కొంతమంది పట్టుదలగా ఎప్పటికైనా కారు కొనాలని లక్ష్యం పెట్టుకుని మరీ నెరవేర్చుకున్న వారు లేకపోలేదు. ఐతే అందరికీ అలా సాధ్యం కాకపోవచ్చు. ఏ షోరూంలోనో లేక స్నేహితులు లేదా బంధువుల వద్ద కారు ఉంటే చక్కగా వాళ్లని అడగి అందులో కాసేపు కూర్చొని సరదా తీర్చకుంటాం. అచ్చం అలానే ఇద్దరూ అబ్బాయిలు రోడ్డు పక్కకు పార్క్ చేసి ఉన్న అందమైన కారు చూసి ముచ్చట పడ్డారు. వెంటనే ఆ కారు వద్దకు వచ్చి ఫోటోలు తీసుకోవడం ప్రారంభించారు. ఇంతలో సడెన్‌గా ఆ కారు ఓనర్ వచ్చాడు. ఐతే సహజంగా ఏ ఓనర్ అయినా ఎవర్రా! అది అని అరిచి వెళ్లిపోయేలా చేస్తాడు. కానీ ఇతను ఏకంగా కారు కీ ఇచ్చి ఎక్కి కూర్చొని ఫోటోలు దిగమని ప్రోత్సహించాడు. అందుకు సంబంధించిన వీడియో ఇన్‌స్టాగ్రాంలో అన్షుబాత్రా పోస్ట్ చేయడంతో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు సదరు ఓనర్ని మీది చాలా విశాల హృదయం అని ఒకరు, మంచి వ్యక్తి అంటూ మరోకరు ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Batra King ☆ (@_anshubatra_) (చదవండి: షాకింగ్ ఘటన:రెస్టారెంట్లోకి దూసుకొచ్చిన టెంపో..ముగ్గురికి గాయాలు) -
భౌ. భౌ..తప్పిపోయా! పోలీస్టేషన్‌కి వెళ్లిన కుక్క!
-
కిల్లర్ సినిమా రేంజ్లో హత్య...గుట్టుచప్పుడు కాకుండా అంబులెన్స్‌లో..
సాక్షి, హైదరాబాద్ : పనిచేసే చోట తరచూ యజమానికి ఫిర్యాదు చేస్తున్నాడని కక్ష పెంచుకున్నాడు.. స్పానర్‌తో తలపై మోది హత్య చేశాడు.. పోలీసులకు తెలిస్తే ఇబ్బందులొస్తాయని యజమానులూ జాగ్రత్త పడ్డారు.. గుండెపోటుతో మరణించాడని చిత్రీకరించి.. గుట్టుచప్పుడు కాకుండా మృతదేహాన్ని సొంతూరికి సాగనంపారు. కిల్లర్ సినిమాను తలపించే హత్య కేసును పహాడీషరీఫ్ పోలీసులు చాకచక్యంగా చేధించారు. ►రాజస్థాన్ పాలి జిల్లా, రాంపుర కాలా గ్రామానికి చెందిన ఓంప్రకాశ్, సునీల్ హైదరాబాద్‌లో ఉంటూ మీర్‌పేట శ్రీరామ్‌కాలనీలో శ్రీసాన్వి ఇండస్ట్రీస్‌ను నిర్వహిస్తున్నారు. ఇదే కంపెనీలో పాలి జిల్లా, జైతరణ్‌కు చెందిన మహేంద్రజీ చౌదరి (45), ఉత్తర్‌ప్రదేశ్ కౌశాంబి జిల్లా చందుపురంరాయన్‌కు చెందిన రోహిత్ కుమార్ పని చేసేవారు. అయితే రోహిత్ సరిగ్గా పని చేయడం లేదని తరుచూ అతనిపై యజమానికి మహేంద్రజీ ఫిర్యాదు చేసేవాడు. ►మహేంద్రపై కక్ష పెంచుకున్న రోహిత్ అతడిని అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు.. పనిచేస్తున్న సమయంలో స్పానర్‌తో మహేంద్ర తలపై మోదడంతో తీవ్రంగా గాయపడిన మహేంద్రజీని కంపెనీ యజమానులు శివరాంపల్లిలోని చంద్రా మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మహేంద్ర మృతి చెందాడు. గుండెపోటుగా చిత్రీకరించి.. అయితే హత్య విషయం బయటికి పొక్కితే ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన యజమానులు ఓం ప్రకాశ్, సునీల్ పథకం పన్నారు. గుండె పోటుతో మహేంద్ర మరణించాడని ఆసుపత్రి నుంచే రోహిత్ చేత మహేంద్ర మామ ప్రకాశ్‌కు అక్టోబర్ 4న ఫోన్ చేయించారు. ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు. హత్య సమాచారం పోలీసులకు అందించకుండా, మృతదేహానికి పోస్టు మార్టం నిర్వహించకుండా ఆసుపత్రి యాజమాన్యాన్ని మేనేజ్ చేశారు. అనంతరం పరిస్థితి సద్దుమణిగే వరకూ రోహిత్‌ను ఉత్తర్‌ప్రదేశ్‌కు పంపించేశారు. గాయాలు కనిపించకుండా పార్సిల్.. హంతకుడి సూచన మేరకు శివరాంపల్లిలోని ఆసుపత్రికి వచ్చిన ప్రకాశ్ అంబులెన్స్‌లో పూర్తిగా ప్యాక్ చేసి ఉన్న మృతదేహాన్ని చూసి బోరున విలపించాడు. అనంతరం మృతదేహాన్ని సొంతూరైన బాగియాడకు తీసుకెళ్లారు. చివరి చూపు కోసం మహేంద్రజీ మృతదేహాన్ని తెరిచి చూసిన అతడి కుమారుడు పాబురాంజీ జాఖర్ మృతుడి తల, శరీరంపై బలమైన గాయాలున్నట్లు గుర్తించాడు. దీంతో తమ తండ్రి గుండె పోటుతో మరణించలేదని, ఎవరో హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అక్టోబర్ 31న రాజస్థాన్‌లోని జైతారామ్ ఠాణాలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్.. రాజస్థాన్ పోలీసులు కేసును పహాడీషరీఫ్ ఠాణాకు బదిలీ చేయడంతో.. రంగంలోకి దిగిన ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ ఫ్యాక్టరీని సందర్శించి, కార్మికులను విచారించారు. క్రైమ్ సీన్‌ను రీ–కన్స్ట్రక్షన్ చేశారు. రోహితే హంతకుడని తేల్చే కీలక సాక్ష్యాధారాలు సేకరించారు. అయితే హత్య కేసు సద్దుమణిగిందని భావించిన రోహిత్ ఈనెల 14న యూపీ నుంచి హైదరాబాద్‌కు తిరిగి వచ్చి యధావిధిగా పనిలో చేరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం ఉదయం రోహిత్‌ను అరెస్టు చేసి, విచారించగా.. మహేంద్రజీని తలపై స్పానర్‌తో కొట్టి చంపినట్లు అంగీకరించాడు. ఫ్యాక్టరీ యజమానులు ఓంప్రకాశ్, సునీల్ వ్యవహారం కూడా వెలుగులోకి రావటంతో ముగ్గురిని అరెస్టు చేసి జ్యూడిషయల్ రిమాండ్‌కు తరలించారు. హత్యకు ఉపయోగించిన స్పానర్ను స్వా«దీనం చేసుకున్నారు. (చదవండి: ప్రేమించింది బావనే కదా అని దగ్గరైంది.. ప్రైవసీ ఫొటోలు తీసి..) -
భౌ. భౌ..తప్పిపోయా! పోలీస్టేషన్‌కి వెళ్లిన కుక్క! వీడియో వైరల్
ఎప్పడైనా ఎవరైనా తాము ఒకవేళ తప్పిపోయినా! పోలీస్టేషన్‌కి వెళ్లి సాయం అర్థించేవారు అరుదు. ఎవర్నోఒకర్నీ సాయం అడిగి వెళ్లేందుకు ట్రై చేస్తాం. ఇక సాధ్యం కావట్లేదు అనుకొన్నప్పుడూ పోలీస్టేషన్‌కి వెళ్తాం. కానీ ఇక్కడొక కుక్క ఏకంగా తాను తప్పిపోయానంటూ పోలీస్టేషన్‌కి వెళ్లి కూర్చొంది. వివరాల్లోకెళ్తే....ఇంగ్లాండ్‌లో ఒక యజమాని వద్ద బోర్డర్కోలీ జాతికి చెందిన రోజీ అనే కుక్క ఉంది. అది ఒక రోజు తన యజమానితో వాకింగ్‌కి వచ్చి అక్కడే ఉన్న మరో కుక్కతో కలిసి వెళ్లి తప్పిపోయింది. దీంతో ఏం చేయాలో తెలియని ఆ రోజీ అక్కడే ఉన్న లీసెస్టర్‌షైర్ పోలీస్టేషన్‌కి వెళ్తుంది. ఆ స్టేషన్‌కి ఆటోమెటెడ్ ఓపెన్ అండ్ క్లోజ్ డోర్స్ ఉన్నాయి. ఆ కుక్క నేరుగా ఆ తలుపలు వద్దకు వెళ్లగానే ఆ ఆటోమేటెడ్ తలుపులు తెరుచుకున్నాయి. పాపం ఆ కుక్క లోపలికి వెళ్లంగానే అవి క్లోజ్ అయిపోయాయి. దీంతో ఏం చేయాలో తెలియక లోపల ఒక మూలన అలా కూర్చొని ఉంటుంది. అక్కడే ఉన్న పోలీసులు గమనించి దాన్ని దగ్గరకు తీసుకుని పరిశీలించారు. ఇది బహుశా తప్పిపోయి ఉంటుందని భావించారు. వెంటనే పోలీసుల ఆ కుక్క ఫోటోతో సహా అది తప్పిపోయి పోలీస్టేషన్‌కి వచ్చిన సీసీఫుటేజ్ వీడియోని ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అంతేగాదు ఈ కుక్క ఓనర్ ఎవరో వారు పోలీస్టేషన్‌కి వచ్చి కలెక్ట్ చేసుకోవల్సిందిగా పేర్కొన్నారు. దీంతో ఆ కుక్క ఓనర్ హూటాహుని స్టేషన్‌కి వచ్చి తన పెంపుడు కుక్కను కలెక్ట్ చేసుకుని వెళ్లిపోయాడు. తప్పిపోయానంటూ పోలీస్టేషన్ మెట్లెక్కడంతో ఓనర్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఇది ఎంత తెలివైన కుక్క, తిరిగి నా వద్దకు వచ్చేసింది అంటూ తెగ మురిసిపోయాడు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. మీరు ఓ లుక్కేయండి. (చదవండి: విమానం టేక్ అఫ్ టైంలో ఫోన్ మిస్సింగ్.. పైలెట్ కిటికిలోంచి వంగి మరీ...) -
పని మనిషి కాస్త.. ఓనర్ అయ్యింది!
ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం అంటే.. దాని వెనుక బోలెడంత కథాకమీషు ఉంటుంది. అయితే అనుకున్న దానిని నెరవేర్చుకునేందుకు కొందరు పడే తాపత్రయం.. ఆకట్టుకోవడమే కాదు, వాళ్ల లక్ష్యసాధన చాలామందిలో స్ఫూర్తిని నింపుతుంది కూడా. ఒకప్పుడు ఆమె ఆ విలాసవంతమైన ఇంట్లో పని మనిషి. ఇల్లు ఊడ్చి.. తుడిచి.. ఇంటి పనులు చేసేది. కాలచక్రం గిర్రున తిరిగి 43 ఏళ్లు గడిచింది. అదే ఇంట్లో ఇప్పుడామె ఓనర్‌గా దర్జాగా కాలు మీద కాలేసి కూర్చుంది!. న్యూమెక్సికో అల్బుకెర్కీకి చెందిన మార్గరెట్ గాక్సియోలా.. 1976లో 29 ఏళ్ల వయసున్నప్పుడు పెళ్లి చేసుకుని ముగ్గురు పిల్లలకు తల్లైంది. అయితే భర్త ఆమెను వదిలేసి.. మరో వ్యక్తితో వెళ్లిపోయాడు. దీంతో పిల్లల బాధ్యత ఆమెపై పడింది. ఓ పూల షాపులో పని చేస్తూనే.. నాలుగు ఇళ్లల్లో పని మనిషిగా చేసింది. ఆ సమయంలో చిన్నకూతురు నికోల్‌ను వెంటపెట్టుకుని వెళ్లేది. అయితే అన్నింట్లోకి ఆమెకు ఒక ఇల్లు ఎంతో ప్రత్యేకంగా ఉండేది. ఆ ఇల్లు చాలా విలాసవంతమైంది కావడమే అందుకు కారణం. తన పూర్తి జీవితం అందులోనే గడిపితే బాగుండేదని తరచూ గాక్సియోలా పిల్లలతో చెబుతూ ఉండేదట. కానీ, అది సాధ్యం కానీ అంశమని ఆమెకు కూడా తెలుసు!. ఇక నికోల్‌కు కూడా ఆ ఇంట్లో ఎంతో నచ్చింది. ఓ టేబుల్ కింద కూర్చుని ఎక్కువ సేపు ఆడుకునేది. ఆ ఇల్లు గాక్సియోలా ఉండే చిన్ని అద్దెయింటికి కేవలం 20 నిమిషాల దూరంలోనే ఉండేది. ఇక ఇంటి ఓనర్ పమేలా కీ లిండెన్ కూడా ఈ తల్లీబిడ్డలను సొంతవాళ్లుగా భావించేది. అలా చాలా ఏళ్లు గడిచాయి. 2018లో పమేలా అనారోగ్యంతో చనిపోయాక.. గాక్సియోలా ఆ ఇంటి పనులకు వెళ్లడం మానేసింది. ఈలోపు తన ముగ్గురు పిల్లలు మంచి చదువులతో.. మంచి ఉద్యోగాల్లో చేరారు. ఇద్దరు కొడుకులు భార్యాపిల్లలతో సుఖంగా వేరే ఊళ్లలో స్థిరపడ్డారు. గాక్సియోలా మాత్రం ఒంటరిగా ఆ చిన్ని అద్దె ఇంట్లోనూ ఉంటూ వచ్చింది. అయితే తన తల్లి మనసును అర్థం చేసుకుంది కూతురు నికోల్ నారంజో(44). పెళ్లై ఇద్దరు బిడ్డలకు తల్లి అయినా కూడా.. తన తల్లి కలను నెరవేర్చేందుకు ప్రయత్నించింది. భర్త సాయంతో.. తానూ ఉద్యోగం చేస్తూ డబ్బును కూడబెడుతూ వచ్చింది. తమ కోసమే జీవితాన్ని త్యాగం చేసిన తల్లికి.. వెలకట్టలేని బహుమతిని అందించాలనుకుంది. నవంబర్ 2020లో ఆ ఇల్లును కొనుగోలు చేయాలని నిర్ణయించుకుంది. చివరకు.. ఆ ఇంటిని కొనుగోలు చేసి.. ఈ మధ్యే ఆ ఇంట్లో తల్లిని అడుగుపెట్టించింది. కోరుకున్న కలను కళ్ల ముందు ఉంచిన బిడ్డను ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని.. ఆ క్షణాలను భావోద్వేగంగా మల్చుకుంది ఆ తల్లి. -
పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని యజమాని హత్య
బంజారాహిల్స్: పెంపుడు పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తోందని ఆగ్రహించిన ఓ యువకుడు దాని యజమానిని హత్య చేశాడు. ఈ ఘటన హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లోని మిథిలానగర్‌లో డాక్టర్ మీనన్ ఇంట్లో రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం నల్లాపూర్‌కు చెందిన ఓ బాలుడు(17)తోపాటు హరీశ్వర్‌రెడ్డి అలియాస్ చింటూ(20) అద్దెకు ఉంటున్నారు. అసోంకు చెందిన ఎజాజ్ హుస్సేన్ (20), బ్రాన్ స్టిల్లింగ్(20) కూడా ఇదే ఇంట్లోని ఓ గదిలో అద్దెకుంటూ సెక్యూరిటీగార్డులుగా పనిచేస్తున్నారు. ఈ నెల 20న రాత్రి ఎజాజ్, బ్రాన్ ఇద్దరూ విధులు ముగించుకొని గదికి వెళ్తుండగా దారిలో కనిపించిన ఓ పిల్లిని వెంట తీసుకెళ్లారు. ఇంటికి వెళ్లిన తర్వాత పిల్లి అరుస్తుండటంతో పక్కనే ఉన్న హరీశ్వర్రెడ్డితోపాటు సదరు బాలుడు వారిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత కూడా పిల్లి అరుస్తూ నిద్రాభంగం చేస్తుండటంతో మద్యం మత్తులో ఉన్న బాలుడు కోపంగా ఎజాజ్ గదికి వెళ్లాడు. అక్కడే ఉన్న బాటిల్లోని పెట్రోల్‌ను ఆయనపై పోసి నిప్పంటించాడు. తీవ్ర గాయాలపాలైన ఎజాజ్‌ను వెంటనే ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారంరాత్రి మృతి చెందాడు. అయితే ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని చనిపోయాడంటూ మొదట ఆ బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డి తప్పుడు ఫిర్యాదు చేశారు. అనంతరం మృతుడి స్నేహితుడు బ్రాన్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసును తిరగదోడిన పోలీసులు బాలుడితోపాటు హరీశ్వర్‌రెడ్డిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. (చదవండి: దంపతుల ఆత్మహత్య) -
ఐదేళ్లుగా పని, నమ్మి ఇంటి తాళం ఇస్తే.. రూ.10కోట్లతో జంప్..
న్యూఢిల్లీ: ఐదేళ్లుగా ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడని తాళం అతనికే అప్పగించి అమెరికా వెళ్లాడు ఓ యజమాని. తీరా అతనే దొంగతనానికి పాల్పడి రూ.10కోట్లు దోచుకెళ్లాడని తెలిసి షాక్‌కు గురయ్యాడు. వెంటనే ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పశ్చిమ ఢిల్లీలోని పంజాబీ బాగ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఈ కేసులో దొంగతనానికి పాల్పడిన నిందితుని పేరు మోహన్ కుమార్(26). ఐదేళ్లుగా నమ్మకంగా ఉంటున్నాడని అతని ఇంటి యజమాని తాళాలు అప్పగించి కుటుంబంతో అమెరికా వెళ్లాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఇంట్లో పనిచేసే మరో వ్యక్తి యజమానికి ఫోన్ చేశాడు. మోహన్ కుమార్ ఇంట్లో దొంగతనం చేశాడని, డబ్బు, నగలతో పారిపోయాడని తెలియజేశాడు. వెంటనే యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. మోహన్ ఇంట్లో నుంచి సూట్‌కేసుతో కారులో పారిపోతున్నట్లు అందులో రికార్డు ఉయ్యింది. అతనితో పాటు మరో మైనర్ కూడా ఉన్నాడు. విచారణ చేపట్టిన పోలీసులు మొదట మైనర్ జాడ కనుగొన్నారు. అతడు మోహన్ బంధువని, బిహార్‌లోని శివహర్ జిల్లాలో ఉంటున్నాడని తెలుసుకున్నారు. వెంటనే అక్కడికి వెళ్లి బాలుడ్ని ఆదివారం అరెస్టు చేశారు. అతడు చెప్పిన వివరాలతో మోహన్‌ను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మోహన్ బంధువు మైనర్ అయినందున అతడ్ని జువెనైల్ హోంకు తరలించారు. మోహన్ దొంగతనం చేసిన డబ్బులు, నగలు, వజ్రాల మొత్తం విలువ రూ.10కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. వీటిలో కొంతమాత్రమే స్వాధీనం చేసుకున్నామని, మిగతా మొత్తం ఎక్కుడుందో తెలుసుకుంటున్నట్లు పేర్కొన్నారు. చదవండి: ముసుగు దుండగుల దాడి.. మంగళూరులో దారుణ హత్య.. 144 సెక్షన్ విధింపు -
ఎంపీ బంధువునని రూ.7 లక్షల స్వాహా
మైసూరు: ఉత్తర కన్నడ జిల్లా ఎంపీ అనంతకుమార్ హెగడె బంధువునని చెప్పుకున్న ఒక మహిళ తాను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని వద్ద సుమారు రూ. 7 లక్షలు తీసుకుని అదృశ్యమైంది. ఈ సంఘటన మైసూరు కువెంపు నగరలో చోటు చేసుకుంది. నిందితురాలు రేఖా హెగడె (32). సుధీర్, మంజుళ అనే దంపతులకు చెందిన ఇంటిలో రేఖా నివాసం ఉంటుంది. తనకు ఎంపి అనంత్ కుమార్ హెగడె దగ్గరి బంధువని చెప్పుకుంది. రూ. 1 కోటితో ఇంటిని కొనుగోలు చేస్తున్నానని, ఇందుకోసం రూ.7 లక్షలు తక్కువ అయ్యాయి, ఇస్తే వెంటనే తిరిగి ఇస్తానని నమ్మబలికింది. దీంతో సుధీర్ దంపతులు ఆమెకు ఆ డబ్బు ఇచ్చారు. మరుసటి రోజే పరారైంది. దీంతో బాధితులు కువెంపు నగర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘరానా దొంగ అరెస్టు బనశంకరి: విలాసవంతమైన జీవనం కోసం చోరీలకు పాల్పడుతున్న దొంగను సోమవారం బసవనగుడి పోలీసులు అరెస్ట్‌చేశారు. ఇతడి వద్ద నుంచి రూ.18 లక్షల విలువచేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మహమ్మద్ సాదిక్ పట్టుబడిన దొంగ. మంగళూరుకు చెందిన నిందితుడు బెంగళూరు సిటీమార్కెట్‌లో ఉన్న ఒక హోటల్లో క్లీనింగ్ పనిచేసేవాడు. జల్సాల కోసం చోరీలకు పాల్పడుతున్నాడు. గతంలో ఇతడు దొంగతనాల కేసుల్లో జైలు పాలై, విడుదలై మళ్లీ చోరీలకు పాల్పడడం గమనార్హం. బెట్టింగ్ కేసులో పట్టివేత క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్న వ్యక్తిని సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. హెచ్ఏఎల్ రెండోస్టేజ్ వద్ద బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసి దాడి చేశారు. నిందితున్ని అరెస్టు చేసి రూ.9.50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. (చదవండి: స్థలం చూసోద్దామని చెప్పి...కిడ్నాప్ చేసి రూ.10 లక్షల వసూలు) -
నేతన్న ఓనరయ్యేనా?
సాంచాలు నడుపుతున్న ఈయన (గడ్డం గణేశ్, సిరిసిల్ల పట్ట ణం సర్ధార్‌నగర్) 25 ఏళ్లుగా ఇదే వృత్తిలో ఉన్నారు. రోజూ 10–12 గంటలపాటు 10 సాంచాలపై పాలిస్టర్ వస్త్రాన్ని నడిపితే వారానికి రూ.2 వేలు వస్తాయి. అదే బతుకమ్మ చీరల వస్త్రాన్ని నడిపితే వారానికి రూ.3 వేలు వస్తాయి. గణేశ్ భార్య మిషన్ కుడతారు. వారికి ఇద్దరు అమ్మాయిలు. భార్యాభర్తలు పనిచేస్తే వచ్చే డబ్బులు బట్టకు, పొట్టకే సరిపోతుంది... ఇది ఒక్క గణేశ్ పరిస్థితే కాదు. సిరిసిల్లలో పాతిక వేలమంది కార్మి కుల దుస్థితి. ఈ నేపథ్యంలో ఆసాముల వద్ద పనిచేసే కార్మికులను యజమానులుగా మార్చేందుకు ప్రభుత్వం ‘వర్కర్ టు ఓనర్’ పథకాన్ని ప్రతిపాదించింది. నేతకార్మికుడే యజమానిగా.. మెరుగైన ఉపాధి పొందేలా ప్రణాళిక సిద్ధం చేసింది. కానీ ఆ పథకం ఐదేళ్లుగా తుదిరూపం దాల్చలేదు. సిరిసిల్ల: నేత కార్మికులకు పుట్టినిల్లయిన సిరిసిల్లలో.. కార్మికుడే యజమానిగా మారితే వారి బతుకుల్లో మార్పు వస్తుందనే లక్ష్యంతో రాష్ట్రంలోనే తొలిసారిగా రూ.220 కోట్లతో వీవింగ్ పార్క్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా 2017 అక్టోబర్ 11న శంకుస్థాపన చేయించారు. సిరిసిల్లలో ఈ పథకం విజయవంతమైతే రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలనే ప్రణాళిక ఉంది. రాష్ట్ర పరిశ్రమలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ) దీని నిర్మాణాన్ని చేపట్టింది. ఇక్కడ సెమీ ఆటోమేటిక్ మరమగ్గాలను ఏర్పాటుచేసి.. ఆధునిక విధా నాల్లో వేగంగా వస్త్రోత్పత్తి చేయాలని నిర్ణయించారు. ఒకే సారి 4 రంగుల నూలుతో అనేక డిజైన్లతో వస్త్రాన్ని ఉత్పత్తిచేసి ప్రపంచస్థాయిలో వస్త్రాన్ని ఎగుమతి చేయాలని లక్ష్యం గా పెట్టుకున్నారు. అయితే ఏళ్లుగా వీవింగ్ షెడ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడంతో పనులు కొలిక్కి రాలేదు. ఏమిటీ ‘వర్కర్ టు ఓనర్’పథకం? వర్కర్ టు ఓనర్ పథకానికి ఎంపికైన కార్మికులు ప్రాజెక్టు వ్యయంలో పది శాతం చెల్లిస్తే 50 శాతం ప్రభుత్వ రాయితీ, మరో 40 శాతం బ్యాంకు రుణం అందుతుంది. ఒక్కో కార్మికుడికి ఒక యూనిట్ కింద రూ.8 లక్షలు వెచ్చిస్తారు. నాలుగు ఆధునిక మగ్గాలు సమకూర్చి, ఒక్కో షెడ్డులో ఎనిమిది మంది కార్మికులకు యూనిట్లు అందిస్తారు. ఆధునిక మగ్గా లపై వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తూ యజమాని, ఆసామి లేకుండా కార్మికులు సొంతంగా ఉపాధి పొందుతారు. తొలివిడతగా ఎంపికయ్యే 1,104 మందికి ఆధునిక మగ్గాలపై శిక్షణ ఇచ్చి యూనిట్లు కేటాయిస్తారు. తమకు శాశ్వత ఉపాధి కల్పించే ఈ పథకం ఎప్పుడు కార్యరూపం దాలుస్తుందా.. అని సిరి సిల్ల నేతన్నలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. మంత్రి కేటీఆర్ దృష్టిపెట్టాలని నేతకార్మికులు కోరుతున్నారు. మోడల్ లూమ్స్ బిగించాం సిరిసిల్ల శివారులోని పెద్దూరు వద్ద బైపాస్ రోడ్డులో వీవింగ్ పార్క్‌లో షెడ్ల నిర్మాణాలు సాగుతున్నాయి. నాలుగు మోడల్ లూమ్స్ బిగించాము. వర్కర్ల షెడ్లు పూర్తయితే.. వీవింగ్ పార్క్‌ను ప్రారంభిస్తాం. – తస్నీమా, జేడీ, జౌళిశాఖ, సిరిసిల్ల -
ప్రేమ పేరుతో లోబరుచుకుని.. ఆపై స్నేహితుడితో కలిసి..
సాక్షి, రాజేంద్రనగర్(హైదరాబాద్): తన వద్ద పని చేస్తున్న అమ్మాయిని ప్రేమ, పెళ్లి పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడో ప్రబుద్ధుడు. సదరు యువతి గర్భం విషయం తెలపడంతో అబార్షన్ చేసుకుంటే పెళ్లి చేసుకుంటానని తెలిపి తన స్నేహితుడితో ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గర్భాన్ని తీయించాడు. యువతి ఆరోగ్యం విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా.. అసలు విషయం బయటకొచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అత్తాపూర్‌కు చెందిన శ్రీనివాస్ అలియాస్ వాసు (32) ఇదే ప్రాంతంలో ఓ ప్రింటింగ్ ప్రెస్‌ను నిర్వహిస్తున్నాడు. ఇతడికి భార్య, ఒకరు సంతానం కాగా..అతని వద్ద 20 ఏళ్లున్న యువతి పని చేస్తోంది. ఆమెను ప్రేమ, పెళ్లి పేరుతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు. ఈ విషయాన్ని అతడికి తెలపడంతో గర్భం తీసేయాలని సూచించాడు. అనంతరం వివాహం చేసుకుందామని నమ్మించి యువతిని ఒప్పించాడు. స్నేహితుడితో కలిసి.. నగర శివారులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్నేహితుడి సాయంతో అబార్షన్ చేయించాడు. ఈ నెల 4 న అమ్మాయి ఆరోగ్యం క్షిణించి అధిక రక్తశ్రావం కావడంతో కుటుంబ సభ్యులకు తెలిపింది. వారు స్థానిక ఆసుపత్రికి తరలించగా గాంధీ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. డాక్టర్లు పరిశీలించి యువతిని నిలదీయడంతో అబార్షన్ విషయాన్ని తెలిపింది. ఈ విషయాన్ని డాక్టర్లు కుటుంబ సభ్యులకు తెలపడంతో వారు మంగళ్‌హట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి రాజేంద్రనగర్ పోలీస్‌స్టేషన్‌కు బదిలీ చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని శనివారం రిమాండ్‌కు తరలించారు. స్నేహితుడు పరారీలో ఉన్నట్లు సమాచారం. చదవండి: ఫోన్ చేసి మాటల్లో పెట్టి.. 5 నిమిషాల్లోనే.. -
ఉద్వేగభరితమైన ఫోటో.. యజమాని వద్దే కూర్చొన్న కుక్క!
Ukraine Hachiko Dog: ఉక్రెయిన్ పై నెలరోజలుకు పైగా దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో రష్యా యుద్ధా నేరాలకు పాల్పడుతోంది. అయితే ఉక్రెయిన్ రాజధాని కైవ్ ప్రాంతంలో రష్యా దళాల చేతిలో ఒక వ్యక్తి చనిపోయాడు. అయితే అతని పెంపుడు కుక్క అతనిని వదిలి వెళ్లేందుకు నిరాకరించింది. అతని మృతదేహం పక్కనే దీనంగా కూర్చొని ఉన్న ఉద్వేగభరితమైన ఫోటోని తూర్పు యూరోపియన్ నెక్స్టా మీడియా పోస్ట్ చేసింది. ఈ సంఘటన 1930లలో మరణించిన తర్వాత తొమ్మిదేళ్లపాటు తన యజమాని కోసం ఎదురుచూసిన జపనీస్ కుక్క హచికో కథను గుర్తుచేస్తోంది. రష్యా దాడులు కారణంగా ఉక్రెయిన్‌లో వేలాది మంది పౌరులు నిరాశ్రయులయ్యారు. మరోవైపు బూచో నగరం శవాల దిబ్బగా మారిపోయింది. The dog does not leave its owner, who was killed by the #Russian invaders. #Kyiv region. pic.twitter.com/dnVV1X7XLG — NEXTA (@nexta_tv) April 4, 2022 (చదవండి: ఊచకోత.. ఊహించినదానికంటే ఎక్కువే!) -
జీతం డబ్బుల విషయంలో గొడవ.. అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి..
సాక్షి,జీడిమెట్ల(హైదరాబాద్): జీతం డబ్బుల విషయంలో యజమాని గొడవకు దిగడంతో విచక్షణ కోల్పోయిన ఓ యువకు డు యజమానిని కిరాతకంగా హతమార్చిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ కె.బాలరాజు, మృతుడి బంధువుల వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వీరేందర్ కుమార్ సేత్(55) భార్య హేమలతతో కలిసి 30 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి చింతల్ కల్పన సొసైటీలో ఉంటున్నాడు. గత 7 ఏళ్ల క్రితం వీరేందర్ చింతల్ గణేష్‌నగర్ బస్టాప్ పక్క సందులో బైక్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు. వీరేందర్ వద్ద ఇద్దరు యువకులు పని చేస్తుండగా నెల రోజుల క్రితం గాజులరామారం రోడామేస్త్రీనగర్‌కు చెందిన మరో యువకుడు సయ్యద్ జహీర్(26) పనికి కుదిరాడు. ఇద్దరు యువకులు సెలవుల్లో ఉండగా గురువారం షాపులో వీరేందర్, జహీర్ ఇద్దరే ఉన్నారు. రాత్రి 10 గంటలకు వీరేందర్ బార్లో మద్యం సేవిస్తుండగా జహీర్ జీతం డబ్బులు ఇవ్వాలని యజమాని వీరేందర్‌ను అడిగగా వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో విచక్షణ కోల్పోయిన జహీర్ ఒక్కసారిగా వీరేందర్ తలపై ఇనుప వస్తువుతో దాడి చేసి అరవకుండా నోట్లో గుడ్డలు కుక్కి పలుమార్లు దాడికి పాల్పడి వీరేందర్‌ను హతమార్చి అక్కడి నుంచి పరారయ్యాడు. కొద్ది సేపటికి బైక్ కోసం దుకాణానికి వచ్చిన ఓ వ్యక్తి వీరేందర్ రక్తపు మడుగులో పడి మృతి చెంది ఉండటాన్ని గమనించి పోలీసులకు సమాచారం అందించాడు. వెంటనే అక్కడకు చేరుకున్న జీడిమెట్ల పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి వీరేందర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి భార్య హేమలత ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అనంతరం సాంకేతిక ఆధారాలతో నిందితుడు జహీర్‌ను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. -
Kidnap Case: ఆనందపడ్డారు.. కానీ పోలీసులు వదల్లేదు..
మండపేట(తూర్పుగోదావరి): నమ్మిన పాలేరే నయవంచన చేశాడు. చెడు వ్యసనాలకు బానిసై, చేసిన అప్పులు తీర్చేందుకు మరో నలుగురితో కలిసి పథకం ప్రకారం యజమానిని కిడ్నాప్ చేయించాడు. వచ్చిన రూ.10 లక్షలు పంచుకుని అంతా సద్దుమణిగిపోయిందని అందరూ ఆనందపడ్డారు. కానీ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న పోలీసులు మాత్రం అంత తేలిగ్గా వదల్లేదు. చదవండి: భార్య కువైట్‌లో.. ఎంత పనిచేశావ్ బంగార్రాజు.. ఈ కిడ్నాప్ వ్యవహారంపై ఎటువంటి ఫిర్యాదూ రానప్పటికీ స్పందించారు. తమంత తామే ఫిర్యాదు తీసుకుని మరీ విచారణ చేపట్టారు. చివరకు కారు నంబరు ఆధారంగా కిడ్నాప్ మిస్టరీని ఛేదించారు. అయిదుగురు నిందితులకు అరదండాలు వేశారు. వీరిలో ఒకరు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) కానిస్టేబుల్ కూడా ఉండటం గమనార్హం. మండపేట రూరల్ పోలీస్ స్టేషన్లో రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డి ఈ కేసు వివరాలను సోమవారం విలేకర్లకు వివరించారు. ఆయన కథనం ప్రకారం.. అనపర్తి మండలం పొలమూరుకు చెందిన ద్వారంపూడి కృష్ణారెడ్డి ఈ నెల 5వ తేదీ ఉదయం మండపేట మండలం వేములపల్లిలోని పొలం వద్దకు వెళ్లారు. ఆయనను అక్కడ గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఈ ఉదంతంపై సోషల్ మీడియాలోను, మీడియాలోను విస్తృతంగా ప్రచారం జరిగింది. కిడ్నాపర్ల డిమాండ్ మేరకు బంధువులు రూ.10 లక్షలు చెల్లించి, కృష్ణారెడ్డిని విడిపించారు. అయితే ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. అయితే, విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఎస్పీ ఎం.రవీంద్రనాథ్‌బాబు దీనిపై విచారణ జరపాల్సిందిగా రామచంద్రపురం డీఎస్పీ బాలచంద్రారెడ్డిని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎస్సై బి.శివకృష్ణ బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. రూరల్ సీఐ పి.శివగణేష్ పర్యవేక్షణలో కేసు దర్యాప్తు చేపట్టారు. కృష్ణారెడ్డి బంధువులను అన్ని వివరాలూ అడిగి తెలుసుకున్నారు. కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసిన దుండగులు ఆయనను కారులో ఎక్కించుకుని రాజానగరం మండలం తుంగపాడు, గోకవరం, రంపచోడవరం మీదుగా సీతపల్లి వరకూ తీసుకువెళ్లారు. ఆయనను వదలాలంటే రూ.10 లక్షలు ఇవ్వాలని కృష్ణారెడ్డి కుటుంబ సభ్యులను డిమాండ్ చేశారు. ఆ మొత్తాన్ని పాలేరు బక్కి జయరాజు ద్వారా తమకు అందజేయాలని సూచించారు. దీంతో కుటుంబ సభ్యులు జయరాజుకు రూ.10 లక్షల నగదు ఇచ్చి పంపగా.. కడియం మండలం బుర్రిలంక వద్ద హైవేపై నగదు తీసుకుని, కృష్ణారెడ్డిని అప్పగించి పరారయ్యారు. ‘జయరాజుకు ఇచ్చి పంపాలి’ అని చెప్పడంతో పోలీసులు తొలుత జయరాజును అనుమానించారు. అతడి కాల్ డేటా సేకరించారు. అనంతరం సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా కారు నంబర్‌ను గుర్తించి, కేసును ఛేదించారు. రాజానగరం మండలం ముక్కినాడపాకలుకు చెందిన జయరాజు చెడు వ్యసనాలకు బానిసై అప్పుల పాలయ్యాడు. అదే గ్రామానికి చెందిన సమీప బంధువులు పాకా శ్రీను, పాకా సతీష్‌కుమార్, మండేల ప్రవీణ్, వారి స్నేహితుడు ద్వారంపూడి శ్రీనివాసరెడ్డితో కలిసి కృష్ణారెడ్డిని కిడ్నాప్ చేసేందుకు పథక రచన చేశాడు. వీరిలో సతీష్‌కుమార్ ఎస్పీఎఫ్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్నాడు. నిందితులు వచ్చిన సొమ్మును పంచుకుని సోమవారం వేములపల్లిలో పార్టీ చేసుకుంటుండగా పోలీసులు వారిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6 లక్షల నగదు, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారు, మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించిన సీఐ శివగణేష్, ఎస్సై శివకృష్ణలను డీఎస్పీ బాలచంద్రారెడ్డి అభినందించారు. -
నిజామాబాద్ జిల్లా: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులు
-
యజమాని పైశాచికం.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకిన యువకుడు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రెండు రోజులుగా ఓ యువకుడిని గదిలో వేసి యజమాని చితకబాదడంతో.. సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దెబ్బలు భరించలేక ఆర్మూర్ నుండి నిజామాబాద్ తప్పించుకుని వచ్చిన యువకుడు.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. చదవండి: వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ పది వేలు తీసుకుంటే.. రూ. 25 వేలు ఇవ్వాలని కొట్టారంటూ బాధితుడు అరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం యువకుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్మూర్ లో తాను నర్మదా వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నానని.. వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నానన్నాడు. అయితే అక్కడ ఇష్టంలేక పని మానేయడంతో.. పదివేలకు.. 25 వేలు ఇవ్వాలంటూ తనను చితకబాదినట్టు యువకుడు వాపోయాడు. -
ఆరడుగుల తాచు పాము.. ప్రాణాలకు తెగించిన శునకం.. యజమాని వెళ్లి చూసేసరికి
నందిగామ: శునకాన్ని విశ్వాసానికి ప్రతీకగా చెప్తారు. పెంపుడు శునకాలు తమ యజమానుల కోసం ప్రాణాలను సైతం త్యజించేందుకు వెనుకాడవు. అటువంటి ఘటనే కృష్ణాజిల్లా నందిగామలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. తన యజమాని గెస్ట్ హౌస్‌లోకి ప్రవేశించిన తాచుపామును అడ్డుకునే క్రమంలో ఓ శునకం తన ప్రాణాలనే కోల్పోయింది. వివరాల్లోకి వెళితే.. నందిగామకు చెందిన వ్యాపారి నర్వనేని మురళికి పట్టణ శివారులో ఓ గెస్ట్ హౌస్ ఉంది. చదవండి: స్నేహితురాలి పుట్టినరోజు.. యువతుల కార్ల రేస్.. చివరికి ఏం జరిగిందంటే? అందులో ఒక ఆడ, ఒక మగ శునకాలు ఉన్నాయి. ఇవి రెండూ ఆరేళ్లుగా గెస్ట్ హౌస్‌కి కాపలా కాస్తున్నాయి. శనివారం రాత్రి పొద్దుపోయాక గెస్ట్ హౌస్‌లోకి దాదాపు ఆరడుగుల పొడవైన తాచు పాము ప్రవేశించింది. దానిని పసిగట్టిన మగ కుక్క కైజర్ పాముతో పోరాటానికి దిగింది. దానిని చంపేసింది. ఈ క్రమంలో పాము కాటుకు గురైన కైజర్ తానూ ప్రాణాలు విడిచింది. ఆదివారం ఉదయం గెస్ట్ హౌస్‌కు వెళ్లిన యజమాని, అక్కడి దృశ్యాన్ని చూసి ఒక్కసారిగా కంగుతిన్నారు. యజమాని కోసం ప్రాణాలకు తెగించి మరీ పోరాడిన శునకాన్ని సంప్రదాయబద్ధంగా ఖననం చేశారు. -
మస్కట్‌లో మహిళ ‘గోస’.. 10 రోజుల నుంచి ఫోన్ స్విచ్చాఫ్
సాక్షి, జగిత్యాల(కరీంనగర్): నిరుపేద కుటుంబం. భర్త వికలాంగుడు. ఎదిగిన కొడుకు ప్రేమ పెళ్లి చేసుకొని ఇల్లు విడిచి వెళ్లాడు. దీంతో ఆ పేద మహిళకు ఇంటి పోషణ భారం కావడంతో ఓ గల్ఫ్ ఏజెంట్ ద్వారా 36 రోజుల క్రితం మస్కట్ వెళ్లింది. అక్కడ ఇంటి యజమాని పెట్టే చిత్రహింసలకు నరకం అనుభవిస్తున్నట్లు 10 రోజుల క్రితం కుటుంబ సభ్యులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులు ఆమెతో ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నం చేస్తుండగా స్విచ్ ఆఫ్ ఉండడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కృష్ణానగర్‌కు చెందిన కొదురుపాక సత్తమ్మ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. తన బాధలు అదే కాలనీకి చెందిన రమాదేవికి చెప్పుకోగా, ఆమె తన అన్న నిజామాబాద్‌లో గల్ఫ్ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్న రవికుమార్‌కు పరిచయం చేయించింది. ఈ క్రమంలో రవికుమార్, సత్తమ్మ వయస్సుతో పాటు మతం (క్రిస్టియన్‌గా) మార్చి పాస్‌పోర్టు తీయించాడు. నవంబర్ 4న ఇంటి పని కోసమని మస్కట్‌కు పంపించాడు. అక్కడకు చేరుకున్న సత్తమ్మ ఇంటి యజమానితో తాను హిందువు అని చెప్పడంతో ఆమెను తీవ్ర వేధింపులతో పాటు అనవసరమైన పనులు చేయించడం.. చేయకపోతే దాడిచేయడంతో చెయ్యి కూడా విరిగిపోయిందని 15 రోజుల క్రితం బాధితురాలు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు తెలిపింది. దీంతో కుటుంబ సభ్యులు గల్ఫ్ ఏజెంట్ రవికుమార్ వద్దకు వెళ్లగా, తాను మస్కట్‌కు పంపించేందుకు రూ.1.50 లక్షలు ఖర్చు అయిందని, ప్రస్తుతం రూ.లక్ష చెల్లిస్తే స్వగ్రామం రప్పిస్తానని చెప్పాడు. వారి వద్ద డబ్బులు చెల్లించే స్థోమత లేకపోవడంతో జగిత్యాలలోని గల్ఫ్ సోషల్ వర్కర్ షేక్ చాంద్‌పాషాకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. అతడు స్పందించి సత్తమ్మను స్వగ్రామం రప్పించేందుకు గురువారం జాతీయ దర్యాప్తు సంస్థ, ఇంటర్‌పోల్‌తో పాటు భారత రాయబార కార్యాలయానికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశాడు. జాతీయ దర్యాప్తు సంస్థకు ఫిర్యాదు చేశాం జిల్లా కేంద్రానికి చెందిన సత్తమ్మకు గల్ఫ్ ఏజెంట్ నిబంధనలకు విరుద్ధంగా పాస్‌పోర్టు ఇప్పించి మస్కట్ పంపించాడు. అక్కడ యజమాని ద్వారా ఇబ్బందులు పడుతున్నట్లు ఆమె కుటుంబ సభ్యులు నా దృష్టికి తీసుకువచ్చారు. జాతీయ దర్యాప్తు సంస్థకు సమాచారం అందించడంతో పాటు మస్కట్ భారత రాయబార కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశాం. – షేక్ చాంద్‌పాషా, గల్ఫ్ సోషల్ వర్కర్, జగిత్యాల చదవండి: యువతి అదృశ్యం -
మేస్త్రీ అసభ్యంగా తిడుతూ, కొట్టాడు..
సాక్షి, దుండిగల్(హైదరాబాద్): అసభ్య పదజాలంతో మేస్త్రీ దూషించడంతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ మున్సిపాలిటీ సాయి పూజా కాలనీకి చెందిన రామ్‌నాథ్(32) లేబర్ పని చేస్తుంటాడు. ఆయన గాజులరామారం ప్రాంతానికి చెందిన శేఖర్ మేస్త్రీ వద్ద గత 12 సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా ఈ నెల 16న ఆలస్యంగా పనికి వచ్చిన రామ్నాథ్పై శేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బూతులు తిడుతూ చెప్పుతో కొట్టాడు. దీంతో ఇంటికి వచ్చిన రామ్‌నాథ్ జరిగిన విషయాన్ని భార్యకు చెప్పి బాధపడ్డారు. 17వ తేదీ రాత్రి కుటుంబ సభ్యులు అన్నం తిని నిద్రపోయారు. 18వ తేదీ ఉదయం 6 గంటలకు నిద్రలేచి చూడగా రామ్‌నాథ్ ఇంటి పైకప్పు రేకులకు లుంగీతో ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతన్ని కిందకు దించి చూడగా అప్పటికే మృతి చెందాడు. మేస్త్రీ అసభ్యంగా తిట్టి, కొట్టడంతోనే తన భర్త ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
యజమానికి కాసులు కురిపిస్తున్న గొర్రె.. మేళతాళాలతో ఊరేగింపుగా..
సాక్షి, మండ్య (కర్ణాటక): మామూలుగా ఒక గొర్రె రూ. 25–30 వేలు పలికితే గొప్ప. మళవళ్లి తాలూకా దేవీపుర గ్రామానికి చెందిన సణ్ణప్ప అనే వ్యక్తి చిత్రంలోని ఈ గొర్రెను పెంచాడు. రెండేళ్ల క్రితమే రూ. 1.5 లక్షలు ఖర్చు పెట్టి కొన్నాడు. ఇప్పటివరకు అనేక పిల్లలు కూడా పుట్టి మంచి ఆదాయం పొందాడు. ఇప్పుడీ గొర్రెకు నాలుగేళ్లు. బీదరకోటె గ్రామవాసి కృష్ణగౌడ గొర్రె కథ విని దేవీపురకు వచ్చి రూ.1.91 లక్షలు చెల్లించి దీన్ని కొనుగోలు చేశాడు. మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు. చదవండి: కూతురిపై ఆరోపణలు.. కుటుంబమంతా పురుగులమందు తాగారు.. -
షాకింగ్: బైజూస్ రవీంద్రన్‌పై ఎఫ్ఐఆర్
సాక్షి,ముంబై: ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ కంపెనీ యజమాని మీద ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీఎస్సీ సిలబస్‌కు సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించారనే ఆరోపణలతో బైజూస్ యజమాని రవీంద్రన్ మీద ఎఫ్ఐఆర్ నమోదు అయింది. క్రిమోఫోబియా అనే సంస్థ దాఖలు చేసిన ఫిర్యాదు ఆధారంగా నేరపూరిత కుట్ర, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సెక్షన్ 69 (ఎ) కింద జూలై 30 న ఎఫ్ఐఆర్ నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. బైజూస్ కంపెనీ యూపీఎస్సీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని అందించిందని క్రిమియోఫోబియా వ్యవస్థాపకుడు స్నేహిల్ ధాల్ ఆరోపించారు. యుపీఎస్సీ ప్రిపరేటరీ మెటీరియల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ)ను యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ట్రాన్స్‌నేషనల్ ఆర్గనైజ్డ్ క్రైమ్ (యుఎన్‌టీఓసీ)కి నోడల్ ఏజెన్సీగా పేర్కొన్నట్లు తెలిపారు. ఈ విషయాన్నిగమనించిన వెంటనే కంపెనీకి అవసరమైన మార్పులు చేయమని కోరుతూ ఒక ఇ-మెయిల్ పంపామన్నారు. అయితే బైజూస్ సమాధానంపై సంతృప్తికంరంగా లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. మరోవైపు ఈ ఫిర్యాదుపై బైజూస్ స్పందించింది. ఎఫ్ఐఆర్ కాపీని తమ న్యాయవాదులు పరిశీలిస్తున్నారని వెల్లడించారు. అలాగే క్రిమియోఫోబియా లేఖను కూడా ధృవీకరించిన సంస్థ తాము అందించిన మెటీరియల్ వాస్తవంగా సరైందనని భావిస్తున్నామన్నారు. దీనికి సంబంధించి హో మంత్రిత్వ శాఖ జారీ చేసిన బహిరంగంగా అందుబాటులో ఉన్న 2012, ఏప్రిల్ 30 నాటి అధికారిక కాపీని క్రిమియోఫోబియాకు షేర్ చేసినట్టు తెలిపారు. -
వామ్మో.. బిహారి గ్యాంగ్ .. యజమాని బయటి రాష్ట్రాలకు వెళ్లడంతో..
సాక్షి, బనశంకరి(కర్ణాటక): యజమాని ఇంట్లో వెండి ఆభరణాలు దోచుకెళ్లిన బిహారీ ముఠాను కోరమంగల పోలీసులు అరెస్ట్‌చేశారు. వీరి వద్ద నుంచి రూ.20 లక్షల విలువచేసే 17 కేజీల వెండి వస్తువులు, మూడు విలువైన గడియారాలు, నాలుగు మొబైళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులు చోటూకుమార్, రంజిత్‌కుమార్, పంకజ్‌కుమార్, గౌతమ్‌కుమార్. వీరు ఉపాధి కోసం బెంగళూరుకు చేరుకున్నారు. చోటుకుమార్ కోరమంగల బ్లాక్‌లో పారిశ్రామికవేత్త ఇంట్లో పనిచేసేవాడు. యజమాని బయటి రాష్ట్రాలకు వెళ్లిన సమయంలో చోటుకుమార్ ముగ్గురు స్నేహితులను పిలిపించి విలువైన వస్తువులను వారికి ఇచ్చి పంపాడు. యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తులో అసలు విషయం వెల్లడైంది. కుుమ్మక్కు అప్రయిజర్ అరెస్టు దొడ్డబళ్లాపురం: ఖాతాదారులు డూప్లికేట్ నగలు కుదువ పెట్టడానికి సహకరించిన అప్రయిజర్పై బ్యాంకు అధికారులు కేసు నమోదుచేశారు. ఈ సంఘటన కనకపుర తాలూకా హొన్నిగనహళ్లి కెనరా బ్యాంకులో చోటుచేసుకుంది. బ్యాంకులో 32 ఏళ్లుగా మలగూరు రాజన్న అప్రయిజర్‌గా పనిచేస్తున్నాడు. 352 మందికి ఇతని ద్వారా బంగారు నగల పరీక్షలు జరిపించి అసలైనవేనని తేల్చడంతో పెద్దమొత్తంలో రుణాలు ఇచ్చారు. ఎక్కువమంది రుణాలు చెల్లించకపోవడంతో అధికారులు అనుమానంతో నగలను పరీక్షించగా మొత్తం 81 మంది నకిలీ నగలు కుదువ పెట్టి డబ్బు కొట్టేశారని తేలింది. ఇందులో రాజన్న పాత్ర కూడా ఉండడంతో ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. -
అంగన్వాడీ కేంద్రానికి తాళం వేసిన యజమాని..
భైంసాలోని ఓవైసీ నగర్లో అద్దె భవనంలో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రానికి రెండు నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో యజమాని శనివారం ఇలా ఇంటికి తాళం వేశాడు. సరుకులన్నీ బయటపెట్టడంతో అంగన్వాడీ టీచర్ లబ్ధిదారులకు ఆరుబయటే టీహెచ్ఆర్ పంపిణీ చేసింది. విషయం తెలుసుకున్న సీడీపీవో నాగలక్ష్మి, సూపర్వైజర్ రాజశ్రీ అక్కడికి చేరుకుని యజమానికి సర్దిచెప్పడంతో మళ్లీ తాళం తీశాడు.. ఈ ఒక్క చోటే కాదు.. జిల్లాలోని పలు ప్రాజెక్టుల పరిధిలో అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలలో ఇదే పరిస్థితి. సకాలంలో అద్దె బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. భైంసాటౌన్(నిర్మల్): గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రారంభించిన అంగన్వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలు లేకపోవడంతో క్షేత్రస్థాయిలో తిప్పలు త ప్పడం లేదు. అద్దె భవనాలకు నెలనెలా బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు అవస్థలు పడుతున్నారు. యజమానులు ప్రతినెలా కిరాయి చెల్లించాలంటున్నారని, అయితే తమకు ఏడాదికోసారి కూడా బిల్లులు రావడం లేదని వాపోతున్నారు. రూ.21.40లక్షల వరకు పెండింగ్‌లో.. భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో భైంసారూరల్, అర్బన్, కుభీర్, కుంటాల మండలాలు ఉండగా, వీటి పరిధిలో 205 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాలకు సంబంధించి ఆగస్టు 2020 నుంచి బిల్లులు రావాల్సి ఉంది. దాదాపు రూ.21.40 లక్షల వరకు బిల్లులు మంజూరు కాకపోవడంతో టీచర్లు సొంతంగా అద్దె చెల్లించాల్సిన పరిస్థితి. డబ్బులు సర్దుకాని సందర్భాల్లో కొన్నిచోట్ల యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నారు. పట్టణంలోని ఓవైసీనగర్‌లో అద్దె భవనంలో ఉన్న సెంటర్ అద్దె చెల్లించకపోవడంతో యజమానికి తాళం వేసి, సరుకులన్నీ బయటపె ట్టాడు. దీంతో సూపర్వైజర్లు వచ్చి సర్దిచెప్పాల్సిన పరిస్థితి. గతంలో సైతం పులేనగర్‌లోని అంగన్వాడీ కేంద్రానికి సైతం అద్దె చెల్లించకపోవడంతో తాళం వేశారు. సొంత భవనాలుంటే... జిల్లావ్యాప్తంగా 363 కేంద్రాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో నెలకు రూ. 3వేల వరకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.వెయ్యి వర కు వీటికి అద్దె చెల్లిస్తున్నారు. అయితే ఈ బిల్లులు సకాలంలో మంజూరు కావడం లేదని టీచర్లు చెబు తున్నారు. అయితే ఏటా రూ.లక్షల్లో అద్దె చెల్లిస్తున్న ప్రభుత్వం, సొంత భవనాలు నిర్మించడంపై దృష్టి పెట్టాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెలనెలా చెల్లించాలి.. అద్దె భవనాల్లో కొనసాగుతున్న అంగన్వాడీ కేంద్రాలకు బిల్లులు సకాలంలో చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. దాదాపు ఏడాదికిపైగా బిల్లులు రావాల్సి ఉంది. మేం మాత్రం నెలనెలా చెల్లించాల్సి వస్తుంది. కేవలం రెండునెలల కిరాయి చెల్లించకపోవడంతో యజ మాని తాళం వేశాడు. ప్రభుత్వం నెలనెలా బిల్లులు మంజూరు చేస్తే మాకు ఇబ్బంది ఉండదు. – జయశ్రీ, అంగన్వాడీ టీచర్, భైంసా బిల్లులు పంపించాం.. భైంసా ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అద్దె భవనాల్లో కొనసాగుతున్న కేంద్రాల అద్దెలకు సంబంధించి బిల్లులు పంపించాం. ఆగస్టు 2020 నుంచి చెల్లించాల్సి ఉంది. యజమానులు కేంద్రాలకు తాళాలు వేస్తున్నట్లు దృష్టికి వచ్చింది. బడ్జెట్ కేటాయించగానే బిల్లులు చెల్లిస్తాం. – నాగలక్ష్మి, ఇన్చార్జి సీడీపీవో, భైంసా -
శునకం మిస్సింగ్.. ఆచూకీ చెబితే రూ.5వేలు!
టీ.నగర్: కనిపించకుండాపోయిన పెంపుడు కుక్క పిల్ల ఆచూకీ తెలియజేస్తే రూ.5వేలు బహుమతి ప్రకటించాడో ఆ శునక యజమాని. అంతేకాకుండా పోస్టర్లు సైతం ముద్రించి పలుచోట్ల అతికించాడు. వివరాలు.. శివగంగై జిల్లా, మదగుపట్టి తూర్పు వీధికి చెందిన రైతు వైరవన్. ఇతను జల్లికట్టు ఎద్దులను పెంచుతుంటాడు. పెంపుడు జంతువులంటే ఆసక్తి కలిగిన ఇతను నెల క్రితం రామనాథపురం జిల్లా, కముది నుంచి ఒక కుక్క పిల్లను కొనుగోలు చేశాడు. ఇది ప్రసిద్ధి చెందిన రాజపాళయం జాతికి చెందింది. ఇది మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయింది. దీంతో వైరవన్ కంటికి కునుకు కరువైంది. మనస్తాపానికి గురయ్యాడు. తన పెంపుడు శునకం ఆచూకీ తెలియజేస్తే రూ.5వేలు బహుమతి ఇస్తానంటూ మదగుపట్టి, బాగనేరి, సొక్కనాథపురం ప్రాంతాలలో పోస్టర్లు అతికించారు. ఇది సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆయన కుటుంబీకులు, బంధువులు ఈ శునకం అన్వేషణలో పడ్డారు. ఈ పోస్టర్లు చూసి జనం వెతికేందుకు సిద్ధమయ్యారు. -
గన్నవరం ఆర్టీసీ బస్టాండ్ లో పాప్ కార్న్ షాప్ యజమాని పై దాడి
-
పెద్దాయన క్రూరత్వం, నెటిజన్ల మండిపాటు
సాక్షి, తిరువనంతపురం: పెంపుడుకుక్కను దారుణంగా కారుకు కట్టి నడిరోడ్డుపై లాక్కెళ్లిన క్రూర చర్య సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. అదీ 62 ఏళ్ల ఒక పెద్దాయన కనీసం కనికరం లేకుండా దారుణంగా ప్రవర్తించిన వైనంపై నెటిజన్లులు మండిపడుతున్నారు. కేరళలోని ఎర్నాకుళం జిల్లాలో శుక్రవారం ఈ ఉదంతం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, తనను బాగి విసిగిస్తోందంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన యూసఫ్ ఆప్రాంతం నుండి కుక్కను దూరంగా తీసుకెళ్లి వదిలిరావాలని అనుకున్నాడు. అంతే క్షణం ఆలోచించకుండా.. ఏ మాత్రం దయ లేకుండా కుక్కను కారుకు కట్టేసి మరీ లాక్కెళ్లిపోయాడు. ఈ అమానుషాన్ని గమనించిన అఖిల్ అనే బైకర్ వీడియో తీశారు. ఇంత దారుణంగా ఎలా ప్రవర్తిస్తామంటూ ఆయన యూసఫ్‌ను అడ్డుకుని ప్రశ్నించారు. అయితే...నీకేంటి సమస్య అంటూ వాదించిన యూసఫ్ చివరకు కుక్కకు కట్టిన తాడును వదిలించి అక్కడినుంచి వెళ్లి పోయారు. దీనిపై వ్యవహారంపై అఖిల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కారు యజమాని యూసుఫ్‌పై చెంగమండ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. జంతువుల క్రూరత్వాన్ని నిరోధించే (ది ప్రివెన్షన్ ఆఫ్ క్రూయెల్టీ టు యానిమల్స్ యాక్ట్, 1960) చట్టంలోని వివిధ సెక్షన్ల కింద నిందితుడిని అరెస్టు చేసి బెయిల్‌పై విడుదల చేశామని పోలీసు అధికారి తెలిపారు. గాయపడిన కుక్కను ప్రభుత్వ పశువైద్య కేంద్రానికి తరలించి చికిత్స అందించినట్టు చెప్పారు. -
దళితులకు హెయిర్ కట్ : ఆత్మహత్యే శరణ్యం
సాక్షి, బెంగళూరు: కరోనా వైరస్, లాక్డౌన్ కారణంగా పలు వ్యాపారాలు, చిన్న, చిన్న దుకాణాలు కూడా మూతపడ్డాయి. దీంతోపాటు అనేక వృత్తి కార్మికులు కూడా ఉపాధిలేక సంక్షోభంలోకి కూరుకుపోయారు. అయితే ఇపుడిపుడే సాధారణ పరిస్థితులతో కాస్త ఊపిరి పీల్చుకుంటున్న తరుణంలో ఒక బార్బర్‌షాపు యజమాని పట్ల గ్రామ పెద్దలు అమానుషంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సీ, ఎస్టీ సామాజివర్గాలకు హెయిర్ కట్ చేశారన్న అక్కసుతో మైసూరు జిల్లాలోని నంజనాగుడు తాలూకాలోని బార్బర్ కుటుంబాన్ని బాయ్‌కాట్ చేసిన ఉదంతం కర్నాటకలో చోటుచేసుకుంది. హల్లారే గ్రామానికి చెందిన మాల్లికార్జున శెట్టి కుటుంబం కటింగ్ సెలూన్ నడుపుకుంటోంది. చెప్పినా వినకుండా ఎస్టీ, ఎస్సీ సభ్యులకు జుట్టు కత్తిరించారంటూ కొందరు కుల దురహంకారులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ కుటుంబాన్ని సామాజికంగా బహిష్కరిస్తున్నట్టు గ్రామ పెద్దలు ప్రకటించారు. అంతేకాదు ఏకంగా 50 వేల రూపాయల జరిమానా చెల్లించాలని ఆదేశించారు. గతంలో కూడా రెండుసార్లు కుల వివక్షకు గురయ్యామని జరిమానా కూడా చెల్లించామంటూ బార్బర్ మాల్లికార్జున ఆవేదన వ్యక్తం చేశారు. తమ షాపును సందర్శించిన చన్నా నాయక్ తదితరులు దళితులకు ఎక్కువ చార్జ్ వసూలు చేయాలని గతంలో ఆదేశించారని ఆరోపించారు. దీనికి తాము అంగీకరించకపోవడంతో తమ కుమారుడిని కొట్టి, బెదిరించి మరీ అతడినుంచి 5 వేల రూపాయలను లాక్కుపోయారని తెలిపారు. దళితుడికి హెయిర్ కట్ చేయడం నేరం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ ఘటనపై అధికారులకు పిర్యాదు చేశామన్నారు. ఈ హింస ఆపకపోతే, తమకు న్యాయం జరగకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యమని పేర్కొన్నారు. మరోవైపు దీనిపై ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆధునిక నాగరిక సమాజంలో జాతి, కుల, మతం అటూ విద్వేషాన్ని వెళ్లగక్కడం శోచనీయమని మండిపడుతున్నాయి. ఇంకా దళితులు, అంటరాని వారు అంటూ వివక్ష, సంఘ బహిష్కారం లాంటి ఘటనలు అమానవీయమైవనవీ, అధికారులు తగిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. -
అమ్మా.. ఇక్కడ ఉండలేకపోతున్నా!
నిజాంపేట్: ‘తమ్ముడు, చెల్లెలు చదువుల కోసం నగరంలోని ఓ ఇంట్లో పనికి కుదిరిన యువతి మృతి చెందడం కలకలం సృష్టించింది. ఇంటి యజమాని వేధింపుల తాళలేకనే తన కూతురు చనిపోయిందని మృతురాలి తల్లి.. అలాంటిదేమీ లేదు.. ఇతర కారణాలతోనే మరణించిందని యజమాని పరస్పర విరుద్ధ ప్రకటనల మధ్య పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసులు, మృతురాలి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. ప్రగతినగర్‌లోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని ప్రసాద్ అనే ఫర్నిచర్ వ్యాపారి ఇంట్లో తూర్పుగోదావరి జిల్లా పోతులూరుకు చెందిన అపర్ణ (16) నాలుగేళ్లుగా పని చేస్తోంది. అపర్ణ పంపించే డబ్బుతోనే ఆమె తల్లి అర్జమ్మ కొడుకు, కూతురునూ చదివిస్తోంది. మూడు రోజల క్రితం వాచ్‌మన్ ఫోన్ ద్వారా అపర్ణ తన తల్లితో మాట్లాడింది. తానిక్కడ ఉండలేకపోతున్నానని వచ్చి తీసుకువెళ్లాలని కోరింది. లాక్డౌన్ కావటంతో తల్లి రావటం కుదర్లేదు. ఇదే క్రమంలో ఈ నెల 1న ఉదయం తొమ్మిది గంటల సమయంలో ప్రసాద్ ఇంట్లోనే అపస్మారక స్థితిలో పడి ఉన్న అపర్ణను తొలుత స్థానిక ఆస్పత్రికి, అక్కడి నుంచి కూకట్‌పల్లికి, అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అప్పటికే పరిస్థితి విషమించి అపర్ణ మరణించింది. మంగళవారం నగరానికి చేరుకున్న ఆమె తల్లి.. కూతురు మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించింది. బుధవారం ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం అపర్ణ మృతదేహాన్ని పోతులూరుకు తరలించారు. ఆ రెండో వ్యక్తి ఎవరు? అపర్ణ 2016 నుంచి ప్రసాద్ ఇంట్లో పని చేస్తున్నట్లు తల్లి ఫిర్యాదు చేశారు. అపర్ణ తన చివరి కాల్‌ను తల్లితో పాటు మరో వ్యక్తికి కూడా చేశారు. రెండో వ్యక్తి ఎవరూ అనేది విచారణలో తేలాల్సి ఉంది. ప్రసాద్ ఇంట్లో లభించిన మూత తీసిన పురుగుల మందు డబ్బా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆమె మరణించిన సమయంలో నోట్లోంచి నురగ వచ్చిందని, పురుగుల మందే తాగి ఉంటుందని భావిస్తున్నారు. యజమాని వేధింపుల వల్లే కూతురు మృతి చెందినట్లు తల్లి చేసిన ఫిర్యాదు మేరకు ప్రసాద్ఫై కేసు నమోదు చేస్తినట్లు బాచుపల్లి సీఐ జగదీశ్వర్ తెలిపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ ఆధారంగా ముందుకు వెళతామని ఆయన చెప్పారు. -
కూలి డబ్బులు అడిగినందుకు.. కార్మికులపై దాడి
సాక్షి, వరంగల్ : తమ కూలీ డబ్బులు చెల్లించాలని అడిగినందుకు అనుచరులతో కలిసి యజమాని కార్మికులపై దాడి చేయించిన ఘటన వరంగల్‌లో చోటుచేసుకుంది. ఖిలా వరంగల్ మండలం నక్కలపెల్లి గ్రామంలో ఒడిశాకు చెందిన కొంతమంది కూలీలు ఇటుక బట్టిలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం తమ కూలీ డబ్బులు చెల్లించాలని యాజమాని శ్రీనివాస్‌ను కోరారు. దీంతో కోపోద్రుక్తుడైన యజమాని, తన అనుచరులతో కలిసి కార్మికులపై దాడికి తెగబడ్డాడు. కాగా వెంటనే కార్మికులందరు మామూనూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకొని యజమాని శ్రీనివాస్ నాయుడుపై ఫిర్యాదు చేశారు. ఈమేరకు మండల తహశీల్దార్ కిరణ్ కుమార్, సీఐ సార్ల రాజు ఘటన స్థలానికి చేరుకొని గాయపడిన కార్మికుల వివరాలను సేకరించారు, అనంతరం యజమానిని కస్టడీలోకి తీసుకొని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఉద్యోగిపై యజమాని దాడి
కర్ణాటక ,యశవంతపుర : ప్రైవేట్ భద్రత సంస్థకు చెందిన యజమాని తన వద్ద పని చేస్తున్న ఉద్యోగిపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్ అయింది. సంస్థ యజమాని సలీమ్‌ఖాన్ తన వద్ద పనిచేస్తున్న గార్డుపై ఇష్టం వచ్చినట్లు చితకబాదాడు. దీనిని అక్కడే పనిచేస్తున్న సిబ్బంది వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేశారు. ఈ ఘటన సోమవారం జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నెటిజన్లు సలీం ఖాన్‌పై నిప్పులు కక్కుతున్నారు. ఇంత అమానుషంగా ప్రవర్తించిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే సిబ్బందిని ఎందుకు ఇంత దారుణంగా కొట్టాల్సి వచ్చిందో తెలియటం లేదు. ఈ ఘటన బెంగళూరు సెక్యూరిటీ ఫోర్స్ ఆఫీసులో జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పుల్వామా ఉగ్రదాడి నిందితుడి హతం
శ్రీనగర్ : జమ్మూ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో భద్రతా బలగాలు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఘటనలో ఒక సైనికుడు మరణించారు. గాయపడిన మరో ఇద్దరు సైనికులను ఆస్పత్రికి తరలించారు. భద్రతా దళాల కాల్పుల్లో ఉగ్రవాదుల ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో పుల్వామా ఉగ్ర దాడిలో ప్రమేయం ఉన్న సాజద్ భట్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఉగ్రవాదిని ఇదే దాడితో సంబంధం ఉన్న అహ్మద్ భట్‌గా గుర్తించారు. సాజద్ బట్ 25 కిలోల పేలుడు పదార్థంతో ఉన్న మారుతి ఈకో కారును పుల్వామా దాడిలో ఉపయోగించారని ఎన్ఐఏ అధికారులు తెలిపారు. సోఫీయన్ మదర్సాలో విద్యార్థిగా ఉన్న సాజద్ పుల్వామా దాడికి ముందు కొన్ని రోజలు కనిపిచంకుండా పొయినట్లు ఎన్ఐఏ తెలిపింది. కాగా, దక్షిణ కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది సోమవారం హతమయ్యాడు. ఈ కాల్పుల్లో ఆర్మీ మేజర్ రాహుల్ వర్మ మరణించిన విషయం తెలిసిదే. -
జ్ఞానమా? శీలమా? ఏది మిన్న?
కాశీరాజు ఆస్థానంలో అనేకమంది పండితులుండేవారు. వారిలో ధర్మధరుడు మహాపండితుడే కాదు, శీలవంతుడు కూడా. రాజు పండితుల్ని వారి వారి పాండిత్యానికి తగిన రీతిలో ఘనంగా సత్కరించేవాడు. వారిలో పాండిత్యంతోపాటు శీలసంపన్నులూ ఉండేవారు. శీలగుణం లేని పండితులూ ఉండేవారు. రాజు మాత్రం వారి బుద్ధుల్ని లెక్కించకుండా కేవలం పాండిత్యానికే గౌరవ సత్కారాలు అందించడం ధర్మధరునికి నచ్చలేదు. రాజు మాత్రం అందరికంటే ధర్మధరుణ్ణే మిన్నగా గౌరవించేవాడు. ధర్మధరుడు రాజుకి జ్ఞానోదయం కలిగించాలనుకున్నాడు. ఒకరోజున నగరంలోని ఒక వజ్రాల దుకాణానికి వెళ్లాడు. దుకాణం యజమాని లేచి ధర్మధరునికి నమస్కరించాడు. యజమానితో మాట్లాడుతూ ఒక వజ్రాన్ని చేతిలో పట్టుకుని వెళ్లిపోయాడు ధర్మధరుడు. ‘మాటల మధ్య మరపుగా తీసుకుని ఉంటారు’ అనుకుని ఊరుకున్నాడు వ్యాపారి. రెండోరోజు అలానే చేశాడు ధర్మధరుడు. రెండోసారీ ఏమీ అనలేదు వ్యాపారి. మూడోరోజూ అలానే చేశాడు. వ్యాపారికి కోపం వచ్చి– ‘‘ఓరీ! దొంగవెధవా! నీ పాండిత్యం తగలబడ. నిన్ను గౌరవించడం నా తప్పు’’ అని గట్టిగా అరచి ధర్మధరుణ్ణి నాలుగు తన్ని, రాజు దగ్గరకు ఈడ్చుకుపోయాడు వ్యాపారి. దొంగగా తన ఎదుట నిలిచిన ధర్మధరుని చూసి ఆశ్చర్యపోయాడు రాజు. ‘‘రాజా! ఇప్పుడు నన్ను సత్కరించగలరా?’’అని అడిగాడు ధర్మధరుడు. ‘‘సత్కరించడం కాదు. శిక్షిస్తాను. అదే నీకు సత్కారం’’ అన్నాడు రాజు.‘‘ఔను కదా! మహారాజా! నేను మీకు చెప్పదలచుకుంది ఇదే! పాండిత్యమే కాదు, శీలం కూడా ఉండాలి. అలాంటివారినే గౌరవించాలి. కానీ, మీరు శీలం లేని పండితుల్ని కూడా అందరితోపాటే ఘనంగా సత్కరిస్తున్నారు’’ అన్నాడు ధర్మధరుడు. తను చేస్తున్న తప్పు తెలియజెప్పడానికే ధర్మధరుడు ఇలా చేశాడని రాజుకు అర్థమైంది.జ్ఞానం కంటే పాండిత్యం కంటే శీలమే గొప్పది అని బుద్ధుడు చెప్పిన కథ ఇది. – డా. బొర్రా గోవర్ధన్ -
పంచభూతాధికారి ఉదానవాయు ఆధిపత్యం–సంతానప్రాప్తి
ఎన్ని వాక్కులు సాయి పలికినవి సత్యాలయ్యాయో, ఎందరికి ఎందరెందరికి ప్రత్యక్షంగానూ–వచ్చి దర్శించుకోలేని వృద్ధాప్య బాధతో సంతానం చూడటం లేదనో దుఃఖంతో తల్ల్లడిల్లిపోతున్నవారికి పరోక్షంగానూ సాయి వాక్కు వజ్రాయుధంలా పనిచేసి కష్టాలనే కొండలని పిండి చేసేసిందో ఆ పద్ధతిని తెలుసుకుంటూ ఉంటే సమయం తెలియదు. ఆనందభారానికి శరీరం పట్టదు.పంచభూతాల్లోనూ ఒకటైన వాయువులో ఉన్న వాటిలో ఉదానవాయువుని సాయి ఎలా అదుపు చేసాడో ఓ వితండవాది విషయంలో తెలుసుకున్నాం. ఇప్పుడు అదే ఉదానవాయువుని ఎలా సాయి తన అదుపులో ఉంచుకున్నాడో మరో ప్రత్యక్ష ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం!అంతేనేమో జీవితం!!మహారాష్ట్రలో ‘నాందేడ్’ అనే ప్రసిద్ధ ప్రదేశం ఉంది. అది మంచి వ్యాపారాలకి నిలయం. ధనవంతులకి ఆ ఊరు ఆటపట్టు. అక్కడ నాస్తికులూ వితండవాదులూ లేరుగాని, భక్తిభావం మాత్రం సాధారణంగానే ఉంటూ ఉండేది. ఎంతమటుకూ ధర్మబద్ధమైన వ్యాపారం ఆర్జన కుటుంబసభ్యుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఉండటం పనివాళ్లని తగుప్రేమతో చూడటం.. ఇంతే సంసారచక్రానికి సరైన జీవితాలుగా ఉంటూండేవి వాళ్ల ప్రవర్తనలన్నీ, ఎవరైనా పూనుకుని ఓ మంచిపని చేద్దామనుకుంటే ఆ పూనుకున్న వ్యక్తిని బట్టి పనికి సహకరిస్తూ ఉండేవారు. వాదవివాదాలు అనవసరమనే ధోరణే వాళ్లది. ‘మంచి అయినట్లయితే పది రూకలిచ్చి తెచ్చుకో! అదే చెడు అయినట్లయితే పది రూకలిచ్చి వదిలించుకో!’ అనే సామెత ప్రకారం ఉండేవాళ్లు తప్ప తమంత తాముగా ఏ పనికీ పూనుకునేవారు కాదు.. కారణం వ్యాపారాలు దెబ్బ తింటాయేమోనని.ఇలాంటి పట్టణంలో రుస్తుంజీ వాడియా అనే వర్తకుడు ఉంటూండేవాడు. సహజంగా వర్తకుడనగానే లాభసాటి పనుల్నే చేస్తాడనీ, మోసం చేయడంలో దిట్ట అనీ, పిల్లికి బిచ్చమైనా పెట్టడనీ, ఆ సొమ్ముతో మరో వ్యాపారానికి పెట్టుబడి పెట్టుకోవచ్చుగా! అనే దృక్పథంతో ఉండేవాడనీ మనలో ఓ అభిప్రాయం దృఢంగా పాతుకుపోయి ఉంది. అయితే రుస్తుంజీ వాడియా వృత్తికి వర్తకుడే అయినా, పైన అనుకున్న లక్షణాల్లో ఏ ఒక్కటీ (వ్యతిరేకం) కలవాడు కాడు. పెద్దలంటే గౌరవం, పిన్నలమీద వాత్సల్యం అనురాగం, శరీరం నిండుగా దైవభక్తి, దానధర్మాలు, సమయాన్ని వెచ్చిస్తూ దైవ ఉత్సవాల్లో పాల్గొనడం... వంటి అన్ని సత్కార్యాలనీ చేస్తుండేవాడు. అందరూ కూడా రుస్తుంజీని చూస్తూ వాళ్లంతట వాళ్లే ‘ఇతను చక్కగా ఉండితీరాలి కలకాలం. పూర్తిగా భగవంతుడి తీర్చిదిద్దిన వ్యక్తి ఇతను. ఎంత అదృష్టవంతుడో:’ అని హృదయపూర్వకంగా పొగుడుతూ ఉండేవారు. నిజానికి అవన్నీ వాస్తవాలే తప్ప స్తవాలు (పొగడ్తలు) కానేకావు.అంత విశాలమైన ఆకాశానికి సన్నని చిల్లుల్ని (వర్షించేందుకు వీలుగా) ఏర్పాటు చేసినట్లూ, అంత సువిశాలమైన భూమికి (ఏ వస్తువునైనా తనలో దాచేసుకునే) ఓ చిత్రమైన బుద్ధిని పెట్టినట్లూ, ఎంతో పెద్దదైన సముద్రానికి ఉప్పదనాన్ని తగిలించినట్లూ, భగవంతుడు ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కరికీ ఎన్నో ఎన్నెన్నో ఆనందాలని కలిగించినా ఏదో ఒక్క లోపాన్ని కూడా తగిలించినట్లు ఆ రుస్తుంజీ దంపతులకి ఆయుష్షు, ఆరోగ్యం, భోగ, భాగ్యాలనే అన్నింటినీ పుష్కలంగా ఇచ్చినా అతి ముఖ్యమైన సంతానాన్ని మాత్రం ఇచ్చి ఉండలేదు.ఎదురుచూడని ధనాదాయం–వ్యాపారం ద్వారా తెగ వచ్చిపడుతూండేది. ఎదురుచూసే సంతాన లాభం మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా వచ్చి ఉండలేదు. భార్యాభర్తలు మనస్తాప పడుతూండేవారు. ఒకసారి ఆమె అంది రుస్తుంజీతో నేను పడుతున్నంత మనోవ్య«థ మీలో కనిపించడం లేదు. ఎందుకని? అని.అతనామెని దగ్గరకి తీసుకుని.. ‘పిచ్చిదానా! మధ్యలో చిరిగిన విస్తరిలో భోజనాన్ని చేస్తున్నట్లూ, ఆరిపోబోతున్న దీపపు వెలుగులో అడవిలో నడుస్తున్నట్లూ, అన్నీ ఉండి కూడా అనుభవించలేని పేద ధనికుని లాగా నేనున్నాను. స్త్రీ–పురుషుల్లో భేదమేమిటో తెలుసునా? స్త్రీలు బయటపడిపోతారు. పురుషులు తన దుఃఖాన్ని లోలోపల అణుచుకుంటూ స్త్రీ (భార్య)కి ధైర్యాన్ని చెప్తాడు. తేనెతో నిండుగా ఉన్న కుండకి చిన్న రాతి దెబ్బ తగిలితే ఎలా మొత్తం తేనె నేలపాలవుతుందో అలా ఇలాంటి ప్రశ్నగాని వస్తే మొత్తం దుఃఖమంతా వెలికి వచ్చేస్తుంది’ అంటూ గొంతు పెగిలిన దుఃఖంతో బావురుమన్నాడు.దాంతో ఆమె అతడ్ని ఓదార్చింది. ఏదో ఒకసారి దైవాన్ని గురించిన ఉపన్యాసానికి వెళ్తే అక్కడ ‘అపుత్రస్య గతిర్నాస్తి’ సంతానం లేనివాళ్లకి ఉత్తమగతులుండవంటూ ఆ ప్రవచనకర్త ఉపన్యసించగానే దాదాపు రెండు మూడు రోజులు ఇద్దరికీ నిద్రలు లేవు. మనకీ జీవితంలో ‘సంతానంలేని దుఃఖమే– అంతేనేమో జీవితం!’ అనుకున్నారు. ఆ దంపతులు తిరగని క్షేత్రం లేదు. దర్శించని దేవాలయం లేదు. ఆచరించని పుణ్యస్నానాలు లేవు. మొక్కని చెట్టు లేదు. పాలు పోయని పుట్ట లేదు. ఔషధం తీసుకోని వైద్యుడు లేడు. శాంతి జప హోమాలు చేయించని గ్రహం లేదు. మానవ శక్తికి అనుగుణంగా చేయని ప్రయత్నం లేదు. ఎవరికీ దక్షిణలు ఇవ్యడంలో గాని, వైద్యులకు రుసుములు ఇవ్వడంలోగాని, తీర్థయాత్రల్లో దానధర్మాలు చేయడంలో గాని ఏ తీరు లోపమూ చేయలేదు వారు. గొప్ప విశేషమేమిటంటే ఈ దంపతుల గురించి మాట్లాడుతూ– దేవుడే ఉంటే ఇంత పుణ్యదంపతులకి సంతానాన్ని ఎందుకివ్వడంటూ ఉండేవారు గాని, ఈ దంపతులు మాత్రం ఏనాడూ అలా మనసులో కూడా అనుకోలేదు. తప్పక సంతానవంతులమవుతామనేదే వాళ్ల దృఢ భావన.ఈ కథ ఎందుకింత వివరంగా చెప్పబడింది సాయిచరిత్రలోనంటే– ఒకప్పటి రోజుల్లో పెళ్లయిన రెండు నెలల్లోనే గర్భవతులయ్యేవాళ్లు కాబట్టి వాళ్లకి సంతానలేమి గురించి వ్యథ తెలిసేది కాదు. అదే మరి వివాహమై దశాబ్దం, మళ్లీ మాట్లాడితే రెండు దశాబ్దాలు గడిచినా సంతానం లేని వాళ్లకి తెలుస్తుంది ఆ దుఃఖం, ఆ మనోవ్యథ కాబట్టి. పదిహేను రోజుల పాటు అమావాస్య చీకటిని అనుభవించాక ఇక శుక్లపక్షం వచ్చినట్టుగా కొద్ది రోజులు ఆగితే పూర్ణిమనాడు పదహారు కళలతోనూ చంద్ర దర్శనం అయినట్టుగా రుస్తుంజీకి ఓ ఆలోచన తట్టింది ఓ రోజున.దాస్‌గణు రుస్తుంజీకి గురువు. ఆధ్యాత్మికంగా వచ్చిన అన్ని ప్రశ్నలకీ సమాధానాలు ఇస్తుండటమే కాక, తలపట్టు సమస్యలు గాని వచ్చిన పక్షంలో చటుక్కున చిక్కుముడి విప్పేయగల శక్తిమంతుడు కూడా ఆయనే రుస్తుంజీకి. కొన్ని కొన్ని సందర్భాల్లో– ఉయ్యాలలోనే పిల్లను పడుకోబెట్టి ఆ ఇల్లాలు ఊరంతా వెదికిన చందంగా– అతి ముఖ్యమైన వ్యక్తే గుర్తుకి రాడు. దానికి ఈ దంపతులే ఉదాహరణ. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ దంపతులు దాస్‌గణు వద్దకు వెళ్లి మొత్తం గోడు వెళ్లబోసుకున్నారు. సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో ధనవంతులకి ఏదో తోచిన మార్గాన్ని చెప్పి సొమ్ము కాజేస్తూ ఉండే కొందరు వెదుక్కుంటూ ఇలాంటి దీనుల వద్దకొచ్చేస్తారు. అయితే దాస్‌గణు అలాంటివాడు కాదు. అందుకే ఆయన సూటిగా వీళ్లని సాయి దర్శనానికి వెళ్లవలసిందిగా చెప్పాడు. ఇక్కడిదాకా ఈ వృత్తాంతాన్ని వింటున్న లేదా చదువుతున్న పాఠకులకి– ఇంకేముంది? సాయి దర్శనమయింది– సంతానం లభించింది– అనే ముగింపు వచ్చేస్తుంది– అనే ఆలోచన కలుగుతుంది. అలా తేలికగా ఆలోచించకూడదు. మనం అనుకుంటున్నది సాయికి ఉదానవాయువు మీద ఆధిపత్య శక్తిని గురించి కదా! ఇద్దరూ షిర్డీ చేరారు.గోసాయి రూపంలో సాయి కనిపించాడు. పూర్తి ఫకీరుగా ఒకవైపు చిరిగిన చేయి ఉన్న పెద్ద కఫ్నే (పెద్ద లాల్చీ)తో నలిగిపోయిన వస్త్రాలతో ఏమాత్రం మరమ్మతులకీ నోచుకోని పాతకాలపు భవంతిలా ఉన్న సాయి కనిపించాడు. ఇతడా మాకు సంతానాన్ని కలిగించగలవాడనే తీరు ఆలోచనే వాళ్లకి రాలేదు సరికదా ఇద్దరికీ కూడా ఆ సాయి ఎన్ని సంవత్సరాల నుంచో మహా పరిచితుడిగా ఉన్నట్లు అనిపించింది.ఇద్దరికీ ఒకే ఒక్కసారి సాయి శిరసు చుట్టూ దివ్యకాంతి వెలుగుతూ కనిపించినట్లయింది. శరీరం పులకలెత్తడమే కాక ఏదో చెప్పుకోబోయినా నోట మాట రానట్లయింది. ఇద్దరూ ఏకకాలంలో ఆయన పాదాల మీద తల పెట్టి మౌనంగా తమ మనోవ్యథ చెప్పుకోబోయారు. వాళ్లింకా చెప్పకుండానే ‘బిడ్డా! లే!’ అంటూ ఇద్దరినీ పైకి లేవమని చెబుతూ సాయి ఆ ఇద్దరి కళ్లలోకీ చూస్తూ మాట్లాడటం ప్రారంభించాడు. సాధారణంగా బాబా దగ్గరకి ఎవరైనా అదే మొదటిసారిగా దర్శనానికంటూ వస్తే అక్కడుండే భక్తులందరిలో ఓ భయం ఉంటూ ఉంటుంది. ఆ భక్తుడు గాని సాయి గురించి ఏవైనా వ్యతిరేక ప్రచారాలు చేసి ఉంటే నలుగురిలో బహిరంగంగా ఛీత్కారాలకి గురి కావాల్సిందే. ఇంకా దుర్మార్గపు పనులుగాని చేసి ఉన్నవాడై ఉంటే అతణ్ణి పరిచయం చేయడం కోసం తెచ్చిన సాయి భక్తుణ్ణి ఉద్దేశించి మాట్లాడుతూ– ‘ఇలాంటి నీచుణ్ణి, మోసగాణ్ణి ఎందుకయ్యా తెచ్చావు’ అంటూ మాట్లాడే సాయి మాటలకి తలవంచుకోవాల్సిందే. పరిస్థితులు ఇలా ఉంటాయి. కాబట్టి ఈ దంపతులకి ఏ అదృష్టం/దురదృష్టం పట్టబోతుందోనని అలా చూస్తూ ఉండిపోయారు భయంతో అందరూ.సాయి ఆ ఇద్దరినీ ఆనందకర నేత్రాలతో చూస్తూ సుదీర్ఘోపన్యాసం ధర్మబోధగా చేయనారంభించాడు. ఇక్కడే ఉంది రహస్యం. కంఠంలో ఉండే ఉదాన వాయువు తన ధ్వని తరంగాలని అలా ప్రసరింపజేస్తూ ఎదుటి వ్యక్తిని పూర్తిగా మార్చేయగలుగుతుంది. ఆ మాట్లాడే వ్యక్తి కంఠంలో ఆ శక్తిని దైవధ్యానం కారణంగా గాని పొంది ఉండినట్లయితే! మృకండ మహర్షి పుత్రుడైన మార్కండేయుణ్ణి పుట్టుకకి పూర్వమే అల్పాయుష్కునిగా ఉండడానికి తప్పనిసరిగా మరో తోవ లేక ఒప్పుకున్నారు తల్లిదండ్రులు. అయితే సప్తమహర్షులూ నడిచి వెళ్లే తోవలో మార్కండేయుణ్ణి నిలబెట్టి వాళ్లందరికీ ఒకరి పిమ్మట ఒకరికి సాష్టాంగ ప్రణామాలు చేయిస్తే సమస్య తీరిపోతుందని నారదుడు చెప్పాడు మృకండ మహర్షికి. అంతే. వస్తూండే అందరికీ క్రమంలో సాష్టాంగాన్ని చేయిస్తుండటమేమిటి? వాళ్లంతా నమస్కరిస్తే అందునా దండ ప్రణామం చేయని పక్షంలో రుణగ్రస్తులం పుణ్యక్షీణులం (సాష్టాంగ దండ ప్రణామాన్ని చేసిన వ్యక్తికి ఆశీర్వదించిన కారణంగా ఆ ఆశీర్వచనానికి సరిపడినంత పుణ్యం క్షీణిస్తుంది. పుణ్యనష్టం అవుతుంది కదా అని ఆశీర్వదించకపోతే నమస్కరించిన వ్యక్తికి రుణగ్రస్తుడవుతాడు నమస్కారాన్ని స్వీకరించిన వ్యక్తి) అవుతాం కదా! అనే దృష్టితో ఒక్కొక్కరూ ‘దీర్ఘాయుష్మాన్ భవ– చిరంజీవీ భవ– దీర్ఘాయుష్యమస్తు’ అని ఈ తీరుగా ఆశీర్వదించసాగారు. ఈ ఆశీర్వచనాలన్నీ ఆ అందరి మహర్షుల తపశ్శక్తిని నింపుకున్న ఉదానవాయువులు నిండిన కంఠాల నుంచి వచ్చినవి కనుకనే మార్కండేయుని వద్దకి యముడొచ్చినా మార్కండేయుడు దీర్ఘాయుష్మంతుడయ్యాడు. కాబట్టి ఉదానవాయువుకి ఆ శక్తి తపశ్శక్తి వల్నే వస్తుందనేది యదార్థం.అదే తీరుగా నిరంతరం ‘అల్లాహ్ హో మాలిక్’ మంత్ర జపాన్ని చేస్తుండే సాయికి, లోగడ పన్నెండేళ్లు మంత్ర మననాన్ని చేసి ఉన్న సాయికి ఉదానవాయు శక్తి పరమాధికంగా ఉంది. అందుకే ఈ దంపతులను చూస్తూ ఆ ఇద్దరిలోనూ ఏవిధమైన అసత్య– అధర్మ దోషమూ లేదని గ్రహించి వారి దుఃఖాన్ని పోగొట్టాలనుకుంటూ మాట్లాడటం మొదలుపెట్టాడు. ‘దంపతులారా! మరణాన్ని వెన్నంటి జననం, జననాన్ని వెన్నంటి మరణం అనేది ఉంటూనే ఉంటుంది. ప్రతి జీవి ఈ జనన మరణ చక్రాల్లో తిరుగుతూ ఉండాల్సిందే. పాప పుణ్యాల్లో పుణ్యఫలం ఎక్కువగా ఉన్నట్లయితే ఆ చక్రానికి బరువు ఎక్కువై, ఇరుసు బిగిసిపోయి చక్రాన్ని తిరగనీయదు. దాంతో మరణానంతరం మరో జన్మ రాదు. తీర్థయాత్రలూ పవిత్ర నదీస్నానాలూ ఏవేవో పుణ్యకార్యాలు చేసి స్వర్గాన్ని ఆశించినా స్వర్గం దుర్లభం. అనేక కఠిన యజ్ఞయాగాదులు చేసిన మహర్షులంతటి వాళ్లు కూడా కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలనే ఆరింటిలో మొదటి పరీక్షలో ఓడిపోయిన వారే దాదాపుగా. మొదటి పరీక్షలో ఉత్తీర్ణులయ్యారనుకునేంతలో రెండో పరీక్ష రానే వస్తుంది. దాంట్లో గెలిస్తే మూడవది సిద్ధం. ఏ మహర్షీ మూడో పరీక్షలో నెగ్గలేకపోయాడు. ఇది మహర్షులని తక్కువ చేసి నిందించే మాట కాదు. అంత అసాధ్యమని తెలియజేయడమే దీని లక్ష్యం. ఈ తీరుగా సాయి ఉపన్యసిస్తూ సాగిపోతుంటే సంతానప్రాప్తికి వచ్చిన వాళ్లకి సాయి పరమార్థ బోధ చేయడంలో లో అర్థమేమై ఉంటుందా అనేది ఎవరికీ అంతుబట్టలేదు. కారణం ఒక్కటే. పిల్లవాడు ఏదో కావాలని అడుగుతాడు. ఏడుస్తాడు. దాన్ని ఇస్తే వాని ఆరోగ్యం దెబ్బతింటుందనుకుందాం! అప్పుడు తల్లి ఏం చేస్తుంది? అతణ్ణి ఏమరుపాటుకి గురయ్యేలా చేస్తూ ఏవేవో సంబంధం లేని మాటలు చెబుతూ వాణ్ణి తనవైపు తిప్పుకుంటుంది. ఆ చెబుతున్నది తన తల్లి కదా! అందుకని వాడు వింటూనే ఉంటాడు. ఆ కావలసిందేదో దేనికోసం ఏడ్చాడో ఆ విషయాన్ని మర్చిపోతాడు. సరిగ్గా సాయిబోధ కూడా అలాంటిదే. సంతానం ఆపేక్షించే దంపతులకి కావలసినది మనశ్శాంతి తప్ప లోపల విరక్తీ నిరాశా నిస్పృహా సంతానం కలగదేమోననే దుఃఖాలోచనలూ కావు. ఈ విషయాన్ని సంతానాన్ని ఆపేక్షించే అందరూ గుర్తుంచుకోవాలి. మౌనంగా సాయి కళ్లలోకి చూస్తూ తమ దుఃఖాన్ని వెల్లడించుకుంటే ఆయన తప్పక తన కళ్ల నుంచి ఈ తీరు ప్రబోధాన్ని మనకి చేస్తూనే ఉంటాడన్నమాట. ఆ బోధ మనకి అర్థం కావచ్చు, కాకపోవచ్చు. మౌనంగా ఆ సాయి కళ్లలోకే చూస్తూ ఉండిపోవాలనేది ఇక్కడి అద్భుత రహస్యం.రుస్తుంజీ దంపతులు అలా వింటూనే ఉండిపోయారు. ఇంద్రుడున్నాడు. తూర్పు దిక్కుకి అధ్యక్షుడు. అంతేకాదు, దేవతలంతా ఆయనని తమ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. పాల సముద్రంలోంచి వచ్చిన తెల్లని ఐరావతమనే ఏనుగుని ఆయనకి అయాచితంగా కట్టబెట్టారు. ఆయనకున్న భోగాన్ని తక్కువ లేదు. అందుకే ఇంద్రభోగమంటారు. ఆ భోగం ఇంద్రునికి మాత్రమే ఉందనుకోకూడదు. ఒక గాడిద ఉందనుకుందాం! దాని యజమాని చక్కగా దానికి స్నానం చేయిస్తే వెంటనే వెళ్లి ఒళ్లంతా దుమ్ము అంటుకునేలా దుమ్ములో పొర్లి పొర్లి ఆ స్నానం చేయించిన ఫలితం లేకుండా చేసుకుంటుంది. పోలిక సరికాదు గానీ అర్థమవుతుందని చెబుతున్నాను. ఇంద్రుడు తనకున్న భోగానికి ఎంత ఆనందపడతాడో, గార్దాభం కూడా దుమ్ములో పొర్లాడినప్పుడు అంత ఆనందాన్నీ పొందుతుంది. అంటే ఏమన్నమాట? ఆనందమనేది అందరికీ ఒకేలా ఉండదు. ఒకటే ఉండదు. ఎవరి ఆనందం వారిదే. ఎవరి ఆనంద స్థాయి వారిదే.అలాగే మీకున్న భోగభాగ్యాలు ఎందరికో లేవు. వాళ్లకున్న సంతాన సౌఖ్యం మీకు లేదు. అంటే– ఎవరికైనా ఏదో ఒక లోపం– తద్వారా దుఃఖం ఉండి తీరుతుందన్న మాట. ఏ జన్మలో ఎంత పాపం చేసుకున్నామో ఆ పాప క్షయమయ్యేంత వరకు వాళ్లకున్న లోపం లోటూ తీరదు. మీరు చేసిన దాన ధర్మాలూ పుణ్యకార్యాలూ పవిత్ర నదీస్నానాలూ గ్రహజపాలూ, అలాగే భౌతికంగా చేసిన వైద్య చికిత్సలూ.. ఇవన్నీ పాపక్షయానికి తోడ్పడినవే. అందుకే ద్వారకామాయికొచ్చారు. చివరి ప్రయత్నంగా– అంటూ ఆమె చేతికి నాలుగు ఫలాలనిస్తూ ‘తల్లీ! వీటిని నువ్వే భుజించు. నీకు పుత్రులెందరో తెలుసా? ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, నలుగురు.. అన్నాడు. ఆ దంపతుల కన్నుల్లో ఆనందబాష్పాలు అలా స్రవించసాగాయి. ఆమె సాయినే దైవంగా భావిస్తూ ముమ్మారు ప్రదక్షిణం చేసింది. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే వారికి సంతానం లేదనే లోటుని సాయికి వాళ్లు విన్నవించుకోకుండానే సాయి సర్వాన్ని లోనేత్రంతో గ్రహించి ఫలాలనందించి, నలుగురు పుత్రులంటూ సంఖ్యతో సహా సంతానప్రాప్తిని చెప్పడం రుస్తుంజీకి ఒళ్లు తెలియని ఆనందం కలిగించింది. ‘తండ్రీ! దేవా!’ అంటూ కన్నుల నుంచి నిండుగా వస్తున్న ఆనందబాష్పాలతో సాయిని గట్టిగా కౌగిలించుకున్నాడు రుస్తుంజీ తన ఒళ్లు తనకి తెలియక అలా చేయవచ్చునో లేదో ఆలోచించే ఆలోచనే రాక.సాయి నోట వెలువడిన ఆ ఉదాయనవాయు శక్తి ఫలితంగా ఆమె సాయి అన్నట్లుగా నలుగురు పుత్రులను కన్నది. ఎంత ఆశ్చర్యం! ఇక సాయికి ఉన్న సమానవాయు ఆధిపత్యం గురించి తెలుసుకుందాం. –సశేషం -
శాకాహార పిల్లి.. యాజమానిపై విమర్శలు
కాన్బెర్రా : మనషుల్లో శాకాహారులు ఉండటం చాలా సహజం. అలా ఏళ్ల తరబడి మాంసం ముట్టకుండా కూరగాయలు తింటూ బతికేస్తుంటారు. కానీ ఆస్ట్రేలియాకు చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను పాటించే నియమాలను పెంపుడు జంతువు కూడా పాటించేలా చేశాడు. దీంతో కొంత మంది జంతుప్రేమికులు అతనిపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌కు చెందిన హ్యారీ బొల్మన్(53) పూర్తి శాకాహారి. గత 38 ఏళ్లుగా ముక్కముట్టకుండా కాలం గడుపుతున్నాడు. అయితే ఓ ఏడాది క్రితం ఓ పిల్లిని పెంచుకుందామని ఇంటికి తెచ్చుకున్నాడు. దానికి ఉమా అని పేరుపెట్టి దాన్ని కూడా పూర్తి శాకాహారిగా మార్చాడు. ఈ విషయం అందరికి తెలిసిపోవటంతో అతనిపై విమర్శలు మొదలయ్యాయి. దీంతో హ్యారీ స్పందిస్తూ.. తాను చాలా ఏళ్లుగా శాకాహారిగా ఉన్నానని, గతంతో పెంచుకున్న కుక్కలను సైతం శాకాహారులుగానే పెంచానని తెలిపాడు. ప్రస్తుతం పెంచుకుంటున్న పిల్లి కూడా శాకాహారంతో చాలా ఆరోగ్యంగా ఉందని పేర్కొన్నాడు. అయితే సరైన మోతాదులో జంతు సంబంధమైన ప్రోటీన్లు పిల్లికి లభించకపోతే ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని పశు వైద్యాధికారులు తెలిపారు. -
చేసిన మోసం!
అదొక మామిడి చెట్టు. ఆకు కనిపించకుండా కాయలు విరగ్గాశాయి. దాని యజమాని చెట్టు నుండి పండిన కొన్ని కాయలు కోసుకుపోయాడు. అందరి దృష్టీ వాటి మీద పడింది. తలా కొన్ని కాయలు కోసుకుపోతున్నారు. కొన్ని కాయలు పండి నేలమీద పడుతున్నాయి. వాటిలో ఒక కాయ మాత్రం బాగా పిరికిది. ఆ పిరికి కాయ ఆకుల గుబుర్ల మాటున దాక్కుని అలానే ఉండిపోయింది. తన సహచరులందరూ దూరం అవడంతో గాభరా పడసాగింది. అలాగని తనంతట తాను పండి నేలమీద పడడం కానీ, ఎవరి కంటా పడడం కానీ ఇష్టం లేదు. దాంతో చెట్టుకే అతుక్కుపోయింది. తన మీద తనకు ఉన్న ‘మోహం’ దానిని బయటపడనివ్వలేదు. కానీ కాలం ఊరుకుంటుందా? కాయ కుళ్లి, అందులో పురుగులు పడ్డాయి. అలా చెట్టుకు ఉండగానే దానిని తినేయసాగాయి. అలా మరికొంత కాలం గడిచింది. చెట్టుకే ఎండి, మరింతగా అతుక్కుపోయింది ఆ పిరికి మామిడి. ఒకరోజు బాగా వేగంగా వీచిన గాలి, ఎండిన ఆకులతో సహా దీనిని కూడా తెంచి పక్కనే ఉన్న మురికి గుంటలో పడేసింది. అప్పుడు కానీ దానికి అర్థం కాలేదు తాను ఎందుకూ పనికి రాకుండా పోవడానికి తనలో దాగి ఉన్న మోహమే కారణమని. – డి.వి.ఆర్. -
పెట్రోల్ బంకులో దాష్టీకం.. వైరల్
పెట్రోల్ బంకులో పని చేసే వ్యక్తిపై బంకు యాజమాని దాష్టీకానికి పాల్పడ్డాడు. కట్టేసి మరీ అతన్ని దారుణంగా హింసించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతుండగా.. అధికారులు రంగంలోకి దిగి నిందితులను అరెస్ట్ చేశారు. భోపాల్: మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌లో తాజాగా ఈ ఘటన చోటు చేసుకుంది. కొన్నిరోజులుగా పనులోకి రావట్లేదన్న కోపంతో సదరు వ్యక్తిని బంక్‌లోని పిల్లర్‌కు కట్టేసి ఆ యాజమాని కొరడాతో చితకబాదాడు. అంతేకాదు అక్కడే ఉన్న మరోవ్యక్తితో కూడా అతను కొట్టించాడు. ఎంత బతిమిలాడుకున్న అతన్ని విడిచిపెట్టలేదు. అక్కడికొచ్చిన ఓ వాహనదారుడు ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయగా, వైరల్ కావటంతో పోలీసులు నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. ‘నాకు చిన్న యాక్సిడెంట్ అయ్యింది. అందుకే వారం నుంచి పనిలోకి రావట్లేదు. ఆ కోపంతోనే బంక్ ఓనర్, అతని స్నేహితుడు నాపై దాడి చేశారు’ అని బాధితుడు చెబుతున్నాడు. -
పెట్రోల్ బంకు యాజమాని దాష్టీకం..
-
అప్పు తీర్చమన్నందుకు.. ప్రాణం తీశాడు
కోల్‌కతా : పాత బాకీ తీర్చమన్నాడన్న కోపంతో బిర్యానీ బండి యాజమానిపై తుపాకీతో కాల్పులు జరిపాడో వ్యక్తి. ఈ సంఘటన ఆదివారం పశ్చిమ బెంగాల్ రాష్ట్రం పరగణ జిల్లాలోని భట్పారా పారిశ్రామిక వాడలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. భట్పారా పారిశ్రామిక వాడకు చెందిన సంజయ్ మండల్(40) తోపుడు బండిపై బిర్యానీ పాయింట్ నిర్వహిస్తున్నాడు. ఆదివారం రాత్రి 9గంటల సమయంలో అదే ప్రాంతానికి చెందిన మహ్మద్ ఫిరోజ్(26) అతని స్నేహితులు అక్కడికి వచ్చారు. తమకు బిర్యానీ పార్శిల్ కట్టాల్సిందిగా సంజయ్‌ని కోరారు. దీంతో సంజయ్ మండల్ ముందుగా డబ్బులు ఇస్తేనే బిర్యానీ ఇస్తానన్నాడు. ఆగ్రహించిన ఫిరోజ్ బిర్యానీ అధిక ధరలకు విక్రయిస్తున్నాడని ఆరోపిస్తూ సంజయ్‌తో గొడవ పెట్టుకున్నాడు. గొడవ పెద్దది చేయడం ఇష్టంలేని సంజయ్ వారిని పాత బాకీ 190 ఇవ్వాలన్నాడు. పాత బాకీ అడగటంతో కోపగించిన ఫిరోజ్ వెంట తెచ్చుకున్న తుపాకీతో సంజయ్‌పై రెండు రౌండ్లు కాల్పులు జరిపి అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర రక్త స్రావంతో సంజయ్ అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మహ్మద్ ఫిరోజ్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిపినపుడు ఫిరోజ్ వెంట ఉన్న మరో ముగ్గురిని త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. -
మద్యం మత్తులో కారుపై పెట్రోల్ పోసి దగ్ధం
జైపూర్(చెన్నూర్): జైపూర్ మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంటు ప్రహరీ గోడ సమీపంలో పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఇమ్రాన్ అనే వ్యక్తి తన ఎర్టీగా కారును మద్యం మత్తులో గురువారం రాత్రి 1గంట సమయంలో పెట్రోల్ పోసి కాలబెట్టాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం టీఎస్08ఈయూ7243 అనే ఎర్టీగా కారు ఖమ్మం జిల్లాకు చెందినది కాగా పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన ఇమ్రాన్ కొనుగోలు చేశాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో తన భార్య పుట్టింకి వెళ్లింది. ఈ క్రమంలో గురువారం జైపూర్ మండల కేంద్రానికి వచ్చిన ఇమ్రాన్ నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి వెళ్లి మద్యం మత్తులో తన ఎర్టీగా కారును తానే కాలబెట్టుకున్నాడు. కాగా అర్ధరాత్రికి రాత్రి కారు ఇక్కడకి తెచ్చి కాలబెట్టడంపై స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులు విచారించగా తానే మద్యం మత్తులో కారును తగులబెట్టిన్నట్లు ఇమ్రాన్ చెప్పినట్లు స్థానిక ఎస్సై ఆంజనేయులు తెలిపారు. -
అప్పులబాధతో సాఫ్ట్వేర్ కంపెనీ అధినేత ఆత్మహత్య
నవాబుపేట(జడ్చర్ల) : సాధారణ గిరిజన కుటుంబం నుంచి వచ్చిన ఆ యువకుడు బీటెక్ అయిపోగానే.. సాఫ్ట్వేర్ కోర్సులు పూర్తిచేశాడు. ఆ తర్వాత తనకే కాకుండా మరికొందరికి ఉపాధి కల్పించాలన్న సదుద్దేశంతో అప్పులు చేసి మరీ సాఫ్ట్వేర్ కంపెనీని స్థాపించాడు. అయితే, ప్రభుత్వం నుంచి ప్రాజెక్టులు వస్తాయని భావించినా అలాంటిదేమీ లేకపోవడం.. అప్పులు చెల్లించే పరిస్థితి లేకపోవడంతో ఆత్మహత్య చేసుకుని తన బంగారు జీవితాన్ని అర్ధంతరంగా ముగించాడు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని నవాబుపేట మండల పరిధిలోని కొల్లూర్ పరిధిలోని బట్టోనిపల్లి తండాకు చెందిన హరికృష్ణనాయక్(23) గత ఏడాది హరిభారతి ఆర్గనైజేషన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పేరిట సాఫ్ట్వేర్ కంపెనీనీ మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేశాడు. దాదాపుగా రూ.40 లక్షలు వెచ్చించి ఈ కంపెనీని ఏర్పాటుచేయగా, 22 మందికి ఉపాధి కల్పించాడు. రానురాను ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడం, ప్రభుత్వం నుంచి సహకారం లేకపోవడంతో ఉద్యోగులకు సైతం వేతనాలు ఇవ్వలేని పరిస్థితి ఎదురైంది. అంతేకాకుండా అప్పులకు వడ్డీ కూడా చెల్లించలేని స్థితిలో మనోవేదనకు గురైన హరికృష్ణ మహబూబ్‌నగర్‌లోని తన గదిలో శనివారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడికి తల్లిదండ్రులు రాంచందర్‌నాయక్–హేమ్లీ బాయి ఉన్నారు. -
ఫుడ్ బాగా లేదన్న పాపానికి..!?
ముంబై : రోడ్‌సైడ్ హోటల్లో ఫుడ్ బాగా లేదన్న ఓ కస్టమర్‌పై సలసల కాగే నూనె పోసేందుకు ప్రయత్నించాడో యజమాని. షాకింగ్‌కు గురి చేసే ఈ ఘటన ముంబై శివారులోని ఉల్లాస్ నగర్లో జరిగింది. రోడ్ పక్కగా ఉండే ఓ హోటల్లో టిఫిన్ చేసేందుకు ఓ యువకుడు వెళ్లాడు. తింటున్న టిఫిన్ రుచిగా లేదని చెప్పాడు. అంతేకాక ఇంత చట్నీలు కూడా సరిగ్గా లేవని యువకుడు హొటల్ యజమానితో గొడవ పెట్టుకున్నాడు. అంతేకాక టిఫిన్ చేసేందుకు వస్తున్న ఇతర కస్టమర్లతో.. ఇక్కడ టిఫిన్ బాగాలేదని యువకుడు చెప్పడంతో హోటల్ యజమానికి ఆగ్రహం తెప్పించింది. గొడవ పెట్టుకున్న కస్టమర్‌పై కోపం తెచ్చుకున్న హోటల్ యజమాని అతనిమీద సలసల మరిగే నూనెను పోసేందుకు ప్రయత్నించాడు. అయితే ప్రమాదాన్ని పసిగట్టిన కస్టమర్ అక్కడనుంచి పారిపోయాడు. అయినా అతని మీద నూనె పోసేందుకు హోటల్ యజమాని తీవ్రంగా ప్రయత్నించాడు. ఈ ఘటన అంతా అక్కడ ఉండే సీసీటీవీలో రికార్డయింది. కస్టమర్ ఇచ్చిన ఫిర్యాదుతో సీసీటీవీ ఫుటేజ్‌ని పరిశీలించి.. సదరు హోటల్ యజమానిపై కేసును నమోదు చేశారు పోలీసులు ఫుడ్ బాగా లేదన్న కస్టమర్‌పై హోటల్ యజమాని గొడవ -
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
-
అనంతలో దోపిడీ దొంగలు బీభత్సం
సాక్షి, గుత్తి : అనంతపురం జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. తన ఇంట్లో చోరీకి పాల్పడ్డ దొంగలను అడ్డుకునే క్రమంలో ఇంటి యజమాని ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. జిల్లాలోని గుత్తి కుమ్మరవీధిలోని ఓ ఇంట్లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ప్రవేశించారు. ఇంట్లో బీరువాలు, లాకర్లు వెతుకుండగా ఇది గమనించిన ఇంటి యజమాని దొంగలను అడ్డుకున్నారు. కానీ దోపిడీ దొంగలు యజమానికి హత్యచేసి 25 తులాల బంగారం, రూ. 5లక్షల నగదుతో ఉడాయించారు. స్థానికుల నుంచి సమచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. -
బస్మాసుర ట్రావెల్స్
-
కన్నమేస్తే అంతేమరి!
జుహై నగరం: అదో ఎలుక.. ప్రతిరోజు పిల్లిలా శబ్ధం చేయకుండా వచ్చి ధాన్యపు బస్తాలకు కన్నమేసి తినేస్తోంది. దీంతో యజమాని ఉచ్చు బిగించి దాన్ని పట్టుకున్నాడు. అంతటితో సరిపెట్టలేదు. ఆ ఎలుకకి శిక్ష అమలు చేశాడు. ఎవరైనా అదే చేస్తారు. కానీ, అతను కాస్త విచిత్రంగా చేశాడు. చైనాలో జరిగిన ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పట్టుకున్న ఎలుక చేసిన నేరాన్ని దాని మెడలో బోర్డులా తగిలించాడు. ఈ ఫోటోలను నెట్లో పోస్టు చేయడంతో నెటిజన్లు దీనిపై ఆసక్తి చూపిస్తున్నారు. జుహై నగరంలోని తన కిరాణాదుకాణంలో ఓ ఎలుక ధాన్యపు బస్తాల నుంచి బియ్యం కాజేయడంపై యజమానికి ఆందోళన చెందాడు. తన స్నేహితుడి సాయంతో మొత్తానికి దాన్ని పట్టుకున్నాడు. దాని మెడలో ఓ బోర్డు తగిలించాడు. మొదటి ఫొటోలో ’నన్ను కొట్టిచంపినా.. బియ్యాన్ని దొంగిలించానన్న నిందను మాత్రం ఒప్పుకోను’ అని ఎలుక దృష్టితో యజమానిని తిడుతున్నట్టు రాయగా.. మరో ఫొటోలో ‘ఇలాంటి సాహసం మళ్లీ వదిలిపెట్టండి’ అని వేడుకుంటూ కామెంట్ రాసి పెట్టారు. వినోదాన్ని పంచుతున్న ఈ పోస్టులను చైనీయులు తెగ షేర్ చేసేస్తున్నారు. -
ప్రాణం తీసిన మినుము బస్తాలు
అనంతపల్లి (నల్లజర్ల) : నల్లజర్ల మండలం అనంతపల్లిలో నిల్వ ఉంచిన మినుము బస్తాల లాటు కూలి వ్యాపారి మృతి చెందాడు. శుక్రవారం వేకువజామున జరిగిన సంఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. తూర్పుచోడవరం గ్రామానికి చెందిన యడవల్లి వెంకటేశ్వరరావు కుమారుడు రవిశంకర్‌కుమార్ (28) ఐదేళ్లుగా అనంతపల్లిలో ఉంటూ రాజ్యలక్ష్మి ఆయిల్, ఫ్లోర్‌మిల్ నిర్వహిస్తూ అపరాలు కొనుగోలు చేస్తున్నాడు. ఇటీవల రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన మినుము బస్తాలను మిల్లు బయట నిల్వ ఉంచారు. రాత్రి వేళ వాటికి కాపలాగా తానే నిద్రపోతున్నాడు. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి యధావిధిగా రెండు లాట్లు కట్టిన బస్తాల మధ్య మడత మంచం వేసుకొని నిద్రపోయాడు. తెల్లవారేసరికి ఒక లాటులో బస్తాలు అతను నిద్రిస్తున్న మంచంపై పడ్డాయి. ఉదయం చుట్టుపక్కల వారు చూసేసరికి బస్తాల కింద రవిశంకర్‌కుమార్ అచేతనంగా పడిఉన్నాడు. బస్తాలు తొలగించి చూసేసరికి మృతి చెంది ఉన్నాడు. ఘటనపై గ్రామస్తులు, కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామస్తులందరికీ సహాయ సహకారాలు అందించే రవిని విగత జీవిగా చూసిన వాళ్లు చలించిపోయారు. మృతదేహం వద్ద తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎంపీపీ జమ్ముల సతీష్, ఆత్మ చైర్మన్ గన్నమని కృష్ణమోహన్, బళ్ల ప్రభాకరరావు, ఓలిరెడ్డి సతీష్ తదితరులు సహాయక చర్యలు చేపట్టారు. ఎస్ఐ సూర్యప్రకాశరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరి మృతి
-
మాట వినకుంటే కనెక్షన్ కట్టే!
* ఓ షోరూం నిర్వాహకులపై వేధింపులు * తమ షోరూం నుంచి వాహనాలు కొనుగోలు చేయాలంటూ హుకుం * మాట వినకపోవడంతో విద్యుత్ కనెక్షన్ కట్ చేయించిన వైనం * నోటీసు ఇచ్చినరోజే హడావిడిగా విద్యుత్ సరఫరా నిలిపివేత ఆయన కన్ను పడితే కబ్జాలే.. మాట వినకుంటే మటాషే.. అడిగినంత ఇవ్వాల్సిందే.. చెప్పింది చెయ్యాల్సిందే.. ఏ వ్యాపారం అయినా తన వాటా తేల్చాల్సిందే.. తాను చేసే వ్యాపారం ఎవరు చేసినా అందులో తనకు లబ్ధి కలగాల్సిందే.. లేదంటే బెదిరింపులు.. అప్పటికీ మాట వినకుంటే వేధింపులు.. అధికారులను రంగంలోకి దించి ఆర్థికంగా నష్టం కలిగించే చర్యలకు దిగుతారు.. - సాక్షి, గుంటూరు సత్తెనపల్లి పట్టణంలో 15 ఏళ్లుగా ఓ ద్విచక్రవాహనం షోరూమ్‌ను నిర్వహిస్తున్న వ్యాపారిని ముఖ్యనేత తనయుడు గత కొంతకాలంగా వేధింపులకు గురిచేస్తున్నాడు. గుంటూరులో ఉన్న తమ షోరూమ్ నుంచి ద్విచక్రవాహనాలను కొనుగోలు చేసి అమ్మకాలు జరపాలంటూ బెదిరింపులకు దిగుతున్నారు. గతంలో ఏఆర్డీగా ఉండే షోరూమ్ ప్రస్తుతం ఆథరైజ్డ్ సర్వీస్ సెంటర్‌గా గుర్తింపు పొందింది. కంపెనీ వారి ఆదేశాలతో మొదటì నుంచి గుంటూరులోని ఓ షోరూమ్ ద్వారా ద్విచక్రవాహనాలను దిగుమతి చేసుకుని వీరు అమ్మకాలు జరుపుతున్నారు. అయితే సత్తెనపల్లిలో వాహనాల కొనుగోళ్లన్నీ తమ షోరూమ్ నుంచి జరగాలంటూ ముఖ్యనేత తనయుడు పట్టుబట్టాడు. దీనిపై వారు.. కంపెనీ సూచించిన మేరకే గుంటూరులో కొనుగోలు చేస్తున్నామని తెలియజేశారు. దీంతో తమ మాట వినలేదని ఆగ్రహం చెందిన సదరు ముఖ్యనేత తనయుడు విద్యుత్ అధికారులను ప్రయోగించి సదరు షోరూమ్‌పై దాడులు చేయించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గురువారం సదరు షోరూమ్‌కు వెళ్లిన విద్యుత్ అధికారులు 14 కేవీ లోడు వాడాల్సి ఉండగా, 17 కేవీ లోడు వాడుతున్నారని, మిగతా డబ్బులు చెల్లించాలంటూ నోటీసులు ఇచ్చారు. సాధారణంగా నోటీసులు ఇచ్చిన తరువాత కొన్ని రోజులపాటు వీరు డబ్బు చెల్లించేందుకు అవకాశం ఉంటుంది. అయితే మొదటిసారి నోటీసులు ఇచ్చిlవెళ్లిన అధికారులు.. అదేరోజు రెండోసారి మళ్లీ షోరూమ్‌కు వచ్చి విద్యుత్ కనెక్షన్ కట్ చేసి సరఫరా నిలిపివేశారు. దీనిపై షోరూమ్ నిర్వాహకులు విద్యుత్ అధికారులను నిలదీయగా, తమపై ఉన్న ఒత్తిళ్లు అర్థం చేసుకోవాలంటూ చెప్పి వెళ్లిపోయారు. అయితే సదరు షోరూమ్ నిర్వాహకులు వెంటనే 3 కేవీకి డబ్బులు చెల్లించి తిరిగి విద్యుత్ కనెక్షన్ పునరుద్ధరించుకున్నారు. అయినప్పటికీ ఏదో విధంగా ఇబ్బందులకు గురిచేయాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల వివరణ ఇదీ... ఈ విషయంపై విద్యుత్ అధికారులను ‘సాక్షి’ వివరణ కోరగా అధిక లోడు వాడుతుండటంతో విద్యుత్ కనెక్షన్ కట్ చేశామని, డబ్బు చెల్లించగానే పునరుద్ధరించామని చెప్పారు. నోటీసు ఇచ్చిన తరువాత సమయం ఉంటుంది కదా అని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేశారు. పెచ్చుమీరుతున్న దౌర్జన్యాలు... నరసరావుపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల్లో వ్యాపారులు, కాంట్రాక్టర్లపై ముఖ్యనేత తనయుని దాషీ్టకాలు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయి. అడ్డుకోవాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో వీరు మరింతగా రెచ్చిపోతున్నారు. వీరు చేసే అక్రమ దందాలకు అధికారులను ప్రయోగించడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం వీరిపై చర్యలు చేపట్టకుండా చూసీచూడనట్లు వదిలేయడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళపై వేడినూనె చల్లిన వ్యక్తి అరెస్ట్
హోసూరు: కబాబ్ దుకాణంలో యజమానిపై కాగుతున్న నూనె చల్లిన వ్యక్తిని మహారాజగడ పోలీసులు అరెస్టు చేశారు. వివరాలు.. క్రిష్ణగిరి జిల్లా ఊత్తంగేరి సమీపంలోని మగనూర్పట్టికి చెందిన పర్విన్(32) చికెన్కబాబ్ దుకాణం నిర్వహిస్తుంది. గురువారం రాత్రి ఆ దుకాణానికి వచ్చిన అబ్దుల్కుద్దూస్ (31) వచ్చి కబాబ్ తిని వెళ్తుండగా దుకాణ యాజమాని పార్విన్ డబ్బులు అడగడంతో వారిమధ్య వాగ్వాదం జరిగింది. ఈ గొడవలో అబ్దుల్ కుద్దూస్ కాగుతున్న నూనె మహిళపై చల్లాడు. తీవ్రంగా గాయపడిన పర్విన్ను స్థానికులు చికిత్స కోసం ఊత్తంగేరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మహారాజగడ పోలీసులు కేసు నమోదు చేసుకొని, అబ్దుల్‌కు కుద్దూస్‌ను అరెస్టు చేశారు. -
సామాన్యులకు 'అందని ద్రాక్ష'..!
జపాన్ః మనకు అందని ఎత్తులో ఉన్న ఏ విషయానికైనా 'అందని ద్రాక్ష' సామెతను ఉదహరిస్తుంటాం. కానీ జపాన్ లోని ఓ దుకాణందారుడు నిజంగా సామాన్యులకు అందని ద్రాక్షనే తన దుకాణంలో ప్రదర్శనకు పెట్టాడు. ఓ అరుదైన జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని ఏకంగా లక్షల రూపాయలు వెచ్చించి వేలంలో దక్కించుకోవడమే కాదు... వాటిని తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి వచ్చినవారికి రుచి చూపించి ఇప్పుడు జపాన్ లోనే వార్తల్లో వ్యక్తిగా మారాడు. పాశ్చాత్య ప్రపంచంలో అరుదైన వైన్ కు ఎటువంటి గుర్తింపు ఉంటుందో అలాగే జపాన్ లో అరుదైన, ప్రత్యేకత కలిగిన పళ్ళను కొనుగోలు చేయడం, వినియోగించడం వారి హోదాకు గుర్తుగా భావిస్తారు. అదే నేపథ్యంలో జపాన్ లోని ఓ కిరాణా దుకాణం యజమాని రూబీ రోమన్ జాతికి చెందిన ద్రాక్షపళ్ళ గుత్తిని సుమారు 8 లక్షల రూపాయలకు వేలంలో దక్కించుకున్నాడు. అది తనకు గౌరవంగా భావించడమే కాదు... అలా లక్షలు పోసి కొన్న ద్రాక్షను ప్రదర్శనకు పెట్టి, అందరికీ ఉచితంగా రుచి చూపించాడు. ఆస్పత్రులను సందర్శించేప్పుడు, వివాహాలు, వేడుకల సందర్భాల్లో నాణ్యత కలిగిన, అరుదైన, రుచికరమైన పళ్ళను అందించడం జపాన్ సంప్రదాయాల్లో ఒక భాగమే కాక, హోదాగా కూడా భావిస్తారు. అందుకే అక్కడ అటువంటి ఖరీదైన పళ్ళను అమ్మేందుకు ప్రత్యేక దుకాణాలు కూడ ఉంటాయి. ప్రత్యేక పద్ధతుల్లో పండించిన, ఉత్పత్తి చేసిన పళ్ళ జాతులను ఆ యా దుకాణాల్లో అందుబాటులో ఉంచుతారు. అటువంటి పళ్ళను కొని, ఇతరులకు బహుమతిగా ఇవ్వడం కొనుగోలుదారులు సైతం హోదాగా భావిస్తారు. ఈ సీజన్ లో ప్రత్యేకంగా పండించిన రూబీ రోమన్ జాతికి చెందిన 30 ద్రాక్ష పళ్ళను కొన్నవాళ్ళలో జపాన్ లోనే తకమారూ కొనీషీ మొదటివాడు. పింగ్ పాంగ్ బంతుల సైజులో ఉన్న ఆ ద్రాక్ష.. నిజంగా రూబీ రోమన్ రత్నాల్లా ఉన్నాయని తెగ సంబరపడిపోతున్నాడు. అందుకే తాను సుమారు 8 లక్షల రూపాయలను వెచ్చించానని, తన దుకాణంలో ప్రదర్శనకు ఉంచి, అందరికీ రుచి చూపిస్తున్నానని గర్వంగా చెప్తున్నాడు. జపాన్ సముద్ర తీరంలోని ఇషికవ ప్రాంతంలో ఈ రూబీ రోమన్ జాతిని ఫిజిమోరీ వెరైటీ విత్తనాలతో మొదటిసారి 1992 లో పండించారు. ఈ ద్రాక్ష ఒక్కోటి కనీస బరువు 20 గ్రాములు ఉండటంతోపాటు, రసంలో 18 శాతం చక్కెర పాళ్ళు కలిగి ఉంటుంది. ఈ అరుదైన జాతి ద్రాక్షను మొదటిసారి 2008 లో జపాన్ పండ్ల మార్కెట్లో వేలానికి పెట్టారు. అయితే అప్పట్లో నిజంగానే అందని ద్రాక్ష పుల్లన అన్నట్లుగా దాని ధర కూడ ప్రపంచంలోని ద్రాక్ష పళ్ళ మార్కెట్లలోనే అత్యధిక ధర పలికింది. అంతేకాదు అత్యంత అరుదైన, ఖరీదైన ద్రాక్షగా కొత్త రికార్డు సృష్టించింది. అయితే వేలంలో రూబీ రోమన్ ద్రాక్షను పొందటం నాకెంతో ఆనందంగా ఉందని, ప్రత్యేక గౌరవం లభించినట్లుగా ఉందని కొనిషీ చెప్తున్నాడు. తన దుకాణానికి వచ్చిన కొనుగోలుదారులు రుచి చూడటంతోపాటు, కొందరు ఇతర వ్యాపారులు శాంపిల్ గా కూడ ఈ ద్రాక్షను తీసుకెళ్ళారని చెప్తున్నాడు. ఒక్కోటి సుమారు 25 వేల రూపాయల ఖరీదు చేసే ఆ పళ్ళను కొనిషీ జనానికి ఎలా ఉచితంగా ఇచ్చాడో తెలియదు కానీ, అతడి దుకాణం దగ్గర శాంపిల్స్ కోసం, రుచికోసం జనం క్యూ కట్టడం మాత్రం పెద్ద ఈవెంట్ గా మారిపోయింది. పత్రికలు, మీడియా లో ప్రత్యేక వార్తా కథనం అయిపోయింది. కాగా మార్కెట్లోకి కొత్తగా వచ్చిన అరుదైన జాతి ద్రాక్షను అందరికీ పరిచయం చేసి, తన అమ్మకాలను పెంచుకొనేందుకు సదరు వ్యాపారి ఆ మార్గం ఎంచుకొన్నాడా అన్న అనుమానం కూడా కలుగుతోంది.