హాలీవుడ్ భారీ చిత్రం ఆడమ్ ఈనెల 20న దేశవ్యాప్తంగా వివిధ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. న్యూలైన్ సినిమా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి జామ్ కల్లెట్ సెర్రా దర్శకత్వం వహించారు. డ్వైన్ జాన్సన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం యాక్షన్ అడ్వెంచర్‌గా రూపొందింది. దీని గురించి చిత్ర నిర్వాహకులు వివరిస్తూ.. పాలకుల బానిసత్వం కారణంగా బలైపోయిన ఓ వ్యక్తి 5వేల సంవత్సరాల తరువాత అతీంద్రియ శక్తులతో తిరిగి వస్తాడన్నారు.
అతను చేసే అరాచకమే ఈ చిత్రం అన్నారు. అతన్ని ఎదుర్కోవటానికి జస్టిస్ సొసైటీ చేసే పోరాటమే ఈ చిత్రంలో ప్రధానాంశంగా ఉంటుందన్నారు. అయితే తన కొడుకు ప్రాణత్యాగం తోనే తాను మళ్లీ ఈ లోకానికి వచ్చానని, ప్రతీకారం తీర్చుకునే వరకు తనను ఎవరూ ఆపలేరని ఛాలెంజ్ చేసి బీభత్సం సృష్టించే బ్లాక్ ఆడమ్ తన అతీంద్రియ శక్తులతో రాకెట్లను కూడా పట్టుకుని అవలీలగా విసిరేస్తాడన్నారు.
ఇతన్ని జస్టిస్ సొసైటీ ఎదుర్కోగలిగిందా..? లేదా..? అనే పలు ఇంట్రెస్టింగ్ అంశాలతో రూపొందిన చిత్రం బ్లాక్ ఆడమ్ అని, హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలతో భారీ గ్రాఫిక్స్‌తో ప్రేక్షకులను అబ్బురపరిచే సన్నివేశాలతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment