automation
-
సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇక సర్దుకోవాల్సిందే..!
ఆటోమేషన్... ఈ పదం జాబ్ మార్కెట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ (automation) బాట పట్టాయి. దీంతో ఉద్యోగుల మనుగడకు ముప్పు ఏర్పడింది. తాజాగా ఇన్మోబి (InMobi) సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ పిడుగులాంటి వార్త చెప్పారు.వారికి ఉద్యోగాలు ఉండవుఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని, ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు (software engineers) ఉద్యోగాలు పోతాయని నవీన్ తివారీ వెల్లడించారు. 'మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వెళ్లిపోతారని అనుకుంటున్నాను. రెండేళ్లలో వారికి ఉద్యోగాలు ఉండవు' అని ప్రారంభ దశ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ లెట్స్ వెంచర్ నిర్వహించిన కార్యక్రమంలో తివారీ అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్ ను నా సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ) అందిస్తారు. ఇప్పటికే 50 శాతం సాధించాం. యంత్రం సృష్టించిన కోడ్లు వేగంగా, మెరుగ్గా ఉంటాయి. అలాగే అవి తమను తాము సరిచేసుకోగలవు" అని ఆయన లెట్స్ వెంచర్ సీఈవో శాంతి మోహన్‌తో అన్నారు.ఇన్మోబి సీఈవో నవీన్ తివారీమిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి..అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు మొదట కృత్రిమ మేధ (ఏఐ) వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని అప్ గ్రేడ్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే ఇది మనుగడ. మీ కింద ప్రపంచం మారుతోంది' అని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.ఇది చదివారా? ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపుఇన్మోబిలో రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఇన్మోబి యాడ్స్. ఇది అడ్వర్టైజింగ్ టెక్నాలజీపై పనిచేసే బిజినెస్-టు-బిజినెస్ కంపెనీ. మరొకటి గ్లాన్స్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన స్మార్ట్ లాక్ స్క్రీన్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ను అందించే కన్స్యూమర్ టెక్నాలజీ బిజినెస్-టు-కన్స్యూమర్ కంపెనీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్లాన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్ఫోన్ల కోసం జెన్ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. -
డిజిటల్ ప్రపంచంలో.. సంపద ఇలా భద్రం..
డిజిటల్ టెక్నాలజీ వినియోగం వేగవంతం కావడంతో కమ్యూనికేషన్, వ్యాపారాల నుంచి హెల్త్‌కేర్, వినోదం వరకు మన జీవితాలన్నింటిలో చాలా మార్పులు వస్తున్నాయి. కృత్రిమ మేథ, మెషిన్ లెర్ణింగ్ మొదలైనవి డేటా విశ్లేషణ, ఆటోమేషన్ వంటి అంశాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అప్లికేషన్స్ సౌకర్యవంతంగా ఉంటున్నాయి. రోబోటిక్స్, ఆటోమేషన్‌లాంటివి తయారీ, లాజిస్టిక్స్, వ్యవసాయం లాంటి రంగాల్లో పెను మార్పులు తెస్తున్నాయి. ఇవన్నీ సౌకర్యవంతంగా ఉంటున్నప్పటికీ వీటి వినియోగం విషయంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. పర్సనల్ ఫైనాన్స్‌కి సంబంధించి పోర్ట్‌ఫోలియోలను ఆన్లైన్లో ట్రాకింగ్ చేయడం నుంచి పెట్టుబడుల వరకు అన్నీ కూడా ఫోన్ ద్వారానే చేసే వీలుంటోంది. అయితే, ఈ సౌకర్యం వెనుక మన డిజిటల్ భద్రతకు ముప్పులు కూడా పొంచి ఉంటున్నాయి. ఇన్వెస్టర్ల విషయానికొస్తే తమ పాస్వర్డ్లు లేదా యాప్‌లను సురక్షితంగా ఉంచుకోవడం ఒకెత్తైతే, ఏళ్లతరబడి ఆర్థిక ప్రణాళికలను సైబర్ నేరగాళ్ల నుంచి కాపాడుకోవడం మరో ఎత్తుగా ఉంటోంది. సైబర్ నేరగాళ్లు కేవలం పెద్ద వ్యాపారులు, సంపన్నులనే కాదు.. చిన్న చిన్న ఇన్వెస్టర్లను కూడా టార్గెట్ చేసుకుంటున్నారు. ఫిషింగ్, ర్యాన్సమ్వేర్లాంటివి ప్రయోగిస్తున్నారు. ఫిషింగ్ సంగతి తీసుకుంటే, ఆర్థిక సంస్థలు లేదా అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా కనిపించేలా ఈమెయిల్స్, మెసేజీల్లాంటివి పంపిస్తారు. మిమ్మల్ని మాయ చేసి పాస్వర్డ్ల్లాంటి వ్యక్తిగత వివరాలు సేకరిస్తారు. ఆ తర్వాత మీ ప్రమేయం లేకుండానే మీ ఖాతాల్లోనుంచి విత్‌డ్రా చేసుకోవడం, ట్రేడింగ్ చేయడంలాంటివి చేసి ఖాతాలను కొల్లగొడతారు. ఇక ఐడెంటిటీ థెఫ్ట్ కేసుల్లో మీ వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి, మీ పేరు మీద రుణాలు తీసుకోవడం, మీ ఖాతాలను ఖాళీ చేయడంలాంటివి జరుగుతుంటాయి. ర్యాన్సమ్వేర్ దాడులు మరింత అధునాతనంగా ఉంటాయి. సైబర్ నేరగాళ్లు మీ ఖాతాలను స్తంభింపచేసి, తిరిగి మీ చేతికివ్వాలంటే డబ్బు కట్టాలంటూ బెదిరింపులకు దిగుతారు. మిమ్మల్ని నేరుగా టార్గెట్ చేయకపోయినా మీరు ఆధారపడే ఆర్థిక సేవలను లక్ష్యంగా చేసుకుని మీ లావాదేవీలకు అంతరాయం కలిగించవచ్చు. కొన్నిసార్లు క్రిమినల్స్ నేరుగా పెట్టుబడి ప్లాట్‌ఫాంలలోకి చొరబడి నిధులను దొంగిలించవచ్చు. తప్పుడు ట్రేడింగ్ చేసి నష్టపర్చవచ్చు. అలాగని ఇలాంటి పరిణామాల వల్ల డిజిటల్ సాధనాల మీద నమ్మకాన్ని కోల్పోనక్కర్లేదు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఇలాంటి సవాళ్లను అధిగమించవచ్చు. → మీ అకౌంట్లకు పటిష్టమైన పాస్‌వర్డ్‌లను వాడండి. తరచూ వాటిని అప్డేట్ చేస్తూ ఉండండి. పాస్‌వర్డ్‌లను భద్రపర్చుకునేందుకు ఒక పాస్ వర్డ్ మేనేజర్ వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. → మల్టీ–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్‌ను ఉపయోగించండి. వీలైన సందర్భాల్లో మీ ఫోన్‌కు వెరిఫికేషన్ కోడ్లు వచ్చేలా జాగ్రత్తలు తీసుకోండి. పర్సనల్ డివైజ్‌లను అన్‌లాక్ చేసేందుకు బయోమెట్రిక్స్‌ను ఎనేబుల్ చేయండి. → ఫిషింగ్, సోషల్ ఇంజినీరింగ్ దాడుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంకులు, మ్యుచువల్ ఫండ్లు లేదా ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి వచి్చనట్లుగా అనిపించేలా మోసగాళ్లు ఈమెయిల్స్ లేదా మెసేజీలు పంపిస్తుంటారు. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చేలా మిమ్మల్ని మభ్యపెట్టొచ్చు. అప్రమత్తత వహించండి. అనుమానం వస్తే వెంటనే ఆ సంస్థను అధికారిక మాధ్యమాల ద్వారా సంప్రదించండి. → డివైజ్‌లను భద్రంగా ఉంచుకోండి. విశ్వసనీయ ప్లాట్‌ఫాంలు, యాప్‌ల ద్వారానే ఆర్థిక లావాదేవీలు నిర్వహించండి. సాఫ్ట్వేర్, ఓఎస్‌లు, యాంటీవైరస్ ప్రోగ్రాంలను అప్డేటెడ్గా ఉంచండి. కీలకమైన డేటా చోరీ కాకుండా డివైజ్ ఎన్క్రిప్షన్ను ఎనేబుల్ చేయండి. డివైజ్‌ల స్క్రీన్‌ను లాక్ చేసి ఉంచండి. ఆటోలాక్ను ఎనేబుల్ చేయండి. సెషన్ హైజాక్ కాకుండా, ట్రాకింగ్‌ను, ఆటో–లాగిన్ రిసు్కలను నియంత్రించేందుకు బ్రౌజర్ నుంచి కుకీలను, హిస్టరీని తొలగించండి. → ఆర్థిక లావాదేవీల కోసం పబ్లిక్ వై–ఫైను వాడొద్దు. ప్రయాణాల్లో కీలకమైన అకౌంట్లు, ఆర్థిక సేవల ప్లాట్‌ఫాంలలోకి లాగిన్ అయ్యేందుకు సురక్షితమైన వీపీఎన్‌ను ఉపయోగించండి. → వ్యక్తిగత సమాచారాన్ని ఆన్లైన్లో షేర్ చేసుకోవడం తగ్గించుకోండి. మీ పుట్టిన రోజు లేదా ఆర్థిక వివరాలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోకండి. సైబర్ నేరగాళ్ల బారిన పడే రిసు్కలు ఉన్నాయి.→ బ్యాంకు ఖాతా స్టేట్మెంట్లు, లావాదేవీలను తరచూ పరిశీలించండి. అనధికారిక లావాదేవీలేవైనా కనిపిస్తే సత్వరం గుర్తించొచ్చు. → కీలకమైన డాక్యుమెంట్ల వంటి వాటిని సురక్షితమైన, ఆఫ్‌లైన్ లొకేషన్లలో బ్యాకప్ తీసుకోండి. రాన్సమ్వేర్ రిసు్కలను తగ్గించుకోవచ్చు. → సైబర్ నేరగాళ్లు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఆర్థిక సంస్థలు తరచుగా అప్డేట్లు, టిప్‌లు ఇస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ, అప్డేట్గా ఉండాలి. -
భవిష్యత్తులో కనుమరుగయ్యే ఉద్యోగాలు ఇవే..
టెక్నాలజీ అభివృద్ధి చెందుతుండడంతో కొంతమందికి ఉపాధి లభిస్తుంటే, ఇంకొందరు తమ కొలువులు కోల్పోయేందుకు కారణం అవుతుంది. కృత్రిమ మేధ(AI) వేగంగా వృద్ధి చెందుతున్న ప్రస్తుత కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థలోని ఉద్యోగ మార్కెట్(Job Market)పై దీని ప్రభావం తీవ్రంగానే ఉంది. గతంలో వివిధ రంగాల్లో భిన్న విభాగాల్లో పని చేసేందుకు మానవవనరుల అవసరం ఉండేది. ప్రస్తుతం ఆ పరిస్థితులు మారిపోయాయి. రానున్న పదేళ్లలో ఇప్పుడు చేస్తున్న చాలా ఉద్యోగాలు కనుమరుగవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందులో ప్రధానంగా కింది విభాగాలకు ముప్పు వాటిల్లబోతున్నట్లు చెబుతున్నారు.క్యాషియర్లు: సెల్ఫ్ చెక్ అవుట్ కియోస్క్‌లు, ఆన్లైన్ షాపింగ్(Online Shopping) వల్ల క్యాషియర్ల అవసరం తగ్గిపోతోంది.ట్రావెల్ ఏజెంట్లు: ఎక్స్ పీడియా వంటి ఆన్లైన్ బుకింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యూట్యూబ్(YouTube), వెబ్ కంటెట్.. వంటి విభిన్న మార్గాలు ఉండడంతో ట్రావెల్ ఏజెంట్ల అవసరం తగ్గిపోతోంది.లైబ్రరీ క్లర్కులు: డిజిటల్ వనరులు, ఈ-బుక్స్(E-Books) అధికమవుతున్నాయి. దాంతో ఫిజికల్ లైబ్రరీ మేనేజ్మెంట్ అవసరం తక్కువగా ఉంది.పోస్టల్ సర్వీస్ వర్కర్స్: ఈ-మెయిల్, డిజిటల్ కమ్యూనికేషన్(Digital Communication) కారణంగా ఫిజికల్ మెయిల్ తగ్గడం పోస్టల్ వర్కర్ల అవసరాన్ని తగ్గిస్తోంది.డేటా ఎంట్రీ క్లర్క్‌లు: మాన్యువల్‌గా డేటా ఎంట్రీ చేసే క్లర్క్‌ల స్థానంలో ఏఐ, ఆటోమేషన్ డేటా ప్రాసెసింగ్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. దాంతో భవిష్యత్తులో వీరి అవసరం ఉండకపోవచ్చు.ఫ్యాక్టరీ వర్కర్స్: తయారీ రంగంలో ఇప్పటికే చాలా కంపెనీలు ఆటోమేషన్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కొత్త మోడళ్లను రూపొందించడానికి వీలుగా రోబోటిక్స్‌ను వాడుతున్నారు. గతంలో ఈ పనంతా ఫిజికల్‌గా ఉద్యోగులు చేసేవారు.బ్యాంక్ టెల్లర్స్: గతంలో బ్యాంకింగ్ సమస్యలకు సంబంధించి ఏదైనా ఇబ్బందులుంటే వెంటనే కాల్ సెంటర్‌కు కాల్ చేసిన కనుక్కునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి. బ్యాంకింగ్ సిస్టమ్‌లో వచ్చిన మార్పులు, చాట్బాట్లు, మొబైల్ యాప్స్ వల్ల సంప్రదాయ బ్యాంకు టెల్లర్ల అవసరం తగ్గిపోతోంది.ట్యాక్సీ డ్రైవర్లు: సంప్రదాయ ట్యాక్సీ డ్రైవర్లు ఇప్పటికే భారీగా తగ్గిపోయారు. ఉబెర్, ఓలా, ర్యాపిడో.. వంటి రైడ్ హెయిలింగ్ సర్వీసులు ట్యాక్సీ(Taxi) సేవలను అందిస్తున్నాయి. దాంతో సంప్రదాయ డ్రైవర్లకు ఉపాధి కరవైంది.ఫాస్ట్ ఫుడ్ కుక్స్: ఫాస్ట్ ఫుడ్ రెస్టారెంట్లలో ఆటోమేషన్ పెరుగుతోంది. మాన్యువల్‌గా కాకుండా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అవసరమైన పదార్థాలతో రుచికరంగా ఫాస్ట్‌ఫుడ్ తయారు చేసే సిస్టమ్‌ను అభివృద్ధి చేశారు.మెషిన్‌కు అలసట, సెలవులు ఉండవు!మానవుల కంటే వేగంగా, మరింత కచ్చితత్వంతో ఏఐ ఆధారిత రోబోట్స్, చాట్‌బాట్స్.. పనులను నిర్వహించగలవు. ఫిజికల్‌గా ఉద్యోగులు షిఫ్ట్‌ల వారీగా పని చేస్తుంటారు. మెషిన్‌కు అలాంటివి ఉండవు. ఉద్యోగులకు అలవెన్స్‌లు, జీతాలు, సెలవులు, వీక్‌ఆఫ్‌లు.. వంటివి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రోబోట్స్‌కు అలాంటి ఇబ్బంది ఉండదు. దాంతో ఉత్పాదకత పెరుగుతుందనే వాదనలున్నాయి. ఇది డేటా ఎంట్రీ, బేసిక్ కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల కోతకు కారణమవుతుంది.అసలు ఏఐ వల్ల కొలువులే దొరకవా..?ఏఐ డెవలప్మెంట్, డేటా అనాలిసిస్, సైబర్ సెక్యూరిటీ, ఏఐ ఎథిక్స్ వంటి రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగావకాశాలను సృష్టిస్తోంది. ఏఐ, మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్‌లో అడ్వాన్స్డ్ స్కిల్స్ అవసరమయ్యే ఉద్యోగాలు పెరుగుతున్నాయి. అందుకు తగ్గట్టుగా నైపుణ్యాలు పెంచుకోవాలి. ఒకవేళ చేస్తున్న ఉద్యోగం కోల్పోవాల్సిన పరిస్థితులు ఎదురైతే తిరిగి అంతకంటే ఉన్నతమైన కొలువులు ఎలా సాధించవచ్చో దృష్టి కేంద్రీకరించి స్కిల్స్ పెంచుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.ఇదీ చదవండి: స్వరంతో సంపద సృష్టించిన గాయనీమణులుఇప్పుడేం చేయాలి..కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా నిర్వహించడానికి శ్రామిక శక్తికి తగినంత శిక్షణ ఇవ్వకపోతే అసమానతలు పెరిగే ప్రమాదం ఉందని చెబుతున్నారు. కృత్రిమ మేధ ఆధారిత పాత్రలకు కార్మికులను సిద్ధం చేయడానికి శిక్షణ, అప్ స్కిల్ కార్యక్రమాల అవసరం ఉందని సూచిస్తున్నారు. ఆర్థిక, ఆర్థికేతర మార్గాల ద్వారా ఈ కార్యక్రమాలకు ప్రభుత్వం మద్దతు ఇవ్వాలని చెబుతున్నారు. -
ఐదేళ్లలో నైపుణ్యాలు నిరుపయోగం!
భవిష్యత్తులో ఏఐ, ఆటోమేషన్, మెషిన్ లెర్నింగ్ వంటి రంగాల్లో భారత్ గ్లోబల్ లీడర్‌గా ఎదుగుతుందని గ్లోబల్ లేబర్ మార్కెట్ కాన్ఫరెన్స్ (జీఎల్ఎంసీ) నివేదిక విడుదల చేసింది. సాంకేతిక విభాగాల్లో గ్లోబల్ సౌత్‌లో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందని తెలిపింది. ‘నేవిగేటింగ్ టుమారో’ పేరుతో విడుదల చేసిన ఈ రిపోర్ట్‌లో భారత్ జాబ్ మార్కెట్ వైవిధ్యంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొంది. అయితే భారతీయ నిపుణుల్లో సగానికిపైగా వచ్చే ఐదేళ్లలో తమ నైపుణ్యాలు ఉపయోగంలో లేకుండా పోతాయని ఆందోళన చెందుతున్నట్లు నివేదిక తెలియజేసింది.నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు..సాంకేతిక అభివృద్ధికి అనుగుణంగా ఇప్పటికే వివిధ రంగాల్లో పని చేస్తున్న సిబ్బంది నైపుణ్యాలు నేర్చుకునేందుకు ఆందోళన చెందుతున్నారు. 55 శాతం మంది తమ నైపుణ్యాలు వచ్చే ఐదేళ్లలో పాక్షికంగా లేదా పూర్తిగా వాడుకలో లేకుండా పోతాయనే భయంతో ఉన్నారు.ఈ ధోరణి యూకేలో 44 శాతం, ఆస్ట్రేలియాలో 43 శాతంతో కనిష్టంగా, బ్రెజిల్లో అధికంగా 61 శాతం, చైనాలో 60 శాతంగా ఉంది.భారత్‌లో 32 శాతం మంది రాబోయే ఐదేళ్లలో రీస్కిల్లింగ్ అవసరాలను గుర్తించారు. ఇది చైనాలో 41 శాతం, వియత్నాం 36 శాతం, యూకే 14 శాతం, యూఎస్ఏ 18 శాతంగా ఉంది.రానున్న రోజుల్లో సాంకేతికత అవసరాలు పెరుగుతాయి. అందుకు అనుగుణంగా భారత యువత నైపుణ్యాలు పెంచుకుంటుంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, ఆటోమేషన్ వంటి సాంకేతిక రంగాల్లో యువత నైపుణ్యం పెంచుకోవాలని ఆసక్తిగా ఉంది.ఇదీ చదవండి: దడ పుట్టిస్తున్న బంగారం! తులం ఎంతంటే..?అభివృద్ధి చెందుతున్న నైపుణ్య అవసరాలకు అనుగుణంగా విద్య, శిక్షణా వ్యవస్థలు మరింత మెరుగుపడాలి.19 శాతం మంది ప్రస్తుతం కొత్త నైపుణ్యాలకు అనువైన విద్యా విధానం లేదని అభిప్రాయపడ్డారు. ఈ అభిప్రాయం ముఖ్యంగా 21 శాతం మంది యువకులలో (18-34) ఉంది.భారత్‌లో నైపుణ్యాలు పెంచుకోవడానికి సమయాభావం-40 శాతం మంది, ఆర్థిక పరిమితులు-38 శాతం మందికి అడ్డంకిగా ఉందని పేర్కొన్నారు. ఈ విషయంలో భారత్‌తో సమానంగా బ్రెజిల్లో సమయం లేకపోవడం, ఆర్థిక పరిమితులు వరుసగా 43 శాతం, 39 శాతంగా, దక్షిణాఫ్రికాలో 45 శాతం, 42 శాతంగా ఉంది. నార్వే, యూకే వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో వీటిని పెద్దగా అడ్డంకులుగా భావించడంలేదు. నార్వేలో ఇది వరుసగా 27 శాతం, 28 శాతంగా ఉంది. యూకేలో 31 శాతం, 24 శాతంగా ఉంది.భారతీయ నిపుణులు సాంకేతికంగా స్కిల్స్ పెంచుకోవడానికి అవకాశాలను వెతుకుతున్నారు. -
ఆటోమేషన్తో మహిళలకు అవకాశాలు
తయారీ రంగంలో మహిళలకు మరిన్ని అవకాశాలు రానున్నాయి. పురుషులకు ఎక్కువ అవకాశాలు కల్పించే ఈ రంగంలో ఆటోమేషన్ (మెషినరీ సాయంతో పనుల నిర్వహణ)తో మహిళల నియామకాలు పెరుగుతాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ అంచనా వేస్తోంది. 2047 నాటికి 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలన్నది భారత్ లక్ష్యంగా ఉంది. ఈ క్రమంలో తయారీ రంగం మరిన్ని అవకాశాలు అందిపుచ్చుకునేందుకు ఆటోమేషన్‌ను పెద్ద ఎత్తున అమలు చేస్తున్నట్టు టీమ్‌లీజ్ నివేదిక తెలిపింది.టీమ్‌లీజ్ సర్వీసెస్ చీఫ్ స్ట్రాటజీ ఆఫీసర్ పి.సుబ్బురాతినమ్ మాట్లాడుతూ..‘దేశీయంగా చాలా కంపెనీలు దశలవారీ ఆటోమేషన్‌ను అమలు చేస్తున్నాయి. మహిళల నియామకాలు మొదలు పెట్టాయి. తయారీ రంగాల్లో ఆటోమేషన్ అమలు పెరుగుతున్న కొద్దీ కంపెనీలు మరింత మంది మహిళలను పనుల్లోకి తీసుకుంటున్నాయి. భారత తయారీ రంగంలో మహిళల ప్రాతినిధ్యం ఇప్పటికీ చాలా తక్కువగా ఉంది. మొత్తం శ్రామిక శక్తిలో మహిళలు 15–20 శాతంలోపే ఉంటారు. ఆటోమేషన్‌ను వేగంగా అమలు చేస్తున్న కంపెనీల్లో ఇప్పటికే మహిళల నియామకాలు పెరిగాయి. ఎలక్ట్రిక్ వాహనాలు, టెలికం విడిభాగాల తయారీ సంస్థలు మరింత మంది మహిళలను తీసుకునేందుకు చర్యలు చేపట్టాయి. శ్రామికశక్తిలో లింగ సమతుల్యంపై కొన్ని కంపెనీలు దృష్టి సారించాయి’ అని అన్నారు.ఇదీ చదవండి: కార్ల ధరపై భారీ డిస్కౌంట్లుకొన్ని విభాగాల్లో మెరుగైన అవకాశాలుతయారీలో కొన్ని రంగాలు మహిళలకు పెద్ద ఎత్తున అవకాశాలు కల్పిస్తుండడడాన్ని టీమ్‌లీజ్ నివేదిక ప్రస్తావించింది. ఎలక్ట్రానిక్స్ తయారీలో కార్మికుల్లో 70–80 శాతం మహిళలు ఉన్నట్టు పేర్కొంది. అలాగే టెక్స్టైల్స్, వస్త్రాల తయారీలోనూ సహజంగానే మహిళల శాతం ఎక్కువగా ఉన్నట్టు తెలిపింది. ఫ్యాబ్రికేటెడ్, బేసిక్ మెటల్స్, మెషినరీ, ఎక్విప్మెంట్, మోటారు వాహనాలు, ఆటో విడిభాగాల తయారీ పరిశ్రమల్లో కఠినమైన పని పరిస్థితుల దృష్ట్యా పురుషులే ఎక్కువగా ఉంటున్నారని, వీటిల్లో ఆటోమేషన్ అమలు తక్కువగా ఉన్నట్టు టీమ్‌లీజ్ తెలిపింది. ఇక ఫార్మాస్యూటికల్స్, కెమికల్స్లోనూ పురుషులే ఎక్కువగా ఉన్నట్టు పేర్కొంది. -
ServiceNow study: ఏఐ నైపుణ్యాల పెంపు అత్యావశ్యకం
న్యూఢిల్లీ: కృత్రిమ మేథ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్/ఏఐ), ఆటోమేషన్‌పై దేశంలో 1.62 కోట్ల మందికి నైపుణ్యాల పెంపు, పునఃశిక్షణ అవసరం ఉందని ఓ అధ్యయనంలో తేలింది. ఈ రెండు విభాగాల్లో 47 లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు రానున్నట్టు తెలిసింది. సర్వీస్‌నౌ సంస్థ అధ్యయనం నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. ఉపాధి ముఖచిత్రాన్ని ఏఐ మార్చేయనుందని, డిజిటల్‌నైపుణ్యాల పెంపుతోపాటు టెక్నాలజీలో లక్షలాది ఉపాధి అవకాశాలను తీసుకురానుందని ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. అప్లికేషన్ డెవలపర్లు అదనంగా 75,000 మంది అవసరమని పేర్కొంది. డేటా అనలిస్టులు 70,000 మంది, ప్లాట్‌ఫామ్ ఓనర్లు 65,000 మంది, ప్రొడక్ట్ ఓనర్లు 65,000 మంది, ఇంప్లిమెంటేషన్ ఇంజనీర్లు 55,000 మంది 2027 నాటికి అవసరం ఉంటుందని వెల్లడించింది. టెక్నాలజీ కారణంగా తయారీలో ఎక్కువ మార్పులు చోటు చేసుకుంటాయని, 23 శాతం మంది ఉద్యోగులకు నైపుణ్యాలు పెంచుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ఆ తర్వాత వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఫిషింగ్‌లో 22 శాతం, హోల్‌సేల్, రిటైల్ వాణిజ్యంలో 11.6 శాతం, రవాణా, స్టోరేజ్‌లో 8 శాతం, నిర్మాణ రంగంలో 7.8 శాతం మంది కార్మికులు నైపుణ్యాలను పెంచుకోవాల్సిన అవసరం ఉంటుందని వివరించింది. సర్వీస్‌నౌ సంస్థ నైపుణ్యాల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తుంటుంది. ఇప్పటికే 13కు పైగా విద్యా సంబంధిత భాగస్వామ్యాలను కుదుర్చుకుంది. కీలకమైన వ్యాపార అవసరాలు, భవిష్యత్ అవసరాలకు ఉద్యోగులను సిద్ధం చేసేందుకు వీలుగా నాస్కామ్కు చెందిన ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్‌తో ఆగస్ట్‌లో భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ‘‘దేశవ్యాప్తంగా ప్రతి పరిశ్రమతో పనిచేస్తున్నాం. ఏఐని అర్థవంతమైన వ్యాపార మార్పుల కోసం ఎలా ఉపయోగించుకోవచ్చన్నది తెలియజేస్తున్నాం. ఈ మార్పుల వల్ల ఉత్పాదకత పెంపుతోపాటు నాణ్యమైన, సురక్షితమైన ఉపాధి అవకాశాలను అందించేలా చూస్తున్నాం’’అని సెక్యూర్‌నౌ వైస్ ప్రెసిడెంట్ కమోలికా గుప్తా పెరెస్ వివరించారు. రికార్డు స్థాయిలో కొత్త ఉద్యోగాలు: అప్నా పండుగలకు ముందు పెద్ద ఎత్తు ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. ఆగస్ట్, సెపె్టంబర్లో కొత్తగా 1.2 లక్షల ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనలు వెలువడ్డాయి. ఈ వివరాలను జాబ్స్, ప్రొపెషనల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫామ్ అయిన ఆప్నా డాట్ కో విడుదల చేసింది. జూలై–సెపె్టంబర్ కాలంలో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్న మహిళా అభ్యరి్థనుల సంఖ్య 61 శాతం పెరిగింది. ఇది మహిళా నిపుణుల కోసం వివిధ రంగాల్లో పెరిగిన డిమాండ్‌ను సూచిస్తున్నట్టు అప్నా నివేదిక తెలిపింది. ఈ కామర్స్, రిటైల్, ఆతిథ్య రంగాలు ఎక్కువ మందికి ఉపాధి కలి్పంచినట్టు వెల్లడించింది. పండుగల సీజన్ నేపథ్యంలో బజాజ్, యాక్సిస్ బ్యాంక్, పేటీఎం, ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ కంపెనీలు ఎక్కువ నియామకాలకు ముందుకు వచి్చనట్టు తెలిపింది. మంచి ప్రతిభ కలిగిన వారికి ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలను ఆఫర్ చేయడంతోపాటు, సేల్స్, మార్కెటింగ్, ఫైనాన్స్, హెచ్ఆర్, బిజినెస్ డెవలప్మెంట్లో ఉద్యోగుల భర్తీకి ప్రాధాన్యం ఇచి్చనట్టు పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జూలై నుంచి సెపె్టంబర్ వరకు తన ప్లాట్ఫామ్లో యాజమాన్యాల సంప్రదింపులు పెరిగాయని, 78,000 కొత్త సంస్థలు చేరినట్టు వెల్లడించింది. 2022 ఇదే కాలంలో 42,000 కొత్త సంస్థల చేరికతో పోల్చి చూస్తే గణనీయమైన వృద్ధి కనిపించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో 1,70,000 ఉద్యోగాలకు ప్రకటనలు విడుదల అయితే, అవి ఈ ఏడాది 2,13,000కు పెరిగినట్టు తెలిపింది. మహిళా దరఖాస్తు దారుల సంఖ్య పెరిగిందని, గతేడాదితో పోలిస్తే ఉద్యోగార్థుల ప్రాధాన్యతల్లోనూ మార్పు కనిపించినట్టు అప్నా సీఈవో నిర్మిత్ పారిఖ్ తెలిపారు. -
ఉద్యోగాలపై ఏఐ ప్రభావం మీద స్పష్టత లేదు
న్యూఢిల్లీ: జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (జెన్ ఏఐ) ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా కాకుండా వారు తమ విధులను మరింత మెరుగ్గా నిర్వహించడానికి తోడ్పడే సాధనంగా ఉపయోగపడే అవకాశం ఉందని నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. దేశీయంగా ఉద్యోగాలపై దీని ప్రభావాలు ఎలా ఉంటాయనే అంశంపై కాలక్రమేణా స్పష్టత రాగలదని ఆమె పేర్కొన్నారు. సాంకేతిక, సాంకేతికయేతర రంగాల్లో ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావాలు పడుతున్న నేపథ్యంలో గుప్తా వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. నాస్కామ్ వార్షిక టెక్నాలజీ సదస్సు 2023లో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపారు. మరోవైపు, వారానికి 40 గంటల పని విధానాన్ని ఏఐ మార్చేయగలదని, ఉద్యోగులు తమకు ఆసక్తి ఉన్న ఇతర అంశాలపై దృష్టి పెట్టేందుకు తగినంత సమయం లభించేందుకు ఇది తోడ్పడగలదని యాక్సెంచర్ గ్లోబల్ సీనియర్ ఎండీ మార్క్ క్యారెల్ బిలియార్డ్ తెలిపారు. అటు, విదేశాల్లో లిస్టయిన అంకుర సంస్థలను భారత్‌కు తెచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై గుప్తా స్పందించారు. సాధారణంగా తమ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రీత్యా, అలాగే వ్యాపారాల నిర్వహణకు సులభతరమైన పరిస్థితుల కారణంగా పలు స్టార్టప్‌లు విదేశాల్లో లిస్టింగ్ వైపు మొగ్గు చూపుతుంటాయని ఆమె తెలిపారు. వాటిని తిరిగి భారత్‌కు తెప్పించే క్రమంలో దేశీయంగా పన్నులపరమైన విధానాలు, ఎసాప్ (ఉద్యోగులకు స్టాక్ ఆప్షన్స్ ఇవ్వడం) పాలసీలు మొదలైన వాటిని తగు రీతిలో సరిదిద్దేలా నాస్కామ్.. ప్రభుత్వంతో కలిసి పని చేస్తోందని గుప్తా వివరించారు. డీప్‌టెక్ పరిశ్రమకు ప్రతిభావంతులు, పెట్టుబడులు, తగిన మౌలిక సదుపాయాల కొరత సమస్యగా ఉంటోందన్న నివేదిక వివరాలను సదస్సు సందర్భంగా నాస్కామ్, కన్సల్టెన్సీ సంస్థ ఈవై ఆవిష్కరించాయి. -
కొంపముంచుతున్న ‘AI’.. ప్రమాదంలో మహిళా ఉద్యోగులు, సంచలన నివేదికలో
కృత్తిమ మేధ (ai) చాట్‌జీపీటీ రాకతో ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్లో ప్రకంపనలు నెలకొన్నాయి. మనుషుల ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేస్తుందనే భయాలు, ఇప్పటికే పలు రంగాల్లో మనుషుల స్థానాల్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆక్రమించడమే అందుకు కారణమంటూ పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఓ రిపోర్ట్‌ను విడుదల చేసింది. ఆ నివేదికలో రానున్న 10 ఏళ్లల్లో అభివృద్ది చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఆటోమెషిన్ వంటి టెక్నాలజీలతో ఉద్యోగం చేస్తున్న పురుషుల కంటే మహిళలకే ఎక్కువ నష్టం వాటిల్లే అవకాశం ఉందని తెలిపింది. అంతేకాదు, పని ప్రదేశంలో కృత్రిమ మేధస్సు, ఆటోమేషన్ కారణంగా దాదాపు పది మందిలో ఎనిమిది మంది మహిళలు వేరే కంపెనీకి వెళ్లాల్సి వస్తుందని లేదా ఉద్యోగాన్ని కోల్పోవాల్సి వస్తుందని అధ్యయనంలో గుర్తించింది. ఫుడ్ సర్వీస్, కస్టమర్ కేర్, సేల్స్, ఆఫీస్ సపోర్ట్ వంటి రంగాల్లో ఎక్కువ మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు. పురుషులతో పోలిస్తే తక్కువ జీతంతో పనిచేస్తున్నప్పటికీ ఆటోమేషన్ కారణంగా ఉపాధి పోయే అవకాశం ఉందని వెల్లడించింది. 2030 నాటికి పురుషుల కంటే మహిళలు చేస్తున్న ఉద్యోగాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతికూల ప్రభావం ఎక్కువ శాతం ఉంది. ఈ గండం నుంచి గట్టెక్కాలంటే ఉద్యోగం చేస్తున్న సంస్థలో కొనసాగాలంటే.. సదరు కంపెనీకి కావాల్సిన నైపుణాలను తెలుసుకొని, ముందే నేర్చుకొని ఉండడం మంచిదన్న అభిప్రాయాన్ని హైలెట్ చేసింది. మొత్తం మీద, మెకిన్సే గ్లోబల్ ఇనిస్టిట్యూట్ ఈ సందర్భంగా అమెరికాలో కనీసం 12 మిలియన్ల మంది కార్మికులు 2030 చివరి నాటికి వృత్తులను మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ ఏడాది మార్చి నెలలో విడుదల చేసిన గోల్డ్‌మన్ సాచ్స్ నివేదిక ప్రకారం.. 300 మిలియన్ల ఉద్యోగాలు ఏఐ వల్ల ప్రభావితం కావచ్చని అంచనా వేసింది. చాట్‌జీపీటీలు వంటి టెక్నాలజీలు పోటాపోటీగా మనుషులు రాసే కంటెంట్లు.. కృత్తిమ మేధ’ టూల్స్ రాస్తాయని, రాబోయే దశాబ్దంలో ఉత్పాదకత మరింత పెరిగే అవకాశం స్పష్టం చేసింది. చదవండి👉 అంతా చాట్‌జీపీటీ మహిమ.. బ్యాచిలర్స్ ఏం చేస్తున్నారో తెలుసా? -
Amarnath Vasireddy: యంత్రాన్ని ప్రేమించు... మనిషిని ద్వేషించు! కోపం వస్తోందా?
వచ్చేసింది.. కృత్రిమ మేధ , మరమనుషుల ఉపయోగం , డిజిటలైజేషన్, ఆటోమేషన్ యుగం! రానున్న 15 ఏళ్ళల్లో భారీగా తగ్గిపోనున్న ఉద్యోగాలు/ వృత్తులు.. డ్రైవర్ , వ్యవసాయదారుడు , ప్రింటర్, పబ్లిషర్ , క్యాషియర్, ట్రావెల్ ఏజెంట్ , వైటర్స్ , డిస్పాచ్ క్లర్క్, ఫ్రంట్ ఆఫీస్ ఉద్యోగాలు, మిలిటరీ పైలట్, సోల్జర్.. టెలిమార్కెటర్, అకౌంటెంట్, టాక్స్ సలహాదారుడు , స్పోర్ట్స్ రిఫరీ / అంపైర్ , చేనేత కార్మికుడు, పెయింటర్, ప్లంబర్, స్టాక్ ట్రేడర్, నిర్మాణ కార్మికుడు.. భయమేస్తోందా? చర్చించండి . తప్పులేదు . తప్పదు. చిన్న చితకా వ్యాపారాలు అంతరించిపోతాయి. బహుళ జాతి సంస్థలు మరింత బలపడతాయి. ►ఒక పక్క కోట్ల ఆస్తులు కలిగిన వారు, మరో పక్క బతుకు తెరువు కోసం కష్టపడేవారు . ►ధనికులు మరింత ధనికులు అవుతారు, మధ్య తరగతి బీదరికంలోకి నెట్టబడతారు. సుమారుగా ఎనభై శాతం కష్టపడతారు. ►ధనికుల ఇళ్లల్లో వంటపనికి, ఇంటిపనికి రోబోలు, ఫ్రెండ్స్‌గా లివ్ ఇన్ పార్టనర్లుగా రోబోలు వస్తారు. ►ప్రతి ఆఫీస్‌లో మనుష్యుల కంటే రోబోలు, లేదా యంత్రాలు కనిపిస్తాయి. ►ఉద్యోగాలు తక్కువ; ధనిక బీద తారతమ్యం.. దీనితో తారా స్థాయిలో సామాజిక అసమానతలు, సామాజిక వైరుధ్యాలు, విద్వేషాలు. ►బాగా డెవలప్ అయ్యామనుకుంటున్న ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ లాంటి దేశాల్లో జాతి విద్వేషం మరింత పెరిగే అవకాశం ఉంటుంది. ► ప్రతి దేశం రక్షిత విధానాలను అనుసరిస్తుంది. వలసలను తగ్గిస్తుంది లేదా పూర్తిగా అనుమతించదు ఈ మెసేజ్ చదివితే నా పై కోపం వస్తోందా ? ఇది నిజం కాకూడదు అనిపిస్తోందా? సాంకేతికత జ్యామితీయ నిష్పత్తి వేగంతో దాన్ని ఆపలేము. ఆపాల్సిన అవసరం లేదు. సాంకేతికతను మానవ కల్యాణానికి వాడాలి. కానీ అది కొన్ని బహుళ జాతీయ కంపెనీల చేతిలో బందీ. వారి అధిపత్యానికి తిరుగు లేదు. సామాజిక శాస్త్రాలను చదవని సాధారణ ప్రజానీకానికి ఇది అవగాహన అయ్యే అవకాశం లేదు . అయినా కన్ఫ్యూజ్ చేస్తారు. ఆటలు సాగనివ్వరు . నిరాశావాదం అనిపిస్తోందా ? నిజం నిష్టూరంగానే ఉంటుంది . మెసేజ్ సేవ్ చేసుకొని ఒక నాలుగేళ్ళ తరువాత చెక్ చేసుకోండి. -వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ ఉపాధ్యాయులు, వ్యక్తిత్వ, మానసిక పరిశోధకులు -
వావ్ ఏం టెక్నాలజీ గురూ,ప్లే అవుతున్న టీవీని పాజ్ క్లిక్ చేసి చూడొచ్చు!
ఎలాంటి కెమెరాలు మిమ్మల్ని క్యాప్చర్ చేయకుండా బాడీ లాంగ్వేజ్ ఎలాంటిదో గుర్తిస్తే. టీవీలో టెలికాస్ట్ అవుతున్న సినిమాలో ఓ కామెడీ సిన్ టెలికాస్ట్ అయ్యే సమయంలో మనం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తాం.తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత టీవీలో ప్లే అవుతున్న సినిమాను పాజ్ నొక్కి ..వెనక్కి వెళ్లి మనకు కావాల్సిన కామెడీ, సాంగ్స్‌ను వీక్షిస్తే. బ్యాడ్ మూడ్‌లో ఉన్న మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేందుకు.ఆ క్షణంలో మీ మైండ్ సెట్‌ను గుర్తించి..అందుకు అనుగుణంగా పర్సనల్ కంప్యూటర్, ల్యాప్‌ట్యాప్‌లో మీ మనసుకు నచ్చిన సాంగ్స్ ప్లే అయితే ఎలా ఉంటుంది. ఎస్! మీరు ఊహించింది నిజమే. భవిష్యత్‌లో ప్రస్తుతం మనం ఆందోళన వ్యక్తం చేస్తున్న ఆటోమెషిన్ టెక్నాలజీతో సాధ్యం కానున్నాయి. పైన మనం చెప్పుకున్న ఊహాతీతమైన టెక్నాలజీపై ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ పనిచేస్తున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గూగుల్ ఎలాంటి కెమెరాల్ని ఊపగించకుండా యూజర్ల కదలికలు, వారి ప్రవర్తనను రికార్డ్ చేసి, విశ్లేషించే కొత్త టెక్నాలజీపై గూగుల్ పనిచేస్తున్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే బదులుగా శరీర కదలికలను గుర్తించి మానసిక స్థితి అర్థం చేసుకునేందుకు రాడార్‌ను ఉపయోగిస్తుందని నివేదికలు హైలెట్ చేస్తున్నాయి. కాగా, గూగుల్ ఈ తరహ టెక్నాలజీపై గతంలో పనిచేసింది. 2015లో గూగుల్ సోలి అనే సెన్సార్‌ను ఆవిష్కరించింది. ఇది ఖచ్చితమైన సంజ్ఞలు, కదలికల్ని గుర్తించేలా రాడార్ ఆధారిత ఎలక్ట్రో మ్యాగ్నెట్ తరంగాలను ఉపయోగించింది. గూగుల్ తొలిసారి గూగుల్ పిక్సెల్4లో ఈ సెన్సార్‌ను ఉపయోగించింది. దీంతో మోగుతున్న అలారంను సౌండ్ చేసి ఆపివేయడం, మ్యూజిక్‌ను పాజ్ చేసేందుకు ఉపయోగపడింది. చదవండి👉దిగ్గజ కంపెనీల్లో సాఫ్ట్వేర్ జాబ్ చేయడమే మీ లక్ష్యమా! గూగుల్ అదిరిపోయే ఆఫర్! -
కొత్త కేంద్రం ఏర్పాటులో అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో అసెంబ్లింగ్ యూనిట్, ఆర్అండ్డీ కేంద్రాలున్న అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్ తాజాగా కొత్త కేంద్రం ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. దీనితో ప్రత్యక్షంగా 50 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని సంస్థ సీఈవో విష్ణు రెడ్డి తెలిపారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ స్మార్ట్ డివైజ్‌ల తయారీ తదితర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. ప్రస్తుతం ఉప్పల్‌లోని తమ కేంద్రంలో .. 100 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 6 లక్షల యూనిట్లని పేర్కొన్నారు. 2019లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు విష్ణు రెడ్డి వివరించారు. ప్రస్తుతం టర్నోవరు 2.5 మిలియన్ డాలర్లుగా ఉండగా దీన్ని రెట్టింపు స్థాయికి 5 మిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ ప్రైమాప్లస్ స్మార్ట్ టచ్ ప్యానెల్ ఉత్పత్తుల శ్రేణిని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. సాధారణ లైట్లు, ఫ్యాన్లు మొదలైన వాటిని కూడా స్మార్ట్ ఉపకరణాలుగా మార్చేందుకు ఇది ఉపయోగపడగలదని విష్ణు రెడ్డి పేర్కొన్నారు. -
ఆటోమేషన్.. జాబ్ ఆఫర్లు అపారం!
డిజిటలైజేషన్.. ఆటోమేషన్.. ఇప్పుడు అన్ని రంగాల్లో వినిపిస్తున్న మాట! మానవ ప్రమేయం తగ్గించి ఆటోమేషన్ విధానంలో కార్యకలాపాలు నిర్వహించాలని కంపెనీలు భావిస్తున్నాయి. ఇందుకోసం రోబోటిక్ టెక్నాలజీ వైపు మొగ్గు చూపుతున్నాయి. దాంతో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) మొదలు తయారీ వరకు.. అన్ని రంగాల్లో రోబో ఆధారిత సేవలు విస్తరిస్తున్నాయి. ఫలితంగా.. రోబోటిక్స్ రంగం యువతకు కొలువుల వేదికగా మారుతోంది. ఈ నేపథ్యంలో.. రోబోటిక్స్ కొలువులు, తాజా ట్రెండ్స్, అవసరమైన నైపుణ్యాలు, అందుకునేందుకు మార్గాలపై ప్రత్యేక కథనం.. కొన్నేళ్ల క్రితం వరకు మాన్యుఫ్యాక్చరింగ్ రంగంలో ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమల్లోనే ఇండస్ట్రియల్ రోబోల వినియోగం ఉండేది. క్రమేణా ఇది ఇతర రంగాల్లోకి దూసుకొస్తోంది. ఇప్పుడు ఐటీ, హెల్త్‌కేర్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, అగ్రికల్చర్, డిఫెన్స్,స్పేస్ టెక్నాలజీ తదితర విభాగాల్లో సైతం రోబో ఆధారిత కార్యకలాపాలు విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా భారత్‌లోని ఐటీ సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ద్వారా కార్యకలాపాలు నిర్వహించే దిశగా అడుగులు వేస్తున్నాయి. అందుకోసం ఆర్పీఏ నైపుణ్యాలున్న వారిని నియమించుకునే ప్రయత్నంలో ఉన్నాయి. అందుకే ఆటోమేషన్ డిజిటలైజేషన్, ఆటోమేషన్‌ను వేగవంతం చేయడం ద్వారా మానవ ప్రమేయం తగ్గించొచ్చని సంస్థలు భావిస్తున్నాయి. అందుకోసం రోబోటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లను వినియోగించాలనే ఆలోచన చేస్తున్నాయి. అంటే.. వ్యక్తులు చేయాల్సిన అనేక కార్యకలాపాలు రోబోల ద్వారా నిర్వహిస్తారు. నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–పది మంది చేసే పనిని ఒక్క రోబో ద్వారా వేగంగా పూర్తిచేయొచ్చు. ఖర్చు కూడా తగ్గుతుంది. అందుకే సంస్థలు రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ వైపు దృష్టిపెడుతున్నాయి. కొత్త కొలువులు ► ముఖ్యంగా ఇటీవల కాలంలో ఐటీ విభాగంలో ఆటోమేషన్ ప్రక్రియ వేగవంతం అవుతోంది. ఐటీ అనుబంధ విభాగంగా పేర్కొనే బీపీఓలో చాట్ బోట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ పేరుతో రోబో ఆధారిత సేవలు అందించాలని సాఫ్ట్వేర్ సంస్థలు భావిస్తున్నాయి. ► సంస్థలు నిర్దిష్టంగా ఏదైనా ఒక విభాగంలో రోబోటిక్ సేవలు అందించాలని భావిస్తే.. దానికి సరితూగే విధంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ వంటివి సిద్ధం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం రోబోల తయారీ, నిర్వహణ, నియంత్రణకు మానవ నైపుణ్యం తప్పనిసరి. పది లక్షల ఉద్యోగాలు ► నాస్కామ్,బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల తాజా నివేదికల ప్రకారం–2022నాటికి రోబోటిక్స్ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పది లక్షల ఉద్యోగాలు అందుబాటులోకి రానున్నాయి. ► ఐటీ బీపీఓ రంగంలో 2022 నాటికి రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్(ఆర్పీఏ) ఆధారిత సేవలు 70శాతం మేర పెరగనున్నాయి. దీనికి తగ్గట్టుగా 2022 చివరి నాటికి లక్షల ఉద్యోగాలు ఆర్పీఏ, రోబోటిక్స్ విభాగాల్లో లభించనున్నాయని అంచనా. nఒక్క భారత్‌లోనే 2022 నాటికి ఆటోమేషన్ విభాగంలో దాదాపు మూడు లక్షల కొలువులు అందుబాటులోకి రానున్నాయి. నైపుణ్యాలు రోబోటిక్స్ విభాగంలో కొలువులు అందుకోవాలంటే.. నిర్దిష్టంగా కొన్ని నైపుణ్యాలు ఉండాలి. ముఖ్యంగా ప్రోగ్రామింగ్, కోడింగ్ స్కిల్స్; నానో టెక్నాలజీ; డిజైన్ అండ్ టెక్నాలజీ; సంబంధిత కోర్ స్కిల్స్ సొంతం చేసుకోవాలి. ఉదాహరణకు సాఫ్ట్వేర్ రంగంలో రోబోటిక్స్ విభాగంలో రాణించాలంటే.. రోబోల రూపకల్పనకు అవసరమైన స్పీచ్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్ వంటి వాటిపై అవగాహన ఉండాలి. అదే విధంగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మెషీన్ లెర్నింగ్ నైపుణ్యాలు కూడా రోబోటిక్ రంగంలో రాణించేందుకు ఉపయోగపడతాయి. కారణం..రోబోల రూపకల్పన, నిర్వహణ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారితంగా ఉండటమే. ఈ రోబోలకు డిమాండ్ ఇండస్ట్రియల్ రోబోట్స్, మెడికల్ రోబోట్స్; హెల్త్‌కేర్ రోబోట్స్, హాస్పిటాలిటీ రోబోట్స్, లాజిస్టిక్స్ రోబోట్స్‌కు డిమాండ్ పెరుగుతోంది. వీటిలోనూ సిగ్నల్ ప్రాసెసింగ్, రోబోటిక్ మోషన్ ప్లానింగ్, ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్,ఏఐ అండ్ రోబోటిక్స్ విభాగాలు మరింత కీలకంగా మారుతున్నాయి. జాబ్ ప్రొఫైల్స్ రోబోటిక్స్ ఇంజనీరింగ్ లేదా రోబోటిక్స్ స్పెషలైజేషన్ చేసిన అభ్యర్థులకు.. రోబోటిక్స్ టెక్నీషియన్స్, రోబోట్ డిజైన్ ఇంజనీర్, రోబోటిక్స్ టెస్ట్ ఇంజనీర్స్, సీనియర్ రోబోటిక్స్ ఇంజనీర్స్, ఆటోమేటెడ్ ప్రొడక్ట్ డిజైన్ ఇంజనీర్, అగ్రికల్చర్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీర్, రోబోటిక్ సిస్టమ్ ఇంజనీర్ వంటి జాబ్ ప్రొఫైల్స్ లభిస్తున్నాయి. ఈ ఉద్యోగాల్లో నియమితులైన వారికి సంస్థ స్థాయి, కార్యకలాపాల ఆధారంగా రూ.మూడు లక్షల నుంచి రూ. పది లక్షల వరకూ వార్షిక వేతనం లభిస్తోంది. స్కిల్స్‌కు మార్గం ► ఇప్పుడు అకడమిక్ స్థాయి నుంచే రోబోటిక్స్ నైపుణ్యాలు పొందే వీలుంది. ► ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రముఖ ఇన్స్టిట్యూట్లు.. బీటెక్ స్థాయిలోనే రోబోటిక్స్‌ను మైనర్‌గా అందిస్తున్నాయి. ► ఎంటెక్ స్థాయిలో రోబోటిక్స్ స్పెషలైజేషన్‌తో పూర్తి స్థాయి ప్రోగ్రామ్‌లను సైతం పలు ఇన్స్టిట్యూట్లు అందిస్తున్నాయి. ► ఎంటెక్‌లో మెడికల్ రోబోటిక్స్; సిగ్నల్ ప్రాసెసింగ్; రోబోట్ మోషన్ ప్లానింగ్; ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ రోబోటిక్స్; ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్ స్పెషలైజేషన్లు అభ్యసించడం ద్వారా ఆర్పీఏ నైపుణ్యాలు సొంతం చేసుకోవచ్చు. ► ఏఐసీటీఈ సైతం రోబోటిక్స్, ఏఐ విభాగాలకు సంబంధించిన స్కిల్స్ అందించేలా కరిక్యులం రూపొందించాలని అనుబంధ కళాశాలలకు మార్గనిర్దేశం చేసింది. ► వీటితోపాటు సీమెన్స్, రోబోటిక్స్ ఆన్లైన్, సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్, రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్ వంటి పలు సర్టిఫికేషన్ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. సర్టిఫికేషన్ కోర్సులు ► రోబోటిక్స్‌లో పూర్తి స్థాయి కోర్సులు అభ్యసించే అవకాశం లేని విద్యార్థులకు మూక్స్ విధానంలో పలు సర్టిఫికేషన్స్ అందుబాటులోకి వచ్చాయి. వీటిని పూర్తి చేసుకుని నిర్ణీత పరీక్షలో ఉత్తీర్ణత సాధించడం ద్వారా జాబ్ మార్కెట్లో పోటీ పడే అవకాశం లభిస్తుంది. పలు సంస్థలు రోబోటిక్స్ సర్టిఫికేషన్స్ అందిస్తున్నాయి. అవి.. ► రోబోటిక్స్ టెక్నీషియన్ అండ్ ఆటోమేషన్ ట్రైనింగ్: వెబ్సైట్: www.onlinerobotics.com ► రోబో జీనియస్ అకాడమీ: వెబ్సైట్: www.robogenious.in ► రోబోటిక్స్ ఆన్లైన్: వెబ్సైట్: www.robotics.org ► సర్టిఫైడ్ ఆటోమేషన్ ప్రొఫెషనల్: వెబ్సైట్: www.isa.org రోబోటిక్స్.. ముఖ్యాంశాలు ► రోబోటిక్ ఇంజనీరింగ్ విభాగంలో.. వచ్చే ఏడాది చివరికి ప్రపంచ వ్యాప్తంగా 20 శాతం మేర పెరగనున్న నియామకాలు. ► పీడబ్ల్యూసీ, నాస్కామ్, బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదికల ప్రకారం–వచ్చే ఏడాది చివరికి పది లక్షల ఉద్యోగాలు. ► అంతర్జాతీయంగా లక్షల కొలువులు లభిస్తాయని పలు సర్వేల అంచనా. ► రోబోటిక్ జాబ్స్ అందించడంలో మూడో స్థానంలో భారత్. ► ఈ విభాగాల్లో కనిష్టంగా రూ.మూడు లక్షలు, గరిష్టంగా రూ.10–12 లక్షల వార్షిక వేతనం. ► రోబోటిక్ ఇంజనీర్లు, డెవలపర్స్‌కు సగటున నెలకు రూ.50వేల నుంచి రూ.80వేల వేతనం లభిస్తోంది. ► బ్యాంకింగ్, హెల్త్‌కేర్ వంటి సర్వీస్ సెక్టార్లలో నెలకు రూ.60వేల వరకు వేతనం ఖాయం. n సాఫ్ట్వేర్, ప్రొడక్షన్, మెకానికల్, హెల్త్‌కేర్, ఎలక్ట్రానిక్స్,ఎలక్ట్రికల్, మాన్యుఫ్యాక్చరింగ్ సంస్థల్లో అధిక శాతం నియామకాలు. ఇదే మంచి అవకాశం రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ కార్యకలాపాలు పెరుగుతూ..దానికి సంబంధించిన విభాగాల్లో కొలువులు అందుబాటులోకి వస్తున్నాయి. యువత దీన్ని తమకు అనుకూలంగా మలచుకోవాలి. సంబంధిత నైపుణ్యాలను నేర్చుకునే ప్రయత్నం చేయాలి. రోబోలతో ఉద్యోగాలు తగ్గుతాయన్న మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ.. వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు లభిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించాలి. – ప్రొ.కె.మాధవ కృష్ణ, అసోసియేట్ ప్రొఫెసర్, రోబోటిక్స్ రీసెర్చ్ సెంటర్, ఐఐఐటీ–హైదరాబాద్ -
‘ఆటోమేషన్’ ఆపద..?
కంప్యూటర్లు వచ్చిన తరువాత టైప్ రైటర్లకు పనిలేకుండా పోయింది.. కంప్యూటర్లు కాస్తా తెలివిమీరి.. రోబోలు, డ్రోన్లు, కృత్రిమ మేథలొచ్చేశాయి..ఇవన్నీ పూర్తి వినియోగంలోకి వస్తే... మనిషి చేసేందుకు పనులుండవు.. ఆటోమేషన్ ముప్పు ఇప్పటికైతే సాఫ్ట్వేర్ రంగానికే కావచ్చుకానీ... ఇంకొన్నేళ్లు పోతే.. సాగు, నిర్మాణ, తయారీ రంగాల్లోనూ హవా చెలాయించడం గ్యారెంటీ.. మరి.. ఈ భారీ మార్పునకు భారత్ సిద్ధంగా ఉందా అంటే..ఊహూ.. లేదు అని ఆంటోంది ఆటోడెస్క్! సాక్షి, హైదరాబాద్ : ఐటీ రంగంలో ఆటోమేషన్తో లక్షల ఉద్యోగాలు పోతాయన్న వార్తలు మనకు కొత్త కాదు. కానీ, ఇతర రంగాలపై దీని ప్రభావం ఇప్పుటికిప్పుడే ఉండదని అనుకుంటూ ఉండగా.. అంతర్జాతీయ సాఫ్ట్వేర్ సంస్థ ఆటోడెస్క్ భారత్, చైనాలు సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో జరి పిన ఒక సర్వే ఇందుకు భిన్నమైన అంచనాలను మన ముందుంచింది. రాబోయే ఆటోమేషన్ విప్లవానికి భారత్ సన్నద్ధత అంతంత మాత్రమేనని ఈ అధ్యయనం నిర్వహించిన కన్సల్టింగ్ సంస్థ డెలాయిట్ కూడా చెబుతోంది. వివిధ రంగాల్లో ఆటోమేషన్ ఎలా జరుగుతోంది? భవిష్యత్‌లో ఉపాధి పరిస్థితి ఏంటి? అనే విషయాలపై 12 ఆసియా పసిఫిక్ దేశాల్లో ఈ సర్వే జరిగింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లపై ఆటోమేషన్ ప్రభావం చాలా తీవ్రంగా ఉండనుందని ఈ అధ్యయనం హెచ్చరించింది. ఆటోమేషన్ ప్రభావం చాలా ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో భారత్ ఐదవ స్థానంలో ఉండగా... సన్నద్ధత విషయంలో తొమ్మిదో స్థానంలో ఉంది. వ్యవసాయం, తయారీ, నిర్మాణం వంటి రంగాల్లోనే దేశ ప్రజల్లో ఎక్కువ మంది ఉపాధి అవకాశాలు పొందుతూ ఉండటం ఇందుకు కారణమన్నది ఈ అధ్యయనం అంచనా. ఈ రంగాల్లో ఆటోమేషన్ వేగం పుంజుకుంటే.. అదేస్థాయిలో ఉపాధి అవకాశాలు పోతాయన్నమాట. ఒకేరకమైన పనిని పదేపదే మనుషులతో చేయించడం కంటే.. రోబోలు, అత్యాధునిక సాఫ్ట్వేర్ల సాయంతో చేపడితే.. నాణ్యత పెరగడంతోపాటు, ఖర్చులు కలిసివస్తాయన్నది కంపెనీల ఆలోచన. వ్యాపార సంస్థల్లోని కనీసం సగం మంది తమ రంగాల్లో ఆటోమేషన్‌కు సుముఖంగా ఉన్నట్లు ఈ అధ్యయనం తెలిపింది. జాగ్రత్తలు అత్యవసరం.. –ఆటోడెస్క్ రీజినల్ డైరెక్టర్ రాజీవ్ మిట్టల్ ఆటోమేషన్ మోసుకు రాగల సమస్యలను ముందుగానే గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకోవడం అత్యవసరం. ఆయా రంగాల్లో ఆటోమేషన్‌కు ఉన్న అవకాశాలపై అవగాహన పెంచడం, కొత్త కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేలా శ్రామిక శక్తికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వాలి. కోవిడ్ కారణంగా పలు రంగాల్లో ఆటోమేషన్ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. అదే సమయంలో ఈ ప్రక్రియలు కాస్తా.. కొత్త, అర్థవంతమైన ఉపాధి అవకాశాలను కల్పిస్తున్నాయి. ఆయా దేశాలు ఈ మార్పునకు ఎంత సిద్ధంగా ఉన్నాయన్న అంశంపై ఆటోమేషన్ ప్రభావం ఆధారపడి ఉంటుంది. డిజిటల్ సాక్షరతను పెంచడం, కూలీలకు కొత్త నైపుణ్యాలను అందించే ప్రయత్నం చేయడం, నైపుణ్యాభివృద్ధికి తగిన మౌలిక సదుపాయాల కల్పన అవసరం. -
టాప్-5 ఐటీ కంపెనీల్లోనే 96 వేల ఉద్యోగాలు: నాస్కామ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంతో ఐటీ నిపుణులకు అవకాశాలు మెండుగా వచ్చి పడుతున్నాయని ఐటీ పరిశ్రమ వాదిస్తోంది. ఆటోమేషన్‌వల్ల ఐటీ రంగంలో ఉద్యోగులకు భారీ ఎత్తున నష్టం ఏర్పడుతోందన్న తాజా వాదనపై స్పందించిన ఐటీ పరిశ్రమ బాడీ నాస్కామ్ ప్రస్తుతం ఐటీ పప్రొఫెషనల్స్కు భారీ డిమాండ్ కనిపిస్తోందని గురువారం పేర్కొంది. ముఖ్యంగా దేశంలోని టాప్-5 ఐటీ సంస్థలు 2021-22లో 96వేలమంది ఉద్యోగులను నియమించుకోవాలని యోచిస్తున్నాయని తెలిపింది. 2022 సంవత్సరం నాటికి భారతీయ సాఫ్ట్వేర్ సంస్థలు 30 లక్షల ఉద్యోగాలను తొలగించబోతున్నాయని, తద్వారా సంవత్సరానికి 100 బిలియన్ డాలర్లను ఆదా చేసుకోవాలని భావిస్తున్నాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదించిన తర్వాత నాస్కామ్ ప్రకటన రావడం గమనార్హం. దేశీయ ఐటీ రంగంలో 2021-22 సంవత్సరంలో నియామకాలు పుంజుకోనున్నాయని నాస్కామ వాదించింది.ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలకు ముప్పు ఉందన్న బీఓఏ వ్యాఖ్యలపై స్పందిస్తూ సాంకేతిక పరిజ్ఞానంతో, పెరుగుతున్న ఆటోమేషన్ కారణంగా సాంప్రదాయ ఐటీ ఉద్యోగాలు, పాత్రల స్వభావం మారనుందని, ఫలితంగా కొత్త ఉద్యోగాల కల్పనకు దారితీస్తుందని వ్యాఖ్యానించింది. నిపుణులకు, ప్రతిభావంతులకు డిమాండ్ బాగుందని, 2021 ఏడాదిలో 1,38,000 ఉద్యోగులను చేర్చుకుందని నాస్కామ్ అధికారిక ప్రకటనలో తెలిపింది. టాప్-5 సంస్థలే సుమారు 96 వేల మందిని రిక్రూట్ చేసుకోబోతున్నాయని పేర్కొంది. దీంతోపాటు 2 లక్షల 50వేల మందికి పైగా ఉద్యోగుల్లో డిజిటల్ నైపుణ్యాలను పెంపొందిస్తోందని, అలాగే 40 వేలమందిని డిజిటల్ ప్రతిభావంతులను నియమించిందని తెలిపింది. దేశంలో బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) రంగంలో1.4 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని నాస్కామ్ తెలిపింది. ఆటోమేషన్‌లో కీలకమైన ఐటీ-బీపీఎంలో మార్చి 2021నాటికి ఐటీ-బీపీఎంలోరంగంలో మొత్తం 4.5 మిలియన్ల మంది ఉద్యోగులున్నారని పేర్కొంది. గత 3 సంవత్సరాల్లో ఆటోమేషన్, ఆర్‌పిఎ (రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్) బీపీఎం రంగంలో ఉద్యోగాల సృష్టికి దారితీసిందని అసోసియేషన్ వివరించింది. చదవండి: కరోనా సంక్షోభం: గూగుల్ మరోసారి భారీ సాయం Edible oil: వినియోగదారులకు భారీ ఊరట -
ఐటీ ఉద్యోగులకు ఆటోమేషన్ గండం!
ముంబై: వివిధ రంగాల్లో.. ముఖ్యంగా టెక్నాలజీ విభాగంలో ఆటోమేషన్ వేగవంతం అవుతున్న నేపథ్యంలో దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) కంపెనీలు ..భారీగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే యోచనలో ఉన్నాయి. 2022 నాటికి ఏకంగా 30 లక్షల మందికి ఉద్వాసన పలకనున్నాయి. జీతభత్యాలకు సంబంధించి కంపెనీలు ఏటా 100 బిలియన్ డాలర్ల దాకా ఆదా చేసుకునేందుకు ఇది తోడ్పడనుంది. బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక నివేదికలో ఈ అంశాలు వెల్లడించింది. దేశీ ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్ లెక్కల ప్రకారం.. ప్రస్తుతం దేశీయంగా ఐటీ రంగంలో 1.6 కోట్ల మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. వీరిలో సుమారు 90 లక్షల మంది తక్కువ స్థాయి నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాల్లోనూ, బీపీవో ఉద్యోగాల్లోనూ పనిచేస్తున్నారు. ఈ విభాగంలోనే ఉద్యోగుల తీసివేత ఉండనుంది. 90 లక్షల ఉద్యోగాల్లో సుమారు 30 శాతం .. అంటే 30 లక్షల కొలువులకు కత్తెర పడనుంది. ప్రధానంగా రోబో ప్రాసెస్ ఆటోమేషన్ (ఆర్పీఏ) ప్రభావమే ఇందుకు కారణం. ఆర్పీఏ కారణంగా సుమారు 7 లక్షల ఉద్యోగాలకు, ఐటీ కంపెనీలు టెక్నాలజీని అప్‌గ్రేడ్ చేసుకోవడం తదితర అంశాల మూలంగా మిగతా వాటికి కోత పడనుంది. ఆర్పీఏ వల్ల అమెరికాలో అత్యధికంగా దాదాపు 10 లక్షల కొలువులకు ముప్పు ఉంది. దేశీయంగా ఉద్యోగులపై వ్యయాలు వార్షికంగా సగటున 25,000 డాలర్లుగాను, అమెరికాలోని వారిపై వ్యయాలు 50,000 డాలర్లుగా లెక్కిస్తే.. ఉద్యోగాల్లో కోతలతో కంపెనీలు 100 బిలియన్ డాలర్ల మేర వార్షిక జీతభత్యాలు, సంబంధిత వ్యయాలు ఆదా చేసుకోనున్నాయి. టీసీఎస్, ఇన్ఫీ.. అన్నీ.. ‘‘ఆర్పీఏ అమలు ద్వారా తక్కువ నైపుణ్యాలు అవసరమైన ఉద్యోగాలకు సంబంధించి సుమారు 30 లక్షల కొలువుల్లో కోత పెట్టాలని టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్రా, కాగ్నిజెంట్‌తో పాటు ఇతర సంస్థలు యోచిస్తున్నట్లు కనిపిస్తోంది. దీనివల్ల వాటికి 100 బిలియన్ డాలర్ల మేర జీతభత్యాలు, ఇతర వ్యయాలు తగ్గుతాయి. ఆర్పీఏని విజయవంతంగా అమలు చేయగలిగితే ఐటీ కంపెనీలకు 10 బిలియన్ డాలర్ల దాకా, అలాగే కొత్త సాఫ్ట్వేర్లతో మరో 5 బిలియన్ డాలర్ల దాకా లాభించే అవకాశం ఉంది. మనుషులతో పోలిస్తే రోబోలు రోజంతా 24 గంటలూ పనిచేస్తాయి కాబట్టి కంపెనీలకు గణనీయంగా ఆదా అవుతుంది’’ అని నివేదిక పేర్కొంది. భౌతిక రోబోలు కాకుండా సాఫ్ట్వేర్ అప్లికేషన్ రూపంలో ఉండేదాన్ని ఆర్పీఏగా వ్యవహరిస్తారు. దీన్ని రోజువారీగా భారీ స్థాయిలో చేసే పనుల్లో ఉపయోగిస్తారు. దేశీ ఐటీకి ఆఫ్‌షోరింగ్ ఊతం.. అనేక సంవత్సరాలుగా విదేశీ సంస్థలు తమ ఐటీ అవసరాల కోసం భారత టెక్నాలజీ కంపెనీల వైపు చూస్తుండటంతో (ఆఫ్‌షోరింగ్) దేశీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగం గణనీయంగా వృద్ధి చెందింది. 1998లో స్థూల దేశీయోత్పత్తిలో దీని వాటా 1 శాతంగా ఉండగా.. ప్రస్తుతం ఇది 7 శాతానికి చేరింది. ఆర్థిక వ్యవస్థకు అత్యంత వ్యూహాత్మకంగా ఎదిగింది. అయితే, గతంలో తమ కార్యకలాపాలను ఆఫ్‌షోర్ చేసిన చాలా మటుకు దేశాలు తమ స్వదేశాల్లో ఉద్యోగాల కల్పనపై ప్రస్తుతం దృష్టి పెడుతున్నాయి. నివేదిక ప్రకారం.. సంపన్న దేశాలు కూడా విదేశాలకు అవుట్సోర్స్ చేసిన ఐటీ ఉద్యోగాలను స్వదేశానికి తరలించడం లేదా స్థానిక ఐటీ ఉద్యోగులను ఉపయోగించుకోవడం లేదా ఆర్పీఏ వంటి విధానాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. తద్వారా తమ డిజిటల్ సరఫరా వ్యవస్థను, దేశీయ టెక్నాలజీ ఇన్ఫ్రా రంగాన్ని భవిష్యత్‌లో సురక్షితంగా ఉంచుకోవాలని అవి భావిస్తున్నాయి. భారీ స్థాయిలో ఆటోమేషన్ అయినప్పటికీ.. జర్మనీ (26శాతం), చైనా (7శాతం), భారత్ (5శాతం), కొరియా, బ్రెజిల్, థాయ్‌ల్యాండ్, మలేషియా, రష్యా వంటి పెద్ద దేశాల్లో కార్మికుల కొరత ఏర్పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. అయితే, దీనికి విరుద్ధంగా దక్షిణాఫ్రికా, గ్రీస్, ఇండొనేíÙయా, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో వచ్చే 15 ఏళ్ల పాటు కార్మికుల లభ్యత అధిక స్థాయిలో ఉంటుందని పేర్కొంది. చదవండి: నెలకు లక్షల ఆర్డర్లు, 4 వేల కోట్లు ఇన్వెస్ట్ చేసిన ఈకామర్స్ సంస్థ -
‘రోబో డాగ్’ చేసే పనులు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!
సాధారణంగా చాలా మంది పెంపుడు జంతువులుగా కుక్కలను పెంచుకుంటారు. ఆ మూగజీవాలు మన రక్షణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కానీ భవిష్యత్తులో వాటిని కూడా రోబోలతో భర్తీ చేస్తామేమో..! అవును మీరు చదివింది నిజమే.. రానున్న కాలంలో రోబోలే మనకు కాపలాగా ఉండనున్నాయి. కెనడాకు చెందిన ఆల్బార్టా షెల్ రిఫైనరీ కంపెనీ ‘స్పాట్’ అనే రెండు రోబో డాగ్‌లను కాపలా ఉద్యోగులుగా చేర్చుకున్నారు. ప్లాంట్‌లో అత్యంత ప్రమాదకరమైన పనులను ఈ రోబో డాగ్‌లు చూడనున్నాయి. వీటితో ప్లాంట్‌లో ప్రాణనష్టం తక్కువని భావించి ఈ రోబోలను వారి కంపెనీలో చేర్చుకున్నారు. ఈ రోబో డాగ్‌లను అమెరికాకు చెందిన బోస్టన్ డైనమిక్స్ అనే సంస్థ రూపొందించింది. స్పాట్ రోబో డాగ్ ధర సుమారు లక్ష డాలర్లు. స్పాట్ ప్రత్యేకతలివే.. స్పాట్ చేసే పని చూస్తే ముక్కు మీద వేలు వేసుకోవాల్సిందే. ఈ రోబో డాగ్‌లు గంటకు మూడు మైళ్ల గరిష్ట వేగాన్ని అందుకోగలవు. అంతేకాకుండా వీటికి అమర్చిన 360 డిగ్రీల కెమెరాలతో వాటికి ఎదురయ్యే అడ్డంకుల నుంచి సులువుగా తప్పించుకోగలవు. సుమారు పద్నాలుగు కిలోల వరకు బరువును మోయగలవు. స్పాట్‌ను అత్యల్పంగా -20 డిగ్రీల సెల్సియస్ నుంచి, అత్యధికంగా 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద ఆపరేట్ చేయవచ్చు. అంతేకాకుండా ఆయిల్, గ్యాస్ కంపెనీలో జరిగే లీకేజీలను కూడా ఇవి పసిగట్టగలవు. ఈ రోబో డాగ్‌లను పలు క్లిష్టమైన పనులకు ఉపయోగించవచ్చునని బోస్టన్ డైనమిక్స్ తెలిపింది. అండర్‌గ్రౌండ్ మైనింగ్, రేడియేషన్ ఎక్కువగా ఉండే న్యూక్లియర్ పవర్ ప్లాంట్, ఆయిల్ రిఫైనరీ కంపెనీలో వీటిని వాడొచ్చుననీ పేర్కొంది. బోస్టన్ డైనమిక్స్ స్పాట్ రోబో డాగ్‌లతో పాటు, బిగ్ డాగ్, హ్యాండిల్, చీతా, పెట్మెన్, అట్లాస్ లాంటి హ్యూమనాయిడ్ రోబోలను రూపొందించింది. వీటిలో ప్రస్తుతం స్పాట్ రోబో డాగ్‌లను మాత్రమే మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. -
ఇక డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్
సాక్షి, అమరావతి: వీడియో ఆధారిత సెన్సర్ల వినియోగం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్ సామర్థ్య పరీక్షల నిర్వహణకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. రూ.13.4 కోట్లతో రాష్ట్రంలో తొమ్మిది చోట్ల డ్రైవింగ్ ట్రాక్‌ల ఆటోమేషన్ నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకు కేంద్రం ఏపీకి రూ.9 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.4.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్రంలోని రవాణా కార్యాలయాల్లో సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్న చోట్ల ఈ ఆటోమేషన్ డ్రైవింగ్ ట్రాక్‌లు నిర్మిస్తారు. వైజాగ్, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులలో ఈ ట్రాక్‌లకు టెండర్లు ఖరారయ్యాయి. మార్చి నెలాఖరుకల్లా విశాఖ, అనంతపురం, చిత్తూరు, విజయవాడలలో, డిసెంబర్ నాటికి తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రొద్దుటూరులలో ట్రాక్‌ల్ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ఆటో మేషన్ డ్రైవింగ్ ట్రాక్ అంటే.. డ్రైవింగ్ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులు మాన్యువల్ విధానంలో పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లైసెన్స్‌లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా, పారదర్శకంగా నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. వీడియో సెన్సర్లే కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఇవి నమోదు చేస్తాయి. వాహనాన్ని నడిపే తీరు, వేగం, వాహనం కండిషన్, పార్కింగ్ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తయిన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్ రద్దీలో నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి. -
చిన్న కమతాలకు పెద్ద అండ యాంత్రీకరణ
సాక్షి, అమరావతి: పవర్ టిల్లర్లు, వీడర్లు, స్ప్రేయర్లు, ట్రాక్టర్లు, కట్టె గానుగలు వంటి అనేక చిన్నా, పెద్ద యంత్రాల ప్రదర్శనకు గుంటూరు సమీపంలోని పుల్లడిగుంట వేదికైంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆదివారం ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు వందలాదిమంది రైతులు హాజరయ్యారు. పరికరాల వినియోగాన్ని ప్రయోగాత్మకంగా చూసి, చేసి తెలుసుకున్నారు. బాపట్ల వ్యవసాయ కళాశాల డీన్, అగ్రికల్చర్ ప్రొఫెసర్ జోసఫ్రెడ్డితో పాటు పలువురు శాస్త్రవేత్తలు, ప్రకృతి, సేంద్రియరంగ సేద్య నిపుణులు రైతులకు యంత్రపరికరాల వినియోగ అవసరాన్ని వివరించారు. రాష్ట్రంలో కమతాలు చిన్నవైనందున వాటికి తగిన యంత్రాలనే ఇక్కడ ప్రదర్శనకు పెట్టామని రైతునేస్తం ఫౌండేషన్ ఛైర్మన్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వై.వెంకటేశ్వరరావు చెప్పారు. ఆకట్టుకున్న ప్రదర్శన పత్తి, మిరప వంటి పంటల్లో కలుపు తీసే యంత్రాలు, ట్రాక్టర్ సాయంతో పెద్దఎత్తున పిచికారీ చేసే పరికరాలు, తక్కువ ఖర్చుతో 10, 12 కిలోల కూరగాయలు నిల్వచేసుకునే థర్మోకోల్ రిఫ్రిజిరేటర్లు, అంతరసేద్యం చేసే బుల్లి గొర్రు, చిన్న నాగలి, మనిషి నిల్చొనే గడ్డి పీకేసే పరికరాలు వంటివి అనేకం రైతులను ఆకట్టుకున్నాయి. పలువురు వ్యవసాయ విద్యార్థులు సొంతంగా తయారుచేసిన పరికరాలను రైతులు ఆసక్తిగా పరిశీలిస్తూ వివరాలు తెలుసుకున్నారు. ఈ రైతు పేరు పి.సాంబశివరావు. గుంటూరు జిల్లా పసుమర్రు గ్రామం. తన మోపెడ్ వాహనాన్నే సోలార్ పవర్ స్ప్రేయర్‌గా మార్చుకున్నారు. ఎక్కడైనా చేలో మందు చల్లాల్సి వచ్చినప్పుడు మోపెడ్‌కు బిగించిన 20 లీటర్ల క్యాన్‌లో ద్రావణాలను కలిపి సోలార్ పవర్ ఆధారంగా నడిచే చిన్న మోటారు సాయంతో పిచికారీ చేస్తున్నారు. మోపెడ్ మీదనే పొలానికి వెళతారు. చేలో బండి ఆపి మందును పిచికారీ చేస్తారు. మీ పంట చేలో పడిన కోతులను తరమడం పెద్ద బెడదగా మారిందా? అయితే ఇదిగో పరిష్కారం. తక్కువ ఖర్చుతో పెద్ద శబ్దం వచ్చే చిన్నపాటి ప్లాస్టిక్ గన్ను ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన వ్యవసాయ కళాశాల విద్యార్థులు తయారు చేశారు. దీన్ని ఎలా వాడాలో రైతులకు వివరిస్తూ ఆకట్టుకుంటున్నారు. ఇదో పవర్ టిల్లర్. ఎద్దులు, దున్నపోతులతో పనిలేకుండా స్వయంగా రైతే పొలాన్ని దున్నుకునే చిన్నపాటి యంత్రం. దీనిసాయంతో ఎకరం, రెండెకరాల పొలాన్ని సునాయాసనంగా దున్నవచ్చు. లీటర్ పెట్రోలు పోసుకుంటే గంటన్నరకుపైగా నడుస్తుంది. తక్కువ ఖర్చుతో అటు సమయాన్ని, ఇటు శ్రమను ఆదా చేసుకోవచ్చు. -
ఇక రెండుగా ఐబీఎం..
న్యూఢిల్లీ: టెక్ దిగ్గజం ఐబీఎం తన వ్యాపార కార్యకలాపాలను రెండుగా విభజించనుంది. ఇందులో భాగంగా మేనేజ్డ్ ఇన్ఫ్రా సేవల విభాగాన్ని ప్రత్యేక సంస్థగా ఏర్పాటు చేయనుంది. ఇకపై ఐబీఎం పూర్తిగా హైబ్రీడ్ క్లౌడ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మొదలైన వ్యాపారాలపై దృష్టి పెట్టనుండగా, రెండో సంస్థ సర్వీస్ డెలివరీ, ఆటోమేషన్ తదితర విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహించనుంది. ఈ ప్రక్రియ 2021 ఆఖరు నాటికి పూర్తి కావచ్చని అంచనా. తాత్కాలికంగా ’న్యూకో’ పేరుతో వ్యవహరిస్తున్న ఇన్ఫ్రా సేవల విభాగానికి భారత్‌లోని ఉద్యోగుల్లో సుమారు మూడో వంతు సిబ్బందిని బదలాయించనున్నట్లు ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ తెలిపారు. 2019 ఆఖరు నాటికి ఐబీఎంలో మొత్తం 3.83 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. దేశాలవారీగా ఉద్యోగుల సంఖ్యను కంపెనీ వెల్లడించనప్పటికీ.. భారత్‌లో సుమారు 1 లక్ష పైచిలుకు సిబ్బంది ఉంటారని అంచనా. -
షాకింగ్ : ఆటోమేషన్తో 9 శాతం కొలువులు కోత..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్తో భారత్‌లో 9 శాతం మంది ఉద్యోగులు తమ కొలువులు కోల్పోతారని ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డేవిడ్ లిప్టన్ అంచనా వేశారు. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ అప్లైడ్ ఎకనమిక్ రీసెర్చ్ (ఎన్సీఏఈఆర్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆటోమేషన్ ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది అంటే దాదాపు 37.5 కోట్ల మంది ఉద్యోగులు ఉపాధి కోల్పోతారని అన్నారు. తక్కువ వేతనాలు, అధిక కార్మికులు అవసరమైన పరిశ్రమల్లో ఆటోమేషన్ కారణంగా ఉద్యోగాలు పోయే పరిస్థితి అధికంగా ఉంటుందని లిప్టన్ హెచ్చరించారు. బడ్జెట్లో భారత్ పలు ఉత్పత్తులపై దిగుమతి సుంకాన్ని పెంచడం ద్వారా పోటీతత్వంపై ప్రభావం ఉంటుందని, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థకు ఇది విఘాతం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. స్వల్పకాలంలో పోటీతత్వం కొంత ఇబ్బందికరమే అయినా దీర్ఘకాలంలో కంపెనీలు స్వతంత్రంగా ఎదిగేందుకు ఇది దోహదపడుతుందని అన్నారు. అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వృద్ధి రేటు మందగించిందని, దీని ప్రభావం ఇతర ఆసియా దేశాలతో పోలిస్తే భారత్‌పై పరిమితంగానే ఉంటుందని అంచనా వేశారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు న్యాయ, రెగ్యులేటరీ పరమైన చిక్కులను తొలగించాలని అన్నారు. గ్రామీణ వినిమయం తగ్గడం, ఎగుమతుల వృద్ధి పతనమవడం, నిరుద్యోగం దేశ ఆర్థిక వ్యవస్థకు ఇబ్బందులుగా మారాయని చెప్పుకొచ్చారు. కరెంట్ ఖాతా లోటుపై భారత్ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని దాన్ని పూడ్చుకునేందుకు మూలధన నిధులను ఆకర్షించాలని కోరారు. చదవండి : పనీపాటా లేని కుర్రకారు ఇక్కడే ఎక్కువ -
ఇక ఆటోమ్యుటేషన్
సాక్షి, అమరావతి: భూయాజమాన్య హక్కుల మార్పిడి (మ్యుటేషన్) విషయంలో అవినీతిరహిత, పారదర్శక, సులభతర, సత్వర సేవల దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. రిజిస్ట్రేషన్ దస్తావేజుల తయారీలో అవినీతి, దళారుల ప్రమేయం లేకుండా ఎవరి దస్తావేజులు వారే రాసుకునే పబ్లిక్ డేటా ఎంట్రీ (పీడీఈ) విధానాన్ని ఇటీవల అమల్లోకి తెచ్చిన ప్రభుత్వం తాజాగా ఆటోమ్యుటేషన్ ప్రక్రియకు మంగళవారం శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆటోమ్యుటేషన్ సేవల పోస్టర్‌ను మంగళవారం సచివాలయంలో విడుదల చేశారు. ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రస్తుతం భూములను కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నవారు రెవెన్యూ రికార్డుల్లో వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం మీసేవ కేంద్రాలకు వెళ్లి.. నిర్ధిష్ట రుసుం చెల్లించి.. పత్రాలన్నీ స్కాన్ చేసి సమర్పించాల్సి వస్తోంది. తర్వాత మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగడమే కాకుండా.. అక్కడి సిబ్బందికి ఎంతో కొంత సమర్పించుకోవాల్సి వస్తోంది. ఎటువంటి ఫీజు చెల్లించకుండానే.. ఇకపై రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఆ భూములను కొనుగోలుదారుల పేరుతో తాత్కాలికంగా నమోదు చేసేలా రిజిస్ట్రేషన్ అధికారులకు వీలు కల్పిస్తూ ‘ఆంధ్రప్రదేశ్ భూమి హక్కులు, పట్టాదార్ పాస్‌బుక్ చట్టం – 1971’ను ప్రభుత్వం సవరించింది. ఇక నుంచి భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్నవారు ఆన్‌లైన్‌లోనూ, రెవెన్యూ రికార్డుల్లోనూ వారి పేర్ల నమోదు (మ్యుటేషన్) కోసం ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. దరఖాస్తు కూడా చేసుకోవాల్సిన అవసరం లేదు. అధికారులే రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మీభూమి పోర్టల్ (ఆర్ఓఆర్, 1బి, అడంగల్)లో తాత్కాలిక ప్రాతిపదికన నమోదు చేస్తారు. తదుపరి ఆ లావాదేవీపై అభ్యంతరాల స్వీకరణకు రెవెన్యూ అధికారులు 15 రోజులు గడువు ఇస్తారు. తర్వాత తహసీల్దార్ కార్యాలయ అధికారులు చట్టబద్ధమైన ప్రక్రియను పూర్తి చేసి నెల రోజుల్లో శాశ్వత మ్యుటేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. ఈ భూమార్పిడి వివరాలను meebhoomi. ap. gov. in లో చూసుకునే సదుపాయాన్ని కల్పించారు. ప్రయోగాత్మకంగా మొదట కృష్ణా జిల్లా కంకిపాడులో.. ఆటోమ్యుటేషన్‌ను మొదట కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ప్రభుత్వం ప్రయోగాత్మకంగా అమలు చేసింది. ఇప్పుడు దీన్ని రాష్ట్రమంతా అమల్లోకి తెచ్చింది. నూతన విధానం ప్రకారం.. భూబదలాయింపు ప్రక్రియ ప్రతి దశలో పట్టాదారు మొబైల్‌కు సంక్షిప్త సమాచారం వస్తుంది. రిజిస్ట్రేషన్ జరిగిన 30 రోజుల్లో తహసీల్దార్ ధ్రువీకరించి రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేస్తారు. తర్వాత ఎలక్ట్రానిక్ పట్టాదారు పాస్ పుస్తకాన్ని మీభూమి వెబ్సైట్ నుంచి ప్రజలు నేరుగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. – శ్రీధర్, రాష్ట్ర భూపరిపాలన సంయుక్త కమిషనర్ -
హైదరాబాద్‌లో ఎండ్రెస్ హోసర్ ఎక్స్‌పీరియెన్స్ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాసెస్ ఆటోమేషన్ రంగంలో ఉన్న ఎండ్రెస్ హోసర్ హైదరాబాద్‌లో టెక్నాలజీ ఆధారిత ఎక్స్‌పీరియెన్స్ సెంటర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే కంపెనీకి ఇతర నగరాల్లో ఇటువంటివి రెండు కేంద్రాలున్నాయి. దేశవ్యాప్తంగా 3,000కు పైగా క్లయింట్లకు తాము సేవలు అందిస్తున్నట్టు ఎండ్రెస్ హోసర్ ఇండియా ఎండీ కైలాష్ దేశాయ్ శుక్రవారమిక్కడ మీడియాకు తెలియజేశారు. 70 దేశాల్లో కార్యకలాపాలు సాగిస్తున్న సంస్థ ఖాతాలో 7,000 పేటెంట్లు ఉన్నాయని గుర్తు చేశారు. గత ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.750 కోట్ల ఎగుమతులతో కలిపి రూ.1,400 కోట్ల టర్నోవర్ సాధించింది. -
మనిషిని మింగుతున్న ‘ఆటోమేషన్’
యాంత్రీకరణ మనిషిని ఉత్పత్తికి దూరం చేస్తోంది. ఇది వ్యవసాయ రంగాన్ని మొట్టమొదటిగా కబళించింది. మట్టికీ మనిషికీ ఉన్న సంబంధాన్ని బద్దలు కొట్టింది. గత రెండు వేల ఏళ్లుగా సమాజంలో సంభవించని పరిణామాలు గత ముప్ఫై, నలభై ఏళ్లలో అనూహ్యంగా చోటు చేసుకున్నాయి. ఒకే ఒక్క ట్రాక్టరు వ్యవసాయరంగంలో కొన్ని వందలమంది జీవనోపాధిని మింగేసింది. వ్యవసాయంలో జరిగే అతి చిన్న పనులను కూడా మనిషితో సంబంధం లేని యంత్రాలు చేస్తున్నాయి. నేడు ఆటోమేషన్ అనేది లక్షలాదిమందికి నిజంగానే పనిలేకుండా చేస్తోంది. ప్రజలకు తమ కాళ్లమీద తాము నిలబడి బతికే పరిస్థితిని కల్పించడం, ఉపాధిని ఏర్పర్చడం.. వంద సంక్షేమ చర్యలకంటే మిన్నగా మేలు చేకూర్చుతుంది. మనిషి ప్రగతి, భద్రత, రక్షణ, సంతోషం కేంద్ర బిందువుగా సమాజం అభివృద్ధి చెందడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలవ్వాలి. ‘‘ప్రపంచంలో అనూహ్యమైన పరిణా మాలు జరగబోతున్నాయి. ప్రస్తుతం కొనసా గుతున్న ఆర్థిక అసమానతలు మరింత పెరిగి, ఒక అసాధారణమైన ధనికవర్గం ఏర్పడబోతున్నది. రోజురోజుకు శాస్త్ర, సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులవల్ల మనిషి శరీరం లోని జీన్స్‌లో కూడా మార్పులు తీసుకొచ్చి, దీర్ఘకాలం జీవించే విధానాలను కనుగొనబోతున్నారు. దాని వల్ల ధనవంతులకే పరిమితమైన ఒక అసాధారణమైన మానవజాతి ఏర్పడనుంది. సమాజంలో దారిద్య్రం అనుభవిస్తున్న వాళ్లు రక్షణ, భద్రత కరువై ప్రపంచపటం నుంచి కనుమరుగవుతారు.’’ ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ సామాజిక, ఆర్థిక అసమా నతలతో కూడిన భవిష్యత్ చిత్రపటాన్ని శాస్త్రీయంగా విశ్లేషించిన చిట్ట చివరి వ్యాఖ్యానమిది. ప్రపంచ పరిణామాలపై స్టీఫెన్ హాకింగ్ జరిపిన పరిశోధనలు అనన్య సామాన్యమైనవి. ‘సుదీర్ఘ ప్రశ్న, సంక్షిప్త సమాధా నాలు’ అనే పుస్తకంలో ఈ విశ్లేషణ చేశారు. ఈ పుస్తకంలో మానవ సమా జాన్ని అతలాకుతలం చేసే ఆర్థిక అసమానతలపై స్పష్టమైన, విలువైన సమాచారాన్ని వెల్లడించారు. దాని ఫలితంగా ఆవిష్కృతమయ్యే ఒక అసాధారణ మానవజాతి గురించి, అదేవిధంగా ఆకలితో, అభద్రతతో కుంగికృశించిపోయే మరొక దీనజాతి గురించి కళ్లకు కట్టినట్లు చూపారు. ఇది వినడానికి కొంత బాధగానే ఉన్నప్పటికీ, ప్రపంచ పరి ణామాలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి చెప్పిన అక్షర సత్యాలివి. నాడు కారల్ మార్క్స్ పెట్టుబడి రూపంలో పెరుగుతున్న అసమానతల గురించి చెప్పిననాడు విమర్శించిన వారున్నారు. మార్క్సిసు ్ట మహానా యకుల సిద్ధాంతాలతో, భావజాలంతో అంతగా సంబంధంలేని ప్రపంచ మేధావి స్టీఫెన్ హాకింగ్ వ్యాఖ్యలు సమాజానికి కనువిప్పు అవుతాయి. మార్క్సిస్టు భావజాలం పనికిరాదని కొట్టిపడేస్తున్న వాళ్లు, ఇటీవల పెరుగుతున్న ఆర్థిక అసమానతలను తొలగించే ఆలోచన చేయలేకపోతున్నారు. ఆర్థిక అసమానతలు భవిష్యత్తులో ప్రపంచాన్ని ధ్వంసం చేయగలవని చెప్పిన స్టీఫెన్ హాకింగ్ హెచ్చరిక మన దేశానికి కూడా వర్తిస్తుంది. ఇందుకు మనదేశంలో జరుగుతున్న పరిణామాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ధనిక, పేదల మధ్య అంబరాల అగాధాలు అనూహ్యంగా పెరిగిపోతున్నాయి. తొంబై శాతం ప్రజలు కటిక దారి ద్య్రాన్ని అనుభవిస్తుంటే, కేవలం పదిశాతం మంది బొక్కసాల్లో మానవ జాతి సంపద మొత్తం బందీ అయింది. సమాజంలోని అత్యధికమంది ప్రజలు నిలువనీడలేక, సెంటు భూమి లేక, సహజవనరులపై ఎలాంటి హక్కులూ లేక, కనీస ఉపాధి కరువై, నిజమైన విద్య, నిలకడ కలిగిన ఉపాధి, జీవన భద్రత, సామాజిక సంరక్షణలకు దూరంగా బతుకీడు స్తున్నారు. ఓవైపు ప్రజల జీవితం నిత్య దారిద్య్రంతో కొట్టుమిట్టాడు తుంటే, మరోవైపు మానవ ప్రమేయమే లేని, మానవజాతిని ఉత్పాదక రంగం నుంచి తరిమికొట్టే సరికొత్త అభివృద్ధి నమూనా ప్రాధాన్యతను సంతరించుకుంటోంది. గత మూడు, నాలుగు దశాబ్దాలుగా సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులు, యాంత్రీకరణ మనిషిని ఉత్పత్తికి దూరం చేస్తోంది. ఇదే వ్యవసాయ రంగాన్ని మొట్టమొదటిగా కబళించింది. మట్టికీ మనిషికీ ఉన్న సంబంధాన్ని బద్దలు కొట్టింది. గత రెండు వేల ఏళ్లుగా జరగని పరి ణామాలు గత ముప్ఫై, నలభై ఏళ్లలో జరిగాయి. మానవ జాతిని ఇంతకాలం నిలబెట్టిన వ్యవసాయం కుదేలైంది. యాంత్రీకరణ, ఆధుని కీకరణ ప్రభావంతో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాది మంది ఉపాధిని కోల్పోయారు. 1977–78లో 32వ సర్వే ప్రకారం 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తుంటే, 2017–18లో జరిపిన సర్వే ప్రకారం వీరు 55 శాతానికి పడిపోయారు. వ్యవసాయ సంక్షోభంతో తొట్టతొలి బాధితులు మహిళలేనన్నది సత్యం. నిజానికి ఒకే ఒక్క ట్రాక్టరు కొన్ని వందలమంది జీవనోపాధిని మింగేసింది. శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడాన్ని వ్యతిరేకించడం నా ఉద్దేశం కాదు. ట్రాక్టర్ ద్వారా కోత కోయడం, కుప్ప చేయడం, గింజలు రాల్చడం నుంచి పంట రవాణావరకు మనిషితో సంబంధం లేని యంత్రాలు చేస్తున్నాయి. వివిధ రకాల పనులు చేసే రైతులు, కూలీలను పనినుంచి పారదోలాయి. దానిపై ఆధారపడిన మనుషులు కనీసం 2, 3 నెలలపాటు జీవనోపాధిని కోల్పోవాల్సిన దుర్భరస్థితి. మొత్తం వ్యవ సాయ రంగం నుంచి రైతాంగం నిష్క్రమించాల్సిన స్థితి దాపురించింది. వ్యవసాయ రంగం తర్వాత యాంత్రీకరణ చేదు ఫలితాలను చవి చూసిన రంగం నిర్మాణ రంగం. నిర్మాణ రంగంలో ఎంతోమంది పని చేస్తున్నట్టు కనిపించినా అక్కడ మనుషుల ప్రమేయం బాగా తగ్గిపోయిన మాట వాస్తవం. గత నలభై ఏళ్లలో నిర్మాణ రంగం పెరిగిన స్థాయిలో కూలీల వినియోగం జరగలేదు. ముఖ్యంగా సిమెంటు, ఇసుక మిక్సింగ్ చేసే ప్రక్రియ తదితర పనులన్నింటికీ యంత్రాలనే వినియో గిస్తున్నారు. దీని ఫలితంగా జీవనోపాధిని కోల్పోతున్న వేలాదిమంది జీవితం అగమ్య గోచరంగా తయారైంది. ఉన్నచోట పని దొరకక ఊళ్లకు ఊళ్లు ఖాళీచేసి వలసబాట పడుతున్న పేద బతుకులకు అక్కడ కూడా జీవనో పాధి దొరకక దిక్కుతోచని స్థితి. బతుకు భారమైన ప్రజలకు కనీసం ఒకపూట తిండి పెట్టగలిగే జీవన భద్రత కోసం ఉపాధి హామీ పథకం తెచ్చారు. అయితే ఇది కూడా అవినీతికి నెలవుగా మారిపోయింది. అయితే ఇది కూడా శాశ్వత పరిష్కారం కాదు. ప్రజలకు తమ కాళ్లమీద తాము నిలబడి బతికే పరిస్థితిని కల్పించాలి. పెన్షన్లు, రూపాయికి కిలో బియ్యం లాంటి పథకాలు, ఆకలితో అలమటించకుండా ఒక భరోసాను ఇస్తున్నాయి. ఇవి కూడా పేదలను చావకుండా బతికిస్తాయ్గానీ తమ కాళ్లమీద తాము నిలబడే పరిస్థితిని కల్పించవు. రెండోవైపు, ఇప్పు డిప్పుడే శ్రామిక రంగంలో అడుగుపెడుతున్న యువత పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గతంలోలాగా సాంప్రదాయకంగా వచ్చే ఆఫీసు ఉద్యోగాలు, నైపుణ్యం లేని పనుల స్థానంలో కంప్యూటర్లు, యాంత్రీ కరణ, ఆధునికీకరణ ప్రవేశించి సాధారణ డిగ్రీలు, పీజీలు, పీహెచ్‌డీలు చేసిన లక్షలాదిమంది అగమ్య గోచరమైన స్థితిలో ఉన్నారు. కంప్యూటర్ రంగం మొదటగా ఎంతోమందికి ఆశాకిరణం లాగా కనిపించింది. అది కూడా మసక బారుతున్నది. ఆటోమేషన్ ఈరోజు ఒక భూతంలా వెంటాడుతున్నది. ప్రతిరోజూ కొన్ని పదులకొద్దీ ఉద్యోగులు కంప్యూటర్ రంగం నుంచి నిష్క్రమిస్తున్నారు. దేశంలోని ఉత్పత్తిరం గంలో వచ్చే యాంత్రీకరణ వల్ల నో వేకెన్సీ బోర్డులు పెరుగుతున్నాయి. సర్వీసు రంగం కూడా క్రమంగా స్తబ్దతకు గురవుతోంది. పైగా, దేశంలో శ్రమించగలిగే శక్తి ఉన్న యువతలో నైపుణ్యం కలిగిన వాళ్ల సంఖ్య చాలా అత్యల్పం. మనకంటే చిన్న దేశమైన దక్షిణ కొరియాలో నైపుణ్యం కలిగిన కార్మికుల సంఖ్య 90, జపాన్ 80, జర్మనీ 75, బ్రిటన్ 68, అమెరికా 52 శాతంగా ఉన్నాయి. మన దేశంలో శ్రమ చేయగలిగే శక్తి ఉన్నవాళ్లు ప్రపం చంలోని అన్ని దేశాలతో పోలిస్తే 28 శాతం ఉన్నారు. కానీ నైపుణ్యం స్థాయి మాత్రం కేవలం 4 శాతం మాత్రమే. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ప్రపంచాన్ని ఆక్రమిస్తున్న సమయంలో మన యువత కనీస నైపుణ్యం దరిదాపుల్లో కూడా లేదు. ఇది నిజానికి అసలు సమస్య. యువతలో వృత్తి నైపుణ్యాలు లేకపోవడానికి మన విద్యా వ్యవస్థలో ఉన్న లోపాలే కారణం. మనం విద్య అంటే, కేవలం అక్షరాస్యత అని భ్రమిస్తున్నాం. మన పూర్వీకులు కోటి విద్యలు కూటికొరకే అన్నారు. అంటే కోటి చదువులు అని అర్థం కాదు. కోటి పనులు, అంటే ఏ పనైనా తిండి కొరకే అన్న అర్థంలో వాడారు. ఈరోజు మన విద్యార్థులు ఎన్ని డిగ్రీలు పొందినా అందులో వృత్తి నైపుణ్యానికి అర్థం లేదు. అందుకే మన నైపుణ్యం శాతం నాలుగు దాటలేదు. దీనిని సరిజేసుకోకపోతే గ్రామాల్లో, పట్టణాల్లో వృత్తులకు, శ్రమకు దూరమవుతున్న తల్లిదం డ్రులు, వారి వెనుకనే నైపుణ్యంలేని డిగ్రీలు పట్టుకొని మన యువత తయారవుతూనే ఉంటారు. ఈ పరిస్థితులను ఉపయోగించుకొని కొద్ది మంది పారిశ్రామిక వేత్తలు, పెట్టుబడిదారులు మొత్తం దేశంలోని సహజ వనరులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి కొద్దికాలంలోనే వేలకోట్లకు అధిపతులవుతున్నారు. వాళ్లకుగానీ వాళ్లను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వా లకు గానీ దేశ సంపద పెరుగుదలే గీటురాయి. కానీ కోట్లాదిమంది ప్రజలు శ్రమకు, వనరులకు, ఆస్తులకు, ఆదాయాలకు దూరమై పెన్ష న్లతో, ఇతర రీతిలో వచ్చే డబ్బులతో పరాధీనమైన బతుకులు వెళ్లదీస్తు న్నారు. ఈ పరిణామం క్రమంగా ఆస్తులు, ఆదాయాలు, వనరులు అన్ని రకాల సాంకేతిక పరిజ్ఞానంలో మనుషుల ప్రమేయం లేకుండా సాగే ఒక కేంద్రీకృతమైన అభివృద్ధివైపు పయనిస్తున్నది. కోట్లాదిమంది మను షులు ఆకలేస్తే, దాహమేస్తే ప్రభుత్వాలు, కొన్ని దాతృత్వ సంస్థలవైపు నోరెళ్లబెట్టి చూసే పరిస్థితి రానున్నది. ప్రజల మధ్య ఆర్థిక అసమానతలు రోజురోజుకూ ఎక్కువవుతు న్నాయి. ఈ పరిస్థితులను పెంచి పోషి స్తున్నవాళ్లు ఎలాగూ దీనిని సరి దిద్దలేరు. ప్రజలే ఈ పరిస్థితుల గురించి, ఎవరి దయాదాక్షిణ్యాల మీదనో ఆధారపడే పరిస్థితిని ఎదుర్కోవాలి. సాంకేతిక పరిజ్ఞానం, యంత్రాలు, పెట్టుబడులు కాకుండా.. మనిషి ప్రగతి, భద్రత, రక్షణ, సంతోషం కేంద్ర బిందువుగా సమాజం అభివృద్ధి చెందడానికి ఇప్పటికైనా ప్రయత్నాలు మొదలవ్వాలి. వ్యాసకర్త : మల్లెపల్లి లక్ష్మయ్య, సామాజిక విశ్లేషకులు మొబైల్ : 81063 22077 -
భవిష్యత్తులో రాష్ట్రంలో 37.5 శాతం తగ్గనున్న ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్: రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సమీప భవిష్యత్తులో దేశంలో గణనీయమైన స్థాయిలో ఉద్యోగాలకు ఎసరు పెడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇప్పటికే వివిధ రంగాల్లో కీలకపాత్ర పోషిస్తున్న ఆటోమేషన్ (యాంత్రీకరణ) వంటి సాంకేతిక ప్రక్రియల ప్రభావంతో భవిష్యత్తులో మానవవనరుల ఆధారిత ఉద్యోగాలు తగ్గిపోతాయని యాస్పైరింగ్ మైండ్స్ అనే సంస్థ ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్–2018 పేరిట రూపొందించిన నివేదికలో అంచనా వేసింది. భవిష్యత్తు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషీన్ లెర్నింగ్ అండ్ రోబోటిక్స్‌దేనని తెలిపింది. ఆటోమేషన్ కారణంగా ఢిల్లీలో అత్యధికంగా 45.1% ఉద్యోగాలు తగ్గిపోనున్నాయని, తెలంగాణలో 37.5% ఉద్యోగాలు తగ్గిపోతాయని నివేదిక పేర్కొంది. అదే సమయంలో సాఫ్ట్ స్కిల్స్, అంచనా సామర్థ్యాలు ఆ స్థానాన్ని భర్తీ చేస్తాయని వివరించింది. డేటా అనాలిసిస్, మార్కెటింగ్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ అండ్ డెవలప్మెంట్, ప్రాజెక్టు మేనేజ్మెంట్, ఇంజనీరింగ్, జనరల్ మేనేజ్మెంట్ వంటి రంగాల్లో ఆటోమేషన్ ప్రభావం తక్కువగా ఉంటుందని, అక్కడ మానవ వనరులే కీలకమని నివేదిక వివరించింది. ఏఐ, రోబోటిక్స్‌తో నూతన శకం... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లర్నింగ్ అండ్ రోబోటిక్స్, ఆటోమేషన్ వల్ల దేశంలో నూతన శకం రాబోతోందని నివేదిక పేర్కొంది. ఆటోమేషన్ కారణంగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉద్యోగ అవకాశాలు తగ్గుతాయన్న ఆందోళన నెలకొన్నా ఆయా రంగాల్లోనూ మానవ అవసరాల పాత్ర ప్రముఖంగానే ఉంటుందని వెల్లడించింది. భవిష్యత్తులో మన దేశంలో ఆటోమేషన్ ప్రభావం ఐటీ, సాఫ్ట్వేర్ రంగాల్లో 42 శాతం మేర ఉండనున్నప్పటికీ, ఆ రంగంలో 31 శాతం మేర ఉద్యోగాలు ఉంటాయని పేర్కొంది. సాఫ్ట్వేర్ డెవలపర్, సపోర్ట్ టెక్నీషియన్, నెట్వర్కింగ్ ఇంజనీర్, సిస్టమ్ అనలిస్ట్, అనుబంధ విభాగాల్లో ఉద్యోగాలు లభిస్తాయని తెలిపింది. సివిల్, మెకానికల్ వంటి సబ్జెక్టులుగల కోర్ ఇంజనీరింగ్ చదివిన వారికి 7 శాతమే ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొంది. అయితే ఆంగ్ల భాషా నైపుణ్యం అవసరమైన రంగాల్లో ఉద్యోగాలకు 100 శాతం డిమాండ్ ఉంటుందని, సేల్స్, మార్కెటింగ్ రంగాల్లోనూ ఉపాధి, ఉద్యోగ అవకాశాలు అధికంగా ఉండనున్నాయని నివేదిక వెల్లడించింది. లేబర్ మార్కెట్లోని 30 రకాల ఉద్యోగాల్లో మానవ నైపుణ్యాలకు అధిక డిమాండ్ ఉంటుందని వివరించింది. బిజినెస్ అభివృద్ధి, ఆదాయ వృద్ధిలో కీలకమైన సేల్స్ రంగంలో 12 శాతం ఉద్యోగాలు లభిస్తాయని నివేదిక అంచనా వేసింది. లాజికల్ ఎబిలిటీ, భాషా నైపుణ్యాలు కలిగిన ఇందులో ప్రధానంగా అవసరమని పేర్కొంది. సంప్రదింపుల్లో వాక్చాతుర్యంతో ఇతరులను ప్రభావితం చేయగలగాలని పేర్కొంది. కస్టమర్ సర్వీసు విభాగంలో భారీగా ఆటోమేషన్... కస్టమర్ సర్వీస్‌లో ఆటోమేషన్ పాత్ర మరింత పెరుగుతుందని నివేదిక అంచనా వేసింది. 2020 నాటికి 85 శాతం మేర ఆటోమేషన్ ప్రక్రియ ద్వారానే కస్టమర్ ఇంటరాక్షన్ జరుగుతుందని పేర్కొంది. అలాగే అకౌంటింగ్, బ్యాంకింగ్ రంగాల్లో ఆటోమేషన్ వినియోగం మరింత పెరుగుతందని వివరించింది. భవిష్యత్తులో ఆటోమేషన్తో వివిధ రాష్ట్రాల్లో తగ్గనున్న ఉద్యోగాలు... రాష్ట్రం తగ్గనున్న ఉద్యోగాల శాతం ఢిల్లీ 45.1 పశ్చిమ బెంగాల్ 42.2 హరియాణా 39.3 ఉత్తరప్రదేశ్ 39 రాజస్తాన్ 37.8 మధ్యప్రదేశ్ 37.8 కర్ణాటక 37.8 తమిళనాడు 37.6 తెలంగాణ 37.5 ఆంధ్రప్రదేశ్ 37.2 -
ప్రమాదంలో 18కోట్ల మహిళా ఉద్యోగాలు
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాకింగ్ న్యూస్ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 180మిలియన్ల (18కోట్లు) మహిళా ఉద్యోగాలు అత్యంత ప్రమాదంలో ఉన్నాయని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్) హెచ్చరించింది. బాలీలో జరిగిన ప్రపంచ బ్యాంకు వార్షిక సమావేశాల సందర్భంగా ఐఎంఎఫ్ ఈ వ్యాఖ్యలు చేసింది. ఆటోమేషన్ లాంటి కొత్త సాంతకేతికల కారణంగా ఈ ఉద్యోగాలు ఊడిపోన్నాయని తెలిపింది 30 దేశాల్లో నిర్వహించిన అధ్యయనంలో పురుషులతో పోలిస్తే ఈ నష్టం మహిళల్లో ఎక్కువగా ఉందని తేలిందని తెలిపింది. పురుషులతో (9శాతం)పోలిస్తే మహిళలు (11శాతం) ఆటోమేషన్ ప్రభావానికి గురవుతున్నారని తెలిపింది. ఈ నేపథ్యంలో మహిళా ఉద్యోగుల్లో సంబంధిత నైపుణ్యాలను పెంచాలని గ్లోబల్ లిడర్ షిప్‌ను కోరింది. అలాగే నాయకత్వ స్థానాల్లో ఉన్నలింగ వివక్షను రూపు మాపాలని సూచించింది. మహిళల్లో కొత్త నైపుణ్యాల పెంపొందించడం ద్వారా భారత్ లాంటి దేశాల్లో ఉత్పాదక సామర్ధ్యాలను పెంచుకోవడంతోపాటు లింగ సమానత వస్తుందని తెలిపింది. డిజిటల్ యుగంలో పురోభివృద్ధికి అవసరమైన కొన్ని నైపుణ్యాలు మహిళలు తక్కువగా ఉన్నారని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్, కమ్యూనికేషన్స్ టెక్నాలజీ రంగాల్లో ఉద్యోగాల వృద్ధి అంచనాలున్నప్పటికీ మహిళా ప్రాతినిధ్యం తక్కువ అని తెలిపింది. అలాగే ఆటోమేషన్‌కి తక్కువ అవకాశం ఉన్న ఆరోగ్యం, విద్య, సాంఘిక సేవలు లాంటి సాంప్రదాయ రంగాల్లో మహిళలు ఉద్యోగావకాశాలు వృద్ధి చెందుతున్నాయని పేర్కొంది. గత రెండు దశాబ్దాల్లో మహిళా కార్మికుల భాగస్వామ్యాన్ని పెంచుకోవడంలో పురోగతి జరిగినా, ఇంక అసమానత భారీగానే ఉందని తన పరిశోధనా పత్రంలో పేర్కొంది. -
80 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!
‘మా బ్యాంకులోని ఉద్యోగులంతా రోబోల్లా పనిచేస్తారు. అలాగే రేపటి రోజున మనుషుల్లా పనిచేసే రోబోలతో మా కార్యాలయం నిండిపోవచ్చు. ఇందులో ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు. మార్పులు సహజమే కదా...’ - దాయిష్ బ్యాంకు మాజీ సీఈఓ జాన్ క్రియాన్ ఆటోమేషన్... ఈ మాట వింటేనే చాలు సగటు ఉద్యోగి గుండెల్లో రైళ్లు పరుగెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయి. మనుషులతో పనే లేకుండా.. యంత్రాల సహాయంతోనే పనులన్నీ పూర్తి చేయడం. ప్రస్తుతం పరిశ్రమలన్నింటిలోనూ ఇదే ట్రెండ్ నడుస్తోంది. మరోవైపు కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్) ముప్పు కూడా ముంచుకొస్తోంది. మనుషుల్లా ఆలోచించి, మనుషుల కన్నా వేగంగా, చురుకుగా పనిచేసే రోబోలను సృష్టించే ఈ అత్యాధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో 2030 నాటికి సుమారు 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ సంఖ్య ప్రపంచ జనాభాలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతు. ఈ గణాంకాలను బట్టి చూస్తే.. సగటు ఉద్యోగిపై ఆటోమేషన్ ఎంత తీవ్ర ప్రభావం చూపనుందో అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆర్థిక, విద్య, వైద్య, రవాణా, పర్యాటకం వంటి వివిధ రంగాల్లోని ఉద్యోగులు గడ్డు పరిస్థితులు ఎదుర్కోక తప్పదని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆర్థిక రంగంపై ఆటోమేషన్ ప్రభావం.. ఆర్థిక రంగంలో కీలక విభాగాలైన బ్యాంకింగ్, బీమా, పెట్టుబడి రంగాల్లో కృత్రిమ మేథ(ఏఐ)తో పనిచేసే రోబోలను ప్రవేశ పెట్టడం ద్వారా ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్టు దిగ్గజ బ్యాంకు దాయిష్ బ్యాంకు మాజీ సీఈఓ వ్యాఖ్యానించారు. క్లౌడ్ స్టోరేజీని ఉపయోగించడం ద్వారా టెలీకాలర్లు, క్లర్కులు, ఫ్రంట్ ఆఫీసు సిబ్బందికి ప్రత్యామ్నాయంగా కృత్రిమ మేథను ఉపయోగించనున్నామని పేర్కొన్నారు. అదే విధంగా నేషనల్ ఆస్ట్రేలియా బ్యాంకు(ఎన్ఏబీ) కూడా కృత్రిమ మేథను ఉపయోగించుకునేందుకు ఆసక్తి కనబరుస్తోంది. తద్వారా రానున్న 13 సంవత్సరాల్లో తమ ఉద్యోగుల సంఖ్యను 12 శాతానికి తగ్గించేందుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఏఐని ఉపయోగించడం ద్వారా వివిధ శాఖల్లో పనిచేసే ఉద్యోగులను మొత్తంగా తొలగించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రక్షణ రంగంలో ప్రాణ నష్టం తగ్గించుకునేందుకు.. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడం ద్వారా ప్రాణ నష్టాన్ని తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగా వివిధ దేశాల ప్రభుత్వాలు కూడా ఏఐనే వాడుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. డ్రోన్లను ఉపయోగించి శత్రు స్థావరాలను గుర్తించడంతో పాటుగా... దాడులు జరపడం కూడా సులభతరంగా మారిన నేపథ్యంలో సైనికుల సంఖ్యను తగ్గించేకునేందుకు మొగ్గు చూపుతున్నాయి. తద్వారా ప్రాణ నష్టం తగ్గించుకోవడంతో పాటుగా ఖర్చు కూడా తగ్గించుకునే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాయి. వైద్య రంగంలోనూ ఆటోమేషన్ హవా... వైద్య రంగంలో కూడా ఆటోమేషన్ హవా కొనసాగుతోంది. థర్మామీటర్స్, బీపీ మానిటర్స్‌ను కంప్యూటర్లతో అనుసంధానం చేయడం ద్వారా పారామెడికల్ ఉద్యోగాల్లో భారీగా కోత పడనున్నట్లు తాజా అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. యూకే నేషనల్ హెల్త్ సర్వీస్ తమ నాన్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ 111తో ఏఐని అనుసంధానించడం ద్వారా మెడికల్ యాప్‌ను అభివృద్ధి చేసింది. సుమారు 1.2 మిలియన్ మంది ఇప్పటికే ఈ యాప్‌ను వినియోగిస్తున్నారు. దీంతో ఉత్తర లండన్‌లోని టెలీకాలర్లు భారీగా ఉద్యోగాలు కోల్పోయారు. అంతేకాకుండా ఆటోమేషన్ ప్రభావం వల్ల వేలాది మంది అంబులెన్స్ డ్రైవర్లు కూడా ఉద్యోగాలు కోల్పోనున్నారు. రవాణా రంగ ఉద్యోగులకు కూడా తిప్పలు తప్పవు.. ప్రపంచ వ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించే రైల్వేల్లో కూడా ఆటోమేషన్ ప్రభావం చూపనుంది. టికెట్ వాలిడేషన్, సెక్యూరిటీ విభాగాల్లో ఏఐని ఉపయోగించడం ద్వారా సిబ్బందిని భారీగా తగ్గించుకునే అవకాశాలు కన్పిస్తున్నాయి. బయోమెట్రిక్ స్కానర్లను ఏఐతో అనుసంధానించి ఉపయోగించడం ద్వారా టికెట్ల దృవీకరణ, పర్యవేక్షణ సిబ్బందిని పూర్తిగా తొలగించే దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తోన్నాయి వివిధ దేశాల ప్రభుత్వాలు. పర్యాటక రంగంలోని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలపై ప్రభావం ఆటోమేషన్ ప్రభావం వల్ల పర్యాటక రంగంలోని ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాల్లో భారీగా కోత పడబోతుంది. ఏఐని వినియోగించడం ద్వారా టూరిజం ప్యాకేజీ అడ్వైజర్లు, ట్రావెల్ ఏజెంట్స్ చేసే పనులను రోబోలే చేస్తున్నాయి. అదే విధంగా టూరిస్టు గైడులు, క్యాబ్ డ్రైవర్ల ఉద్యోగాలకు కూడా కృత్రిమ మేథ ఎసరు పెడుతోంది. విద్యారంగంలో వర్చువల్ రియాలిటీ ద్వారా.. నేటి డిజిటల్ యుగంలో సమయాభావం వల్ల ఆన్లైన్లోనే కోర్సులు పూర్తి చేసే విద్యార్థుల సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో పలు యూనివర్సిటీలు కూడా ఆన్లైన్ ద్వారా వివిధ కోర్సులు అందుబాటులోకి తెచ్చి వర్చువల్ రియాలిటీ ద్వారా విద్య బోధిస్తున్నాయి. ఇందుకోసం రోబోలను వినియోగించుకుంటున్నాయి. రోబో టెక్నాలజీకి కృత్రిమ మేథ కూడా తోడవడంతో నిపుణులైన అధ్యాపకుల అవసరం కూడా లేకుండా పోతోంది. ఆటోమేషన్‌కు జన్మస్థానమైన తయారీ రంగంలో.. ఆటోమేషన్‌కు జన్మస్థానంగా చెప్పుకునే తయారీ రంగంలో ఇప్పటి వరకు సెమీ ఆటోమేటిక్, ఆటోమేటిక్ మెషీన్ల హవా కొనసాగుతోంది. దీనికి ఏఐ కూడా తోడవడంతో యంత్రాలను పర్యవేక్షించే పనిని కూడా రోబోలే తలకెత్తుకుంటున్నాయి. మనుషుల కంటే కూడా మెరుగ్గా ఈ రోబోలు పని చేస్తున్నాయని, వీటితో ఖర్చు కూడా తగ్గుతోందని పలు కంపెనీలు పేర్కొన్నాయి. దీంతో సహాయక సిబ్బందిని పూర్తిగా తొలగించే దిశగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు తెలిపాయి. అసలు మొత్తంగా పరిశ్రమలన్నీ రోబోలతోనూ, యంత్రాలతోనే నిండిపోతే ఇక మనుషులే కనిపించకుండా పోయే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. -
ఆటోమేషన్తో ఊడే ఉద్యోగాలివే..
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్ రాకతో లక్షలాది ఉద్యోగాలు కనుమరుగవుతాయనే ఆందోళనల నేపథ్యంలో రానున్న రెండు దశాబ్ధాల్లో ఏయే రంగాల్లో, ఏయే దేశాల్లో ఎక్కువగా కొలువులు కోల్పోతాయనే వివరాలను పీడబ్ల్యూసీ అథ్యయనం వెల్లడించింది. ఆటోమేషన్ ప్రభావాన్ని భిన్న కోణాల్లో ఈ అథ్యయనం విశ్లేషించింది. 2030 నాటికి ఆటోమేషన్ కారణంగా డ్రైవర్ రహిత వాహనాలు ముంచెత్తే క్రమంలో రవాణా, తయారీ రంగాలు అత్యధికంగా ప్రభావితమవుతాయని, పెద్దసంఖ్యలో ఉద్యోగాలు దెబ్బతింటాయని లెక్కగట్టింది. ఫైనాన్షియల్ సర్వీసుల రంగంలో మానవవనరులకు డిమాండ్ తగ్గుతుందని పేర్కొంది. డేటా అనాలిసిస్, అలాగరిథమ్స్ కారణంగా కొలువులు కోల్పోయే ప్రమాదం ఉందని పసిగట్టింది. ఐటీ, నిర్మాణ రంగాల్లోనూ ఆటోమేషన్ రిస్క్ అధికంగా ఉందని పేర్కొంది. అయితే విద్య, వైద్య రంగాల్లో ఆటోమేషన్ ప్రభావం పెద్దగా ఉండబోదని తెలిసింది. ఆటోమేషన్ ముప్పు తప్పించుకోవాలంటే అత్యున్నత నైపుణ్యాలను సంతరించుకోవాలని స్పష్టం చేసింది. సరైన విద్యార్హతలు లేనివారు దీర్ఘకాలంలో రిస్క్ ఎదుర్కొంటారని హెచ్చరించింది. క్లరికల్ ఉద్యోగాలు చేపట్టే మహిళల ఉద్యోగాలు ఆటోమేషన్ కారణంగా ముప్పును ఎదుర్కొంటాయని తెలిపింది. -
ఇంటికి తగ్గ వెలుగు...
సాక్షి, హైదరాబాద్: మార్కెట్లో దొరికే లైటు తెచ్చి ప్రతి గదిలో పెట్టే రోజులు పోయాయి. పరిస్థితులకు అనుగుణం గా ఆధునిక ఇంటి యజమానుల్లో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఆలోచనలకు తగ్గట్టు, పరిస్థితుల ప్రకారం వెలిగే లైట్లను ఏర్పాటు చేసుకునే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇందుకు తగ్గట్టుగా వైర్లెస్ లైటింగ్ ఆటోమేషన్ మార్కెట్లో లభిస్తుంది. ♦ ఫ్లాట్‌లో అయినా విల్లాలో అయినా వైర్లెస్ లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేసుకోవచ్చు. బంధుమిత్రులు, చూపరులకు నచ్చే విధంగా ఇంటిని అలంకరించుకోవచ్చు. అయితే ఇందుకు మనం చేయాల్సిందల్లా.. ఎక్కడెక్కడ ఏయే తరహా లైట్లు ఉండాలో చెబితే సరిపోతుంది. లేదా మన ఆలోచనల్ని చెబితే ఆయా సంస్థలే పనిని పూర్తి చేస్తాయి. ♦ ఏసీలు ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. రిమోట్ కం ట్రోల్ బదులు మొబైల్‌తో వీటిని నియంత్రించుకోవచ్చు. వీటిని అమర్చిన తర్వాత మనం ఎక్కడున్నా సరే అరచేతిలో ఉండే మొబైల్‌తో ఇంట్లోని లైట్లను వెలిగించుకోవచ్చు, ఆర్పేయవచ్చు. ♦ నిన్నటిదాకా ఇంటికి హోమ్ ఆటోమేషన్ చేయాలంటే ప్రత్యేకంగా వైరింగ్ చేయాల్సి ఉండేది. కానీ, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక వైర్ల అవసరం లేకుండానే ఇంటిని ఆధునిక లైట్లతో అలంకరించే వీలు కలిగింది. సన్నివేశాలకు తగ్గట్టుగా, పరిస్థితులకు అనుగుణంగా వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు. ♦ కొత్త, పాత అనే తేడా లేకుండా ఏ ఇంట్లో అయినా హోమ్ ఆటోమేషన్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 2 బీహెచ్‌కే ఫ్లాట్‌లో దీని ఏర్పాటుకు రూ.90 వేల దాకా ఖర్చవుతుంది. -
రోడ్డున పడనున్న కోట్ల మంది ఉద్యోగులు
న్యూఢిల్లీ: రోబోలు, ఆటోమేషన్ వల్ల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని వింటుంటాం. కానీ దాని గురించి అంతపెద్దగా పట్టించుకోం. కానీ సమస్య అనుకున్నంత చిన్నదిగా మాత్రం లేదు. రోబోలు, ఆటోమేషన్ కారణంగా ఎంత మంది ఉపాధి కోల్పోతారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!! వీటి వల్ల ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏకంగా 80 కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిన్సే తాజాగా తన సర్వేలో పేర్కొంది. ఈ సంఖ్య ప్రస్తుతం ప్రపంచంలోని మొత్తం కార్మిక సిబ్బందిలో ఐదో వంతుకు సమానం కావడం గమనార్హం. అభివృద్ధి చెందిన దేశాలు, వర్ధమాన దేశాలు రెండూ కూడా ప్రతికూల ప్రభావం ఎదుర్కొవలసి ఉంటుందని హెచ్చరించింది. ఆటోమేషన్ త్వరితగతిన విస్తరిస్తే మెషీన్ ఆపరేటర్లు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు, బ్యాక్–ఆఫీస్ ఉద్యోగులు ఎక్కువగా నష్టపోతారని, వారికి కష్టకాలం తప్పదని పేర్కొంది. ఒకవేళ రోబోలు, ఆటోమేషన్ అనుకున్నంత వేగంగా విస్తరించకపోతే అప్పుడు వచ్చే 13 ఏళ్లలో 40 కోట్ల మంది మాత్రం కొత్త ఉద్యోగాలను వెతుక్కోవలసి ఉంటుందని తెలిపింది. మెకిన్సే 46 దేశాల్లో ఈ సర్వే చేసింది. భారత్‌లో 12 కోట్ల ఉద్యోగాలకు ఎసరు!! రోబోలు, ఆటోమేషన్ వల్ల మనకూ ప్రమాదం పొంచి ఉంది. భారత్‌లో 11–12 కోట్ల మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి రావొచ్చని మెకిన్సే అంచనా వేసింది. ఇక ఎక్కువ ఉద్యోగాల కోత చైనాలో ఉండొచ్చని పేర్కొంది. ఇక్కడ దాదాపు 20 కోట్ల మందిపైగా ఉపాధి కోల్పోనున్నారని తెలిపింది. ఇక అమెరికాలో 5–8 కోట్ల మంది ఉద్యోగాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంది. చైనా, భారత్, అమెరికా దేశాల తర్వాత జపాన్, మెక్సికో, జర్మనీ దేశాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశముందని అభిప్రాయపడింది. -
ఆటోమేషన్‌పై ఉద్యోగుల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : ఆటోమేషన్ ప్రస్తుతం అన్ని రంగాల ఉద్యోగులకు మెడపై కత్తిలా వేలాడుతోందని... దీంతో మొత్తం పరిశ్రమ రూపురేఖలే మారిపోయి, భారీ ఎత్తున్న ఉద్యోగాలు గల్లంతయ్యే అవకాశమున్నట్టు రిపోర్టులు హెచ్చరిస్తున్నాయి. అయితే దీనిలో ఎంత నిజముంది? నిజంగానే భారీ ఎత్తున్న ఉద్యోగాలను ఆటోమేషన్ హరించుకుపోతుందా? దీనిపై అసలు ఉద్యోగులేమంటున్నారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంది? అని తెలుసుకోవడం కోసం రిక్రూట్మెంట్ సంస్థ మైఖెల్ పేజ్ ఇండియా ఓ అధ్యయనం చేపట్టింది. ఈ అధ్యయనంలో పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ప్రస్తుత తమ పనితీరుపై ఆటోమేషన్ పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని 87 శాతం మంది భారతీయ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నట్టు తెలిసింది. ఉద్యోగం పోతుందనే భయమున్నప్పటికీ, ఆటోమేషన్ ప్రభావం సానుకూలమేనని వారు పేర్కొన్నారని వెల్లడైంది. అంతేకాక, మెజారిటీ ప్రొఫెషనల్స్ తమ ఉద్యోగాలపై విశ్వాసం కూడా వ్యక్తం చేసినట్టు తెలిసింది. 1000కి పైగా భారతీయ ఉద్యోగులపై ఈ అధ్యయనం చేపట్టింది. సంబంధిత పరిశ్రమల్లో ఆటోమేషన్ ప్రభావం ఏ మేరకు ఉందో తెలుసుకోవడం కోసం భారతీయ నిపుణుల వైఖరిని విశ్లేషించింది. దీనిలో 87 శాతం మంది ఆటోమేషన్ ప్రస్తుత తమ పనితీరులో పాజిటివ్ ప్రభావాన్ని చూపుతుందని తెలుపగా... 78 శాతం మంది తమ భవిష్యత్తు ఉద్యోగాలపై విశ్వాసాన్ని వ్యక్తంచేశారని ఈ రిక్రూట్మెంట్ సంస్థ చెప్పింది. తమ ఉద్యోగాలను రోబోటిక్స్ భర్తీ చేస్తాయని అనుకోవడం లేదని 83 శాతం రెస్పాడెంట్లు చెప్పారు. 17 శాతం మంది మాత్రమే తమ ఉద్యోగ భద్రతపై ఆందోళన వ్యక్తంచేసినట్టు తెలిసింది. -
ఐటీ జాబ్‌లు కష్టమే!!
♦ కొత్త కొలువులకు ఆటోమేషన్, కొత్త టెక్నాలజీల సెగ... ♦ క్యూ–1లో దిగ్గజాల నియామకాల్లో తిరోగమనం... ♦ టీసీఎస్, ఇన్ఫీల్లో చేరినవారికన్నా మానేసినవారే ఎక్కువ ♦ టీసీఎస్‌లో 1,414 మంది, ఇన్ఫీలో 1,811 మంది తగ్గుదల... ♦ కోతలు లేవంటూనే.. జోరు తగ్గించామంటున్న కంపెనీలు ♦ మానేసిన వారిలో... తీసేసిన వారూ ఉండొచ్చన్న నిపుణులు ఉద్యోగాల కల్పవృక్షంగా చెప్పుకునే ఐటీ పరిశ్రమ.. ఇప్పుడు కొత్త కొలువుల విషయంలో ఆచితూచి అడుగులేస్తోంది. ప్రధానంగా ఆటోమేషన్‌కు తోడు డిజిటల్, క్లౌడ్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) దిశగా అడుగులేస్తున్న ఐటీ కంపెనీలు.. ‘జాబ్‌లెస్’ వృద్ధిపై దృష్టిపెడుతున్నాయి. ఉన్న ఉద్యోగులను తొలగించడం లేదని చెబుతూనే... కొత్త నియామకాల్లో వేగం తగ్గించామని ఒప్పుకుంటున్నాయి. ఉద్యోగుల ఉత్పాదక సామర్థ్యాన్ని మరింతగా మెరుగుపరచడం ద్వారా, అంటే ఉన్న సిబ్బంది నుంచే సాధ్యమైనంత మేర పనిని పిండుకొని లాభదాయకతను నిలబెట్టుకోవాలనేది వాటి వ్యూహం. ఫలితంగా దేశీ ఐటీ రంగంలో కొత్త కొలువులు కనాకష్టంగా మారే పరిస్థితి నెలకొంది. అమెరికా సహా కొన్ని దేశాల రక్షణాత్మక చర్యలు, వీసా నిబంధనల కఠినతరం వంటివి కూడా ఐటీ రంగానికి పెను సవాళ్లుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి కూడా. తాజా ఫలితాల్లో తేటతెల్లం... దిగ్గజాలు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లు ఇటీవలే ప్రకటించిన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (2017–18, ఏప్రిల్–జూన్, క్యూ–1) ఫలితాల్లో ఉద్యోగాలు తగ్గుతున్న ధోరణి స్పష్టమైంది. టీసీఎస్ క్యూ1లో స్థూలంగా 11,202 మంది ఉద్యోగులను నియమించుకుంది. అయితే, 12,616 మంది కంపెనీని వీడిపోయారు. దీంతో నికరంగా 1,414 ఉద్యోగాలు తగ్గిపోయాయి. మార్చి చివరి నాటికి కంపెనీ మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,87,223 కాగా, జూన్ చివరినాటికి మొత్తం సిబ్బంది 3,85,809కి పడిపోయింది. గడిచిన మూడు నెలల్లో ఉద్యోగులెవరినీ తొలగించలేదని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ ఫలితాల సందర్భంగా చెప్పారు. అయితే, ఈ ఏడాది కొత్త ఉద్యోగాల కల్పన కాస్త తక్కువగా ఉండొచ్చని ఆయన స్పష్టం చేయడం నియామకాల్లో మందగమనానికి నిదర్శనం. మరోపక్క, ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) క్యూ1లో 12 శాతానికి ఎగబాకింది. ఇన్ఫోసిస్ విషయానికొస్తే... ఈ ఏడాది ఏప్రిల్– జూన్ కాలానికి నికరంగా 1,811 ఉద్యోగాలు తగ్గాయి. దీంతో జూన్ చివరి నాటికి ఇన్ఫీ మొత్తం సిబ్బంది (అనుబంధ సంస్థలతో కలిపి) సంఖ్య 1,98,553కు చేరింది. జూన్ క్వార్టర్లో ఉద్యోగుల వలసల రేటు (అట్రిషన్) 21 శాతానికి ఎగబాకింది. మార్చి క్వార్టర్లో ఇది 17.1 శాతం మాత్రమే. హైరింగ్‌ను కొనసాగిస్తున్నామని, అయితే, నియామకాల్లో వృద్ధి తగ్గుముఖం పట్టినట్లు ఫలితాల ప్రకటన సందర్భంగా ఇన్ఫోసిస్ చీఫ్ విశాల్ సిక్కా కూడా చెప్పారు. ఉద్యోగుల వలసల రేటు భారీగా పెరగడం, నికర నియామకాలు తగ్గడాన్ని చూస్తుంటే... నైపుణ్యాలు, పనితీరు సరిగ్గా లేవంటూ కొంతమంది సిబ్బందికి పొమ్మనలేక పొగబెడుతున్నారా అన్న వాదనలు కూడా బలపడుతున్నాయి. ఇలా పొగబెట్టి పంపించేసిన వారిని వెళ్లిపోయిన వారిగా చూపించటం వల్లే అట్రిషన్ రేటు అంత ఎక్కువ ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. మారుతున్న క్లయింట్ల ధోరణి... ప్రస్తుతం దేశం నుంచి సాఫ్ట్వేర్ ఎగుమతుల విలువ 117 బిలియన్ డాలర్లు. ఇందులో దాదాపు ఐదో వంతు టీసీఎస్, ఇన్ఫోసిస్‌లదే. అయితే, ఇప్పటివరకూ దేశీ ఐటీ కంపెనీలకు భారీగా వ్యాపారాన్ని ఇస్తున్న బ్యాంకింగ్, రిటైల్, ఇంధన రంగం వంటి సంప్రదాయ సర్వీసుల నుంచి ఆదాయంలో మందగమనం ఐటీ కంపెనీలను తీవ్రంగా కలవరపెడుతోంది. ఎందుకంటే మన ఐటీ సంస్థలు సంపాదిస్తున్న ప్రతి 5 డాలర్లలో 4 డాలర్లు ఈ రంగాలకు చెందిన సేవల నుంచే లభిస్తున్నాయి. మరోపక్క, ఆటోమేషన్ కారణంగా కిందిస్థాయి ఉద్యోగుల అవసరం అంతకంతకూ తగ్గుతూవస్తోంది. ఐటీ సంస్థల ప్రధాన క్లయింట్లు కూడా డిజిటల్, క్లౌడ్ వంటి టెక్నాలజీలవైపు తమ వ్యయాలను మళ్లిస్తుండటం కూడా ఆ దిశగా మన ఐటీ కంపెనీలు కొత్త పెట్టుబడులు పెట్టాల్సిన పరిస్థితి. డిజిటల్ నైపుణ్యాల్లో 2.15 లక్షల మందికిపైగా ఉద్యోగులకు శిక్షణనిచ్చినట్లు తాజాగా టీసీఎస్ వెల్లడించింది. ఇదిలాఉండగా, ఐటీ కంపెనీ లకు ప్రధాన ఆదాయ వనరైన అమెరికా వంటి దేశాలు అనుసరిస్తున్న రక్షణాత్మక ధోరణితో(అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చాక ఈ వైఖరి మరింత పెరిగిపోయింది) మన కంపెనీలు అమెరికన్లను ఎక్కువ జీతాలిచ్చి తప్పకుండా నియమించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు అమెరికన్లకు భారీగా కొలువులను కూడా ప్రకటించాయి. ఈ ప్రభావంతో కంపెనీల వ్యయం పెరిగి... దేశీయంగా కొత్త ఉద్యోగాలను కల్పించేందుకు వెనకాడే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. మార్జిన్లు కాపాడుకోవడానికే... కొత్త టెక్నాలజీలకు మారుతున్న తరుణంలో కొత్తవారికి అవకాశాలు సన్నగిల్లుతాయన్నది తాజాగా కంపెనీల వాదన. ‘అంతర్గతంగా టాలెంట్ పూల్ (నిపుణులను తయారు చేసుకోవడం) ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అవసరం. ఎందుకంటే మా కంపెనీ స్థాయి దృష్ట్యా డిజిటల్, క్లౌడ్ వంటి కొత్త సేవల్లో అనుభవం ఉన్నవారిని పూర్తిగా బయటినుంచి తీసుకోవడం కష్టం. కొందరిని నియమించుకుంటాం కానీ, ఎక్కువగా ప్రస్తుత ఉద్యోగులకు శిక్షణ ఇచ్చి ఉపయోగించుకోవడానికే ప్రాధాన్యం ఇస్తున్నాం.’ అని టీసీఎస్ హెచ్ఆర్ హెడ్ అజోయ్ ముఖర్జీ పేర్కొన్నారు. సిబ్బంది ఉత్పాదకత(యుటిలైజేషన్) ఇటీవలి కాలంలో 2 శాతం పెరిగిందని.. అయితే, డాలరుతో రూపాయి మారకం విలువ ఎగబాకడం(ఏప్రిల్–జూన్‌లో 3.5 శాతం పెరిగింది. 64.5 వద్ద కదలాడుతోంది) దీని ఫలితాన్ని దెబ్బతీసినట్లు ఇన్ఫీ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ఒకరైన మోహన్ దాస్ పాయ్ చెబుతున్నారు. అంతేకాకుండా ఐటీపై ప్రపంచవ్యాప్తంగా కంపెనీల వ్యయాలు తగ్గడంతో మన ఐటీ సంస్థల మార్జిన్లకు ఎసరుపెడుతోందని చెప్పారు. ఇన్ఫోసిస్ నిర్వహణ మార్జిన్ క్యూ1లో అరశాతం తగ్గి 24.1 శాతానికి పరిమితమైంది. ఇక టీసీఎస్ మార్జిన్లు అయితే, 2.3 శాతం దిగజారి.. 23.4 శాతానికి పడిపోయాయి. ఈ తరుణంలో మార్జిన్లు పడిపోకుండా చూసుకోవడానికి కొత్త నియామకాలను చాలా కంపెనీలు వాయిదా వేసుకుంటున్నాయని ఆయన అంటున్నారు. నాస్కామ్ అంచనాల్లోనూ... ఈ ఏడాది(2017–18)లో భారత్ ఐటీ ఎగుమతుల వృద్ధి అంచనాలను నాస్కామ్ తగ్గించడం మందగమనానికి అద్దం పడుతోంది. వరుసగా రెండో ఏడాదీ వృద్ధి సింగిల్ డిజిట్‌కే (7–8%) పరిమితం చేసింది. గతేడాది ఎగుమతులు 8.3% పెరిగాయి. ఇక దేశీయంగా పరిశ్రమ ఆదాయం 8.6% వృద్ధితో 38 బిలియన్ డాలర్లకు చేరింది. దీంతో మొత్తం ఐటీ పరిశ్రమ ఆదాయం 155 బిలియన్ డాలర్లుగా లెక్కతేలింది. భారత్ స్థూలదేశీయోత్పత్తి(జీడీపీ)లో ఇది 7.7%. ఇదిలాఉండగా, ఈ ఏడాది దేశీ ఐటీ కంపెనీలు 1.5 లక్షల కొత్త ఉద్యోగాలు ఇస్తాయనేది నాస్కామ్ తాజా అంచనా. దీంతో మొత్తం కొలువుల సంఖ్య 38.5 లక్షలకు చేరొచ్చని భావిస్తోం ది. గతేడాది(2016–17) 1.73 లక్షలు, అంతక్రితం ఏడాది(2015–16) 2 లక్షల కొత్త ఉద్యోగాలతో పోలిస్తే హైరింగ్ జోరు తగ్గుతున్న దాఖలాలు స్పష్టంగా కనబడుతున్నాయి. -
టెకీలకు శుభవార్త: ఆ కంపెనీ 20వేల ఉద్యోగాలు
బెంగళూరు : ఐటీ ఇండస్ట్రీలో ఉద్యోగాల నియామకంపై నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ప్రముఖ బహుళ జాతీయ కంపెనీ క్యాప్‌జెమిని గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. ఈ ఏడాది భారత్‌లో 20వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకోవాలని ఈ కంపెనీ యోచిస్తోంది. అంతేకాక ఆటోమేషన్ ప్రభావం ప్రస్తుత ఉద్యోగులపై పడకుండా ఉండేందుకు మే నెల వరకు ఈ కంపెనీ 45 వేల మందికి రీస్కిల్ చేపట్టింది. ఈ ఫ్రెంచ్ ఐటీ సర్వీసు కన్సల్టెంట్ గతేడాది 33వేల మంది ఉద్యోగులను నియమించుకుంది. 51వేల మందికి రీస్కిల్ చేపట్టింది. తాము ఎక్కువమొత్తంలో పెట్టుబడులను ట్రైనింగ్ ప్రొగ్రామ్స్ అభివృద్ధి కోసం పెడుతున్నామని క్యాప్‌జెమిని ఆటోమేషన్, ఇండస్ట్రియలైజేషన్ హెడ్ క్రిస్టోఫర్ స్టాన్కోమ్బ్ చెప్పారు. తమ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ అవకాశాలు ఆటోమేషన్, ఇంటిగ్రేషన్ ఆటోమేషన్ కల్పిస్తుండటంతో ట్రైనింగ్ ప్రొగ్రామ్లలో పెట్టుబడులు పెంచినట్టు తెలిపారు. క్యాప్‌జెమిని భారత కార్యకలాపాల్లో కంపెనీకి లక్ష మంది ఉద్యోగులున్నారు. అయితే అంతర్జాతీయంగా ఎంతమందిని నియమించుకుంటుంది, ఎంతమందికి ట్రైనింగ్ ఇస్తుందో కంపెనీ బహిర్గతం చేయలేదు. ఆటోమేషన్ తమ ఉద్యోగులకు మరింత ఉత్పాదకతను అందిస్తుందని క్రిస్టోఫర్ చెప్పారు. ఆటోమేషన్ ప్రభావం ఉద్యోగులకు మరింత డిమాండ్‌ను కల్పించనుందనే ఈ కంపెనీ చెబుతోంది. అయితే ఆటోమేషన్, డిజిటైజేషన్ ప్రభావంతో చాలా ఐటీ కంపెనీలు నియామకాలను తగ్గించాయి. ఇండస్ట్రి బాడీ నాస్కామ్ సైతం ఈ ఏడాది ఉద్యోగాల వృద్ది కేవలం 5 శాతం మాత్రమే ఉంటుందని పేర్కొంది. వచ్చే మూడేళ్లలో ఉద్యోగ నియామకాలు 20-25 శాతం తగ్గిపోయే అవకాశముందని కూడా అంచనావేసింది. మరోవైపు ఇన్ఫోసిస్ కంపెనీ కూడా 2018 ఆర్థిక సంవత్సరంలో భారత్‌లో 20వేల మందిని నియమించుకోనున్నట్టు తెలిపింది. అయితే ఆటోమేషన్తో 11వేల మంది ఫుల్-టైమ్ ఉద్యోగులను ఇంటికి పంపేసినట్టు తన వార్షిక రిపోర్టులో పేర్కొంది. -
11వేల మందిని బయటికి పంపేసిన ఇన్ఫీ
న్యూఢిల్లీ : ఆటోమేషన్.. ఉద్యోగులకు ఏ స్థాయిలో ప్రమాదం చూపుతుందో ఇన్ఫోసిస్ చెప్పకనే చెప్పేసింది. ఆటోమేషన్ కారణంతో ఈ ఏడాది 11వేల మందికి పైగా ఉద్యోగులను కంపెనీ నుంచి బయటికి పంపేశామని ఇన్ఫోసిస్ నేడు(శనివారం) బెంగళూరులో జరిగిన 36వ వార్షిక సాధారణ సమావేశంలో చెప్పింది. అయితే ఆటోమేషన్, యూటిలైజేషన్, ప్రొడక్టివిటీ మెరుగుదలతో పూర్తిస్థాయి ఉద్యోగి ఆదాయం 1.2 శాతం పెరిగినట్టు తెలిపింది. అదేవిధంగా ఇటీవల మీడియా సృష్టిస్తున్న రూమర్లపై కూడా ఇన్ఫోసిస్ క్లారిటీ ఇచ్చింది. ప్రమోటర్లకు, కంపెనీ బోర్డుకు ఎలాంటి సమస్యలేదని తెలిపింది. నేడు జరిగిన వార్షిక ఏజీఎంలో కీలక విషయాలు: ► 2017 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఒక్కో షేరుకు 14.75 రూపాయల ఫైనల్ డివిడెంట్ ను ప్రకటించినట్టు ఇన్ఫీ చెప్పింది. దీంతో సుమారు 4,061 కోట్ల నగదు కంపెనీ నుంచి బయటికి వెళ్లిపోతున్నట్టు పేర్కొంది. దీనిలో ట్రెజరీ షేర్లపై చెల్లించే డివిడెంట్ లేదు. కార్పొరేట్ డివిడెంట్ పన్నును కలిపారు. ► అదేవిధంగా 2018 ఆర్థిక సంవత్సరంలో షేర్ హోల్డర్స్ కు రూ.13వేల కోట్లు లేదా రూ.12,899 కోట్లు చెల్లించాలని బోర్డు నిర్ణయించినట్టు ఇన్ఫీ చెప్పింది. ఇది డివిడెంట్లా లేదా బై బ్యాకా అనేది తర్వాత నిర్ణయిస్తామని తెలిపింది. ► 2017 మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఇన్ఫీ వద్ద రూ.12,222 కోట్ల నగదు, నగదు సమానవైనవి ఉన్నట్టు తెలిపింది. ఇది 2016 కంటే తక్కువే. 2016లో ఇవి రూ.24,276కోట్లుగా ఉన్నాయి. తమ దగ్గర ఎక్కువ నగదు ఉందని అనడం నిరాధారంగా పేర్కొంది. అయితే ముందటేడాది కంటే ఈ ఏడాదికి ఇన్ స్టిట్యూషన్ల వద్ద ఉంచిన డిపాజిట్లు పెరిగాయి. 2016లో కంపెనీ డిపాజిట్లు రూ.4,900కోట్లు కాగ, అవి ఈ 2017 మార్చికి రూ.6,931కోట్లకు పెరిగాయి. ► కంపెనీ చైర్మన్ శేషసాయికి ఇదే చివరి ఏజీఎం. వచ్చే ఏడాది మే నెలలో ఆయన పదవీ విరమణ చేయబోతున్నారు. తన మిగతా పదవీ కాలాన్ని కార్పొరేట్ ప్రమాణాలకు అనుగుణంగా షేర్ హోల్డర్స్ విలువను పెంచడానికే కృషిచేస్తానన్నారు. ► ఇటీవల మీడియాలో వస్తున్న రిపోర్టులను ఇన్ఫీ కొట్టిపారేసింది. బోర్డు సభ్యులకు, వ్యవస్థాపకులకు మధ్య ఎలాంటి మనస్పర్థలు లేవని తెలిపింది. ► ఏఐ ప్లాట్ ఫామ్ పై 70కి పైగా క్లయింట్స్ ఉన్నారని, కొత్త ప్లాట్ ఫామ్ లే తమకు క్యూ1లో రెవెన్యూలిస్తాయని కంపెనీ పేర్కొంది. తమ యుటిలైజేషన్ 81.7శాతముందని, ఇది దశాబ్దంలోనే అత్యధికంగా వెల్లడించింది. గత 12 ఏళ్లలో అత్యధిక క్లయింట్ల సంతృప్తి సాధించామని చెప్పింది. -
ఇన్ఫీని వదిలేసిన 38వేల మంది ఉద్యోగులు
-
ఇన్ఫీని వదిలేసిన 38వేల మంది ఉద్యోగులు
బెంగళూరు : దేశీయంగా టాప్ ప్లేస్ లో ఉన్న ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. కానీ ఇటీవల కంపెనీ వేతన విషయంలో నెలకొన్న లుకలుకలు, భారీగా తగ్గిపోతున్న రిక్రూట్మెంట్ కంపెనీ పేరును దెబ్బతీస్తున్నాయి. ఈ సాప్ట్ వేర్ దిగ్గజం నుంచి గతేడాది దాదాపు 38 వేల మంది ఉద్యోగాలు వదిలివేసినట్టు వెళ్లినట్టు వెల్లడైంది. అంతేకాక 2016-17లో రిక్రూట్ మెంట్ ప్రక్రియ కూడా 65 శాతం పడిపోయినట్టు తెలిసింది. దీనికంతటికీ ప్రధానకారణం ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాగ, మరోవైపు ప్రాజెక్టులకు కూడా దెబ్బపడుతున్నట్టు తెలుస్తోంది. మంగళవారం ఎంప్లాయీ మెట్రిక్స్ వివరాలు వెల్లడించిన ఇన్ఫోసిస్, తన కంపెనీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనుబంధ కంపెనీల నుంచి 37,915 మంది ఉద్యోగులు వదిలివెళ్లినట్టు పేర్కొంది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేవలం 34,688 మందే రాజీనామా చేశారు. అదేవిధంగా 2016-17 ఆర్థిక సంవత్సరంలో 44,235 టెక్కీలను నియమించుకున్నప్పటికీ, నికరంగా కంపెనీలోకి వచ్చింది 6320 మంది మాత్రమేనని ఇన్ఫోసిస్ తెలిపింది. అంటే ఇది కూడా 65 శాతం పడిపోయినట్టు వెల్లడించింది. అదేవిధంగా 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ అనుభవమున్న వారిని కూడా 2016 నియమించుకున్న సంఖ్యకంటే తక్కువగా 18,797 మందినే నియమించుకుందని తెలిపింది. మొత్తంగా అవుట్ సోర్సింగ్ కంపెనీలో పనిచేసే ఉద్యోగుల సంఖ్యను 6320కి పెంచి, 2,00,364కు చేర్చుకుంది. దీనిఫలితంగా పేరెంట్ కంపెనీలో అట్రిక్షన్ లెవల్స్(ఉద్యోగులను తగ్గించుకోవడం) 15 శాతానికి పెరిగినట్టు వార్షిక సమీక్షలో ఇన్ఫోసిస్ వెల్లడించింది. గతేడాది ఈ శాతం 13.6 శాతంగానే ఉందని తెలిపింది. -
ఉద్యోగాలపై ఆటోమేషన్ పిడుగు
► ప్రతీ 10 ఉద్యోగాలకు నాలుగు మాయం ► వాటిలో ఒకటి మన దేశం నుంచే ► 2021 నాటికి గడ్డు పరిస్థితులు న్యూఢిల్లీ: ఆటోమేషన్ (యాంత్రీకరణ) ఉపాధి అవకాశాలను తీవ్రంగా దెబ్బతీయనుంది. ఒకవైపు పెరుగుతున్న యువ జనాభాకు అనుగుణంగా అదనపు ఉపాధి అవకాశాల అవసరం ఏర్పడగా... మరోవైపు యాంత్రీకరణ కారణంగా ఎన్నో రంగాల్లో భారీగా ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి నెలకొంది. 2021 నాటికి ప్రపంచవ్యాప్తంగా ప్రతీ 10 ఉద్యోగాల్లో నాలుగు ఆటోమేషన్ కారణంగా మాయం కానున్నాయని నిపుణుల అంచనా. ఇంజనీరింగ్, తయారీ, ఆటోమొబైల్స్, ఐటీ, బ్యాంకింగ్ తదితర రంగాల్లోకి ఇప్పటికే ఆటోమేషన్ అడుగు పెట్టేసింది. ఈ ఆటోమేషన్ పరిమాణం పెరుగుతున్న కొద్దీ దిగువ స్థాయి ఉద్యోగాలపై వేటు పడుతుందని నిపుణుల విశ్లేషణ. రానున్న మూడు నుంచి నాలుగేళ్లలో ఆటోమేషన్ పరంగా చెప్పుకోదగ్గ మార్పు చూడొచ్చని పీపుల్ స్ట్రాంగ్ సీఈవో పంకజ్ బన్సాల్ పేర్కొన్నారు. ముం దుగా అత్యధిక ప్రభావం పడే రంగాల్లో తయారీ, ఐటీ, ఐటీ ఆధారిత రంగం, సెక్యూరిటీ సేవలు, వ్యవసాయ రంగాలుంటాయని ఆయన చెప్పారు. మన దగ్గర 23 శాతం కనుమరుగు... ‘‘2021 నాటికి మా అంచనా ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి 10 ఉద్యోగాల్లో నాలుగు ఆటోమేషన్ కారణంగా కనుమరుగు అవుతాయి. ఇలా కోల్పోయే ప్రతీ నాలుగు ఉద్యోగాల్లో ఒకటి భారత్ నుంచి ఉంటుంది. అంటే ఒక్క మనదేశంలోనే 23 శాతం ఉద్యోగాలు కోల్పోయే పరిస్థితి ఉంటుంది. మన దేశంలో ఏటా 55 లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తున్నాయి. ఉద్యోగాలకు తగ్గ నైపుణ్యాల లేమి కారణంగా ఈ స్థాయిలో ఉద్యోగాల భర్తీ ఉండడం లేదు. ఆటోమేషన్ ఈ అంతరాన్ని మరింత పెంచనుంది’’ అని పంకజ్ బన్సాల్ వివరించారు. అసెంబ్లింగ్(పరికరాల అమరిక) విభాగంలో ఐదేళ్ల క్రితం 1,500 ఉద్యోగాలుంటే అవిప్పుడు 500కు తగ్గాయని, కంపెనీల దృష్టి నైపుణ్యాలపై శిక్షణ నుంచి ఆటోమేషన్ వైపు మళ్లిందని కెల్లీ ఓసీజీ ఇండియా దేశీయ డైరెక్టర్ ఫ్రాన్సిస్ పదమదన్ తెలిపారు. ఆటోమేషన్తో అన్ని ఉద్యోగాలకు ముప్పు ఉండదని ఫ్రాన్సిస్ అభిప్రాయం. యంత్రాల పర్యవేక్షణకు ఉద్యోగుల అవసరం ఉంటుందని, కేవలం దిగువ స్థాయి ఉద్యోగాలకే ముప్పు ఉంటుందన్నారు. అయితే, తక్కువ నైపుణ్యాలుండి, ఎక్కువ పనిభారం ఉండే ఉద్యోగాలను ఆటోమేషన్ గల్లంతు చేస్తుందని నిపుణులు అంటున్నారు. -
6000 మందిని తీసేస్తున్న కాగ్నిజెంట్
బెంగళూరు: ఆటోమేషన్ ప్రభావం ఐటీ కంపెనీల్లో ఉద్యోగులకు భారీగా షాకిస్తోంది. ఐటీ కంపెనీలన్నీ ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగాలకు కోత పెడుతున్నాయి. తాజాగా అమెరికా టెక్ దిగ్గజం కాగ్నిజెంట్ 6000 మందికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తెలుస్తోంది. అంటే మొత్తం వర్క్ ఫోర్స్ లో 2.3శాతం మందిని కంపెనీ తీసేస్తోంది. కొత్త డిజిటల్ సర్వీసులోకి మరలే క్రమంలో ఐటీ ఇండస్ట్రి ఎదుర్కొంటున్న సంక్షోభంతో కంపెనీలు ఉద్యోగులకు గుడ్ బై చెబుతున్నాయి.. ఈ నేపథ్యంలోనే కాగ్నిజెంట్ కూడా ఈ ఏడాది రెగ్యులర్ అప్రైజల్ సైకిల్ లో భాగంగా 6000 మందిని తొలగిస్తున్నట్టు సంబంధిత వర్గాలు చెప్పాయి. కాగ్నిజెంట్ ఉద్యోగులకు ఇది చాలా క్లిష్టమైన సమయమని, ఉద్యోగులు తమకు తాముగా రీస్కిల్ చేసుకోలేని పక్షంలో కంపెనీలో కొనసాగడం కష్టతరమని పేర్కొన్నాయి. కాగ్నిజెంట్ కు గ్లోబల్ గా 2,65,000 మంది ఉద్యోగులుండగా... వారిలో 1,88,000 మంది భారత్ లో ఉన్నారు. గతేడాది కూడా కాగ్నిజెంట్ తమ వర్క్ ఫోర్స్ లో 1-2 శాతం తగ్గించుకుంది. అయితే ప్రస్తుతం ఎంతమందిని తీసేస్తున్నట్టో కంపెనీ స్పష్టంచేయనప్పటికీ, సంబంధిత వర్గాల ప్రకారం 6000 మందికి పైగా ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఖాయమంటూ వెల్లడవుతోంది. తమ వర్క్ ఫోర్స్ మేనేజ్ మెంట్ స్ట్రాటజీలో ఎప్పటికప్పుడూ ఉద్యోగుల పనితీరుపై సమీక్షలు జరుగుతూ ఉంటాయని, క్లయింట్ అవసరాలకు అనుగుణంగా ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుని, వ్యాపార లక్ష్యాలను సాధించాల్సి ఉంటుందని కాగ్నిజెంట్ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో భాగంగా కంపెనీ ఏ చర్య తీసుకున్నా... అది పనితీరు ప్రకారమే ఉంటుందని చెప్పారు. -
ఉద్యోగాలు రావడం ఇక చాలాకష్టం!
ముంబై : ఉద్యోగవకాశాలు ఎదురుచూస్తున్న వారికి బ్యాడ్ న్యూస్. గతేడాదితో పోలిస్తే ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఉద్యోగవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని తాజా రిపోర్టులు పేర్కొంటున్నాయి. కంపెనీల్లో ఆటోమేషన్ టెక్నాలజీ పెరగడం, అంతర్జాతీయంగా వ్యాపారాల్లో అనిశ్చితి పరిస్థితులు నెలకొనడం, అవసరమైన నైపుణ్యాలకు తగిన ప్రతిభావంతులు దొరకకపోవడం ఈ త్రైమాసికంలో ఉద్యోగాలకు భారీగా గండికొడుతుందని వెల్లడవుతోంది. 4,389 మంది ఉద్యోగులపై నిర్వహించిన మ్యాన్‌పవర్‌గ్రూప్ ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ సర్వే క్యూ2 2017లో కేవలం 19 శాతం మంది ఉద్యోగులు మాత్రమే తమ స్టాఫ్ ను పెంచాలని యోచిస్తున్నట్టు చెప్పారు. 1 శాతం ఉద్యోగులు తమ స్టాఫ్ తగ్గించుకోనున్నట్టు తెలిపారు. ఈ సర్వేలో గరిష్టంగా 68 శాతం మంది అసలు తమ ఎంప్లాయ్ మెంట్ లో ఎలాంటి మార్పులు చేయబోమని వెల్లడించారు. దీంతో నికరంగా ఈ త్రైమాసికంలో ఎంప్లాయ్ మెంట్ అవుట్ లుక్ +18శాతంగానే ఉండబోతుందని ఈ సర్వే తెలిపింది. 2017 జనవరి-మార్చి క్వార్టర్లో ఈ నికర ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ +21 శాతంగా, 2016 ఏప్రిల్-జూన్ లో+38 శాతంగా ఉంది. ప్రస్తుతం స్థిరంగా కొనసాగుతున్న కొత్త ఉద్యోగులను నియమించుకునే ప్రక్రియ మున్ముందు సన్నగిల్లుతుందని మ్యాన్‌పవర్‌గ్రూప్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ ఏజీ రావ్ కూడా తెలిపారు. అయితే ఏడు ఇండస్ట్రి సెక్టార్లలో వర్క్ ఫోర్స్ పెరుగుతుందని భావిస్తున్నామని తాజా సర్వే పేర్కొంది. ఎక్కువగా సర్వీసు సెక్టార్లో ఉద్యోగవకాశాలు పెరుగుతాయని చెప్పారు. తర్వాత పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషన్ సెక్టార్, రిటైల్ ట్రేడ్ సెక్టార్లలో ఎంప్లాయిమెంట్ అవుట్ లుక్ బాగుంటుందని సర్వే రిపోర్టు వెల్లడించింది. ట్రాన్స్‌పోర్టేషన్, యుటిలిటీస్ సెక్టార్ భారీగా పడిపోతుందని తెలిపింది. -
సగం ఉద్యోగాలకు మనుషులతో పనిలేదు!
వాషింగ్టన్: మనుషులు చేస్తున్న ఉద్యోగాలను రోబోలు ఆక్రమించేస్తున్నాయి. 2055 నాటికి ఇప్పుడు మనుషులు చేస్తున్న పనుల్లో సగం రోబోలే చేయనున్నాయని మెక్కిన్సీ గ్లోబల్ ఇనిస్టిట్యూట్ నిర్వహించిన తాజా అధ్యయనంలో తేలింది. రాజకీయ పరిస్థితులు, టెక్నాలజీపై ప్రజలకు ఉన్న సెంటిమెంట్ వల్ల రోబోల విస్తృత వినియోగానికి మహా అయితే ఇంకో 20 ఏళ్లు ఆలస్యమౌతుందేమో గానీ.. మార్పు మాత్రం ఖాయం అని అధ్యయనానికి నేతృత్వం వహించిన మైఖేల్ చుయ్ వెల్లడించారు. అలాగే.. ఆటోమేషన్ పెరిగిపోవడం మూలంగా ఉత్పాదకత కూడా పెరుగుతుందని మెక్కిన్సీ నివేదిక వెల్లడించింది. రోబోల మూలంగా మానవ తప్పిదాలు, జబ్బుపడటం లాంటి వాటికి ఆస్కారం లేకపోవడంతో.. పనిలో వేగం పెరుగుతుందని, ఇది ఏడాదికి 0.8 నుంచి 1.4 శాతం ఉత్పదకత పెరిగేలా నివేదిక తెలిపింది. అలాగని ఉద్యోగాలను రోబోలు ఆక్రమిస్తున్నాయనగానే నిరుద్యోగం పెరిగిపోతుందని ఆందోళన చెందాల్సిన పనిలేదని మైఖేల్ చుయ్ వెల్లడించారు. అమెరికాలో వ్యవసాయ రంగంలో ఇంతకు ముందు 40 శాతం కార్మికులు పనిచేస్తే.. ఇప్పుడు యంత్రాల వాడకం మూలంగా అది 2 శాతానికి తగ్గిందని, అంతమాత్రాన ఇప్పుడు 30 శాతానికి మించిన నిరుద్యోగం అక్కడ లేదని అన్నారు. నూతన ఆవిష్కరణలతో ఉద్యోగాల సృష్టి జరుగుతుందని ఆయన తెలిపారు. -
ఐటీ ముందున్న రెండు అతిపెద్ద సవాళ్లివే!
దేశీయ ఐటీ ఇండస్ట్రీ రెండు అతిపెద్ద సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందని టెక్ నిపుణలంటున్నారు. ఒకటి ఆటోమేషన్, మరొకటి కొత్తగా ఎన్నికైన అమెరికా అధ్యక్షుడు ప్రవేశపెడుతున్న కఠినతర నిబంధనలు. ఈ రెండు ఐటీ ఇండస్ట్రీకి పెద్ద సవాళ్లుగా మారుతున్నాయన్నారు. ఆటోమేషన్తో మిషన్ల వాడకం పెరిగి వేల కొద్దీ ఉద్యోగాలు ఊడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. దేశీయ ఐటీ కీలకమార్కెట్గా ఉన్న అమెరికాలో వీసా నిబంధనలు మార్చడం కూడా పెద్ద పెనుముప్పుగానే మారుతుందన్నారు. ఆటోమేషన్తో ధరలు తగ్గినప్పటికీ, చాలామంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది. కానీ వీసా నిబంధనలు కఠినతరం చేయడం ఐటీకి వ్యయాలు పెరిగి, మార్జిన్లపై ప్రభావం చూపుతుందని ఐటీ వర్గాలు పేర్కొంటున్నాయి. మూడు రోజుల పాటు జరిగిన నాస్కామ్ లీడర్షిప్ ఈవెంట్లో ఐటీ నిపుణులు ఈ అభిప్రాయాలను వ్యక్తంచేశారు. అయితే టాప్ ఎగ్జిక్యూటివ్‌లు సైతం మిషన్లతో భయపడాల్సి వస్తుందని పేర్కొంటూనే ఆటోమేషన్ మరింత క్రియేటివ్ ఉద్యోగాలకు నాంది పలుకుతుందన్నారు. పునరావృత ఉద్యోగాలను తీసివేసి, ఇంజనీర్లకు, డెవలపర్లకు మరింత క్రియేటివ్ రోల్స్‌కు సాయం చేస్తుందని ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావ్ తెలిపారు. ట్రంప్ వీసా నిబంధనల్లో మార్పులు చేయడం కంటే ఆటోమేషన్ అత్యంత ప్రమాదకరమైందని మరో టాప్ ఐటీ సంస్థ జనరల్ మేనేజర్ చెప్పారు. -
ఆటోమేషన్ దిశగా అడుగులు!
ఎంబీఏ హెచ్ఆర్.. సంస్థ నిర్వహణలో కీలకమైన మానవ వనరుల (హెచ్ఆర్) విభాగం నేడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఆధునిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ కంపెనీ వృద్ధికి దోహదపడుతోంది. ఈ క్రమంలో ఎంబీఏ హెచ్ఆర్ స్పెషలైజేషన్ అభ్యర్థులు.. తమ నైపుణ్యాలకు నగిషీలు దిద్దుకోవాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ముఖ్యంగా హెచ్ఆర్ విభాగంలో ఆటోమేషన్ పెరుగుతున్న నేపథ్యంలో భవిష్యత్తు హెచ్ఆర్ నిపుణులు మెరుగుపరచుకోవాల్సిన స్కిల్స్‌పై ఫోకస్.. హెచ్ఆర్ విభాగంపై ఆటోమేషన్ ప్రభావం చాలాకాలంగానే ఉంది. అయితే ఇప్పుడు ఇది మరింత విస్తృతమవుతోంది. ప్రస్తుతం హెచ్ఆర్ విభాగంలో నియామకాల పరంగా ఆఫర్ లెటర్ అందజేయడం నుంచి ఉద్యోగుల అప్రైజల్స్ వరకూ అంతా ఆన్లైన్లోనే సాగుతోంది. హెచ్ఆర్ కన్సల్టింగ్ సంస్థల ద్వారా నియామకాలు చేపట్టే కంపెనీలు.. తమకు అవసరమైన సిబ్బంది సంఖ్య, వారికి ఉండాల్సిన అర్హతలు, నైపుణ్యాలు తదితర వివరాలను అందిస్తుండగా.. వీటి ఆధారంగా కన్సల్టింగ్ సంస్థలు క్లౌడ్ బేస్డ్ విధానంలో నిర్ణీత అర్హతలున్న అభ్యర్థుల జాబితాను కంపెనీల హెచ్ఆర్ విభాగాలకు అందిస్తున్నాయి. వాస్తవానికి ఒక సంస్థ హెచ్ఆర్ విభాగం ఒక ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు సగటున 40 నుంచి 45 రోజుల వ్యవధి పడుతుందని.. కానీ, కన్సల్టింగ్ సంస్థలు.. క్లౌడ్ బేస్డ్ టెక్నాలజీ వినియోగం ఆధారంగా వారం పది రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతోందని క్యాప్ జెమిని సంస్థ ఒక నివేదికలో పేర్కొంది. అదే విధంగా చాలా సంస్థల్లో సిబ్బంది హాజరు నుంచి వారి పనితీరును విశ్లేషించడం వరకు అంతర్గతంగా ఆన్లైన్ విధానంలో జరుగుతోంది. వీటన్నింటినీ హెచ్ఆర్ విభాగంలో ఆటోమేషన్ ప్రభావం పెరిగిందనడానికి నిదర్శనాలుగా చెప్పొచ్చు. మేనేజ్.. బిగ్ డేటా n ఇప్పటి వరకు ఈ–కామర్స్, ఇతర కస్టమర్ ఓరియెంటేషన్ కంపెనీల్లో బిగ్‌డేటా మేనేజ్మెంట్ ప్రాధాన్య అంశంగా ఉండేది. కానీ, ఇప్పుడిది హెచ్ఆర్ విభాగాల్లోనూ కీలకంగా మారుతోంది. ముఖ్యంగా వందలు, వేల సంఖ్యలో ఉద్యోగులున్న సంస్థల్లో బిగ్ డేటా అనాలిసిస్‌కు ప్రాధాన్యం పెరుగుతోంది. ఉద్యోగుల వివరాలను ఆన్లైన్ డేటాబేస్‌లో నిక్షిప్తం చేయడమే కాకుండా.. బదిలీలు, పదోన్నతుల సమయంలో ఈ సమాచార విశ్లేషణకు హెచ్ఆర్ సిబ్బంది.. డేటా మేనేజ్మెంట్ను ఉపయోగించుకుంటున్నారు. n ఆటోమేషన్ విధానంగా పేర్కొనే ఎంప్లాయీ డేటా బేస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, పే–రోల్ ప్రిపరేషన్ సాఫ్ట్వేర్ టూల్స్ వంటి ఆధునిక పద్ధతులను అనుసరించడం వల్ల సిబ్బంది పనితీరు, ఇతర అంశాలను బేరీజు వేయడంలో చాలా తక్కువ లోపాలు నమోదవుతాయన్నది నిపుణుల అభిప్రాయం. విదేశాల్లో ఎప్పటి నుంచో.. అమెరికా, యూకే తదితర అభివృద్ధి చెందిన దేశాల్లో హెచ్ఆర్ విభాగంలో కోర్ ఆటోమేషన్ ప్రక్రియ అయిదారేళ్ల క్రితం నుంచే ప్రారంభమైంది. EHRM (Electronic Human Resource Management), HRIS(Human Resource Information System), HRIM (Human Resource Information Management), CHRIS (Computerised Human Resource Information వంటి పేర్లతో మానవ వనరుల నిర్వహణ పరంగా ఐటీ టూల్స్‌ను అక్కడి సంస్థలు వినియోగిస్తున్నాయి. వీటి అన్నిటి ఉద్దేశం ఒకటే.. ఒక ఉద్యోగికి సంబంధించి నియామకం నుంచి యాన్యువల్ అప్రైజల్ వరకు అంతా ఆన్లైన్లోనే నిర్వహించడం.. తద్వారా సమయం, డబ్బు రెండిటినీ ఆదా చేయడం. ఉద్యోగుల కోణంలోనూ అసంతృప్తికి స్వస్తి పలకడం. హెచ్ఆర్ నియామకాలు తగ్గుతాయా? మానవ వనరుల నిర్వహణ పరంగా ఆటోమేషన్ విధానాలను అమలు చేసినా.. వాటిని నిర్వర్తించేందుకు నిపుణులైన హెచ్ఆర్ సిబ్బంది అవసరం ఎప్పుడూ ఉంటుందని, ఉద్యోగాల కోత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ ప్రభావం ఉన్నా అది 10–20 శాతం వరకే ఉంటుందని అంటున్నారు. ఆందోళన అనవసరం నేటి ఆధునిక యుగంలో సంస్థల్లో అంతర్గత విభాగాల నిర్వహణలోనూ ఆటోమేషన్ కీలకమవుతోంది. అంతమాత్రాన భవిష్యత్తు ఉద్యోగాల పరంగా కోత పడుతుందని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. హెచ్ఆర్ స్పెషలైజేషన్ ఔత్సాహిక విద్యార్థులు ఆధునికత దిశగా అడుగులు వేస్తే సుస్థిర కెరీర్‌కు ఢోకా ఉండదు. భవిష్యత్తులో మానవ వనరుల విభాగంలో సుస్థిర కెరీర్‌ను సొంతం చేసుకోవాలనుకునే అభ్యర్థులు హెచ్ఆర్ స్పెషలైజేషన్‌లో చేరినప్పటి నుంచే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టిసారించాలి. ముఖ్యంగా పే–రోల్ ప్రిపరేషన్, టైమ్ షీట్ ట్రాకింగ్, డేటాబేస్ మేనేజ్మెంట్ వంటి విధులు నిర్వర్తించేందుకు ముందునుంచే సన్నద్ధమయ్యేలా శిక్షణ పొందాలి. హెచ్ఆర్ ఆటోమేషన్ ఫ్యాక్ట్స్ 90% కెరీర్ బిల్డర్ నిర్వహించిన సర్వేలో హెచ్ఆర్లో బిగ్ డేటా ఆవశ్యకత ఉందని పేర్కొన్న సీఈవోలు. 35% రానున్న రోజుల్లో ఆటోమేషన్‌ను అమలు చేయనున్నట్లు తెలిపిన సీఈవోలు. -
హెచ్డీఎఫ్సీ భారీ ఉద్యోగాల కోత
ముంబై: ఆటోమేషన్ ప్రభావంతో ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో దాదాపు 4,500 ఉద్యోగులను వదలుకుంది. ఈ ధోరణి రాబోయే క్వార్టర్స్ లో కూడా కొనసాగనుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ఈ క్వార్టర్ లో ఆదాయ వృద్ధి 18 సం.రాల కనిష్టానికి పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. అధిక వ్యయాలు కూడా బ్యాంకును దెబ్బతీసినట్టు విశ్లుకులు భావిస్తున్నారు. బ్యాంకు ఆర్థిక రికవరీ పుంజుకోకపోతే ఈ ధోరణి కొనసాగే అవకాశం ఉందంటున్నారు. వేగవంతమైన ఆటోమేషన్ సహా వివిధ చర్యల ద్వారా ఉత్పాదకత వృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల నియామకాలు నెమ్మదించనున్నాయనే సంకేతాలలిచ్చిందని పేర్కొన్నారు. 4500 ఆటోమేషన్, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు హెడ్ డీ ఎఫ్ సీ బ్యాంకు ప్రశ్నకు సమాధానంగా చెప్పింది. . అధిక ఉత్పాదకత , సామర్థ్యాలను పెంచుకునే ఉద్దేశంతో గత కొన్ని నెలలుగా ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలిపింది కాగా మొత్తం సిబ్బంది సంఖ్య డిసెంబర్ 2016, 5 శాతం క్షీణించి 90,421గా నిలిచింది. సెప్టెంబర్ లో వీరి సంఖ్య 95,002 . -
9000 మందిని ఇంటికి పంపించేసిన ఇన్ఫీ!
బెంగళూరు : ఓ వైపు నుంచి ఆటోమేషన్ ప్రభావం, మరోవైపు నుంచి టాప్ కంపెనీ అయినా సరియైన ప్రదర్శన కనబర్చలేకపోవడం ఉద్యోగులకు ఎసరు తెచ్చి పెడుతోంది. గత ఏడాది కాలంలో దాదాపు 9వేల మంది ఉద్యోగులు ఆ కంపెనీ నుంచి బయటికి రావాల్సి పరిస్థితి వచ్చింది. ఇంతకి ఆ కంపెనీ ఏమిటా అనుకుంటున్నారా? దేశీయంగా నెంబర్.2 కంపెనీగా ఐటీ సర్వీసులు అందిస్తున్న ఇన్ఫోసిస్ సంస్థ. ఐటీ సేవల్లో బ్రాండెడ్ కంపెనీగా ముద్రపడిన ఇన్ఫోసిస్ గత ఏడాది కాలంగా 8000 నుంచి 9000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసినట్టు ఆ కంపెనీ హ్యుమన్ రిసోర్సస్ హెడ్ కృష్ణమూర్తి శంకర్ చెప్పారు. అయితే ప్రస్తుతం ఆ ఉద్యోగులు మరింత అడ్వాన్డ్ ప్రాజెక్టులలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి క్వార్టర్లోనూ దాదాపు 2000 మందిని బయటికి పంపుతున్నామని, వారికి స్పెషల్ కోర్సుల్లో ట్రైనింగ్ ఇచ్చిన తర్వాతే కంపెనీ నుంచి తీసివేస్తున్నట్టు ఆయన చెప్పారు. ఈ ట్రైనింగ్ ఉద్యోగులకు కొత్త అసైన్మెంట్లలో సహకరించనున్నట్టు శంకర్ తెలిపారు. ఆటోమేషన్ రంగం తీవ్రంగా విస్తరిస్తుందని, ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాల తగ్గిపోతున్నట్టు ఆయన వివరించారు. అయితే కేవలం ఆటోమేషను కాకుండా, అంచనాల మేర కంపెనీ రాణించలేకపోవడమేనని మరో కారణంగా ఎత్తిచూపారు. మొదటి తొమ్మిది నెలల కాలంలో ఇన్ఫోసిస్ కేవలం 5700 మందిని మాత్రమే నియమించుకుందని తెలిసింది. గతేడాది ఇదే కాలంలో 17వేల మందిని కంపెనీలో నియమించుకుంది. డిసెంబర్ క్వార్టర్లోనూ ఇన్ఫోసిస్ మొత్తం ఉద్యోగుల సంఖ్య తగ్గిపోయింది. పెద్దపెద్ద ఐటీ సర్వీసుల కంపెనీలను ఆటోమేషన్ ప్రక్రియపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ సంప్రదాయ వ్యాపారాలు బీపీవో, అప్లికేషన్ మేనేజ్మెంట్, ఇన్‌ఫ్రాక్ట్ర్చర్ మేనేజ్మెంట్ వాటిపై పెట్టుబడులను తగ్గిస్తుండటంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. -
అమెరికన్లకు కూడా ఉద్యోగాల ముప్పు
న్యూయార్క్: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ స్థానిక అమెరికన్లకు ఉద్యోగావకాశాలు కల్పించడం కోసం అక్రమవలసదారులను దేశం నుంచి వెనక్కి పంపిస్తానని పదే పదే చెబుతున్నారు. ఎన్నికల్లో ఆయన విజయానికి కూడా ఈ ప్రచారం ఎంతగానో దోహద పడింది. ఆయనకు తెలియకుండా అమెరికన్లకు ఉద్యోగాలు పోయే మరో గండం పొంచి ఉందని, అది వలసదారులకన్నా ప్రమాదరంగా మారనుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే యాంత్రీకరణ (ఆటోమేషన్). ఇంతకాలం మనుషులు చేస్తూ వస్తున్న పనిని ఇక కంప్యూటర్లు, రోబోలు చేయడమే ఆటోమేషన్. ప్రపంచీకరణ వల్ల పోయిన ఉద్యోగాలకన్నా ఆటోమేషన్ వల్ల ఎక్కువ ఉద్యోగాలు పోతాయని, ఇంతకుముందు ఆటోమేషన్ వల్ల ఓ చోట ఉద్యోగాలు పోతే మరో చోట కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చేవని, ఇకముందు అలా జరిగే అవకాశం లేదని మ్యాక్ కిన్సే, డరాన్ ఏస్మొగ్లూ, డేవిడ్ ఆటర్ లాంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక్క ఉక్కు రంగంలో వచ్చిన ఆటోమేషన్ వల్ల అమెరికా ఉక్కు పరిశ్రమలో 1962 నుంచి 2005 వరకు దాదాపు నాలుగు లక్షల ఉద్యోగాలు పోయాయని, అంటే కార్మికుల సంఖ్య 75 శాతం తగ్గిందని అధ్యయనాలు తెలియజేస్తున్నాయి. ప్రపంచీకరణ నేపథ్యంలో చైనాతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడం వల్ల ఎన్నో దేశాలు తమ ఉద్యోగాలను కోల్పోయాయి. ఉద్యోగాలు కోల్పోయిన కార్మికుల సంఖ్య 20 లక్షల నుంచి 24 లక్షల వరకు ఉండవచ్చని ఆర్థిక నిపుణులు అంచనావేశారు. ఈ నేపథ్యంలో దేశీయ ఉద్యోగాలు మెక్సికోకు తరలిపోకుండా ఉండేందుకు అమెరికాలోని యునైటెడ్ టెక్నాలజీస్ కంపెనీతో ఇటీవల డోనల్డ్ ట్రంప్ ఓ ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందంలో భాగంగా కంపెనీ 160 లక్షల డాలర్లను అదనంగా పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. అయితే ఇందులో ఎక్కువ నిధులను ఆటోమేషన్ కోసమే వెచ్చించనున్నారు. అంటే భవిష్యత్తులో ఈ కంపెనీలో కూడా ఉద్యోగావకాశాలు తగ్గిపోనున్నాయి. ఒకప్పుడు కార్మికులు చేసే శరీర కష్టమే ఆ తర్వాత యంత్రాలు చేస్తూ వచ్చాయి. ఇప్పుడు వైట్ కాలర్ జాబ్స్‌తోపాటు సేవారంగం పనులను కూడా కంప్యూటర్లు, రోబోలు చక్కగా చేయగలడమే మానవ ఉద్యోగాలకు ఎసరు తెస్తోంది. కొంతమేరకు ఒకచోట పోయిన ఉద్యోగాలు, మరో చోట పుట్టుకొని రావచ్చు. అయితే అలాంటి ఉద్యోగాలు మరో తరానికి ఉపయోగపడతాయిగానీ, ప్రస్తుత తరానికి ఉపయోగపడకపోవచ్చని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జపాన్, చైనా లాంటి దేశాల్లోని కొన్ని హోటళ్లలో బిల్లింగ్ నుంచి సర్వింగ్ వరకు అన్ని పనులుచేసే రోబోలు అందుబాటులోకి వచ్చిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. -
ఆందోళనకరంగా దూసుకొస్తున్న ఆటోమేషన్
అవలోకనం మన ఆర్థిక వ్యవస్థకు సంబంధించి ఆందోళన చెందాల్సిన ఒక విషయం ప్రస్తుతం బిజినెస్ వార్తా పత్రికలకే పరిమితమైంది. అది, భారత సమాచార సాంకేతికతకు, సాఫ్ట్వేర్ పరిశ్రమకు, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో వంటి ఐటీ కంపెనీలకు సంబంధించినది. గత రెండు దశాబ్దాలుగా త్వరితగతిన విస్తరించిన ఈ కంపెనీల వృద్ధి మందగించిపోయింది. ప్రస్తుతం అవి ఒక్క అంకె వార్షిక వృద్ధితో నడుస్తున్నాయి. దాన్ని కొనసాగించడానికీ తంటాలు పడుతున్నాయి. భారత్‌లో ఐటీ పరిశ్రమ మరణశయ్యపై ఉందనే ఊహాగానాలకూ అది దారి తీస్తోంది. మానవ పెట్టుబడి స్థానంలో ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని అత్యాధునిక సాంకేతికతతో తయారయ్యే యంత్రాలే నిర్వహించడం) ప్రవేశించడం అందుకు ఒక కారణం. ఇది, ఆ కంపెనీలు అందించే సేవలను, వాటిలోని వందల వేల ఉద్యోగులను ప్రభావితం చేస్తుంది. ఇన్ఫోసిస్ మాజీ నేత మోహన్ దాస్ పాయ్ సరైన దృక్కోణం నుంచి ఈ పరిణామాన్ని చక్కగా వివరిస్తూ ఓ వ్యాసం రాశారు. మార్పు రానున్నా అందుకు మూడేళ్ల నుంచి ఐదేళ్ల వ్యవధి పడు తుంది, భారత ఐటీ కంపెనీలు ఆ మార్పును ఎదుర్కోగల మంచి స్థితిలోనే ఉన్నా యని ఆయన అభిప్రాయం. ఆయన ఇలా రాశారు ‘‘నేటి పరిస్థితిని చూద్దాం. భారత సాఫ్ట్వేర్ ఎగుమతుల పరిశ్రమ దాదాపు 11,000 కోట్ల డాలర్ల విలువైనది. అది దాదాపు 42.50 లక్షల మంది ఉద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. ప్రపంచ ఔట్‌సోర్సింగ్‌లో దాని మార్కెట్ వాటా 60 శాతం, ప్రపంచంలో దానిది ఆధిపత్య స్థానం. మార్కెట్ విలువను బట్టి పది అగ్రశ్రేణి సాఫ్ట్వేర్ సర్వీస్ కంపెనీలలో భారత కంపెనీలు ఐదు. అగ్రశ్రేణి ఐదు సంస్థలలో నైతే మూడు భారత్‌వి. వాటన్నిటికీ భారత్‌లో భారీ ఉనికి ఉంది. ఈ 10 కంపెనీ లలోని దాదాపు 20 లక్షల మంది మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 70 శాతం భారత్ కేంద్రంగా చేస్తున్నవారు లేదా భారత్ నుంచి బయటకు వె ళ్లినవాళ్లు. విదేశాలలోని భారత సాఫ్ట్వేర్ పరిశ్రమ ప్రపంచ సాఫ్ట్వేర్ సేవల రంగంలో అధిపత్య స్థానంలో ఉంది. దానికి సాటి ఏదీ లేదు.’’ ప్రపంచ స్థాయి నాయకత్వంలో మన పెద్ద కంపెనీలకు అనుభవం ఉంది, అసాధారణ ప్రతిభగల మేనేజ్మెంట్ సైతం వాటికి ఉంది. కాబట్టి అవన్నీ ఈ మార్పును తమకు సాధ్యమైనంత అత్యుత్తమమైన రీతిలో ఎదుర్కోగలుగుతాయనే మనమంతా ఆశించాలి. అయితే ఈ మార్పు వ్యవస్థాగతమైనదని, ఉన్నదాన్ని ఛిద్రం చేసేదని అభిప్రాయపడుతున్నవారు కూడా ఉన్నారు. కొన్ని వారాల క్రితం నేను హైదరాబాద్‌లో జరిగిన ఒక సెమినార్లో మాట్లా డాను. ఐబీఎం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (కృత్రిమ మేధస్సు) కార్యక్రమమైన ‘వాట్సన్’ విభాగాధిపతి మనోజ్ సక్సేనా కూడా ఆ కార్యక్రమంలో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయం బాగా ఆందోళన కలిగించేదిగా ఉంది. వచ్చే దశాబ్ద కాలంలో సాంకేతికతలో రానున్న మార్పులను ఆయన వివరించారు. ఆ పరివర్తనకు తగిన విధంగా మనం సంసిద్ధమై లేమన్నట్టు మాట్లాడారు. మన కంపెనీలు ఇప్పటికి ఉన్న వందల వేల కోట్ల డాలర్ల వ్యాపారాలపైనే దృష్టి కేంద్రీకరణను కొనసాగిస్తున్నాయని, ఇది వంద మైళ్ల వేగంతో పోతున్న కారు టైర్లను మార్చడం లాంటిదని అన్నారాయన. మనలో చాలా మంది ఊహిస్తున్న దాని కంటే మరింత వేగంగా ఆటోమేషన్ దూసుకొస్తోంది. ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో పాయ్ ఇలా అన్నారు: ‘‘నేడు ఏడాదికి రూ. 30 లక్షల నుంచి రూ. 70 లక్షల వరకు సంపాదిస్తున్న వారు (మధ్యస్త స్థాయి మేనేజర్లు) చాలా మందే ఉన్నారు. వారిలో సగం మంది రాబోయే పదేళ్లలో ఉద్యోగాలు కోల్పోతారు.’’ ఆయన చెప్పేదాన్ని బట్టి, భారత ఐటీ పరిశ్రమలోని మొత్తం ఉద్యోగులలో 10 శాతం లేదా 4,50,000 మంది మధ్యస్త స్థాయి మేనేజర్లు ఉంటారు. వీరిలో 2,25,000 మంది, వారి పనిని ఆటోమేషన్ చేయడం వల్ల వచ్చే దశాబ్ద కాలంలో ఉద్యోగాలు కోల్పోతారు. ఇది అనేక విధాలుగా విచారకరమైన వార్త. ఒకటి, భారత ఐటీ కంపెనీలు సాఫ్ట్వేర్ పనిలో తమ మార్కెట్ వాటాను కాపాడుకున్నా, ఆ పని ఆటోమేట్ అయిపోతుంది. అంటే తక్కువ మంది ఉద్యోగులే ఉంటారు. రెండు, ఆటోమేషన్ వల్ల ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా తయారీ రంగంలో ఉద్యోగాలు క్షీణిస్తున్నాయి. వాస్తవానికి రోబోటిక్స్ సాంకేతికత కొన్ని తయారీ రంగ ఉద్యోగాలు తిరిగి పాశ్చాత్య దేశాలకు తిరిగి రావడానికి కారణమైంది కూడా. మూడు, భారత్ మరింత సంఖ్యలో ఉద్యోగాలను సృష్టించడానికి తంటాలు పడుతున్న దశలో ఈ ఐటీ రంగ పరివర్తన రావడం. ఉద్యోగ కల్పనకు సంబంధిం చిన గణాంకాలన్నీ ఆందోళనకరంగానే ఉన్నాయి. నాలుగు, ఉద్యోగాల సమస్యపై జనాభాలోని పెద్ద విభాగాలలో ఇప్పటికే అసంతృప్తి ప్రబలివుంది. మూడు లేదా నాలుగు అత్యంత పారిశ్రామికీకరణ చెందిన రాష్ట్రాలు గుజరాత్, హరియాణ, మహారాష్ట్రలలోని ఆధిపత్య కులాలు ఈ సమస్యపై ఇప్పటికే ఆందోళన సాగిస్తున్నాయి. పటేళ్లు, జాట్లు, మరాఠాలు ఉద్యోగాల విషయంలో తమకు ప్రభుత్వ సహాయం అందడం అవసరమని భావి స్తున్నారు. అయితే ప్రధానంగా వారు చాలా వరకు పట్టణాలకు చెందినవారే. బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్, గుర్గావ్ కేంద్రంగా ఉన్న మన ఐటీ పరిశ్రమలో అగ్ర కులాల వారికి చాలా ఎక్కువగా ఉద్యోగాలు లభించాయి. ఈ వర్గం, తమకు ఇంగ్లిష్ విద్య, సేవారంగ ఉద్యోగాలు సులువుగా అందు బాటులో ఉండటంతో రిజర్వేషన్లకు వ్యతిరేకం. ప్రపంచవ్యాప్తంగా సాంకేతికతలో వేగంగా మార్పులు సంభవించడం అంటే అర్థం, ఇకపై ఈ పరిస్థితి ఇలా ఉండదని అర్థం. ఇది, ప్రభుత్వానికి సంబంధించిన సమస్య మాత్రమే కాదని నా అభి ప్రాయం. అయినా రానున్న ఈ మౌలిక మార్పుల గురించి, అవి తమ జీవితాలను ఎలా ప్రభావితం చేయనున్నాయనే దాని గురించి భారతీయులందరికీ తెలిసి ఉండటం అవసరం. ఆకార్ పటేల్ aakar.patel@icloud.com -
ఆటోమేషన్తో ఉద్యోగాలకు ఎసరు
భారత్‌లో 69 శాతంగా ఉంటుంది: ప్రపంచ బ్యాంకు వాషింగ్టన్: ఆటోమేషన్తో భారత్‌లో 69 శాతం ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉందని ప్రపంచ బ్యాంకు హెచ్చరించింది. ఇది చైనాలో 77 శాతంగా ఉంటుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో సంప్రదాయ ఆర్థిక విధానాలను టెక్నాలజీ పూర్తిగా మార్చేస్తుందని పేర్కొంది. వృద్ధిని పెంచుకునేందుకు మౌలిక రంగంలో మరిన్ని పెట్టుబడులను ప్రోత్సహించాలని సూచించింది. అయితే, భవిష్యత్తు ఆర్థిక విధానాలను దృష్టిలో పెట్టుకుని ఎటువంటి మౌలిక సదుపాయాలు అవసరమో ఆలోచన చేయాల్సి ఉందని పేర్కొంది. ‘ప్రపంచాన్ని టెక్నాలజీ సమూలంగా మార్చేస్తుందనే విషయం మనకు తెలిసిందే. అయితే, సంప్రదాయ ఆర్థిక విధానమైన వ్యవసాయం, తక్కువ స్థాయిలో తయారీ రంగం నుంచి పూర్తి స్థాయి పారిశ్రామిక దేశంగా మారిపోవడం అన్నది అన్ని వర్ధమాన దేశాలకు సాధ్యమయ్యేది కాదు’ అని ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్‌కిన్ అన్నారు. వాషింగ్టన్‌లోని బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్లో పేదరికంపై జరిగిన చర్చా కార్యక్రమం సందర్భంగా జిమ్‌కిన్ ఈ అంశాలను వెల్లడించారు. కిమ్ ఏం చెప్పారంటే... ప్రపంచ బ్యాంకు పరిశోధన ప్రకారం ఆటోమేషన్ (మనుషులు చేసే పనిని యంత్రాలతో చేయించుకోవడం) వల్ల భారత్‌లో 69 శాతం, చైనాలో 77 శాతం, ఇథియోపియాలో 85 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉంది. ఇదే గనుక వాస్తవ రూపం దాలిస్తే ఈ దేశాలు అధిక సంఖ్యలో ఉద్యోగాలను కోల్పోతాయి. ఈ దృష్ట్యా ఆర్థికాభివృద్ధికి అందుబాటులో ఉన్న మార్గాలను అర్థం చేసుకుని అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపట్టాలి. యాంత్రీకరణ, టెక్నాలజీలు సంప్రదాయ పారిశ్రామిక తయారీని దెబ్బతీశాయి. దీంతో మాన్యువల్ ఉద్యోగాలపై ప్రభావం పడింది. దీనికి ఏ దేశం కూడా అతీతం కాదు. భారత్‌లో చైల్డ్ స్టంటింగ్ (చిన్నారుల్లో ఎదుగుదల లోపం) 38.7 శాతంగా ఉంది. వీరంతా భవిష్యత్తు తరానికి ప్రతీకలు. వారిలో 40 శాతం మంది ప్రపంచ డిజిటల్ ఆర్థిక రంగంలో పోటీ పడలేకున్నారు. పక్కనే ఉన్న చైనా మాత్రం చైల్డ్ స్టంటింగ్‌ను చాలా కనిష్ట స్థాయికి తగ్గించిందని కిమ్ పేర్కొన్నారు. -
ఉద్యోగాల కోతపై ప్రపంచ బ్యాంక్ హెచ్చరిక
వాషింగ్టన్: ఆటోమేషన్ కారణంగా భారతదేశంలో భారీ ఎత్తున ఉద్యోగాలు కోల్పోనున్నట్టు ప్రపంచబ్యాంక్ హెచ్చరిస్తోంది. దాదాపు 69శాతం ఉద్యోగలకు కోతపడుతుందని తెలిపింది. అభివృద్ధి చెందుతున్న దేశాలలో టెక్నాలజీ సంప్రదాయ ఆర్థిక మార్గం నమూనాకు విఘాతం కలిగిస్తుందని ప్రపంచ బ్యాంకు పరిశోధనలో తేలింది. అలాగే చైనా, ఇథియోపియా 77శాతం ఉద్యోగాలు నష్టపోనున్నాయని అంచనా వేసింది. మొత్తానికి ఆటోమేషన్ ప్రభావంతో 85 శాతం ఉద్యోగాలు ప్రమాదంలో పడ్డాయని స్పష్టం చేసింది. తీవ్రమైన పేదరికం పై కిమ్ బ్రూకింగ్స్ ఇన్స్టిట్యూట్ లో మంగళవారం జరిగిన చర్చ సందర్భంగా ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్ కిమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. సాంకేతికత మూలంగా ప్రపంచంలో ఎన్నో మార్పులు వచ్చినప్పటికీ దాని ప్రభావాలను అంచనా వేస్తున్నా మన్నారు. అభివృద్ధిని ప్రోత్సహించడానికి గాను తమ పెట్టుబడుల ప్రోత్సాహం కొనసాగుతుందన్న ఆయన దేశాల భవిష్యత్ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన వివిధ రకాల ఇన్ ఫ్రాస్ట్రక్చర్ గురించి కూడా ఆలోచిస్తున్నామన్నారు. కానీ అభివృద్ధి చెందుతున్న దేశాల్లో పూర్తి స్థాయి పారిశ్రామికీకరణ సాధ్యం కాకపోవచ్చనీ, వ్యవసాయ ఉత్పాదకత పెంచడంద్వారా సంప్రదాయ ఆర్థికవ్యవస్థ వృద్ధికి మార్గం సుగమవుతుందనీ ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. యాంత్రీకరణ, టెక్నాలజీ కారణంగా సంప్రదాయ పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతిందనీ, మాన్యువల్ ఉద్యోగాలు నష్టపోతున్నామనీ, ఈ ధోరణి అమెరికాకు పరిమితం కాదనీ, ప్రపంచ దేశాల్లో ప్రతిచోటా ప్రజలు దీనికి ప్రభావితమవుతున్నారని కిమ్ చెప్పారు. దీనిపై చైనాలో జరిగిన జీ 20 సమావేశంలో ప్రపంచ నాయకులందరూ ఆందోళన వ్యక్తం చేశారన్నారు. అయితే ఉమ్మడి వాణిజ్యం ద్వారా ఆర్థిక వ్యవస్థ వృద్దికోసం ప్రపంచ దేశాల సమిష్టి కృషితో కొంత పురోగతి సాధించిన ప్పటికీ తీవ్రమైన ఎదురుగాలి తప్పడం లేదని కిమ్ వ్యాఖ్యానించారు. సరుకుల ధరల క్షీణత ప్రపంచ వాణిజ్యంలో మందగింపు కారణమవుతోందన్నారు. ఇది చారిత్రాత్మక స్థాయిలో ఉందని కిమ్ పేర్కొన్నారు. -
పదివేల ఉద్యోగాల కోత
ఆటోమేషన్ ముప్పు అంతకంతకూ ముదురుతోంది. ఈ కారణంగా కోల్పోతున్న ఉద్యోగాల సంఖ్యం రోజురోజు పెరుగుతోంది. తాజాగా టెక్స్టైల్స్ దిగ్గజం రేమండ్ దేశంలో భారీగాఉద్యోగాల కోత పెట్టనున్నట్టు తెలుస్తోంది. సాఫ్ట్ వేర్ సెక్టార్ ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ పేరుతో 10,000 ఉద్యోగులకు ఉద్వాసన పలకనుంది. రాబోయే మూడేళ్లలో తయారీ ప్లాంట్లలో టెక్నాలజీని వినియోగించడం ద్వారా ఉద్యోగులను తగ్గించే ప్రణాళికల్లో ఉన్నట్లు వెల్లడించింది. వీరి స్థానంలో రోబోలు, అధునాతన టెక్నాలజీని వినియోగించనున్నట్లు తెలియజేసింది. తద్వారా కార్యకలాపాలను క్రమబద్ధీకరించనున్నట్లు పేర్కొంది. రోబో ద్వారా 100 కార్మికులు భర్తీ చేయవచ్చని రేమండ్ సీఈవో సంజయ్ బెహల్ వ్యాఖ్యల్ని ఉటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే టెక్నాలజీ ఇన్వెన్షన్ ద్వారా తమ ఉద్యోగుల సంఖ్యను 20 వేలకు తగ్గించుకుంటున్నట్టు తెలిపింది. దీంతోపాటుగా దేశంలోని కొన్న ప్రయివేటు బ్యాంకులుకూడా ఉద్యోగుల స్థానంలో రోబోలు నియమించుకునేందుకు యోచిస్తున్నట్టు టెక్నాలజీ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కస్టమర్ల ఐడీలు సృష్టించేందుకు, అప్ డేట్ చేసేందుకు , ఏటీఎం సంబంధింత సమస్యలను పరిష్కరించేందుకు రోబో సేవలను వినియోగించుకోనున్నట్టు ఐసీఐసీఐ ఇటీవల ప్రకటించింది. రెండవ అతిపెద్ద బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా తన ముంబై బ్రాంచ్ లో రోబో సేవలను ప్రయోగాత్మకంగా ప్రారంభించనున్నామని తెలిపింది. కాగా దేశ వ్యాప్తంగా 16 యూనిట్లలో ముప్పయి వేలమందికి పైగా ఉద్యోగులున్నారు. -
ఆటోమేషన్తో కొత్త ఐటీ ఉద్యోగాలు
ఆటోమేషన్ ఎఫెక్ట్‌తో హడలిపోతున్న ఐటీ ఉద్యోగులకు గుడ్ న్యూస్. ఆటోమేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లతో ఐటీ రంగంలో సమూల మార్పులు జరిగి, ఐటీ ఉద్యోగాలకు గండికొడుతుందనే అపోహలకు తెరదించుతూ.. కొత్త ఉద్యోగాలు సృష్టికి ఈ టెక్నాలజీలు సహకరిస్తాయని నాస్కామ్ వెల్లడించింది. ఈ కొత్త టెక్నాలజీలతో లక్షల సంఖ్యలో ఐటీ ఉద్యోగాలు కనుమరుగవుతాయని గత కొంత కాలంగా పలు సర్వేలు, నిపుణులు హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టెక్నాలజీలు తీసుకొచ్చే మార్పులతో కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందని నాస్కామ్ అధ్యక్షుడు చంద్ర శేఖర్ తెలిపారు. భారత్‌కు సంబంధించినంత వరకు ఈ టెక్నాలజీల భయాలు తక్కువేనని వెల్లడించారు. కొన్ని ఉద్యోగాలు కనుమరుగైనప్పటికీ, అధికనైపుణ్యాలతో కూడిన కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలిపారు. అయితే కోల్పోయే ఉద్యోగాల కంటే తక్కువగానే కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే టెక్నాలజీతో కోల్పోయ్యే ఉద్యోగాల కంటే సృష్టించే ఉద్యోగాలే ఎక్కువగా ఉంటున్నాయని చంద్రశేఖర్ వివరించారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇండస్ట్రి స్పందించాలని, భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. -
ఐటీ ఉద్యోగాలు పోకుండా ఉండాలంటే ఎలా...
హైదరాబాద్ : ఐటీ సెక్టార్లో ఆటోమేషన్‌కు పెరుగుతున్న డిమాండ్ లక్షల ఉద్యోగాలకు గండి కొట్టనుందన్న నేపథ్యంలో విద్యార్థులు సాంకేతిక పరిజ్ఞానంపై ఎక్కువగా పట్టు సాధించాలని సూచిస్తున్నారు ఐటీ నిపుణులు. ఐటీ విద్యార్థులు మెరుగైన నైపుణ్యాలు అలవర్చుకోవాలని ఇండస్ట్రి నిపుణుడు, ఇన్ఫోసిస్ మాజీ సీఈవో, హెచ్ఆర్ హెడ్ టీవీ మోహన్‌దాస్ పాయ్ పేర్కొన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఆండ్రాయిడ్, పైథాన్ లాంటి కోడింగ్ లాంగ్వేజ్‌లపై పట్టు ఉన్నవారికి వచ్చే ఐదేళ్లలో ఉద్యోగాలు ఎక్కడికి పోవని స్పష్టంచేశారు. ప్రస్తుతం బీటెక్ చదువులు 10వ తరగతి చదివిన విద్యార్థితో సరిపోతుందని, విద్యార్థులు మరింత టెక్నికల్ నాలెడ్జ్‌ను పొందడానికి కేవలం బ్యాచ్‌లర్ డిగ్రీలతో సరిపెట్టుకోకుండా, మాస్టర్ డిగ్రీలను(పోస్ట్-గ్రాడ్యుయేషన్) కూడా చేయాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంపై పట్టు సాధించాలని లేకపోతే అసలకే తగ్గిపోతున్న ఉద్యోగాల్లో, ఉద్యోగం సంపాదించడం కష్టతరమవుతుందని హెచ్చరించారు. ప్రతేడాది ఐటీ మార్కెట్లోకి వచ్చే 6.5 లక్షల మందిలో కేవలం 2-2.5లక్షల మంది ఇంజనీర్లే ఉద్యోగాలను సంపాదిస్తున్నారని పాయ్ పేర్కొన్నారు.. ఆటోమేషన్ ప్రభావంతో ఏటా కొత్తగా వచ్చే ఉద్యోగాల్లో ప్రారంభ, మధ్యస్థాయి ఉద్యోగాల్లో 10 శాతం వరకూ కోతపడనుందని పేర్కొన్నారు. గణాంకాల పరంగా చూసుకుంటే ఏటా 2 నుంచి 2.5 లక్షల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుంటే, వాటిలో 25వేల నుంచి 50 వేల వరకు ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని చెప్పారు. ఐటీ ఇండస్ట్రిలో మొత్తంలో 45 లక్షల మంది ఐటీ ఉద్యోగులున్నారని, వారిలో 4,50,000 మంది మధ్యస్థాయి ఉద్యోగులేనన్నారు. అయితే ఆటోమేషన్ వల్ల వచ్చే దశాబ్దంలోనే వారిలో సగం మంది ఉద్యోగాలు వదులుకోవాల్సి వస్తుందని తెలిపారు. మధ్యస్థాయి ఉద్యోగుల్లో చాలామంది ఏడాదికి రూ.30 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు ఆదాయం సంపాదిస్తున్నారని, ఈ ఖర్చును తగ్గించుకోవడానికి ఐటీ సంస్థలు ఆటోమేషన్‌పై మొగ్గుచూపుతున్నాయని అన్నారు. -
ఐటీలో 6.4లక్షల ఉద్యోగాలు హాంఫట్...?
ముంబై : ఇప్పటికే ఐటీ పరిశ్రమలో ఉద్యోగాలు లేక సతమతమవుతున్న నిరుద్యోగులకు మరో బ్యాడ్ న్యూస్. వచ్చే ఐదేళ్లలో భారత్ లో ఆటోమేషన్ వల్ల 6.4 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందని రీసెర్చ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి.. తక్కువ నైపుణ్యమున్న ఉద్యోగులకు ఐటీ పరిశ్రమ ఉద్వాసన పలుకనుందని హెచ్ఎఫ్ఎస్ రీసెర్చ్ సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఐటీ ఇండస్ట్రీలో 2021 కల్లా నికర తగ్గుదల 9 శాతం లేదా 14 లక్షల ఉద్యోగాలు ఉండొచ్చని హెచ్ఎఫ్ఎస్ సంస్థ తెలుపుతోంది. ఫిలిప్పీన్స్, యూకే, అమెరికాలో ఈ ఉద్యోగాల కోత అధికంగా ఉంటుందని పేర్కొంది. అయితే ఐటీ ఇండస్ట్రి బాడీ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాప్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) ఈ రిపోర్టును కొట్టిపారేస్తోంది. కొత్త టెక్నాలజీస్ సృష్టించే ఉద్యోగాలన్నింటిన్నీ ఈ సంస్థ పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంటోంది. ఆటోమేషన్, రోబోటిక్స్ టెక్నాలజీ సంస్థలను లీడ్ చేస్తాయని భావించడం లేదని, కొంత మాత్రమే ఆటోమేషన్ ప్రభావం ఉంటుందని చెబుతోంది. టెక్నాలజీ అనుసరణ ఐటీ రంగంలో ఎక్కువ ఉద్యోగాలను సృష్టిస్తుందని తాము విశ్వసిస్తున్నట్టు నాస్కామ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంగీత గుప్తా తెలిపారు. అయితే ఇన్ని ఉద్యోగాలు కోల్పోతాయి అనడం సరియైనది కాదని నాస్కామ్ వెల్లడించింది. మిగతా ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్గిఉంటాయని పేర్కొంది. హెచ్ఎఫ్ఎస్ రిపోర్టు ప్రకారం.. తక్కువ నైపుణ్యమున్న ఉద్యోగాలు 30 శాతం తగ్గిపోతే.. మధ్యస్త నైపుణ్యమున్న ఉద్యోగాలు 8శాతం, ఎక్కువ నైపుణ్యమున్న ఉద్యోగాలు 56 శాతం పెరుగుతాయని తెలిపింది. 1477 ఇండస్ట్రి స్టాక్ హోల్డర్స్ తో హెచ్ఎఫ్ఎస్ ఈ సర్వే నిర్వహించింది. ఆటోమేషన్, ఉద్యోగాల పడిపోవడానికి ఎక్కువ దోహదం చేస్తుందని ఐటీ ఇండస్ట్రి ఎగ్జిక్యూటివ్ లు నమ్ముతున్నట్టు ఈ రీసెర్చ్ సంస్థ వెల్లడించింది. అయితే ఈ రిపోర్టుపై ఇండస్ట్రీలో భిన్న స్పందనలు వస్తున్నాయి. ఒకరు 6.4లక్షల జాబ్స్ కోల్పోవడం చాలా ఎక్కువని అంటుంటే.. మరొకరు వచ్చే రెండేళ్లలోనే బీపీఓ ఇండస్ట్రి రోబోటిక్స్ ప్రాసెస్ ఆటోమేషన్ సమస్యను ఫేస్ చేయబోతుందని పేర్కొంటున్నారు. అయితే టెక్ మహింద్రా గతేడాది ప్రారంభించిన ఆటోమేషన్ డ్రైవ్ వల్ల, గత త్రైమాసికంలో 2,000 ఉద్యోగాలను తగ్గించింది. అసెంచర్ సంస్థ తక్కువమంది ఉద్యోగులను రిక్రూట్ చేసుకుంటుందని ఆ కంపెనీ సీఈవో, చైర్మన్ పియరీ నాన్ టెర్మి రెండు వారాల క్రితం జరిగిన ఫోస్ట్ ఎర్నింగ్ కాన్ఫరెన్స్ లో తెలిపారు. -
బీపీఎల్ నుంచి హోమ్ ఆటోమేషన్, సర్విలెన్స్ ఉత్పత్తులు
న్యూఢిల్లీ: దేశీ కన్సూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ బీపీఎల్ తాజాగా హోమ్ సర్విలెన్స్, ఆటోమేషన్ విభాగంలో పలు రకాల ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. సంస్థ ‘బీపీఎల్ ఐక్యూ’ బ్రాండ్ కింద స్మార్ట్ ఆటోమేషన్, స్మార్ట్ సర్విలెన్స్ అనే ఉత్పత్తులను తీసుకువచ్చింది. బీపీఎల్ ఐక్యూ స్మార్ట్ ఆటోమేషన్ ఒక అడ్వాన్స్డ్ వైర్లెస్ టెక్నాలజీ అని, దీని ద్వారా సెక్యూరిటీ, ఉష్ణోగ్రత, లైటింగ్, ఆడియో వంటి ఇతర హోమ్ కంట్రోల్ ఫంక్షన్లను ఒక టచ్‌తో నియంత్రించవచ్చని సంస్థ తెలిపింది. దీని ధర రూ.50,000 నుంచి ఉంటుందని పేర్కొంది. ఇక బీపీఎల్ ఐక్యూ స్మార్ట్ సర్విలెన్స్లోని పలు రకాల భద్రతా కెమెరాలు యూజర్ ఫ్రెండ్లీగా, టెక్నాలజీ పరంగా అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంటాయని తెలిపింది. వీటి ధర రూ.1,000 నుంచి ఉంటుందని పేర్కొంది. ‘ఆటోమేషన్ మార్కెట్ పరిమాణం రూ.600 కోట్లు ఉండొచ్చని, ఇందులో వచ్చే మూడేళ్లలో 20% వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నాం’ అని బీపీఎల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె.విజయ కుమార్ తెలిపారు. -
ఐటీ కొలువులకు ‘ఆటోమేషన్’ గండి!
తగ్గుతున్న నియామకాలు... * ఉత్పాదకత, ఆదాయం మెరుగు * వేతనాల పెంపు ఒత్తిడి తగ్గుతోంది * ఆటోమేషన్‌పై పెరుగుతున్న ఐటీ కంపెనీల ఆసక్తి ముంబై: ఆటోమేషన్ కారణంగా ఐటీ కంపెనీల్లో ఉద్యోగాలు తగ్గుతున్నాయి. ఆటోమేషన్ ద్వారా వినియోగిత రేట్లను పెంచుకోవడంపై ఐటీ కంపెనీలు దృష్టి పెడుతుండడం వల్ల ఐటీ రంగంలో కొత్త నియామకాలు తగ్గుతున్నాయని ముంబైకు చెందిన బ్రోకరేజ్ కంపెనీ సెంట్రమ్ బ్రోకింగ్ వెల్లడించింది. ఆటోమేషన్ వల్ల వేతనాల పెంపు ఒత్తిడి కూడా తగ్గుతుండటంతో పలు ఐటీ కంపెనీలు ఆటోమేషన్వైపే మొగ్గుచూపుతున్నాయని ఈ సంస్థ తాజా నివేదిక వివరించింది. ఈ విషయంలో దేశంలో సాఫ్ట్వేర్ సేవల ఎగుమతుల్లో అగ్రస్థానంలో ఉన్న ఐదు ఐటీ కంపెనీలు గత ఏడాది స్వల్ప సంఖ్యలోనే ఉద్యోగులను తీసుకున్నాయని పేర్కొంది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్, కాగ్నిజంట్-ఈ ఐదు కంపెనీలు కలిసి గత ఏడాది ఇచ్చిన నికర ఉద్యోగాల సంఖ్య 77,265 మాత్రమేనని వివరించింది. ఈ కంపెనీల్లోని మొత్తం ఉద్యోగులకు గత ఏడాది జత అయిన ఉద్యోగులు 24 శాతం తక్కువని పేర్కొంది. సెంట్రమ్ బ్రోకింగ్ వెల్లడించిన వివరాల ప్రకారం.., * చెన్నై కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న అమెరికా కంపెనీ కాగ్నిజంట్ కొత్త ఉద్యోగాలను బాగా తగ్గించింది. గత ఏడాది ఈ కంపెనీ 10,200 నికర ఉద్యోగాలను మాత్రమే ఇచ్చింది. 2014తో పోల్చితే ఈ కంపెనీ నికర ఉద్యోగాల సంఖ్య 75 శాతం తగ్గింది. * హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ విషయంలో ఈ క్షీణత 71 %గా ఉంది. టీసీఎస్‌లో ఈ క్షీణత 7%గా ఉంది. * అయితే ఈ కంపెనీలకు భిన్నంగా ఇన్ఫోసిస్ నికరంగా 23,745 మంది ఉద్యోగులను తీసుకుంది. జత అయిన ఉద్యోగుల శాతం 111 శాతంగా ఉంది. అయితే గత కొన్నేళ్లుగా ఈ కంపెనీలో ఆట్రీషన్(ఉద్యోగులు కంపెనీని వదిలివెళ్లడం) రేటు బాగా ఉండటంతో ఈ స్థాయిలో ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసుకుంది. * పలు ఐటీ కంపెనీలు ఆటోమేషన్‌పై ప్రధానంగా దృష్టిసారిస్తుండటంతో ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా నికర ఉద్యోగాల సంఖ్య తగ్గుతుంది. * పోటీ తీవ్రంగా ఉండటంతో ఆటోమేషన్ విస్తరణపై ఐటీ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి. ఆటోమేషన్ విస్తరణ కారణంగా వివిధ ప్రాజెక్టుల పనితీరు మెరుగుపడటంతో ఈ విధానాన్నే అవలంభించాలని కంపెనీలు భావిస్తున్నాయి. * ఆటోమేషన్ వినియోగం వల్ల ఈ కంపెనీల్లో ఒక్కో ఉద్యోగి ఆదాయ ఉత్పాదకత ఏడాదికి 45,000-50,000 డాలర్లుగా ఉంది. అంతర్జాతీయ ఐటీ కంపెనీలతో పోల్చితే ఇది చాలా తక్కువ. ఆటోమేషన్ వినియోగంతో దీనిని 2020 కల్లా 80,000 డాలర్లకు పెంచుకోవాలని ఇన్ఫీ యోచిస్తోంది. * పెద్ద ఐటీ కంపెనీలకు సొంత ఆటోమేషన్ ప్లాట్ఫార్మ్లున్నాయి. ఇన్ఫోసిస్‌కు ఇన్ఫోసిస్ ఆటోమేషన్ ప్లాట్ఫార్మ్, విప్రోకు హోమ్స్, హెచ్‌సీఎల్ టెక్కు డ్రై ఐస్, టీసీఎస్‌కు ఇగ్నియో పేరు తో ఈ ఆటోమేషన్ ప్లాట్ఫార్మ్లున్నాయి. అయినప్పటికీ పలు స్వతంత్ర కంపెనీలు ఆటోమేషన్ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. ఐపీ సాఫ్ట్, బ్లూ ప్రిజ్మ్, జెన్ఫోర్, ఆటోమేషన్ ఏనీవేర్ వాటిల్లో కొన్ని. -
భలే ఆప్స్
ఒత్తిడిని దూరం చేసే జెనీటైమ్... ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు గూగుల్ ప్లే స్టోర్‌లో అనేక అప్లికేషన్లు అందుబాటులో ఉన్నాయి. జెనీటైమ్ కూడా వీటిల్లో ఒకట అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. ఈ అప్లికేషన్ కొంచెం వెరైటీ. ఎలా అంటే... ముందుగా చెప్పాల్సింది ఇది ఒక సెన్సర్‌తో కలిసి పనిచేస్తుందని. ఊపిరి గట్టిగా తీసుకుంటూ, వదులుతూ ఉంటే ఆరోగ్యానికి మంచిదని మనం వింటూనే ఉంటాం. శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ ఎక్కువ మోతాదులో అందడం, గుండెకొట్టుకునే వేగంలో మార్పు వంటివి దీనికి కారణాలు. కానీ టైమ్ లేదనో.. ఇంకో కారణం చేతనో ఈరకమైన వ్యాయామం చేయము. ఈ కొరతను అధిగమించేందుకు ఉపయోగపడే అప్లికేషనే ఈ జెనీటైమ్. మీ ఊపిరి తీరుతెన్నులను గుర్తించేందుకు ఈ అప్లికేషన్‌తోపాటు రెస్పిరేట్ అనే ఓ పరికరం లభిస్తుంది. మీరు చేయాల్సిందల్లా మొబైల్ఫోన్తోపాటు వచ్చే గేమ్స్ ఆడటమే. కొవ్వొత్తులు ఆర్పటం, చెప్పిన దిశగా గట్టిగా గాలి ఊదడం ఇవీ గేమ్స్. వీటిద్వారానే అటు ప్రాణాయామానికి ప్రాణాయామం.., ఇటు వినోదమూ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. ఈ అప్లికేషన్‌ను, గేమ్స్‌ను తరచూ ఉపయోగించడం ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవడంతోపాటు గుండె ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవచ్చునని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతానికి ఈ అప్లికేషన్ ఆపిల్ ఐఫోన్‌తో మాత్రమే లభిస్తోంది. యాంగ్రీబర్డ్ స్టెల్లా.... స్మార్ట్ఫోన్లతో గేమ్స్ అడటం... అదీ యాంగ్రీబర్డ్ వంటి పాప్యులర్ గేమ్స్ ఆడటం చాలామందికి కాలక్షేపం. తాజాగా యాంగ్రీబర్డ్స్ స్టెల్లా పేరుతో మరో కొత్త గేమ్ అందుబాటులోకి వచ్చింది. దాదాపు 120 లెవెల్స్‌లో సాగే ఈ గేమ్‌లో స్టెల్లా దాని సహచర పక్షులతో గోల్డెన్ ఐలాండ్‌ను దుష్ట రాకుమారి ఆమె పందిపిల్లల నుంచి రక్షించాల్సి ఉంటుంది. స్టెల్లాతోపాటు దహలియా, పాపీ, విల్లో లూకాలు ఉంటాయి. ప్రతి పక్షికీ ప్రత్యేకమైన శక్తులు ఉంటాయి. స్లింగ్సాట్ ద్వారా రకరకాల విన్యాసాలు చేసేందుకు అవకాశముంటుంది. ఈ గేమ్‌లో ఉపయోగించే టెలిపాడ్ అనే అప్లికేషన్‌తో పనిచేసేందుకు కెమెరాను వాడాల్సి ఉంటుంది. కెమెరాతోపాటు, మైక్రోఫోన్‌ను కూడా ఉపయోగించేందుకు ఒకసారి రిక్వెస్ట్ వస్తుంది. చాలావరకూ యాంగ్రీబర్డ్స్ గేమ్స్ మాదిరిగానే ఇది కూడా ఆండ్రాయిడ్ ప్లే స్టోర్‌లో ఉచితంగానే లభిస్తుంది కానీ ఆట మధ్యలో కొన్ని ఆయుధాలు లేదా ఇతర పరికరాలను కొనాల్సి రావచ్చు. ఆటోమేషన్ కోసం మరో ఆప్... ఈమెయిల్ మొదలుకొని, వాయిస్ కాలింగ్ వరకూ స్మార్ట్‌ఫోన్‌తో మనం చేసుకునే అనేకానేక పనులను ఆటోమేట్ చేసేందుకు ఇప్పటికే అనేక అప్లికేషన్లు ఉన్నాయి. ఈ జాబితాలోకి తాజాగా చేరిన మరో అప్లికేషన్ ఆటోమేట్! పరిస్థితికి తగ్గట్టుగా సొంతంగా నిర్ణయాలు తీసుకుని అమలు చేయడం ఈ అప్లికేషన్కున్న ప్రత్యేకత. ఉదాహరణకు... స్మార్ట్‌ఫోన్ లాక్‌స్క్రీన్ ప్యాటర్న్‌ను తప్పుగా తీశారనుకుందాం. ఆ వెంటనే ఈ అప్లికేషన్ ఫ్రంట్ కెమెరాతో ఎదురుగా ఉన్న వ్యక్తి ఫొటో తీసేస్తుంది. లాక్ ఓపెన్ చేసిందెవరు? అని ప్రశ్నిస్తుంది. మీరే అయితే ఫర్వాలేదుగానీ... మీ ఫోన్‌ను ఇతరులెవరైనా ఉపయోగించినప్పుడు ఈ ఫీచర్ ఎంతో ఉపయోగపడుతుంది. ఫ్లో ఛార్ట్‌ల ఆధారంగా మీరు ఆటోమేటిక్‌గా చేయాలనుకుంటున్న పనులను నిర్ణయించుకోవచ్చు. మెయిల్ పంపడం, వైఫై సెట్టింగ్స్ మార్చుకోవడం వంటి పనులను ఈ అప్లికేషన్ ద్వారా చక్కబెట్టుకోవచ్చు. ఈ అప్లికేషన్‌కు కేవలం మనం ఏఏ ఆండ్రాయిడ్ అప్లికేషన్లను వాడుతున్నామో వాటి పర్మిషన్లు మాత్రమే ఇస్తే సరిపోతుంది. గూగుల్ ప్లే స్టోర్‌లో ఉచితంగా లభిస్తున్న ఈ అప్లికేషన్‌ను వాడి చూడండి మరి!. -
కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి
మెదక్: ‘‘కేసీఆర్ కళ్లు నెత్తికెక్కాయి...దిమాక్ మోకాల్లోకి వచ్చింది. రజాకార్ల పార్టీ మజ్లిస్ చేతిలో కీలుబొమ్మగా మారారు. కరెంట్ కోసం రోడ్డెక్కితే...రైతులను లాఠీ లతో కొట్టిస్తున్నారు. యూనివర్శిటీ విద్యార్థులు ఆందోళన చేపడితే...తిన్నదరగక ఉద్యమాలు చేస్తున్నారంటూ వెక్కిరిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించి కేసీఆర్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వండి’’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం మెదక్‌లో నిర్వహించిన బీజేపీ, టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించా రు. టీఆర్ఎస్ వంద రోజుల పాలనలో 60 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాసాయిపేట రైలు ప్రమాదంలో 18 మంది చిన్నారులు మరణించినా...ముఖ్యమంత్రికి పరామర్శించే సమయం లేకుండా పోయిందన్నారు. సమగ్ర సర్వే పేరుతో అర్హులైన వేలాది మంది లబ్ధిదారులను రోడ్డు పాలు చేస్తున్నారని ఆరోపించారు. మజ్లిస్‌కు భయపడి అభివృద్ధి నిధుల కోసం ప్రధానమంత్రి మోడిని కలవడం లేదన్నారు. మాటలు మార్చే కేసీఆర్‌కు షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలంటే ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి జగ్గారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. ఇక దింపుడు కల్లం కాడున్న కాంగ్రెస్‌కు ఓటేస్తే అది మురిగిపోతుందన్నారు. అనంతరం టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ మాట్లాడుతూ, ఉప ఎన్నికల్లో టీడీపీ, బీజేపీల ఉమ్మడి అభ్యర్థిని గెలిపిస్తే నెల రోజుల్లో రైతులకు నిరంతరంగా 8 గంటల విద్యుత్‌ను అందిస్తామన్నారు. రుణమాఫీ చేస్తామని చెప్పిన కేసీఆర్, పూటకో మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. గెలిపించండి..మంజీరా పారిస్తా ఎంపీ అభ్యర్థిగా తనను గెలిపిస్తే రూ.200 కోట్లతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి మంజీరా నీరు అందిస్తానని బీజేపీ ఎంపీ అభ్యర్థి జగ్గారెడ్డి తెలిపారు. ఈ ఎన్నికలను నియోజకవర్గ ప్రజలు ఛాలెంజ్‌గా తీసుకోవాలన్నారు. కేసీఆర్‌వి మాట లెక్కువ...పని తక్కువ అని ఎద్దేవా చేశారు. నియోజకవర్గంలోని బీజేపీ, టీడీపీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. తనను గెలిపిస్తే అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పారు. సమావేశంలో టీడీపీ, బీజేపీ రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఇంద్రసేనారెడ్డి, యెండల లక్ష్మినారాయణ, ఎ.కె.గంగాధర్, బట్టి జగపతి, డాక్టర్ సురేందర్, డాక్టర్ మురళీధర్‌గౌడ్, శశికళ యాదవరెడ్డి, కె.సత్యనారాయణ, మనోహర్‌రెడ్డి, గడ్డం శ్రీనివాస్, లక్ష్మినర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.