
ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు అరుణ్
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రెండు రోజులుగా ఓ యువకుడిని గదిలో వేసి యజమాని చితకబాదడంతో.. సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దెబ్బలు భరించలేక ఆర్మూర్ నుండి నిజామాబాద్ తప్పించుకుని వచ్చిన యువకుడు.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు.
చదవండి: వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ
పది వేలు తీసుకుంటే.. రూ. 25 వేలు ఇవ్వాలని కొట్టారంటూ బాధితుడు అరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం యువకుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్మూర్ లో తాను నర్మదా వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నానని.. వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నానన్నాడు. అయితే అక్కడ ఇష్టంలేక పని మానేయడంతో.. పదివేలకు.. 25 వేలు ఇవ్వాలంటూ తనను చితకబాదినట్టు యువకుడు వాపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment