James Cameron Avatar 2 Movie Release: అవతార్.. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ ఈ సినిమా. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ఒక సరికొత్త ఊహ ప్రపంచంలో విహరించేలా చేసింది ఈ మూవీ. పండోరా లోకం, అక్కడి మనుషులు, ఆ వింత గుర్రాలు, వాటితో హీరో చేసే సాహసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ సినిమా అనేక అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అవతార్ 2' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ను 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్‌నెస్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్.
తాజాగా ఈ మూవీ గురించి వచ్చిన అప్‌డేట్ ఆడియెన్స్ వరల్డ్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంది. అవతార్ 2 డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా ఏకంగా 160 భాషల్లో (Avatar 2 Movie Release In 160 Languages). అవును. అవతార్ 2 సినిమాను సుమారు 160 భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఒకవేళ ఇదే జరిగితే సినీ చరిత్రలోనే ఇది రికార్డ్‌గా నెలకొల్పనుంది. అలాగే త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్‌లలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా బుధవారం (ఏప్రిల్ 27) ఈ సినిమా గ్లింప్స్‌ను 'సినిమా కాన్'లో ప్రీమియర్‌గా ప్రదర్శించానున్నారని టాక్.
చదవండి: ప్రేక్షకులకు కనువిందు.. ఆ సినిమాతో 'అవతార్ 2' ట్రైలర్ !
ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే?
Comments
Please login to add a commentAdd a comment