ఏడుపుగొట్టు గది | Room in America | Sakshi
Sakshi News home page

ఏడుపుగొట్టు గది

Published Sun, May 6 2018 12:54 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

Room in America - Sakshi

స్కూల్‌లో హోం వర్క్‌.. పరీక్షల ఒత్తిడి తట్టుకోలేకపోతున్నారా... ఆఫీసులో పని ఒత్తిడి నుంచి ఉపశమనం కలగడం లేదా.. అయితే కడుపు నిండా ఏడవండి..? అలాగే ఏడవడానికి మీ స్కూల్, పాఠశాల లేదా ఆఫీసులో ఓ గది ఏర్పాటు చేయమని అడగండి.. ఏడవడం ఏంటి.. గది ఏంటి అనుకుంటున్నారా.. ఏడిస్తే ఒత్తిడి తగ్గుతుందని అమెరికాలోని ఉతా యూనివర్సిటీ అక్కడి విద్యార్థుల కోసం ఓ చిన్న గదిని నిర్మించింది.

ఒంటరిగా ఎంత కావాలంటే అంతసేపు ఏడవండి అని విద్యార్థులకు ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఒంటరిగా ఆ చిన్న గదిలో ఉంటే అందరి కష్టాలతో పోల్చుకుంటే తాము పడుతున్నవి పెద్ద కష్టాలు కావనే విషయం తెలుసుకుంటారని యాజమాన్యం చెబుతోంది.

అయితే అందులో కనీసం పది నిమిషాల పాటు ఉండాల్సిందేనని రూల్స్‌ కూడా పెట్టారు. ఆ గదిలో టెడ్డీ బేర్‌ వంటి జంతువుల బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. ఏడుస్తున్నంత సేపు ఆ బొమ్మలను గట్టిగా కౌగిలించుకుని మనసారా ఏడిచేందుకు ఈ ఏర్పాటు చేశారు. ఇంకేం మీరు కూడా మీ ఏడుపు మీరు ఏడిచేయండి మరి! 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement