ప్రపంచంలో మనుషుల ఒంటరి తనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆరోగ్య ముప్పుకారకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.
అయితే ఈ ఒంటరితనం, ఆందోళన నుంచి బయట పడేందుకు భారతీయులు పెంపుడు జంతువుల్ని పెంచుతున్నారు. పెట్స్ కోసం భారతీయ కుటుంబాలు నెలవారీగా కనీసం రూ.3 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రూ.5 వేల వరకు పెట్స్ కోసం కేటాయిస్తున్నారని డ్రూల్ పెట్ ఫుడ్ సీఈఓ శశాంక్ సిన్హా తెలిపారు.
రూ.10వేల కోట్లుకు
ఫలితంగా దేశీయ పెట్ కేర్ రంగం ప్రస్తుత విలువ రూ.5వేల కోట్లుంటే.. 2028 నాటికి ఆ మొత్తం రూ.10వేల కోట్లుకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో 31 మిలియన్ల పెట్ డాగ్స్, 2.44 పెట్ క్యాట్స్‌తో పెంపుడు జంతువుల పాపులేషన్‌లో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది.
యజమానులం కాదు.. తల్లిదండ్రులం
పెంపుడు జంతువులను దత్తత తీసుకునే విషయంలో ధోరణి మారింది. జెన్‌జెడ్, మిలీనియల్స్ పెంపుడు జంతువులకు తమని తాము యజమానులం అనే భావన కాకుండా.. తల్లిదండ్రుల్లా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పెట్స్ ఆహారం, గ్రూమింగ్‌తో పాటు పెట్ కేఫ్‌లు, పెట్ ఇన్సూరెన్స్ ఇలా వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు.
16-18 శాతం వృద్ధితో
రాబోయే 5-6 సంవత్సరాల్లో పరిశ్రమ 16-18 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని మార్స్ పెట్‌కేర్ ఇండియా తెలిపింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి మాట్లాడుతూ.. ఓ ‘20 ఏళ్లు వెనక్కి వెళ్లండి. పెంపుడు జంతువులు ఇంటి బయట ఉండేవి. పరిస్థితులు మారాయి. ఇంట్లోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా బెడ్‌రూమ్‌లోకి ప్రవేశించాయి. కుటుంబంలో భాగమయ్యాయి. జంతుప్రేమికులు పెరిగారు. పెట్స్‌కు ఏం తినిపించాలి. ఎలాంటి ఆహారం అందించాలి. వాటికి అవసరమయ్యే వస్తువులు ఏమైనా ఉన్నాయని అడగడం ప్రారంభించారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment