DC League Of Super Pets Movie Release Date Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

DC League Of Super Pets: ‘డీసీ లీగ్‌ ఆఫ్‌ సూపర్‌ పెట్స్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది, ఎప్పుడంటే..

Published Thu, Jul 28 2022 10:30 AM | Last Updated on Thu, Jul 28 2022 11:49 AM

DC League of Super Pets Screening on Theatre From August 5th in India - Sakshi

సూపర్‌ పెట్స్‌ చిత్రంలో సన్నివేశం

ప్రముఖ హాలీవుడ్‌ సంస్థ వార్నర్‌ బ్రదర్స్‌ నుంచి డీసీ లీగ్‌ ఆఫ్‌ సూపర్‌ పెట్స్‌ విడుదలకు సిద్ధమైంది. ప్రముఖ రచయిత/కన్సల్టెంట్‌ జారెడ్‌ స్టెర్న్‌ తొలిసారి దర్శకత్వం వహించిన సినిమా ఇది. ఈ సినిమాలో ప్రధాన క్యారెక్టర్‌ కృప్తో ది సూపర్‌ డాగ్‌కి మాటలు అందించినది కూడా ఈ చిత్ర ప్రొడ్యుసర్‌ ద్వేన్‌ జాన్సన్‌ అవటం విశేషం. ద్వేన్‌ జాన్సన్‌ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ.. సూపర్‌ హీరోల పెంపుడు జంతువుల గురించి సినిమాలో ఇంతకు ముందెన్నడూ సినీ చరిత్రలో చూడలేదన్నారు.

 అసలు సూపర్‌ మ్యాన్, బ్యాట్‌ మ్యాన్, వండర్‌ ఉమెన్‌ లాంటి సూపర్‌ హీరోలకి ఎలాంటి పెట్స్‌ ఉంటాయనే ఆలోచన వినగానే నేను ఏ సంకోచం లేకుండా గట్టి నమ్మకంతో ఈ సినిమాను తెరకెక్కించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. ఈ చిత్రం ఆగస్టు 5వ తేదీన ఇంగ్లిష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో విడుదల చేయనున్నట్లు తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement