
ఆటోమేషన్... ఈ పదం జాబ్ మార్కెట్‌ను వణికిస్తోంది. ముఖ్యంగా టెక్ పరిశ్రమలో ఉద్యోగులకు గుబులు పుట్టిస్తోంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ విస్తరణతో చాలా కంపెనీలు ఆటోమేషన్ (automation) బాట పట్టాయి. దీంతో ఉద్యోగుల మనుగడకు ముప్పు ఏర్పడింది. తాజాగా ఇన్‌మోబి (InMobi) సంస్థ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నవీన్ తివారీ పిడుగులాంటి వార్త చెప్పారు.
వారికి ఉద్యోగాలు ఉండవు
ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో తమ సంస్థ 80 శాతం ఆటోమేషన్ ను సాధిస్తుందని, ఫలితంగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లకు (software engineers) ఉద్యోగాలు పోతాయని నవీన్ తివారీ వెల్లడించారు. 'మా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు వెళ్లిపోతారని అనుకుంటున్నాను. రెండేళ్లలో వారికి ఉద్యోగాలు ఉండవు' అని ప్రారంభ దశ ఇన్వెస్ట్ మెంట్ ప్లాట్ ఫామ్ లెట్స్ వెంచర్ నిర్వహించిన కార్యక్రమంలో తివారీ అన్నారు. ‘ఈ ఏడాది చివరి నాటికి సాఫ్ట్ వేర్ కోడింగ్ లో 80 శాతం ఆటోమేషన్ ను నా సీటీవో (చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ) అందిస్తారు. ఇప్పటికే 50 శాతం సాధించాం. యంత్రం సృష్టించిన కోడ్లు వేగంగా, మెరుగ్గా ఉంటాయి. అలాగే అవి తమను తాము సరిచేసుకోగలవు" అని ఆయన లెట్స్ వెంచర్ సీఈవో శాంతి మోహన్‌తో అన్నారు.

ఇన్‌మోబి సీఈవో నవీన్ తివారీ
మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి..
అత్యంత ప్రత్యేకమైన ఉద్యోగాలకు మొదట కృత్రిమ మేధ (ఏఐ) వస్తుందని, ఉద్యోగులు తమను తాము అప్ గ్రేడ్ చేసుకోవాలని తివారీ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని మీరు అప్ గ్రేడ్ చేసుకోండి, మిమ్మల్ని అప్ గ్రేడ్ చేయమని నన్ను అడగకండి. ఎందుకంటే ఇది మనుగడ. మీ కింద ప్రపంచం మారుతోంది' అని ఉద్యోగులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఇది చదివారా? ఐటీ కంపెనీ కొత్త రూల్.. పరీక్ష పాసైతేనే జీతం పెంపు
ఇన్‌మోబిలో రెండు కంపెనీలు ఉన్నాయి. ఒకటి ఇన్‌మోబి యాడ్స్. ఇది అడ్వర్‌టైజింగ్ టెక్నాలజీపై పనిచేసే బిజినెస్-టు-బిజినెస్ కంపెనీ. మరొకటి గ్లాన్స్. ఇది ఆండ్రాయిడ్ ఆధారిత స్మార్ట్ ఫోన్ ల కోసం రూపొందించిన స్మార్ట్ లాక్ స్క్రీన్ టెక్నాలజీ ప్లాట్ ఫామ్ ను అందించే కన్స్యూమర్ టెక్నాలజీ బిజినెస్-టు-కన్స్యూమర్ కంపెనీ. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా గ్లాన్స్ ఎనేబుల్డ్ స్మార్ట్‌ఫోన్ల కోసం జెన్ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి గూగుల్ క్లౌడ్‌తో తాజాగా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment