room
-
రూ.5.18 లక్షలు.. జీతం కాదు.. ఇంటి అద్దె!
దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో నివసించాలంటే రూ.5.18 లక్షలు ఉండాల్సిందే. ఇది ఏటా వేతనం అనుకుంటే పొరపడినట్లే..కేవలం ఇంటి అద్దె కోసమే ఇంత వెచ్చించాలి. అవునండి..ముంబయిలో ఇంటి అద్దెలు దేశంలో ఎక్కడా లేనివిధంగా పెరుగుతున్నాయి. సింగిల్ బెడ్ రూమ్(1 బీహెచ్‌కే) ఇళ్లు కావాలంటే ఏకంగా ఐదు లక్షలు చెల్లించాల్సిందేనని ‘క్రెడాయ్-ఎంసీహెచ్ఐ’ నివేదిక పేర్కొంది.నివేదికలోని వివరాల ప్రకారం..దేశ వాణిజ్య రాజధానిగా పేరున్న ముంబయిలో ఇంటి అద్దెలు భారీగా పెరుగుతున్నాయి. బెంగళూరులో సింగిల్ బెడ్రూమ్ అద్దె రూ.2.32 లక్షలుగా ఉంటే ఢిల్లీ ఎన్సీఆర్లో రూ.2.29 లక్షలుగా ఉంది. ఇందుకు భిన్నంగా ముంబయిలో అధికంగా రూ.5.18 లక్షలు ఇంటి అద్దె ఉంది. స్థానికంగా జూనియర్ లెవల్ ఉద్యోగికి వచ్చే ఏడాది వేతనం రూ.4.49 లక్షలు. తన సంపాదనపోను ముంబయిలో 1 బీహెచ్‌కే ఇంటి అద్దె కోసం అప్పు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవేళ ముంబయిలో డబుల్ బెడ్ రూమ్(2 బీహెచ్‌కే) ఇళ్లు అద్దెకు తీసుకోవాలంటే ఉద్యోగుల వేతనం రూ.15.07 లక్షలుండాలి. అందులో రూ.7.5 లక్షలు అద్దెకే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అదే బెంగళూరు, ఢిల్లీలో 2 బీహెచ్‌కే అద్దెలు వరుసగా రూ.3.9 లక్షలు, రూ.3.55 లక్షలుగా ఉన్నాయి.ముంబయిలోని సీనియర్ లెవల్ ఉద్యోగుల వేతనం దాదాపు రూ.33.95 లక్షలుగా ఉంది. వారు 3 బీహెచ్‌కే ఇంట్లో అద్దెకు ఉండాలనుకుంటే ఏటా రూ.14.05 చెల్లించాల్సి ఉంటుంది. అది బెంగళూరు, ఢిల్లీలో వరుసగా రూ.6.25 లక్షలు, రూ.5.78 లక్షలుగా ఉంది. అంటే ముంబయిలో సింగిల్ బెడ్ రూమ్ ఇంటి అద్దె బెంగళూరు, ఢిల్లీలోని 3 బీహెచ్‌కే ఇంటి అద్దెకు దాదాపు సమానంగా ఉంది.ఇదీ చదవండి: విదేశాలకు వెళ్తున్నారా? ఈ పాలసీ మీ కోసమే..ముంబయిలో జూనియర్, మిడిల్ లెవల్ ఉద్యోగులు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఇంటి అద్దెలు వారి జీతాలను గణనీయంగా ప్రభావితం చేస్తున్నాయి. పొదుపు, నిత్యావసరాల కోసం వారికి ఇబ్బందులు తప్పడం లేదు. స్థానికంగా కార్యాలయాలు ఉన్న ప్రాంతాల్లో ఈ అద్దెలు మరింత అధికంగా ఉండడంతో దూర ప్రాంతాల్లో నివసిస్తున్నారు. దాంతో గంటల తరబడి ప్రయాణించి కార్యాలయానికి వస్తున్నారు. ఫలితంగా తీవ్ర శారీరక, మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు. ఈ పరిస్థితుల వల్ల భవిష్యత్తులో ‘బ్రెయిన్ డ్రెయిన్(మెరుగైన అవకాశాల కోసం ఉద్యోగుల వలస)’కు దారి తీయవచ్చు. -
అయోధ్యలో హోటల్ గది అద్దెలు ఆకాశానికి!
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో జనవరి 22న రామ్‌లల్లా పవిత్రోత్సవం జరగనుంది. ఈ నేపధ్యంలో ఇక్కడి హోటళ్ల బుకింగ్స్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయ్యాయి. హోటల్ రూమ్ బుకింగ్ ధర గతంలో కంటే ఐదు రెట్లు పెరిగింది. అయోధ్యలో 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండటంతో భక్తులు కూడా ఇక్కడికి వచ్చేందుకు ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. ఈ నేపధ్యంలో అయోధ్యలోని పలు లగ్జరీ హోటళ్లలో ఒక రోజు రూమ్ బుకింగ్ లక్ష రూపాయల వరకూ చేరింది. రామ్‌లల్లా పవిత్రోత్సవం రోజున మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా ఐదు లక్షల మంది వరకూ భక్తులు అయోధ్యకు వస్తారనే అంచనాలున్నాయి. ఈ పరిస్థితులను గమనించిన స్థానిక హోటళ్ల యజమానులు రూమ్‌ల ధరలను అమాంతం పెంచేశారు. హోటల్ అయోధ్య ప్యాలెస్‌లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె సుమారు రూ. 18,500 పలుకుతోంది. సాధారణంగా ఇక్కడ గది అద్దె రూ. 3,700. ది రామాయణ హోటల్లో ప్రస్తుతం రోజువారీ గది అద్దె రూ. 40 వేలు. 2023లో దీని అద్దె రూ. 14,900గా ఉండేది. సిగ్నెట్ కలెక్షన్ హోటల్లో ప్రస్తుతం ఒకరోజు అద్దె దాదాపు రూ.70, 500. గత ఏడాది జనవరిలో ఇక్కడ గది అద్దె రూ. 16,800గా ఉండేది. మీడియాకు అందిన వివరాల ప్రకారం అయోధ్యలోని రామాయణ్ హోటల్లోని గదుల బుకింగ్ ఇప్పటికే 80 శాతం మేరకు పూర్తయింది. ఈ హోటల్లోని గదులు జనవరి 20 నుండి 23 వరకు ఇప్పటికే బుక్ అయ్యాయి. ఈ హోటల్లో గది అద్దె రోజుకు రూ.10,000 నుంచి రూ.25,000 వరకూ పెరిగింది. రానున్న రోజుల్లో ఛార్జీలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇటీవల అయోధ్యలోని పార్క్ ఇన్ రాడిసన్‌లోని విలాసవంతమైన గది ఒకరోజు అద్దె లక్ష రూపాయలకు బుక్ అయ్యింది. ఈ హోటల్లోని గదులన్నీ బుక్ అయ్యాయని హోటల్ యాజమాన్యం తెలిపింది. గతంలో ఈ హోటల్లో గది అద్దె కనీసంగా రూ.7,500 ఉండేది. ఇది కూడా చదవండి: 2,100 కిలోల గంట.. 108 అడుగుల అగరుబత్తి -
Hyderabad: ‘డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తా’.. యువతి బెదిరింపులు.
సాక్షి, హైదరాబాద్: అడిగినంత డబ్బులు ఇవ్వకపోతే ఫొటోలు వైరల్ చేస్తానంటూ ఓ యువకుడిని ఒక యువతి వేధింపులకు గురి చేస్తున్న సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన కిరణ్‌కుమార్ కృష్ణానగర్‌లో ఉంటున్నాడు. ఏడాది క్రితం అతను రూం షేరింగ్ కోసం ఓఎల్ఎక్స్లో ప్రకటన ఇచ్చాడు. ఓ యువతి స్పందించి తాను షేర్ చేసుకుంటానని చెబుతూ కూకట్‌పల్లిలో రూం తీసుకోవాలని కోరింది. దీంతో ఇద్దరూ కలిసి గదిలో ఉంటున్నారు. అయితే తాను వేశ్యనని ఆమె చెప్పడంతో, తన ప్రవర్తన నచ్చక కిరణ్ ఆమెను బయటికి వెళ్లాలని కోరాడు. ఆమె నిరాకరించడంతో పాటు తాము సన్నిహితంగా ఉన్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తానంటూ బెదిరించింది. అంతేగాక తనపై లైంగిక దాడిచేశాడని సైబరాబాద్ షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. వారు ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. తర్వాత అతడి నుంచి ఆమెకు రూ.4.70 లక్షలు పరిహారంగా చెల్లించాడు. అనంతరం సామాజిక మాధ్యమాల్లో ఫొటోలు వైరల్ చేయడంతో కిరణ్‌కుమార్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వాటిని తొలగించారు. ఈ నెల 13న రాత్రి ఆమె కిరణ్‌ను సారథి స్టూడియో వద్దకు రప్పించి మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి అతడిపై దాడి చేసింది. గురువారం అతను మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
Babu In Jail: తొలి రోజు గడిచిందిలా..
సాక్షి, అమరావతి, సాక్షి, రాజమహేంద్రవరం: పొద్దున్నే యోగా.. కాసేపు పత్రికల పఠనం... ప్రత్యేకంగా తెప్పించిన ఆహారం... రెండు సార్లు వైద్య పరీక్షలు.. మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పూర్తిస్థాయి భద్రత నడుమ రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా తొలిరోజు గడిపారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టై రిమాండ్ ఖైదీ 7691గా ఉన్న ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా, పూర్తి భద్రతతో కూడిన ప్రత్యేక గదిలో ఉంటున్నారు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకు నిద్ర లేచారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు. ప్రత్యేకంగా సహాయకుడు.. వంటకు ప్యాంట్రీ కార్ న్యాయస్థానం ఆదేశాలతో జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్యారక్‌లో ప్రత్యేక గదిని ఆదివారం రాత్రే కేటాయించారు. అందులో వెస్ట్రన్ మోడల్ టాయిలెట్‌ను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. చంద్రబాబుకు ప్రత్యేకంగా ఓ సహాయకుడిని అందుబాటులో ఉంచారు. చంద్రబాబు జిల్లాల పర్యటనల్లో ఆయన కాన్వాయ్‌లో ఉండే ప్రత్యేక ప్యాంట్రీ కార్‌ను జైలుకు సమీపంలో ఉంచారు. నారా లోకేష్ రాజమహేంద్రవరంలోనే ఓ టీడీపీ నేత ఇంటి వద్ద మకాం వేసి చంద్రబాబుకు అవసరమైనవన్నీ సమకూరుస్తున్నారు. ఉదయం అల్పాహారంగా ఫ్రూట్ సలాడ్‌తో పాటు వేడినీళ్లు, బ్లాక్ కాఫీని పంపారు. మధ్యాహ్న భోజనంలో 100 గ్రాముల బ్రౌన్ రైస్, బెండకాయ వేపుడు, పన్నీర్ కూర, పెరుగు పంపించారు. మధ్యాహ్నం 3 గంటల సమయంలో టీ తాగేందుకు వేడినీళ్లు అందజేసినట్లు తెలిసింది. ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం, మధ్యాహ్న భోజనం అనంతరం చంద్రబాబుకు రెండు సార్లు వైద్య పరీక్షలు చేశారు. ఆయన ఉంటున్న స్నేహ బ్యారక్‌కు ఎదురుగానే జైలుకు సంబంధించిన ఆస్పత్రి ఉండటంతో అక్కడ వైద్య పరీక్షలు చేపట్టారు. రాత్రి కూడా ప్యాంట్రీ కార్ నుంచే పుల్కాలు, పెరుగు తెప్పించి ఆహారాన్ని అందించారు. నిరంతరం 1 + 4 భద్రత జైలు అధికారులు చంద్రబాబు భద్రత కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఆయన ఉన్న జైలు గది వద్ద 24 గంటలపాటు విధులు నిర్వహించేలా 1 + 4 భద్రతను వినియోగించారు. జైలు లోపల, చుట్టుపక్కల పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తు కల్పించారు. కట్టుదిట్టమైన భద్రతతోపాటు జైలులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా భద్రతను నిశితంగా పర్యవేక్షిస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు సంపూర్ణ ఆరోగ్యంతో పూర్తిస్థాయి భద్రత నడుమ ఉన్నారు. తొలిరోజు ములాఖత్‌లు లేవు సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును తొలిరోజు ఎవరూ కలవలేదు. జైలు నిబంధనల ప్రకారం వారానికి రెండు ములాఖత్‌లను అనుమతిస్తారు. సోమవారం ములాఖత్ కోసం ఎవరూ దరఖాస్తు చేయలేదు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రాహ్మణి, కుమారుడు లోకేష్ మంగళవారం ఆయన్ను ములాఖత్‌లో కలిసేందుకు జైలు అధికారులకు దరఖాస్తు చేసుకున్నారు. -
భార్యను 12 ఏళ్లుగా ‘టార్చర్ రూమ్’లో బంధించి.. భర్త నోట్ బుక్‌లో ఏముంది?
ఒక వ్యక్తి తన భార్యను 12 ఏళ్ల పాటు గదిలో బంధీగా ఉంచాడు. ఈ సమయంలో ఆమెకు టార్చర్ చూపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుని ఇంటికి చేరుకోగా బాధితురాలు సెమీన్యూడ్ స్థితిలో శిరోముండనంతో పోలీసులకు కనిపించింది. ఆ మహిళ భర్త చేతిలో అత్యంత దయనీయమైన పరిస్థితులను చవిచూసింది. పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు. ఈ ఉదంతం జర్మనీలో చోటుచేసుకుంది. ఫోను చేతికి చిక్కడంతో.. 53 ఏళ్ల నిందితుడిని పోలీసులు జర్మనీలోని ఫోర్‌బ్యాక్ పట్టణంలోని ఒక అపార్ట్మెంట్లోని బెడ్రూమ్లో తమ అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం 2011లో భర్త ఆమెను కిడ్నాప్ చేశాడు. రెండు రోజుల క్రితం ఆమెకు ఫోను అందుబాటులోకి రావడంతో ఆమె పోలీసులకు ఫోన్ చేసి, తన భర్త తనను గత కొన్నేళ్లుగా హింసిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై నిందితుడని అరెస్టు చేశారు. తరువాత అతనిని.. భార్య తెలిపిన చిరునామాకు తీసుకువచ్చారు. అయితే నిందితుడు తన భార్యను దాచివుంచిన టార్చర్ రూం చూపించేందుకు నిరాకరించాడు. దీంతో పోలీసుల తమదైన శైలిలో అతని చేత టార్చర్ రూమ్ తలుపులు తెరిపించారు. సెమీ న్యూడ్‌గా బాధితురాలు స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం బాధితురాలు ఒక గదిలో బంధీగా పోలీసులకు కనిపించింది. భర్త ఆమెను ఇనుప తీగలతో కట్టేశాడు. ఆ గదిలోకి వెళ్లిన ముగ్గురు పోలీసులకు బాధితురాలు సెమీ న్యూడ్‌గా గుండుతో కనిపించింది. ఆమె చేతి వేళ్లు, కాలి వేళ్లు పనిచేయని స్థితిలో ఉండటాన్ని పోలీసులు గమనించారు. అలాగే ఆమెకు కొంతకాలంగా ఆహారం ఇవ్వడం లేదని కూడా పోలీసులు తెలుసుకున్నారు. టార్చర్ రూమ్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వెంటనే బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలు చికిత్స పొందుతోంది. నోట్ బుక్‌లో టార్చర్ వివరాలు ఆ ఇంటి ఇరుగుపొరుగువారు తెలిపిన వివరాల ప్రకారం ఆ ఇంటినుంచి ఒక మహిళ అరుపులు వినిపించేవని, తాము ఆ ఇంటి యజమానిని దీని గురించి అడిగినప్పుడు తన భార్యకు క్యాన్సర్ అని, బాధతో అలా అరుస్తుంటుందని చెప్పేవాడన్నారు. అయితే తాము ఎప్పుడూ ఆ బాధిత మహిళను చూడలేదని వారు తెలిపారు. అయితే పొరుగింటికి చెందిన ఒక వ్యక్తి తాను 10 ఏళ్ల క్రితం ఆ ఇంటిలో ఒక మహిళను చూశానని, ఇన్నాళ్లుగా కనిపించకపోవడంతో ఆమె చనిపోయి ఉంటుందని, లేదా వేరే ప్రాంతానికి వెళ్లిందని అనుకున్నానని తెలిపారు. ఫ్రాన్సిసీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం పోలీసులకు ఆ ఫ్లాట్‌లో ఒక నోట్ బుక్ లభ్యమయ్యింది. దానిలో నిందితుడు తన భార్యను టార్చర్ పెట్టిన విధానాలను, ఆమెకు ఆహారం ఇచ్చిన తేదీలను రాశాడని సమాచారం. ఇది కూడా చూడండి: చాలామంది డబ్బులు కట్టి మోసపోయారు.. ఆ ట్రాప్‌లో పడితే ... అంతే సంగతులు ! -
200 ఏళ్లనాటి ఫార్మ్‌హౌస్‌లో రహస్య భూగృహం.. లోపల ఏముందో చూసేసరికి..
ఒక్కోసారి కొన్ని దశాబ్ధాల పురాతన గృహాలలో అనుకోని విధంగా ఏవైనా లభిస్తే మన ఆశ్చర్యానికి అవధులు ఉండవు. యూకేలోని ఒక టిక్‌టాకర్ తన తల్లిదండ్రులకు సంబంధించిన 200 ఏళ్ల క్రితం నాటి పురాతన ఫార్మ్‌హౌస్‌లోని ఫ్లోర్‌బోర్డ్ కింద కనిపించిన ఆనవాళ్లు చూసి తెగ ఆశ్చర్యపోయింది. ఇటువంటిది ఒకటి ఉందని ఆమెకు బాల్యంలో ఎప్పుడూ తెలియలేదు. ఇంటి రెనోవేషన్ సందర్భంగా ఆ ఇంటిలో ఒక భూగృహం ఉందని ఆమెకు తెలిసింది. దశాబ్ధాల తరబడి రహస్యంగా.. జెనిఫర్ మల్లాఘన్ ఇటీవల తమ చారిత్రాత్మక పురాతన ఇంటికి సంబంధించిన ఒక వీడియోను టిక్‌టాక్‌లో షేర్ చేసింది. ఈ ఇంటిలో తన తల్లిదండ్రులు 6 దశాబ్ధాల పాటు ఉన్నారని, అయితే తనకు ఈ ఇంటిలో భూగృహం ఉందన్న సంగతి ఇన్నాళ్లలో తెలియలేదన్నారు. జెనీఫర్ ఈ వీడియో కాప్షన్లో ‘ఈ భూగృహం ఏళ్ల తరబడి రహస్యంగానే ఉంది’ అని పేర్కొన్నారు. 44 సెకెన్లపాటు ఉన్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తవ్వకాల మధ్య నిలుచుని, చేతులతో ఒక పరికరం పట్టుకుని, కంపార్ట్మెంట్ను తెరిచే ప్రయత్నం చేస్తుంటాడు. లోపల చీకటిగా ఉంటూ, ఆ గది భయం గొలిపేదిగా కనిపిస్తుంది. గది తెరుచుకున్నా.. మల్లాఘన్ మాట్లాడుతూ భయపెడుతున్న ఆ గదిలో ఎటువంటి సామాను లేదని తెలిపింది. విలువైన ఖజానా అంతకన్నా లేదని పేర్కొంది. ఈ వీడియో చూసిన ఒక యూజర్ ఈ గదిని రెనోవేషన్ చేస్తారా? అని అడగగా, దానికి జవాబుగా ఆమె ఆ గది రెనోవేషన్ చేయబోమని, దానిలో ఏముందో చూడాలని అనుకున్నామని తెలిపింది. గతంలోనూ బయల్పడిన భూగృహాలు ఈ విధంగా భూగృహం బయటపడటం ఇదేమీ తొలిసారి కాదు. గత నెలలోనే ఒక రెడిట్ యూజర్ తమ కొత్త ఇంటిలో హిడెన్ రూమ్‌లో కొన్ని ప్రైవేట్ వస్తువులు లభ్యమయ్యాయని తెలిపారు. 1970-1980ల మధ్యకాలం నాటి ఈ గదిలో కొన్ని పురాతన వస్తువులతో పాటు ఒక బీరుబాటిల్ కూడా దొరికిందని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: ప్రపంచంలోని ఆ ముగ్గురు పాస్‌పోర్టు లేకుండా ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారెవరో తెలిస్తే.. -
పాలు దొంగిలిస్తున్న రూమ్మేట్.. ఉప్పుతో బుద్ధి చెప్పిన యువతి!
హాస్టల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుండటం సాధారణమే. ఒకరి వస్తువులను మరొకరు వాడటం, ఒకరి దుస్తులను మరొకరు ధరించడం మొదలైన విషయాల్లో రూమ్మేట్స్ మధ్య గొడవలు జరుగుతుంటాయి. అయితే ఒక యువతి తన రూమ్మేట్ తన ఆహారాన్ని రోజూ దొంగిలిస్తున్నదని గ్రహించి,అత్యంత విచిత్ర రీతిలో ప్రతీకారం తీర్చుకుంది. హాస్టల్, లేదా పీజీలో ఉండేవారు అక్కడ లభ్యమయ్యే ఆహారం కన్నా ఇంటి భోజనమే వెయ్యిరెట్లు ఉత్తమమని భావిస్తుంటారు. అందుకే కొందరు బయటి నుంచి ప్రత్యేకంగా ఆహారాన్ని తెప్పించుకుంటారు. ఇటువంటి సందర్భాల్లో రూమ్మేట్స్తో షేర్ చేసుకుంటుంటారు. అయితే ఇటీవల ఒక యువతి తన ఫ్లాట్మేట్ నుంచి తన ఆహారాన్ని జాగ్రత్త చేసుకునేందుకు ఏం చేసిందో తెలిస్తే ఎవరైనా సరే ఆశ్చ్యపోవాల్సిందే. సారా అనే యువతి టిక్‌టాక్‌లో @saatj32 హ్యాండిల్‌పై ఒక వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోను చూసినవారంతా షాక్ అవుతున్నారు. ఆమె మరోదారిలేక తాను తన ఆహారాన్ని పాడు చేసుకోవలసి వస్తున్నదని ఈ వీడియోలో పేర్కొంది. తన ఫ్లాట్ మేట్ తన ఆహారాన్ని చోరీ చేస్తున్నందుకు ప్రతీకారంగా ఇలా చేస్తున్నానని పేర్కొంది. ఆమె షేర్ చేసిన వీడియోలో ఆమె ఒక ఆర్గానిక్ బ్రిటీష్ సెమీ స్కిమ్డ్ మిల్క్ డబ్బా తెరుస్తూ కనిపిస్తోంది. తరువాత ఆమె దానిలో అత్యధిక మోతాదులో ఉప్పు కలిపింది. తరువాత ఆమె కెమెరావైపు చూస్తూ.. తన ఫ్లాట్మేట్ దొంగచాటుగా పాలను తాగేసి, డబ్బా అక్కడ పెట్టేస్తోంది. ఈ పాలు ఎలా తాగుతుందో ఇప్పుడు చూస్తాను అని పేర్కొంది. ఈ వీడియో క్యాప్షన్‌లో.. ‘ఈ విషయంలో నాకేమీ పశ్చాత్తాపం లేదు’ అని పేర్కొంది. ఈ వీడియోను చూసిన పలువురు రకరకాలుగా తమ స్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇలా చేసేముందు నువ్వు నీ రూమ్మేట్కు ఒకసారి ఈ విషయం చెప్పి ఉండాల్సింది’ అని రాశారు. చదవండి: వధువు పరారైనా ఆగని పెళ్లి.. తండ్రి చొరవకు అభినందనల వెల్లువ! -
ఉన్నట్టుండి ఉద్యోగం ఊడిందని పిచ్చెక్కుతోందా? ఈ గదిలోకి వెళ్లాల్సిందే!
ఎంత చదివినా అర్థం కావట్లేదని చిర్రెత్తుకొస్తోందా? మీ కలల కొలువు ఉన్నట్టుండి ఊడిందేమిటని పిచ్చెక్కుతోందా? ఆఫీస్‌లో గొడ్డులా చాకిరీ చేసినా బాస్ ఏమాత్రం పట్టించుకోవట్లేదని మనసు రగులుతోందా? ప్రేయసి హ్యాండ్ ఇచ్చిందని తెగ ఫీలవుతున్నారా? అయితే వెంటనే టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, గాజు గ్లాసులు, ట్యూబ్లైట్ల వంటి వస్తువులను విరగ్గొట్టండి!! ఏమిటీ పిచ్చి సలహా అనుకుంటున్నారా? ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్న ట్రెండ్ ఇదే మరి.. అదేమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. సాక్షి, హైదరాబాద్: మనలో ఎవరికైనా ఏదో ఒక సందర్భంలో ఏదైనా విషయంపై పట్ట లేని ఆగ్రహావేశాలు, కసి, కోపం వంటివి కలి గే సందర్భాలు ఎదురవుతుంటాయి. అలాంటప్పుడు ఎవరికీ చెప్పుకోలేక, ఏం చేయాలో అర్థంకాక చాలా మంది కుమిలిపోయే పరిస్థితులే ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి కోపం, ఫ్రస్ట్రేషన్‌ను తీర్చుకొనేందుకు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకంగా అందుబాటులోకి వచ్చిన గదులే రేజ్ రూమ్స్. వీటిని రేజ్ రూమ్స్, బ్రేక్ రూమ్స్, యాంగర్ రూమ్స్, డిస్ట్రక్షన్ రూమ్స్, స్మాష్ రూమ్స్... ఇలా రకరకాల పేర్లతో పిలుస్తున్నారు. ఇలాంటి గదులు ఆవేశంతో రగిలిపోతున్న వారికి సాంత్వన చేకూర్చి శాంతపరుస్తున్నాయి. అసలేమిటీ రేజ్ రూమ్‌లు...? కోపం, కసి, ఫ్రస్ట్రేషన్ వంటి వాటితో బాగా ఇబ్బంది పడుతున్న వారిలో కొందరుఏదైనా పగులగొట్టడమో, ధ్వంసం చేయడమో చేస్తే ప్రశాంతత వస్తుందని అనుకోవడం పరిపాటి. ఎలాంటి వస్తువులను ధ్వంసం చేయడం ద్వారా స్థిమిత పడతామని భావిస్తారో అలాంటి వాటిని ఒక గదిలో ఉంచి ధ్వంసం చేయించడమే ఈ రేజ్ రూమ్‌ల ఏర్పాటు ఉద్దేశం. ఈ జాబితాలో హాళ్లలోని వస్తువులు, వంటిగది వస్తువుల నమూనాలు, ఫర్నీచర్, టీవీలు, ల్యాప్‌టాప్‌లు, డెస్‌్కలు, ఫోన్లు మొదలైనవి ఉంటాయి. ఎప్పుడు మొదలైందీ ట్రెండ్... 2008 ప్రారంభంలో జపాన్, అమెరికాలోనిటెక్సాస్లలో ఇది మొదలైంది. ముఖ్యంగా జపాన్‌లో 2008లో ఆర్థిక మాంద్య పరిస్థితులు ఏర్పడటంతో ప్రజల్లో పెరిగిన ఒత్తిళ్లు, ఫ్ర్రస్టేషన్ను తగ్గించేందుకు ఈ పద్ధతిని కనుగొన్నారు. అమెరికా, జపాన్‌తోపాటు సెర్బియా, యూకే, అర్జెంటీనా వంటి దేశాల్లో వందలాది రేజ్రూమ్లు ఇప్పటికే ఏర్పాటయ్యాయి. మన దేశంలోనూ షురూ... 2017లో ఢిల్లీ శివార్లలోని గుర్‌గ్రామ్‌లో ‘బ్రేక్రూమ్’పేరుతో ప్రారంభం. అదే ఏడాది మధ్యప్రదేశ్ ఇండోర్‌లో ‘భద్దాస్’–యాంగర్ రూమ్ అండ్ కేఫ్ ఏర్పాటైంది. తాజాగా ఈ నెలలోనే బెంగళూరులోని బసవనగుడిలో రేజ్రూమ్ను ఐఐటీ మద్రాస్ పట్టభద్రుడు అనన్యశెట్టి ప్రారంభించాడు. 2022 అక్టోబర్ హైదరాబాద్‌లో తొలి రేజ్రూమ్కు 25 ఏళ్ల సూరజ్ పూసర్ల శ్రీకారం చుట్టాడు. గదిలో ఏముంటాయి? పాడైపోయిన లేదా పనికిరాని వస్తువులను సేకరించి రేజ్ రూమ్‌లో ఉంచుతారు. తమ కోపాన్ని తీర్చుకోవాలనుకొనే వ్యక్తులు ఈ గదిలోకి వెళ్లి వారి ఆవేశం చల్లారే దాకా వస్తువులను చితక్కొట్టొచ్చన్నమాట. అయితే ఇదేమీ ఊరికే కాదండోయ్... వస్తువులను విరగ్గొట్డడమో లేదా పగలగొట్టడమో చేయాలంటే డబ్బు ముట్టజెప్పాల్సిందే. ఇవీ ప్యాకేజీలు.. ఉదాహరణకు హైదరాబాద్‌లోని రేజ్ రూమ్‌లో ‘క్వికీ’ప్యాకేజీ కింద రూ.1,300 చెల్లిస్తే గాజు సీసాలు పెట్టే ఒక ఫైబర్ బుట్ట (బాటిల్ క్రేట్), ఓ కంప్యూటర్ కీ బోర్డు, మౌస్, స్పీకర్లు ధ్వంసం చేయొచ్చు. అలాగే ‘రఫ్ డే’కి రూ.1,500 కడితే రెండు క్రేట్లలో 15 బాటిళ్లు, ప్టాస్టిక్, ఎల్రక్టానిక్ వస్తువులు విరగ్గొట్టొచ్చు. అదే ‘రేజ్ మోడ్’కు అయితే రూ. 2,800 చెల్లించి ఓ మైక్రోవేవ్ ఓవెన్, వాషింగ్ మెషీన్, టీవీ సెట్, రిఫ్రిజిరేటర్, ప్రింటర్, ల్యాప్‌టాప్‌లను విరగ్గొట్టొచ్చు. ఇవేకాకుండా పంచింగ్ బ్యాగ్, బాక్సింగ్ ఉపకరణాలు, గురిచేసి కొట్టే డార్ట్‌లు ఇంకా రేజ్ బాల్స్ ఉన్నాయి. ఈ ప్యాకేజీలు ఉపయోగించుకొనే వారికి ఇండస్ట్రియల్ సూట్, హెల్మెట్, గ్లౌస్, షూస్ వంటివి ఇస్తారు. ఒక్కొక్కరూ లేదా ఏడుగురు సభ్యులతో కూడిన బృందం 20 నిమిషాలపాటు ఆ గదిలో ఉండి వస్తువులను ధ్వంసం చేయొచ్చు. పనికి రానివే.. పనికి రాని వస్తువులు, పాడైన వస్తువులను తుక్కు వ్యాపారుల నుంచి కొనుగోలు చేసి రేజ్ రూమ్‌లో ఉంచుతాం. కోపంతో ఉన్న వారు విరగ్గొట్టిన వివిధ వస్తువులను రీసైక్లింగ్ కేంద్రాలకుతరలిస్తాం. –నిర్వాహకులు -
గాలి శుభ్రం... తీరేను దాహం
ఫొటోలో వాటర్ డిస్పెన్సర్లా కనిపిస్తున్నది ఉత్త వాటర్ డిస్పెన్సర్ మాత్రమే కాదు, అంతకు మించిన అధునాతన యంత్రపరికరం. వాటర్ డిస్పెన్సర్ నుంచి నీరు రావాలంటే, అందులో నీరు నింపాల్సిందే! దీనికి ఆ అవసరమే లేదు. ఇది గాలిలోని తేమనే నీరుగా మార్చి సరఫరా చేస్తుంది. అంతే కాదు, గదిలోని గాలిని శుభ్రపరుస్తుంది కూడా! ఇది టూ ఇన్ వన్ పరికరం. ఎయిర్ ప్యూరిఫయర్ కమ్ వాటర్ డిస్పెన్సర్. గదిలోని గాలిలో నిండి ఉండే దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవకణాలను పీల్చేసుకుని, గదిలోని గాలిని నిమిషాల్లోనే శుభ్రం చేస్తుంది. గాలిలోని తేమను ఒడిసిపట్టుకుని, నీటిగా మారుస్తుంది. ఇలా ఇది రోజుకు ఇరవై లీటర్ల స్వచ్ఛమైన నీటిని అందిస్తుంది. వేణ్ణీళ్లు కావాలంటే వేణ్ణీళ్లు, చన్నీళ్లు కావాలంటే చన్నీళ్లు క్షణాల్లో సరఫరా చేస్తుంది. ఇది పూర్తిగా విద్యుత్తుతో పనిచేస్తుంది. ‘టాప్ఫ్రెష్’ పేరిట ఒక హాంకాంగ్ కంపెనీ రూపొందించిన దీని ధర 399 డాలర్లు (సుమారు రూ.32 వేలు) మాత్రమే! -
ఏం జరిగిందో.. స్నేహితుడి గదికి వెళ్లి.. తెల్లారే సరికి..
గుత్తి(అనంతపురం జిల్లా): స్నేహితుడి గదిలో ఓ యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... గుత్తి ఆర్ఎస్ పాత పంచాయతీ కార్యాలయం వెనుక ఉన్న కాలనీలో నివాసముంటున్న షేక్ బాషా (23) శుక్రవారం రాత్రి సుందరయ్య కాలనీలోని స్నేహితుడు సురేష్ గదికి వెళ్లాడు. తెల్లారే సరికి అతను మృతి చెంది ఉన్నాడు. సమాచారం అందుకున్న సీఐ శ్యామారావు, ఎస్ఐ శ్రీనివాసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. చదవండి: ఎమ్మెల్యే బాలకృష్ణ మాజీ పీఏకు బంపర్ ఆఫర్ -
బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఇంట్లో మహిళ అనుమానాస్పద మృతి
గోపాలపట్నం(విశాఖ పశ్చిమ): బ్యాచిలర్స్ అద్దెకుంటున్న ఓ ఇంట్లో 35 ఏళ్ల మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది. కంచరపాలెం పోలీస్‌స్టేషన్ పరిధి బాపూజీనగర్ సమీపం రామకృష్ణానగర్‌లో శనివారం ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంట్లో ఉంటున్న ఇద్దరు యువకులు పరారీలో ఉన్నారు. కంచరపాలెం సీఐ కృష్ణారావు తెలిపిన వివరాలివీ.. రామకృష్ణానగర్‌లోని బ్యాచిలర్ ఇంట్లో నుంచి దుర్వాసన రావడం స్థానికులు గుర్తించారు. చదవండి: మరో మహిళతో ఆర్ఎంపీ సహజీవనం, భార్యకు విషయం తెలియడంతో.. ఈ విషయాన్ని ఇంటి యజమాని గేదెల సత్యవతికి తెలిపారు. ఆ ఇళ్లు తాళం వేసి ఉండటంతో.. యజమాని కొడుకు ఈశ్వరరావు మారు తాళాలతో తలుపులు తెరిచి చూడగా.. బాత్రూమ్లో మహిళ మృతి చెందినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారమందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఏసీపీ శ్రీపాదరావు, సీఐ కృష్ణారావు, ఎస్ఐ అప్పలనాయుడు.. మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలు సేకరించారు. మహిళ మృతి చెంది మూడు రోజులై ఉంటుందని పోలీసులు తెలిపారు. బాత్రూమ్లో స్నానానికని వెళ్లే సమయంలో జారిపడి తలకు గాయమై మృతి చెంది ఉంటుందని అనుమానిస్తున్నారు. ఆమె మృతికి ఇతర కారణాలున్నాయో అనే కోణంలో కూడా దర్యాప్తు చేపడుతున్నారు. ఈ ఇంట్లో మూడు నెలల కిందట ఒడిశాకు చెందిన ఇద్దరు యువకులు దిగారు. వీరు పోర్టులో బొగ్గు పని చేస్తుంటారు. ఉదయం 7 గంటలకు వెళ్లి తిరిగి సాయంత్రం వస్తుంటారు. ఇద్దరిలో ఒకరి పేరు రాజేష్‌గా పోలీసులు గుర్తించారు. పరారీలో ఇద్దరు యువకులు: మూడు రోజులుగా ఈ ఇద్దరు యువకులు పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమీపంలోని సీసీ కెమెరాలు, కిరాణా దుకాణాల వద్ద వారి వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అనుమానాస్పదమృతిగా కేసు నమోదు చేసినట్లు సీఐ కృష్ణారావు తెలిపారు. ఎస్ఐ అప్పలనాయుడు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
నిజామాబాద్ జిల్లా: తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని వేధింపులు
-
యజమాని పైశాచికం.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకిన యువకుడు
సాక్షి, నిజామాబాద్: జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాలంటూ రెండు రోజులుగా ఓ యువకుడిని గదిలో వేసి యజమాని చితకబాదడంతో.. సదరు యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. దెబ్బలు భరించలేక ఆర్మూర్ నుండి నిజామాబాద్ తప్పించుకుని వచ్చిన యువకుడు.. భయంతో బిల్డింగ్ మీద నుండి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. చదవండి: వీడు మాయలోడు.. కలెక్టర్ పీఏ నంటూ పది వేలు తీసుకుంటే.. రూ. 25 వేలు ఇవ్వాలని కొట్టారంటూ బాధితుడు అరుణ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం యువకుడు నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆర్మూర్ లో తాను నర్మదా వాటర్ ప్లాంట్ లో పనిచేస్తున్నానని.. వాళ్ళ దగ్గర పదివేల రూపాయలు అప్పుగా తీసుకున్నానన్నాడు. అయితే అక్కడ ఇష్టంలేక పని మానేయడంతో.. పదివేలకు.. 25 వేలు ఇవ్వాలంటూ తనను చితకబాదినట్టు యువకుడు వాపోయాడు. -
Ancient Slave Room: రెండు వేల ఏళ్ల నాటి బానిస గది ఇదిగో..!
Archaeologists Discover slave Room at Pompeii: రాజులు బానిసలను ప్రత్యేకమైన దీవులు, గుహలు, గదుల్లో బంధించినట్లు చర్రితలో చదివాం. అయితే ఈ ఆధునిక కాలంలో బానిస వ్యవస్థ దాదాపు లేదు అనటంలో సందేహం లేదు. అయితే పురాతన కాలంలో బానిసలకు సంబంధించిన విషయాలు ఆసక్తిగా ఉండటంతో పాటు భయం గొల్పుతాయి కూడా! అయితే తాజాగా ఇటలీలోని రోమ్‌లో ఓ పురాతన ‘బానిస గది’ తవ్వకాల్లో బయటపడింది. పాంపీ పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఈ గది బయటపడింది. సుమారు రెండు వేల ఏళ్ల క్రితం వెసువియస్ పర్వతం విస్ఫోటనం వల్ల వెలువడిన బూడిద కింద పాంపీ నగరం సమాధి అయిపోయిన విషయం తెలిసిందే. సివిటా గియులియానా విల్లాలో జరిపిన తవ్వకాల్లో బయటపడ్డ బానిసరూంలో మూడు బెడ్స్, ఒక మట్టి కుండ, చెక్కపెట్టెను పురావస్తు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ గదిలోని మంచాలు 1.7 మీటర్ల పోడవు, 1.4 మీట్లర్ల వెడల్పుతో ఉన్నాయి. వాటితోపాటు కుండలు, కొని ఇతర వస్తువులు కూడా లభించాయి. వాటిని చూస్తే ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బానిసలు ఈ గదిలో ఉన్నట్లు తెలుస్తోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ గది గోడకు ఓ చిన్న కిటికి ఉండి.. గోడలకు ఎటువంటి అలంకరణ లేకుండా ఉన్నాయని తెలిపారు. అక్రమ తవ్వకాలు జరిగి కొంతమంది ఇక్కడ లభించే కళాఖండాలను అమ్ముకుంటున్నారని పురావస్తు శాస్త్రవేత్తలు అధికారికంగా 2017లో తవ్వకాలు ప్రారంభించారు. ‘బానిస గది’ పై స్పందించిన పాంపీ డైరెక్టర్ జనరల్ గాబ్రియేల్ జుచ్ట్రిగెల్ మాట్లాడుతూ.. చరిత్రక మూలాల్లో అరుదుగా కనిపించే వ్యక్తులకు సంబంధించిన వాస్తవికత బయటకు వచ్చిందని తెలిపారు. పురాతనమైన కాలానికి చెందినవారు ఎలా జీవించారనే విషయం స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. తన జీవితంలో ఇది ఓ గొప్ప తవ్వకమని పేర్కొన్నారు. -
వాస్తు కోసం పోలీస్ స్టేషన్ గది కూల్చివేత
బి.కొత్తకోట : వాస్తు దెబ్బకు బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ భవనంపై గది కూలిపోయింది. మండల పరిధిలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలతో ఏదో వాస్తులోపం ఉందని భావించారు. వాస్తు రీత్యా స్టేషన్ భవనంపై ఉన్న గది ఉండకూదని గ్రహించారు. మంగళవారం ఆ గదిని కూల్చేశారు. వాస్తవంగా ఈ గది పోలీస్‌స్టేషన్ భవన నిర్మాణంలో భాగం కాదు. 1980లో పోలీస్‌స్టేషన్‌ను నిర్మించగా, 1992లో గది నిర్మించారు. 1980 దశాబ్దంలో పీపుల్స్‌వార్ (ప్రస్తుత మావోయిస్టు పార్టీ) చరిత్రలో తంబళ్లపల్లె నియోజకవర్గానికి ఉన్న గుర్తింపు ఏ ప్రాంతానికీ లేదు. పీపుల్స్‌వార్ వెలుగు వెలిగిన కాలంలో తంబళ్లపల్లె కార్యకలాపాలతో రాష్ట్ర స్థాయిలో గుర్తింపు లభించడంతోపాటు ఉద్రిక్తతలు, సంచలన సంఘటనలు జరిగాయి. వార్ కదలికలు అధికంగా ఉండటం, తీవ్రమైన సంఘటనలు చోటు చేసుకోవడంతో నియోజకవర్గంలోని పోలీస్స్టేషన్లకూ భద్రత కలి్పంచాల్సిన పరిస్థితి ఏర్పడింది. అప్పట్లో మదనపల్లె నియోజకవర్గం పరిధిలో ఉన్న బి.కొత్తకోట, ముదివేడు, తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని ములకలచెరువు, తంబళ్లపల్లె, పెద్దతిప్పసముద్రం, పెద్దమండ్యం పోలీస్స్టేషన్లపై పీపుల్స్‌వార్ దళాలు దాడులు చేస్తే తిప్పికొట్టడం కోసం రక్షణ చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రతి పోలీస్‌స్టేషన్ భవనంపై ఓ గదిని నిర్మించి అందులో ఇసుక బస్తాలు వేసి, సాయిధ బలగాలతో పహారా ఏర్పాటు చేశారు. 24 గంటలు గది నుంచి పహారా ఉండేది. స్టేషన్ల చుట్టూ ఇనుప కంచె ఏర్పాటు చేశారు. ఎవరైనా నేరుగా స్టేషన్లోకి వచ్చే వీలులేకుండా కంచెతో పలు వలయాలను నిర్మించారు. ఇలా చేయడం ద్వారా నక్సల్స్‌ను స్టేషన్లలోకి దూసుకురాకుండా నివారించడం, పై గదిలో పహారా కాస్తున్న సాయుధ బలగాలు నిలువరించడం సాధ్యమవుతుందని ఇలా చర్యలు తీసుకున్నారు. ఆ సమయంలో అంటే 1992–93లో బి.కొత్తకోట పోలీస్‌స్టేషన్‌పై ఈ గది నిర్మించారు. అప్పుడు నిర్మించిన గది 2000 వరకు ఉపయోగంలో ఉండగా, అనంతర పరిణామాలతో పీపుల్స్‌వార్ కనుమరుగు కావడంతో నిఘా, కంచెను తొలగించారు. అప్పటి నుంచి వృథాగా ఉన్న ఈ గది ఇప్పుడిలా వాస్తు దెబ్బకు కూలిపోయింది. -
జీవితం నాలుగ్గోడల గది అయినప్పుడు...
‘రూమ్’ నవల, జాక్ ఐదో పుట్టినరోజున మొదలవుతుంది. జాక్‌కు తెలిసినది కేవలం పేరుండని ‘మా’ తో పాటు తనుండే సౌండ్ ప్రూఫ్ చేసిన పదకొండడుగుల చదరపు గదే. తన 19 ఏళ్ళప్పుడు అపహరించబడిన ‘మా’– ఏడేళ్లుగా ఆ ‘గది’లో ఉంటూ జాక్‌ను కంటుంది. కథకుడు పిల్లవాడే. పగలు ఇంటికప్పు నుంచి సూర్యరశ్మి వస్తుంది. రాత్రి అయినప్పుడు, ‘రాక్షసుడు వచ్చి సూర్యుడిని మింగేశాడు’ అనుకుంటాడు మా చెప్పే కథలు వినే జాక్. గది తలుపు, కోడ్ వాడితే తప్ప తెరుచుకోదు. ఆ కోడ్, ‘మా’ను అపహరించిన ‘ఓల్డ్ నిక్’ వద్దే ఉంటుంది. కొడుక్కి నేర్పించడంలో, పెంచడంలో, సంతోషపెట్టడంలో తనకున్న మానసిక శక్తినంతటినీ వెచ్చిస్తుంది మా. ఆ ప్రక్రియలో తన స్వస్థచిత్తతనూ కాపాడుకుంటుంది. గదిలో ఉండేవి– ఒక టీవీ, బీరువా, కొన్ని పుస్తకాలు. ‘ఓల్డ్ నిక్’ వచ్చినప్పుడు, జాక్ బీరువాలో దాక్కోవాలని మా ఆజ్ఞాపిస్తుంది. నిజమైన మనుషులకు చెప్పేలాగానే గదిలో ఉన్న వాటన్నిటికీ, ‘గుడ్ నైట్ గది, గుడ్ నైట్ కార్పెట్’ అని చెప్తుంటారిద్దరూ. బయట కూడా ఒక లోకం ఉంటుందని జాక్‌కు తెలియదు. తల్లికి గది జైలయినా కొడుక్కి అదే స్వర్గం. టీవీలో కనిపించేవి మరే గ్రహంవో అని తలపోస్తాడు. ‘నేను మనిషిని అయి ఉంటాను. మా కూడా మనిషేనేమో!’ అనుకుంటాడు. మా చనుబాలు తాగడం, ఆమెతోపాటు స్నానం చేయడంలో ఊరట పొందుతాడు. ‘ఓల్డ్ నిక్’ వచ్చినప్పుడు, బీరువాలో దాక్కుని, వినిపిస్తుండే శబ్దాలని లెక్కపెడుతూ, అతను మా మీద చేసే బలాత్కారం పూర్తయిందో లేదో గ్రహిస్తాడు. దృఢ సంకల్పంతో, మా– జాక్ కోసం ఒక జీవితాన్నయితే సృష్టిస్తుంది కానీ అది తమిద్దరికీ సరిపోదనుకున్నప్పుడు, తప్పించుకునే ప్రణాళిక వేస్తుంది. ‘జాక్ జబ్బు పడ్డాడు. హాస్పిటల్ అవసరం’ అని ఓల్డ్ నిక్కు చెప్తుంది కానీ అతను వినడు. అప్పుడు జాక్‌ను కార్పెట్‌లో చుట్టేసి, అబ్బాయి చనిపోయాడని అబద్ధం చెప్తుంది. అతను జాక్‌ను తనతో తీసుకువెళ్తాడు. పిల్లాడు– తల్లి చెప్పినట్టే, ఓల్డ్ నిక్‌ను తప్పించుకుని ఒక అపరిచితుడిని సమీపిస్తాడు. అతని సహాయంతో పోలీసులకు– అతి కష్టం మీద, గదికుండే దారి చెప్పగలుగుతాడు. అప్పుడు మా కూడా బయటపడుతుంది. ఓల్డ్ నిక్ జైలు పాలవుతాడు. మా – తన కుటుంబాన్ని కలుసుకుంటుంది. అయితే అపరిచితులు, కొత్త అనుభవాలు నచ్చని జాక్, ‘ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూశాను, చాలు. అలిసిపోయాను. గదికి వెళ్ళిపోదాం’ అంటాడు. ఈ లోపల కేసు మీడియా దృష్టికి రావడం వారిద్దరి జీవితాలనీ దుర్భరం చేస్తుంది. రచయిత్రి ఎమ్మా డానహ్యూ– అద్భుతమైన నైపుణ్యంతో గందరగోళమైన ప్రపంచ స్వేచ్ఛను జాక్‌కు పరిచయం చేస్తారు. ‘‘పిల్లల్ని గమనిస్తుంటే, తల్లిదండ్రులకి వాళ్ళంటే ఇష్టం అనిపించడం లేదు. ‘ఎంత ముద్దుగా ఉంటారో!’ అంటూ వాళ్ళ ఫొటోలు తీసుకుంటూనే, కబుర్లు చెప్పుకుంటారు తప్ప, పిల్లలతో ఆడుకోరెందుకో!’’ అంటూ ఆశ్చర్యపోతాడు జాక్.మా కు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది. ఆమె స్వేచ్ఛ ఎక్కువవుతున్నకొద్దీ ఆమె కేవలం తనతోనే ఉండాలన్న జాక్ అసహనమూ పెరుగుతుంది. ‘గదిలో మాకు అన్ని పనులూ చేసే టైముండేది. ఇక్కడ కాలం ఒక చోట నిలవకుండా, వెన్నలాగా ప్రపంచమంతటా పాకిపోవడంవల్లనేమో, అందరికీ పరిమితమైన సమయమే ఉంది’ అనుకుంటాడు. ఒకసారి గదిని చూసి రావడానికి వెళ్తారిద్దరూ. ప్రపంచం గురించిన తన కొత్త దృక్కోణంతో చూసినప్పుడు, దానితో తనకుండే పాత అనుబంధం మరుగై, ఆ నిర్బంధకరమైన చోటుకి సులభంగానే వీడ్కోలు పలకగలుగుతాడు జాక్. తల్లీకొడుకులు కొత్త జీవితం ప్రారంభిస్తారు.పుస్తకం– జీవితంలో తగిలిన దెబ్బలని తట్టుకుని తిరిగి నిలుచోవడం గురించినది. కథనం– మితిమీరిన అమాయకత్వం కనబరచకుండా, పిల్లల వాస్తవికమైన కంఠాన్ని వొడిసి పట్టుకోగలుగుతుంది. మనం జీవించే లోకం గురించిన ఒక తాజా కోణాన్ని చూపుతూనే, ప్రేమకి ఒక వినూత్నమైన నిర్వచనం ఇస్తుంది నవల. ఐదేళ్ళ బాలుడి కథనాన్ని పాఠకులు తమ గ్రహింపు ప్రకారం వివరాలు జోడించుకుంటూనో, తీసివేసుకుంటూనో అర్థం చేసుకోవాలి. బుకర్ ప్రైజుకి షార్ట్ లిస్ట్ అయిన ఈ నవలని లిటిల్ బ్రౌన్, 2010లో ప్రచురించింది. దీని ఆధారంగా ఇదే పేరుతో 2015లో సినిమా కూడా వచ్చింది. కృష్ణ వేణి -
టుటన్ఖమున్ సమాధిలో రహస్యగది లేదు!
కైరో : 3000 ఏళ్ల క్రితం ఈజిప్టును పాలించిన ‘బాల రాజు’ టుటన్ఖమున్ సమాధి గుట్టు వీడింది. 19 ఏళ్ల వయసులోనే మరణించిన ఈ ఫారో పాలకుడి సమాధిలో అద్భుతమైన కళాఖండాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైఢూర్యాలు బయటపడడంతో యావత్ ప్రపంచం దృష్టి సమాధిపై పడింది. సరిగ్గా ఇదే సమయంలో అందులో రహస్య గదులున్నాయన్న ప్రచారం కూడా జరిగింది. దీనికి స్థానిక అధికారులు కూడా ఉన్నాయన్నట్లుగానే సంకేతాలు పంపారు. అయితే సమాధిలో అటువంటి గదులేవీ లేవని తాజా పరిశోధనలో తేలింది. అది రహస్య గది కాదని, టుటన్ఖమున్ తల్లి రాణి నెఫ్రిటిటీదని చెబుతున్నారు. 2015లో ఇంగ్లిష్ ఆర్కియాలజిస్టు సమాధిపై సమగ్ర పరిశోధనలు జరిపి, ఆయా ప్రదేశాల చిత్రాలను స్కాన్ చేసి, ఓ పరిశోధన పత్రాన్ని విడుదల చేశారు. దాని ప్రకారం 3వేల ఏళ్ల క్రితం తన భర్త మరణం తర్వాత ఈజిప్టును నెఫ్రిటిటీ రాణి పాలించి, మంచి పాలకురాలిగా పేరుగాంచింది. అయితే చరిత్రలో ఎక్కడా ఆమె మరణం, సమాధి గురించి లేదని, తమ పరిశోధనలో మాత్రం ఈ సమాధిలోనే రాణి మృతదేహాన్ని, ఆమెకు సంబంధించిన ఆభరణాలను పెట్టారని పరిశోధన బృందానికి నేతృత్వం వహించిన ఫ్రాన్సెస్కో పోర్సెల్లీ తెలిపారు. -
ఏడుపుగొట్టు గది
స్కూల్లో హోం వర్క్.. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా... ఆఫీసులో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడం లేదా.. అయితే కడుపు నిండా ఏడవండి..? అలాగే ఏడవడానికి మీ స్కూల్, పాఠశాల లేదా ఆఫీసులో ఓ గది ఏర్పాటు చేయమని అడగండి.. ఏడవడం ఏంటి.. గది ఏంటి అనుకుంటున్నారా.. ఏడిస్తే ఒత్తిడి తగ్గుతుందని అమెరికాలోని ఉతా యూనివర్సిటీ అక్కడి విద్యార్థుల కోసం ఓ చిన్న గదిని నిర్మించింది. ఒంటరిగా ఎంత కావాలంటే అంతసేపు ఏడవండి అని విద్యార్థులకు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒంటరిగా ఆ చిన్న గదిలో ఉంటే అందరి కష్టాలతో పోల్చుకుంటే తాము పడుతున్నవి పెద్ద కష్టాలు కావనే విషయం తెలుసుకుంటారని యాజమాన్యం చెబుతోంది. అయితే అందులో కనీసం పది నిమిషాల పాటు ఉండాల్సిందేనని రూల్స్ కూడా పెట్టారు. ఆ గదిలో టెడ్డీ బేర్ వంటి జంతువుల బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఏడుస్తున్నంత సేపు ఆ బొమ్మలను గట్టిగా కౌగిలించుకుని మనసారా ఏడిచేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇంకేం మీరు కూడా మీ ఏడుపు మీరు ఏడిచేయండి మరి! -
ఇంటికి తగ్గ వెలుగు...
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో దొరికే లైటు తెచ్చి ప్రతి గదిలో పెట్టే రోజులు పోయాయి. పరిస్థితులకు అనుగుణం గా ఆధునిక ఇంటి యజమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనలకు తగ్గట్టు, పరిస్థితుల ప్రకారం వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా వైర్లెస్ లైటింగ్ ఆటోమేషన్ మార్కెట్లో లభిస్తుంది. ♦ ఫ్లాట్‌లో అయినా విల్లాలో అయినా వైర్లెస్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. బంధుమిత్రులు, చూపరులకు నచ్చే విధంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే ఇందుకు మనం చేయాల్సిందల్లా.. ఎక్కడెక్కడ ఏయే తరహా లైట్లు ఉండాలో చెబితే సరిపోతుంది. లేదా మన ఆలోచనల్ని చెబితే ఆయా సంస్థలే పనిని పూర్తి చేస్తాయి. ♦ ఏసీలు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. రిమోట్ కం ట్రోల్ బదులు మొబైల్‌తో వీటిని నియంత్రించుకోవచ్చు. వీటిని అమర్చిన తర్వాత మనం ఎక్కడున్నా సరే అరచేతిలో ఉండే మొబైల్‌తో ఇంట్లోని లైట్లను వెలిగించుకోవచ్చు, ఆర్పేయవచ్చు. ♦ నిన్నటిదాకా ఇంటికి హోమ్ ఆటోమేషన్ చేయాలంటే ప్రత్యేకంగా వైరింగ్ చేయాల్సి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వైర్ల అవసరం లేకుండానే ఇంటిని ఆధునిక లైట్లతో అలంకరించే వీలు కలిగింది. సన్నివేశాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ♦ కొత్త, పాత అనే తేడా లేకుండా ఏ ఇంట్లో అయినా హోమ్ ఆటోమేషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో దీని ఏర్పాటుకు రూ.90 వేల దాకా ఖర్చవుతుంది. -
రంగులే కీలకం
సాక్షి, హైదరాబాద్: పిల్లలను ఆకట్టుకొనేలా గదిని రూపొందించడంలో రంగుల ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. సాధారణంగా పిల్లలు ఎరుపు, నీలం, పసుపు రంగులను ఇష్టపడతారు. ఇవి కాకుండా ఆకుపచ్చ, పర్పుల్‌లు కూడా ఓకే. ఇక వయోలెట్, పింక్‌లు కూడా పర్వాలేదు. అన్నింటికన్నా ముఖ్యం మీ చిన్నారి ఏ రంగుని ఇష్టపడుతున్నడనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మొత్తం అంతా ఒకే రంగు కాకుండా గదిలో వేర్వేదు చోట్ల వేర్వేరు రంగులను నింపడం ద్వారా అందాన్ని తేవచ్చు. దీనితో పాటు ఒక్కో రంగు ఒక్కో అంశాన్ని బహిర్గత పరచడానికి ప్రేరణ కల్పిస్తుందని కలర్ సైకాలజీ చెబుతోంది. ఎరుపు అధికంగా ప్రభావితం చేసే రంగు, ఇక ఆరెంజ్ స్నేహ స్వభావాన్ని తెలియజేస్తుంది. కాబట్టి ఆడుకునే చోట, పిల్లలు కూర్చునే చోట ఈ కలర్ ఉంటే బాగుంటుంది. పసుపు ఏకాగ్రతను పెంచేందుకు తోడ్పడుతుంది. అందువల్ల చదువుకునే చోట వేస్తేసరి. పిల్లల కంటూ ప్రత్యేకించి గది చిన్నదైతే బాగా దట్టంగా వేయడం వల్ల మరింత చిన్నదిగా కనిపించే ప్రమాదముంది. కాబటి తేలిక రంగులు వేస్తే మంచిది. పిల్లలకు ఇష్టమైన కార్టూన్ క్యారెక్టర్లను గోడలపై చిత్రించడం ద్వారా వారికి ఆనందాన్ని కలుగచేయవచ్చు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు లైట్స్ ఆఫ్ చేస్తే పిల్లలు కొత్తల్లో బయపడే అవకాశం ఉంది. సీలింగ్‌కు చీకట్లో కూడా మెరిసే మెటాలిక్ రంగులు లేదా స్టెన్సిల్‌తో పెయింటింగ్‌లు వేస్తే చీకట్లో కూడా హాయిగా నిద్రపోతారు. కంటికి శ్రమ కలిగించని లైటింగ్.. లైట్ల విషయానికి వస్తే బాగా వెలుతురుని అందించే ఫ్లోరోసెంట్ బల్బులను వాడాలి. లైటింగ్ స్టాండ్లు కూడా వంకీలు లేదా ఇతర డిజైన్లతో ఉంటే పిల్లలను ఆకట్టుకుంటాయి. అయితే కంటిపై ఎలాంటి ప్రభావం చూపకుండానూ, చదువుకొనేటప్పుడు ఇబ్బంది కలగకుండానూ ఉండాలి. పిల్లల గది కదా అని తెగ హంగామా చేసి అన్ని వస్తువులను పేర్చేయకుండా అవసరమైన మేరకు ఉంచాలి. ఈ క్రమంలో వారి అభిరుచులకు ప్రాధాన్యతను ఇస్తూనే ఆకట్టుకొనే విధంగాను రూపొందించాలి. ఎక్కడి బొమ్మలు అక్కడనే.. ఇంట్లో గోడలకు చిత్రాలను వేలాడదీయడం కూడా ఒక కళే. లేకపోతే ‘వీడికి బొత్తిగా కళాభిరుచి లేదే’ అంటూ పెదవి విరుస్తారు. వంట గదిలో తాజా కన్పించే పండ్లు, కూరగాయలు తదితర తినుబండారాల చిత్రాలను వేలాడదీయాలి. ఆహార పదార్థాలకు ఉండాల్సిన తాజాదనాన్ని ఎప్పడూ గుర్తు చేస్తుంటుంది కూడా. కొందరికి జంతువల చిత్రాలు అంతగా నప్పవు. దీనికి తోడు మాంసాహార సంబంధిత బొమ్మలు కూడా కొందరికి రుచించవు. అందుకే చిత్రాల ఎంపిక ఆలోచించి తీసుకోవాలి. అదే ముందు గదిలోనయితే ప్రకృతి చిత్రాలు, పడకగదిలో ఊహా చిత్రాలు, పిల్లల గదుల్లో జంతువుల, పక్షుల చిత్రాలు, వృద్ధు లు ఉండే గదుల్లో ఆధ్యాత్మికత ఉట్టిపడే చిత్రాలు వేలాడదీయవచ్చు. ఇంటి అందం రెట్టింపు సాక్షి, హైదరాబాద్: ఇంటి గుమ్మం ముందు ఆధునిక కార్పెట్ వేస్తే సరిపోదు.. అది ఎంత శుభ్రంగా ఉందో కూడా చూడాలి. లేకపోతే ఇంట్లోకి వచ్చే అతిథుల దృష్టిలో చులకనవ్వడమే కాకుండా అనారోగ్య సమస్యలూ తలెత్తుతాయి. ఎక్కువ కాలం మన్నే విధంగా కార్పెట్‌ను క్లీన్‌గా ఉంచుకోవడమెలాగో చూడండి. ♦ ఇంట్లోకి దుమ్ము, ధూళి రాకుండా ఉండటం కోసం ప్రధాన ద్వారం దగ్గర మ్యాట్‌ను ఉపయోగించాలి. పాదరక్షలు ఇంటి బయటే విడిచే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ♦మరకలు పడిన వెంటనే కార్పెట్‌ను వాక్యుమ్ క్లీనర్‌తో శుభ్రపరుచుకోవాలి. లేకపోతే మరకలు ఎండిపోయి తొలగించడం కష్టమవుతుంది. ♦మరకలను తొలగించడానికి ఉపయోగించే యాసిడ్‌ను ముందుగా పరీక్షించండం మంచిది. కొన్ని రకాల యాసీడ్ల వల్ల కార్పెట్ రంగు పోయే ప్రమాదం ఉంది. ♦డిటర్జెంట్, శ్యాంపోలు ఎక్కువగా ఉపయోగించడం మంచిది కాదు. డిటర్జెంట్ ముక్కలు కార్పెట్‌లో ఇరుక్కుపోయే ప్రమాదమూ ఉందండోయ్. ♦హాల్లో ఉండే కార్పెట్‌ను నెలకోసారి, పడక గదిలో ఉండే కార్పెట్‌ను ఆరు నెలలకోసారి శుభ్రం చేసుకోవడమ ఉత్తమం. ♦స్టీమ్ క్లీనింగ్‌తో కూడా కార్పెట్‌ను క్లీన్ చేసుకోవచ్చు. అయితే ముందుగా కార్పెట్ బాగా తడిగా ఉండకుండా చూసుకోవాలి. స్టీమ్ క్లీన్ చేసే ముందు బ్రెష్ చేయడం కూడా మరవద్దండోయ్. -
విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక!
గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీని ఎంపిక చేసుకోవాలి. 120–140 చ.అ. ఉండే గదిలో 1 టన్ను, 150–180 చ.అ. ఉండే గదిలో 1.5 టన్నులు, 180–240 చ.అ. విస్తీర్ణం ఉండే గదిలో 2 టన్నుల ఏసీ సరిపోతుంది. ఒకవేళ పడక గది దక్షిణం, పశ్చిమ దిశల్లో ఉంటే ఎండ ఎక్కువుంటుంది కాబట్టి సాధారణం కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న ఏసీని తీసుకోవాలి. టన్ను ఏసీ బదులు 1.5 టన్ను ఏసీని ఎంచుకోవటం ఉత్తమం. ⇒ ఒకవేళ 3–4 నెలలు... రోజులో 8–10 గంటల పాటు ఏసీని వినియోగిస్తే కనీసం త్రీ స్టార్ రేటింగ్ ఉన్న ఏసీని తీసుకోవటం ఉత్తమం. ఒకవేళ 5–7 నెలల పాటు వినియోగిస్తే మాత్రం ఫైవ్ స్టార్ ఏసీని తీసుకోవటం మేలు. సాక్షి, హైదరాబాద్: ఎండాకాలం వచ్చేసిందంటే చాలు.. కూలరో లేక ఎయిర్ కండీషనర్ (ఏసీ)ని కొనడంలో బిజీ బిజీగా ఉంటారు. నిజం చెప్పాలంటే ఇంటికి ఎలాంటి ఏసీని కొనాలో చాలా మందికి తెలియదు. బ్రాండ్ ఎంపిక బెస్టా? లేక స్టార్ రేటింగ్ ముఖ్యమా? అని నిపుణులనడితే.. గది విస్తీర్ణాన్ని బట్టి ఏసీ ఎంపిక ఉంటుందంటున్నారు. ఇళ్లల్లో ఎక్కువగా వినియోగించే ఏసీలు విండో, స్లి్పట్ రకాలే. అయితే ప్రస్తుతం విండో కంటే స్లి్పట్ ఏసీలను ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. పెద్దగా చప్పుడు లేకుండా చల్లదనాన్ని ఇవ్వడమే దీని ప్రత్యేకత. డైకిన్, ఎల్జీ, శామ్సంగ్, వోల్టాస్, బ్లూస్టార్, క్యారియర్, లాయిడ్, ఓ జనరల్, మిట్సుబిషి, వర్ల్‌పూల్ వంటి ఎన్నో బ్రాండ్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. పోటాపోటీగా ఆయా సంస్థలు సరికొత్త సదుపాయాలతో మార్కెట్లో రెడీగా ఉన్నాయి. ప్రారంభ ధరలు రూ.25 వేల నుంచి ఉన్నాయి. కొనాలంటే స్టార్ ఉండాల్సిందే.. ఏసీ కొనాలంటే కొనుగోలుదారులు ముందుగా చూసేది స్టార్ గుర్తులే. ఎందుకంటే ఎనర్జీ ఎఫిసియెన్సీ అనేది ఎంత విద్యుత్‌ను ఆదా చేస్తుందనే తెలియజేస్తుంది మరి. అందుకే ప్రస్తుతం ప్రతి సంస్థ కూడా స్టార్ రేటింగ్ ఏసీలను తయారు చేస్తున్నాయి. ఏసీపై ఒక స్టార్ ముద్రించి ఉంటే 5 శాతం విద్యుత్ ఆదా అవుతుందని అర్థం. స్టార్ల సంఖ్య పెరుగుతుంటే విద్యుత్ ఆదా కూడా పెరుగుతుంది. ఒక్కో స్టార్ గుర్తు పెరుగుతుంటే ధర కూడా రూ.2,500 పెరుగుతుంది. ఫైవ్ స్టార్ స్లి్పట్ ఏసీతో పోల్చుకుంటే ఇన్వర్టర్ ఏసీ ధర 20 శాతం అధికంగా ఉంటుంది. -
తర‘గతి’ లేకున్నా పట్టదా?
పాఠశాల ఆవరణలో భవనం కుట్టుశిక్షణకు కేటాయింపు వరండాలో చదువుతో అవస్థలు పడుతున్న విద్యార్థులు ప్రజాప్రతినిధి పంతానికి తలవంచిన కార్పొరేషన్ అధికారులు విద్యాకమిటీ కాదన్నా... తల్లిదండ్రులు వద్దన్నా... హెచ్ఎం అభ్యంతరం చెప్పినా... చివరకు ప్రజాప్రతినిధి పంతమే నెగ్గింది. తరగతి గదిలేక పిల్లలు ఎండ వేడిమి, వర్షం తాకిడి తట్టుకుంటూ వరండాలోనే చదువుతున్నా పట్టించుకోకుండా ఖాళీగా ఉన్న హాలును ఓ కుట్టు శిక్షణ కేంద్రానికి కేటాయిస్తూ నగరపాలక సంస్థ తీసుకున్న నిర్ణయం వివాదానికి దారితీస్తోంది. ఇలా అయితే టీసీలు తీసుకుని వెళ్లిపోతామంటూ విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించినా బేఖాతరు చేస్తూ అధికారులు ఆ ప్రజాప్రతినిధిని సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యం ఇచ్చిన తీరు వివాదానికి ఆజ్యం పోస్తోంది. కాకినాడ : కాకినాడ రామకృష్ణారావుపేటలో మదర్‌థెరిస్సా మున్సిపల్ కార్పొరేషన్ ప్రాథమిక పాఠశాల ఉంది. ఇటీవలే ఈ స్కూల్‌ను ఈ – పాఠశాలగా ప్రకటించి ఆధునిక విద్యాబోధనకు కూడా శ్రీకారం చుట్టారు. 5 కేఎన్ కంప్యూటర్లు కూడా సమకూర్చారు. ఒకప్పుడు తెలుగు మీడియం మాత్రమే ఉన్న ఈ పాఠశాలలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. దీంతో గత ఏడాది వరకు 90మందికి మించని ఈ పాఠశాలలో ప్రస్తుతం 153 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ 1 నుంచి 4వ తరగతి విద్యార్థులకు మాత్రమే తరగతి గదులు ఉన్నాయి. 5వ తరగతి విద్యార్థులకు స్కూల్ వరండాలో విద్యాబోధన చేస్తున్నారు. కమ్యూనిటీ హాలు ఖాళీగా ఉన్నా.. స్కూల్ ఆవరణలో ఒకప్పుడు కమ్యూనిటీ హాలుగా వినియోగించిన భవనం ఖాళీగా ఉంది. ఈ భవనంలో ఐదవ తరగతి గది నిర్వహించుకునేందుకు హెచ్ఎం సీహెచ్ విజయలక్ష్మి కమిషనర్‌కు ప్రతిపాదనలు కూడా పంపారు. లెక్కచేయక... కుట్టు శిక్షణకు మొగ్గు విద్యార్థుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు స్థానిక ప్రజాప్రతినిధి సిఫార్సుతో ఆ ప్రాంగణాన్ని కుట్టు శిక్షణ కేంద్రానికి ఇచ్చారు. మైనార్టీలకు కుట్టు శిక్షణ పేరుతో దీనిని ప్రతిపాదించినప్పటికీ ఆ సంస్థ ఎక్కడి నుంచి వచ్చిందో, ఎవరి అధీనంలో పనిచేస్తుందో కూడా తెలియదు. ఆగ్రహించిన తల్లిదండ్రులు పిల్లలు ఆరుబయట చదువుకుంటున్నా పట్టని అధికారులు ఎలాంటిధ్రువపత్రాలు లేని ప్రైవేటు సంస్థకు హాలును కట్టబెట్టడంపై తల్లిదండ్రులు మండిపడ్డారు. శిక్షణ కేంద్రాన్ని వేరొక చోటకు తరలించి ఆ ప్రాంగణాన్ని తరగతిగా ఇవ్వాలంటూ డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. ఇలాగైతే టీసీలు తీసుకుని తమ పిల్లలను బయటకు తీసుకువెళ్లిపోతామంటూ గొడవపడ్డారు. విద్యాకమిటీ సభ్యులు కూడా అదే స్థాయిలో అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఒకానొకదశలో స్థానికులు ఆ భవనానికి తాళాలు వేస్తే దానిని తొలగించి ఆ శిక్షణ కేంద్రానికి అప్పగించడం వెనుక స్థానిక ప్రజాప్రతినిధి ఒత్తిడే కారణమంటున్నారు. నిర్వాహకురాలితో వాగ్వాదం కుట్టుశిక్షణ ప్రారంభించేందుకు బుధవారం మధ్యాహ్నం వచ్చిన నిర్వాహకురాలు విజయలక్షి్మతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. అనుమతి పత్రాలు చూపించాలంటూ నిలదీశారు. అవేమీ తన వద్ద లేవని, పది రోజుల్లో వస్తాయంటూ ఆమె చెప్పిన సమాధానం తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది. -
ఇల్లు.. ఆఫీసు.. కారు.. అన్నీ ఇదే!
పెద్ద పెద్ద అంతస్థుల్లో ఉండేవారికి, అస్తమానం పైకీ కిందికీ దిగలేనివారికీ, పార్కింగ్ ప్లేస్ లేనివారికి, ఆఫీస్ పని అక్కడికక్కడే అయిపోతే బాగుండనుకునే వారికీ, డ్రైవింగ్ చేసే ఓపిక లేనివారికి... అంతెందుకు? ఇల్లు, ఆఫీసు, లిఫ్టు, కారు, లివింగ్ రూమ్... అన్నీ ఆల్ ఇన్ వన్ గా ఉంటే బాగుండు అని గొంతెమ్మ కోరికలు ఉన్నవారికి ఒక వరంగా ‘త్రిదిక’అనే ఒక వాహనం టెక్నాలజీ నిపుణుల ఆలోచనల్లో రూపుదిద్దుకుంటోంది. ఇంట్లో ఉండాల్సినవి ఇంట్లో... బయట ఉండాల్సినవి బయట ఉండటం ఓ పద్ధతి. కానీ ఇది 21వ శతాబ్దం. హైటెక్ యుగం. ఫొటో చూశారుగా... అదీ విషయం. ఈ సూపర్ బిల్డింగ్‌కు అతుక్కున్నట్టుగా కొన్ని నిర్మాణాలు కనిపిస్తున్నాయా? అవి ఏమనుకుంటున్నారు? ఊహకు అందడం లేదా..? ఓకే. అవన్నీ కార్ల వంటి వాహనాలు! కార్లు గోడలెక్కడమేమిటి? హౌ... హౌ ఇటీజ్ పాజిబుల్ అంటున్నారా? ఈ మధ్య ఓ సరికొత్త లిఫ్ట్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది లెండి. అది పైకి, కిందకు మాత్రమే కాదు.. లెఫ్ట్, రైట్లకు కూడా కదలగలదు. అచ్చంగా ఈ టెక్నాలజీ స్ఫూర్తితోనే తాను గోడలెక్కగల ‘త్రిదిక’ వాహనాల రూపకల్పనకు ఆలోచన చేశానని అంటున్నాడు చార్లెస్ బంబార్డియర్ అనే యువ శాస్త్రవేత్త. వావ్.. అనేశారా...? సరే... ఈ వాహనాలకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇది పగలు మిమ్మల్ని కావాల్సిన చోటుకు తిప్పేందుకు పనికొస్తే... రాత్రిళ్లు మీ ఇంట్లో అదనపు లివింగ్ రూమ్‌గా దీన్ని వాడుకోవచ్చు. ఇంకో విషయం త్రిదికలు నడిపేందుకు డ్రైవర్లు అవసరం లేదు. ప్రత్యేకమైన ట్రాక్‌పై అయస్కాంతాల సాయంతో వెళ్లగల ఈ ఎలక్ట్రిక్ వాహనంలో ఆరుగురు కూర్చోవచ్చు. డ్రైవింగ్ పనిలేదు కాబట్టి వాహనంలో కూర్చుని ఆఫీసు పనులూ చక్కబెట్టుకోవచ్చునన్నమాట. పనైపోయాక ఇంటికొచ్చారనుకోండి. మీ ఇల్లు పదో అంతస్తులో ఉన్నా సరే.. గుమ్మం దాకా దిగబెడుతుంది. అక్కడే ఉండిపోతుంది కూడా! ఆలోచన బాగానే ఉందిగానీ.. ఇలాంటివి నిజంగానే వస్తాయా? అంటే... ఏమో... గుర్రం ఎగరావచ్చు అనక తప్పదు! -
జనరేటర్ రూం పాక్షిక తొలగింపు
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్) : ప్రకాశం బ్యారేజీ వద్ద బ్యారేజికి అనుసంధానంగా ఉన్న జనరేటర్ రూమ్‌ను పాక్షికంగా తొలగించేందుకు రెవెన్యూ శాఖ చర్యలు చేపట్టింది. వివిధ శాఖలకు చెందిన అధికారులు, ఇరిగేషన్ శాఖ సిబ్బంది సోమవారం చర్చించుకున్న అనంతరం జనరేటర్ ఉన్న రూమ్‌ను తొలగించకుండా, దానికి అనుసంధానంగా ఉన్న వాటిని అన్నింటినీ తొలగించే విధంగా చర్యలు తీసుకున్నారు. జనరేటర్ రూమ్ సిబ్బంది ఒక్కరోజు వ్యవధిలో తాము తొలగిస్తామన్నా, రెవెన్యూ శాఖ అధికారులు వెంటనే తొలగించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో మునిసిపల్ అధికారులు జనరేటర్ రూమ్‌కు అనుసంధానంగా ఉన్న సామాన్లు భద్రపరిచే గదులను, సిబ్బంది సేదతీరే హాల్‌ను, స్క్రాప్S రూమ్‌ను తొలగిస్తున్నారు. వీఐపీలకు కృష్ణానది ఆప్రాన్పై ఏర్పాటు చేసే ఫుడ్ కోర్టుకు వెళ్లే మార్గం ఇరుగ్గా ఉండడంతో ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. -
అతిథిని చూసి పరుగులు తీశారు!
సిడ్నీ: అనుకోని అతిథి ఇంటికి వస్తే ఎంతో సర్ ప్రైజింగ్ గా ఫీలవుతాం. ఎన్నాళ్ళకెన్నాళ్ళకు అంటూ ఆనందంగా ఆహ్వానిస్తాం. పైగా ఎప్పుడు పడితే అప్పుడు, ఎవరికి పడితే వారికి కనిపించని అరుదైన అతిథి వస్తే... ఇక ఆనందానికి అవధులే ఉండవు. కానీ ఓ ఆస్ట్రేలియన్ దంపతులు వారింటికి అరుదుగా వచ్చిన అతిథిని చూసి ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని భయంతో పరుగులు తీశారట. చుట్టుపక్కల వారి సహాయంతో పట్టుకొని బంధించేందుకు ప్రయత్నించారట. ఇంతకూ ఆ భయంకర అతిథి వివరాలేమిటో ఓసారి చూద్దామా...? ఆస్ట్రేలియాలో నార్త్ క్వీన్స్ ల్యాండ్ స్టేట్ లోని వాంగలింగ్ బీచ్ ప్రాంతంలో నివసించే పీటర్, సూ లీచ్ దంపతులు తమ ఇంటికి వచ్చిన జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ పక్షిని చూసి పరుగులు తీశారట. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పక్షులుగా జెయింట్ ఫ్లైట్లెస్ కాసోవరీ జాతి పక్షులను చెప్తారు. అటువంటి పక్షి అనుకోకుండా ఆ దంపతుల ఇంటికి అరుచుకుంటూ రావడంతో ముందు ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే అదో ప్రమాదకర పక్షి అని గుర్తించి పరుగులు తీశారు. రెండు మీటర్ల పొడవు.. సుమారు 70 కిలోల బరువుండే ఆ పక్షి.. నల్లని రెక్కలు, పొడవైన ముక్కు, మెడవద్ద నీలిరంగు, తలపై చిన్నపాటి పించంతో చూసేందుకు మాత్రం పెద్ద సైజు నెమలిని పోలి ఉంటుంది. ముందుగా పక్షిని చూసిన తన భర్త... ఇంటికి ఎవరొచ్చారో చూడు.. అంటూ ఆనందాన్ని వ్యక్తం చేశాడని, తీరా అది ప్రమాదకర కాసోవరీస్ పక్షి అని గుర్తించి అతడు డైనింగ్ టేబుల్ వెనక దాక్కున్నాడని, తాను మాత్రం బయటకు పరుగు తీశానని సూలీచ్ తెలిపింది. విషయం తెలసిన పొరుగువారు ఆ పక్షి అత్యంత ప్రమాదకరమైన పక్షి అని, దగ్గరలోని రైన్ ఫారెస్ట్ నుంచి వచ్చి ఉంటుందని, ఇంతకుముందెప్పుడూ ఎవరింటికీ రాలేదని తెలిపారని సూలీచ్ అంటోంది. ఆ ప్రమాదకరమైన, అరుదైన కాసోవరీ పక్షి జాతి.. ఆస్ట్రేలియా ఈశాన్య క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలోని రైన్ ఫారెస్టుల్లోనూ, కొన్ని ఐస్ ల్యాండ్ ప్రాంతాల్లోనూ కనిపిస్తాయి. అత్యంత బరువైన, పొడవైన ఆపక్షిని ప్రపంచంలోనే ప్రమాదకరమైన పక్షిగా గుర్తించారు. అది దాని పొడవైన కాళ్ళతో మనుషులు, పెంపుడు జంతువులపై దాడి చేస్తుంటుంది. 2003 లెక్కల ప్రకారం క్వీన్స్ ల్యాండ్ ప్రాంతంలో ఈ కాసోవరీ పక్షి దాడికి ఎనిమిదిమంది గురైనట్లు, 1926-1999 మధ్య ప్రాంతంలో తీవ్ర గాయాలైన ఒకరు మృతి చెందినట్లు రికార్డులు చెప్తున్నాయి. ఆస్ట్రేలియాలో ఈ జాతి పక్షులు సుమారు 2 వేల వరకూ ఉండొచ్చని పదహారేళ్ళ క్రితంనాటి ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలుస్తోంది.