హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్‌లో అసెంబ్లింగ్ యూనిట్, ఆర్‌అండ్‌డీ కేంద్రాలున్న అంతర్జాతీయ ఐవోటీ సంస్థ హోగర్ కంట్రోల్స్ తాజాగా కొత్త కేంద్రం ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. దీనితో ప్రత్యక్షంగా 50 పైగా ఉద్యోగాల కల్పన జరగగలదని సంస్థ సీఈవో విష్ణు రెడ్డి తెలిపారు.
హోమ్ ఆటోమేషన్ సంబంధ స్మార్ట్ డివైజ్‌ల తయారీ తదితర కార్యకలాపాలకు ఇది ఉపయోగపడనుందని వివరించారు. ప్రస్తుతం ఉప్పల్‌లోని తమ కేంద్రంలో .. 100 మంది పైచిలుకు ఉద్యోగులు ఉన్నారని చెప్పారు. దీని వార్షిక తయారీ సామర్థ్యం 6 లక్షల యూనిట్లని పేర్కొన్నారు.
2019లో హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించినప్పట్నుంచి సుమారు రూ. 100 కోట్లు ఇన్వెస్ట్ చేసినట్లు విష్ణు రెడ్డి వివరించారు. ప్రస్తుతం టర్నోవరు 2.5 మిలియన్ డాలర్లుగా ఉండగా దీన్ని రెట్టింపు స్థాయికి 5 మిలియన్ డాలర్లకు పెంచుకోనున్నట్లు చెప్పారు. హోమ్ ఆటోమేషన్ సంబంధ ప్రైమాప్లస్ స్మార్ట్ టచ్ ప్యానెల్ ఉత్పత్తుల శ్రేణిని ఈ సందర్భంగా ఆయన ఆవిష్కరించారు. సాధారణ లైట్లు, ఫ్యాన్లు మొదలైన వాటిని కూడా స్మార్ట్ ఉపకరణాలుగా మార్చేందుకు ఇది ఉపయోగపడగలదని విష్ణు రెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment