ఇంటికి తగ్గ వెలుగు... | Wireless lighting automation For home lighting | Sakshi
Sakshi News home page

ఇంటికి తగ్గ వెలుగు...

Published Sat, Dec 16 2017 10:49 AM | Last Updated on Sat, Dec 16 2017 10:49 AM

Wireless lighting automation For home lighting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మార్కెట్లో దొరికే లైటు తెచ్చి ప్రతి గదిలో పెట్టే రోజులు పోయాయి. పరిస్థితులకు అనుగుణం గా ఆధునిక ఇంటి యజమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనలకు తగ్గట్టు, పరిస్థితుల ప్రకారం వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా వైర్‌లెస్‌ లైటింగ్‌ ఆటోమేషన్‌ మార్కెట్లో లభిస్తుంది.

ఫ్లాట్‌లో అయినా విల్లాలో అయినా వైర్‌లెస్‌ లైటింగ్‌ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. బంధుమిత్రులు, చూపరులకు నచ్చే విధంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే ఇందుకు మనం చేయాల్సిందల్లా.. ఎక్కడెక్కడ ఏయే తరహా లైట్లు ఉండాలో చెబితే సరిపోతుంది. లేదా మన ఆలోచనల్ని చెబితే ఆయా సంస్థలే పనిని పూర్తి చేస్తాయి.
ఏసీలు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. రిమోట్‌ కం ట్రోల్‌ బదులు మొబైల్‌తో వీటిని నియంత్రించుకోవచ్చు. వీటిని అమర్చిన తర్వాత మనం ఎక్కడున్నా సరే అరచేతిలో ఉండే మొబైల్‌తో ఇంట్లోని లైట్లను వెలిగించుకోవచ్చు, ఆర్పేయవచ్చు.
నిన్నటిదాకా ఇంటికి హోమ్‌ ఆటోమేషన్‌ చేయాలంటే ప్రత్యేకంగా వైరింగ్‌ చేయాల్సి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వైర్ల అవసరం లేకుండానే ఇంటిని ఆధునిక లైట్లతో అలంకరించే వీలు కలిగింది. సన్నివేశాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
కొత్త, పాత అనే తేడా లేకుండా ఏ ఇంట్లో అయినా హోమ్‌ ఆటోమేషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో దీని ఏర్పాటుకు రూ.90 వేల దాకా ఖర్చవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement