
ఏదో ముఖ్యమైన పనిలో బిజీగా ఉన్న సమయంలో వచ్చే స్పామ్ కాల్స్ చిరాకు తెప్పిస్తుంటాయి. ఇకపై అలాంటి కాల్స్‌తోపాటు ఫోన్‌లోని కాంటాక్ట్ లిస్ట్‌లో లేని కాల్స్‌కు సమాధానం ఇచ్చేలా హైదరాబాద్‌కు చెందిన స్టార్టప్ ‘ఈక్వల్ఏఐ’ కొత్తగా ఇంటెలిజెంట్ కాల్ అసిస్టెంట్‌ను రూపొందించింది. ఇది ఆయా కాల్స్‌ను గుర్తించి ఎదుటి వ్యక్తితో వాస్తవికంగా మాట్లాడి బ్రీఫ్‌గా అందులోని సారాంశాన్ని సందేశం రూపంలో యూజర్ ముందుంచుతుంది. దీన్ని అక్టోబర్ 2న న్యూదిల్లీలో ప్రారంభించనున్నట్లు కంపెనీ తెలిపింది.
భారతదేశంలో దాదాపు 100 కోట్ల స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఉన్నారు. 60% మంది భారతీయులు రోజుకు 3 కంటే ఎక్కువ స్పామ్ కాల్స్‌తో ఇబ్బంది పడుతున్నట్లు కొన్ని సర్వేలు చెబుతున్నాయి. ఇప్పటికే డునాట్ డిస్టర్బ్(DND) రిజిస్ట్రీలు, కాలర్ ఐడీ యాప్‌లు ఉన్నప్పటికీ స్పామ్ కాల్స్ పెరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో యూజర్లకు వీటి నుంచి ఉపశమనం కలిగించేలా ఈక్వల్ ఏఐ ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా కొత్తగా ఏఐ అసిస్టెంట్‌ను ప్రారంభించనుంది.
ట్రయల్ సక్సెస్
ఈక్వల్ ఏఐ టూల్ ట్రయల్స్ సమయంలో 87% అంతరాయాలను సమర్థంగా నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. పార్సిల్ డెలివరీలను సమన్వయం చేసుకోవడంలో యూజర్లు గడిపే సమయాన్ని 73% తగ్గించినట్లు పేర్కొంది. 94% స్పామ్ కాల్స్‌ను గుర్తించి అందుకు అనుగుణంగా స్పందించినట్లు తెలిపింది. అయితే కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్ అయిన నంబర్ల నుంచి వచ్చే కాల్స్‌కు ఇది సమాధానం ఇవ్వదని గమనించాలి.
డెలివరీ ఏజెంట్లతో మాట్లాడే క్రమంలో చిరునామాలు లేదా సూచనలు ఇస్తుంది.
లైవ్ కాల్ ట్రాన్‌స్క్రిప్ట్ అందిస్తుంది.
యూజర్ ఎప్పుడైనా నేరుగా కాల్‌కు సమాధానం ఇవ్వొచ్చు.
భారతీయ భాషలు, కాలర్ నమూనాలపై శిక్షణ పొందింది.
ప్రాథమికంగా ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఆండ్రాయిడ్ వినియోగదారులకు అక్టోబర్ 2, 2025 నుంచి ఈ సేవలు ప్రారంభం అవుతాయని కంపెనీ తెలిపింది. 2025 నాలుగో త్రైమాసికం నాటికి ముంబై, బెంగళూరు, హైదరాబాద్‌లకు ఈ సర్వీసులు విస్తరిస్తాయని పేర్కొంది.
ఇదీ చదవండి: యూఎస్ బెదిరించినా తగ్గేదేలే