PETs
-
హైదరాబాద్ : హైటెక్స్‌లో ముగిసిన పెటెక్స్ ఎక్స్పో (ఫొటోలు)
-
ఒంటరులవుతున్నారు... జంతువుల సాయం తీసుకుంటున్నారు!
ప్రపంచంలో మనుషుల ఒంటరి తనంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) హెచ్చరికలు జారీ చేసింది. ఇది ఆరోగ్య ముప్పుకారకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తుంది.అయితే ఈ ఒంటరితనం, ఆందోళన నుంచి బయట పడేందుకు భారతీయులు పెంపుడు జంతువుల్ని పెంచుతున్నారు. పెట్స్ కోసం భారతీయ కుటుంబాలు నెలవారీగా కనీసం రూ.3 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో రూ.5 వేల వరకు పెట్స్ కోసం కేటాయిస్తున్నారని డ్రూల్ పెట్ ఫుడ్ సీఈఓ శశాంక్ సిన్హా తెలిపారు. రూ.10వేల కోట్లుకుఫలితంగా దేశీయ పెట్ కేర్ రంగం ప్రస్తుత విలువ రూ.5వేల కోట్లుంటే.. 2028 నాటికి ఆ మొత్తం రూ.10వేల కోట్లుకు చేరుతుందని అంచనా. ప్రస్తుతం భారత్‌లో 31 మిలియన్ల పెట్ డాగ్స్, 2.44 పెట్ క్యాట్స్‌తో పెంపుడు జంతువుల పాపులేషన్లో భారత్ ఐదవ స్థానంలో నిలిచింది.యజమానులం కాదు.. తల్లిదండ్రులంపెంపుడు జంతువులను దత్తత తీసుకునే విషయంలో ధోరణి మారింది. జెన్‌జెడ్, మిలీనియల్స్ పెంపుడు జంతువులకు తమని తాము యజమానులం అనే భావన కాకుండా.. తల్లిదండ్రుల్లా ప్రత్యేకతను చాటుకుంటున్నారు. పెట్స్ ఆహారం, గ్రూమింగ్‌తో పాటు పెట్ కేఫ్‌లు, పెట్ ఇన్సూరెన్స్ ఇలా వాటి సంరక్షణ కోసం ఖర్చు చేసేందుకు ఏమాత్రం వెనకాడటం లేదని నెస్లే ఇండియా ప్రతినిధి తెలిపారు.16-18 శాతం వృద్ధితోరాబోయే 5-6 సంవత్సరాల్లో పరిశ్రమ 16-18 శాతం వృద్ధి చెందే అవకాశం ఉందని మార్స్ పెట్‌కేర్ ఇండియా తెలిపింది. ఈ సందర్భంగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ సలీల్ మూర్తి మాట్లాడుతూ.. ఓ ‘20 ఏళ్లు వెనక్కి వెళ్లండి. పెంపుడు జంతువులు ఇంటి బయట ఉండేవి. పరిస్థితులు మారాయి. ఇంట్లోకి వచ్చాయి. కోవిడ్ కారణంగా బెడ్రూమ్లోకి ప్రవేశించాయి. కుటుంబంలో భాగమయ్యాయి. జంతుప్రేమికులు పెరిగారు. పెట్స్‌కు ఏం తినిపించాలి. ఎలాంటి ఆహారం అందించాలి. వాటికి అవసరమయ్యే వస్తువులు ఏమైనా ఉన్నాయని అడగడం ప్రారంభించారని తెలిపారు. -
ప్రియుడితో కలిసి పెట్స్ బర్త్‌డే సెలబ్రేట్ చేసిన వరలక్ష్మి (ఫోటోలు)
-
‘కుక్కలకూ’ ఓ కంపార్ట్మెంట్
సాక్షి, హైదరాబాద్: రైల్వే వ్యవస్థ దశ మార్చే రైళ్లుగా పేర్కొంటున్న వందేభారత్ రైళ్లను మరింత అప్‌గ్రేడ్ చేసేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. తదుపరి వెర్షన్‌గా రాబోతున్న వందేభారత్ స్లీపర్ రైళ్లలో పెంపుడు జంతువుల కంపార్ట్మెంట్ను చేరుస్తుండటం విశేషం. రైలులో ప్రయాణం చేసేవారు వెంట పెంపుడు జంతువులను కూడా తీసుకెళ్లేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేస్తున్నారు. 16 కోచ్‌లతో ఉండబోయే ఈ రైలులో ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కోసం కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. మరో ఆరు నెలల్లో ఈ రైళ్లు పట్టాలెక్కే అవకాశం ఉంది. వాటి ఇంటీరియర్, ఎక్ట్సీరియర్‌లను అధికారికంగా రైల్వే శాఖ ఇప్పటికే విడుదల చేసి ప్రజల్లో ఆసక్తి పెంచడం తెలిసిందే. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. దూర ప్రయాణాలు చేసే వారు ఇంటికి తాళం వేసి వెళ్లాల్సి వస్తే పెంపుడు జంతువులను కూడా వెంట తీసుకెళ్తుంటారు. పిల్లులు, కుక్కలు సహా ఇతర పెంపుడు జంతువులను రైళ్లలో తీసుకెళ్లటం ప్రస్తుతం చాలా ఇబ్బందిగా మారింది. లగేజీ కంపార్ట్మెంట్లో వాటిని తీసుకెళ్లేందుకు కొన్ని సందర్భాల్లో అనుమతిస్తున్నా.. వాటిల్లో సరైన వ్యవస్థ ఉండటం లేదు. కొన్ని చోట్ల బుకింగ్ చేసుకునేందుకు సిబ్బంది నిరాకరిస్తున్నారు. ప్రయాణికుల కోచ్‌లలో వాటిని తరలించాలంటే, వాటిల్లోని ఇతర ప్రయాణికుల నుంచి అనుమతి తీసుకోవాల్సి వస్తోంది. అందరి అంగీకారం లభించటం అసాధ్యంగా ఉంటోంది. జంతు ప్రేమికుల విజ్ఞప్తితో.. ఈ నేపథ్యంలో చాలా కాలంగా జంతు ప్రేమికుల నుంచి రైల్వేకు విన్నపాలు వస్తున్నాయి. ఇంతకాలం ఆ దిశగా దృష్టి సారించని అధికారులు ఇప్పుడు వందేభారత్ స్లీపర్ రైళ్లలో అందుకు అవకాశం కల్పించాలని నిర్ణయించారు. లగేజీ కంపార్ట్మెంట్ పక్కన ప్రత్యేకంగా పెంపుడు జంతువుల కంపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో జంతువులను ఉంచేందుకు ప్రత్యేకంగా ర్యాక్స్ ఉంటాయి. అక్కడ వాటి పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బంది కూడా ఉంటారు. ప్రయాణికుల కోచ్‌లతో ఈ కంపార్ట్‌మెంట్‌కు ప్రత్యేక కమ్యూనికేషన్ వ్యవస్థ కూడా ఉంటుంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ రైళ్లు రూపొందుతున్నాయి. వచ్చే మార్చి నాటికి తొలి రైలు అందుబాటులోకి రానుంది. ఇక్కడ తొలుత పది రైళ్లు రూపొందిస్తారు. ఆ తర్వాత రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌తో కలిసి రష్యాకు చెందిన కీనెట్ రైల్వే సొల్యూషన్స్ 120 రైళ్లను తయారు చేయనుంది. లాతూరులోని కోచ్ ఫ్యాక్టరీలో ఇవి తయారవుతాయి. -
కనీసం రూ.100 అయినా ఇవ్వండి.. రేణు దేశాయ్ పోస్ట్ వైరల్
‘బద్రి’చిత్రంతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయం అయింది నటి రేణూ దేశాయ్. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత జానీ(2003) చిత్రంలో నటించి, పవన్‌తో ప్రేమలో పడింది. కొన్నాళ్లు డేటింగ్ చేసిన తర్వాత 2009లో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. 2012లో ఇద్దరు విడిపోయారు. ప్రస్తుతం కొడుకు అకీరా, కూతురు ఆద్యతో కలిసి ఉంటుంది రేణూ. పిల్లల కోసం సినిమాలను దూరం పెట్టింది. దాదాపు రెండు దశాబ్దాల తర్వాత ‘టైగర్ నాగేశ్వరరావు’తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. రవితేజ హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె సంఘ సంస్కర్త హేమలత లవణం పాత్రను పోషించి, తనదైన నటనతో మెప్పించింది. మంచి పాత్రలు లభిస్తే..ఇకపై సినిమాల్లో నటిస్తానని కూడా చెప్పింది. దీంతో టాలీవుడ్‌కు చెందిన పలువురు దర్శకులు రేణూ దేశాయ్‌కి కథలు వినిపించేందుకు సిద్ధమవుతున్నారు. ఇలా సినిమాల పరంగా కాస్త దూరమైనా.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో టచ్‌లోనే ఉంటుంది రేణూ దేశాయ్. మంచి పనులను చేయడానికే సోషల్ మీడియాను వాడుతుంటారు. తాజాగా రేణూ తన ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అవుతుంది. నా వంతుగా రూ.30 వేలు ఇచ్చా రేణూ దేశాయ్‌కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టం. తను పెట్స్‌తో పాటు పిల్లులను కూడా పెంచుకుంటుంది. వాటికి ఆరోగ్య సమస్యలు వస్తే.. తట్టుకోలేదు. అంతేకాదు పెంపుడు జంతువుల కోసం విరాళాలు ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. తాజాగా ఓ మూడు కుక్కలకు ఆపరేషన్ చేయించేందుకు ఓ సంస్థ విరాళాలు అడుగుతోంది. ఆపరేషన్‌కి మొత్తం రూ.55 వేల వరకు ఖర్చు అవుతుందట. ఈ విషయం రేణూ దేశాయ్ దృష్టికి వెళ్లింది. దీంతో తన వంతుగా రూ.30 వేలు విరాళం ఇచ్చి.. మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరంటూ.. తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ‘నేను రూ.30 వేలు సర్దాను. దయచేసిన మిగతా డబ్బును ఎవరైనా పంపించగలరు. కనీసం ఒక్కొక్కరు రూ. 100 పంపించినా చాలు’ అని రేణూ దేశాయ్ తన ఫాలోవర్స్‌కి విజ్ఞప్తి చేసింది. -
ఇదిగో సారూ... నా మేక టికెటు
గ్రామీణ ప్రాంతాల్లో పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా చూసుకుంటారు. పేర్లు పెట్టి ప్రేమగా పిలుచుకుంటారు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఒక మహిళ మేకను పెంచుకుంటుంది. ఒకరోజు ఆమె వేరే ఊరికి పోవాల్సి వచ్చింది. మేకను ఇంట్లో ఒంటరిగా విడిచిపెట్టడం ఇష్టం లేక తనతో పాటు తీసుకెళ్లింది. విశేషం ఏమిటంటే మేకకు కూడా ట్రైన్ టికెట్ తీసుకుంది. ఐఏఎస్ అధికారి అవినాష్ శరణ్ ట్విట్టర్లో పోస్ట్ చేసిన ఈ వీడియో క్లిప్ వైరల్ అయింది. ‘తన మేకకు కూడా టికెట్ తీసుకున్న విషయాన్ని టీటీయితో ఎంత గర్వంగా చెబుతుందో చూడండి’ అని రాశారు అవినాష్. ఇక వీడియో క్లిప్ విషయానికి వస్తే... టికెట్ చూపించమని ఆమెను టీటీయి అడుగుతాడు. ‘ఇదిగో’ అంటూ చూపిస్తుంది. ‘నీ సంగతి సరే, మరి మేకకు టికెట్ తీసుకున్నావా?’ అని సరదాగా అడుగుతాడు టీటీయి. ‘అమ్మో...తీసుకోకుండా ఎలా ఉంటాను. ఇదిగో టిక్కెట్టు’ అని చూపిస్తుంది. ‘నేను తరచుగా రైల్లో ప్రయాణిస్తుంటాను. టికెట్ లేకుండా ట్రైన్లో ప్రయాణించి టీటీయికి దొరికి పోయేవారిని చాలామందిని చూస్తుంటాను. వారిని గుర్తు తెచ్చుకున్నప్పుడు ఈమె చాలా గొప్పగా అనిపిస్తుంది’ అని ఒక యూజర్ స్పందించాడు. -
‘పాపం..చేప! నా బాధ వారికే తెలుస్తుంది’ ఎయిరిండియాపై పెట్ లవర్ ఫిర్యాదు వైరల్
బెంగళూరు: టాటా యాజమాన్యంలోని ఎయిరిండియాపై ఒక వ్యక్తి ఫిర్యాదు వార్తల్లో నిలిచింది. నా పెంపుడు ఫిష్‌ను విమానంలో తీసుకెళ్లనీయ లేదంటూ బెంగళూరుకు చెందిన హుస్సేన్ ఫిర్యాదు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించిన వివరాలను స్వయంగా హుస్సేన్ ట్విటర్లో షేర్ చేశారు. దీంతో ఈ చేప కథ వైరల్‌గా మారింది. డిజిటల్ మార్కెటర్ అకిబ్ హుస్సేన్ బెంగళూరు నుండి శ్రీనగర్‌కు ఎయిరిండియా విమానంలో బయలుదేరారు. అత్యవసర విమానంలో హుస్సేన్ తన తల్లిని చూడటానికి వెళుతున్నారు. అయితే తనతోపాటు పెట్ ఫిష్ కంటైనర్‌ను తీసుకెళ్లడంపై సిబ్బంది అభ్యంతరం చెప్పారు. అందులోని నీరు పరిమితికి మించి ఉందంటూ దాన్ని క్యారీచేసేందుకు అనుమతినివ్వలేదు ఎయిర్‌లైన్. దీంతో తన లైఫ్‌లో ఇదో ‘‘చెత్త అనుభవం’’ అంటూ ఎయిరిండియా, టాటా సన్స్ ఎమెరిటస్ ఛైర్మన్ రతన్ టాటాలను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. (ఇండియన్ టెకీలకు గిట్‌హబ్ షాక్: టీం మొత్తానికి ఉద్వాసన) ఈ వివరాలను వరుస ట్వీట్లలో షేర్ చేసిన హుస్సేన్ “ఒక పెట్ లవర్ బాధ మరో పెట్ లవర్‌కు మాత్రమే అర్థం అవుతుంది. కేవలం 50 గా బరువున్న ట్రాన్స్పరెంట్ కంటైనర్‌లో లైవ్ అక్వేరియం తీసుకెళ్లేందుకు బెంగళూరుకు చెందిన ఫ్లైట్ గ్రౌండ్ స్టాఫ్, ఫ్లైట్ ఎక్కనీయలేదు. క్యారీరింగ్ ఛార్జీగా రూ.1,350 జరిమానా చెల్లించేందుకు సిద్ధపడినా అంగీకరించలేదు. దీనిపై చర్య తీసుకొనేది ఎవరంటూ వాపోయాడు. సంవత్సరం పాటు కలిసి బతికాం.. కానీ ఎయిరిండియా కారణంగా బలవంతంగా విమానాశ్రయంలో వదిలివేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. మరోవైపు ఎయిర్‌పోర్ట్‌లో వదిలివేసిన హుస్సేన్ పెంపుడు చేపను ఎయిర్‌లైన్ ఉద్యోగులు బెంగళూరులోని అతని బంధువుకు సురక్షితంగా అప్పగించారుట. (Disney Layoffs: మరో నాలుగు రోజులే, ఉద్యోగులకు ఈమెయిల్ బాంబు!) Pain for loosing a pet after spending 1 year together. Who is gonna take action on this @RNTata2000 Sir ? @airindiain @DGCAIndia @ministry_ca @AviationIndia2 — Aqib Hussain (@askaqibhussain) March 21, 2023 -
లైఫ్ స్టయిల్ పాలసీలకు అయిదు కారణాలు
అలవాట్లు, అభిరుచులు, ఇష్టాఇష్టాలను బట్టి ప్రతి ఒక్కరికీ ఒకో జీవన విధానం...అంటే లైఫ్ స్టయిల్ ఉంటుంది. విలువైనదిగా పరిగణించే లైఫ్ స్టయిల్‌ను కాపాడుకునేందుకు అంతా ప్రయత్నిస్తుంటాము. బీమా సాధనం దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు ఇష్టపడేవి చేజారకుండా నివారించలేకపోయినా.. అలాంటి సందర్భాల్లో వాటిల్లే నష్టాన్ని ఎంతో కొంత మేర భర్తీ చేసుకునేందుకు ఇది ఉపయోగకరంగా ఉండగలదు. మిగతా పాలసీలకు భిన్నమైన లైఫ్ స్టయిల్ బీమాను ఎంచుకోవడానికి ప్రధానంగా అయిదు కారణాలు ఉన్నాయి. ► మానసిక, శారీరక ఆరోగ్యానికి రక్షణ కోసం: ఒత్తిళ్లు, ఆందోళనలతో కూడుకున్న ప్రస్తుత ప్రపంచంలో శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్నీ కాపాడుకోవడం చాలా కీలకంగా ఉంటోంది. సమగ్రమైన హెల్త్ ఇన్సూరెన్స్ ఇందుకు సహాయపడుతుంది. ప్రస్తుతం టెలీ కౌన్సిలింగ్, మానసిక.. శారీరక ఆరోగ్యంపై వెబినార్లు, వెల్నెస్ సెంటర్స్ .. డయాగ్నాస్టిక్ సెంటర్లకు వోచర్లు, తరచూ హెల్త్ చెకప్‌లు మొదలైన వాటికి కూడా బీమా కంపెనీలు కవరేజీనిస్తున్నాయి. ఆరోగ్యకరమైన జీవన విధానాలు పాటిస్తే రెన్యువల్ సమయంలో ప్రీమియంపై డిస్కౌంట్లు, రివార్డ్ పాయింట్లు కూడా ఇస్తున్నాయి. ► సైబర్ క్రైమ్ నుంచి రక్షణ కోసం: కరోనా మహమ్మారి ప్రబలినప్పటి నుంచి సైబర్ నేరాలు కూడా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో ఆన్లైన్ మోసగాళ్ల వల్ల వాటిల్లే నష్టాల నుంచి వ్యక్తిగత సైబర్ రిస్క్ పాలసీలు కాపాడగలవు. వ్యక్తిగత డేటా లేదా ప్రైవసీకి భంగం కలగడం, ఈ–మెయిల్ ఫిషింగ్, మొదలైన వాటి నుంచి రక్షణనివ్వగలవు. ► రిస్కీ క్రీడల్లో గాయాల బారిన పడితే రక్షణ: మీకు ఎంతో ఇష్టమైన క్రీడలు ఆడేటప్పుడు గాయాలబారిన పడితే రక్షణ కల్పించే విధమైన పాలసీలు ఉన్నాయి. అడ్వెంచర్ స్పోర్ట్స్, ఎన్డ్యురెన్స్ స్పోర్ట్స్ వంటి రిస్కీ హాబీలు ఉన్న వారికీ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ కవరేజీని బీమా కంపెనీలు ఇస్తున్నాయి. క్రీడలపరంగా వివిధ రకాల గాయాలకు చికిత్స, ఫిజియోథెరపీ మొదలుకుని ప్రమాదవశాత్తూ ఏదైనా అనుకోనిది జరిగితే యాక్సిడెంటల్ డెత్ కవరేజీ వరకూ పలు అంశాలకు కవరేజీ ఉంటోంది. ప్రమాదాల బారిన పడినప్పుడు తలెత్తే వైద్య ఖర్చులు, విరిగిన ఎముకలకు చికిత్స వ్యయాలు, సాహస క్రీడలపరమైన బెనిఫిట్, ఎయిర్ అంబులెన్స్ కవరేజీ లాంటివి అదనంగా తీసుకోవచ్చు. ► పెంపుడు జంతువులకు బీమా: జంతువులను పెంచుకోవడమంటే చాలా బాధ్యతతోను, ఖర్చుతోనూ కూడుకున్న వ్యవహారం. వాటి ఆరోగ్యాన్ని సంరక్షిస్తూ ఉండాలి. వెటర్నరీ ఫీజులు, వైద్యం ఖర్చులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో సమగ్రమైన పెట్ కవరేజీ ఉంటే శస్త్రచికిత్సలు .. హాస్పిటలైజేషన్ వ్యయాలు, థర్డ్ పార్టీ లయబిలిటీ మొదలైన భారాలను తగ్గించుకోవచ్చు. ► వివాహ శుభకార్యానికీ కవరేజీ: ప్రస్తుతం పెళ్లిళ్లంటే చాలా ఖర్చుతో కూడుకున్నవిగా మారిపోయాయి. అనుకోనిది ఏదైనా జరిగితే చేసిన ఖర్చంతా వృధాగా పోయే రిస్కులు ఉంటు న్నాయి. అయితే, వెడ్డింగ్ ఇన్సూరెన్స్‌తో పెళ్లిళ్లలో ఏదైనా ప్రమాదాలు చోటు చేసుకున్నా, విలువైనవి పోయినా కవరేజీని పొందవచ్చు. అంతే కాదు, ఊహించని పరిస్థితుల వల్ల వివాహం రద్దయినా లేదా వాయిదా పడినా అప్పటి వరకూ చేసిన ఖర్చులను నష్టపోకుండా లైఫ్‌స్టయిల్ కవరేజీ కాపాడుతుంది. -
కుక్కల కోసం ప్రత్యేక రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
శునకాలు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. చాలా ఇళ్లలో అవి కూడా సభ్యులుగా ఉంటున్నాయి. వివిధ రకాల జాతుల శునకాలను వేలు.. లక్షల రూపాయలు పెట్టి మరీ కొని ప్రేమగా పెంచుకుంటున్నారు. వాటి పోషణ, సంరక్షణ కోసం ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు డాగ్ లవర్స్. ఈ క్రమంలోనే కుక్కల కోసం ప్రత్యేకమైన స్పాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. డాగ్ లవర్స్ తమ పెంపుడు శునకాలను తమతో పాటు హోటళ్లకు, రెస్టారెంట్లకు తీసుకెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే వాటికి అక్కడ అనువైన వాతావరణం ఉండదు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శునకాల కోసమే ప్రత్యేకంగా ‘డాగీ దాబా’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇక్కడ కుక్కల కోసం చాలా రకాల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు లభిస్తాయి. రూ.7 నుంచి రూ.500 వరకు శునకాలకు ఇష్టమైన ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కుక్కల పుట్టినరోజులను జరుపుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకమైన కేక్‌లు ఇక్కడ తయారు చేస్తున్నారు. కుక్కలు ఆడుకునేందుకు, విహారం చేసేందుకు అనువైన ఏర్పాట్లు సైతం చేశారు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) బాలరాజ్ ఝాలా అనే వ్యక్తి అతని భార్య కలిసి ఈ డాగీ దాబాను ఏర్పాటు చేశారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. తాను హోటల్లో పనిచేస్తున్న సమయంలో రోజూ ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కలకు ఆహారం వేసేవాడినని, ఈ సమయంలోనే కుక్కలకు మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు బాలరాజ్ వివరించారు. -
ముద్దుల పెట్‌కు గ్లామర్...
సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో గ్లామర్ మేనియా ఇంట్లో వారికే కాదు.. వాళ్ల పెంపుడు జంతువులకూ ముఖ్యమైపోయింది. ముద్దొచ్చే తమ పెట్స్‌ను మరింత అందంగా చూడాలనుకుంటున్న యజమానులు ఇందుకోసం ఎంతయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పెంపుడు జంతువులను ముస్తాబు చేసే సంస్థలు హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. మసాజ్, గోళ్ల కత్తిరింపు, బబుల్ బాత్ వంటి సేవలను పెంపుడు జంతువులకు అందిస్తున్నాయి. తరలి వచ్చె తళుకులద్దగ... గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని హైదరాబాద్‌లో కొన్ని సంస్థలు మాత్రమే అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెంపుడు జంతువులను గ్రూమింగ్ పార్లర్స్‌కు తీసుకెళ్లలేక నగరవాసులు పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్‌కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు డజనుకుపైగా మొబైల్ వ్యాన్లు పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నారు. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నామని మొబైల్ పార్లర్ల నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు గంట పడుతుందని... బొచ్చు కుక్కలకు మాత్రం 90 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. అలాగే పిల్లులను పెంచుకొనే వారికి కూడా సేవలు అందిస్తున్నామని వివరిస్తున్నారు. పెట్‌ను ఫంక్షన్ లేదా ఫోటోషూట్‌కు తీసుకెళ్లాల్సి వస్తే అందుకు తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్‌ను సెట్ చేయడం కూడా చేస్తామని చెబుతున్నారు. వెటర్నరీ డిప్లొమా వారినే తీసుకున్నాం... మా మొబైల్ సెలూన్లలో పనిచేసే గ్రూమర్లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారికి 3 నెలలపాటు శిక్షణ సైతం అందిస్తున్నాం. – జస్ట్ గ్రూమ్ నిర్వాహకురాలు చైత్ర వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే.. శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం మన వల్ల సాధ్యం కాదు. ఫలితంగా పెట్స్‌కు చర్మవ్యా« దుల వంటివి రావచ్చు. అందుకే నా పెట్‌కి నెలకో సారి స్పాలో స్నానం, 3 నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. సగటున దాని శుభ్రతకు నెలవారీగా రూ. 3 వేలు ఖర్చు పెడుతున్నా. అయితే పెట్స్‌కు వ్యాధులు సోకితే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. పెట్ మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది. – పరిమళ, సికింద్రాబాద్ -
హైదరాబాద్ : హైటెక్స్‌లో పెటెక్స్–2023 ప్రదర్శన (ఫొటోలు)
-
పెటెక్స్..అదుర్స్
మాదాపూర్: వివిధ దేశాలు...50 విభిన్న జాతులకు చెందిన 500 శునకాలు.. 700 రకాల చేపలు...క్యాట్ షో...అంతర్జాతీయ న్యాయనిర్ణేతలు...నగరంలో మొదటిసారిగా ఏర్పాటైన పెటెక్స్–2023 ప్రత్యేకతలివీ. మాదాపూర్‌లోని హైటెక్స్‌లో శుక్రవారం ఈ ప్రదర్శన ప్రారంభమైంది. ఎనిమిది మంది అంతర్జాతీయ నిపుణులు పోటీల్లో న్యాయనిర్ణేతలుగా పాలుపంచుకుంటున్నారు. ఇక ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ సంస్థ క్యాట్ షోను నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న పెంపుడు జంతువుల సంరక్షణ పరిశ్రమలో భారత్ ఒకటి అని హైటెక్స్ బిజినెస్ హెడ్ టీజీ శ్రీకాంత్ తెలిపారు. పెంపుడు జంతువుల ప్రాముఖ్యతను వివరించేందుకే ప్రదర్శన ఏర్పాటు చేశారని వెల్లడించారు. ఆకట్టుకుంటున్న 700 రకాల చేపలు హైటెక్స్‌లో పెటెక్స్లో భాగంగా ఆక్వా జోన్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో 700 రకాల చేపలు ప్రదర్శనలో ఉంచారు. చేపలను పెంచేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్లాంటెడ్ అక్వేరియమ్, మాన్స్స్టార్, సెమీ అగ్రెసివ్ అక్వేరియమ్లను అందుబాటులో ఉంచారు. ఈ ప్రదర్శనలో సిల్వర్ డెరోడో చేప ప్రత్యేకంగా నిలుస్తుంది. దీని ధర రూ.3.50 లక్షల రూపాయలు. దీని ప్రత్యేకత..నీటిలో 12 అడుగుల లోతులో గంటకి 1600 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో చివరి రోజు రెడ్‌చిల్లీ అర్వాన చేపను సందర్శకులు తిలకించేందుకు తీసుకువస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. దీని ధర. రూ.42 లక్షలు. దీని ప్రత్యేకత..నెగటివ్ ఎనర్జీని తీసివేస్తుందని, అందంగా ఉంటుందని, ఇంట్లో ఉంటో వాస్తుపరంగా బాగుంటుందని జపనీయుల నమ్మకం. ఆకట్టుకుంటున్న 120 రకాల పిల్లులు ప్రదర్శనలో దాదాపు 120 రకాల పిల్లులను ఉంచారు. కొన్ని రకాల పిల్లులు చూడడానికి పులులుగా ఉన్నాయి. ఇందులో బెంగాల్ క్యాట్, ట్రెడిషనల్ లాంగ్ హేయిర్, హిమాలయన్, బ్రీటీస్ సార్ట్ హేయిర్, ఎక్సోటిక్ సార్ట్ హెయిర్, మెన్కున్ లాంటి బ్రీడ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. వీటి ధర రూ. 50 వేల నుండి రూ.3 లక్షల వరకు ఉన్నాయి. పక్షులు సైతం.. ఆస్ట్రేలియాకు చెందిన మోలుకన్ కొకాటో పక్షి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వీటి ధర రూ.50 నుండి ప్రారంభం. నెల ఖర్చు రూ.5 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. గృహాలలో పెంచుకునేందుకు ఎక్కువ మంది ఇష్టపడతారని నిర్వాహకులు తెలిపారు. వీటితో పాటు బ్లూగోల్డ్ మకావ్, రామచిలుకలు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రోజు అందంగా తయారు చేస్తా.. నా దగ్గర ఉన్న చిన్న డాగ్ షెడ్జి. దీని ధర రూ.28 వేలు. దీనికి నెలఖర్చు రూ.10 వేల వరకు అవుతాయి. ప్రతి నెల డాక్టర్ వద్ద చెకప్ చేయిస్తా. ఒకరిని విడిచి ఒకరం ఉండలేనంత ప్రేమగా చూసుకుంటాను. ప్రతి రోజు అందంగా తయారు చేస్తాను. – రమన్, జుంతుప్రేమికురాలు కుక్కలకు రక్తం అవసరం ప్రమాదాలు వాటిల్లినప్పుడు మనుషులకు రక్తం ఎలా అవసరం ఉంటుందో కుక్కలకూ అలాగే అవసరం. ఎక్కువ రక్తస్రావం అయినప్పుడు, సర్జరీలు చేసేటప్పుడు, రక్తం మార్చవలసిన పరిస్థితి కలిగినప్పుడు మాకు సమాచారం అందిస్తే సంబంధించిన ఇతర కుక్కలను తీసుకువచ్చి రక్తాన్ని ఇస్తాం. – కౌశిక్, జంతుప్రేమికుడు కేరింగ్ తీసుకోవాలి పెంపుడు జంతువులను పెంచాలనే కోరిక, ఆసక్తి ఉన్నప్పుడే వాటిని పెంచగలం, పెండుపు జంతువులను పెంచేవారు డాక్టర్ల సలహాలను, నిపుణులతో సంప్రదించాలి. వాటికి కావాల్సిన ఆహారాన్ని తగినంత మొతాదులో పెట్టాలి. వాటిని ఎప్పుడూ గమనిస్తూ ఉండాలి. – గణేశ్, వెటర్నరీ డాక్టర్ ఫ్యామిలీలో ఒకరిగా చూస్తాం.. బ్లాక్ల్యాబ్రో డాగ్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకే పెంచుతున్నా. కుటుంబంలో ఒకరిగా చూసుకుంటాం. మా ఫ్రెండ్స్ సైతం చూడడానికి ఇంటికి వస్తారు. దీని ధర రూ.20 వేల నుండి ప్రారంభం అవుతుంది. దీనికి నెల ఖర్చు రూ.6 వేల నుండి 8 వేల వరకు ఉంటుంది. – జాగృతి, జంతు ప్రేమికురాలు -
స్మార్ట్ పెట్డ్రైయర్..కుక్క పిల్లలు దర్జాగా కూర్చోవచ్చు!
పిల్లులను, కుక్కలను పెంచుకోవడం చాలామందికి సరదా. అయితే, వాటిని పెంచుకోవడం అంత తేలికైన పని కాదు. వేళకు వాటికి అన్ని సేవలూ చెయ్యాలి. ముఖ్యంగా వాటికి స్నానం చేయించడం పెద్ద ప్రహసనమే! స్నానం చేయించాక, వాటిని తువ్వాలుతో తుడిచేస్తే తేలికగా ఆరిపోవు. ఒంటినిండా రోమాలతో ఉండే పెంపుడు జంతువులను స్నానం తర్వాత పొడిగా తయారు చేయడానికి కొందరు సాధారణ హెయిర్ డ్రైయర్లను వాడుతున్నారు. హెయిర్ డ్రైయర్ల నుంచి వెలువడే శబ్దానికి పెంపుడు జంతువులు బెదిరిపోతాయి. ముద్దుగా పెంచుకునే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు ఎలాంటి సమస్య లేనివిధంగా ఉపయోగపడే స్మార్ట్ పెట్డ్రైయర్ అందుబాటులోకి వచ్చింది. ఘనాకారంలో డబ్బా మాదిరిగా ఉండే ఈ డ్రైయర్‌లో పిల్లులు, కుక్కపిల్లలు సుఖంగా కూర్చునేందుకు తగిన చోటు ఉంటుంది. ఇందులో అన్ని వైపుల నుంచి వెలువడే వెచ్చని గాలికి అవి ఇట్టే పొడారిపోతాయి. ‘డ్రైబో ప్లస్’ పేరిట దొరుకుతున్న ఈ స్మార్ట్ పెట్డ్రైయర్ ధర సైజును బట్టి 599–749 డాలర్లు (సుమారు రూ.50 వేల నుంచి 62 వేలు) ఉంటుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. -
‘డీసీ లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్’ రిలీజ్ డేట్ వచ్చేసింది, ఎప్పుడంటే..
ప్రముఖ హాలీవుడ్ సంస్థ వార్నర్ బ్రదర్స్ నుంచి డీసీ లీగ్ ఆఫ్ సూపర్ పెట్స్ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ రచయిత/కన్సల్టెంట్ జారెడ్ స్టెర్న్ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాలో ప్రధాన క్యారెక్టర్ కృప్తో ది సూపర్ డాగ్‌కి మాటలు అందించినది కూడా ఈ చిత్ర ప్రొడ్యుసర్ ద్వేన్ జాన్సన్ అవటం విశేషం. ద్వేన్ జాన్సన్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. సూపర్ హీరోల పెంపుడు జంతువుల గురించి సినిమాలో ఇంతకు ముందెన్నడూ సినీ చరిత్రలో చూడలేదన్నారు. అసలు సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్, వండర్ ఉమెన్ లాంటి సూపర్ హీరోలకి ఎలాంటి పెట్స్ ఉంటాయనే ఆలోచన వినగానే నేను ఏ సంకోచం లేకుండా గట్టి నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు. -
భూగోళమంతటా ప్లాస్టిక్ భూతం.. సవాళ్లు ఎన్నున్నా.. స్వచ్ఛ సాగరం
ప్లాస్టిక్.. ప్లాస్టిక్.. దాదాపు భూగోళమంతటా విస్తరించిన భూతం. చెరువులు, నదులు, సముద్రాల్లోనూ తిష్టవేసుకొని కూర్చుంది. విలువైన జలవనరులను కలుషితం చేస్తోంది. జలచరాల ఆయువును కబళిస్తోంది. తనను సృష్టించిన మనిషికే ముప్పుగా పరిణమిస్తోంది. సముద్రాల్లో మాటువేసిన ప్లాస్టిక్ కాలుష్యం ప్రపంచదేశాలకు ఇప్పుడొక పెద్ద సమస్యగా మారిపోయింది. భూమిపై అన్ని సముద్రాల్లో 19.90 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నట్లు నిపుణుల అంచనా. వీటిని తొలగించి, మహాసాగరాలను పరిశుభ్రంగా మార్చడానికి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నారు. ఎంతోమంది పరిశోధకులు, ఇంజనీర్లు ఇదే పనిలో నిమగ్నమయ్యారు. కృత్రిమ మేధ(ఏఐ) బీచ్ బగ్గీలు, ప్లాస్టిక్‌ను తినేసే కృత్రిమ ఎంజైమ్‌లు, ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లు, అక్వాటిక్ డ్రోన్లు వంటివి కొన్ని పరిష్కార మార్గాలుగా చెబుతున్నారు. ఎంజైమ్‌లతోపాటు మైక్రోబ్ నెట్లు, మ్యాగ్నెటిక్ లిక్విడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. వాటర్షార్క్లు సముద్రాల్లో మారుమూల ప్రాంతాలకు కూడా ప్లాస్టిక్ రక్కసి చొచ్చుకెళ్తోంది. మానవ సంచారం లేని అంటార్కిటికాలో కురిసిన మంచులోనూ సూక్ష్మ ప్లాస్టిక్ ఆనవాళ్లు బయటపడ్డాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్(డబ్ల్యూఈఎఫ్) అంచనా ప్రకారం సముద్రాల్లో 199 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వివిధ రూపాలు, పరిణామాల్లో ఉంది. తక్కువ బరువు కలిగిన మైక్రోప్లాస్టిక్‌లు ఉపరితలంపై తేలుతుండగా, అధిక బరువు కలిగినవి అడుగు భాగానికి చేరుకున్నాయి. నీటిపై తేలుతున్న ప్లాస్టిక్‌ను తొలగించడానికి అక్వాటిక్ డ్రోన్లను ఉపయోగిస్తున్నారు. నీటి పై భాగంలోని చిన్నచిన్న ప్లాస్టిక్ ముక్కలను సైతం సులువుగా సేకరిస్తాయి. వీటిని వాటర్షార్క్లుగా వ్యవహరిస్తున్నారు. బీచ్‌లో పేరుకుపోయిన ప్లాస్టిక్‌ను ఏరివేయడానికి కృత్రిమ మేధతో పనిచేసే బగ్గీలు (చిన్నపాటి వాహనాలు) వాడుతున్నారు. కంటికి కనిపించని సూక్ష్మ ప్లాస్టిక్‌ను నిర్మూలించడానికి మ్యాగ్నటిక్ నానో–స్కేల్ స్ప్రింగ్‌లను తయారు చేస్తున్నారు. మరికొన్ని ప్రయోగాలు అభివృద్ధి దశలో ఉన్నట్లు చెబుతున్నారు. ప్లాస్టిక్‌ను భక్షించే ఎంజైమ్ నదులు, సముద్రాల్లోని ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను 2016లో కనిపెట్టారు. దీన్ని పెటేస్ అని పిలుస్తున్నారు. అధిక ఉష్ణోగ్రతల వద్ద ఈ ఎంజైమ్ నిర్వీర్యం అవుతుండడంతో పెద్దగా ఉపయోగించడం లేదు. ఈ సమస్య పరిష్కారం కోసం అమెరికాలోని నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక పాలిమర్‌ను డిజైన్ చేశారు. ప్లాస్టిక్‌ను తినేసే ఎంజైమ్‌ను అధిక ఉష్ణోగ్రతల్లోనూ కాపాడుతుందని అంటున్నారు. మోంటానా స్టేట్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ పోర్ట్స్మౌత్ పరిశోధకులు టీపీఏడీఓ అనే మరో ఎంజైమ్‌ను అభివృద్ధి చేశారు. జల వనరుల్లోని ప్లాస్టిక్ వ్యర్థాలను నిర్మూలించడానికి ఇది చక్కగా ఉపకరిస్తుందని పేర్కొంటున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లు సౌరశక్తితో పనిచేసే ప్లాస్టిక్ ఇంటర్సెప్టర్లను పలు దేశాల్లో ఉపయోగిస్తున్నాయి. ఇందులో ఇంటర్‌సెప్టర్‌కు పొడవైన చేతుల్లాంటి ఉంటాయి. నీటిలోని ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, కన్వేయర్ బెల్ట్ ద్వారా ఇంటర్సెప్టర్లోని బుట్టల్లోకి పంపిస్తాయి. బుట్టలు నిండిపోయిన తర్వాత ఒడ్డుకు చేరుస్తారు. ఇదే తరహాలో పనిచేసే వాటర్–వీల్ పవర్డ్ ప్లాస్టిక్ కలెక్టర్‌ను అమెరికాలో వాడుతున్నారు. సీబిన్ వాక్యూమ్ క్లీనర్లను 2015లో ఆస్ట్రేలియాలో రూపొందించారు. ఇవి ప్లాస్టిక్‌తో వ్యర్థాలతో కూడిన నీటిని యంత్రంలోకి సేకరిస్తాయి. రెండింటినీ వేరుచేసి, నీటిని మాత్రమే బయటకు పంపిస్తాయి. ప్లాస్టిక్ ముక్కలన్నీ క్లీనర్లోని సంచిలోకి చేరుకుంటాయి. ప్రపంచమంతటా ఇప్పుడు 860 సీబిన్ వాక్యూమ్ క్లీనర్లలో వాడుకలో ఉన్నాయి. తుపాన్ల దిశను గుర్తించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ అభివృద్ధి చేసిన సైక్లోన్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్(సీవైజీఎన్ఎన్ఎస్) సముద్రాలు, నదుల్లో ప్లాస్టిక్ వ్యర్థాల కదలికలను తెలుసుకోవడానికి ఉపయోగపడుతుండడం గమనార్హం. ప్లాస్టిక్ ముక్కలు ఏ ప్రదేశంలో అధికంగా ఉన్నాయో తెలుసుకొని, సేకరించడానికి ఈ పరిజ్ఞానాన్ని వాడుకుంటున్నారు. హాంకాంగ్ పాలిటెక్నిక్ యూనివర్సిటీ పరిశోధకులు అతుక్కునే గుణం ఉన్న బయోఫిల్మ్తో కూడిన మైక్రోబ్ నెట్లను రూపొందించారు. నెట్లను నీటిలోకి జారవిడిస్తే అక్కడున్న ప్లాస్టిక్ వ్యర్థాలకు అతుక్కుపోతాయి. పైకి లాగితే వాటితోపాటు వ్యర్థాలు వచ్చేస్తాయి. వామ్మో ప్లాస్టిక్ ... ► ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలిసిపోవాలంటే వేల సంవత్సరాలు పడుతుంది. సముద్రాల్లో కోట్లాది ప్లాస్టిక్ వ్యర్థాలు ఉన్నాయి. వీటి సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది. ► నీటిలోని సూక్ష్మ ప్లాస్టిక్‌ను పూర్తిగా ఫిల్టర్ చేసే పరిజ్ఞానం ఇంకా అందుబాటులోకి రాలేదు. ► 2050 నాటికి సముద్రాల్లోని మొత్తం చేపల బరువు కంటే ప్లాస్టిక్ బరువే ఎక్కువగా ఉంటుందని 2016లో విడుదల చేసిన ఓ నివేదికలో నిపుణులు తేల్చిచెప్పారు. ► ప్రపంచంలో కుళాయి ద్వారా సరఫరా చేస్తున్న నీటిలో 80 శాతం నీరు ప్లాస్టిక్‌తో కలుషితమైందేనని 2017లో ఒక అధ్యయనంతో తేలింది. ► కుళాయి నీటిలో ప్లాస్టిక్ కాలుష్యం ముప్పు అధికంగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా, లెబనాన్, భారత్ తొలి మూడు స్థానాల్లో నిలిచాయి. ఫ్రాన్స్, జర్మనీ, యూకే చిట్టచివరి స్థానాల్లో ఉన్నాయి. ► ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో నీటి నమూనాలను సేకరించి, పరీక్షించగా.. 83 శాతం నమూనాల్లో మైక్రోప్లాస్టిక్ కనిపించింది. ఈ మైక్రోప్లాస్టిక్ మనిషి శరీర అంతర్భాగాల్లోకి సులభంగా చొచ్చుకెళ్తుందని పరిశోధకులు చెబుతున్నారు. ప్లాస్టిక్ నీళ్ల బాటిళ్లను దూరం పెట్టడమే మంచిదని సూచిస్తున్నారు. ► సూక్ష్మ ప్లాస్టిక్‌లో విషపూరితమైన రసాయనాలు ఉంటాయి. ► భూగోళంపై నివసిస్తున్న అన్ని రకాల జీవులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్లాస్టిక్‌ను స్వీకరిస్తున్నాయి. ప్లాస్టిక్ వల్ల ప్రభావితమవుతున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే!
ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకూ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ‘ప్రపంచ జునోసిస్ డే’ను నిర్వహిస్తుంటారు. పొంచి ఉన్న వ్యాధులు మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువుల నుంచి, గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్ డిసీజెస్ అంటారు. ముఖ్యంగా వీధి కుక్కుల నుంచి ర్యాబిస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంత్రాక్స్. దీన్ని దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంత్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ర్యాబిస్ నివారణ చర్యలు ►ర్యాబిస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. ►అలాగే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజెక్షన్లు చేయాలి. ►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. ►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ►ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. అప్రమత్తత అవసరం జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరమైనవి. మన పరిసరాల్లో ఉండే జంతువుల నుంచే వస్తాయి. జంతువులను కుట్టిన దోమలు మనుషులను కుట్టడం వల్ల, కుక్కలు నేరుగా మనుషులను కరవడం వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ర్యాబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. మా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ జూనోసిస్ వ్యాదుల పట్ల అవగాహన కల్పిస్తున్నాం. పెంపుడు జంతువుల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పశువైద్య కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సిన్లు వేస్తున్నాము. – డాక్టర్ సనపల లవకుమార్, మల్టీ స్పెషలిస్ట్, పశువైద్యాధికారి, ఇచ్ఛాపురం మండలం -ఇచ్ఛాపురం రూరల్, శ్రీకాకుళం చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? -
వీటికి ‘డబ్బు’ చేసింది.. ప్రపంచంలో టాప్ ధనిక జంతువులు ఇవేనండి!
డాలర్లైనా, రష్యన్ రూబుళ్లైనా... డబ్బుంటేనే ఖానా పీనా! అన్నాడో సినీ కవి. మనవాళ్లు ఈ విషయం ఎప్పుడో కనిపెట్టి ధనం మూలం ఇదం జగత్ అన్నారు. మానవ చరిత్రలో కుబేరులుగా ఖ్యాతికెక్కినవాళ్లు అనేకమంది ఉన్నారు. అయితే మనుషులు కాకుండా ప్రపంచంలో ధనిక జీవులుగా కొన్ని జంతువులు పేరుగాంచాయి. జంతువులేంటి.. వాటికి సంపదేంటి అనుకుంటున్నారా! అవేమీ కంపెనీలు పెట్టి ధనం కూడబెట్టలేదండీ! వాటి యజమానులు ప్రేమతో ఇచ్చిన సంపదతో ఈ పెంపుడు జంతువులకు డబ్బు చేసింది. అయితే వీటిలో కొన్ని స్వయంకృషి జంతువులు కూడా ఉన్నాయి. అంటే సినిమాల్లో, టీవీల్లో నటించడం ద్వారా ఇవి బోలెడు సంపద ఆర్జించాయన్నమాట! ఇలా ఈ జాబితాలో చేరిన జంతువుల ఆస్తుల వివరాల్లో కొన్ని అతిశయోక్తులున్నాయని తర్వాత తెలిసింది. ప్రస్తుతం ► జిగో అనే కోడి పెట్టను టెక్ట్స్ బుక్ రచయిత మైల్స్ బ్లాక్వెల్ పెంచుకున్నారు. తన తదనంతరం సదరు పెట్టగారికి బ్లాక్వెల్ 1.5 కోట్ల డాలర్లు రాసిచ్చారు. ► ఇటలీకి చెందిన రియల్టీ వ్యాపారి మారియా అసుంటా బజార్లో ఒక పిల్లిని చూసి జాలిపడి తెచ్చుకొని టొమసో అని పేరు పెట్టి పెంచుకున్నారు. 94ఏళ్ల వయసులో ఆమె మరణించారు. ఆమె విల్లు ప్రకారం టొమసోకు 1.3 కోట్ల డాలర్ల ఆస్తి దక్కింది. ► 2018 వరకు బ్లాకీ అనే పిల్లి 1.25 కోట్ల డాలర్ల సంపదతో ప్రపంచంలోనే సంపన్న పిల్లిగా పేరుగాంచింది. ► గైల్ పోస్నర్ అనే ఆమె తన పెంపుడు కుక్క కొంచిటాకు 30 లక్షల డాలర్ల ధనంతో పాటు దా దాపు 80 లక్షల విలువైన భవంతిని ఇచ్చేసింది. ► లియోనా హెల్మ్స్లే అనే ఆమె తన మనవళ్లపై కోపంతో తనకున్న 1.2 కోట్ల డాలర్లను ట్రబుల్ అనే కుక్కకు రాసింది. అయితే తర్వాత కోర్టులో జడ్జిగారు కుక్కకు 20 లక్షలు చాలని తీర్పిచ్చారు. ► అగ్ని ప్రమాదాన్ని ముందుగా పసిగట్టి తమను రక్షించిందన్న కృతజ్ఞతతో ఫ్లాసీ అనే పెంపుడు కుక్కకు డ్రీ బారీమోర్ దంపతులు 13లక్షల డాలర్ల ఇంటిని ముద్దుగా ఇచ్చేసింది. ► టింకర్ అనే పిల్లికి దాని యజమాని ద్వారా దాదాపు 8లక్షల డాలర్ల ఇల్లు, 2.26 లక్షల డాలర్ల సంపద ముట్టాయి. ► ఫాషన్ మేనేజర్ కార్ల్ పెంచుకునే చుపెట్టే అనే పిల్లికి 20 కోట్ల డాలర్ల ఆస్తి దక్కినట్లు వార్తలు వచ్చాయి, కానీ నిర్ధారణ జరగలేదు. ► ఇక పిల్లుల్లో మహారాజా పిల్లి అంటే గ్రుంపీ క్యాట్నే చెప్పుకోవాలి. అనేక షోలు, సినిమాల్లో నటించి ఈ పిల్లి దాదాపు 10 కోట్ల డాలర్లు సంపాదించింది. ► ఒలివియా బెన్సన్ అనే పిల్లి సుమారు 9.7 కోట్ల డాలర్లను వివిధ కార్యక్రమాల ద్వారా సంపాదించింది. ► గుంతర్6 అనే కుక్కకు కోట్ల డాలర్ల ఆస్తి దక్కిందని అనేక వార్తలు వచ్చినా అదంతా ప్రాంక్ అని తర్వాత తెలిసింది. డబ్బున్నవారు ఏక్షణం ఏం చేస్తారో తెలియదు కాబట్టి, ఈ జాబితా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. చట్టబద్దత ఉందా? జంతువులు న్యాయ పరిభాషలో లీగల్ పర్సన్స్ కావు కనుక వీటి పేరుమీద సొంత ఆస్తులు, ధనం ఉండదు. పెంపుడు జంతువంటేనే ఒక ఆస్తి, అందువల్ల మరో ఆస్తిని ఈ ఆస్తికి కట్టబెట్టేందుకు చట్టాలు అంగీకరించవు. అందుకే ఆయా జంతువుల యజమానులు ఏర్పాటు చేసిన ట్రస్టులు ఈ జంతువుల ఆస్తుల నిర్వహణ చేస్తుంటాయి. ఈ సొమ్మును కేవలం సదరు జీవి బాగోగులు చూసుకోవడానికి మాత్రమే ఉపయోగించాల్సిఉంటుంది. సదరు జంతువు మరణిస్తే ట్రస్టు నిబంధనల ప్రకారం మిగిలిన సొత్తును వినియోగిస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి. -
ఆర్థిక మోసాలు.. నయా రూటు!
గతంలో మాదిరి కాకుండా, నేడు దాదాపు అన్ని రకాల ఆర్థిక సేవలను డిజిటల్ రూపంలో ఉన్న చోట నుంచే కదలకుండా పొందే సౌలభ్యం ఉంది. చెల్లింపులను డిజిటల్‌గా చేస్తున్నాం. మొబైల్ నుంచే షాపింగ్ చేస్తున్నాం. కొన్ని క్లిక్‌లతో ఇన్‌స్టంట్‌గా రుణాలు తీసుకుంటున్నాం. యాప్ నుంచి అవతలి వ్యక్తికి క్షణాల్లో నగదు బదిలీ చేస్తున్నాం. దీంతో ఈ డిజిటల్ వేదికల్లోని కీలక సమాచారం నేరస్థులకు ఆదాయ వనరుగా మారిపోయింది. మోసాలకు వారు ఎప్పటికప్పుడు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. అందుకే ’నాకు తెలుసులే‘ అని అనుకోవద్దు. ఎంత తెలివితనం ఉన్నా సైబర్ నేరగాళ్లు ఏదో ఒక కొత్త మార్గంలో వచ్చి నిండా ముంచేస్తున్నారు. మోసాలకు నమ్మకమే మూలం. మోసపోయిన తర్వాత కానీ, అర్థం కాదు అందులోని లాజిక్. తాము అవతలి వ్యక్తిని ఏ విధంగా నమ్మి మోసపోయామో? బాధితులను అడిగితే చెబుతారు. అవగాహనే మోసాల బారిన చిక్కుకోకుండా కాపాడుతుంది. ఈ తరహా పలు కొత్త మోసాలపై అవగాహన కల్పించే కథనమే ఇది. ఫోన్ కాల్ వెరిఫికేషన్ టీకాల రూపంలోనూ మోసం చేస్తారని ఊహించగలమా? స్థానిక హెల్త్ సెంటర్ నుంచి కాల్ చేస్తున్నామని, ఇంటికే వచ్చి టీకాలు ఇస్తున్నట్టు మీకు కాల్ వస్తే తప్పకుండా సందేహించాల్సిందే. ఇంటికే వచ్చి కరోనా టీకాను ఇస్తామని.. ఇందుకు ఎటువంటి చార్జీ ఉండదని చెబుతారు. ఇందుకోసం చిరునామా, మొబైల్ నంబర్, పాన్, ఆధార్‌తో ధ్రువీకరిస్తే చాలని చెబుతారు. ఈ వివరాలన్నీ తీసుకున్న తర్వాత రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ చెబితే ధ్రువీకరణ పూర్తవుతుందని నమ్మిస్తారు. ఇదే ఓటీపీని ఇంటికి వచ్చి టీకా ఇచ్చే వైద్య సిబ్బందికి కూడా చెప్పాల్సి ఉంటుందని సూచిస్తారు. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీని మీరు చెప్పిన తర్వాత ఆ కాల్‌ను డిస్కనెక్ట్ చేస్తారు. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్‌కు.. బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ నుంచి రుణ దరఖాస్తును ఆమోదించామంటూ ఎస్ఎంఎస్ రావచ్చు. అంతేకాదు కొన్ని సందర్భాల్లో రుణం మొత్తాన్ని ఆయా బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థ మంజూరు చేయడం కూడా పూర్తి కావచ్చు. ఈ మొత్తాన్ని మీకు కాల్ చేసిన వాళ్లు అప్పటికే తీసేసుకోవడం కూడా పూర్తయి ఉంటుంది. ఫోన్ కాల్ చేసి, ఆధార్, పాన్, చిరునామా వివరాలు తీసుకుంటున్నారంటే అది మోసపూరిత కార్యక్రమమే అని గుర్తించాలి. అధికారికంగా ఎవ్వరూ ఆ వివరాలు అడగరు. ఏంటి మార్గం..? ఆధార్, పాన్ ఈ తరహా వ్యక్తిగత, కీలకమైన వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. వీటి సాయంతో ఓటీపీ రూపంలో రుణాలను తీసుకునే మోసాలు పెరిగిపోయాయి. ఓటీపీ పేరుతో మొబైల్‌కు వచ్చే ఎస్ఎంఎస్ను పూర్తిగా చదవాలి. ఆ ఓటీపీ దేనికోసం అన్నది అందులో క్లుప్తంగా ఉంటుంది. అందులో లోన్అప్లికేషన్ అని ఏమైనా ఉంటే, వెంటనే సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలి. సదరు బ్యాంకు లేదా ఎన్బీఎఫ్సీ సంస్థకు కాల్ చేసి సమాచారం ఇవ్వాలి. క్రెడిట్ కార్డు ఫీజు ఎత్తివేత 2021 చివరికి 6.9 కోట్ల క్రెడిట్ కార్డులు వినియోగంలో ఉన్నాయి. పట్టణాల్లోని చాలా కుటుంబాలకు కనీసం ఒక క్రెడిట్ కార్డు అయినా ఉంది. క్రెడిట్ కార్డులు వార్షిక నిర్వహణ పేరుతో ఫీజు వసూలు చేస్తుంటాయి. అయినా, వార్షిక ఫీజుల్లేవంటూ క్రెడిట్ కార్డులను ఆయా సంస్థలు మార్కెటింగ్ చేసుకుంటాయి. అది మొదటి ఏడాది వరకేనన్న సూక్ష్మాన్ని ఆయా సంస్థలు చెప్పవు. రెండో ఏడాది నుంచి వార్షిక ఫీజు బాదుడు మొదలవుతుంది. దీన్ని కూడా సైబర్ నేరస్థులు దోపిడీకి మార్గంగా ఎంపిక చేసుకున్నారు. జీవితకాలం పాటు ఎటువంటి వార్షిక ఫీజులేని ఉచిత క్రెడిట్ కార్డు ఇస్తున్నామంటూ సంప్రదిస్తారు. తాము ఫలానా బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నామని నమ్మిస్తారు. అప్పటికే వార్షిక ఫీజు చెల్లిస్తున్న వారిని దాన్ని ఎత్తివేస్తామంటూ బురిడీ కొట్టిస్తారు. వారి మాటలకు మనం స్పందించే విధానం ఆధారంగా మొత్తం అంచనా వేస్తారు. తర్వాత తాము సూచించినట్టు చేయాలంటూ తమ పని మొదలు పెడతారు. ముందు క్రెడిట్ కార్డు నంబర్, దానిపై ఉన్న పేరు చెబుతారు. దాంతో నమ్మకం ఏర్పడేలా చేస్తారు. బ్యాంకు నుంచి కాల్ చేస్తున్నారు కనుకనే తమ కార్డు వివరాలు తెలుసని భావిస్తాం. కానీ, ఆ వివరాలను వారు అక్రమ మార్గాల్లో సంపాదించారన్నది మనకు తెలియదు. ఇవన్నీ అయిన తర్వాత వారికి అసలైన ఓటీపీ అవసరంపడుతుంది. జీవిత కాలం పాటు క్రెడిట్ కార్డు ఫీజును ఎత్తివేయాలనుకుంటే అందుకు మొబైల్‌కు వచ్చే ఓటీపీ ద్వారా ధ్రువీకరించాలని చెబుతారు. మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపిస్తారు. మొబైల్‌కు వచ్చిన ఓటీపీ వివరాలు చెప్పిన వెంటనే.. క్రెడిట్ కార్డు ఫీజు రద్దయినట్టు చెప్పి కాల్ కట్ చేసేస్తారు. ఇక ఆ తర్వాత మొబైల్‌కు వరుసగా వచ్చే డెబిట్ లావాదేవీల ఎస్ఎంఎస్లు చూసిన తర్వాత కానీ, మోసం జరిగినట్టు అర్థం కాదు. స్పందించేలోపే ఉన్న మొత్తాన్ని వారు ఊడ్చేస్తారు. ఏంటి మార్గం..? తెలియని వ్యక్తులు కాల్ చేసి, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు ఖాతాలు గురించి మాట్లాడుతుంటే వెంటనే డిస్ కనెక్ట్ చేసేయాలి. వారితో చర్చించాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. బ్యాంకు ఉద్యోగులు ఖాతాదారులకు కాల్ చేస్తే, విషయం చెప్పి పెట్టేస్తారే కానీ, సున్నితమైన సమాచారం, వివరాలను చెప్పాలని కోరరు. పైగా బ్యాంకు ఉద్యోగి కార్డు వివరాలను చెప్పే ప్రయత్నం అసలు చేయరు. ఒకవేళ ఎవరైనా కాల్ చేసి, మీ క్రెడిట్ కార్డు వివరాలు చెబుతుంటే వెంటనే ఆ కాల్‌ను కట్ చేయాలి. బ్యాంకు యాప్‌లోకి వెళ్లి కార్డు ఆన్లైన్ లావాదేవీల యాక్సెస్‌ను, అంతర్జాతీయ యాక్సెస్ ను తాత్కాలికంగా నిలిపివేయాలి. మీకు తెలియకుండా క్రెడిట్ కార్డు వివరాలు సంపాదించినప్పటికీ.. మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ లేకుండా అందులోని బ్యాలన్స్‌ను వారు ఖాళీ చేయడం అసాధ్యం. అందుకుని ఓటీపీని ఎట్టి పరిస్థితుల్లోనూ షేర్ చేయవద్దు. కుక్క పిల్లనీ వదలరు.. హైదరాబాద్ వాసి శాంతి (33)కి పెట్స్ అంటే పంచ ప్రాణాలు. పెళ్లయి ఏడేళ్లు అయినా ఇంత వరకు కుక్క పిల్లను పెంచుకోవాలన్న కోరిక నెరవేరలేదు. ఎనిమిదో వివాహ వార్షికోత్సవం సందర్భంగా అయినా తనకు కుక్కపిల్ల తెచ్చి ఇవ్వాలని భర్తను కోరింది. ఆమె భర్తకు ఫేస్బుక్లో ‘ఇంటి వద్దకే పెట్స్ డెలివరీ’ పేరుతో పోస్ట్ కనపడింది. ఆ వివరాలు తీసుకొచ్చి పెళ్లానికి ఇచ్చాడు. ఆమె ఎంతో సంతోషంతో ఆ నంబర్ కు కాల్ చేసి మాట్లాడింది. అవతలి వ్యక్తి హిందీలో మాట్లాడాడు. రాజస్తాన్‌లో ఆర్మీ కంటోన్మెంట్ ఏరియాలో తన సెంటర్ ఉందని.. కరోనా కారణంగా తన వద్ద భారీ సంఖ్యలో కుక్కలు ఉండిపోయినట్టు ఒక ఆసక్తికరమైన స్టోరీ చెప్పాడు. వాట్సాప్‌కు వీడియోలు పంపిస్తాను చూడండి అని కోరాడు. కొద్ది సేపటి తర్వాత వాట్సాప్ లో వచ్చిన వీడియోలు చూసిన తర్వాత శాంతికి ఆరాటం ఆగలేదు. వెంటనే కుక్కపిల్లకు ఆర్డర్ చేసేయాలన్నంత ఉత్సాహం వచ్చింది. ఎందుకంటే వీడియోల్లోని కుక్క పిల్లలు అంత క్యూట్‌గా ఉన్నాయి. మార్కెట్ ధర అయితే ఒక్కో పెట్‌కు రూ.45,000–50,000 ఉంటుందని, ఎక్కువ సంఖ్యలో కుక్క పిల్లలు ఉండిపోయినందున ఒకటి రూ.5,000కు ఇస్తానని రాజస్తాన్ కేటుగాడు ఆఫర్ ఇచ్చాడు. అడ్వాన్స్‌కింద ముందు రూ.2,000 పంపించాలని కోరాడు. రసీదు కూడా ఇస్తానన్నాడు. డెలివరీ సమయంలో మొత్తం చెల్లిస్తానని ఆమె చెప్పడంతో నో అన్నాడు. దాంతో రూ.500 పంపించింది శాంతి. ఆమె పేరుతో రసీదు ప్రింట్ చేసి వాట్సాప్ చేశాడు. వారం రోజుల్లో పెట్‌ను మీ ఇంటి వద్దకు తీసుకొచ్చి డెలివరీ చేస్తారని.. ఆర్మీ వ్యాన్‌లో రవాణా చేస్తున్నామంటూ ఒక నకిలీ వీడియో పంపించాడు. కొన్ని రోజులు గడిచాయి. డెలివరీ తేదీ వచ్చినా అవతలి వ్యక్తి నుంచి ఫోన్ కాల్ రాలేదు. దాంతో ఉండబట్టలేక శాంతి కాల్ చేసింది. ఈ రోజు పెట్ వస్తుందని, గంటలో డెలివరీ వాళ్లు కాల్ చేస్తారని చెప్పాడు. అన్నట్టు గంటలోపే ఒక కొత్త నంబర్ నుంచి ఆమెకు కాల్ వచ్చింది. మీరు డీల్ చేసిన వ్యక్తి మోసగాడని, మిమ్మల్ని మోసం చేశాడంటూ అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించాడు. వాట్సాప్ లో తాము కోరిన వివరాలన్నీ ఇస్తే ఫిర్యాదు దాఖలు చేస్తామని స్టోరీ వినిపించాడు. ఇదే విషయం ఆమె తన భర్తతో చెప్పింది. అవేమీ చేయకు.. ఇక వదిలేసెయ్ అని అతడు చెప్పాడు. ఇంతకీ వాట్సాప్ లో ఫిర్యాదు కోసం కోరిన వివరాలు ఏవి అనుకున్నారు..? బాధితుని పేరు, ఫోన్ నంబర్, చిరునామా, నష్టపోయిన మొత్తం, అకౌంట్ నంబర్/ వ్యాలెట్ నంబర్/ యూపీఐ నంబర్, బ్యాంకు ఖాతా లేదా గూగుల్ పే అయితే ఆ వివరాలు, బ్యాంకు ఖాతా నంబర్, డెబిట్/ క్రెడిట్ కార్డు నంబర్.. ఈ వివరాలన్నీ పంపాలని కోరాడు. అవి కనుక ఇచ్చి ఉంటే.. ఆ ఖాతా లేదా కార్డులోని బ్యాలన్స్ అంతటినీ.. ఓటీపీ కనుక్కుని మరీ మోసగాళ్లు ఊడ్చేసేవాళ్లు. శాంతి భర్తకు చెప్పడం.. అతను ఊరుకోమని చెప్పడంతో మోసం రూ.500కే పరిమితం అయింది. ఆన్లైన్లో తెలియని వారితో వ్యక్తిగత వివరాలు పంచుకోకపోవడం, తెలియని వారికి డబ్బులు పంపించకుండా ఉండడం ఒక్కటే పరిష్కారం. అసలు వారితో ఆయా అంశాలు చర్చించవద్దు. నకిలీ రూపాలు.. రోడ్డు పక్కన అంబరెల్లా టెంట్ వేసుకుని మార్కెటింగ్ చేసే వ్యక్తుల పట్ల కాస్తంత అప్రమత్తంగా వ్యవహరించాలి. లైఫ్ ఇన్సూరెన్స్ మార్కెటింగ్, బ్యాంకింగ్, డిజిటల్ వ్యాలెట్ కంపెనీల ఉద్యోగులుగా మోసగాళ్లు రూపాలు మారుస్తున్నారు. టెంట్ వేసుక్కూర్చుని తమ వద్దకు విచారణకు వచ్చిన వారిని నిండా ముంచుతున్నారు. వారి వద్దకు వెళ్లి మీరే స్వయంగా విచారించినా.. లేక పక్క నుంచి వెళుతున్నా ఆకర్షణీయ కరపత్రంతో వారు పలకరిస్తారు. తాను ఫలానా బ్యాంకు లేదా బీమా కంపెనీ ఉద్యోగినని.. జీరో బ్యాలన్స్ ఖాతా లేదా.. కొత్త బీమా ప్లాన్‌ను ఆవిష్కరిస్తున్నామని చెబుతారు. ఈ రోజే ప్లాన్ కొనుగోలు చేస్తే ప్రీమియంలో భారీ రాయితీ ఇస్తామని ఆశ చూపుతారు. కుటుంబం మొత్తానికి రూ.15 లక్షల కవరేజీ కోసం ఏటా రూ.5,000 కడితే చాలని చెబుతారు. ఆలోచించుకోవడానికి కొంచెం వ్యవధి కావాలని అడిగితే.. మరో రూ.1,000 డిస్కౌంట్ ఇస్తామని, ఆ తర్వాత మళ్లీ ఇలాంటి ఆఫర్ ఉండదంటూ ఆలోచనలో పడేస్తారు. ఏదో విధంగా ఒప్పించి ప్రీమియం కట్టించుకోవడం కోసమే వారు అక్కడ కూర్చున్నారని మనకు అర్థం కాదు. ఒరిజినల్ పాలసీ డాక్యుమెంట్ రెండు వారాల్లో ఇంటికి వస్తుందని.. నచ్చకపోతే అప్పుడు రద్దు చేసుకుంటే పూర్తి మొత్తం వెనక్కి వస్తుందని పాలసీ తీసుకునేలా చేస్తారు. చెల్లించిన ప్రీమియానికి రసీదును కూడా ఇస్తారు. కానీ, అదంతా మోసమన్నది నష్టపోయిన తర్వాత కానీ అర్థం కాదు. ఏంటి మార్గం..? రోడ్డు పక్కన టెంట్లు వేసుకుని, స్టాల్స్ పెట్టుకుని ఆర్థిక ఉత్పత్తులు విక్రయించే వారిని నమ్మొద్దు. ఒకవేళ మీకు మంచి ఆఫర్ అనిపిస్తే ఆ ఉద్యోగి పేరు, ఉద్యోగి గుర్తింపు ఐడీ వివరాలు తీసుకుని బీమా కంపెనీకి కాల్ చేసి నిర్ధారించుకోవాలి. బీమా పాలసీలు అయినా, క్రెడిట్ కార్డు అయినా, బ్యాంకు ఖాతా అయినా.. మరొకటి అయినా నేరుగా ఆయా బ్యాంకు, బీమా సంస్థల శాఖల నుంచి లేదంటే ఆన్లైన్ పోర్టల్‌కు వెళ్లి తీసుకోవడమే సురక్షితం. బయట ఇలా మార్కెటింగ్ వ్యక్తుల రూపంలో మంచి ఆఫర్ కనిపిస్తే దాన్ని బ్రాంచ్‌కు వెళ్లి నిర్ధారించుకుని తీసుకోవాలి. ఇలాంటి కొనుగోళ్ల విషయంలో ఏ వ్యక్తికి కూడా వ్యక్తిగత ఖాతా లేదా నంబర్‌కు నగదు బదిలీ చేయవద్దు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది. డబ్బులు కొట్టేశారా..! ఆన్లైన్ లేదా టెలిఫోన్ కాల్ రూపంలో ఓటీపీ తీసుకుని మీ కార్డు/వ్యాలెట్‌లోని డబ్బు లు కొట్టేసినట్టు గుర్తించారా? ఆలస్యం చేయ కండి. వెంటనే 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేసి జరిగిన ఘటన వివరాలపై ఫిర్యాదు చేయండి. అలాగే. https://cybercrime.gov.in లాగిన్ అయ్యి మోసానికి సంబంధించి వివరాలు నమోదు చేయాలి. బ్యాంకు లావాదేవీల స్టేట్మెంట్ను అప్లోడ్ చేయాలి. అనంతరం కేంద్ర హోంశాఖ పరిధిలో పనిచేస్తున్న ఈ పోర్టల్ నుంచి ఆయా రాష్ట్రాల పోలీసులకు, బ్యాంకులకు సమాచారం వెళుతుంది. దాంతో సైబర్ నేరస్థుల ఖాతాల్లో జమ అయిన మొత్తాన్ని తిరిగి రికవరీ చేసి బాధితుల ఖాతాలకు జమ చేస్తారు. అయితే, ఎంత వేగంగా ఫిర్యాదు చేశారన్న దాని ఆధారంగానే రికవరీ ఆధారపడి ఉంటుంది. సైబర్ నేరగాళ్లు బదిలీ చేసుకున్న మొత్తాన్ని వెంటనే డ్రా చేసుకుంటే రికవరీ కష్టమవుతుంది. -
హృదయ విదారకం: పునీత్ లేడని వాటికెలా చెప్పేది.. సమాధి వద్దకు తీసుకెళ్లి
కొంతమంది జంతువులను అమితంగా ప్రేమిస్తుంటారు. వాటికి ఏమైనా అయితే ఏ మాత్రం తట్టుకోలేరు. ముఖ్యంగా పెంపుడు కుక్కల విషయంలో మనుషులు అమితమైన ప్రేమ కనబరుస్తుంటారు. కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్(Puneeth Rajkumar) కూడా అంతే. ఆయనకు కుక్కలు అంటే చాలా ఇష్టం. చాలా కుక్కలను ఆయన పెంచుకున్నారు. గతంలో అనేకసార్లు తన పెంపుడు కుక్కలకు సంబంధించిన ఫోటోలు,వీడియోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. అయితే ఆయన హఠాన్మరణంతో లక్షలాది అభిమానులతో పాటు ఆ పెంపుడు శునకాలు కన్నీంటి పర్యంతమవుతున్నాయి. అప్పు ఇక రాలేడనే విషయం తెలియక.. ఆయన ఫోటో ముందుకెళ్లి దీనంగా ఏడుస్తూ కుర్చుంటున్నాయి. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన కుటుంబ సభ్యులు కూడా కన్నీళ్లు పెంటుకుంటున్నారు. పునీత్ కనిపించకపోవడంతో అవి ఆహారం కూడా తీసుకోవడం లేదట. పునీత్ ఇక రాలేడనే విషయం వాటికి ఎలా చెప్పాలో తెలియక.. చివరికి రాజ్‌కుమార్ సమాధి వద్దకు ఆ కుక్కలను తీసుకెళ్లారు. గతేడాది బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ చనిపోయినప్పుడు ఆయన పెంపుడు కుక్క కూడా వారం రోజుల పాటు ఏమీ తినకుండా అనారోగ్యం పాలైంది. చివరికి వాళ్ల కుటుంబం ఎన్నో ప్రయత్నాలు చేస్తే తప్ప అది ప్రాణాలతో బయట పడలేదు. మరి రాజ్‌కుమార్ శునకాలు ఎప్పుడు మాములు పరిస్థితి వస్తాయో చూడాలి. -
మొసళ్ళని పెంపుడు జంతువులుగా పెంచుకుంటున్న మాలి ప్రాంత ప్రజలు
-
వెరైటీ థెరపీలు... విలువైన ప్రయోజనాలు!
రాతి పనిముట్ల వాడకం మొదలెట్టడంతో మానవ పరిణామ క్రమంలో నూతనాధ్యాయం ఆరంభమైంది. క్రమంగా చక్రం, నిప్పు కనుగొనడం ఈ పరిణామ క్రమాన్ని మరింత వేగవంతం చేసింది. జంతు లక్షణాల నుంచి బయటపడ్డ మనిషి ఇతర జంతువుల్లాగా కాకుండా తమలో తాము సంభాషించుకోవడానికి భాషను సృష్టించాడు, అలాగే తాను చూసిన వాటిని పాతరాతియుగం నాటి మానవుడు కొండగుహల్లో చిత్రీకరించడం ఆరంభించాడు. క్రమంగా సంచార జీవనం వదిలి స్థిరజీవనం దిశగా ఆదిమ సమాజాలు పయనించడంతో మనిషిలో మరిన్ని కళలు బయటపడ్డాయి. భాష నుంచి సంగీతం, దానికనుగుణంగా నాట్యం వంటి అనేక కళలు మానవ జీవితంలోకి ప్రవేశించాయి. తర్వాత కాలంలో కళారూపాలు శాఖోపశాఖలుగా విస్తరించాయి. ఇలాంటి కళా రూపాలు కేవలం మానసికోల్లాసానికే కాదని, వీటిని సరిగా ఆచరిస్తే ఆరోగ్యం కూడా మెరుగవుతుందని మనిషి కనుగొన్నాడు. ఆధునిక యుగంలో కూడా ఈ కళా రూపాలను ఉపయోగించి పలు దీర్ఘకాల వ్యాధులను, చికిత్స దొరకని రోగాలను ఉపశమింపచేసే థెరపీలు అనేకం ఉన్నాయి. కళలే కదా అని కొట్టి పారేయకుండా ఈ థెరపీలతో పలు ప్రయోజనాలు కూడా ఉన్నాయన్నది నిపుణుల అభిప్రాయం. ఆధునిక వైద్యం ఈ థెరపీలను సమర్థించదు కానీ వీటి వాడకాన్ని వద్దనలేదు. సైడ్ ఎఫెక్టులు ఉండని కొన్నిరకాల ప్రత్యామ్నాయ థెరపీల గురించిన వివరాలు... పెట్ థెరపీ మనిషి జీవితంలో జంతువులను మచ్చిక చేసుకోవడం ఎంతో కలిసివచ్చింది. దీనివల్ల నాగరికతలు దూసుకుపోయాయి. మనిషి మనసును అర్ధం చేసుకొనే పెంపుడు జంతువులకు, వాటి యజమానులకు మధ్య ఒక మానసిక బంధం ఏర్పడుతుంది. దీని ఆధారంగా యానిమల్ అసిస్టెడ్ లేదా పెట్ థెరపీ పుట్టుకొచ్చింది. సాధారణంగా మనిషి పెంచుకునే కుక్క, పిల్లి, గుర్రం, పంది, పక్షులతో ఈ థెరపీ ప్లాన్‌ను రూపొందిస్తారు. ఆటిజం, బిహేవియరల్ సమస్యలు, మెంటల్ కండీషన్స్, స్క్రీజోఫ్రీనియా ఉన్నవారికి ఇది ఉపయోగపడుతుంది. అయితే పెట్ అలెర్జీ ఉన్నవారు, జంతువులంటే అసహ్యం ఉన్నవారు ఈ థెరపీకి దూరంగా ఉండడం మంచిది. ఈ విధానంలో మన పెంపుడు జంతువుతో మనకు ఎమోషనల్ బంధం బలపడేలా థెరపిస్టు చేస్తాడు. దీనివల్ల మనిషి మనసులో సున్నితత్వం మెరుగుపడుతుంది. ఇతర జీవులపై ప్రేమ పెరుగుతుంది. దీనివల్ల మెదడులో కరుణ, జాలి భావాలకు ప్రాధాన్యం పెరిగి మానసికంగా బలోపేతం అవుతాడు. ఈ థెరపీలో కేవలం వైయుక్తిక విధానమే ఉంటుంది. గ్రూప్ థెరపీ ఉండదు. మ్యూజిక్ థెరపీ శిశుర్వేత్తి పశుర్వేత్తి.. వేత్తి గానరసం ఫణిః అన్నాడు ప్రవచనకారుడు. సంగీతానికి పరవశించని జీవం ఉండదన్నది అందరికీ తెలిసిన సంగతే! అలాంటి సంగీతాన్నే ఆధారంగా చేసుకొని స్వాంతన చేకూర్చేది మ్యూజిక్ థెరపీ. పిల్లలో, పెద్దల్లో ఎదురయ్యే యాంగై్జటీ, డిప్రెషన్, నొప్పులు, ఆటిజం, ఆల్జీమర్స్, డిమెన్షియా, మెదడుకు దెబ్బతగలడం తదితర అనేక రకాల ఇక్కట్లకు ఈ థెరపీ బాగా పనిచేస్తుందని నిపుణులు చెబుతారు. ఇందులో రెండు రకాలున్నాయి. వినడం(రెసెప్టివ్ విధానం), పాడడం(యాక్టివ్ విధానం)లో మనకు నచ్చినదాన్ని ఎంచుకోవచ్చు. భారతీయ సంస్కృతిలో సంగీతానికి ప్రాధాన్యత మెండు. వివిధ రకాల మానసిక స్థితులకు తగినట్లు సంగీతంలో వివిధ రాగాలను సృష్టించారు. ఉదాహరణకు కరుణ రసాన్ని గాంధారం ప్లస్ నిషాధం అలాగే గాంధారం ప్లస్ షడ్జమం శౌర్య రసాన్ని ప్రేరేపిస్తాయి. రస, రాగ సమ్మిళితంతో మానసికోల్లాసమేకాకుండా, ఆరోగ్యం కూడా లభిస్తుందని భారతీయులు గుర్తించారు. పాశ్చాత్య సంగీతంలో కూడా ఆయా స్థితులకు తగ్గట్లు నోట్స్‌ను సృష్టించారు. ఇలా పనిచేస్తుంది... మనిషి పుట్టినప్పటి నుంచి చివరివరకు శబ్దమయ జీవితం గడుపుతాడు. శబ్దాలను క్రమపద్ధతిలో పేరిస్తే సంగీతమవుతుంది. సంగీతం వినడం ఒకలాగా, సొంతంగా పాడడం ఒకలాగా ప్రభావాన్ని చూపుతాయి. ఉదాహరణకు మతిమరుపు, అల్జీమర్స్ లాంటి వ్యాధులతో బాధపడేవాళ్లకు గతంలో విన్న సంగీతం కారణంగా మెదడులో గత న్యూరాన్లకు ప్రేరణ కలుగుతుంది. అలాగే సొంతంగా హమ్మింగ్ లేదా పాడుతూ పనిచేయడం శ్రమ తెలియనివ్వదు. మ్యూజిక్ థెరపీ చేసేవాళ్లు ముందుగా క్లయింట్ కండీషన్ బట్టి ఎలాంటి విధానం అవలంబించాలో నిర్ణయించుకుంటారు. అలాగే క్లయింట్‌కు మ్యూజిక్‌లో, సంగీత వాయిద్యాల్లో ప్రవేశం ఉన్నట్లయితే అందుకు తగిన విధానాన్ని సూచిస్తారు. అలాగే క్లయింట్ అవసరాన్ని బట్టి గ్రూప్ థెరపీని లేదా వైయుక్తిక సిట్టింగ్‌ను సూచిస్తారు. శ్రావ్య సంగీతం వినేప్పుడు శరీరంలోని రక్తపోటు, హదయ స్పందన రేటు నెమ్మదిస్తాయి. ఆక్సిజన్ సాచురేషన్ తగ్గుతుంది. ఉద్రేకపూరిత సంగీతం వింటే ఈ మార్పులు రివర్సులో జరుగుతాయి. పేషెంటు కండీషన్‌ను బట్టి థెరపిస్టు సంగీతాన్ని ఎంచుకుంటాడు. ఒక పాటను విన్నప్పుడు, పాడినప్పుడు మనసులో కలిగే స్పందనలను గుర్తించేలా థెరపిస్టులు ప్రేరేపిస్తారు. తద్వారా ఆరోగ్యం మెరుగుపడేందుకు అవసరమైన టెక్నిక్స్‌ను వాడతారు. ఆర్ట్ థెరపీ ఆదిమమానవ కాలం నుంచి మనిషిలో ఉండే క్రియేటివిటీ చిత్రాల రూపంలో బయటపడుతోంది. మనలోని సైకలాజికల్, ఎమోషనల్ ఆలోచనలకు ఒక రూపాన్నివ్వడంలో చిత్రలేఖనం ఉపయోగపడుతుంది. దీన్ని ఆధారంగా తీసుకొని ఆర్ట్ థెరపీ అభివృద్ధి చేశారు. ఇందులో చిత్రలేఖనం(పెయింటింగ్), రేఖాలేఖనం(డ్రాయింగ్), రంగులద్దడం(కలరింగ్), శిల్పాలు చెక్కడం(స్కల్ప్టింగ్)వంటివి మనిషిలో గూడుకట్టుకున్న భావాలను డీకోడ్ చేసేందుకు ఉపయోగపడతాయి. ఏ వయసు వారిలోనైనా ఆత్మస్థైర్యం పెంచడానికి, వ్యసనాలను దూరం చేయడానికి, ఒత్తిడి నివారణకు, యాంక్జైటీ, డిప్రెషన్ తగ్గించడానికి ఆర్ట్ థెరపీని వాడతారు. పైనవాటిలోలాగానే ఇందులో కూడా గ్రూప్ థెరపీ, వైయుక్తిక థెరపీ ఉంటాయి. మన అవసరాన్ని బట్టి థెరపిస్టు సరైన విధానం సూచిస్తాడు. ఆర్ట్ థెరపీ అంటే మనలో ఆర్టిస్టిక్ ట్యాలెంట్ ఉండాల్సిన పనిలేదు. ఇది మన అంతఃచేతనలోని ఆలోచనలను బయటపెట్టడానికి చేసే ప్రయత్నమని గుర్తించాలి. థెరపీలో క్లయింట్ ఫీలింగ్స్‌ను థెరపిస్టు గమనించి తగిన టెక్నిక్స్ నేర్పుతాడు. వివిధ రంగుల సమ్మిళితాలను చిత్రీకరించడం, చూడడం వంటివి మనిషి మనసును తేటపరుస్తుందని అమెరికన్ ఆర్ట్ థెరపీ అసోసియేషన్ పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. మానవతాత్మక థెరపీ ప్రపంచంలో జరిగే సంక్షోభ కారణాలను గుర్తించి నివారించడానికి యత్నించడమే మానవత్వం. సాటివారి బాధను అర్థం చేసుకున్నవాడే అసలైన మానవుడు అన్న సూక్తి ఆధారంగా హ్యూమనిస్టిక్ థెరపీ ఆరంభమైంది. మనం చూసే, వినే, అనుభవించే వాటిని మరింతగా అర్థం చేసుకోవడంలో ఈ థెరపీ ఎంతో పయ్రోజనకారి. ఆత్మనూన్యత సమస్యలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధలు పడుతుండడం, ఇతరులతో సరైన సంబంధాలు లేకపోవడం, సున్నిత భావనలకు స్పందించకపోవడం వంటి పరిస్థితుల్లో ఈ థెరపీ ఉపయోగపడుతుంది. జీవితానికి అర్థం చెప్పడం ద్వారా మానవ జీవిత విలువను క్లయింట్‌కు థెరపిస్టు తెలియజేస్తాడు. జీవన విలువ తెలిసిన తర్వాత ఇతరులకు కీడు చేయాలనే ఆలోచన మనసుకు రాదు. అదేవిధంగా సర్వమానవ సౌభ్రాతృత్వ దృష్టి అలవడుతుంది. నెగిటివ్ జడ్జిమెంట్ చేసే గుణం తొలగిపోతుంది. ఇది ఎక్కువగా థెరపిస్టుకు, క్లయింట్‌కు మధ్య సంభాషణల ద్వారా జరుగుతుంది. క్లయింట్ ఆలోచనా విధానంలో లోపాలను సున్నితంగా ఎత్తి చూపడం, వాటిని సరైన దారికి మళ్లించడం, ఎదుటివారిని నొప్పించకుండా సంభాషించడాన్ని అలవాటు చేయడం ద్వారా క్లయింట్‌ను థెరపిస్టు సరైన మార్గంలోకి తీసుకుపోతాడు. దీనివల్ల క్లయింట్ క్రమంగా తనతో, ఇతరులతో సత్సంబంధాలు పెంచుకుంటాడు. డ్యాన్స్ థెరపీ పదంతో కలిసి కదం తొక్కినప్పుడు శరీరానికి నూతనోల్లాసం కలుగుతుంది. దీని ఆధారంగా డ్యాన్స్ థెరపీ ఆరంభమైంది. అందుకే ఆధునిక కాలంతో దీన్ని అనేక మొండి వ్యాధులకు స్వాంతనకోసం వాడుతున్నారు. నొప్పులు, ఒత్తిళ్లు, మానసిక చింత, కుంగుబాటు, కండరాల్లో బాధ, స్ట్రెస్, ఊబకాయం తదితర పలు ఇబ్బందులకు ఈ థెరపీ ఉపయోగపడుతుంది. కరోనా కాలంలో పిల్లల్లో పెరిగిన ఒత్తిడి తగ్గించడంలో దీని పాత్ర అమోఘమని అమెరికాకు చెందిన స్టెస్ర్ల్యాబ్ పేర్కొంది. సాంకేతికత పెరిగి శారీరక శ్రమ తగ్గుతూ వస్తున్న ఈ రోజుల్లో నృత్య సాధనతో శరీరానికి తగినంత వ్యాయామం కూడా లభిస్తుంది. డ్యాన్స్ థెరపీతో అటు మానసిక, ఇటు శారీరక ప్రయోజనాలు కలుగుతాయన్నది నిపుణుల మాట. నృత్యాల్లో అభినయించే ముద్రలు, స్టెప్పులు మూవ్మెంట్ థెరపీలో కీలక పాత్ర పోషిస్తాయి. దీన్ని క్రమపద్ధతిలో పాటించడం వల్ల శరీరంలో ఒక రిథమ్ పెరగడంతోపాటు ఆత్మవిశ్వాసం మెరుగుపడడం గమనించవచ్చు. చిన్నపిల్లలకు అలవాటు చేయడం వల్ల వారి మానసిక, శారీరకోన్నతికి తోడ్పాటు లభిస్తుంది. ఇందులో కూడా గ్రూప్, వైయుక్తక థెరపీలుంటాయి. మన అవసరాన్ని బట్టి కావాల్సిన విధానాన్ని థెరపిస్టు సూచిస్తాడు. యోగాలో జరిగినట్లే డ్యాన్స్ థెరపీలో శ్వాసపై ధ్యాస పెరుగుతుంది. దీర్ఘ శ్వాసలు తీసుకోవడం వల్ల వంట్లో ఉండే వేగస్ నరం చురుగ్గా పనిచేస్తుంది. ఇది శరీరంలోని అతిపెద్ద నరం. దీని ప్రభావం పలు జీవ క్రియలపై ఉంటుంది. దీన్ని చురుగ్గా ఉంచడమంటే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడమే! (చదవండి: అదిరిపోయే బ్రైడల్ కలెక్షన్.. చూపు తిప్పుకోలేరు!) వినూత్న థెరపీలను ఎంచుకోవడమే కాదు, వాటిని ఆచరించే చిత్తశుద్ధి కూడా అవసరం. లేకుంటే ఎన్ని థెరపీలు చేపట్టినా ఏ ప్రయోజనం ఉండదు. అలాగే నకిలీలను ఎంచుకోకుండా సర్టిఫైడ్ థెరపిస్టుల వద్దకు వెళ్లడం మరువకూడదు. ఇప్పుడు ఇండియాలో పలు యూనివర్సిటీలు, కాలేజీలు ఇలాంటి థెరపీల్లో డిగ్రీలను ఆఫర్ చేస్తున్నాయి. అందువల్ల ఇలాంటి థెరపిస్టుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అవగాహన, అనుభవం ఉన్న థెరపిస్టు వద్ద తీసుకునే థెరపీ ఎప్పటికీ ప్రయోజనమే! – శాయి ప్రమోద్ (చదవండి: ఈ కాఫీ తాగితే బరువు తగ్గొచ్చు.. ఇంకా) -
ఐటమ్‌తో ఆరా అలా.. తల్లైన రష్మిక అంటూ చార్మీ పోస్ట్
నటి, నిర్మాత చార్మీ కౌర్‌కి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. తను పెంచుకుంటున్న కుక్కపిల్లని కొడుకుగా భావిస్తుంది చార్మి. తన పెట్ చేసే అల్లరిని సోషల్ మీడియా ద్వారా ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌తో పంచుకుంటుంది. ఆ ఫోటోలు వైరల్ అయినా సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇదిలా ఉంటే పెట్స్ ప్రేమని రష్మికకు కూడా రుద్దింది చార్మీ. రష్మిక మందన్నా ప్రస్తుతం పలు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమితాబ్, సిద్దార్త్ మల్హోత్ర సినిమాలతో ఫుల్ సందడి చేస్తున్నారు. తాజాగా మరో బాలీవుడ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. షూటింగ్ నిమిత్తం తాజాగా ఆమె ముంబైలో వెళ్లిన రష్మిక.. అక్కడే మకాం వేసిన చార్మీ వద్దకు వెళ్లింది. ఈ సందర్భంగా రష్మికకు ఓ పెట్‌ను దత్తత ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని చార్మి సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్స్‌తో పంచుకుంది. ‘ఐటమ్‌ని ఆరా కలిసినప్పుడు.. కంగ్రాట్స్ రష్మిక.. మీ బిడ్డ ఎంతో బాగుంది. మా ముంబైకి స్వాగతం’అని పోస్ట్ చేసింది. ఇక ఈ పోస్ట్‌కు రష్మిక స్పందిస్తూ.. థ్యాంక్యూ ఛార్మీ, ఇకపై ఎప్పుడూ నన్ను అక్కడే చూడాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. ఇంతకి ఐటమ్, ఆరా ఏంటి అనుకుంటున్నారా? చార్మీ పెంపుడు కుక్క పేరు ఐటమ్, రష్మిక పెట్ పేరు ఆరా. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) చదవండి: Pawan Kalyan: ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..‘వకీల్ సాబ్’ మళ్లీ వస్తున్నాడు -
ప్రేమలో పడిపోయా.. రష్మిక పోస్ట్ వైరల్
అల్లరి పిల్ల, అందాల తారా రష్మిక మందన్నా మరోసారి ప్రేమలో పడిందట. అది కూడా కేవలం మూడు మిల్లీ సెకన్లనే పడిపోయిందట. ఈ విషయాన్ని ఆమే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. సాధారణంగా ఎవరైనా ప్రేమలో పడటానికి మూడు సెకన్ల సమయం పడుతుందని తాను మాత్రం కేవలం మూడు మిల్లీ సెకన్లలోనే ప్రేమలో పడ్డానని రష్మిక తన ప్రేమ గురించి చెప్పుకొచ్చారు. అయితే ఈ సారి ప్రేమలో పడింది మనుషులతో కాదు, తన లిటిల్ పెట్ జౌరాతో. ‘ఈ ఇబ్బందికర పరిస్థితుల్లోనూ నాకు ఆనందాన్ని ఇచ్చిన నా లిటిల్ పెట్‌ను మీకు పరిచయం చేస్తున్నా’ అంటూ తన పెట్ డాగ్ ఫోటోస్‌ను సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశారు రష్మిక మందన్న. ఆ ఫోటోలు సోషల్ మీడియాలొ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈ భామ తెలుగులో అల్లు అర్జున్ ‘పుష్ప’, శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రాల్లో నటిస్తుంది. అలాగే బాలీవుడ్లో గుడ్ బై, మిషన్ మజ్ను సినిమాల్లో హీరోయిన్గా నటిస్తోంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) చదవండి: అకీరా గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన రేణూ దేశాయ్ ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ డేట్‌పై రాజమౌళి సంచలన నిర్ణయం! -
వీధి కుక్కల కోసం 'అడాప్ట్ ఎ పెట్'
-
‘పెట్’.. బహుపరాక్!
సాక్షి, అమరావతి : మనుషులకే కాదు.. కుక్కలకూ కరోనా సోకుతోంది. ఆ మాటకొస్తే ఈ శునకాలు ఇప్పుడు కాదు.. వందేళ్ల క్రితం నుంచీ ఇవి కరోనా వైరస్ బారిన పడుతున్నాయి. కానీ ఇప్పుడు మనుషులకు ఈ ప్రాణాంతక వైరస్ వ్యాప్తి చెందడంతో జనానికి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రస్తుత తరుణంలో మనుషుల నుంచి కుక్కలకు ఈ వైరస్ సంక్రమిస్తోందని అమెరికాలో నిర్ధారణ అయ్యింది. అయితే వీటి నుంచి మనుషులకు సంక్రమిస్తుందా? లేదా? అన్నది తేలాల్సి ఉంది. జిల్లాలో ప్రభావం.. కృష్ణా జిల్లాలోనూ పెంపుడు కుక్కలకు కరోనా వైరస్ సోకుతోంది. పశువైద్య శాఖ అధికారుల అంచనా ప్రకారం 2–3 శాతం పెంపుడు కుక్కలు ఈ వైరస్ బారిన పడుతున్నాయి. వీటిని యజమానులు పశువైద్య శాలలకు తీసుకొచ్చి వైద్యం చేయిస్తున్నారు. జిల్లాలో దాదాపు 30 వేల పెంపుడు కుక్కలున్నట్టు ఆ శాఖ అధికారులు తేల్చారు. కరోనా సోకిన కుక్కలను వాటి యజమానులు పశువైద్యశాలలకు తీసుకొచ్చి చికిత్స చేయిస్తున్నారు. ఈ వైరస్ సోకిన కుక్కలకు సకాలంలో చికిత్స చేయించకపోతే 80 శాతం మరణించే ప్రమాదం ఉందని పశువైద్య అధికారులు చెబుతున్నారు. పెంపుడు కుక్కలకంటే వీధి కుక్కల్లో కరోనా వ్యాధి నిరోధక శక్తి అధికంగా ఉంటుందని వీరు పేర్కొంటున్నారు. అందువల్ల పెంపుడు కుక్కలపైనే ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కరోనా సోకిన కుక్కల లక్షణాలు.. ∙కుక్కల సాధారణ టెంపరేచర్ 102 డిగ్రీలు. ∙కరోనా వైరస్ సోకితే 103–107 వరకు పెరుగుతుంది. ∙జ్వర లక్షణాలు కనిపిస్తాయి. ∙వాంతులు, రక్త విరేచనాలు అవుతాయి. ∙ఆహారం అంతగా తీసుకోదు. ∙కుక్క శరీరంలో వైరస్ ఏడు రోజుల పాటు ఉంటుంది. వేయవలసిన మందులు.. ∙కరోనా సోకిన మనుషులకు ఇచ్చినట్టే కుక్కలకూ యాంటీబయాటిక్స్ ఇస్తారు. ∙సిఫ్టాక్సిన్ 25ఎంజీ/కేజీ బరువుకు ∙పెరినార్మ్ .5 ఎంఎల్, ∙హిస్టాక్ 1 ఎంఎల్ ఇంజక్షన్. ఇలా ఐదు రోజులు ఇవ్వాలి. ∙వారం రోజులు ట్రీట్మెంట్ ఇచ్చాక ఏడాదికొకసారి వ్యాక్సిన్ వేయించాలి. అందుబాటులో వ్యాక్సిన్.. ∙కుక్కలకు సోకిన కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ అందుబాటులోనే ఉంది. ∙ఒక్కో వ్యాక్సిన్ ధర రూ.350–500 వరకు ఉంటోంది. ఈ వ్యాక్సిన్ పేరు కరోనా వ్యాక్సిన్. ∙కుక్కలను పెంచే వారు పరిశుభ్రత పాటించాలి. యజమానులు జాగ్రత్తలు పాటించాలి.. కుక్కలకు కరోనా వైరస్ సోకుతున్న నేపథ్యంలో యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక టెంపరేచర్, వాంతులు, రక్త విరేచనాలు వంటి లక్షణాలు కుక్కల్లో కనిపిస్తే అది కరోనాగా నిర్ధారించుకోవాలి. ఈ లక్షణాలున్న కుక్కలను వాటి యజమానులు సమీపంలోని పశువైద్య శాలలు, గన్నవరం వెటర్నిరీ కాలేజీ, లబ్బీపేట ఎన్టీఆర్ వెటరినరీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో వైద్యం అందుతోంది. వ్యాక్సిన్ మాత్రం యజమానులే కొనుక్కోవాలి. – కొక్కెరగెడ్డ విద్యాసాగర్, జాయింట్ డైరెక్టర్, పశుసంవర్ధకశాఖ -
దీపావళి.. ఒట్టేసి చెప్పమన్న సమంత
-
భాషా పండిట్లు, పీఈటీలు ఇక స్కూల్ అసిస్టెంట్లు..!
భువనగిరి : తమ ఉద్యోగాలను అప్‌గ్రేడ్ చేయాలని తెలుగు, హిందీ భాషా పండిట్లతో పాటు పీఈటీలు ఏళ్ల తరబడి చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించింది. వారికి స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ప్రభుత్వ నిర్ణయాన్ని హర్షిస్తూ మాట్లాడుతున్న గండమల్ల విశ్వరూపం ఎల్బీ స్టేడియంలో 2017 డిసెంబర్లో జరిగిన తెలుగు భాషా ప్రపంచ మహాసభల సందర్భంగా భాషా పండితులను స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేస్తామని సీఎం కేసీఆర్ అప్పట్లో ప్రకటించారు. ఇచ్చిన హామీ మేరకు వారికి పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. భాషా పండితులకు పాతికేళ్లుగా పదోన్నతులు లేకపోవడంతో గ్రేడ్–2 పండితుల స్థాయిలోనే పదవీ విరమణ చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో యాదాద్రి భువనగిరి జిల్లాలో 270 మందికి లబ్ధి చేకూరనుంది. పాతికేళ్లుగా తక్కువ వేతనంతోనే విధులు యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రభుత్వ, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1,446 మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ఎస్జీటీలు అందరూ ప్రాథమిక పాఠశాలల్లో, స్కూల్ అసిస్టెంట్లు హైస్కూళ్లలో విద్యాబోధన చేస్తున్నారు. ఎస్జీటీ కేటగిరీలో ఎంపికైన భాషా పండితులు, పీఈటీలు మాత్రం హైస్కూళ్లలో పని చేస్తుంటారు. వీరు ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్లతో సమానంగా పని చేస్తున్నప్పటికీ ఎస్జీటీల జీతభత్యాలు మాత్రమే లభిస్తున్నాయి. రైట్ టు యాక్ట్ ప్రకారం పనికి తగిన వేతనం చెల్లించాలని పాతికేళ్లుగా భాషా పండితులు, పీఈటీలు ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. అప్‌గ్రేడ్ చేయాలంటూ 2002లో ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేయడంతో అప్పటి ప్రభుత్వం స్పందించి 2017 ఫిబ్రవరి 3వ తేదీన 17, 18జీఓలను తీసుకువచ్చి పదోన్నతులకు పచ్చజెండా ఊపింది. ఆ జీఓలపై ఇతర ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్లడంతో దశాబ్ధన్నర కాలంగా పదోన్నతుల ప్రక్రియ నిలిచిపోయింది. 273 మందికి అప్‌గ్రేడ్ జిల్లాలో 63 ప్రాథమికోన్నత, 466 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మొత్తం 1,446మంది ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. ఇందులో ప్రాథమిక పాఠశాలల్లో 1,095పని చేస్తుండగా, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 351మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. కాగా ప్రభుత్వం భాషా పండితులకు, పీఈటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా అప్‌గ్రేడ్ చేయనుండటంతో జిల్లాలోని 273 మందికి పదోన్నతి లభించనుంది. జిల్లాలో 120మంది తెలుగు, 73 హిందీ భాషా పండితులు, 80మంది పీఈటీలు ఉన్నారు. వీరిందరినీ అప్‌గ్రేడ్ చేయడంతో స్కూల్‌అసిస్టెంట్లకు లభించే జీతభత్యాలతోపాటు పదోన్నతులు కూడా లభించనున్నాయి. ఫలితం దక్కింది దశాబ్ద కాలం పాటు భాషా పం డితులు చేసిన సుధీర్ఘపోరా టానికి ఫలితం దక్కింది. చాలా సంవత్సరాల నుంచి స్కూల్ అసిస్టెంట్ హోదాలో ఉన్నప్పటికీ వేతనాలు రాక, పండితులు ఇబ్బందులు పడ్డారు. భాషా పండితులు స్కూల్ అసిస్టెంట్లుగా మార్చడం కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. –కందుల ఉపేందర్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్ జిల్లా అధ్యక్షుడు సంతోషంగా ఉంది గ్రేడ్–2 హోదాలో ఉన్న భాషా పండితులకు పని ఎక్కువగా ఉండటంతోపాటు వేతనం తక్కువగా ఉండేది. ఈ విధంగా చాలా సంవత్సరాల పాటు పని చేయడం జరిగింది. ప్రస్తుతం గ్రేడ్2 హోదాలో ఉన్న పోస్టులను స్కూల్ అసిస్టెంట్లుగా మార్చడంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో సంతోషంగా ఉంది. –మహేశ్వరం విజయ, ఉత్తటూరు, రామన్నపేట మండలం స్కూల్ అసిస్టెంట్ హోదా దక్కనుంది గ్రేడ్2 హోదాతో దశాబ్ధన్నర కా లం పాటు పాఠశాలలో పని చేశా. గ్రేడ్2 హోదాలో ఉన్న త మకు ఎస్ఏ హోదా ఇవ్వాలని 1998 నుంచి ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చాం. 2003లో రెండుసార్లు జీవోల ద్వారా పదోన్నతులు కల్పిస్తామని చెప్పిన జరగలేదు. ప్రస్తుతం ఈవిషయంలో ప్రభుత్వం మార్పులు చేసి అప్‌గ్రేడ్ చేయడం పట్ల సంతోషంగా ఉంది. –మర్రి జయశ్రీ, భాషా పండితురాలు, ఖప్రాయపల్లి -
పెట్స్ హాలోవీన్
-
పెట్..ప్లే
-
మీ పెంపుడు కుక్కకు లైసెన్స్ ఉందా?
సాక్షి, బెంగళూరు: మీ ఇళ్లలో పెంపుడు కుక్కలు ఉన్నాయా? వాటికి లైసెన్స్ ఉందా? లైసెన్స్ ఏంటి.. అది కుక్కలకి ఏంటి అనుకుంటున్నారా!! ఇప్పటివరకు అయితే కుక్కలకు లైసెన్స్ తప్పనిసరి కాకపోయిన ఇకపై త్వరలో బీబీఎంపీ పరిధిలో కుక్కలకు లైసెన్స్‌లు కచ్చితం కానుంది. ఈ మేరకు బీబీఎంపీ ఆలోచన చేస్తోంది. బీబీఎంపీ పరిధిలో అపార్ట్మెంట్ అసోసియేషన్ నియమాల ప్రకారం లైసెన్స్ తప్పనిసరి. ఈ క్రమంలో ఆదివారం కబ్బన్ పార్కు క్యానిన్స్ (సీపీసీ) స్వచ్ఛంద సేవకులు, బీబీఎంపీతో కలుపుకుని కుక్కలకు లైసెన్స్‌లనే ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించారు. ఆదివారం పెంపుడు కుక్కకు సంబంధించిన ప్రభుత్వ గుర్తింపు, వ్యాక్సినేషన్ వివరాలతో పాటు అడ్రస్ ప్రూఫ్‌తో యజమానులు తమ కుక్కలను కబ్బన్ పార్కుకు తీసుకొచ్చారు. ఈ లైసెన్స్‌కు బీబీఎంపీ రూ. 110 చార్జీ చేసింది. లైసెన్స్ తీసుకున్న పెంపుడు కుక్కలకు ఉచిత హెల్త్ చెకప్, రాయితీతో కూడిన వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీసీ వ్యవస్థాపకురాలు ప్రియా చెట్టి మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు లైసెన్స్‌లు తీసుకోవడం ప్రతిఒక్క యజమాని బాధ్యతని చెప్పారు. భారత జంతు సంక్షేమ సంస్థ (ఏడబ్ల్యూబీఐ) నియమాల ప్రకారం కూడా దేశంలో ఎక్కడైన పెంపుడు కుక్కలకు లైసెన్స్‌లు తప్పనిసరని తెలిపారు. ప్రత్యేక డ్రైవ్ సందర్భంగా అన్ని జాతులకు చెందిన పెంపుడు కుక్కలతో కబ్బన్ పార్కులో సందడి నెలకొంది. -
మనుషులు ఎందుకు కలిసుండకూడదు?
న్యూఢిల్లీ : సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే బాలీవుడ్ నటి, రచయిత ట్వింకిల్ ఖన్నా తన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్స్ ఫొటోలు షేర్ చేసి జంతువుల పట్ల ప్రేమను చాటుకుంటున్నారు. అంతేకాదు వాటి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందంటున్నారు ట్వింకిల్. తన పెంపుడు కుక్క, పిల్లుల ఫొటోను షేర్ చేసి.. వేర్వేరు జాతులకు చెందిన కుక్క, పిల్లులే కలిసి ఉన్నపుడు మనుషులు మాత్రం ఎందుకు కలిసి ఉండకూడదంటూ ప్రశ్నిస్తున్నారు. నిజమే కదా చిన్న చిన్న విషయాలకే గొడవ పడే భార్యాభర్తలు ఈ పోస్ట్‌ను చూసి ట్వింకిల్ సలహాను పాటిస్తే ఏ గొడవా ఉండదు. తనకు, పిల్లులకు మధ్య ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లు భావిస్తారట ట్వింకిల్. ఎక్కడికి వెళ్లినా ఆమెకు పిల్లులు ఎదురవటంతో తాను ‘మురకామి పుస్తకం’లో ఉన్నానా అన్పిస్తుందటూ.. క్యాట్ పర్సన్ అనే హాష్ ట్యాగ్‌తో మరో పోస్ట్ చేశారు. అంతేకాకుండా తన ఫామ్ హౌజ్‌కు విచ్చేసిన అనుకోని అతిథుల ఫొటోలు కూడా షేర్ చేశారు. ‘నన్ను, నా ఇద్దరు పిల్లల్ని చూడటానికి తన ఇద్దరు పిల్లలతో నెమలి వచ్చింది.. కానీ వారి గురించి జడ్జ్ శర్మ చేసిన వ్యాఖ్యల గురించి అడగటం మరచిపోయా’నంటూ సరదాగా చెప్పుకొచ్చారు రచయితగా దూసుకెళ్తున్న ట్వింకిల్. వైవిధ్యమైన ఫొటోలు షేర్ చేయాలి, ఇన్స్టాగ్రామ్ అవార్డు పొందాలనుకుంటే ఆలస్యం చేయకుండా ట్వింకిల్ వద్ద ఇంటర్న్‌షిప్ చేసేయండి మరి. A potential Archies card right there with the slogan ‘If cats and dogs can kiss and makeup why can’t we?’ #home A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Mar 22, 2018 at 5:20am PDT Surprise visitors-A peahen and her two peachicks come to visit me and my two little ones - Forgot to ask them if our judge Sharma was right when he claimed that peacocks reproduced through their tears! #Jeez #springbreak #monodeal A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Mar 19, 2018 at 2:58am PDT Sometimes I think I live inside a Murakami book because cats seem to appear wherever I go #catperson A post shared by Twinkle Khanna (@twinklerkhanna) on Mar 13, 2018 at 7:55am PDT -
కుక్కల్లో వ్యాధి నిర్ధారణతో వైద్యం సులువు
ఆత్కూరు(గన్నవరం): పెంపుడు కుక్కల్లో వచ్చే గుండె సంబంధిత వ్యాధులను సకాలంలో నిర్ధారించడం ద్వారానే నివారణ సాధ్యమని అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన యువ పశువైద్య శాస్త్రవేత్త ప్రొఫెసర్ భార్గవి గడియారం స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా గన్నవరం మండలం ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్టులో పెంపుడు కుక్కల యాజమాన్యంపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో గురువారం వ్యాధుల నిర్ధారణ, నివారణ చర్యలపై పరిశోధన ప్రజెంటేషన్ చేశారు. ఈ సందర్భంగా భార్గవి కుక్కల్లో వచ్చే హర్ట్ఓర్మ్ వ్యాధి ప్రాణంతకరమైనదని చెప్పారు. దోమకాటు వల్ల సంభవించే ఈ వ్యాధి వల్ల పరాన్నజీవులు వ్యాప్తి చెంది ఊపిరితిత్తులు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుందని తెలిపారు. డయాగ్నసిస్ విధానంలో ఎక్సరే, రక్తం, యూరిన్ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారించవచ్చని చెప్పారు. ఈ వ్యాధి దోమల ద్వారా కుక్కల నుంచి మనుషులకు కూడా సంక్రమిస్తుందని వెల్లడించారు. బేరియాట్రిక్ సర్జరీ నిపుణులు ప్రొఫెసర్ ఎల్.రంగనాథ్ మాట్లాడుతూ... మనుషుల మాదిరిగానే ఆహార అలవాట్లలో వస్తున్న మార్పులు కారణంగా పెంపుడు కుక్కలో గుండె సంబంధిత వ్యాధులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ముఖ్యంగా ఎక్కువ కొవ్వు శాతం ఉన్న పదార్థాలను పెట్టడం కారణంగా కుక్కల్లో వయసు పెరిగిన కొద్దీ జీవ క్రీములు పెరిగి, రోగ నిరోధక శక్తి మందగిస్తుందని పేర్కొన్నారు. ఈ తరహా కుక్కలకు బేరియాట్రిక్ సర్జరీ ద్వారా వ్యాధి నివారణ చర్యలు తీసుకోవచ్చని చెప్పారు. కాలేయ వ్యాధి నిపుణులు ప్రొఫెసర్ డాక్టర్ పీఎన్ ద్వివేది మాట్లాడుతూ కుక్కల్లో ఎక్కువగా వైరస్ కారణంగా కాలేయ సంబంధమైన వ్యాధులు వస్తున్నాయని చెప్పారు. ఆహారం సరిగ్గా తీసుకోకపోవడం, నీరసించడం వంటివి వ్యాధి లక్షణాలుగా ఉంటాయన్నారు. కుక్కలకు ముందస్తు టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధి నుంచి కాపాడవచ్చని సూచించారు. ప్రొఫెసర్ డాక్టర్ నంది రేబిస్ వ్యాధి నిర్ధారణ, నివారణ పద్ధతుల గురించి వివరించారు. ప్రొఫెసర్ సయ్యద్ సాజిద్ హుస్సెన్ స్టెమ్‌సెల్ థెరపీ ద్వారా కుక్కల్లో నాడీ వ్యవస్థ సమస్యలను, కీళ్ళ సమస్యల పరిష్కార మార్గాలు గురించి తెలియజేశారు. కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జి.శ్రీనివాసరావు, సదస్సు నిర్వాహకులు వై. వైకుంఠరావు, దేశ, విదేశాలకు చెందిన 300 మంది పాల్గొన్నారు. -
బస్సుల్లోనూ పెట్స్‌కు అనుమతి
దొడ్డబళ్లాపురం: ఇళ్లల్లో పక్షులను, ప్రాణులను పెంచుకునే వారు పనిమీద వేరే ఊరికి వెళ్లాలంటే పెద్ద చిక్కే. పెట్స్‌ను బస్సుల్లో వదలరమ్మా, రెండురోజులు చూసుకోండి అని ఇరుగుపొరుగుకు బతిమాలుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఎందుకంటే కుక్కలు, పిల్లులు, పక్షులు తదితరాలను ఆర్టీసీ బస్సులు, రైళ్లలో అనుమతించరు కాబట్టి వాటిని వెంట తీసుకుపోవడం కుదరదు. ఇకపై కేఎస్ఆర్టీసీ బస్సుల్లో పెంపుడు జంతువులు, పక్షులను తీసుకుని ప్రయాణించడానికి అనుమతి ఇస్తారట. ఒక పెట్‌కి ఒక టికెట్ కొనాల్సి ఉంటుంది. ఇకపై ఇష్టానుసారంగా లగేజీలు తీసుకువెళ్లడం కూడా కుదరదు. కేఎస్ఆర్టీసీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు విమర్శిస్తున్నారు. పక్షులు, ప్రాణులు బస్సుల్లో వస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉండడంతో పాటు శుభ్రత లోపిస్తుందని వాపోతున్నారు. లగేజీ చార్జీలు పెంపు ఒక వ్యక్తి 30 కేజీలు, పిల్లలయితే 15 కేజీలు లగేజీ మాత్రమే తీసికెళ్లే అవకాశం ఉందట. అంతకుమించి లగేజీ తప్పనిసరయితే కేజీకి రూ.1 చెల్లించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 1 నుండి ఈ కొత్త నిబంధనలు, ధరలు వర్తిస్తాయి. -
ఇంట పాస్ ఇంటర్నేషనల్‌కు ప్లస్...
‘‘అక్రమ రవాణా అడ్డుకుని 100 ఒంటెలను స్వాధీనం చేసుకున్నారు’’ టీవీలో ఇలాంటి వార్తని క్యాజువల్‌గా చూసి ఊరుకుంటాం. ఆమె మాత్రం వెంటనే అధికారులను సంప్రదించి తన వంతుగా ఆ మూగ జీవాల రవాణా వ్యయం భరించడానికి రెడీ అని చెబుతారు. మన చుట్టూ ఉన్న జంతువులను ప్రేమించడం అవసరం అంటూన్న శర్వాణి, వినూత్న శైలిలో పెట్స్ మేగజైన్ నిర్వహణలో తనదైన ముద్ర వేస్తున్నారు. ‘‘జంతువులు మనతో కలిసి బతకడాన్ని ఇష్టపడతాయి. యూట్యూబ్ చానెల్ ద్వారా వన్యప్రాణులకు సన్నిహితంగా బతకడం అవసరమని సూచించే కార్యక్రమాలు అందిస్తున్నాం’’అని హైదరాబాద్ పాస్ నిర్వాహకురాలు, పీపుల్స్ ఫర్ యానిమల్ సంస్థకు గౌరవ సభ్యురాలు శర్వాణి చెప్పారు. దిక్కూమొక్కూ లేని జంతువుల సమాచారాన్ని అందించమని కోరుతూ దేశంలోనే తొలి స్ట్రే యానిమల్ రెస్క్యూ యాప్‌ని సైతం రూపొందించిన శర్వాణి... మూగ జీవాలపై ప్రేమతో ఓ మేగజైన్‌ను ఏర్పాటు చేసి, అనుబంధంగా సేవా కార్యక్రమాలూ నిర్వహిస్తున్నారు. ఆమె పంచుకున్న అనుభవాలు ఆమె మాటల్లోనే... నమ్మకాన్ని ‘పెంచుకున్నా’... ఆటోమొబైల్ సబ్జెక్ట్‌లో డిగ్రీ చేశాను. ఉద్యోగం çకన్నా విభిన్నంగా ఏదైనా చేయాలనేది ఆలోచన. అదే హైదరాబాద్ పాస్,. పెంపుడు జంతువుల కోసం తొలి మేగజైన్. మొదట్లో కొనడం సంగతి దేవుడెరుగు. కొన్ని వేల కాపీలు డోర్ టు డోర్ పంచాం. ఒక దశలో ఎనర్జీస్ అన్నీ ఖర్చయిపోయినట్టు అనిపించింది. అప్పుడే మేగ్జైన్కే పరిమితం కాకుండా పలు కార్యక్రమాలకు విస్తరించాం. క్రీడాకారులకు, వికలాంగులకు, అనాథలకు ఆసరా, నిర్భయ వంటి సంఘటనల సమయంలో నిరసనలు, ప్రముఖులను భాగం చేస్తూ సేవా కార్యక్రమాలు, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీ కింద సంగారెడ్డి జిల్లాలో కొన్ని గ్రామాల్లో నిరాశ్రయులకు నీడ కల్పించడం, శానిటరీ ప్యాడ్స్ వాడడం నేర్పించడం, అపోహలు, మూఢ నమ్మకాలను తొలగించడం.. వంటివి చేస్తూ... హైదరాబాద్ పాస్‌ను ఒక సామాజిక సంస్థగా మార్చాను. మూగజీవాల పెంపకం, అనాథ జంతువుల దత్తత, పెట్స్ ఆరోగ్య సమస్యలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ హైదరాబాద్ పాస్ బెంగుళూర్, విజయవాడ తదితర నగరాల్లో కూడా ఉనికిని చాటుకుంది. మనసు పెట్టి చేసే ఏ పనైనా విజయం సాధిస్తుందనే నా నమ్మకాన్ని దాదాపు 75వేల కాపీలకు చేరిన హైదరాబాద్ పాస్... నిలబెట్టింది. వాటా విక్రయం ద్వారా దీనిని ఇక జాతీయ స్థాయికి తీసుకువెళ్లనున్నాం. ఇక లైఫ్‌స్టైల్ మేగ్జైన్... ఇంటర్నేషనల్ లైఫ్‌స్టైల్ మేగజైన్‌ను డిసెంబర్లో హ్యాష్ ట్యాగ్ పేరుతో లాంచ్ చేస్తున్నాం. తొలుత అమెరికా, భారత్‌లో నడపనున్నాం. ఫ్యాషన్, పేజత్రీ, పార్టీస్.. ఇలా కొన్ని అంశాలకే కాకుండా మరిన్ని విస్తృత అంశాలకు చోటు కల్పించనున్నాం. నాలుగేళ్లు కృషి చేసి సాధించిన అడ్మిషన్‌తో... వచ్చే ఏడాది హార్వర్డ్ వర్సిటీలో గ్లోబల్ ఎంబిఎ ఫైనాన్స్ కోర్సు చేయనున్నాను. ఇది మేగజైన్ల నిర్వహణలో మరింత ఉపకరిస్తుంది. వైవిధ్యంగా ఆలోచించడం, ఎవరూ ఊహించని రంగాలను ఎంచుకోవడం, ఎప్పటికప్పుడు మేధస్సుకు పదును పెట్టుకోవడం ఈ మూడు పనుల మేళవింపుతో పనిచేస్తే అద్భుతమైన విజయాలను అందుకోవచ్చు. – ఎస్.సత్యబాబు -
పెంపుడు కుక్కలకు టీకాలు
కర్నూలు (అగ్రికల్చర్) : ప్రపంచ జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బహుళార్థ పశువైద్యశాలలో గురువారం.. పెంపుడు కుక్కలకు యాంటి రేబిస్ వాక్సిన్ను ఉచితంగా వేవారు. ఈ సందర్బంగా పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ డా.సుదర్శన్‌కుమార్ మాట్లాడుతూ.. పందుల నుంచి మెదడు వాపు వ్యాధి సోకుతుందని, వీటిని నివాసాలకు దూరంగా ఉంచాలన్నారు. పశుపోషకులు, గొర్రెలు, మేకల పెంపకందారులు, కబేళాల్లో పనిచేసే వారు విధిగా రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. కర్నూలు డీడీ సీవీ రమణయ్య, వెటర్నరీ పాలీ క్లీనిక్ డీడీ హమాద్పాష, పశువ్యాధి నిర్ధారణ కేంద్రం ఏడీ శ్రీలక్ష్మి, పశుసంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ విజయుడు, అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్లు రవిబాబు శ్యామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ఆత్మీయ నేస్తం – అందమైన ఇల్లు?
సెల్ఫ్ చెక్ పెంపుడు జంతువులు ఇంట్లో తిరుగుతుంటే ముచ్చటగానూ, ఆత్మీయ నేస్తం అంటిపెట్టుకుని ఉన్నట్లు ఉంటుంది. అయితే వాటిని పెంచుకుంటూ ఇంటిని అందంగా ఉంచుకోవడం గృహిణికి పరీక్ష. 1. ఫర్నిచర్‌ను పెంపుడు జంతువులు గోళ్లతో గీరుతుంటాయి కాబట్టి క్రమం తప్పకుండా గోళ్లను కత్తిరిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 2.మొక్కల మొదళ్లను, మట్టిని పెట్ యానిమల్స్ కదిలించి పాడు చేయకుండా కుండీలలో అందంగా కనిపించే రాళ్లను అమరుస్తున్నారు. ఎ. అవును బి. కాదు 3. సోఫాల సందుల్లో ఉండిపోయిన వెంట్రుకలను చేతులకు లేటెక్స్ గ్లవ్స్ వేసుకుని ఫర్నిచర్ మీద ఒకే డైరెక్షన్లో రుద్దినట్లు తుడిస్తే మొత్తం వచ్చేస్తాయి. లేదా క్లాత్‌ను తడిపి తుడవాలి. ఎ. అవును బి. కాదు 4. కార్పెట్ మీద చిక్కుకున్న పెంపుడు జంతువుల బొచ్చును వ్యాక్యూమ్ క్లీనర్‌కు బదులుగా స్పాంజ్‌తో పని పూర్తి చేయవచ్చు. ఎ. అవును బి. కాదు 5. పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా వ్యాక్సిన్లు వేయిస్తున్నారు. ఎ. అవును బి. కాదు 6. నియమిత వేళల్లో ఆహారాన్ని ఇవ్వడం, ప్రకృతి అవసరాలను తీర్చుకోవడంలో క్రమ పద్ధతిని అలవాటు చేశారు. ఎ. అవును బి. కాదు 7. ఇల్లంతా తిరుగుతూ, దూకుతూ కిచెన్‌లో ప్రమాదాలు కలిగించకుండా శిక్షణనిచ్చారు. ప్రమాదకరమైన ఫీట్లు చేసినప్పుడు ముఖం మీద నీటిని స్ప్రే చేస్తే తిరిగి ఆ పనిని చేయవు. ఎ. అవును బి. కాదు 8. పెట్ యానిమల్స్ తడిసినప్పుడు, చెవి ఇన్ఫెక్షన్ సోకినప్పుడు కూడా దుర్వాసన వస్తుంది. కాబట్టి తడి లేకుండా ఒంటిని తుడవడం, డాక్టర్ సలహా తీసుకోవడంలో నిర్లక్ష్యం చేయరు. ఎ. అవును బి. కాదు సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే పెట్ యానిమల్స్‌ను ప్రేమగా పెంచుకుంటూనే ఇంటిని అందంగా ఉంచుకోవడంలో మీకు అవగాహన ఉంది. ‘బి’లు ఎక్కువైతే మీరు మరికొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఇవి ఇంటిని కీకారణ్యం చేసేస్తాయి. -
మీ పెట్‌కి పెట్టేది ఆర్గానిక్ ఫుడ్డేనా?!
పెటానిక్ ఆర్గానిక్ మేనియా మన దగ్గరే కాదు ప్రపంచమంతా హల్చల్ చేస్తోంది. మన ఆరోగ్యం బాగుంటే చాలా! మనం అమితంగా ప్రేమించే పెట్స్ మాటేమిటి? అని కూడా యావత్ ప్రపంచం ఆలోచన చేస్తోంది. దాని ఫలితంగానే పెట్స్ కూడా ప్రతిపూటా ఆర్గానిక్ భోజనం రెడీ అవుతోంది. దాంతో పెట్ ఇండస్త్రీస్ అన్నీ ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీకి తెగ హైరానా పడిపోతున్నాయి. కుటుంబంలో అత్తా–మామ, అన్న–తమ్ముడు, కొడుకు– కోడలు సరసన ఇప్పుడు డైనింగ్ టేబుల్ వద్ద పెట్కీ ఓ కుర్చీ తప్పనిసరిగా ఉంటోంది. దీన్నిబట్టి పెంపుడు జంతువులకు మనవారు ఇచ్చే ప్రాధాన్యత ఎంతగా పెరిగిందో అర్థమైపోతోంది! మనుషులమైన మనం మన ఆరోగ్యానికి ప్రకృతి సిద్ధంగా లభించే ఆహార ఉత్పత్తుల కోసం శ్రద్ధ పెట్టగా లేనిది ప్రేమగా చూసుకునే పెట్స్‌కి పెట్టే తిండి గురించి ఎందుకు పట్టించుకోకూడదు అనుకుంటున్నారు పెట్ లవర్స్. ఈ ఆలోచన మనదే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్ లవర్స్‌ది. దీంతో పెట్ మార్కెట్లో ఆర్గానిక్ సందడి పెరిగింది. పెట్ ప్యాకేజ్డ్ ఫుడ్ మీద ఉండే లేబుల్స్ని నిశితంగా çపరిశీలిస్తున్నారు. వినియోగదారుల ఆసక్తిని సొమ్ము చేసుకోవడానికి ఆర్గానిక్ ఉత్పత్తులు పెట్స్ కోసం మార్కెట్లో కొలువుదీరడంలో పోటీ పడుతున్నాయి. ‘పెట్స్ ఆహార ఉత్పత్తులను కొనుగోలు చేయడంలో ధర కీలకమైనది’ అంటారు బార్న్స్ పెట్ ఫుడ్ ప్రొడక్ట్స్ మార్కెటింగ్ ఆపరేటర్ రాచెల్ షెర్మని, బరోన్స్ మార్కెట్ ఆపరేటర్ శాన్ డియోగో! ‘ప్రజలు పెట్స్‌ని ప్రేమిస్తారు. అందుకే వాటికోసం ధనాన్ని వెచ్చించడానికి సిద్ధపడతారు. అయితే, ఆ ధనం అత్యంత విలువైనదిగా భావిస్తారు. ఉత్పత్తులు నాణ్యమైనవి కావాలనుకుంటారు’ అని వివరిస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకొని పెట్ ఆర్గానిక్ ఉత్పత్తుల తయారీలో చాలా వరకు కంపెనీలు చవక నుంచి నాణ్యమైనవి తీసుకువస్తున్నాయి. పది–పదిహేనేళ్ల క్రితం తాము ఏం తినేవారో వాటినే పెట్స్‌కి పెట్టేవారు. అయితే, ఇప్పుడు ట్రెండ్ మారింది. తాము ఏమి తిన్నా, ఎలా తిన్నా పెట్స్ కోసం మాత్రం క్వాలిటీ ఫుడ్‌ని వెతికి, అమర్చి పెట్టే వారి సంఖ్య పెరిగింది. పెట్స్ పట్ల మనుషుల్లో ఉండే మానవతావాదం, పెంచుకున్న ప్రేమ ఈ రెండూ పెట్ ఇండస్ట్రీ మార్కెట్ విస్తృతిని పెంచుతున్నాయి. ఫోనిక్స్ బేస్డ్ పెట్ ప్రొడక్ట్స్ రిటెయిలర్ ఎవ్వెయా డెవిస్ ‘అవధులు దాటిని ప్రేమ పెట్స్‌ని జాగ్రత్తగా చూసుకునేలా చేస్తోంది. ఈ ప్రేమే సహజసిద్ధమైన, సేంద్రీయ, అత్యంత నాణ్యమైన ఆహార ఉత్పత్తుల సంఖ్యా పెరిగేలా చేస్తోంది’ అంటారు. ఈ విధానం వల్ల పెట్స్ ఆరోగ్యమూ పెరిగింది. అయితే, ఇదే సమయంలో నేచురల్ పెట్ ఫుడ్ రేషియో గణనీయంగా పెరిగింది. ఎంతగా అంటే గతంలో ఏడాదికి 3–4 శాతం ఉండే రేషియో ఈ పదేళ్లుగా పది శాతానికి పైగా పెరిగింది. పెట్ ప్రొడక్ట్స్ మార్కెట్ సర్వేలో 50 శాతం వినియోగదారులు ఇది నిజమే అని తమ అంగీకారం తెలిపారు. ఎవరికి వారు ప్రేమగా తయారీ ‘పెట్స్ కోసం కొనుగోలు చేసే బ్రాండెడ్ ఆర్గానిక్ ఉత్పత్తుల నుంచి తామే సొంతంగా పెట్స్‌కి ఆహారం తయారుచేయడం కోసం గ్లుటెన్ ప్రీ ఫుడ్స్ ఉపయోగించడం, గడ్డి తినిపించడం, ప్రొటీన్లు పుష్కలంగా లభించే పదార్థాలను సేకరించి వండి వార్చడం, మాంసాన్ని సరిపోలే ఉత్పత్తులను కొనుగోలు చేయడం పెరిగింది’ అంటున్నారు మార్కెట్ విశ్లేషకుడు రాక్విల్లె. దీక్షగా లేబుల్ పరిజ్ఞానం... మార్కెట్ విశ్లేషకుల వద్దకు వచ్చిన విషయాలు.... పెట్ ఫుడ్ లేబుల్ ప్రధానంగా ‘నేచురల్’ అనేది ఉంటే చాలు వాటి అమ్మకాల వృద్ధి కూడా బాగుంటుంది. పెట్ కోసం ఎకో ఉత్పత్తుల కొనుగోలుకు ప్యాకేజ్డ్ ఫుడ్ పై నిజానిజాల సర్వేని పట్టణ వినియోగదారుడు మరింత ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నాడు. పెట్ ఆహార ఉత్పత్తుల విషయంలోనే కాకుండా పెట్స్ ఇతర ఉత్పత్తులూ కూడా పర్యావరణహితంగా ఉండే ఉత్పత్తుల కొనుగోలులో ఆసక్తి చూపుతున్నాడు. పెట్ న్యూట్రిషన్ పట్ల వినియోగదారుడికి నూటికి నూరు శాతం ఆసక్తి పెరిగింది. ప్యాకేజ్డ్ ఫుడ్ మీద నిబంధనలు పారదర్శకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. పెట్ ఫుడ్ కొనుగోలు చేసే వినియోగదారులలో చాలా మంది విద్యావంతులైనవారే ఉండటానికి కూడా ఇది కారణం అవుతుంది. వీరే దాన్ని ప్రశ్నిస్తున్నారు. పెట్ ప్యాకేజ్డ్ ఫుడ్‌లో ఏదైనా సమస్యాత్మకమైన పదార్థాన్ని అదనంగా ఏది చేర్చినా దానిని వినియోగదారుడు తిరస్కరిస్తున్నాడు. దీంతో నేచురల్, ఆర్గానిక్, ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులు మార్కెట్లోకి విస్తృతంగా వచ్చేసినా వాటిలో తమ పెట్స్‌కి ఏది మంచిదో దానిని మాత్రమే వినియోగదారుడు ఎంచుకుంటున్నాడు.దీనిని దృష్టిలో పెట్టుకొని పెట్ ఉత్పత్తుల తయారీ కంపెనీలు ఇచ్చే ప్రకటనలు వినియోగదారులకు మరింత చేరువ కావాలని, స్టోర్స్‌లో ఉండే ఉద్యోగులకూ పెట్ ఫుడ్ పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. – ఎన్.ఆర్ -
భారత్‌పై విధ్వంసానికి ముష్కరుల భారీ కుట్ర
-
'పెట్స్'తో స్కెచ్!
పెంపుడు జంతువులకు బాంబులు అమర్చి పేలుళ్లకు పథకం ► గణతంత్ర వేడుకల్లో విధ్వంసానికి ముష్కరుల కుట్ర ► పారిస్ తరహాలో వాహనంతో విరుచుకుపడొచ్చు ► పెద్దనోట్ల రద్దుతో నిధులందక ఉగ్రవాదులు ఉక్కిరిబిక్కిరి ► తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించేందుకు ప్లాన్ ► అన్ని సంస్థలు ఒక్కటై ఏకకాలంలో పేలుళ్లకు పాల్పడొచ్చు ► రాష్ట్రాలన్నింటిని అప్రమత్తం చేసిన కేంద్ర నిఘా వర్గాలు సాక్షి, హైదరాబాద్ గణతంత్ర దినోత్సవం నేపథ్యంలో ఉగ్ర మూకలు కుట్రపన్నాయా? పెద్దనోట్ల రద్దుతో ఉక్కిరిబిక్కిరవుతున్న ముష్కర సంస్థలు తక్కువ ఖర్చుతో భారీ విధ్వంసం సృష్టించేందుకు స్కెచ్ వేస్తున్నాయా? గతానికి భిన్నంగా ఎవరికీ అనుమానం రాకుండా పెంపుడు జంతువుల(పెట్స్)కు బాంబులు అమర్చి పేలుళ్లకు పథక రచన చేస్తున్నాయా? కేంద్ర నిఘా వర్గాలు అవుననే అంటున్నాయి. పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలతో పాటు ఐసిస్, ఏక్యూఐఎస్ వంటి అంతర్జాతీయ సంస్థలూ విధ్వంసాలకు కుట్ర పన్నే ప్రమాదం ఉందని హెచ్చరించాయి. ఈ నెల 27 వరకు అప్రమత్తంగా ఉండాలంటూ శనివారం రాష్ట్రాలకు స్పష్టంచేశాయి. ఉగ్రవాదుల కుట్ర అమలుకు ఆర్థిక వనరులే అత్యంత కీలకం. అయితే పెద్దనోట్ల రద్దు ప్రభావంతో దేశంలోని నిద్రాణ దళాలు (స్లీపర్ సెల్స్), సానుభూతిపరులకు నిధుల రాక ఆగిపోయింది. దీంతో వారు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నేపథ్యంలో వారికి అవసరమైన నిధులను హవాలా మార్గంలో అందించేందుకు పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు సన్నాహాలు చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ఇప్పటికే రూ.2000, రూ.500 కొత్త నోట్లతోపాటు రూ.100 నోట్లను పాక్, బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సిద్ధం చేసి ఉంచినట్లు నిఘా వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ నిధుల్ని దేశంలోకి పంపడం కష్ట సాధ్యం కావడంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రభావం చూపే దాడులకు కుట్ర చేస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు చెప్తున్నాయి. పెంపుడు జంతువులతో విధ్వంసం.. మహారాష్ట్ర ఉగ్రవాద వ్యతిరేక దళం (ఏటీఎస్) అధికారులకు ఇటీవల ఓ కీలక సమాచారం అందింది. సాంకేతిక ఆధారాలతోపాటు గడిచిన రెండేళ్లలో అరెస్టు చేసిన ముష్కరుల విచారణలో ఇది బయటపడింది. దీని ప్రకారం ఈసారి ఉగ్రవాదులు పెంపుడు జంతువుల (పెట్స్) ద్వారా విధ్వంసానికి కుట్ర పన్నే ప్రమాదం ఉన్నట్టు అనుమానిస్తున్నారు. పెంపుడు జంతువులకు బాంబుల్ని అమర్చి ఎంపిక చేసుకున్న బహిరంగ ప్రదేశాల్లో ముష్కరులు పేలుళ్లకు కుట్ర పన్నుతున్నట్లు ఏటీఎస్ అధికారులు చెబుతున్నారు. దీంతో బహిరంగ ప్రదేశాలతో పాటు కీలక ప్రాంతాల్లో సంచరించే పెంపుడు జంతువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించాయి. ప్రధానంగా శీతాకాలం నేపథ్యంలో రొటీన్‌కు భిన్నంగా ప్రత్యేక వస్త్రాలతో, అసహజ/అనుమానాస్పద కదలికలతో ఉన్న పెంపుడు జంతువులతోపాటు వాటి యజమానుల పైనే కన్నేసి ఉంచాల్సిందిగా అన్ని రాష్ట్రాలనూ హెచ్చరించాల్సిందిగా ఏటీఎస్ కేంద్ర నిఘా వర్గాలను కోరింది. గణతంత్ర దినోత్సవాలు జరిగే ప్రాంతాలతోపాటు నగరాలు, పట్టణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిందిగా సూచించాయి. ఒంటరిగా వెళ్లి పెను విధ్వంసం.. ఉగ్రవాదులు, సానుభూతిపరులతో మాడ్యుల్ ఏర్పాటు, పేలుడు పదార్థాల సమీకరణ, బాంబుల తయారీ ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవి. దీంతో ముష్కర మూకలు ‘నైస్æ ఎటాక్స్’గా పిలిచే ‘లోన్ ఉల్ఫ్’దాడులకు కుట్ర పన్నినట్లు కేంద్ర నిఘా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. పారిస్ తరహాలో జనసమ్మర్థ ప్రాంతంలో భారీ వాహనంతో దూసుకుపోయి, వీలైనంత ఎక్కువ ప్రాణనష్టం కలిగించడాన్నే ‘నైస్ ఎటాక్’గా పిలుస్తారు. ఆ వాహనానికి డ్రైవర్‌గా వ్యవహరించే ముష్కరుడు తప్ప మరో వ్యక్తితో అవసరం లేదు. ఇలా ఒకే వ్యక్తితో పూర్తి చేయించే దాడుల్ని ‘లోన్ ఉల్ఫ్’దాడులు అంటారు. ఎదుటి వ్యక్తి తేరుకునే లోపే ఒంటరిగా వెళ్లి ‘పని’పూర్తి చేసుకురావడం ఈ దాడుల ప్రత్యేకత. బుధ, గురువారాల్లో గణతంత్ర దినోత్సవాలు జరిగే ప్రాంతాల సమీపంలో భారీ వాహనాల రాకపోకల్ని రాష్ట్రాలు నిషేధిస్తే ఉత్తమమని నిఘా వర్గాలు సూచించాయి. కేంద్ర నిఘా వర్గాలకు చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ... ‘‘ప్రతి ఏటా స్వాతంత్య్ర, గణతంత్ర దినోత్సవాలతోపాటు కీలక సందర్భాల్లో హెచ్చరికలు వెలుడుతుంటాయి. ఈసారి స్పష్టమైన సూచనలు ఉండటంతో ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశాం. దక్షిణాదిలో హైదరాబాద్ అత్యంత కీలకమైన ప్రాంతం’’అని అన్నారు. మూకుమ్మడి దాడులకు ప్లాన్! సాధారణంగా ఉగ్రవాద సంస్థలు వేటికవే విడివిడిగా ఆపరేషన్స్ చేపడతాయి. అయితే ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా అనేక ఉగ్రకుట్రలు భగ్నమయ్యాయి. దిల్సుఖ్నగర్ బాంబు పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) సహా మరికొన్ని సంస్థలకు చెందిన ఉగ్రవాదులకు శిక్షలు పడ్డాయి. ఈ నేపథ్యంలోనే ప్రతీకారంగా ఐదు సంస్థలు ఏకకాలంలో దాడులు చేయడానికి కుట్ర పన్నుతున్నట్లుగా కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలైన ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్)తోపాటు భారత్‌లో ఆపరేషన్స్ కోసం ఏర్పడిన అల్‌కాయిదా అనుబంధ సంస్థ అల్‌కాయిదా ఇండియన్ సబ్–కాంటినెంట్ (ఏక్యూఐఎస్), పాక్ ప్రేరేపిత హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌యూఎం), ఐఎం, లష్కరేతొయిబా (ఎల్ఈటీ)లు ఏకకాలంలో దాడులకు పథక రచన చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఒక్కో సంస్థ ఒక్కో ప్రాంతాన్ని ఎంచుకుని, ఒక్కో తరహాలో ఏకకాలంలో విరుచుకుపడాలని భావిస్తున్నట్లు కేంద్ర నిఘా వర్గాలు ఆధారాలు సేకరించాయి. దీంతో గణతంత్ర దినోత్సవం ముగిసే వరకు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిందిగా అన్ని రాష్ట్రాలను హెచ్చరించాయి. -
ఈసారి రూటు మార్చిన టెర్రరిస్టులు!
న్యూఢిల్లీ : గణతంత్ర వేడుకల సందర్భంగా పలు ముఖ్యమైన ప్రాంతాల్లో ఉగ్రవాదుల దాడులు జరిగే అవకాశాలున్నాయంటూ ఇంటిలిజెన్స్ హెచ్చరికలు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సారి టెర్రరిస్టులు కొత్త రకం దాడులకు పాల్పడే అవకాశముందని ఇంటిలిజెన్స్ గురువారం మరోసారి హెచ్చరించింది. కుక్కలను, పిల్లులను, ఎలుకలను ఆత్మాహుతి దాడులుగా మార్చి మారణహోమానికి పన్నాగం పన్నుతున్నారని పేర్కొంది. డీఎన్ఏ రిపోర్టుల ప్రకారం ఢిల్లీ, ముంబాయి, అహ్మదాబాద్ వంటి పలు ముఖ్యమైన ప్రాంతాలను టెర్రరిస్టులు టార్గెట్ చేశారని, గణతంత్ర వేడుకల సందర్భంగా వారు కుక్కలతో ఆత్మాహుతికి దాడికి దిగే అవకాశాలున్నాయని, అప్రమత్తంగా ఉంటాలంటూ ఇంటిలిజెన్స్ హెచ్చరికలు జారీచేసింది. శీతాకాల సమయాన్ని అవకాశంగా తీసుకుని , పెంపుడు జంతువులకు వేసే స్వెట్టర్ల ద్వారా దాడులకు ప్లాన్ చేస్తున్నారని ఏజెన్సీలు వివరించాయి. రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ దాడులు చేస్తారని తెలిపింది. జంతువులను వాడుకుని మొదట సిరియాలో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ టెర్రర్ అటాక్ చేసింది. ప్రభుత్వ కార్యాలయాలను టార్గెట్ చేసిన ఐఎస్ఐఎస్ మిలిటెంట్లు పక్షులను సైతం ఉగ్రదాడులకు వాడుకోనున్నాయని తెలుస్తోంది. ఉగ్రదాడుల హెచ్చరికల నేపథ్యంలో అన్ని విమానాశ్రయాల్లో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
పాఠశాలల్లో ‘ఖేల్ ఖతం’
• అరకొర మైదానాలతో కుంటుపడిన క్రీడాభివృద్ధి • జిల్లాలో కేవలం 118మంది పీఈటీలు, 27మంది పీడీలు మహబూబ్‌నగర్ క్రీడలు : జిల్లాలోని క్రీడల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. పాఠశాలస్థాయిలో క్రీడలను అభివృద్ధి చేస్తామన్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల మాటలు కేవలం మూటలుగా మిగిలిపోతున్నాయి. జిల్లాల్లోని చాలా పాఠశాలల్లో సరైన క్రీడామైదానాలు లేక విద్యార్థులకు క్రీడావికాసానికి దూరమవుతున్నారు. ఆటస్థలాలు లేని పాఠశాలలు కొన్ని...మైదానాలు ఉన్నా పీఈటీలు లేని పాఠశాలలు మరికొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఉన్నా ఆట పరికరాలు కనిపించని పాఠశాలలు మరెన్నో. జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు అసలే పీఈటీ లేరు. అరకొర వ్యాయామ ఉపాధ్యాయులు... మహబూబ్‌నగర్ జిల్లాలో 213 ఉన్నత పాఠశాలలు, 185 ప్రాథమికోన్నత పాఠశాలలు, 980 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటి పరి ధిలో కేవలం 118పీఈటీలు, 27మంది ఫిజికల్ డైరెక్టర్లు ఉన్నారు. అత్తెసరు వ్యాయా మ ఉపాధ్యాయులు, అరకొర మైదానాలతో జిల్లాలోని విద్యార్థులకు ఆటలకూ దూరమై, కేవలం చదువుకే పరిమితమవుతున్నారు. ఇక ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల్లో క్రీడలు, వ్యాయామ విద్యకు చోటులేదు. 9, 10 తరగతుల విద్యార్థులకు ఆటలు ఆడడానికి సమ యం లేకుండా సిలబస్ చదివిస్తున్నారు. పదు ల సంఖ్యలోని పాఠశాల్లో మైదానాల్లో క్రీడలు ఆడిపిస్తున్నారు. విద్యాహక్కు చట్టం అమలయ్యేనా...! విద్యాహక్కు చట్టం ప్రకారం వ్యాయామ విద్యను కచ్చితంగా అమలు చేయాలంటూ అప్పటి ప్రభుత్వం 2012లో జీఓన.63ను జారీ చేసింది. అయితే దాని అమలు మాత్రం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది. పాఠశాలల్లో వ్యాయామ విద్యను తప్పనిసరిగా అమలుచేయాల్సి ఉంది. ముఖ్యంగా 6 నుంచి 10 తరగతుల విద్యార్థులకు వ్యాయామ విద్య పీరియడ్లను తప్పనిసరిచేశారు. కానీ ఎక్కడా అమలు చేసిన దాఖలాలు కనిపించడం లేదు. క్రీడల నిర్వహణకు నిధుల కొరత... పాఠశాలల్లో క్రీడల నిర్వహణకు నిధుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం మంజూరు చేసే అరకొర నిధులు క్రీడల నిర్వహణకు ఏ మాత్రం సరిపోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఆర్వీఎం విడుదల చేస్తున్న పాఠశాల నిధుల నుంచే ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో క్రీడా పరికరాలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. చాలా వరకు పాఠశాలల్లో హెచ్ఎంలు క్రీడాసామగ్రి కొనడానికి చొరవ చూపడం లేదు. దీంతో పాఠశాలలో క్రీడలు ఆడిపించడం కేవలం నామమాత్రంగా కొనసాగుతుంది. నిధులు కేటాయిస్తేనే క్రీడాభివృద్ధి పాఠశాలల్లో క్రీడాభివృద్ధి కోసం నిధులు కేటాయించాలి. కొన్నేళ్లుగా క్రీడాసామగ్రి లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ప్రాథమిక స్థాయి నుంచే విద్యార్థులకు క్రీడల పట్ల అవగాహన కల్పించాలి. ప్రతి ఉన్నత పాఠశాలలో పీఈటీ ఉండాలి. సంఖ్యతో నిమిత్తం లేకుండా పీఈటీ పోస్టులను పీడీలుగా అప్‌గ్రేడ్ చేయాలి. పీఈటీలకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి. – దూమర్ల నిరంజన్, టీజీపీఈటీఏ జిల్లా అధ్యక్షుడు -
పుతిన్ అండ్ పెట్స్
రాజతంత్రాలు రణతంత్రాల మధ్య కాసింత మానసికోల్లాసానికి దేశాధ్యక్షులు ఏం చేస్తారు? విందు వినోదాలు... స్నేహితులతో కాలక్షేపం.... కానీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ అలా కాదు. ఏ మాత్రం టైమ్ దొరికినా అతడు తన పెంపుడు జంతువులతో గడుపుతాడు. మూగ జీవులతో ఆడుకుంటాడు. వాటి బాగోగులు చూడడంలో సంతృప్తి చెందుతాడు. మనుషులంటే ఏవో ఒకటి ఆశిస్తారు. కాని పెంపుడు జంతువులు ఏమీ ఆశించవు. ప్రేమిస్తాయి. ఉత్తినే అలా ప్రేమిస్తూనే ఉంటాయి. అందుకే పుతిన్‌కు అవి అంటే ఇష్టం. ఇలాంటి ఇష్టం ఉన్న దేశాధ్యక్షులు ఎంతమంది? మొన్నామధ్య పుతిన్ దత్తత తీసుకున్న మూడు సైబీరియా పులుల్లో ఒకటి అభయారణ్యపు కంచెలు దాటి చైనాలో అడుగుపెట్టింది. చైనా ఈ సంగతి తెలిసి మరేం ఫరవాలేదనీ తమ అడవుల్లో ఆ పులికి ఆహారం కోసం గొర్రెలనూ, దుప్పులనూ పంపుతామనీ చెప్పింది. అయితే ఆశ్చర్యకరంగా ఆ పులి మరుసటిరోజు చనిపోయి కనిపించింది. ఇది తెలిసి పుతిన్ ఎంత బాధపడ్డాడో చైనా అంత హడలిపోయింది. ఎటొచ్చి ఏం గొడవ వస్తుందో అని. ఒక పెంపుడు జంతువు వల్ల రెండు దేశాల మధ్య స్నేహం చెడిపోయేంత స్థాయిలో పుతిన్‌కు మూగజీవుల పట్ల ఆసక్తి ఉంది. ఇక అతడికి సొంతంగా అనేక శునకాలు ఉన్నాయి. వాటిలో ఇష్టమైనది – ‘యుమె’ అనే ‘అకిటా’ జాతి శునకం. జపాన్‌లో విస్తృతంగా కనిపించే ఈ జాతి శునకాన్ని రష్యాలో, అమెరికాలో, మరికొన్ని దేశాల్లో పెంచుకుంటున్నారు. పరాయివాళ్లతో పూర్తిగా దూరంగా ఉంటూ తన యజమాని కుటుంబంతో చాలా దగ్గరగా మసలే అకిటా జాతి శునకాలు యజమానితో ఆటలాడుతూ ఉల్లాసాన్ని పెంచుతాయి. ప్రేమ పంచుతూ ఆనందాన్నిస్తాయి. ఈ శునకాలతోటే కాదు... మంచు ఎలుగుబంటులు, డాల్ఫిన్లు, పులులు, గుర్రాలు... ఒకటనేముంది పుతిన్ మూగప్రాణుల ఆప్తమిత్రుడు. పూర్వాశ్రమంలో కెజిబి (రష్యా గూఢచార సంస్థ) ఏజెంట్ అయిన పుతిన్ సకల తంత్రాలలోనే కాదు... క్రూరమృగాలతో కూడా ఎలా వ్యవహరించాలో తెలుసుకున్నాడు. వేటగాడిగా కూడా అతడు అవసరమైతే తుపాకీ పట్టగలడు. ఈ విషయాన్ని కూడా అతడు ఫొటోల ద్వారా లోకానికి వెల్లడి చేస్తూ ఉంటాడు. ఇదంతా ఎందుకు అనంటే... ‘నేను మరీ కరడుగట్టిన దేశాధ్యక్షుణ్ణి కాదు. నా గుండెల్లో ప్రేమ ఉంది అని చెప్పడానికే. లేదా నేను ప్రేమనూ పంచగలనూ శత్రువును తుద ముట్టించనూ గలను అని చాటడానికే’ అని ఒక పరిశీలకుడు తేల్చాడు. ఏమైనా రష్యాకు రాజు కూడా మూగజీవుల ప్రేమకు బానిసే అని ఈ ఫొటోల ద్వారా మనకు తెలుస్తోంది. -
ఒబామా పెట్ డాగ్స్ కూడా బిజీ!
వాషింగ్టన్: పెట్ డాగ్స్ పట్ల యజమానులు ప్రేమానురాగాలు కురిపించడం చూస్తుంటాం. అబ్బో అవి ఎంత రాజభోగం అనుభవిస్తున్నాయో అంటూ వాటి అదృష్టాన్ని కొనియాడుతాం. అటువంటిది ఏకంగా ఓ దేశాధ్యక్షుడి ఇంట్లో పెట్ డాగ్స్ గా స్థానం పొందిన ఆ శునకాల అదృష్టాన్నేమనాలి? అటువంటి స్థానంలో ఉండటమేకాక, అక్కడ రాజ భోగాలు అనుభవించడంతోపాటు ఆ కుటుంబ సభ్యుల అమితమైన ప్రేమను అందుకుంటున్నాయి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా పెంచుకుంటున్న పెట్ డాగ్స్ బో అండ్ సన్నీలు. మరి త్వరలో ఒబామా పదవీకాలం ముగిసిన తర్వాత వాటి స్థానం ఎక్కడ? సాధారణంగా శునకాలు చేసే పని ఏముంటుంది? తినడం పడుకోవడం. ఇంకా చెప్పాలంటే యజమాని ఇంటికి కాపలా కాయడం. కొన్ని జాతి శునకాలు దొంగలను గుర్తించడంలో ఆరితేరి పోలీసులకు సహకరిస్తుంటాయి. అయితే ఒబామా వైట్ హౌస్ లో నివసిస్తున్న బో మరియు సన్నీలు మాత్రం ప్రెసిడెంట్ ఒబామాతోపాటు ఎంతో బిజీ బిజీ షెడ్యూల్ కలిగి ఉంటాయని తెలుసా? వైట్ హౌస్ అంబాసిడర్లుగా వ్యవహరించే ఆ శునకాల షెడ్యూల్ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒబామా కుటుంబం వైట్ హౌస్ లో పెంచుకుంటున్న పోర్చుగీస్ వాటర్ డాగ్స్ జాతికి చెందిన రెండు శునకాల్లో పెద్దది బో. ఏడేళ్ళ వయసున్న బో కు ఫస్ట్ డాగ్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ టైటిల్ కూడ ఉంది. ఇక రెండవది సన్నీ. ప్రతి ఒక్కరూ తమ పెంపుడు శునకాలను చూసేందుకు ఎంతో ఉత్సాహం చూపిస్తారని, వాటితో ఫొటోలు తీయించుకోవాలని ఆశ పడతారని సాక్షాత్తూ మిచెల్లే ఒబామాయే చెప్పడం విశేషం. అందుకే వాటి షెడ్యూల్ ను సైతం నెల ప్రారంభంలోనే ఖరారు చేస్తారట. దాని ప్రకారమే వాటిని ప్రదర్శనకు ఆమోదిస్తామని కూడ ఆమె అంటారు. ఈస్టర్ సమయంలో సందర్శనకు వచ్చిన వారికి వినోదాన్ని అందించడంలో బో, సన్నీలు ఎంతో బిజీగా ఉంటాయి. ప్రెసిడెంట్ ఇనాగరేషన్ సందర్భంలో కూడ పర్యాటకులను స్వాగతించే మెచెల్లేకు పక్కనే బో ఉంటుంది. అలాగే ప్రతియేటా క్రిస్మస్ ముందు ఆస్పత్రిలో ఉన్నవారిని పరామర్శించేందుకు వెళ్ళే సమయంలో కూడ మిచెల్లే తో పాటు ఆ రెండు శునకాలు ఉండాల్సిందే. అసలు బో, సన్నీలు ఎంత గుర్తింపు పొందాయో చెప్పడానికి గతంలో వాటిపై జరిగిన కిడ్నాప్ ప్రయత్నమే పెద్ద నిదర్శనం. ప్రస్తుతం ఏడేళ్ళ వయసున్న బో.. ఒబామా కుటుంబంలోకి 2009 లో అడుగు పెట్టింది. 2008 అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఒబామాకు మంచి మద్దతుదారుడగా ఉండటమే కాక, ఆయన కుటుంబానికి సైతం సన్నిహితుడుగా ఉండే మాజీ సెనేటర్ ఎడ్వార్డ్ ఎం కెన్నడీ... 'బో' ను ఒబామాకు బహుమతిగా ఇచ్చారు. అనంతరం నాలుగేళ్ళ వయసున్న సన్నీ 2013 ఆగస్టు లో ఒబామా కుటుంబ సభ్యురాలైంది. బో అప్పటికే వైట్ హౌస్ గ్రౌండ్స్ కీపర్ హెడ్ గా ఉన్న డేల్ హానీ కి హెల్పర్ గా విధులు నిర్వహిస్తోంది. ప్రతిరోజూ ఉదయం డేల్ తో పాటు నేషనల్ పార్క్ సేవల్లో ములిగిపోయే బో... నేషనల్ పార్క్ క్రూ సిబ్బందితో పాటు వాకింగ్ చేయడం, అక్కడి మొక్కలను పరీక్షించడం వంటివి తన బాధ్యతగా ఉన్నట్లే కనిపిస్తుందని, అలాంటి సమయంలో అసలు తమనుసైతం పట్టించుకోకుండా సీరియస్ గా విధులు నిర్వహిస్తున్నట్లు ఉంటుందని మిచెల్లే చెప్తుంటారు. అయితే తమ ఇంట్లో తమతోపాటు ఉంటున్న పెంపుడు జంతువులైన బో, సన్నీలు తమ కుటుంబ సభ్యులుగానే పెరుగుతున్నాయని, ఒక్కోసారి అవి నా ఒళ్ళోనూ, నా కుర్చీమీద కూర్చుంటాయని, నేను కూడ వాటిని ఎంతో ప్రేమగా నిమిరుతూ ఉంటానని, అవి మాకు ఎంతో ప్రేమను అందించడంతోపాటు, ఎంతో అందమైన జీవితాన్ని అనుభవిస్తున్నాయని మిచెల్ చెప్తారు. ముఖ్యంగా అధ్యక్ష పదవిలో ఉన్నవారి పెంపుడు జంతువులు ప్రజాదరణ పొందడం, వారికి సహచరులుగా ఉండటం సాధారణమే. అయితే వచ్చే ఏడాది జనవరిలో అమెరికా అధ్యక్షుడుగా పదవీ కాలం ముగియనున్న బరాక్ ఒబామా... గతేడాది ఓ సందర్భంలో తన పెంపుడు జంతువులైన బో, సన్నీల గురించి కూడ ప్రస్తావించారు. తాను వైట్ హౌస్ ఖాళీ చేసే ముందు తన పెంపుడు జంతువులు చించేసిన కాగితాలతో సహా ప్రతి చిన్న విషయాన్నీ క్లియర్ చేసి వెడతానంటూ హామీ ఇవ్వడం ఆయనకు వాటిపై ఉన్న ప్రేమతోపాటు... పదవిపట్ల ఆయనకున్న బాధ్యతను కూడ వెల్లడించింది. -
ఫిబ్రవరి 4న ప్రేమ పోటీల ప్రసారం
తనంటే అమ్మాయికి ప్రేమ ఉంన్నదీ లేనిదీ 'లవ్ మీటర్' ద్వారా తెలుసుకుంటాడు 'అపరిచితుడు'లో రెమో. నిజజీవితంలో ప్రేమను కొలిచే అలాంటి మ్యాజిక్ సాధనాలేవీ లేవుగానీ శాస్త్రీయ పద్ధతుల ద్వారా ప్రేమ గాఢతను నిరూపించవచ్చు. ప్రియమైన వ్యక్తిని చూడటంతోనే విడుదలయ్యే ఆక్సిటోసిన్(ప్రేమను కలిగించే హార్మోన్లు) ప్రభావానికి 'ఇంకా దగ్గరికి వెళ్లు' అని మెదడు ప్రతిస్పందనలు పంపుతుంది. ఈ రసాయనిక చర్య కేవలం స్వజాతి జీవుల్లోనే కాక విభిన్న జీవుల మధ్య కూడా ఒకేరకంగా ఉంటుందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ క్రమంలో మనిషిని అమితంగా ప్రేమించే జంతువు ఏది? అనే దిశగా జరిగిన ప్రయోగాల్లో ఆసక్తికరమైన ఫలితాలు వెల్లడయ్యాయి. మనిషిని ప్రేమించడంలో విశ్వాసానికి ప్రతీకగా నిలిచే శునకరాజాలు మార్జాలాలను తోసిరాజన్నాయి. అమెరికాకు చెందిన న్యూరోసర్జన్ పాల్ జాక్ పరిశోధన ఇలా చేశారు.. 10 పిల్లులు, 10 కుక్కలను ఎంచుకుని, అవి వాటివాటి యజమానులతో విడివిడిగా గడిపినప్పటి దృశ్యాలు రికార్డ్ చేయడమేకాక వాటి మెదళ్లలో చోటుచేసుకున్న రసాయన ప్రక్రియలను కూడా పరిశీలించారు. యజమానికి దగ్గరగా ఉన్నప్పుడు కుక్కలో 57.2 శాతం ఆక్సిటోసిన్ విడుదలకాగా, పిల్లిలో మాత్రం కేవలం 12 శాతమే విడుదలైంది. దీన్నిబట్టి యజమానిని ప్రేమించే పోటీల్లో కుక్కలే విజేతలుగా నిలిచాయి. ఈ ప్రయోగానికి సంబంధించిన కార్యక్రమం ప్రఖ్యాత న్యూస్ ఛానెల్ బీబీసీలో ఫిబ్రవరి 4న ప్రసారంకానుంది. -
కుక్కలకూ ఓ హాలోవెన్ ఫ్యాషన్ షో
-
పెట్స్‌తో జాగ్రత్త సుమా..!
కుక్క, పిల్లి, ఎలుక, పావురం, పిచ్చుక, గుర్రం, కుందేలు.. ఇలా ఏ ప్రాణినైనా పెంచుకునేందుకు నగరవాసులు మక్కువ చూపుతున్నారు. తమ ఆసక్తిని బట్టి, ఆర్థిక స్తోమతను బట్టి ఆయా జంతువులను సంరక్షిస్తున్నారు. కొందరికి ఇవి స్టేటస్ సింబల్‌గా కూడా మారిపోయాయంటే నగరవాసి జంతు ప్రేమ ఏ స్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు. అయితే, ఎక్కువ మంది శునకాలను పెంచుకునేందుకే ఆసక్తి చూపుతున్నారు. వీటిని విదేశాల నుంచి కూడా తెప్పించుకుంటున్నారు. ఎంత ఖరీదైన జంతువైనా సరే పెంపకంలో జాగ్రత్తలు తప్పనిసరి అంటున్నారు వెటర్నరీ వైద్యులు. పెట్స్ ఆహారం, ఆరోగ్యం విషయంలో కనీస అవగాహన అవసరమంటున్నారు. - రాజేంద్రనగర్ / సాక్షి, సిటీబ్యూరో జునోసిస్ అంటే.. జంతువులకు వాటి నుంచి మనుషులకు సంక్రమించే వ్యాధులను జునోసిస్ అంటారు. ఈ వ్యాధుల్లో రేబీస్ ప్రధానమైంది. లూయి పాశ్చర్ 1885 జులై 6న యాంటీ రేబిస్‌ను తొలిసారిగా ఉపయోగించారు. ఈ రోజునే యాంటీ రేబీస్ డేగా కూడా వ్యవహరిస్తుంటారు. అవగాహన అవసరం.. పెంపుడు జంతువులకు వేసే వాక్సినేషన్‌పై చాలా మందికి అవగాహన లేదు. కొంతమంది ఖర్చుతో కూడిందని పట్టించుకోరు. పెట్స్‌కు మాములుగా కరిచే గుణం ఉంటుంది కాబట్టి దాదాపు అన్ని రకాల పెట్స్‌కి వ్యాక్సినేషన్ తప్పనిసరి. మనిషికి, జంతువుకు ఉండే కాంటాక్ట్‌లో అది కరవడం, గీరటం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి. దాని వల్ల ఏదైనా ఆరోగ్య సమస్య రావచ్చు. క్యాట్స్, ర్యాబిట్స్ లాంటివి పెంచుతున్నవారు కూడా వ్యాక్సినేషన్ అవసరాన్ని గుర్తించాలి. మా సంస్థ తరపునవ్యాక్సినేషన్ అవసరంపై అవగాహన చెపడుతున్నాం. వ్యాక్సిన్ వేయించడం పెట్‌కి మాత్రమే కాదు.. పెట్ ఓనర్స్, వారి చుట్టూ ఉన్నవారి రక్షణకు సంబంధించిన విషయం. - నిహార్, ఏఆర్‌పీఎఫ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి వైద్య సలహాలు తప్పనిసరి జంతువుల నుంచి మనుషులకు సంక్రమించే రోగాలను ‘జునాటిక్ డిసీజెస్’ అంటారు. ఎబోలా, బర్డ్‌ఫ్లూ, రేబిస్, ఆంత్రాక్స్.. వంటివి జునాటిక్ వ్యాధులే. ఈ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ఉండాలంటే రెగ్యులర్‌గా వెటర్నరీ వైద్యుల సలహాలు తీసుకోవాలి. పెంపుడు జంతువుల ఆరోగ్యం, స్కిన్ కేర్ ఎంత ముఖ్యమో, వాటి యజమానులు వారి హెల్త్ కూడా ముఖ్యమని గుర్తించాలి. ముఖ్యంగా ఇంట్లో డాగ్స్ ఉన్నవారు చర్మ సమస్యలు వస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. సిటీలో కుక్కలు, పిల్లులు తర్వాత పక్షులను పెంచుతున్నారు. వీటి వల్ల లంగ్స్‌కి సంబంధించిన వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది. వాటిని నివారించేందుకు పక్షులకు సంబంధించిన వాటర్ వ్యాక్సిన్స్ ఇప్పించాలి. వైల్డ్ లైఫ్ యానిమల్స్, పెట్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అవసరమైన జాగ్రత్తలు తప్పనిసరి. - డాక్టర్ మురళీధర్, డాక్టర్ డాగ్ హాస్పిటల్స్ పెట్స్‌ను పిల్లల్లా చూడాలి.. నాకు మూడేళ్ల బాబు. హ్యాపీ, డాలర్, డ్యూక్ పెట్స్ (డాగ్స్) ఉన్నాయి. డాగ్స్‌తో పిల్లలకు ఇన్ఫెక్షన్ అనేది నేను ఫేస్ చేయలేదు. సాధారణంగా ఆరు నెలలకు ఓసారి డాగ్స్‌కి పొట్ట క్లీన్ కావడానికి డీవార్మింగ్ చేస్తారు. అయితే, వీధి కుక్కలకు ఇలాంటిది లేకుండా బాగానే ఉంటాయి. నేను డీవార్మింగ్కి నాచురల్ రెమిడీస్, హోమియోపతి మందులు ఇస్తుంటా. నెలకోసారి పంప్కిన్, సన్‌ఫ్లవర్, తర్బూజా వంటి డ్రై గింజలు మిక్స్ చేసి ఇస్తుంటా. నా పెట్స్ హెల్దీగా ఉన్నాయి. పెట్స్‌కి మంచి హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. సోయా, చికెన్, వెజిటేబుల్స్, ఎగ్, రైస్, యాపిల్ ఇలా అన్నీ వేసి వండుతాను. కొద్దిగా సాల్ట్, ఆయిల్ ఉండేలా చూస్తా. వాటికి రెగ్యులర్‌గా బ్రష్, కోంబింగ్, మంత్లీ బాత్ తప్పనిసరి. బాత్ చేసిన తర్వాత బాగా తుడవాలి. తడిగా ఉంచితే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. - సౌమ్య, పెట్లవర్ ఒత్తిడి మాయం.. చదువుకునేటప్పుడు నా దగ్గర డాగీస్ ఉండేవి. జాబ్‌లోకి వచ్చాక ప్రస్తుతం హాస్టల్లో ఉంటున్నా. ఆరు నెలల క్రితం బర్త్‌డే గిఫ్ట్‌గా బెర్రీ(డాగ్) నా దగ్గరకు వచ్చాడు. మొదటి మూడు నెలలు వరుసగా వ్యాక్సిన్ వేయించాను. తర్వాత వన్ ఇయర్‌కి ఒకటి. డాగ్స్‌కి జనరల్‌గా వామ్స్ వస్తుంటాయి. సిరప్, పౌడర్ వంటి మందులతో ట్రీట్మెంట్ ఉంటుంది. ఆఫీస్ నుంచి వచ్చాక బెర్రీతో కాసేపు ఆడుకుంటే ఒత్తిడి మొత్తం పోతుంది. వ్యాక్సిన్‌కి వెళ్లినప్పుడు డాక్టర్.. ఫుడ్, మెడికల్, బాతింగ్ ఎలా ఉండాలో చెప్పారు. పెట్స్‌కు కిడ్స్‌లా కేర్‌తో పాటు వ్యాక్సిన్ కూడా తప్పనిసరి. - స్వాతి, పెట్ లవర్ పెంపుడు శునకాలకు ఉచిత వ్యాక్సిన్ నేడు ‘ప్రపంచ జునోసిస్ డే’ను పురస్కరించుకుని సోమవారం నారాయణగూడలోని ‘వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి’లో పెంపుడు కుక్కలకు ఉచితంగా రేబిస్ వ్యాధి నిరోధక టీకా వేయనున్నారు. ఉదయం 8.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వ్యాక్సిన్ వేయనున్నట్టు ఆసుపత్రి డిప్యూటీ డెరైక్టర్ డాక్టర్ భగవాన్ రెడ్డి తెలిపారు. పంపుడు శునకాల యజమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. కూకట్‌పల్లిలో.. కూకట్‌పల్లిలో బీజేపీ కార్యాలయం సమీపంలోని వెటర్నరీ ఆసుపత్రిలో నేడు కుక్కలకు, ఇతర పెంపుడు జంతువులకు ఉచిత రేబిస్ వ్యాధి నిరోధక టీకాలు వేయనున్నట్టు డాక్టర్ కృష్ణకుమార్ తెలిపారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు టీకాలు వేస్తామని, ఈ అవకాశాన్ని పెట్ లవర్స్ వినియోగించుకోవాలన్నారు. కుత్బుల్లాపూర్‌లో.. కుత్బుల్లాపూర్ పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ అనిల్ మురారి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు టీకాలు వేస్తామన్నారు. వివరాలకు 99127 89456 నెంబర్లో సంప్రదించవచ్చు. మలక్‌పేటలో.. మలక్‌పేట పశు వైద్యశాలలో నేడు ఉచితంగా యాంటీ రేబిస్ టీకాలు వేయనున్నట్టు డాక్టర్ ఎం.సబిత తెలిపారు. మలక్‌పేట గంజ్ ఆవరణలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం పక్కన ఉన్న పశు వైద్యశాలలో తిరుమల మెడికల్ హాల్ నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. వివరాలకు 89789 01658 నెంబర్లో సంప్రదించవచ్చు. చాంద్రాయణగుట్టలో చాంద్రాయణగుట్ట పూల్‌బాగ్‌లోని నల్లవాగు హిందూ శ్మశానవాటిక ఎదురుగా గల పశు వైద్యశాలలో కుక్కలు, మేకలకు వ్యాక్సిన్ ఇస్తున్నారు. ఇక్కడ సోమవారం నుంచి శనివారం వరకు వైద్యం అందిస్తారు. జంతువుల యజమానులు ఉదయం 8 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. -
సెల్ఫీ.. క్రేజీ!
అందంగా ముస్తాబయ్యి కొత్తబట్టలు వేసుకొని ఫొటో స్టూడియోకి వెళ్లి.. ఫ్లవర్వాజ్పై చేయి వేసి నిటారుగా నిల్చుని ఫొటో దిగడం ఒకనాటి మాట. ఇప్పుడు పెళ్లిళ్లకు, ఇతర ఫంక్షన్స్‌కు తప్ప ఫొటోగ్రాఫర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరమే లేకుండా పోయింది. సెల్‌ఫోన్స్‌లో కెమెరా ఫొటోల్లో ఓ విప్లవాన్నే తెచ్చింది. ఎవరో ఒకరు ఫొటో తీయడం పక్కకు పోయి... ఫ్రంట్ కెమెరాలతో సెల్ఫీస్ వచ్చాయి. తరువాత ఆ స్థానంలో గుల్ఫీస్, హెల్ఫీస్, వేల్ఫీస్... ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ పెల్ఫీస్! ఫ్రంట్ కెమెరా ఉన్న స్మార్ట్ ఫోన్స్, హై రిజల్యూషన్ కలిగిన ట్యాబ్స్, మొబైల్స్‌కి ఆదరణ పెరిగింది. దాంతో తమ క్లాస్మేట్స్, పేరెంట్స్ ఫేవరెట్ ప్లేస్‌లో గుల్ఫీలు తీసుకుని మురిసిపోయిన నగరవాసులు ట్రెండ్‌ని సృష్టించారు. అతివలు తమ అందమైన కురులను మాత్రమే ఫొటో తీసి దానికి హెల్ఫీగా నామకరణం చేసి సోషల్ నెట్‌వర్క్స్‌లో అప్లోడ్ చేశారు. ఆ తరువాత వర్కవుట్స్ వంతు వ చ్చింది. జిమ్‌లో వర్కవుట్ చేస్తున్న ఫొటోస్ను తీసి వాటిని ‘వెల్ఫీ’లుగా అప్డేట్ చేశారు. ఇప్పుడు కొత్తగా... ఈ కోవలోకే చేరింది ‘పెల్ఫీ’! తమ బెస్ట్ బడ్డీలుగా పెంచుకుంటున్న పెట్స్‌తో సెల్ఫీలు దిగి.. సోషల్వెబ్సైట్స్లో, వాట్సప్‌లలో ప్రొఫైల్ పిక్చర్స్‌గా పెట్టేస్తున్నారు. అంతేకాదు ఆ ఫొటోకి తగ్గ కామెంట్ రాసి తమ క్రియేటివిటీని చాటుకుంటున్నారు. ఇంకొందరైతే ఇంకో అడుగు ముందుకేసి తమ పెట్స్‌ని పార్లర్‌కి తీసుకెళ్లి, గ్రూమింగ్ చేయించి యాక్సెసరీస్ వేసి మరీ అందంగా ఫొటోలు, సెల్ఫీలు తీసుకుని పోస్ట్ చేస్తున్నారు. దానికి వచ్చే లైక్స్, కామెంట్స్‌ను చూసుకుని మురిసిపోతున్నారు. షార్ట్ ఫిలింస్... అయితే ఈ తరహా పెట్స్ ప్రిఫరెన్స్ వెస్ట్రన్ కంట్రీస్‌లో పాతదే! మన దేశంలోకి ఇప్పుడిప్పుడే స్పోర్ట్స్ పర్సన్స్, సెలబ్రిటీస్, బిజినెస్‌మెన్స్, నిత్యం బిజీగా ఉండే పొలిటీషియన్స్ సైతం తీరిక దొరికినప్పుడల్లా రిలాక్స్ అవ్వడానికి ఇదే రూట్‌ని ఎంచుకుంటున్నారు. ‘పెల్ఫీ’స్తో కాలక్షేపం చేస్తూ ఆనందిస్తున్నారు. మరికొందరైతే... తమ పెట్స్‌తో ఏకంగా షార్ట్ ఫిలింస్, డాక్యుమెంటరీలే తీస్తున్నారు. మన నగరంలో ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న ఈ ‘పెల్ఫీస్’ ట్రెండ్ సెలబ్రిటీస్‌కి కాలక్షేపం... సాధారణ జనానికి ఆసక్తిగా మారింది! - సిరి -
సెలబ్రిటీలకే సెలబ్రిటీలు!
ఫొటో స్టోరీ ‘వాటితో కొంతసేపు గడిపితే మన నేచర్ మారిపోతుంది. కొంత పెడితే సంతోషిస్తాయవి. మనుషులకే ఎంత పెట్టినా చాలదు...’ పెట్స్ గురించి, అంతర్లీనంగా మనుషుల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిలాసఫీ ఇది. మనుషుల గురించి అందరికీ తెలుసు. పెట్స్ గురించి మాత్రం వాటితో గడిపినప్పుడే తెలుస్తుంది. అలా గడిపేవారికే పూరి ఫిలాసఫీలోని గాఢత అర్థం అవుతుంది. సెలబ్రిటీల జీవితంలో ఖరీదైన దుస్తులు, కార్లు, వాచీలు ఎలాగో... ఈ ఖరీదైన కుక్కపిల్లలు కూడా అలాగే! ఇంకా చెప్పాలంటే ఇవి ఆ సెలబ్రిటీలకే సెలబ్రిటీలు. ఇక్కడ ఈ సినిమా వాళ్ల గురించే కాదు... పెట్స్ గురించి కూడా చెప్పాలి. ఏ జాతివి అయితేనేం, ఏ దేశం నుంచి దిగుమతి చేసుకొన్నవైతేనేం... సృష్టిలో కెల్లా విశ్వాసం గలవి అనే జాతికి చెందినవి. తమను పెంచిపోషిస్తున్న వారిపై అపారమైన ప్రేమను కురిపిస్తాయి. పూరి జగన్నాథ్, మంచు లక్ష్మి, జయప్రద, మంచు మనోజ్‌కుమార్... తమ తమ పెట్స్‌తో మురిపెంగా ప్రేమాభిమానాలను పంచుకొంటున్నప్పుడు క్లిక్మనిపించినవి ఈ ఫోటోలు. ఇవి చాలు మూగజీవులతో అనుబంధం ఎంత ఆనందాన్నిస్తుందో చెప్పడానికి! -
బుడగల ఫుట్‌బాల్
వేరే గ్రహాల మనుషుల్లా కనిపిస్తున్నారా? ప్లాస్టిక్ బుడగబంతుల్లో ఫుట్‌బాల్ ఆడుతున్నారంతే! జపాన్ రాజధాని టోక్యోలోని ‘నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎమర్జింగ్ సైన్స్ అండ్ ఇన్నొవేషన్’ దగ్గరి దృశ్యమిది. గాలిబుడగలో తేలుతున్న మజా అనుభవిస్తూనే ఫుట్బాల్నూ ఆస్వాదించే గేమ్ ఇది. నార్వేలో ప్రాణం పోసుకున్న ఈ కొత్త ఆట ఆస్ట్రేలియా, కెనడా, డెన్మార్క్, ఈజిప్ట్, లెబనాన్, స్వీడన్, స్పెయిన్ లాంటి దేశాలకూ పాకింది, భారత్‌నూ తాకింది. పెద్దల కోసం పరుగు కంబోడియాలో ఏటా జరిగే షమ్ బెన్ పండగలోని దృశ్యం ఇది. యముడిని ఉద్దేశించిన వేడుక ఇది. ఖ్మేర్ క్యాలెండర్ ప్రకారం పదో నెలలో పదిహేను రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో కంబోడియావాసులు తమ ఏడుతరాల పూర్వీకులకు నివాళులు అర్పిస్తారు. ఈ పక్షం రోజులు నరకపు ద్వారాలు తెరిచివుంటాయనీ, ప్రేతాత్మలు చురుగ్గా ఉండటం వల్ల ఆకలిగొనివుంటాయనీ, కాబట్టి వాటికి తగిన ఆహారాన్ని అందించాలనీ చెబుతారు. వేడుకల చివరిరోజున ఇలా దున్నల పరుగులో ఉత్సాహంగా పాల్గొంటారు. విస్తరించిన కుటుంబం తాము అనుభవించే సౌఖ్యం తమవారికీ అందించాలనుకోవడం ఎవరికైనా సహజం. మరి ఇంటిసభ్యుల్లా కలిసిపోయే పెంపుడు జంతువులను ఎలా విస్మరించగలం? అలాంటి యజమానుల కోసమే ఇటీవలే సింగపూర్‌లో ప్రారంభమైన విలాసవంతమైన హోటల్ ఇది. వాగింగ్టన్ లగ్జరీ పెట్ హోటల్లో పెంపుడు జంతువుల వ్యాయామం, గార్డెన్ నడక కోసం కూడా సదుపాయాలున్నాయి. ఎముక ఆకారంలో నిర్మించిన స్విమ్మింగ్‌పూల్‌లో కుక్కను ఈతకొట్టిస్తున్న హోటల్ ఉద్యోగిని చిత్రంలో చూడొచ్చు. -
వెలుగుల వేళ..
టపాసుల మోతతో పొంచి ఉన్న ముప్పు చిన్నారులు,పెంపుడు జంతువులు, ఆస్తమా బాధితులపై ప్రభావం పర్యావరణానికీ హాని సరైన జాగ్రత్తలతోనే ప్రమాదాలకు దూరం దీపావళి... ఆబాలగోపాలాన్ని ఆనందంలో ముంచే పండుగ. అందరి సరదాలకూ వేడుక. ఆత్మీయానందాల కలయిక. సంతోషాల కాకరపువ్వొత్తులు... మమతల మతాబులు... చిరునవ్వుల చిచ్చుబుడ్లు వె లిగే రోజిది. వెలుగులు పంచే బాణసంచా విషాదాన్ని మోసుకొచ్చే ప్రమాదమూ ఉంది. అందుకే అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ దివ్వెల పండుగను జరుపుకుంటే ఉత్సాహం అలాగే మనతో పాటూ ఉంటుంది. సాక్షి, సిటీబ్యూరో: దీపావళి రోజున మతాబుల జిలుగు వెలుగులు, టపాసుల మోత శ్రుతి మించితే ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని తథ్యమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. టపాసుల మోత అవధులు మించితే చిన్నారులు, పెంపుడు జంతువుల మనుగడే ప్రశ్నార్థక మయ్యే ప్రమాదం ఉంది. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ భారీగా పెరిగి శ్వాసకోశ, కళ్ల సంబంధిత వ్యాధులు ప్రబలే ప్రమాదం పొంచి ఉంది. ముఖ్యంగా టపాసులశబ్దాలు నివాస ప్రాంతాల్లో 45 డెసిబుల్స్ (ధ్వనిని కొలిచే ప్రమాణమే డెసిబుల్) మించరాదు. నగరంలో ఈ శబ్దాలు 90 డెసిబుల్స్‌కు మించుతుండడంపై పర్యావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హోదా, ఆర్భాటం కోసం అత్యధిక ధ్వనిని వెదజల్లే టపాసులు కాల్చితే మనకే కాదు.. మన చుట్టు పక్కల వారికీ చేటు కలిగిస్తున్నామనే స్పృహ అవసరమని స్పష్టం చేస్తున్నారు. టపాసుల మోత శ్రుతి మించితే కలిగే అనర్థాలు, కాల్చే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఫోకస్.. శిశువులు జాగ్రత్త గ్రేటర్లో నిత్యం సుమారు 800-1000 మంది శిశువులు కళ్లు తెరుస్తున్నారు. నవజాత శిశువులు 90 డెసిబుల్స్ దాటిన శబ్దాలు వింటే వినికిడి శక్తి కోల్పోతారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారి గుండె కొట్టుకునే వేగం పెరిగి ఇతరత్రా అనారోగ్య సమస్యలు తలెత్తడం తథ్యమంటున్నారు. పెంపుడు జంతువుల్లో సాధారణంగా పెంపుడు జంతువులైన కుక్క, పిల్లి లాంటివి 50 డెసిబుల్స్ దాటిన శబ్దాలను వింటే విపరీతంగా ప్రవర్తిస్తాయని సంబంధిత వైద్యులు చెబుతున్నారు. కొన్నిసార్లు వాటి కర్ణభేరి బద్దలయ్యే ప్రమాదం ఉందని పేర్కొంటున్నారు. అతిధ్వనులు విన్న జంతువులు ఇంటి నుంచి పరుగెత్తి రోడ్డు ప్రమాదాల బారిన పడడం, కరవడం వంటివి చేస్తాయని చెబుతున్నారు. రాకెట్లు, భూచక్రాలు కాల్చినపుడు పెంపుడు జంతువులకు తగిలి గాయాల పాలవుతాయి. ఎపిలెప్సీ(వణుకుడు)బారిన పడతాయి. పెరగనున్న వాయుకాలుష్యం టపాసులు కాల్చినపుడు వెలువడే పొగలో సల్ఫర్‌డై ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్, ధూళి రేణువులు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తాయి. ముఖ్యంగా సల్ఫర్ డై ఆక్సైడ్ క్యూబిక్ మీటరు గాలిలో 80 మైక్రోగ్రాములకు మించరాదు. కానీ టపాసులు అత్యధికంగా కాల్చినపుడు 450-500 మైక్రోగ్రాములకు చేరుకుంటుంది. దీంతోఊపిరితిత్తులకు హాని తథ్యం. బ్రాంకైటిస్ (తీవ్రమైన దగ్గు) తప్పదని వైద్యులు చెబుతున్నారు. నైట్రోజన్ ఆక్సైడ్ పరిమితి క్యూబిక్ మీటరు గాలికి 80 మైక్రోగ్రాములు మించరాదు. టపాసులు అత్యధికంగా కాల్చినపుడు 450-500 మైక్రోగ్రాముల వరకు ఇది పెరుగుతుంది. దీంతో కళ్లు, ముక్కు మండుతాయి. శ్వాసకోశాలకు తీవ్రఇబ్బంది కలుగుతుంది. ధూళి రేణువులు(ఎస్పీఎం) క్యూబిక్ మీటరు గాలిలో 100 మైక్రోగ్రాములు మించరాదు. కానీ 300 మైక్రో గ్రాములు మించే పరిస్థితి తలెత్తడంతో తీవ్రమైన శ్వాసకోశ వ్యాధులు వస్తాయని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కర్ణభేరికి ప్రమాదం 90 డెసిబుళ్లకు మించిన శబ్దాలు విన్నపుడు కొందరికి తాత్కాలిక చెవుడు, మరికొందరికి దీర్ఘకాలిక చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. చిన్నపిల్లల కర్ణభేరిలోని సూక్ష్మనాడులు దెబ్బతింటాయి. వృద్ధులకూ శాశ్వత చెవుడు వచ్చే ప్రమాదం ఉంది. ఒకేచోట అత్యధిక ధ్వనిని ఇచ్చే టపాసులు కాల్చితే ప్రమాదం తప్పదు. మార్కెట్లో ఇయర్ ప్లగ్స్ రూ.500 నుంచి రూ.1000కి లభ్యమవుతాయి. వీటిని వినియోగిస్తే శబ్ద కాలుష్యం నుంచి ఉపశమనం పొందవచ్చు. - డాక్టర్ రవిశంకర్, ఈఎన్టీ వైద్య నిపుణులు, కోఠి ఈఎన్టీ ఆస్పత్రి కంటికీ ముప్పు బాణసంచా కాల్చేటప్పడు వెదజల్లే మిణుగురులు, ఇతర కార్బన్ పదార్థాలు పొరపాటున కంట్లో పడితే కన్ను దెబ్బతినే అవకాశం ఉంది. తారాజువ్వలు పొరపాటున కంట్లోకి దూసుకుపోతే.. కంటిచూపు పూర్తిగా కోల్పొయే ప్రమాదం ఉంది. దీపావళి తర్వాత ఏటా సగటున వంద మంది బాధితులు సరోజినిదేవి ఆస్పత్రికి వస్తున్నారు. సిల్క్ వస్త్రాలు, లూజుగా ఉన్న దుస్తులు ధరించవద్దు. ఒత్తులు ఆరిపోతే వాటి ద గ్గరికి వెళ్లి తొంగి చూడొద్దు. చేత్తో పట్టుకోవద్దు. చేతులు, ముఖం కాలితే మంట తగ్గేవరకు చల్లటి నీరు పోయాలి. - డాక్టర్ రవీందర్‌గౌడ్, సరోజినిదేవి కంటి ఆస్పత్రి చిన్నారుల్లో బుద్ధిమాంద్యం అత్యధిక ధ్వనులు విన్నపుడు చిన్నపిల్లల మెదడుపై దుష్ర్పభావం పడుతుంది. వారిలో బుద్ధిమాంద్యం సంభవిస్తుంది. కొన్నిసార్లు చదువులో వెనుకబడే ప్రమాదం ఉంది. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. చికాకు, అసహనం కలుగుతుంది. - డాక్టర్ నరహరి, చిన్నపిల్లల వైద్య నిపుణులు, నీలోఫర్ ఆస్పత్రి ఆస్తమా బాధితులూ జాగ్రత్త బాణసంచా నుంచి సల్ఫర్‌డై ఆకై ్సడ్, నైట్రోజన్ డై ఆకై ్సడ్, కార్బన్ డై ఆకై ్సడ్, కార్బన్ మోనాకై ్సడ్లు వెలువడుతాయి. వీటిలో 70 శాతం పొటాషియం అయోడైడ్, 15 శాతం కార్బన్, 10 శాతం సల్ఫర్ ఉంటుంది. ఈ పదార్థాలు మనిషి ఊపిరితిత్తులు, కళ్లు, చెవులు, చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. ఇప్పటికే నగరంలో 30-40 శాతం మంది ఆస్తమాతో బాధ పడుతున్నారు. - డాక్టర్ సునంద, ఫల్మనాలజిస్ట్, కేర్ ఆస్పత్రి విద్యుత్ లైన్ల కింద కాల్చవద్దు విద్యుత్లైన్ల కింద రాకెట్లు, తారా జువ్వలు వెలిగించరాదు. ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్ల సమీపంలో పెద్ద శబ్దాలు వచ్చే వాటిని కాల్చొద్దు ప్రమాదవశాత్తూ ఇంట్లో షార్ట్‌సర్క్యూట్ జరిగితే వెంటనే సరఫరా నిలిపివేయాలి వీధిలోని, అపార్టుమెంట్‌లోని వారంతా ఖాళీ ప్రదేశానికి చేరుకుని ఒకే చోట బాంబులు కాల్చడం మంచిది. అత్యవసర పరిస్థితుల్లో 1912 సర్వీసు నెంబర్‌కు సమాచారం ఇవ్వాలి. - ఎ.జి.రమణ ప్రసాద్,తెలంగాణ విద్యుత్ తనిఖీ విభాగం పాఠశాలలు, ఆస్పత్రుల వద్ద నిషేధం నిత్యం ప్రయాణికులతో రద్దీగా ఉండే రహదారులు, పాఠశాలలు, ఆస్పత్రుల వద్ద బాణసంచా కాల్చడం నిషేధం. రాత్రి పది నుంచి ఉదయం 6 గంటల వరకు టపాసులు కాల్చ వద్దు. సాధ్యమైనంత వరకు తక్కువ శబ్ద సామర్థ్యం ఉన్న బాణసంచానే ఎంచుకోవాలి. ధ్వని సామర్థ్యం పారిశ్రామికవాడలో పగలు 75, రాత్రి 70, కమర్షియల్ జోన్లో పగలు 65, రాత్రి 55, రెసిడెన్షియల్ ఏరియాలో పగలు 55, రాత్రి 45, సెలైన్స్ జోన్లో పగలు 50, రాత్రి 40 డెసిబుల్స్ మించకుండా చూడాలి. - వి.అనిల్‌కుమార్, సభ్య కార్యదర్శి, పీసీబీ -
పెట్ ఉంటే పదేళ్లు యంగ్..!
గృహిణులు, ిసీనియర్ సిటిజన్ల జీవితాల్లో పెంపుడు జంతువులు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తాయంటున్నారు అధ్యయనకర్తలు. ఒక పెట్‌ను పెంచుకోవడం నిస్తేజాన్ని పోగొడుతుందని అంటున్నారు. బ్రిటన్‌కు చెందిన ఒక యూనివర్సిటీ చేసిన అధ్యయనం ప్రకారం శునకాన్ని లేదా పిల్లిని పెంచుకొనేవారు ఇతరుల కన్నా 12 శాతం ఉత్సాహంగా ఉంటారని తేలిందట. దాని పోషణపైన, లాలించడం మీద దృష్టిపెట్టడం, దానితో మానసికంగా బంధాన్ని ఏర్పరుచుకోవడం చాలా మంచిదని వారు సూచిస్తున్నారు. పెట్‌ను పెంచుకొనే వారిలో తమకన్నా పదేళ్లు తక్కువ వయసువారిలో ఉండే ఉత్సాహం ఉంటుందని వర్సిటీ అధ్యయనకర్తలు అభ్రిపాయపడ్డారు. ఇళ్లకు పరిమితమై జీవితాలు యాంత్రికంగా మారాయనే వారు తక్షణం ఒక పెట్ పోషణపై దృష్టి పెట్టాలని వారు సూచించారు. -
ఈ తోడు అవసరమే!
వాయనం పెంపుడు జంతువుల పేరు చెబితేనే ముఖాలు చిట్లిస్తారు కొందరు. వాటికి చాకిరీ చేయలేం అంటారు. బోలెడంత ఖర్చు అని ఫీలవుతుంటారు. అయితే వీటితో నష్టం కంటే లాభమే ఎక్కువ. భర్త ఆఫీసుకు వెళ్లిపోయాక, పిల్లలు స్కూలుకెళ్లిపోయాక... ఇంట్లో ఉండే మహిళలకు మంచి తోడు ఎవరైనా ఉంటారు అంటే, అవి పెంపుడు జంతువులే. ఇంట్లో ఓ కుక్కో, పిల్లో ఉంటే ఆ సందడే వేరు. ఇంట్లో ఓ కుక్క ఉంటే అంతకంటే పెద్ద రక్షణ మరొకటి ఉండదు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు, భర్త ఏ క్యాంపుకో వెళ్లి ఒంటరిగా పిల్లలతో ఉండాల్సి వచ్చినప్పుడు అదే పెద్ద సెక్యూరిటీ. నిజానికి పిల్లి కూడా బాగా మచ్చికవుతుంది, యజమాని పట్ల ప్రేమగా ఉంటుంది. కుక్కయితేనేమి, పిల్లి అయితేనేమి... ఏదో ఒక తోడును ఉంచుకోవడం మంచిదే. పెట్ని పెంచమంటే... ఇన్ని పనుల్లో ఇదో పనా అని కొందరు మహిళలు విసుక్కుంటారు. నిజానికది పెద్ద పనేమీ కాదు. నేర్పిస్తే అవి కూడా క్రమశిక్షణ నేర్చుకుంటాయి. ఎక్కడ తినాలి, ఎక్కడ పడుకోవాలి, విసర్జన చేయాలనిపించినప్పుడు తమకు ఎలా తెలియజేయాలి వంటివన్నీ వాటికి నేర్పించవచ్చు. వ్యాక్సిన్లకు తప్ప పెద్ద ఖర్చూ ఉండదు. వాటికి పడనివి ఏమున్నాయో డాక్టర్ని అడిగి తెలుసుకుని, అవి తప్ప మిగతావన్నీ తినడం అలవాటు చేయవచ్చు. ఏ ఊరో వెళ్తే, పెట్ కేర్ సెంటర్లు ఉన్నాయి... పిల్లలకు క్రష్‌లు ఉన్నట్టుగా. నిర్ణీత రుసుము చెల్లించి, అక్కడ వదిలి వెళ్లవచ్చు. ఆ మధ్య కెనడాలో ఓ వృద్ధురాలు సొమ్మసిల్లి పడిపోతే, పెంపుడు పిల్లి నీళ్ల బాటిల్ తెచ్చి ఆమె ముఖమ్మీద ఒంపి లేపింది. ఆస్ట్రేలియాలో ఓ అమ్మాయి వీల్ చెయిర్లోంచి జారి కొలనులో పడిపోతే, పెంపుడు కుక్క రోడ్డు మీద పోతున్న వ్యక్తిని తీసుకొచ్చింది. మన దేశంలోనే ఓ చిలుక ఇంటి నుంచి నగలు దోచుకుపోయిన దొంగలను పట్టించింది. ముంబైలో ఓ ఒంటరి మహిళ మీద ఎవరో అఘాయిత్యం చేయబోతే, పెంపుడు కుక్క అతడిని చీల్చి చెండాడింది. ఇంత ఉపయోగం ఉన్నప్పుడు... కాసింత ఖర్చు, కొద్దిపాటి శ్రద్ధ పెట్టడానికి ఇబ్బంది పడితే ఎలా! ముఖ్యంగా ఒంటరి మహిళలకు ఓ ‘పెట్’ తోడు ఎంతైనా అవసరం. ఓసారి ఆలోచించండి! -
పెట్స్‌కూ లైఫ్‌స్టైల్ ఉంది
‘మనుషులకే కాదు పెంపుడు జంతువుల (పెట్స్)కూ ఓ జీవనశైలి ఉంది. అది గుర్తించి, వాటి భాషను, భావాలను అర్థం చేసుకుంటేనే మనం నిజమైన పెట్ లవర్స్ అనిపించుకుంటాం’ అంటున్నారు శర్వాణి చౌదరి. దేశంలోనే తొలి పెట్స్ లైఫ్‌స్టైల్ మేగజైన్ ‘హైదరాబాద్ పాస్’ను ఆమె రూపొందించి ఇటీవలే విడుదల చేశారు. తొలి పుస్తకంలోనే హీరో సిద్ధార్థకు తన పెట్‌తో అనుబంధాన్ని అందంగా ఆవిష్కరించి ప్రశంసలు పొందిన శర్వాణి... తన తర్వాతి ఎడిషన్ కోసం నటి శ్రీయను ఎంచుకున్నారు. ఈ సందర్భంగా ‘సిటీప్లస్’ ఆమెతో ముచ్చటించింది. ‘ఒక శునకం రోడ్డు మీద మొరుగుతుంటే విసుక్కునే వారేగానీ.. దాని అరుపుల వెనుక ఉన్న వేదన అర్థం చేసుకునేవారెందరు’ అని ప్రశ్నించే శర్వాణి... జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలో దాదాపు 40కి పైగా వీధికుక్కలకు కొంతకాలంగా ఆహారం, వైద్య సేవలు వంటివి అందేలా చూస్తున్నారు. ‘ఆ క్రమంలోనే నాకు అర్థమైంది. వీటిపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని’ అన్నారామె. మెదక్‌లో అనాథ వృద్ధులకు ఆశ్రయం అందించే ఎన్జీఓ హోమ్ కూడా ఆమె నిర్వహిస్తున్నారు. సెలబ్రిటీలే ఎందుకంటే... ‘ప్రముఖులు ఏ విషయమైనా చెబితే అది బాగా ప్రచారంలోకి వస్తుందనేది తెల్సిందే. అదే ఉద్దేశంతో టాలీవుడ్ టాప్‌స్టార్స్‌కు తమ పెట్స్‌తో ఉన్న అనుబంధాన్ని మేగజైన్ కవర్‌స్టోరీగా అందిస్తున్నా’ అన్నారు శర్వాణి. కేవలం ఫ్యాషన్ కోసమో మరోలానో పెట్స్‌ను పెంచుకునేవారిని కాకుండా వాటిని తమ ఫ్యామిలీ మెంబర్స్‌తో సమానంగా చూసేవారికే ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. సృష్టిలో ఉన్న 84 రకాల జీవులకు కూడా మనిషిలాగే ప్రత్యేకమైన జీవనశైలి ఉందనే ఆమె... అవి తమకు నచ్చేలా మనుగడ సాగించడం కోసం ఏ ఎన్జీఓ సరిగా కృషి చేయుడంలేదంటారు. తమ మేగజైన్లో పెట్స్ ఆరోగ్యసమస్యల పరిష్కారాలు మొదలుకుని వాటి కోసం పనిచేసే సంస్థలు, విభిన్న రకాల పెంపుడు జంతువులు, వాటి జీవనశైలి విశేషాలుంటాయని చెప్పారామె. - ఎస్.సత్యబాబు -
శునకం కేర్ ఆఫ్ సుమతి
పెంపుడు జంతువులు అంటేనే ప్రేమ. దానితో ఉన్నంతసేపు మనసు ప్రశాంతంగా ఉంటుంది. కల్మషమైన దాని ప్రేమకు ఎంతటివారైనా ఫిదా అయిపోవాల్సిందే. అలాంటి పెంపుడు జంతువును ఇంట్లో ఒంటరిగా వదిలి ఎక్కడికైనా వెళ్లాల్సి వస్తే పరిస్థితి ఏంటి? తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లినా... మనసంతా దానిపైనే ఉంటుంది. అలాంటివారి బెంగ తీర్చడంకోసం వెలసిందే ‘పెట్సెట్రా’. వేళకు అన్నంతో పాటు ఇంత ఆప్యాయతను కూడా అందిస్తానంటూ మూడేళ్లక్రితం పెట్స్ కేర్ సెంటర్‌ని నెలకొల్పారు సుమతీ నీలమేఘం. హైదరాబాద్ విమానాశ్రయంలో విమానం బయలుదేరడానికి ఇంకా అరగంట సమయం ఉంది. సుమతి మనసు బరువెక్కుతోంది. జనని మొహం మాత్రం ఆనందంతో వెలిగిపోతోంది. ‘నా బంగారం... రేపొద్దిటికల్లా మనింటికి వెళ్లిపోవచ్చు...’ ఒడిలో కూర్చున్న కుక్క తలపై దువ్వుతూ జనని అంటున్న మాటలకు సుమతికి ఇంకాస్త బెంగగా అనిపించింది. ‘మళ్లీ ఎన్నాళ్లకు... నిన్ను చూస్తానే..’ అంది సుమతి. ‘ఎందుకండీ అంత బెంగ... మీకు ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు స్కైప్‌లో చూడొచ్చు కదా!’ అన్న జనని మాటలతో కాస్త ఊరట చెందిన సుమతి ‘ఓబా’ జాగ్రత్త అంటూ వెనుతిరిగింది. ఎయిర్‌పోర్టులో ఈ కుక్క గోలేమిటి అనుకుంటున్నారా! దీని వెనుక ఓ కథ ఉంది. జనని భర్తకు సింగపూర్‌లో ఉద్యోగం రాగానే భార్యాభర్తలు ఉన్నట్టుండి బయలుదేరాల్సి వచ్చింది. వెళ్లేటప్పుడు వారి పెంపుడు కుక్క ‘ఓబా’ని తీసుకెళ్లడం కుదరలేదు. పొరుగుదేశాలకు పెంపుడు జంతువుల్ని తీసుకెళ్లడం అంత సులువైన పనికాదు. ముందుగా అక్కడ క్వారెంటైన్(పొరుగుదేశాల నుంచి వచ్చిన పెంపుడు జంతువుల్ని అక్కడ ఒక నెలరోజులపాటు పెట్టుకుని ఎలాంటి జబ్బులూ లేవని తెలిశాక అప్పుడు యజమానులకు అప్పగించే సెంటర్)లో పెట్టడానికి స్లాట్ దొరక లేదు. దాంతో సుమతి నెలకొల్పిన ‘పెట్సెట్రా’లో చేర్పించారు. ఏడు నెలల తర్వాత సింగపూర్ క్వారెంటైన్లో స్లాట్ దొరికింది. అప్పుడు హైదరాబాద్‌కి వచ్చి తమ కుక్కను తీసుకెళ్లారు. ఆలోచన వెనక... పదిహేడేళ్లపాటు బహుళజాతి కంపెనీలో పనిచేసిన సుమతి కుక్కలను పెంచడంలోనే ఉన్న ఆనందం ఇంకెక్కడా దొరకదంటారు. ఐదంకెల జీతం వదులుకుని కుక్కల్ని పెంచే సెంటర్ నెలకొల్పడం వెనక సుమతికున్న ప్రేమతో పాటు పెట్స్ ప్రేమికుల అవసరం కూడా ఉంది. పెట్స్‌ని ఒంటరిగా వదిలివెళ్లలేక చాలామంది ప్రయాణాలకు దూరంగా ఉంటారు. అలాగే పగలు ఇంట్లో చూసుకునేవాళ్లుండరని కుక్కల్ని పెంచుకోలేనివారు చాలామంది ఉన్నారు. హైదరాబాద్‌లోని మణికొండ దగ్గర సుమతి గురించి ఎవరిని అడిగినా చెబుతారు. ఆమె పేరు చెబితే అడ్రస్ దొరకదు. ‘ఇక్కడ కుక్కలామె ఎక్కడుంటుంది’ అని అడిగితే వెంటపెట్టుకుని మరీ తీసుకెళ్లి చూపిస్తారు. ‘‘నేనలా ఫేమస్ అయిపోయానండీ... పొద్దునే ఓ పది కుక్కల్ని వెంటబెట్టుకుని వాకింగ్‌కి వెళితే అందరికీ తెలియకుండా ఎలా ఉంటుంది! (నవ్వుతూ..) నిన్నమొన్న కొత్తగా వచ్చినవారికి కూడా నా ‘పెట్సెట్రా’ గురించి తెలుసు’’ అని అంటారామె. స్విమ్మింగ్‌పూల్‌తో సహా... ఈ పెట్స్‌కేర్ సెంటర్ నెలకొల్పి మూడేళ్లు దాటుతోంది. మొదట్లో అపార్ట్మెంట్లో తన ఫ్లాట్‌లోనే కుక్కల్ని పెంచిన సుమతి ఈ మధ్యనే సొంతింట్లోకి వచ్చారు. కింది అంతస్థు మొత్తం కుక్కలకోసం కేటాయించారు. అక్కడే వాటికోసం స్విమ్మింగ్‌పూల్ కూడా ఏర్పాటుచేశారు. కొందరు పొద్దుటే తమ కుక్కల్ని ఇక్కడ వదిలేసి ఆఫీసు నుంచి ఇంటికెళ్లేటపుడు తిరిగి తీసుకెళ్లిపోతుంటారు. కొందరు వారాంతపు సెలవుల్లో వదులుతారు. ఇంకొందరు దూరప్రయాణాలపుడు తమ కుక్కల్ని ఇక్కడ అప్పజెప్పేస్తారు. ‘‘కుక్కని ఇక్కడ వదలడానికి ముందు దాని మెడికల్ రిపోర్టు చూస్తాను. ఏమైనా చర్మవ్యాధులుంటే వారికి చెప్పి వైద్యం చేయిస్తాను. లేదంటే మిగతావాటికి వచ్చే అవకాశం ఉంటుంది కదా. ఆ కుక్కలు మొదటిసారి కొంచెం కొత్తగా చేస్తాయి. తర్వాత వాటికి కూడా అలవాటైపోతుంది. చాలామంది చెబుతుంటారు. ‘సుమతీ ఆంటీ ఇంటికి వెళదామా... అనగానే వెంటనే కారెక్కి కూర్చుంటుందండీ..’ అంటూ తమ పెంపుడు కుక్క గురించి వారు చెబుతుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది’’ అని చెపుతున్నప్పుడు సుమతి ముఖంలో కించిత్ గర్వం తొణికిసలాడింది.ప’కి 150మంది క్లయింట్స్ ప్రసుప్రస్తుతం ‘పెట్సెట్రా’కి 150మంది క్లయింట్స్ ఉన్నారు. ఇందులో కుక్కలతోపాటు కుందేళ్లు, లవ్‌బర్డ్స్‌కి కూడా ఆశ్రయం ఉంది. సుమతి భర్త డాక్టర్ కిరణ్ ఒమేగా హాస్పిటల్లో మెడికల్ డెరైక్టర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు కూడా పెంపుడు జంతువులంటే ప్రాణం. ‘‘సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులప్పుడు నేను గుమ్మం దాటను. ఎందుకంటే అప్పుడే కదా అందరికీ నా అవసరం. మాక్కూడా మూడు కుక్కలున్నాయి. వాటిలో ఒకటి దత్తత తీసుకున్నది. నేను అప్పుడప్పుడు బ్లూక్రాస్‌కి వెళుతుంటాను. అప్పుడు ఎవరో వదిలేసిన కుక్క కనిపిస్తే తెచ్చి పెంచుకున్నాను. వీధి కుక్కల్ని పెంచుకునే ధోరణికి మద్దతునిస్తూ స్వచ్ఛందంగా కొన్ని కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటాను’’ అని చెప్పారు సుమతి. పొరుగింటివాళ్లనే పెద్దగా పట్టించుకోని ఈరోజుల్లో వారి పెంపుడు జంతువుల్ని చేతుల్లోకి తీసుకుని తియ్యగా మాటలు చెబుతూ ఆటలాడించేవారెవరుంటారు చెప్పండి. ‘ఊరికే ఏం చేయడం లేదు కదా’ అనొచ్చు. డబ్బుతో వాటికి పెట్టే ఆహారాన్ని కొనచ్చు కానీ ప్రేమను కొనలేరు కదా! - భువనేశ్వరి; ఫొటోలు: జి బాలస్వామి పెంపుడు కుక్కను వదిలే ముందు దానికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్ ఇవ్వాలి. మీ పెట్‌కి స్విమ్మింగ్ అవసరమైతే రెండు రోజుల ముందుగానే స్లాట్ బుక్ చేసుకోవాలి. మీ పెట్ని చూసుకున్నందుకు రోజుకి 300 రూపాయల వరకు తీసుకుంటారు. మీ పెట్‌కి మీరేం ఆహారం పెడతారో అదే మెనూను ఫాలో అవుతారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే ప్రాణం. ఎక్కడ రోడ్డుపైన కుక్కపిల్ల కనిపించినా ఆగిపోయేదాన్ని. ఆ ప్రేమ అక్కడితో ఆగకుండా నన్నిలా వెంటాడి ఏకంగా కేర్ సెంటర్‌నే పెట్టించింది.’’