దీపావళి పండగ సందర్భంగా ప్రజలకు ప్రముఖ సినీనటి సమంత ఓ విజ్ఞప్తి చేశారు. దీపావళిని పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపిన సమంత.. ఈ పండగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందాలు నింపాలని ఆకాంక్షించారు. అదే విధంగా ఓ సందేశాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. మనం పండగ జరుపుకోవడం చిన్న చిన్న కుక్కపిల్లలకు, వీధుల్లోని మూగ జీవాల ప్రశాంతతకు ఇబ్బంది కలిగించేలా ఉండకూడదని అభిప్రాయపడ్డారు. ఈ విషయాన్ని మరచిపోకూడదని.. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చే బాణసంచా కాల్చబోమని ప్రామిస్ చేయాలని ఆమె కోరారు. కాగా, సోషల్ మీడియా వేదికగా సమంత తన అభిప్రాయాలను వెల్లడిస్తారనే సంగతి తెలిసిందే.
దీపావళి.. ఒట్టేసి చెప్పమన్న సమంత
Published Sun, Oct 20 2019 8:52 PM | Last Updated on Thu, Mar 21 2024 8:31 PM
Advertisement
Advertisement
Advertisement