కుక్కకు ట్రిమ్మింగ్..
సాక్షి, హైదరాబాద్: నేటి ఆధునిక కాలంలో గ్లామర్ మేనియా ఇంట్లో వారికే కాదు.. వాళ్ల పెంపుడు జంతువులకూ ముఖ్యమైపోయింది. ముద్దొచ్చే తమ పెట్స్‌ను మరింత అందంగా చూడాలనుకుంటున్న యజమానులు ఇందుకోసం ఎంతయినా ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో పెంపుడు జంతువులను ముస్తాబు చేసే సంస్థలు హైదరాబాద్‌లో క్రమంగా పెరుగుతున్నాయి. మసాజ్, గోళ్ల కత్తిరింపు, బబుల్ బాత్ వంటి సేవలను పెంపుడు జంతువులకు అందిస్తున్నాయి.
తరలి వచ్చె తళుకులద్దగ...
గతంలో ఈ తరహా పెట్ గ్రూమింగ్ సేవల్ని హైదరాబాద్‌లో కొన్ని సంస్థలు మాత్రమే అందించేవి. అయితే కరోనా సమయంలో తమ పెంపుడు జంతువులను గ్రూమింగ్ పార్లర్స్‌కు తీసుకెళ్లలేక నగరవాసులు పడిన ఇబ్బందులు మొబైల్ పార్లర్స్‌కు ఆజ్యం పోశాయి. ప్రస్తుతం నగరంలో దాదాపు డజనుకుపైగా మొబైల్ వ్యాన్లు పెట్ స్పాలను ఇంటింటికీ మోసుకొస్తున్నారు. ఈ సేవల కోసం పూర్తిగా రసాయనాలు లేని ఉత్పత్తులనే ఉపయోగిస్తున్నామని మొబైల్ పార్లర్ల నిర్వాహకులు చెబుతున్నారు.
మొత్తం గ్రూమింగ్ ప్రక్రియ దాదాపు గంట పడుతుందని... బొచ్చు కుక్కలకు మాత్రం 90 నిమిషాల వరకు సమయం పడుతుందంటున్నారు. అలాగే పిల్లులను పెంచుకొనే వారికి కూడా సేవలు అందిస్తున్నామని వివరిస్తున్నారు. పెట్‌ను ఫంక్షన్ లేదా ఫోటోషూట్‌కు తీసుకెళ్లాల్సి వస్తే అందుకు తగిన దుస్తులు ధరింపజేయడం, ప్రత్యేకంగా హెయిర్‌ను సెట్ చేయడం కూడా చేస్తామని చెబుతున్నారు.
వెటర్నరీ డిప్లొమా వారినే తీసుకున్నాం...
మా మొబైల్ సెలూన్‌లలో పనిచేసే గ్రూమర్‌లందరూ వెటర్నరీ కళాశాల డిప్లొమా హోల్డర్లు. ఉద్యోగంలో భాగంగా తొలుత వారికి 3 నెలలపాటు శిక్షణ సైతం అందిస్తున్నాం.
– జస్ట్ గ్రూమ్ నిర్వాహకురాలు చైత్ర
వ్యాధుల వ్యయంతో పోలిస్తే నయమే..
శుభ్రత పాటిస్తే పెట్స్ ఆరోగ్యంగా ఉంటాయి. వాటికి సరైన విధంగా స్నానం చేయించడం మన వల్ల సాధ్యం కాదు. ఫలితంగా పెట్స్‌కు చర్మవ్యా« దుల వంటివి రావచ్చు. అందుకే నా పెట్‌కి నెలకో సారి స్పాలో స్నానం, 3 నెలలకు ఒకసారి గ్రూమింగ్ చేయిస్తాను. సగటున దాని శుభ్రతకు నెలవారీగా రూ. 3 వేలు ఖర్చు పెడుతున్నా. అయితే పెట్స్‌కు వ్యాధులు సోకితే అంతకన్నా ఎక్కువే ఖర్చు చేయాలి. పెట్ మొబైల్ సేవల వల్ల పెట్ స్పా కోసం దూరభారం ప్రయాణించే అవసరం పోయింది.
– పరిమళ, సికింద్రాబాద్
Comments
Please login to add a commentAdd a comment