James Cameron
-
అద్భుతాలు చూపిస్తాం: జేమ్స్ కామెరూన్
‘‘అవతార్, అవతార్ 2’ చిత్రాల తర్వాత ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రంపై ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానుల్లో ఎన్నో అంచనాలుంటాయి. ఆ అంచనాలను మించి మా సినిమా ఉంటుంది’’ అని ప్రముఖ హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘అవతార్’ (2009), ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’ (2022) సినిమాలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకాదరణ పొందిన విషయం తెలిసిందే.ఈ ఫ్రాంచైజీలో రానున్న మూడో చిత్రం ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’. ఈ చిత్రానికి కూడా జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’ గురించి జేమ్స్ కామెరూన్ మాట్లాడుతూ– ‘‘వెండితెరపై ఈ విజువల్ వండర్‌ను చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోతారు. తొలి, ద్వితీయ చిత్రాల్లో చూపినవి రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ధైర్యం చేసి సరికొత్తవి తీసుకొస్తున్నాం.ఇలా ధైర్యం చేసి కొత్తవాటిని సృష్టించకపోతే ప్రేక్షకుల సమయాన్ని, డబ్బును వృథా చేసినవాడిని అవుతాను. ‘అవతార్, అవతార్: ది వే ఆఫ్ వాటర్’ చిత్రాల్లో లేని అద్భుతాలను ‘అవతార్–ఫైర్ అండ్ యాష్’లో చూస్తారు. అంచనాలకు మించిన లైవ్ యాక్షన్‌ని ప్రేక్షకులకు చూపించనున్నాం. ఓ కొత్త ప్రపంచంతో పాటు వైవిధ్యమైన కథ, పాత్రలు ఇందులో కనిపిస్తాయి’’ అని పేర్కొన్నారు. ఈ చిత్రం డిసెంబరు 19న విడుదల కానుంది. -
జేమ్స్ కామెరూన్ లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా
హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ పేరుతో ఓ సినిమా చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. అమెరికన్ ప్రముఖ రచయిత చార్లెస్ ఆర్. పెల్లెగ్రినో రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’ బుక్ హక్కులను సొంతం చేసుకున్నారు జేమ్స్ కామెరూన్. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్‌లోని హిరోషిమా, నాగసాకి నగరాలపై అమెరికా అణు బాంబులతో దాడి చేసింది. ఆ సమయంలో ్రపాణాలతో బతికి బయటపడ్డ జపాన్ ఇంజనీర్ సుటోము యమగుచి జీవితం ఆధారంగా ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమా తెరకెక్కనుందని హాలీవుడ్లో వార్తలు వస్తున్నాయి. చార్లెస్ రాసిన ‘ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమా’, ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’... ఈ రెండు బుక్స్‌ని కలిపి సినిమా తీయనున్నారట జేమ్స్ కామెరూన్. ప్రస్తుతం ‘అవతార్’ ఫ్రాంచైజీతో జేమ్స్ కామెరూన్ బిజీగా ఉన్నారు. ఈ ఫ్రాంచైజీ నుంచి ఇప్పటికే ‘అవతార్ (2019), అవతార్: ద వే ఆఫ్ వాటర్’ (2022) చిత్రాలు విడుదల అయ్యాయి. ‘అవతార్: ఫైర్ అండ్ యాష్’ (అవతార్ 3) చిత్రం 2025లో రిలీజ్ కానుంది. ఇంకా ‘అవతార్ 4, అవతార్ 5’ చిత్రాలు కూడా ఉన్నాయి. మరి... ‘అవతార్’ ఫ్రాంచైజీని పక్కన పెట్టి జేమ్స్ కామెరూన్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ చేస్తారా? లేదా అనే అంశంపై ఓ స్పష్టత రావాల్సి ఉంది. ఒకవేళ ‘అవతార్’ ఫ్రాంచైజీలకన్నా ముందే ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ సినిమాను సెట్స్‌పైకి తీసుకువెళితే 1997లో వచ్చిన ‘టైటానిక్’ తర్వాత జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించే నాన్ అవతార్ ఫిల్మ్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’నే అవుతుంది. -
'అవతార్ 3' క్రేజీ అప్డేట్.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ ప్రకటన
90స్ జనరేషన్ పిల్లల్ని అవాక్కయ్యేలా చేసిన హాలీవుడ్ సినిమా 'అవతార్'. అప్పుడెప్పుడో 2009లో తొలి భాగం రిలీజ్ కాగా.. మళ్లీ 2022లో సీక్వెల్ రిలీజ్ చేశారు. మొత్తంగా వీటిని ఐదు భాగాలుగా తెరకెక్కిస్తున్నట్లు చాన్నాళ్ల క్రితమే ప్రకటించారు. ఇప్పుడు మూడో పార్ట్ పేరుతో పాటు విడుదల తేదీని తాజాగా అధికారికంగా ప్రకటించారు.(ఇదీ చదవండి: నిన్న ఎంగేజ్మెంట్.. ఇప్పుడు పెళ్లిలో కనిపించిన నాగచైతన్య)దిగ్గద దర్శకుడు జేమ్స్ కామెరూన్ తీసిన 'అవతార్' తొలి భాగం అప్పట్లో వసూళ్లలో ప్రపంచ రికార్డులు సృష్టించింది. దీన్ని పండోరా గ్రహంలో భూమిపై తీయగా.. 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' అనే పేరుతో వచ్చిన రెండో భాగాన్ని పూర్తిగా నీటిలో తీశారు. ఇప్పుడు మూడో భాగానికి 'అవతార్: ఫైర్ అండ్ యాష్' అనే టైటిల్ నిర్ణయించారు. పంచ భూతాల్లో మూడోది అయిన అగ్ని కాన్సెప్ట్ బేస్ చేసుకుని దీన్ని తీస్తారని క్లారిటీ వచ్చేసింది.'అవతార్ 3' సినిమాని 2025 డిసెంబరు 19న థియేటర్లలో రిలీజ్ చేస్తామని తాజాగా ప్రకటించారు. అంటే మరో ఏడాది టైమ్ ఉంది. ఇది కాకుండా మరో రెండు పార్ట్స్ కూడా ఉన్నాయి. వీటిని 2027, 29లో విడుదల చేయనున్నట్లు ఇదివరకే అనౌన్స్ చేశారు. కాకపోతే వాటి పేర్లు, రిలీజ్ డేట్స్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.(ఇదీ చదవండి: తమిళ స్టార్ హీరో సూర్యకు గాయం) View this post on Instagram A post shared by Avatar (@avatar) -
టైటానిక్, అవతార్ నిర్మాత కన్నుమూత
సినీ ప్రపంచంలో ఆల్ టైమ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ చిత్రాలను తెరెకెక్కించిన హాలీవుడ్ నిర్మాత జోన్ లాండౌ (63) మరణించారు. ఆయన జులై 5వ తేదీనే మృతిచెందారు. కానీ, ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్‌తో కలిసి టైటానిక్, అవతార్ సీక్వెల్స్ చిత్రాలను నిర్మించారు. ఆయన మరణ వార్తను లాండౌ కుటుంబం ఆలస్యంగా ప్రకటించింది. అయితే, అందుకు సంబంధించిన కారణాలను వారు వెళ్లడించలేదు. డైరెక్టర్ కామెరూన్‌తో లాండౌ సంయుక్తంగా నిర్మించిన చిత్రాలు మూడు ఆస్కార్ నామినేషన్లకు ఎంపిక కావడం విశేషం. ఈ క్రమంలో 1997లో టైటానిక్‌కి ఉత్తమ చిత్రంగా నిలిచింది. అవతార్, దాని సీక్వెల్‌గా వచ్చిన అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో సహా చలనచిత్ర చరిత్రలో అతిపెద్ద బ్లాక్‌బస్టర్స్‌గా రికార్డ్ క్రియేట్ చేశాయి. 1980లో ప్రొడక్షన్ మేనేజర్‌గా తన సినీ కెరియర్ను ఆయన ప్రారంభించాడు. 1912లో టైటానిక్ షిప్ ప్రమాదం వల్ల మునిగిపోవడంతో సుమారు 1500 మంది మరణించారు. ఆ షిప్ మహా జలసౌధ నిర్మాణం, ప్రయాణం వెనుక తెలియని విశేషాలెన్నో ఉన్నాయని ఆయన గ్రహించాడు. దీంతో కామెరూన్‌తో కలిసి టైటానిక్ అనే సినిమాను నిర్మించి 1997లో విడుదల చేశారు. ఈ చిత్రం 11 అస్కార్ అవార్డులను గెలుచుకుంది. జోన్ లాండౌ నిర్మాతగా 2009లో విడుదలైన చిత్రం అవతార్.. ఈ సినిమా సుమారు రూ.24 వేల కోట్ల కలెక్షన్స్ రాబట్టింది.ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా కొనసాగుతోంది. అవతార్ 2 కూడా రూ. 19 వేల కోట్లు రాబట్టింది. అయితే, షాకింగ్ విషయం ఏమిటంటే టైటానిక్ చిత్రం 1997లోనే రూ. 18 వేల కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఇంతటి భారీ చిత్రాలను నిర్మించిన జోన్ లాండౌ మరణించడంతో హాలీవుడ్ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. జోన్ లాండౌకు భార్య జూలీ (45),వారి కుమారులు, జామీ, జోడీ ఉన్నారు. వీరితో పాటు ఆయనకు ఇద్దరు సోదరీమణులు, ఒక సోదరుడు ఉన్నాడు. -
మహేశ్ సినిమాకి అతిథిగా...?
ఎన్టీఆర్, రామ్‌చరణ్ హీరోలుగా దర్శకత్వం వహించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో దర్శకుడు రాజమౌళికి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చిన విషయం తెలిసిందే. పైగా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు (‘నాటు నాటు..’ పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ అవార్డు) కూడా సాధించడంతో హాలీవుడ్ ప్రముఖుల దృష్టిలో పడ్డారు రాజమౌళి. ‘టైటానిక్, అవతార్’లాంటి అద్భుత చిత్రాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ అయితే ‘ఆర్ఆర్ఆర్’ని, రాజమౌళి మేకింగ్‌ని ప్రశంసించారు కూడా. రాజమౌళిలోని మేకర్ అంటే కామెరూన్‌కి మంచి అభిమానం ఏర్పడిందని ఆయన మాటలు స్పష్టం చేశాయి. ఆ అభిమానంతోనే రాజమౌళి ఆహ్వానానికి కామెరూన్ పచ్చజెండా ఊపారని టాక్. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ప్రపంచ దేశాల్లోని పలు భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. బడ్జెట్ రూ. వెయ్యి కోట్లు అని భోగట్టా. ఇంత భారీ చిత్రం కాబట్టేప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కామెరూన్‌ని ఆహ్వానించారని టాక్. ఇప్పటికే ప్రీప్రోడక్షన్ పనులు దాదాపు పూర్తి కావచ్చిన నేపథ్యంలో త్వరలో సినిమాని ఆరంభించాలనుకుంటున్నారట. సో.. వార్తల్లో ఉన్న ప్రకారం కామెరూన్‌ని రాజమౌళి ఆహ్వానించారా లేదా అనేది త్వరలోనే తెలిసిపోతుంది. -
మహేష్ బాబు కోసం హైదరాబాద్ రానున్న అవతార్ డైరెక్టర్
-
ఆ సీక్వెల్స్‌కి నేను డైరెక్షన్ చేయకపోవచ్చు!
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అవతార్’. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను పండోరా ప్రపంచంలో విహరించేలా చేసింది. కలెక్షన్స్‌లో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. దీంతో ‘అవతార్’కు సీక్వెల్స్‌గా ‘అవతార్ 2’, ‘అవతార్ 3’, ‘అవతార్ 4’, ‘అవతార్ 5’లను ప్రకటించారు జేమ్స్ కామెరూన్. ‘అవతార్’ సీక్వెల్‌గా వచ్చిన ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘అవతార్ 3’, ‘అవతార్ 4’ సినిమాల చిత్రీకరణలు ఒకేసారి జరుగుతున్నాయి. ‘అవతార్ 3’ ఈ ఏడాదిలో విడుదల కావాల్సింది. కానీ 2025కి వాయిదా వేశారు. 2025 డిసెంబరు 19న‘అవతార్ 3’, 2029లో ‘అవతార్ 4’, 2031లో ‘అవతార్ 5’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కాగా ‘అవతార్’ ఫ్రాంచైజీలో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు కూడా చాన్స్ ఉందని జేమ్స్ కామెరూన్ చెబుతున్నారు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఆయన ‘అవతార్’ సినిమా ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ– ‘‘అవతార్’ ఫ్రాంచైజీలోని ఐదు సినిమాలకు కథలు రెడీగా ఉన్నాయి. ‘అవతార్ 6’, ‘అవతార్ 7’ల గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు నేను దర్శకత్వం వహించకపోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. హలీవుడ్లో ‘టైటానిక్’, ‘ది టెర్మినేటర్’ వంటి అద్భుత చిత్రాలను కూడా తీసిన జేమ్స్ కామెరూన్ కెరీర్‌ను ‘అవతార్’ ఫ్రాంచైజీ ఒక్కటే డామినేట్ చేయడం ఆయన ఫ్యాన్స్‌కు రుచించడం లేదని హాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఇక కామెరూన్ అన్నట్లు భవిష్యత్‌లో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లు సెట్స్‌పైకి వెళితే.. కనీసం ఇద్దరు, ముగ్గురు దర్శకులు కలిసి ఈ సినిమాలను తీయాల్సి ఉంటుందన్నట్లు హాలీవుడ్ సినీ విశ్లేషకులు అభి్రపాయపడుతున్నారట. -
దర్శకధీరుడిపై మరోసారి ప్రశంసలు.. హాలీవుడ్ దిగ్గజం ఏమన్నారంటే?
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పారు. అంతే కాదు.. ప్రపంచంలోనే ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డ్‌ను గెలిచి మన గొప్పదనాన్ని మరింత పెంచారు. గతేడాది లాస్ ఎంజిల్స్ వేదికగా జరిగిన ఆస్కార్ వేడుకల్లో ఆర్ఆర్ఆర్ చిత్రానికి అవార్డ్ దక్కింది. ది బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటునాటు పాటకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ లభించింది. ఆస్కార్ అవార్డ్ రావడంతో తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. అదే సమయంలో హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సైతం రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. 2023లో జరిగిన క్రిటిక్స్ ఛాయిస్ అవార్డుల కార్యక్రమంలో కామెరూన్‌ను రాజమౌళి కలిశాడు. ఆ సమయంలో ఆర్ఆర్ఆర్ మూవీ గురించి అతడు ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ.. మూవీ అద్భుతంగా ఉందని కొనియాడారు. (ఇది చదవండి: 'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!) తాజాగా ఓ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న హాలీవుడ్ దిగ్గజం మరోసారి రాజమౌళిని పొగిడారు. ఈవెంట్లో ఓ మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ఆర్ఆర్ఆర్ మూవీ అద్భుతంగా తెరకెక్కించారని.. ఇండియన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా తన ముద్ర వేయడం చాలా బాగుందన్నారు. కామెరూన్ మాట్లాడుతూ.. 'నిజంగా చాలా నిజాయతీగా అనిపించి ఈ విషయాన్ని చెప్పాను. అది చాలా అద్భుతమైన సినిమాగా అనిపించింది. ఇండియన్ సినిమా ప్రపంచ వేదిక స్థాయికి చేరడం చాలా గొప్పగా విషయం' అని అన్నారు. తాజాగా దీనికి సంబంధించిన వీడియోను ఆర్ఆర్ఆర్ టీం తన ట్విటర్ ద్వారా పంచుకుంది. 'మీ అమూల్యమైన మాటలు ఎల్లప్పుడూ ఉత్తమంగా ఉండటానికి మాకు స్ఫూర్తినిస్తాయి. భారతీయ సినిమా అన్ని సరిహద్దులను బద్దలు కొట్టి మరింత ఎత్తుకు ఎదుగుతుందని మేము గట్టిగా నమ్ముతున్నాము.' అంటూ ట్వీట్ చేసింది. కాగా.. రాజమౌళి ప్రస్తుతం మహేశ్ బాబుతో సినిమా తీసేందుకు రెడీ అవుతున్నారు. James Cameron.. 🤗 Your precious words always inspire us to strive better and be the best. We strongly believe Indian cinema is going to break all boundaries and grow to its fullest. ❤️ #RRRMovie pic.twitter.com/pzHjGQNZnC — RRR Movie (@RRRMovie) February 7, 2024 -
అవతార్ ఫ్రాంచైజీలో మొత్తం ఎన్నో తెలుసా.. 2031లో చివరి భాగం
జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ ‘అవతార్’. 2009లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ సునామీని క్రియేట్ చేసింది. రూ.1200 కోట్ల బడ్జెట్‌తో క్రియేట్ అయిన ఈ విజువల్ వండర్‌కు ప్రపంచ వ్యాప్తంగా సుమారుగా రూ. 24 వేల కోట్లు కలెక్ట్ చేసింది. ఇదే ఇప్పటి వరకూ నమోదైన భారీ రికార్డ్. ఇన్ని వేల కోట్లు వసూలు చేసిన మరో సినిమా ఏదీ లేదు. దీంతో ‘అవతార్ 2’పై భారీ అంచనాలతో 2022లో విడుదలైంది. పండోరా లోకం నుంచి సీక్వెల్‌గా ‘అవతార్- ది వే ఆఫ్ వాటర్’గా పార్ట్-2 వచ్చిన విషయం తెలిసిందే.. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఓ అద్భుత ప్రపంచంలో రానున్న మూడో భాగాన్ని 2025లో విడుదల చేస్తామని ఆయన గతంలోనే ప్రకటించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఆ సినిమా గురించి పలు విషయాలను పంచుకున్నారు. మూడో భాగంలో విజువల్ వండర్స్‌తో పాటు పాత్రలపై కూడా ఎక్కువగా దృష్టి పెడుతున్నట్లు చెప్పాడు. మంచి స్టోరీతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులను మరింతి అలరించేందుకు రెడీగా ఉన్నట్లు తెలిపాడు. 2025 డిసెంబర్ 19న అవతార్ పార్ట్ -3 విడుదల అవుతుందని ఆయన మరోసారి ప్రకటించడం విశేషం. 2024లో అందరినీ మెచ్చేలా ఎక్కువ రన్‌టైమ్‌లో టీజర్ ఉంటుందని తెలిపాడు. ప్రేక్షకుల అంచనాలకు మించి ఇందులో యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలిపాడు. గతంలో వచ్చిన రెండు భాగాల మాదిరే ఇందులో కూడా భిన్నమైన కథనంతో పాటు విభిన్నమైన పాత్రలు కనిపిస్తాయన్నాడు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' లో కనిపించిన కేట్ విన్స్లెట్ చేసిన రోనాల్ పాత్రను అవతార్ 3లో కూడా ఉంటుంది. దీని కోసం ఆమె చాలా కష్టపడి శిక్షణ తీసుకుంటుందని ఆయన పేర్కొన్నాడు. 'అగ్ని' ప్రధానంగా మూడో భాగం సాగుతుందని ఆయన తెలుపుతూ .. అగ్ని ఒక చిహ్నం.. ప్రయోజనకారి. మూడో భాగంలో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుందని తెలిపాడు. ఫ్రాంచైజీలో 'అవతార్- 4' 2029లో విడుదల అవుతుందని, చివరిగా రానున్న 'అవతార్- 5' కూడా 2031లో విడుదల చేస్తామని మేకర్స్ ప్రకటించారు. -
నేను అప్పుడే వార్నింగ్ ఇచ్చా.. ఏఐపై ప్రముఖ దర్శకుడు సంచలన వ్యాఖ్యలు
I warned you guys in 1984 and you didn't listen: కెనడియన్ చలనచిత్ర దర్శకుడు జేమ్స్ కామెరాన్ కృత్రిమ మేధస్సు (ఏఐ)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏఐ వేగవంతమైన విస్తరణ ప్రమాదాల గురించి 1984లోను తాను హెచ్చరించారంటూ ఆందోళన వ్యక్తం చేశారు. సైన్స్ ఫిక్షన్ బ్లాక్‌బస్టర్ 'ది టెర్మినేటర్' మూవీలో దీనికి సంబంధించి ఒక హెచ్చరికగా పనిచేసి ఉండవలసిందన్నారు.న్యూస్ హౌస్కిచ్చిన ఇంటర్వ్యూలో విపరీతమైన ఏఐ వాడకం విపత్తు పరిణామాలకు దారితీస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. (ఈ కారణంతో టాప్ పెర్ఫార్మర్‌నే పీకేసిన కంపెనీ! ఇదేం చోద్యం అంటున్న నెటిజన్లు) కొంతమంది పరిశ్రమ నాయకులు భయపడుతున్నట్టుగా మానవాళి అంతరించిపోవడానికి కారణమయ్యే కృత్రిమ మేధస్సు గురించి అడిగినప్పుడు, కచ్చితంగా తనకు కూడా ఆందోళన ఉందన్నారు. వాస్తవానికి దీనిపై 1984లోనే హెచ్చరించాను కానీ మీరే వినలేదని పేర్కొన్నారు. తన సెన్సేషనల్ మూవీ 'ది టెర్మినేటర్' గురించి ప్రస్తావించిన కామెరూన్ ఇది స్కైనెట్ అని పిలువబడే తెలివైన సూపర్ కంప్యూటర్ సృష్టించిన సైబర్నెటిక్ హంతకుడు చుట్టూ తిరుగుతుంది కదా అని గుర్తు చేశారు. దూసుకొస్తున్న కొత్త టెక్నాలజీ ఏఐ ఆయుధీకరణ అతిపెద్ద ప్రమాదం ముంచుకొస్తోంది. అణు ఆయుధ పోటీకి సమానమైన పోటీ ఇదని భావించారు. మనం మిన్నకుంటే ఇతరులు దూసుకొస్తారనే పోటీ మధ్య ఇది మరింత తీవ్రమవుతుందని హెచ్చరించారు. అంతేకాదు యుద్ధభూమిలో ఏఐ గురించి ప్రస్తావించిన కామెరూన్ కంప్యూటర్లు చాలా వేగంగా పనిచేస్తాయి, మానవులు జోక్యం చేసుకోలేరు, శాంతి చర్చలు లేదా యుద్ధ విరమణ అనే చాన్స్ ఉండదు. ఈనేపథ్యంలో డీ-ఎస్కలేషన్‌పై దృష్టి పెట్టడం అవసరం, కానీ ఏఐ సిస్టమ్‌లు అటువంటి సూత్రాలకు కట్టుబడి ఉంటాయనే సందేహాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. ఏఐకి సంబంధించి కొన్ని ప్రయోజనాలున్నప్పటికీ అది వినాశకరమైన పరిణామాలకు దారితీస్తుందని , ప్రపంచం అంతం అయ్యే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కంప్యూటర్లు ప్రపంచాన్ని తారుమారు చేస్తున్నాయి.మనకు తెలియ కుండానే, అన్ని మీడియా , సమాచారంపై పూర్తిగా పట్టు దక్కించుకోనుందని పేర్కొన్నారు. అలాగే ఓపెన్ఏఐ, గూగుల్, డీప్‌మైండ్, టెక్ దిగ్గజాలతోపాటు, ఈ రంగంలోని ప్రముఖ నిపుణులు, విద్యావేత్తలు, చట్టసభ సభ్యులు , వ్యవస్థాపకులతో పాటు, AIతో సంబంధం ఉన్న నష్టాలను తగ్గించడానికి చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. మహమ్మారి, అణు యుద్ధ ప్రమాదాలను పరిష్కరించడంతో సమానంగా ఈ ఆందోళనలను పరిష్కరించడం ప్రపంచ ప్రాధాన్యతగా ఉండాలని కామెరూన్ నొక్కి వక్కాణించారు. -
వామ్మో టైటానిక్ దగ్గరకా? నాకు అలాంటి అనుభవమే: జేమ్స్ కామెరూన్
టైటానిక్ షిప్ శకలాలని చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే జలాంతర్గామి కథ విషాదాంతమైంది. నీటి అడుగున పీడన తీవ్రత పెరగడం వల్ల ఈ టైటాన్ పేలిపోయి, అందులోని ఐదుగురు మరణించారని అమెరికా కోస్ట్ గార్డ్ తాజాగా ప్రకటించింది. రిమోట్ కంట్రోల్డ్ వెహికల్ సాయంతో మినీ జలాంతర్గామి శకలాలని గుర్తించారు. ఇప్పుడు ఈ విషయమై టైటానిక్ సినిమా డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ స్పందించాడు. (ఇదీ చదవండి: టైటాన్ ఆశలు జల సమాధి) 'ఈ విషయం(సబ్ మెరైన్ పేలిపోవడం) జీర్ణించుకోవడానికే నాకు చాలా కష్టంగా ఉంది. ఇంతకుముందే సదరు ఓషియన్ గేట్ కంపెనీకి చాలామంది ఇంజినీర్లు లెటర్స్ రాశారు. మీరు చేస్తున్నది చాలా విపరీతమైన ప్రయోగం అని ఆయా లేఖల్లో పేర్కొన్నారు' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చారు. 'టైటాన్ సబ్ మెరైన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు 33 సార్లు ఆ ప్రాంతానికి వెళ్లొచ్చాను. అక్కడ 13వేల అడుగుల లోతు ఉంటుంది. సబ్ మెరైన్ పై చాలా ఒత్తిడి పడుతుంది. ఏ మాత్రం కంట్రోల్ తప్పినా ఆచూకీ దొరకడం అసాధ్యం. ఇది సాహసంతో కూడిన ప్రయాణం. టైటానికి షిప్ దగ్గర్లో ఏదో తెలియని శక్తి ఉంది. అక్కడ మిస్ అయితే దొరకడం కష్టమని నేను ముందే ఊహించాను. ఎందుకంటే నాక్కూడా గతంలో ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి' అని జేమ్స్ కామెరూన్ చెప్పుకొచ్చాడు. James Cameron believes OceanGate Titan imploded before reaching Titanic. #OceanGate #OceansGate #Titan #Titans📷 #submarino #Submarine #Submersible #implosion #imploded #Titanic #TitanicRescue #titanicsubmarine #sousmarin pic.twitter.com/wGtWvXR0V7 — Ak Cheema (@AkCheema777) June 23, 2023 (ఇదీ చదవండి: సాగర గర్భంలో కలిసిన సాహస వీరులు) -
ఓటీటీలోకి వచ్చేసిన అవతార్-2.. ఇక నుంచి ఉచితంగానే!
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ 'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్'. గతేడాది థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. (ఇది చదవండి: ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!) అయితే ఇప్పటికే ఈ సినిమా రెంటల్ పద్ధతిలో ఓటీటీలోకి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు నుంచి ఇండియాలో ఫ్రీగా చూసేందుకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, తమిళం, హిందీ కన్నడ, మళయాళ భాషల్లో అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికి వరకు ఈ విజువల్ వండర్‌ను చూడడం మిస్సయిన వారు చూసేయండి. (ఇది చదవండి: రెండో పెళ్లిపై దారుణ ట్రోల్స్.. స్పందించిన ఆశిష్ విద్యార్థి) -
ఓటీటీలో అవతార్-2.. ఇక నుంచి ఫ్రీగా చూసేయొచ్చు!
హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన విజువల్ వండర్ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' (అవతార్- 2). ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీస్థాయిలో వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలో సందడి చేసిన ఈ చిత్రం పలు ఓటీటీల్లోనూ రెంటల్ పద్ధతిలో అందుబాటులోకి వచ్చింది. తాజాగా సినీ ప్రియులకు చిత్రబృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఎలాంటి అద్దె చెల్లించకుండానే చూసేలా ఈ సినిమా త్వరలో ఓటీటీలోకి రాబోతుంది. (ఇది చదవండి: సల్మాన్‌తో రిలేషన్లో ఉందా?.. ఏకంగా నా భర్తనే అడిగారు: హీరోయిన్) రెంట్ చెల్లించకుండానే ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్కు అందుబాటులో రానున్నట్లు ప్రకటించింది. ఈ విజువల్ వండర్ని జూన్ 7న విడుదల చేస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. దీంతో సినీ ప్రేక్షకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎన్ని భాషల్లో విడుదల కానుందన్న విషయాన్ని మాత్రం ఇంకా వెల్లడించలేదు. (ఇది చదవండి: చెర్రీ ఫ్యాన్స్ అంటే ఇలా ఉండాలి.. మనసులు గెలిచారు భయ్యా!) కాగా.. హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా గతేడాది డిసెంబరులో థియేటర్లలో సందడి చేసింది. తొలి భాగం అవతార్లానే పలు రికార్డులు సృష్టించిన ఈ సీక్వెల్ 2023 మార్చి 28 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలైన మూవీఎస్ ఎనీ వేర్, యాపిల్ టీవీ, ప్రైమ్ వీడియో, వుడు, ఎక్స్ఫినిటీ, గూగుల్‌ప్లే, ఏఎంసీ, మైక్రోసాఫ్ట్ మూవీ అండ్ టీవీల్లో అద్దె ప్రాతిపదికన అందుబాటులోకి వచ్చింది. -
ఓటీటీలోకి వచ్చేస్తున్న అవతార్ 2.. ఎప్పుడు? ఎక్కడ?
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2). గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశారు జేమ్స్ కామెరూన్. ఇన్నాళ్లు థియేటర్ ఆడియన్స్ అలరించిన ఈ చిత్రం..ఇప్పడు ఓటీటీ ప్రేక్షకులను పండోరా గ్రహానికి తీసుకెళ్లేందుకు సిద్దమైంది. మార్చి 28 నుంచి ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ ‘అవతార్’ టీమ్ ఓ ట్వీట్ చేసింది. ఇంతవరకు చూడని విశేషాలను మూడు గంటలపాటు చూసేందుకు సిద్ధం అవ్వండి’అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ని ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ రేటుకు కొనుగోలు చేసింది. మార్చి 28 నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు. Return to Pandora whenever you want at home, only on Digital March 28. Get access to over three hours of never-before-seen extras when you add #AvatarTheWayOfWater to your movie collection. pic.twitter.com/4dOhyjMU9l — Avatar (@officialavatar) March 7, 2023 -
చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా? చిరంజీవి భావోద్వేగం
రాజమౌళి డైరెక్ట్ చేసిన ఆర్ఆర్ఆర్ సినిమాపై హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే! ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించారంటూ జక్కన్నపై ఆయన పొగడ్తల వర్షం కురిపించారు. తాజాగా ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్లో రామ్‌చరణ్ పాత్రను మెచ్చుకున్నారు. 'ఆర్ఆర్ఆర్ అద్భుత సినిమా. తొలిసారి ఒంటరిగా చూసినప్పుడు సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. కథ చెప్పిన విధానం, వీఎఫ్ఎక్స్ అంతా కూడా షేక్స్పియర్ క్లాసిక్‌లా అనిపించింది. రామ్ క్యారెక్టర్ నిజంగా ఛాలెంజింగ్ పాత్ర. ఆ పాత్ర మైండ్‌లో ఏముందనేది తెలిసాక గుండె బద్ధలైనట్లే అనిపిస్తుంది. ఇటీవలే రాజమౌళిని కలిసినప్పుడు ఇదే చెప్పాను' అని చెప్పుకొచ్చాడు. ఇది చూసిన చిరంజీవి సంతోషంతో ఉప్పొంగిపోయాడు. ఆ వీడియోను షేర్ చేస్తూ.. 'ఆర్ఆర్ఆర్లో రామ్‌చరణ్ పాత్రను జేమ్స్ కామెరూన్ ప్రస్తావించడం సంతోషంగా ఉంది. గ్లోబల్ ఐకాన్, సినిమాటిక్ జీనియస్ నీ పర్ఫామెన్స్ ఇష్టపడ్డారంటే ఆయన అభిప్రాయం ముందు ఆస్కార్ కూడా చిన్నదే అవుతుంది. చరణ్ ఇంత ఎత్తుకు ఎదిగాడా? తండ్రిగా తనను చూసి గర్వపడుతున్నాను. జేమ్స్ కామెరూన్ ప్రశంసలే అతడికి దివ్య ఆశీస్సులు, భవిష్యత్తుకు బంగారు బాటలు' అని భావోద్వేగంతో ట్వీట్ చేశాడు. Sir @JimCameron an acknowledgement of his character in #RRR from a Global Icon & Cinematic Genius like you is no less than an Oscar itself! It’s a great honor for @AlwaysRamCharan As a father I feel proud of how far he’s come. Ur compliment is a blessing for his future endeavours pic.twitter.com/jof3Q9j0pA — Chiranjeevi Konidela (@KChiruTweets) February 17, 2023 చదవండి: అవార్డు ఫంక్షన్లో ప్రముఖ నటుడు మృతి -
చరిత్ర సృష్టించిన అవతార్-2.. ఇండియాలో తొలిచిత్రంగా రికార్డ్
హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ విజువల్ వండర్ అవతార్-2 ఇండియాలో రికార్డులు సృష్టిస్తోంది. అవతార్‌లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా వచ్చిన ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2) ప్రస్తుతం అన్ని రికార్డులను తిరగరాసింది. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు జేమ్స్ కామెరూన్. అవతార్-2 ఇండియాలో రూ.368.20 కోట్లు వసూళ్లతో సరికొత్త చరిత్ర సృష్టించింది. అత్యధిక కలెక్షన్లు రాబట్టిన హాలీవుడ్ సినిమాని నిలిచింది. అంతకుముందు 'ఎవెంజర్స్: ది ఎండ్‌గేమ్' రూ.367 కోట్లు వసూళ్లు సాధించగా ఆ రికార్డ్ బ్రేక్ చేసింది. ఈ విషయాన్ని ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్విట్టర్లో వెల్లడించారు. అవతార్-2 కేవలం 14 రోజుల్లోనే బాక్సాఫీస్ 1 బిలియన్ యూఎస్ డాలర్ల మార్కును దాటింది. 2022లో విడుదలైన 'టాప్ గన్: మావెరిక్','జురాసిక్ వరల్డ్ డొమినియన్' సరసన నిలిచింది అవతార్-2. దీంతో 2022లో విడుదలైన ఇతర సినిమాల కంటే జేమ్స్ కామెరూన్ చిత్రం ఈ మైలురాయిని వేగంగా అధిగమించి రికార్డు సృష్టించింది. #Avatar2 creates HISTORY… Emerges the HIGHEST GROSSING #Hollywood film in #India by surpassing *lifetime biz* of #AvengersEndgame. ⭐️ #Avatar2: ₹ 368.20 cr NBOC ⭐️ #AvengersEndgame: ₹ 367 cr NBOC#India biz. #Avatar #AvatarTheWayOfWater pic.twitter.com/eS8EIZ5xu4 — taran adarsh (@taran_adarsh) January 21, 2023 -
రాజమౌళిని ప్రశంసలతో ముంచెత్తిన జేమ్స్ కామెరూన్.. సోషల్ మీడియాలో వైరల్
టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి, హాలీవుడ్ దిగ్గజం, అవతార్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఆర్ఆర్ఆర్ సినిమా గురించి వారిద్దరు మాట్లాడుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో టాలీవుడ్ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు కామెరూన్. ఆర్ఆర్ఆర్ను రెండుసార్లు చూసినట్లు రాజమౌళితో చెప్పారు. దీంతో జక్కన్న వల్లే తెలుగు సినిమా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోను ఆర్ఆర్ఆర్ తన అధికారిక ట్విటర్ ఖాతాలో షేర్ చేసింది. కామెరూన్‌తో రాజమౌళి మాట్లాడుతూ.. మీ సినిమాలు టైటానిక్, టర్మినేటర్తో పాటు అవతార్-2 చూశానని తెలిపారు. మీరే నాకు ఆదర్శమని కామెరూన్‌ను కొనియాడారు. మీ ప్రశంసలు అవార్డ్ కంటే గొప్పవని రాజమౌళి అన్నారు. మీరు సినిమా చూశానంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని కామెరూన్‌తో ముచ్చటించారు. ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని మీరు అనలైజ్ చేయడం బాగుందన్నారు. దీనికి కామెరూన్ స్పందిస్తూ రాజమౌళిపై ప్రశంసల వర్షం కురిపించారు. మీ సినిమా చూసినప్పుడు అద్భుతంగా అనిపించిందన్నారు. ఈ స్టోరీ తెరకెక్కించిన విధానం చాలా బాగుందన్నారు. సినిమాలోని ట్విస్టులు, స్నేహితుల పాత్రలు మలిచిన విధానం అద్భుతమని కొనియాడారు. అక్కడే ఉన్న సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణిని సైతం ప్రశంసలతో ముంచెత్తారు. మీరు అందించిన మ్యూజిక్ అద్భుతమన్నారు. ఆర్ఆర్ఆర్ గతేడాది థియేటర్లలో రిలీజైన ‘ఆర్ఆర్ఆర్’ పలు రికార్డులు కొల్లగొట్టింది. దాదాపు రూ.1200 కోట్ల కలెక్షన్స్‌తో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించింది. ఇప్పటికే ఆస్కార్ బరిలో నిలిచిన ఆర్ఆర్ఆర్.. తాజాగా ‘గోల్డెన్ గ్లోబ్’ అవార్డు గెలుచుకున్న తర్వాత జేమ్స్ కామెరూన్ ఏకంగా రాజమౌళిని మెచ్చుకోవడం చిత్రబృందానికి దక్కిన మరో గౌరవంగా టాలీవుడ్ అభిమానులు భావిస్తున్నారు. "If you ever wanna make a movie over here, let's talk"- #JamesCameron to #SSRajamouli. 🙏🏻🙏🏻Here’s the longer version of the two legendary directors talking to each other. #RRRMovie pic.twitter.com/q0COMnyyg2— RRR Movie (@RRRMovie) January 21, 2023 -
అవతార్ 3 కాన్సెప్ట్ అదుర్స్.. అంచనాలను పెంచేసిన డైరెక్టర్
‘అవతార్’లో పండోరా గ్రహాన్ని సృష్టించి, ప్రకృతి అందాలను తెరపై సరికొత్తగా చూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు జేమ్స్ కామెరూన్. దాదాపు 13 ఏళ్ల తర్వాత దానికి కొనసాగింపుగా ‘అవతార్ అవతార్-ది వే ఆఫ్ వాటర్’(అవతార్-2)ను తెరకెక్కించాడు. గతేడాది డిసెంబర్లో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్స్‌ని రాబట్టింది. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ఈ చిత్రం ద్వారా ప్రేక్షకులకు తెలియజేశాడు. పార్ట్ 1లో అడవి అందాను చూపిస్తే.. పార్ట్ 2లో సముద్రం లోపల మరో సుందరమైన ప్రపంచం ఉందని తెలియజేశాడు. దీంతో అవతార్ 3పై అందరికి ఆసక్తి నెలకొంది. పార్ట్ 3 నేపథ్యం ఏంటి? కొత్తగా ఏం చూపించబోతున్నారనే ఉత్సకత ప్రేక్షకుల్లో మరింత పెరిగింది. తాజాగా అవతార్ 3 కాన్సెప్ట్ ఏంటో దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించాడు. నిప్పు నేపథ్యంలో అవతార్ 3 కొనసాగుతుందట. ఇటీవల క్రిటిక్ చాయిస్ అవార్డ్ కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో అవతార్ 2కి ఉత్తమ విజువల్ ఎఫెక్ట్ మూవీ అవార్డు లభించింది. తాజాగా జరిగిన ఈ కార్యక్రమంలో జేమ్స్ కామెరూన్ పాల్గొని, అవార్డును స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్ 3 ఎలా ఉండబోతుందో వివరించాడు. ‘అగ్ని ఒక చిహ్నం..ప్రయోజకారి. అవతార్ 3లో ఇదే ప్రధాన ఇతివృత్తంగా ఉంటుంది. దీంతో పాటు మరో రెండో సంస్కృతులను కూడా పరిచయం చేస్తా. ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. ఇదంతా పండోరా గ్రహంలోనే జరుగుతుంది. ఇంతకు మించి ఏమి చెప్పలేను’అని జేమ్స్ కామెరూన్ అన్నారు. అవతార్2తో పాటే అవతార్ 3 షూటింగ్‌ని కూడా పూర్తి చేశాడు జేమ్స్ కామెరూన్. విజువల్ఎఫెక్ట్స్ పని మాత్రం మిగిలి ఉంది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పండోరా గ్రహంలోని ఏడాది ప్రదేశంలో ఈ సినిమా సాగుతుందని హాలీవుడ్ టాక్. అక్కడ ఉండే సంపదను దోచుకోవడానికి మనుషులు ప్రయత్నిస్తే.. వారిని జేక్ సెల్లీ ఫ్యామిలీ ఎలా అడ్డుకుంది అనేది ఈ సినిమాలో చూపించబోతున్నారట. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి. -
ఆర్ఆర్ఆర్ను రెండు సార్లు చూశానన్న ‘అవతార్’ డైరెక్టర్, జక్కన్నపై ప్రశంసలు
అంతర్జాతీయ వేదికలపై ఆర్ఆర్ఆర్ మూవీ పేరు మారుమ్రోగుతోంది. ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్ అవార్డు అందుకుని చరిత్ర సృష్టించిన ఈ చిత్రం రీసెంట్గా లాస్ ఎంజిల్స్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ అనే మరో అవార్డును గెలుచుకుంది. ఇలా ప్రపంచ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తున్న ఈ మూవీపై హాలీవుడ్ దిగ్గజం, అవతార్ మూవీ డైరెక్టర్ జెమ్స్ కామెరూన్ ప్రశంసలు కురిపించారు. చదవండి: తండ్రి అయిన స్టార్ కమెడియన్ రాహుల్ రామకృష్ణ అయితే ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ మూవీ ఆస్కార్‌కు నామినేట్ అయిన నేపథ్యంలో డైరెక్టర్ రాజమౌళి, ఎమ్ఎమ్ కీరవాణిలు అమెరికాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో అమెరికాలో జరిగినో ఓ అవార్డు ఫంక్షన్లో రాజమౌళి, జెమ్స్ కామెరూన్ కలిశారు. ఈ సందర్భంగా కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ రెండు సార్లు చూశానని తనతో చెప్పారంటూ రాజమౌళి మురిసిపోయారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేస్తూ.. ‘ది గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ మూవీ చూశారు. ఆయనకు సినిమా చాలా బాగా నచ్చింది. చదవండి: రష్మిక టాటూ అర్థమెంటో తెలుసా? దాని వెనక ఇంత స్టోరీ ఉందా! అంతేకాదు ఆర్ఆర్ఆర్ మూవీ చూడమని తన భార్య సుజిక్ జేమ్స్‌కి కూడా ఆయన ప్రతిపాదించారు. దీంతో ఆమెతో కలిసి ఆయన ఆర్ఆర్ఆర్ మూవీని మరోసారి చూశారట. ఈ సందర్భంగా ఆయన ఆర్ఆర్ఆర్ సినిమా గురించి పది నిమిషాల పాటు నాతో విశ్లేషించడం నమ్మలేకపోతున్నా. అదే విధంగా ‘మీరు ప్రపంచంలోనే టాప్ డైరెక్టర్’ అని ఆయన నాకు కితాబు ఇవ్వడం చాలా ఆనందగా ఉంది. మీకు ధన్యవాదాలు సార్’ అంటూ జక్కన్న ట్వీట్లో రాసుకొచ్చారు. The great James Cameron watched RRR.. He liked it so much that he recommended to his wife Suzy and watched it again with her.🙏🏻🙏🏻 Sir I still cannot believe you spent a whole 10 minutes with us analyzing our movie. As you said I AM ON TOP OF THE WORLD... Thank you both 🥰🥰🤗🤗 pic.twitter.com/0EvZeoVrVa — rajamouli ss (@ssrajamouli) January 16, 2023 -
ప్రేమికుల దినోత్సవానికి టైటానిక్
సినిమా లవర్స్‌కి.. అందులోనూ ప్రేమకథా చిత్రాల ప్రేమికులకు ఈ ప్రేమికుల దినోత్సవానికి సిల్కర్ స్క్రీన్ పై ‘టైటానిక్’ ప్రత్యక్షం కానుంది. టైటానిక్ ఓడలో పరిచయం అయి, ప్రేమికులుగా దగ్గరయ్యే జాక్, రోజ్లు చివరికి ఓడ ప్రమాదంలో దూరమయ్యే ఈ విషాదభరిత ప్రేమకథ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. ప్రేమికులుగా లియో నార్డో డికాప్రియో, కేట్ విన్ ్సలెట్ల కెమిస్ట్రీని అంత సులువుగా ఎవరూ మరచిపోలేరు. జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ ఎవర్గ్రీన్ లవ్‌స్టోరీ విడుదలై 25 ఏళ్లయింది. ఈ సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ చిత్రాన్ని హై క్వాలిటీతో మళ్లీ సిల్వర్ స్క్రీన్ పైకి తీసుకు రావాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ప్రకటించి పోస్టర్ని, ట్రైలర్‌ని విడుదల చేసింది చిత్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా వచ్చే నెల 10న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. 4కే ప్రింట్‌తో త్రీడీ వెర్షన్ లో ఈ లవ్‌స్టోరీ కొత్త హంగులతో రావడానికి సిద్ధమవుతోంది. ఇక 1997 నవంబర్‌లో విడుదలైన ‘టైటానిక్’ సంచలన విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా రూ. 13 వేల కోట్లకు పైగా కలెక్ట్ చేసి, రికార్డు సృష్టించింది. 2010లో జేమ్స్ కామెరూన్ అద్భుత సృష్టి ‘అవతార్’ విడుదలయ్యే వరకూ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం రికార్డ్ ‘టైటానిక్’దే. కామెరూన్ తన సినిమా రికార్డ్‌ని తానే బద్దలు కొట్టడం విశేషం. ఇక ఆస్కార్ అవార్డ్స్‌లో 14 నామినేషన్లు దక్కించుకుని, 11 అవార్డులను సొంతం చేసుకున్న ఘనత కూడా ‘టైటానిక్’కి ఉంది. ప్రేక్షకుల ఆదరణతో పాటు ఇలా పలు రికార్డులు సొంతం చేసుకున్న ఈ చిత్రం త్రీడీ వెర్షన్‌ని 2012లో విడుదల చేశారు. ఇప్పుడు మరింత క్వాలిటీతో ‘టైటానిక్’ రానుంది. -
అవతార్-2 అరుదైన రికార్డ్.. రెండు వారాల్లోనే ఆ చిత్రాన్ని దాటేసింది..!
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ ఓ రేంజ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. సముద్రం అడుగున ఓ అద్భుత ప్రపంచాన్ని సృష్టించడం కామెరూన్‌కే సాధ్యమనేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. (ఇది చదవండి: అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్) తాజాగా ఈ చిత్రం ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా వన్ బిలియన్ డాలర్ల టికెట్ల అమ్మకాల మార్క్‌ను అవతార్-2 అధిగమించింది. కేవలం 14 రోజుల్లో ఈ మార్క్‌ను దాటేసింది కామెరూన్ విజువల్ వండర్. జురాసిక్ వరల్డ్ డొమినియన్ చిత్రాన్ని అధిగమించి 2022లో రెండో అత్యధిక గ్రాస్ సాధించిన మూవీగా నిలిచింది. 2022లో విడుదలైన మూడు సినిమాలు మాత్రమే వన్ బిలియన్ డాలర్ల మార్కును అధిగమించాయి. అవతార్: ది వే ఆఫ్ వాటర్‌తో పాటు టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్: మావెరిక్ (31 రోజులు), క్రిస్ ప్రాట్ మూవీ జురాసిక్ వరల్డ్ డొమినియన్ ఈ మార్క్ చేరుకోవడానికి నాలుగు నెలల కంటే ఎక్కువ సమయం పట్టింది. 2019లో విడుదలైన తొమ్మిది సినిమాలు ప్రపంచవ్యాప్తంగా 1 బిలియన్ డాలర్లను అధిగమించాయి. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ మూవీ తర్వాత అవతార్- 2 అత్యంత వేగంగా ఈ మార్క్‌ను చేరుకుంది. స్పైడర్ మ్యాన్ చిత్రం కేవలం 12 రోజుల్లోనే అధిగమించి మొదటిస్థానంలో ఉంది. ఇప్పటివరకు కేవలం ఆరు సినిమాలు మాత్రమే మొదటి రెండు వారాల్లో వన్ బిలియన్ చేరుకున్నాయి. (ఇది చదవండి: సెన్సేషన్‌గా అవతార్ 2.. ఇండియాలో ఎంత వచ్చిందంటే?) అవతార్ 2 ఇప్పటివరకు ఉత్తర అమెరికాలో 317.1 మిలియన్ డాలర్లు, విదేశాల్లో 712.7 మిలియన్ డాలర్లు వసూళ్లు రాబట్టింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా 1.025 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. జురాసిక్ వరల్డ్ డొమినియన్ 1.001 బిలియన్ డాలర్లను అధిగమించి రెండవ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది అవతార్-2. ప్రస్తుతం అంచనాల ప్రకారం గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద వసూళ్లు తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. కొవిడ్ మహమ్మారి మరోసారి పుంజుకోనుంది. అవతార్-2 ప్రధాన థియేట్రికల్ మార్కెట్ అయిన చైనాలో కరోనా విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే పలు ఆంక్షల రష్యాలో చిత్రానికి ఆదరణ తగ్గింది. -
అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు ఈ సినిమా టికెట్ రేట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవతార్ మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అవతార్-2 త్రీడీ వెర్షన్ టికెట్ ధరలు భారీగా తగ్గాయి. IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్ టికెట్ ధరను రూ.150కి తగ్గించారు. ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు తాజాగా తీసుకున్న టికెట్ తగ్గింపు నిర్ణయం కలెక్షన్లు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అవతార్-2 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి. -
‘అవతార్ 2’ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేస్తోంది.. ఫ్యాన్స్‌కు పండగే
విజువల్ వండర్ అవతార్-2 ప్రస్తుతం థియేటర్లలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ కురిపిస్తుంది. ఇప్పటివరకు సుమారు 5వేల కోట్లకు పైగానే వసూళ్లు సాధించింది. హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక 3D, 4DX టెక్నాలజీతో అందుబాటులో ఉన్న అవతార్-2 సినిమా టికెట్ రేట్స్ కూడా భారీగానే ఉన్నాయి. దీంతో ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. అలాంటి అభిమానులకు గుడ్‌న్యూస్. ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని ఇప్పటికే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ భారీ ధరకు సొంతం చేసుకుంది. రిలీజ్ డేట్ నుంచి 234 రోజుల తర్వాతే అవతార్ 2 ఓటీటీలోకి అందుబాటులో రానుందని వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఈ సినిమాని ఓటీటీ చూడాలనుకునే ప్రేక్షకులు అప్పటిదాకా వేచిచూడాల్సిందే. -
ఆ హామీ ఇస్తే ఇప్పుడే అందరూ చస్తారు: ఆర్జీవీ ట్వీట్ వైరల్
అవతార్-2: ది వే ఆఫ్ వాటర్ జేమ్స్ కామెరూన్ సృష్టించిన అద్భుత ప్రపంచం. సముద్రంలో ఆయన సృష్టించిన ప్రపంచం చూస్తే అశ్చర్యపోకుండా ఉండలేరు. అంటూ అవతార్-2 పై ప్రశంసల వర్షం కురిపించారు సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్. సినిమాలోని ప్రతి సీన్ కట్టిపడేసేలా చేసిందని ఆయన అన్నారు. దేవుడు ఈ విశ్వాన్ని సృష్టిస్తే.. కామెరూన్ ‘పండోరా’ అనే అద్భుత ప్రపంచాన్ని ఆవిష్కరించాడని కొనియాడారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన అవతార్-2 చిత్రంలో జేమ్స్ కామెరూన్ అందమైన నీటి ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. అద్భుతమైన విజువల్స్, ఆకట్టుకునే ప్రదర్శన, ఊపిరి బిగబెట్టేలా యాక్షన్ సీన్లతో థియేటర్లను ఊపేశారు. దేవుడు ఈ భూమిని సృష్టిస్తే.. పండోరా అనే అందమైన ప్రపంచాన్ని జేమ్స్ కామెరూన్ క్రియేట్ చేశాడని రామ్ గోపాల్ వర్మ ప్రశంసలతో ముంచెత్తారు. ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ..'ఈ ప్రపంచంలో నివసించాలని ఉంది. కానీ అవతార్-2 చూశాక స్వర్గం అంటే పండోరా ప్రపంచంలా ఉంటుందని ఎవరైనా హామీ ఇస్తే.. మనుషులందరూ ఇప్పుడే చచ్చిపోతారు' అంటూ పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. 2009లో విడుదలైన అవతార్ సీక్వెల్‌గా హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. శుక్రవారం విడుదలైన ఈ సినిమా తొలి రోజే హిట్ టాక్ తెచ్చుకుంది. ఇదొక విజువల్ వండర్ అని పలువురు ప్రశంసించారు. After seeing AVATAR 2 , if somebody can assure that heaven will look anywhere like PANDORA the entire human species will DIE immediately — Ram Gopal Varma (@RGVzoomin) December 18, 2022 -
తొలి రోజే తుస్సుమన్న అవతార్-2.. ఆ సినిమాను కూడా దాటలేకపోయింది
సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన భారీ విజువల్ వండర్ మూవీ 'అవతార్- 2'. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాపై భారీ అంచనాలు రావడంతో వసూళ్లు సైతం భారీ స్థాయిలో ఉండవచ్చని అభిమానులు ఫ్యాన్స్ భావించారు. 13 ఏళ్ల క్రితం విడుదలైన అవతార్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఇండియాలో ఈనెల 16న విడుదలైన ఈ చిత్రం సాధించిన వసూళ్లపై ఓ లుక్కేద్దాం. అవతార్: ది వే ఆఫ్ వాటర్ ఇండియాలో బాక్సాఫీస్ వద్ద తొలిరోజు రూ.38-40 కోట్ల మధ్య వసూళ్లు సాధించినట్లు సినీవర్గాలు అంచనా వేశాయి. ఈ కలెక్షన్లతో స్పైడర్ మ్యాన్:నో వే హోమ్, అవెంజర్స్: ఇన్ఫీనిటీ వార్ సినిమాలను వెనక్కి నెట్టింది. అయినప్పటికీ దేశంలో అతిపెద్ద హాలీవుడ్ ఓపెనింగ్స్ రాబట్టిన అవెంజర్స్: ఎండ్‌గేమ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. (ఇది చదవండి: ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’ మూవీ రివ్యూ) ఇండియాలో అవెంజర్స్: ఇన్ఫినిటీ వార్ మొదటి రోజు రూ.31 కోట్లు, స్పైడర్ మ్యాన్: నో వే హోమ్ రూ.32 కోట్లు వసూలు చేయగా.. ఎవెంజర్స్: ఎండ్‌గేమ్ రూ.53 కోట్ల ఓపెనింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అవతార్- పార్ట్ 1 ఇప్పటి వరకు 2.9 బిలియన్ డాలర్లతో మొత్తం బాక్సాఫీస్ కలెక్షన్లతో ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రంగా రికార్డ్ సాధించింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన అవతార్-పార్ట్ 1 విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన సంగతి తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్భుతంగా ఆవిష్కరించిన కామెరూన్.. ఈ సారి సీక్వెల్‌తో నీటి అడుగున అందమైన ప్రపంచాన్ని పరిచయం చేశారు. భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. దాదాపు రూ.3వేల కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించారు. విజువల్స్ పరంగా సినిమా అద్భుతంగా ఉందని సినీ ప్రేక్షకులు అంటున్నారు. సినీ విశ్లేషకులు నివేదిక ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా(రెండు రోజుల్లో) రూ.300కోట్లు వరకు వసూలు చేసిందని అన్నారు. -
టైటానిక్ టూ అవతార్.. దాదాపు 25 ఏళ్ల తర్వాత మళ్లీ..!
'అవతార్-2: ది వే ఆఫ్ వాటర్' ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్-2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. తొలి భాగంలో పండోరా అందాలను అద్బుతంగా ఆవిష్కరించిన కామెరూన్.. ఇప్పుడు నీటి అడుగున అందాలు, భారీ జలచరాలతో సంభ్రమాశ్చర్యాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. (ఇది చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత) అయితే ఈ చిత్రంలో టైటానిక్ భామ కేట్ విన్స్లెట్ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జేమ్స్ కామెరూన్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. టైటానిక్ విడుదలైన 25 ఏళ్ల తర్వాత కేట్ విన్ స్లెట్, జేమ్స్ కామెరూన్ మళ్లీ అవతార్-2లో కలిసి పనిచేయడం గమనార్హం. అవతార్ మూవీతో ఆల్ టైమ్ అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన జేమ్స్ కామెరూన్.. దాదాపు 13 ఏళ్ల తర్వాత వచ్చిన సీక్వెల్లో పండోరలోని అందమైన ప్రకృతి దృశ్యాలను చూపించారు. సామ్ వర్తింగ్టన్, జో సాల్దానా.. జేక్, నేత్రి పాత్రలు పోషించగా.. ఈ అడ్వెంచర్‌లో టోనోవరీ భార్యగా రోనల్ పాత్రలో కేట్ విన్స్లెట్ నటించింది. టైటానిక్ భామ కేట్ విన్ స్లెట్ మాట్లాడుతూ.. 'మా ఇద్దరి మధ్య చాలా తేడాలు ఉన్నాయని అనుకుంటున్నా. టైటానిక్ విడుదలై 25 ఏళ్లైంది. ఇది చాలా సుదీర్ఘ సమయం. అది నా జీవితకాలంలో సగభాగం కంటే ఎక్కువ. ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నేను తల్లిని అయ్యా. జేమ్స్ కామెరూన్ కూడా పేరెంట్ అయ్యారు. మేమిద్దరం కళాకారులం. మేం ప్రయోగాత్మకంగా మరింత సాహసోపేతంగా ఉన్నాం. అదే మా ఇద్దరి మధ్య ప్రధాన వ్యత్యాసం. ఇద్దరి మధ్య సృజనాత్మకమైన తేడాలు చాలా ఉన్నాయి.' అని అన్నారు. -
‘అవతార్-ది వే ఆఫ్ వాటర్’ మూవీ రివ్యూ
టైటిల్: అవతార్-ది వే ఆఫ్ వాటర్ నటీనటులు: సామ్ వర్తింగ్టన్, జోయా సాల్డానా, స్టీఫెన్‌లాంగ్, సిగర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్ తదితరులు నిర్మాణ సంస్థలు: లైట్‌స్ట్రోమ్ ఎంటర్టైన్మెంట్, టీఎస్జీ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు: జేమ్స్ కామెరూన్, జోన్ లాండౌ దర్శకత్వం: జేమ్స్ కామెరూన్ సంగీతం: సైమన్ ఫ్రాంగ్లెన్ సినిమాటోగ్రఫీ: రస్సెల్ కర్పెంటర్ ఎడిటింగ్ : స్టీఫెన్ ఈ, డెవిడ్ బ్రేన్నర్, జాన్ రెఫౌవా విడుదల తేది: డిసెంబర్ 16, 2022 కథేంటంటే... మానవ సైన్యంతో పోరాడి పండోరా ప్రపంచాన్ని కాపాడిన జేక్ సెల్లీ ( సామ్ వర్తింగ్టన్) .. నావీ తెగకు నాయకుడవుతాడు. భార్య నేత్రి(జోయా సాల్డానా) కలిసి అక్కడే ఉంటాడు. వారికి లోక్, నితాయాం, టూక్ అనే ముగ్గురు పిల్లలు పుడతారు. అలాగే కిరీ అనే అమ్మాయిని, స్పైడర్ అనే అబ్బాయిని దత్తత తీసుకుంటారు. పండోరా ప్రజలను యోగక్షేమాలు చూసుకుంటూ హాయిగా జీవిస్తుంటారు జేక్ సెల్లీ ఫ్యామిలీ. అదే సమయంలో పండోరాని ఆక్రమించేందుకు మనుషులు మరోసారి దండయాత్రకు వస్తారు. జేక్ సెల్లీ ఫ్యామిలీని అంతమొందిస్తే పండోరా గ్రహాన్ని ఆక్రమించుకోవచ్చని.. ఆ దిశగా పోరాటం చేస్తుంటారు. మనుషుల నుంచి తన కుటుంబాన్ని రక్షించుకునేందుకు జేక్ సెల్లి..మెట్ కానియా ప్రాంతానికి పారిపోతాడు. సముద్రమే ప్రపంచంగా జీవించే మెట్ కానియా తెగ... జేక్ సెల్లీ రాకను అడ్డుకుంటుంది. అయితే అక్కడి రాజు టోనోవరి వీరికి అండగా నిలబడతాడు. మెట్కానియా తెగ మాదిరే.. జేక్ ఫ్యామిలీ కూడా సముద్రంతో అనుబంధం ఏర్పరచుకొని హాయిగా జీవితం గడుపుతుంటారు. ఈ విషయం మనుషులకు తెలుస్తుంది. ఎలాగైన జేక్ సల్లీ కుటుంబాన్ని మట్టుబెట్టాలని కల్నల్ మైల్స్ క్వారిచ్(స్టీఫెన్‌లాంగ్) అతని బృందంతో కలిసి మెట్ కానియా ప్రాంతంపై దండయాత్రకు వస్తాడు. మనుషుల బృందాన్ని జేక్ సెల్లీ ఎలా ఎదుర్కొన్నారు. అతనికి మెట్ కానియా తెగ ఎలా సహాయం చేసింది. పిల్లలను రక్షించుకోవడానికి నేత్రీ, జేక్ సెల్లీ ఎలాంటి పోరాటం చేశారనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. ‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. 13 ఏళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఓ సంచలనం. అప్పటి వరకు చూడని వింత జీవులు.. తెలియని ప్రపంచం.. సరికొత్త ప్రేమాయణం.. ఇలా ఎన్నో ప్రత్యేకతలు ఆ సినిమాలో ఉన్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది. అందుకే 13 ఏళ్లు తర్వాత వచ్చిన సీక్వెల్‌పై సీనీ ప్రేక్షకులు భారీ అంచనాలు ఏర్పరచుకున్నారు. మరోసారి కొత్త ప్రపంచంలోకి వెళ్లోచ్చని ఆశపడ్డారు. నిజంగానే జేమ్స్ కామెరూన్ మరో ప్రపంచాన్ని చూపించాడు. సముద్ర గర్భంలో ఓ అందమైన ప్రపంచం ఉందని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. సినిమా ప్రారంభంలో కాసేపు ‘అవతార్’మాదిరే పండోరా గ్రహంలోని అందాలను చూపించిన దర్శకుడు... ఆ తర్వాత కథను సముద్రంవైపు మళ్లించాడు. సముద్రం అడుగున చూపించే ప్రతి సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. తిమింగలంతో జేక్స్ తనయుడు చేసే పోరాటం ఆకట్టుకుంది. అలాగే పాయకాన్(భారీ ఆకారం గల చేప)తో లోక్ స్నేహం.. క్లైమాక్స్ అది చేసిన పోరాటం సినిమాకు హైలెట్ అని చెప్పొచ్చు. నితాయాం చనిపోయే సన్నివేశం హృదయాలను హత్తుకుంటాయి. విజువల్స్ పరంగా అవతార్ కంటే గొప్పగా ఈ చిత్రం ఉంటుంది. కానీ కథలో మాత్రం కొత్తదనం కొరవడింది. సాధారణ రివేంజ్ డ్రామాగా కథనం సాగుతుంది. జేక్ సెల్లీ ఫ్యామిలీని అంతమొందించేందుకు కల్నల్ మైల్స్ ప్రయత్నించడం..అతని దాడిని జేక్ సెల్లీ తిప్పికొట్టడం..ఇదే ఈ సినిమా కథ. నేత్రి పిల్లలను కల్నల్ బందించడం.. జేక్స్ పోరాటం చేసి తిరిగి తెచ్చుకోవడం.. కథనం మొత్తం ఇలానే సాగుతుంది. ఈ తరహా కథలు తెలుగులో చాలానే వచ్చాయి. కానీ కొత్త జీవులు, విజువల్స్ యాడ్ చేయడం వల్ల అవతార్ 2 కాస్త డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఇక క్లైమాక్స్‌లో నౌకలో వచ్చే కొన్ని సన్నివేశాలు టైటానిక్ సినిమాను గుర్తు చేస్తాయి. విజువల్స్ అండ్ యాక్షన్ సన్నివేశాలు సినిమాకు ప్లస్ అయితే.. సినిమా నిడివి(192.10 నిమిషాలు), ఊహకందేలా కథనం సాగడం మైనస్. ఎవరెలా చేశారంటే.. ఈ చిత్రంలో హీరో జేక్ సెల్లీగా సామ్ వర్తింగ్టన్ నటించాడు. ఓ తెగ నాయకుడిగా, పిల్లలకు మంచి తండ్రిగా చక్కని నటన కనబరిచాడు. యాక్షన్ సీన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవతార్‌కు మించిన యాక్షన్స్ సీన్స్ ఇందులో ఉన్నాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న కల్నల్ మైల్స్ క్వారిచ్ పాత్రలో స్టీఫెన్‌లాంగ్ ఒదిగిపోయాడు. నేత్రిగా జోయా సాల్డానా చక్కని నటనను కనబరిచింది. నౌకలో ఆమె చేసే పోరాట ఘట్టాలు హైలైట్. సిగర్నీ వీవర్, కేట్ విన్స్లెట్, క్లిఫ్ కర్టిస్, జోయెల్ డేవిడ్ మూర్లతో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. సాంకేతిక విషయాల్లో వంక పెట్టనక్కర్లేదు. సంగీతం, సినిమాటోగ్రఫీ, స్క్రీన్‌ప్లే..ప్రతీది అద్భుతంగా ఉన్నాయి. ఎడిటర్ తన కత్తెరకు ఇంకాస్త పనిచెప్పాల్సింది. సినిమాలో అనవసరపు సన్నివేశాలు చాలా ఉన్నాయి. వాటిని తొలగించి సినిమా నిడివిని తగ్గిస్తే.. బాగుండేది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగా ఉన్నతంగా ఉన్నాయి. - అంజిశెట్టి, సాక్షి వెబ్ డెస్క్ -
'అవతార్-2' సినిమా కాదు.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
అవతార్-2: ది వే ఆఫ్ వాటర్' ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట. ఎందుకంటే విజువల్ వండర్‌ను ప్రపంచానికి పరిచయం చేసిన జేమ్స్ కామెరూన్ మరోసారి అవతార్-2 రూపంలో ప్రేక్షకుల ముందుకొచ్చారు. యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ‘అవతార్-2’ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘అవతార్’ విజువల్ వండర్‌గా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. తాజాగా అవతార్-2 సినిమాపై సంచలన దర్శకుడు ట్వీట్ చేశారు. అవతార్ సినిమాను చూశాక ఆర్జీవీ తన అభిప్రాయాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆర్జీవీ తన ట్వీట్లో రాస్తూ..'ఇప్పుడే అవతార్-2 లో స్నానం చేశా. దీన్ని సినిమా అని పిలిస్తే అది కచ్చితంగా నేరమే అవుతుంది. ఎందుకంటే ఆ విజువల్స్, యాక్షన్స్ జీవితకాలం గుర్తుండిపోతాయి. కొద్దిసేపటి క్రితమే ఆ సినిమా చూసి కొన్నిసార్లు థీమ్ పార్క్‌కు వెళ్లినట్లు ఫీలయ్యా. అది నాకు చెడుగా మాత్రం అనిపించలేదు.' అంటూ పోస్ట్ చేశారు. ఆర్జీవీ ట్వీట్ చూసిన అభిమానులు తెగ కామెంట్స్ చేస్తున్నారు. మీ సినిమా డేంజరస్ కంటే బాగుందని కామెంట్స్ చేశారు. మరొకరు అవతార్-2 పై ఆర్జీవీ రివ్యూ అంటూ రిప్లై ఇచ్చారు. Just bathed in AVATAR 2 ..It will be a crime to call it a film because It’s an experience of a life time ..SPECTACULAR VISUALS and MIND BENDING ACTION.. a few times it feels like a theme park visit bit I don’t mean that in a bad way 💐💐💐 — Ram Gopal Varma (@RGVzoomin) December 16, 2022 -
అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత
సినీ ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న అవతార్-2 నేడు(శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. పంచ వ్యాప్తంగా 52000 స్క్రీన్స్‌లో అవతార్-2 గ్రాండ్‌గా విడుదలైంది.అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత మోగించింది. గతంలో ఏ సినిమాకి లేనంతగా అవతార్-2కి అడ్వాన్స్ బుకింగ్స్ జరిగాయి. ఈ క్రమంలో భారత్‌లో కేజీఎఫ్ రికార్డును అవతార్-2 బ్రేక్ చేసేసింది. దీంతో ఓపెనింగ్ కలెక్షన్స్‌పై కూడా భారీగా అంచనాలు క్రియేట్ అయ్యాయి. భారత్‌లో సుమారు రూ.30-40 కోట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే అవతార్-2 మూవీ కోసం 4,41,960 మంది భారత్‌లో అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఏ సినిమాకి కూడా ఇంతమంది అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోలేదు. కేజీఎఫ్-2కి 4,11,000 మంది, బ్రహ్మస్త్రకి 3,02,000, దృశ్యం-2కి 1,16,000, ఆర్ఆర్ఆర్కి 1,05,000 టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 800 ప్లస్ థియేటర్స్ ఈ సినిమా రిలీజ్ అయ్యింది. దీన్ని బట్టి ఓవరాల్‌గా తొలి మూడు రోజుల్లోనే భారత్‌లో అవతార్-2 రూ.100కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టే అవకాశం కనిపిస్తుంది. -
‘అవతార్ 2’ మూవీ ట్విటర్ రివ్యూ
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ సినిమా ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు (డిసెంబర్ 16) ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత వస్తున్న ‘అవతార్’కు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై హైప్ క్రియేట్ చేశాయి. ఈ సినిమా విడుదలకు రెండు రోజుల ముందే ప్రపంచ వ్యాప్తంగా సీనీ ప్రముఖుల కోసం స్పెషల్ స్క్రీనింగ్స్ వేశారు. దీంతో అప్పుడే ఈ సినిమాపై సోషల్ మీడియాలో రివ్యూలు వచ్చాయి. బాలీవుడ్ స్టార్స్ అయితే అవతార్ 2పై ప్రశంసల జల్లు కురిపించారు. పలు చోట్ల అవతార్ 2 ఫస్ట్ షో పడిపోవడంతో సినిమా చూసిన ప్రేక్షకులు శుక్రవారం తెల్లవారుజాము నుంచి ట్విటర్లో తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్’ కథేంటి? ఎలా ఉంది తదితర విషయాలను ట్విటర్ వేదికగా తెలియజేస్తున్నారు. అవేంటో చూసేయండి‘అవతార్ 2 ఓ విజువల్ ట్రీట్. ఎమోషనల్‌గా కూడా కనెక్ట్ అవుతుంది. థియేటర్స్‌లో ఈ సినిమా చూస్తే కలిగే అనుభూతే వేరు’ అని నెటిజన్స్ అంటున్నారు. I’m almost convinced James Cameron shot #AvatarTheWayOfWater on another planet. The film is absolutely stunning and immersive. It’s long but I was completely engaged all the way through. Much like #avatar 13 years ago, this film is a cinematic achievement and a must see event! pic.twitter.com/2WFlJzmbeI — Joseph Deckelmeier (@Joelluminerdi) December 6, 2022 #AvatarTheWayOfTheWater First 90mins has surreal experience with ethereal visuals. 25 mins underwater visuals are magnificent. Waiting for the second half!!!! #AvatarTheWayOfWater #Avatar pic.twitter.com/nwYbN6DEh9 — AZEEZ RAHMAN (@Oliverthala) December 16, 2022 Just saw #AvatarTheWayOfWater. I think the first one is overhated but indulgent. But the story was simple and there were only a few characters. The problem is they were too one-dimensional. — Josh Kroeger (@KailKilbourne) December 16, 2022 In #AvatarTheWayOfWater, #Pandora has been so fully realized, and so meticulously worked out by director @JimCameron - who submerged his actors in real water for the film's many underwater sequences - that it all feels completely lived in. It is pure #JamesCameron movie magic! pic.twitter.com/9fz1zTcke9 — Somesh Sinha (@SinhaSomesh) December 16, 2022 #avatar2 foi o único filme da vida que não me fez dormir no cinema, e olha que a maioria nunca passou de 2hrs, e avatar são 3hrs. ESPETÁCULO!! — Caio Vinícius (@caio7090) December 16, 2022 #AvatarTheWayOfWater was fuckin' SICK and made me cry A LOT. I saw it with my dad. The first movie is one of his favorites, so he's been waiting for this for so long and I'm glad he got to see it and I hope he gets to see the next one too. I'M AN AVATAR STAN AND I DON'T FEEL BAD. — taylor johnston. (@TheSewerGoblin) December 16, 2022 #AvatarTheWayOfWater this is a spectacle. It’s very long, the final battle rules , it’s a lock for the Visual effects Oscar and in IMAX 3D there is a mix between HFR & regular frame rate. Jim Cameron you nut. — RRRyan B+ (@TheChewDefense) December 16, 2022 I really enjoy the tech in this film! definitely interested to see how the future tech is crafted every time! #AvatarTheWayOfWater all the marine tech had me like woah I shouldn't enjoy the evilness 😭 — 𝖙𝖜𝖎𝖙𝖈𝖍 𝖙𝖗𝖎𝖘 🎥 𝕯𝖊𝖈 𝟏𝟗 🎊 (@_StayFancy) December 16, 2022 i’m still reeling from the fact that i FINALLY, after twelve years of waiting, got to see #AvatarTheWayOfWater. it was worth the wait and then some. a genuine “see it in theaters on the biggest/best screen possible” kind of movie. (also, see it in 3D. just saying) — Matt Anderson (@matthew70798) December 16, 2022 #AvatarTheWayofWater Review: Brilliance Written All Over It 👏 The Visuals Are Terrific 💯 The Duration Was Not An Issue For Me ✌️#JamesCameron - Take A Bow🤩 The Long Wait Was Worth It😃#Avatar #Avatar2 #Avatar2review #AvatarTheWayOfWaterreview #AvatarTheWayOfWaterreview pic.twitter.com/PDaGeaRvNk — Kumar Swayam (@KumarSwayam3) December 16, 2022 Saw #AvatarTheWayOfWater on #IMAX tonight. Loved it. It was as good as I wanted it to be. The visuals are truly stunning. I want to see it again already. Big thumbs up 👍🏻 #movie — Josef Blumenfeld (@JosefBlumenfeld) December 16, 2022 AVATAR DAY... ♂️ BEST EXPERIENCE OF ALL TIME WHERE WE GOES TO THE ANOTHER WORLD.. 😇💙#AvatarTheWayOfWater #Avatar | #Avatar2 pic.twitter.com/nrpSMhgsjZ — Karthikeyan AK (@Karthik_AK2) December 16, 2022 All hail James Cameron, King of the Blockbusters! #AvatarTheWayOfWater pic.twitter.com/UJC3DTcyqU — David Hummingbird (@davidshbird) December 16, 2022 After watching #AvatarTheWayOfWater I’d welcome a 9 hour long sequel! Holy shit! https://t.co/cmr8ce3Isq — ❄️Snow Jake❄️ (@Fake_JakeH) December 16, 2022 Film Review: AVATAR: THE WAY OF WATER (2022): James Cameron's Epic Sequel is Awe-Inspiring but Struggles a Bit to Live Up to the Original Movie https://t.co/kHFDD2zIfH #FilmBook #20thCenturyStudios #AmandaSilver #AvatarTheWayofWater #BaileyBass #BrendanCowell #BritainDalt... pic.twitter.com/hyt5ytNyt5 — William Karrington (@FilmBookWilliam) December 16, 2022 #AvatarTheWayOfWater - First half (Indian version), mind blowing! The world of @JimCameron , especially the under water sequences are stunning . The emotional bond between #JakeSully and his family make us root throughout the film . Excellent 👌👌 — Rajasekar (@sekartweets) December 16, 2022 -
‘అవతార్’ కథేంటి? పార్ట్ 2 లో ఏం చూపించారు?
ఎట్టకేలకు అవతార్ సినిమా సీక్వెల్ ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్' థియేటర్స్‌లో వచ్చేసింది. భారత్‌లో నేడు(డిసెంబర్ 16) ఈ సినిమా విడుదలైంది. ఇప్పటికే లక్షలాది మంది ముందుగా టికెట్ బుక్ చేసుకొని పండోరా ప్రపంచానికి చూడడానికి వెళ్లారు. అవతార్ 2009 డిసెంబర్ 18న విడుదలైంది. 13 ఏళ్ల తర్వాత దాని సీక్వెల్ విడుదలైంది. పార్ట్ 2 చూసే ముందు.. ఒక్కసారి అవతార్ కథేంటో మరోసారి గుర్తు చేసుకుందాం. ఈ చిత్రం కోసం పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించాడు జేమ్స్ కామెరూన్. ఆ గ్రహం మీద ‘నావి’ అనే తెగ జీవిస్తుంటుంది. అక్కడ ఉండే సహజవనరులపై మానవుల కన్ను పడుతుంది. అమెరికా సైన్యం అక్కడకు వెళ్లగా.. నావీ తెగ వారిని ఎదుర్కొంటుంది. దీంతో ఏలియన్‌ను పోలి ఉన్న నావీ తెగ మనుషులను తాము తయారు చేయలనుకుంటారు. నేటివ్స్ డీఎన్ఏతో మానవ డీఎన్ఏను జోడించి,రిమోట్ కంట్రోల్‌తో పనిచేసే అవతార్లను రెడీ చేస్తారు. అలాంటి అవతార్లలో జేక్ సల్లీ(సామ్ వర్తింగ్టన్) ఒకరు. మనిషిగా ఉన్నప్పుడు జేక్ సల్లీ నడవలేడు. నావికా దళంలో ఉన్నప్పుడు ఆయన ప్రమాదానికి గురై కాళ్లు పోగోట్టుకుంటాడు. అయితే అవతార్‌గా మారిన తర్వాత జేక్ సల్లీ పరుగెత్తగలగుతాడు. పండోరా గ్రహంలో ఉన్న ఓ విలువైన చెట్టు రహస్యాన్ని చెబితే.. కాళ్లు వచ్చేలా చేస్తానని జేక్‌కు ఓ అధికారి ఆఫర్ ఇస్తాడు. దీంతో జేక్ ఆ గ్రహంపైకి వెళ్తాడు. అక్కడ క్రూర మృగాలు దాడి చేయడంతో జేక్ సల్లీతో వచ్చిన మిగిలిన సభ్యులంతా పారిపోతారు. ఆయన ఒక్కడే పండోరాలో ఉండిపోతాడు. ఇక చావడం ఖాయం అనుకున్న సమయంలో నావీ తెగకు చెందిన నేత్రి అతన్ని రక్షిస్తుంది. నావీతెగ పెట్టిన ఓ పరీక్షలో విజయం సాధించి జేక్ వారిలో ఒక సభ్యునిగా చేరిపోతాడు. వారిలో ఒకడిగా ఉండేందుకు శిక్షణ తీసుకునే క్రమంలో జేక్ సల్లీ నేత్రీతో ప్రేమలో పడిపోతాడు. నావీ తెగ మంచితనం చూసి వారికి రక్షణగా ఉండేందుకు ప్రయత్నిస్తాడు. అయితే ఓ రోజు ఆర్డీఏ ఆఫీసర్లు పండోరా గ్రహంపై ఉన్న విలువైన చెట్టును తొలగించేందుకు ప్రయత్నిస్తారు. జేక్ వారిని అడ్డుకుంటారు. తాము తయారు చేసిన అవతార్..తమకే వ్యతిరేకంగా మాట్లాడడంతో ఆర్డీఏ అధికారులు షాకవుతారు. తమను మోసం చేశాడని అతని శరీరంలోని అవతార్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. తాను నావీ తెగతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లేలా చేస్తానని జేక్ పండోరా గ్రహం మీదకు వస్తాడు. జరిగిన విషయం చెప్పబోతుండగా..వారు వినిపించుకోరు. ప్రేమ పేరుతో మోసం చేశాడని నేత్రి భావిస్తుంది. ఒకవైపు జేక్ సల్లీ నావి తెగను ఒప్పించే ప్రయత్నం చేస్తుండగానే.. మరోవైపు ఆర్డీఏ అధికారులు పండోరాపై యుద్ధానికి వస్తారు. ఈ క్రమంలో జేక్ సల్లీ నావీ తెగకు అండగా నిలబడతాడు. మానవులతో యుద్దం చేసి వారిని తిగిరి భూమ్మీదకు పంపిస్తాడు. అంతేకాదు తాను శాశ్వతంగా అవతార్గానే ఉండిపోవాలని నిర్ణయించుకుంటాడు. దీంతో అవతార్ కథ ముగుస్తుంది. మానవులు, ఏలియన్ ల మధ్య యుద్దంతో పాటు అంతకు మించిన ప్రేమ కథను ‘అవతార్’లో చూపించాడు జేమ్స్ కామెరూన్. అవతార్ 2లో కూడా జేక్ సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకునే పోరాటం చేస్తారని తెలుస్తోంది. . అయితే ఇది నీటి అడుగున జరిగే కథ. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 అద్భుతంగా రూపొందించినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. -
అవతార్ 2 లీక్.. నెట్టింట దుమ్ము దుమారం..
జేమ్స్ కామెరూన్ డైరెక్ట్ చేసిన భారీ బడ్జెట్ చిత్రం అవతార్ 2. ఈ సినిమా శుక్రవారం గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుండగా చిత్రయూనిట్‌కు భారీ షాక్ తగిలింది. రిలీజ్‌కు ఒకరోజు ముందే ఆన్లైన్లో అవతార్ 2 సినిమా ప్రత్యక్షమైంది. కొందరు ఈ సినిమాను పైరసీ చేసి టెలిగ్రామ్‌లోనూ అప్లోడ్ చేశారు. ఫ్రీగా సినిమా అందుబాటులోకి రావడంతో చాలామంది నెట్టింట ప్రింట్ డౌన్లోడ్ చేసుకుని చూసేస్తున్నారు. దీనిపై సినీప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవతార్ 2 థియేటర్లలో చూసిన సినిమా అని, ఫోన్లో చూస్తే మజా ఏం ఉంటుందని ప్రశ్నిస్తున్నారు. వేలాది కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన సినిమాను ఇలా పైరసీ చేయడం చాలా పెద్ద తప్పని కామెంట్లు చేస్తున్నారు. మరి అవతార్ 2 విడుదలకు ముందే ఆన్లైన్లో అందుబాటులోకి రావడం వల్ల సినిమా కలెక్షన్లపై ఏమైనా ఎఫెక్ట్ పడుతుందేమో చూడాలి! కాగా 13 ఏళ్ల క్రితం ఘన విజయం సాధించిన అవతార్‌కు సీక్వెల్‌గా వస్తోందీ చిత్రం. ఈ సినిమా ఏకంగా 160 భాషల్లో రిలీజ్ కానుంది. ఒక్క భారత్‌లోనే ఆరు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా రన్ టైమ్ 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, ప్రకృతి అందాలు, సాహసాలతో సినిమా అద్భుతంగా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద 10 లక్షల టికెట్లు అమ్ముడవగా అందులో ఏడున్నర లక్షల టికెట్లు దక్షిణాదివాళ్లే బుక్ చేసుకోవడం విశేషం. చదవండి: పుట్టింటికి వెళ్లిన ఉపాసన, మిస్ యూ అత్తమ్మ అంటూ పోస్ట్ నేను బతికే ఉన్నా, చనిపోలేదు: సీనియర్ నటి -
‘అవతార్ 2’పై అక్షయ్ కుమార్ రివ్యూ
అవతార్ 2.. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కోట్లాది సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే లక్షలాది మంది టికెట్లు బుక్ చేసుకున్నారు. మరికొద్ది గంటల్లో ఈ సినిమా విడుదల కాబోతుంది. అయితే కొంతమంది సీనీ ప్రముఖుల కోసం ఇప్పటికే స్పెషల్ షో వేసింది చిత్రబృందం. ఈ సినిమా చూసిన బాలీవుడ్ స్టార్స్ వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్ సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారు. Watched #AvatarTheWayOfWater last night and Oh boy!!MAGNIFICENT is the word. Am still spellbound. Want to bow down before your genius craft, @JimCameron. Live on! — Akshay Kumar (@akshaykumar) December 14, 2022 అక్షయ్ కూమార్ కూడా ఈ చిత్రంపై ప్రశంసల జల్లు కురిపించాడు. ‘నిన్న రాత్రి అవతార్ 2 సినిమా చూశాను. ఈ చిత్రం గురించి చెప్పడానికి అద్భుతం అనే పదం కూడా సరిపోదేమో. ఇప్పటికీ ఆ సినిమా నుంచి నేను బయటకు రాలేకపోతున్నాను. జేమ్స్ కామెరూన్ ప్రతిభకు తలవంచాలని ఉంది’ అని అక్షయ్ ట్విటర్లో పేర్కొన్నాడు. ‘అవతార్ 2లోని విజువల్స్, ఎమోషన్స్ చూసి ఆశ్చర్యపోయాను. మళ్లీ ఈ చిత్రాన్ని త్రీడీలో చూడాలనుకుంటున్నాను’అని వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు. ప్రపంచ వ్యాప్తంగా 160 భాషల్లో ఈ చిత్రం విడుదల కాబోతుంది. భారత్‌లో హిందీ, తెలుగుతో పాటు మొత్తం ఆరు భాషల్లో రిలీజ్ కానుంది. #AvatarTheWayOfWater is by far the most important film for the future of cinema. Was blown away by the visuals and the emotions. It’s amazing when the biggest filmmaker of the world chooses his film to give an important message. I wanna see it again in imax 3d @Disney — VarunDhawan (@Varun_dvn) December 14, 2022 -
వామ్మో.. అవతార్ 2 రన్‌టైమ్ అన్ని గంటలా.. అంతసేపు ప్రేక్షకులు కూర్చుంటారా?
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. 13 ఏళ్ల తర్వాత ‘అవతార్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీ.. విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోంది. ఈ మూవీ టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది. ట్రైలరే ఇలా ఉంటే సినిమా ఎలా ఉండబోతుందోననే క్యూరియాసిటీ అందరిలోనూ పెరిగిపోయింది. అందుకే టికెట్లు అడ్వాన్స్‌గా బుక్ చేసుకుంటున్నారు. నెట్టింట అవతార్ 2పై ప్రతి రోజు ఏదో ఒక చర్చ మొదలవుతుంది. తాజాగా ఈ సినిమా రన్‌టైమ్ గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. అదేంటంటే ‘అవతార్ 2’ రన్ టైమ్ 192 నిమిషాల 10 సెక్లను. అంటే 3 గంటల 12 నిమిషాల 10 సెకన్లు.ఇటీవల కాలంలో అత్యధిక నిడివి గల చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రావడం తగ్గిపోయాయి. రెండున్నర గంటల నిడివి ఉన్న సినిమాలే ఎక్కువగా విడుదలవుతున్నాయి. ప్రేక్షకులు కూడా నిడివి తక్కువ ఉన్న సినిమాలపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కంటెంట్‌లో దమ్ము ఉంటే తప్పా మూడు గంటల పాటు ప్రేక్షకుడు థియేటర్లో కూర్చొలేకపోతున్నాడు. కానీ జేమ్స్ కామెరున్ మాత్రం తన సినిమాపై పూర్తి నమ్మకంతో ఉన్నాడు. థియేటర్స్‌కి వచ్చిన ప్రేక్షకుడు.. మూడు గంటల పాటు కొత్త ప్రపంచంలోకి వెళ్తాడని.. నిడివి తనకు సమస్యే కాదు అంటున్నాడట. 2009లో విడుదలైన అవతార్-1 రన్‌టైమ్ 162 నిమిషాలు. అంటే రెండు గంటల 42 నిమిషాలు. దాన్ని మించి అవతార్ 2 రన్ టైమ్ ఉండడం చర్చనీయాంశంగా మారింది. -
వామ్మో.. విడుదలకు ముందే అవతార్-2 రికార్డుల మోత!
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాల్లో 'అవతార్: ది వే ఆఫ్ వాటర్ (అవతార్-2)’ ఒకటి. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 16న ప్రేక్షకులు ముందుకు రానుంది. ఈ చిత్రం ఇప్పటికే 2.2 బిలియన్ డాలర్ల వరల్డ్ వైడ్ బిజినెస్ సాధించిందని ప్రచారం జరుగుతోంది. ప్రపంచ దేశాలతో పాటు భారతీయ సినీ ప్రేక్షకులు కూడా ఈ సినిమా కోసం ఎంతో ఉత్కంఠగా వేచి చూస్తున్నారు. ఈ సినిమా కోసం ఇండియాలో ఈ నెలలోనే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేశారు. కేవలం మూడు రోజుల్లోనే 45 స్క్రీన్లలో 15,000పైగా ప్రీమియం ఫార్మెట్ల టిక్కెట్లు అమ్ముడయ్యాయి. ‘అవతార్-2 ’ విడుదలకు ఇంకా మూడు వారాల సమయం ఉంది. ఇంత ముందుగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేస్తే కూడా ఇలాంటి స్పందన రావడం సంతోషంగా ఉందని పీవీఆర్ పిక్చర్స్ సీఈఓ కమల్ జియాంచందాని అన్నారు. 'జేమ్స్ కామెరూన్ సినిమాలు భారతీయ బాక్సాఫీస్ పై ప్రతిసారీ ఏదో ఒక మాయాజాలం సృష్టిస్తూనే ఉన్నాయి. ప్రేక్షకులు అలాంటి మరో దృశ్యం కోసం ఎదురు చూస్తున్నారు! అడ్వాన్స్ బుకింగ్ లపై భారీ స్పందన వచ్చింది. ఇది కేవలం ప్రీమియం ఫార్మాట్ అమ్మకాల గురించి నేను చెబుతున్న మాట. ఇతర అన్ని ఫార్మాట్ లలో టికెట్ల అమ్మకాలు నేటి నుంచి ఓపెనవ్వడంతో ఇంకా భారీ సంఖ్యలను ఆశిస్తున్నాము' అని అన్నారు. ఐనాక్స్ లీజర్ లిమిటెడ్ చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజేందర్ సింగ్ జ్యాలా ..‘అవతార్‌కి సీక్వెల్ తరతరాలుగా ప్రజలు చూసే ఒక భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అవుతుంది. మా ప్రీమియం ఫార్మాట్ షోలన్నీ ఇప్పటికే అమ్ముడయ్యాయి. ఇది మాకు అద్భుతమైన వార్త. మేము 3D - 2D ఫార్మాట్ ల బుకింగ్‌లను ప్రారంభించిన తర్వాత బుకింగ్ సంఖ్యలు గణనీయంగా పెరుగుతాయని ఆశిస్తున్నాం’ అన్నారు. సినీపోలిస్ సీఈఓ దేవాంగ్ సంపత్ మాట్లాడుతూ.. ‘అవతార్ 13 సంవత్సరాల క్రితం విడుదలైనప్పుడు ఈ చిత్రానికి భారీ స్పందనను చూసి మేం మంత్రముగ్దులయ్యాం. ఇది అప్పట్లో బ్లాక్ బస్టర్ .. ఇప్పటికీ సినీ ప్రేక్షకుల హృదయాలను శాసిస్తోంది. భారతదేశంలోని ప్రేక్షకులు ఎల్లవేళలా లార్జర్-దన్-లైఫ్ ఎంటర్ టైనర్ లపై గొప్ప ప్రేమను కురిపిస్తూనే ఉంటారు. ఒక్క రోజులోనే మేము భారతదేశం అంతటా టికెట్ల అమ్మకాల్లో పార్ట్ 2కి అద్భుతమైన స్పందనను పొందాం. ప్రపంచంలోనే అత్యుత్తమ 3డి టెక్నాలజీ అయిన సినెపోలిస్ రియల్ డి 3డిలో సినిమాను చూడండి’అని అన్నారు. -
అవతార్-2 టికెట్స్.. ధర వింటే సినిమా కనపడుద్ది..!
ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న హాలీవుడ్ చిత్రం ‘అవతార్2’. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబరు 16న విడుదల కానుంది. తొమ్మిదేళ్ల ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్ ఇది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీస్థాయిలో అంచనాలు పెంచేసింది. ప్రస్తుతం ఈ సినిమా టికెట్ బుక్సింగ్స్ దేశవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. ఈ చిత్రం ఇంగ్లీష్‌తో పాటు ఏడు భాషల్లో విడుదల చేస్తున్నారు. అయితే ఈ మూవీని చూడాలనుకుంటున్న సినీ ప్రేక్షకులకు విడుదలకు ముందే షాక్ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్స్, యాప్‌లు ప్రధాన నగరాల్లోని థియేటర్స్‌లో బుకింగ్స్ అందుబాటులోకి వచ్చాయి. ఈ చిత్రాన్ని ఐమ్యాక్స్ 3డీ, 4డీఎక్స్ 3డీ ఫార్మాట్లలోనూ విడుదల చేస్తుండటంతో ఆ స్క్రీన్లపైనే చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు. (చదవండి: కళ్లు చెదిరే విజువల్ వండర్స్‌తో అవతార్-2 కొత్త ట్రైలర్) ఆ స్క్రీన్ల టికెట్ ధరలు చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్ బెంగళూరులోని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ కలిగిన థియేటర్లో టికెట్ ధర ఏకంగా రూ.1,450 చూపిస్తోంది. అలాగే పుణెలో రూ.1200 (4డీఎక్స్ 3డీ), దేశ రాజధాని దిల్లీలో రూ.1000గా ఉంది. ముంబయిలో రూ.970, కోల్‌కతా రూ.770, అహ్మదాబాద్ రూ.750, ఇండోర్ రూ.700 ఉండగా, హైదరాబాద్‌లో ఒక్కో టికెట్ ధర రూ.350 (4డీఎక్స్ 3డీ ఫార్మాట్), విశాఖ రూ.210 (3డీ ఫార్మాట్) ఉంది. ఈ ధరలన్నీ సాధారణ సీట్లకు సంబంధించినవి మాత్రమే. ఇంకా వీటికి పన్నులు, ఇంటర్నెట్ ఛార్జీలు అదనపు భారం కానున్నాయి. త్వరలోనే సాధారణ థియేటర్స్‌లోనూ టికెట్ ధరలు అందుబాటులో ఉంచనున్నారు. అవతార్-2 లో సామ్ వర్దింగ్టన్, జోయా సాల్దానా, సిగుర్నే వీవర్, కేట్ విన్స్లెట్ కీలక పాత్రలు నటించారు. -
‘అవతార్-2’లో ఏం ఉంది? సినిమా ఎలా ఉండబోతుంది?
‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రాన్ని ప్రపంచ సినీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్స్ రెడీ అయింది. డిసెంబర్ 16న అవతార్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా ఈ చిత్రం ట్రైలర్ విడుదలైంది. ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చాడు డైరెక్టర్ జేమ్స్ కామెరూన్. మొదటి భాగంలోలాగే ఈ చిత్రంలో కూడా జేక్ సల్లీ, నేత్రిలు ‘పండోరా’ప్రపంచాన్ని కాపాడుకోవడానికి మనుషులతో పోరాటం చేస్తారని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. అయితే ఇది నీటి అడుగున జరిగే కథ. మొదటి సినిమా లాగే, ఈ చిత్రంలో కూడా జేక్ సల్లీ, నేత్రి తమ ప్రపంచమైన పండోరాను కాపాడుకునే పోరాటం చేస్తారని తెలుస్తోంది. మొదటి భాగం చివరల్లో నేత్రి గర్భవతి అని హింట్ ఇచ్చాడు. ఈ చిత్రం ట్రైలర్లో గర్భవతిగా నేత్రిని చూపించారు. జేక్, ఆయన భార్య నేత్రి, పిల్లలు ...వీరంతా కలిసి పండోరా ప్రపంచానికి కాపాడుకోవడానికి సాహసాలు చేస్తారు. అవతార్ పార్ట్-1లో పండోరా గ్రహం మీద పనిచేసిన రిసోర్స్ డెవలప్మెంట్ అడ్మినిస్ట్రేషన్(ఆర్డీఏ).. సెకండ్ పార్ట్‌లో కూడా ఎంట్రీ ఇవ్వబోతుంది. ఈ సారి కొత్త రకమైన రోబోటిక్ మిషిన్స్‌తో ఆర్డీఏ నావి తెగ మీద అధికారాన్ని చెలాయించాలని చూస్తుంది. ట్రైలర్‌ని గమనిస్తే..ఒక షాట్లో నావీ తెగకు చెందినవారిని ఆర్డీఏ బంధించినట్లు, వారి ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు కనిపిస్తుంది. వీరిని ఎదిరించడానికి హీరో జేక్ సల్లీ.. మెట్ కానియా తెగ సహాయం తీసుకుంటాడు. మరి మెట్ కానియా తెగ ఎలాంటి సాయం అందించిందో సినిమాలోనే చూడాలి. అలాగే అవతార్-2లో ఒక టీనేజ్ రొమాంటిక్ లవ్‌స్టోరీని కూడా చూపించబోతున్నారు. ట్రైలర్లో జేక్ సెల్లి కొడుకు మరో తెగకు చెందిన అమ్మాయితో మాట్లాడుతూ.. ‘ఎవరూ నన్ను అర్ధం చేసుకోవట్లేదు’ అంటే.. ‘నేను అర్థం చేసుకుంటాను’అని ఆ అమ్మాయి చెబుతుంది. అంటే వీరిద్ద మధ్య ఓ లవ్‌స్టోరిని నడిపించబోతున్నట్లు అర్థమవుతుంది. పండోరాలోని మరిన్ని వింతలు, అద్భుతాలు, అక్కడి మనుషుల అమోఘమైన సాహసాలతో అవతార్-2 అద్భుతంగా రూపొందించినట్లు టీజర్, ట్రైలర్ చూస్తే అర్థమవుతంది. మరి ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో డిసెంబర్ 16 తర్వాత తెలుస్తుంది. -
Avatar 2 Trailer: అవతార్ 2 ట్రైలర్ వచ్చేసింది
విజువల్ వండర్ అవతార్ మూవీ గురించి తెలియని సినీ ప్రేమికుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ప్రేక్షకులను ఎంతగానో అబ్బురపరిచిన ఈ చిత్రం సునామీలాంటి కలెక్షన్లతో ప్రపంచ బాక్సాఫీస్‌ను గడగడలాడించేసింది. 2009లో అవతార్ సినిమా రాగా పదమూడేళ్ల తర్వాత దీని సీక్వెల్ వస్తోంది. డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అవతార్: ది వే ఆఫ్ వాటర్ పేరుతో సీక్వెల్ తెరకెక్కించగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. 3డీ వర్షన్లో ఉన్న ట్రైలర్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. 160 దేశాల్లో డిసెంబర్ 16న ఈ సినిమా విడుదల కాబోతోంది. చదవండి: అవతార్ 2 తెలుగు ట్రైలర్‌కు అన్ని కోట్లా? -
కొత్త వింతలు, విశేషాలతో అవతార్-2.. పండోరా ప్రపంచాన్ని చూశారా?
చందమామ కావాలని మారాం చేసిన బిడ్డను తల్లి ఎలా సముదాయిస్తుంది? చందమామను అద్దంలో బంధించి.. ఆ అద్దాన్ని బిడ్డ చేతికిస్తుంది. ఇది అప్పటి తల్లుల చాతుర్యం. ఇప్పటి మల్టీటాస్కింగ్ మదర్స్‌కి ఆ ప్రెషర్ అవసరం లేదు. ఆ పని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేసిపెట్టాడు. అద్దంలో కాదు ఏకంగా వెండి తెర మీదే! ఒక్క చందమామ రూపాన్నే కాదు.. చందమామ మీదున్న ప్రపంచాన్నంతా తెచ్చిపెట్టాడు. అదే.. పండోరా లోకం. అవతార్‌కి సీక్వెల్.. అవతార్ –2! ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మనం కూడా ఓసారి ఆ లోకంలో విహరించొద్దాం. ఫ్యూచర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే కథలన్నిట్లో పెద్ద పెద్ద భవంతులు.. వాటి చుట్టూ ఆధునిక సాంకేతిక వలయాలు.. గాల్లో తేలే వాహనాలు. ఎట్సెట్రా దర్శనమిస్తుంటాయి ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా. కానీ, కామెరూన్ ఆ చట్రాన్ని ఛేదించాడు. ఆ ప్యాటర్న్‌ను మార్చేశాడు. 2154 సంవత్సరంలో నడిచే అవతార్–2 కథలో.. భూమి ఎప్పటిలాగే ఉంటుంది. మనుషులు కూడా అట్లానే ఉంటారు. కానీ, డొల్లగా మారిన భూమి ఎనర్జీ కొరత తీర్చేందుకు.. ఇతర గ్రహాల మీద ఉన్న సహజ సంపదలపై కార్పొరేట్ కంపెనీల కన్నుపడుతుంది. అందులో భాగంగా అంతరిక్షంలో ఎక్కడో దూరంగా ఉన్న ‘పండోరా’ గురించి సైంటిస్టులకి తెలుస్తుంది. అదే అవతార్–2 కథకు వేదికైంది. ఏలియన్స్ అనగానే.. కోడిగుడ్డు ఆకారంలో తల, మెరిసే కనుగుడ్లు, పొట్టికాళ్లతో ఉంటుందని ఊహించేసుకుంటారు చాలామంది. ఆ మూస ఆలోచనలు, ఊహలకు బ్రేక్ వేసి మనిషి తరహా ఏలియన్లకు పురుడుపోశాడు క్రియేటివ్ జీనియస్ జేమ్స్ కామెరూన్ . పది అడుగుల ఎత్తుండే నీలంరంగు బక్కపల్చని ఏలియన్లు.. పొడవుగా ఉండే తోక, ఆ తోక వాళ్ల బ్రెయిన్‌కి ముడిపడి ఉండడం, ఆ తోక ద్వారానే అడవుల్లోని జంతువుల మెదళ్లను కంట్రోల్ చేయడం వంటి ప్రత్యేకతలను పెట్టాడు ఆ ఏలియన్స్‌కి. అలాగే ఆ అత్యంత ఆధునిక సాంకేతికతో ఏ మాత్రం సంబంధంలేని, ప్రకృతిని నమ్ముకుని బతికే అమాయకపు ఆదివాసీ జాతులుగా చూపించాడు. అన్నింటినీ మించి నావి తెగ భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. మరి ఆ ఏలియన్ల చుట్టూ ఉండే జీవజాలం సంగతి ఏంటి? అందుకోసం బయాలజిస్టులతో స్టడీ చేయించి కొత్త జాతుల్ని సృష్టించాడు. విచిత్రమైన చెట్ల జాతులు, ఆరు కాళ్ల రైనోలు, భయంకరమైన థానోటర్ మృగాలు, రెక్కల గుర్రాలు, ఎగిరే డ్రాగాన్స్ లాంటి టోరక్లు.. మరి వీటి ఆవాసం? అందుకే ‘పండోరా’ను ఏర్పాటు చేశాడు. అవతార్‌లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. చెట్లు, జంతువులతో సహా. హోమ్ ట్రీ, ట్రీ ఆఫ్ సోల్స్‌తో పాటు రకరకాల చెట్లు అవతార్‌కి ప్రత్యేక ఆకర్షణ. పండోరా మీద బతికే జీవుల్ని.. అక్కడి క్రూరమృగాలు నిబంధనలు పెట్టుకుని మరీ వేటాడుకుని తింటాయి. కానీ, ఆఖరుకు మనుషుల దాడుల్లో నావి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న వేళ.. అడవి తల్లిని కాపాడుకునేందుకు ఆ క్రూరమృగాలే నావిల తరపున నిలబడి మనుషులతో పోరాడుతాయి. ఇప్పటికే అవతార్‌లో కనిపించిన ఈ అంశాలతో పాటు మరిన్ని కొత్త వింతలు, విశేషాలతో కనువిందు చేయబోతోంది అవతార్–2. పండోరా నిజంగానే ఉంది శనిగ్రహం కక్ష్య లోపలి భాగంలో ఉన్న ఉపగ్రహాల్లో ‘శాటరన్ సెవెన్’ ఒకటి. ఇది సహజం ఉపగ్రహం. 1980లో వోయేజ–1 వ్యోమనౌక దీనిని గుర్తించి.. ఫొటోలు తీసి భూమ్మీదకి పంపింది. గ్రీకు పురాణాల ప్రకారం.. దీనికి ‘పండోరా’ అనే పేరు పెట్టారు. అయితే దీని వాతావరణం ఎలాంటిది? జీవం.. జీవనం ఉందా? లేదా? అనే విషయంలోనే స్పష్టత లేదు. ఈ ఉపగ్రహాన్ని ‘అవతార్’ కోసం వాడుకున్నారు. కామెరూన్ ప్రతిసృష్టిలో పండోరా నక్షత్ర వ్యవస్థలో ఆల్ఫా సెంచూరీన్ ఏ సిస్టమ్‌లో ఉంటుంది. భూమి నుంచి దీని దూరం 4.37 కాంతి సంవత్సరాలు. ఇది కాంతివంతంగా ఉండే ఒక ఉపగ్రహం. అందుకే దీనిని మరో చందమామ అంటారు. కామెరూన్ కల్పిత ప్రపంచం స్ఫూర్తితో ఫ్లోరిడాలోని బే లేక్ దగ్గర ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ ‘పండోరా ది వరల్డ్ ఆఫ్ అవతార్’ పేరుతో 2017లో 12 ఎకరాలున్న ఒక పార్క్‌ను ప్రారంభించింది. ఇంతలా ప్రభావం చూపించింది కాబట్టే అవతార్ సీక్వెల్స్‌లో పండోరాను మరింత అందంగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు కామెరూన్. - భాస్కర్ శ్రీపతి -
అద్భుతమైన విజువల్స్‌తో 'అవతార్ 2'.. టీజర్ చూశారా !
Avatar The Way Of Water Teaser Released: ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్ 2'. 2009లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్ 'అవతార్'. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీ 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ మూవీ టీజర్‌ను మే 6న 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో విడుదల చేశారు. 'అవతార్: ది వే ఆఫ్ వాటర్' టీజర్‌ను తాజాగా సోషల్ మీడియాలో సోమవారం (మే 9) రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ పండోరా గ్రహానికి సంబంధించిన విజువల్స్‌తో ప్రారంభం కాగా, అందులోని అద్భుతమైన లొకేషన్లు, మైమరిపించే నీలి సముద్రం అబ్బురపరిచేలా ఉన్నాయి. టీజర్ ఆసక్తిగా ఉన్నా సినిమా కథేంటి అనేది సస్పెన్స్‌గానే ఉంది. కాగా ఈ సినిమా డిసెంబర్ 16న విడుదలకు సిద్ధంగా ఉండగా, 2024లో అవతార్ 3, 2026లో అవతార్ 4, 2028లో అవతార్ 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి. చదవండి: ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! “Wherever we go, this family is our fortress.” Watch the brand-new teaser trailer for #Avatar: The Way of Water. Experience it only in theaters December 16, 2022. pic.twitter.com/zLfzXnUHv4 — Avatar (@officialavatar) May 9, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4331451957.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఆన్లైన్లో లీకైన 'అవతార్ 2' సినిమా ట్రైలర్ !..
ప్రపంచ సినీ ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం 'అవతార్ 2'. 2009లో హాలీవుడ్ లెజండరీ డైరెక్టర్ జేమ్స్ కామెరాన్ సృష్టించిన గొప్ప విజువల్ వండర్ 'అవతార్'. దీనికి సీక్వెల్‌గా వస్తున్న మూవీకి 'అవతార్: ది వే ఆఫ్ వాటర్'గా టైటిల్ పెట్టారు. ఈ చిత్రాన్ని ఎన్నడూ లేని విధంగా ఏకంగా 160 భాషల్లో డిసెంబర్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అలాగే ఈ మూవీ ట్రైలర్‌ను 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా విడదల రోజైన మే 6న థియేటర్లలో ప్రదర్శించనున్నారు. అయితే 'అవతార్ 2' అభిమానులకు నిరాశ కలిగించే ఓ వార్త చక్కర్లు కొడుతోంది. థియేటర్లలో ఆస్వాదించాలనుకున్న ఈ మూవీ ట్రైలర్ ఆన్లైన్లో లీకైందని సమాచారం. ఈ లీకేజీకి సంబంధించిన ఫుటేజ్ లింక్‌లు సోషల్ మీడియాలో దర్శనమిచ్చాయి. అయితే ప్రస్తుతం ఫుటేజ్‌కు సంబంధించిన లింక్‌లు, ఫొటోలు ట్విటర్ డిలీట్ చేయడంతో మేకర్స్ ఊపిరి పీల్చుకున్నారు. కాగా ఈ లీక్‌కు సంబంధించిన కారణాలు మాత్రం ఇంతవరకు తెలియరాలేదు. ఇది కూడా ఒక ప్రమోషన్ స్టంట్ అని పలువురు నెటిజన్స్ భావిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ 27న ఈ మూవీ గ్లింప్స్‌ను 'సినిమా కాన్'లో ప్రీమియర్‌గా ప్రదర్శించారు. చదవండి: ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా ! #BREAKING ‘Avatar 2’ first teaser trailer has been leaked online. Exclusive stills for Avatar 2. Cinema incoming 🔥#AvatarTheWayOfWater pic.twitter.com/NVi0pglSzs — Adarsh Kumar (@AdarshWords) May 2, 2022 The trailer leaked!!!#AvatarTheWayOfWater pic.twitter.com/VhF0sQCcY8 — Mo☾nknight (@SquaredAnime) May 1, 2022 #AvatarTheWayOfWater leaked video 🥵🥵🔥🔥#Avatar2 — B U N N Y _ H A R I 🦁 (@MRBADBOY0143) May 2, 2022 -
ఇదెక్కడి మాస్ రిలీజ్ జేమ్స్ మావా.. అన్ని భాషల్లో 'అవతార్ 2' సినిమా !
James Cameron Avatar 2 Movie Release: అవతార్.. 2009లో జేమ్స్ కామెరాన్ సృష్టించిన విజువల్ వండర్ ఈ సినిమా. హైలెవెల్ గ్రాఫిక్ వర్క్‌తో ఒక సరికొత్త ఊహ ప్రపంచంలో విహరించేలా చేసింది ఈ మూవీ. పండోరా లోకం, అక్కడి మనుషులు, ఆ వింత గుర్రాలు, వాటితో హీరో చేసే సాహసాలు ప్రేక్షకులను ఆశ్చర్యపరిచాయి. ఇన్ని అద్భుతాలు ఉన్న ఈ సినిమా అనేక అభిమానులను సంపాదించుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అవతార్ 2' తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ మూవీ ట్రైలర్‌ను 'డాక్టర్ స్ట్రేంజ్: ఇన్ ది మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్' సినిమా ప్రదర్శించే థియేటర్లలో రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు మేకర్స్. తాజాగా ఈ మూవీ గురించి వచ్చిన అప్డేట్ ఆడియెన్స్ వరల్డ్‌ను ఆశ్చర్యపరిచేలా ఉంది. అవతార్ 2 డిసెంబర్ 16, 2022న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అది కూడా ఏకంగా 160 భాషల్లో (Avatar 2 Movie Release In 160 Languages). అవును. అవతార్ 2 సినిమాను సుమారు 160 భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఒకవేళ ఇదే జరిగితే సినీ చరిత్రలోనే ఇది రికార్డ్‌గా నెలకొల్పనుంది. అలాగే త్రీడీ, 4కె, 5కె, 8కె వీడియో ఫార్మాట్లలో రిలీజ్ చేయనున్నారని సమాచారం. అంతేకాకుండా బుధవారం (ఏప్రిల్ 27) ఈ సినిమా గ్లింప్స్‌ను 'సినిమా కాన్'లో ప్రీమియర్‌గా ప్రదర్శించానున్నారని టాక్. చదవండి: ప్రేక్షకులకు కనువిందు.. ఆ సినిమాతో 'అవతార్ 2' ట్రైలర్ ! ఓటీటీలోకి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ.. ఎప్పుడు? ఎక్కడంటే? var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్టీరింగ్ లేని కారు.. సూపరో సూపరు!
ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్, ‘అవతార్’ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌తో కలిసి ఏవీటీఆర్ పేరుతో ఒక అధునాతన కారును రూపొందించింది. ఇవాళ్టి మన ఆలోచనలే రేపు మనం పాటించబోయే ప్రమాణాలు అనే నినాదంతోనే ఈ కార్ ఆవిష్కారం సాధ్యమైందని మెర్సిడెజ్ ప్రతినిధి పేర్కొన్నారు. ఈ ఏడాది జనవరిలో నెవాడా రాష్ట్రం (అమెరికా) లోని లాస్‌వేగాస్ నగరంలో మొదటిసారిగా దీన్ని ప్రదర్శించారు. కారు గురించి వివరిస్తూ 13 నిమిషాల వీడియోని యూట్యూబ్‌లో విడుదల చేశారు. టైర్లు కాదు పంజాలు.. ఈ కారుకు ఉండే టైర్లు చక్రాల మాదిరిగా కాకుండా గోళాకారంగా ఉంటాయి. జంతువు పంజా, పువ్వు ఆకృతులను దృష్టిలో ఉంచుకుని వీటిని రూపొందించామని చీఫ్ డిజైన్ ఆఫీసర్ గోర్డెన్ వాజెనర్ తెలిపారు. ఇరుకు ప్రదేశాల్లో పార్కింగ్ కోసం ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన వివరించారు. స్టీరింగ్‌కు బదులుగా ప్యాడ్.. కారులో స్టీరింగ్‌కు బదులుగా డ్రైవర్ లేదా ప్రయాణీకుల సీటు పక్కన ఒక సెంట్రల్ కంట్రోల్ ప్యాడ్ ఉంటుంది. దానిపై చెయ్యి పెట్టి ముందు, వెనక, కుడి, ఎడమ.. ఇలా ఏ వైపు కావాలంటే ఆ వైపుకి కారుని పోనివ్వచ్చు. మీతో సంభాషిస్తుంది కూడా.. స్టీరింగ్ వీల్, డిస్ప్లే బటన్లు, టచ్ స్ర్కీన్లు ఏవీ లేకున్నా ఈ కార్ మీతో సంభాషిస్తుంది. కృత్రిమ మేధ సహకారంతో సైగలు, నాడీ, హృదయ స్పందనల ఆధారంగా పరిస్థితులను అర్థం చేసుకుంటుంది. ముందు అద్దంపై రంగులు మార్చుతూ వేగం, దిశ, బ్రేకుల పనితీరుని తెలియజేస్తుంది. ఇది రోడ్డుపైకి ఎప్పుడొస్తుందో స్పష్టంగా తెలియదు గానీ ఈ ప్రదర్శనతో ప్రపంచమార్కెట్లో మెర్సిడెజ్ బెంజ్ ఒక సంచలనానికి తెర తీసిందన్నది నిర్వివాదాంశం. -
ఏడు నిమిషాలు నీటిలోనే!
ప్రస్తుతం హాలీవుడ్లో తెరకెక్కుతున్న భారీ చిత్రాల్లో ‘అవతార్’ సిరీస్ ఒకటి. జేమ్స్ కేమరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ‘టైటానిక్’ ఫేమ్ కేట్ విన్స్లెట్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా అరుదైన రికార్డు సృష్టించారు కేట్. ‘అవతార్’ సీక్వెల్స్ కథాంశం ప్రకారం అండర్ వాటర్ (నీటి లోపల) కూడా చిత్రీకరణ జరిపారు. ఇందులో భాగంగా కేట్ విన్స్లెట్ నీటి లోపల 7 నిమిషాల 14 సెకన్లు ఉన్న ఓ సన్నివేశంలో నటించారు. దీనికోసం సుమారు నాలుగువారాల పాటు శిక్షణ తీసుకున్నారు. ఈ సన్నివేశం కోసం ఏడు నిమిషాలు పాటు ఊపిరి ఆపుకున్నారామె. సినిమా చిత్రీకరణల్లో ఇదో రికార్డ్ అని హాలీవుడ్ అంటోంది. గతంలో ‘మిషన్ ఇంపాజిబుల్’ కోసం టామ్ క్రూజ్ ఆరు నిమిషాల పాటు ఊపిరి ఆపుకుంటూ అండర్‌వాటర్ సీన్లో యాక్ట్ చేశారు. ఇప్పుడు క్రూజ్ రికార్డ్‌ను కేట్ బద్దలు కొట్టేశారు. ‘ఈ రికార్డ్ బద్దలు కొట్టానని నాకు ఇటీవలే తెలిసింది’ అన్నారు కేట్ విన్స్లెట్. ‘అవతార్ 2’ చిత్రీకరణ దాదాపు పూర్తయింది. వచ్చే ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. -
అవతార్ @ 100
‘అవతార్ 2’ ఫ్యామిలీ అంతా నోరు తీపి చేసుకున్నారు.‘అవతార్ 2’ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టినందుకేనా ఈ సెలబ్రేషన్స్ అంటే కానే కాదు. లైవ్ యాక్షన్ ఫిల్మింగ్‌లో వంద రోజుల మైలురాయిని చేరుకున్నందుకట. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీసు వద్ద సరికొత్త రికార్డులను సృష్టించిన విషయం తెలిసిందే. అందుకే ‘అవతార్’ సీక్వెల్స్‌పై దృష్టి పెట్టారు జేమ్స్ కామెరూన్ . ప్రస్తుతం ‘అవతార్ 2’ చిత్రీకరణ న్యూజిలాండ్‌లో జరుగుతోంది. ‘న్యూజిలాండ్‌లో లైవ్ యాక్షన్ ఫిల్మింగ్‌లో ‘అవతార్ 2’ చిత్రీకరణ వంద రోజులను పూర్తి చేసుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కేక్ పంచుకుని సంబరాలు చేసుకున్నారు టీమ్. ‘అవతార్ 2’లో ఎక్కువగా అండర్ వాటర్ సీన్స్ ఉండబోతున్నాయని తెలిసింది. ఈ చిత్రం వచ్చే ఏడాది డిసెంబరు 21న విడుదల కానుంది. -
అదే తేదీకి అవతార్!
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అయోమయంలో పడింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కచ్చితంగా తెలియదు. విడుదల ఎప్పుడు వీలవుతుందో అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘‘అవతార్ అనుకున్న సమయానికే వస్తాడు’’ అంటున్నారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. 2009లో వచ్చిన ‘అవతార్’ సినిమాకు రెండు మూడు సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నారు కామెరూన్. మొదటి సీక్వెల్ ను వచ్చే ఏడాది డిసెంబర్ 17న విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ‘అవతార్’ ఆలస్యం అవుతుంది అనుకున్నారు. ‘‘కరోనా వల్ల మా షూటింగ్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. అయినా సరే అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తాం అనే నమ్మకం ఉంది. చెప్పిన తేదీకే విడుదల చేయగలుగుతాం అనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు కామెరూన్. -
అవతార్‌కి అవరోధం
దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘ది టెర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’.. ఈ మూడు చిత్రాలకూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు కామెరూన్ ‘అవతార్’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ‘అవతార్’కి అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. అలాగే న్యూజిల్యాండ్‌లోని ‘వెటా డిజిటల్’లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు మొదలుపెట్టాలనుకున్నారు. దీనికోసం ఒక బృందంతో కలిసి కామెరూన్ న్యూజిల్యాండ్ వెళ్లాలనుకున్నారు. ‘‘శుక్రవారం వెళదామనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదం. అందుకే విరమించుకున్నాం’’ అని చిత్రనిర్మాత లాండ్యూ పేర్కొన్నారు. -
బెంజ్ కంపెనీ ‘అవతార్’ కారు లాంచ్
-
బెంజ్ కంపెనీ నుంచి ‘అవతార్’ కారు
సాక్షి, న్యూఢిల్లీ : జేమ్స్ కామెరాన్ దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్ హాలీవుడ్ చిత్రం ‘అవతార్’ కాన్సెప్ట్‌తో తయారుచేసిన ఎలక్ట్రిక్ కార్ డైమ్లర్–బెంజ్‌ను లాస్ వెగాస్‌లో సోమవారం నాడు ప్రారంభమైన కార్ల షోలో ఆవిష్కరించారు. ‘విజన్ అవతార్’గా పిలిచే ఈ కారు పూర్తి పక్కకు తిరగడంతోపాటు డ్రైవర్ స్పర్శకు కూడా స్పందించడం విశేషం. ఇందులో కొత్తరకమైన ఆర్గానిక్ బ్యాటరీని కూడా ఉపయోగించారు. 2009లో వచ్చిన అవతార్ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో బిజీగా ఉన్న జేమ్స్ కామెరాన్ ‘విజన్ అవతార్’ కాన్సెప్ట్ కారు ఆవిష్కరణకు రావడం విశేషం. 30 డిగ్రీలు పక్కకు తిరిగేలా నాలుగు కారు చక్రాల ఇరుసులను తయారు చేశారు. దాన్ని ఉన్నచోటు నుంచే కారు పక్కకు తిరగ గలదు. పూర్తి ఎలక్ట్రిక్ కారైన ఇది దాటంతట అదే నడిచే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. ‘ఈ కారులో నేను కూర్చొని చూశాను. దీనికి నిజంగా ప్రాణం ఉంది. శ్వాస కూడా తీసుకుంటోంది’ జేమ్స్ కామెరాన్ వ్యాఖ్యానించారు. ఈ కారుకు నడిపేందుకు చక్రం లేకపోవడం మరో విశేషం. సెంట్రల్ కంట్రోల్ యూనిట్‌ను చేతితో పట్టుకోవడం ద్వారా నడపవచ్చు. చేయి పైకెత్తితే మెనూ సెలక్షన్ కంప్యూటర్ తెర కళ్లముందు కనిపిస్తుంది. వేళ్లతో డైరెక్షన్ ఇస్తూ కారును నడపవచ్చు. ఈ కారు మనిషిలాగా శ్వాస తీసుకున్నట్లు అనిపించడానికి కారణం వెనక భాగాన చేపల మొప్పల్లాగా బాడీ డిజైన్ చేసి ఉండడం. ఇలాంటి కారు ఎప్పటికీ మార్కెట్లోకి వస్తుందో మెర్సిడెస్ బెంజ్ యాజమాన్యం ప్రకటించలేదు. అందుకని ఇప్పుడే ఈ కారు కోసం ఆర్డర్ ఇవ్వలేకపోతున్నందుకు బాధగా ఉందని కామెరాన్ వ్యాఖ్యానించారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పండోరా గ్రహంలోకి...
మొన్న ఆస్ట్రేలియన్ నటుడు బ్రెండన్ కోవెల్, నిన్న మలేషియన్ నటి మిచెల్లి వోహ్... తాజాగా న్యూజిలాండ్ నటుడు జైమైనే క్లేమిట్ ‘అవతార్’ ఫ్యామిలీలో జాయిన్ అయ్యారు. 2009లో ‘అవతార్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. సినీ ప్రేమికులకు అంతగా నచ్చిన ఈ సినిమాకు సీక్వెల్స్‌ను తెరకెక్కించే పనిలో ఉన్నారాయన. ఈ ప్రక్రియలో ‘అవతార్’ కుటుంబం పెద్దది అవుతోంది. జెమైనే క్లేమిట్ అవతార్ ఫ్యామిలీలో చేరిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు జేమ్స్ కామెరూన్. ‘‘పండోర ప్రపంచంలో సముద్ర జీవ శాస్త్రవేత్త డాక్టర్ గార్విన్ పాత్రను జెమైనే క్లేమిట్ చేయబోతున్నారు. ‘అవతార్’ సీక్వెల్స్ కోసం ఆయన్ను తీసుకున్నాం’’ అని చిత్రబృందం ప్రకటించింది. ఇక క్లేమిట్ విషయానికి వస్తే.. ‘జెంటిల్మెన్ బ్రోన్కోస్’ (2009), ‘మెన్ ఇన్ బ్లాక్ 3’ (2012) చిత్రాల్లో నటించారు. అంతేకాదు ‘వాట్ వుయ్ డు ఆన్ ది షాడోస్’ (2014) అనే హారర్ కామెడీ ఫిల్మ్‌తో దర్శకునిగా కూడా మారారు. ప్రస్తుతం ‘లెజియన్’ అనే అమెరికన్ టీవీ సీరిస్తో ఆయన బిజీగా ఉన్నారు. ‘అవతార్ 2’ డిసెంబర్ 17, 2021న రిలీజ్. -
టైటానిక్‌ను ముంచేశారు
... అవును ‘అవెంజర్స్’ సూపర్ హీరోస్ ‘టైటానిక్’ (1997)ను ముంచేశారు. ఈ విషయాన్ని టైటానిక్ దర్శకుడు జేమ్స్ కామెరూన్‌నే స్వయంగా చెప్పారు. ‘అవెంజర్స్’ ఫ్రాంౖచైజీలో ఇటీవల విడుదలైన ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’ సినిమా బాక్సాఫీస్‌ను దుమ్ము రేగ్గొట్టి కొత్త రికార్డులను సృష్టిస్తోంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్’ సినిమా రికార్డులను ఈ చిత్రం దాటేసింది. ఈ విషయంపై జేమ్స్ కామెరూన్ స్పందిస్తూ... ‘‘కెవిన్ ఫీజ్ (నిర్మాత, మార్వెల్ సంస్థ అధినేత) అండ్ అవెంజర్స్ టీమ్.. వాస్తవంలో ఓ మంచుకొండ నిజమైన టైటానిక్ షిప్‌ను ముంచేసింది. కానీ నా ‘టైటానిక్’ను మీ అవెంజర్స్ టీమ్ ముంచేశారు. లైట్స్ట్రామ్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో భాగస్వాములైన మేమంతా మీ విజయానికి సెల్యూట్ చేస్తున్నాం. సినిమా పరిశ్రమ మరింత ప్రగతిపథంలో ముందుకు వెళ్తోందని మీరు నిరూపించారు’’ అని అన్నారు. అలాగే ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లను రాబట్టిన జేమ్స్ కామెరూన్ ‘అవతార్’ (2009) కలెక్షన్స్‌ని కూడా ‘అవేంజర్స్: ఎండ్‌గేమ్’ దాటేస్తుందని కొందరు ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ‘అవతార్ 2’ చిత్రీకరణలో బిజీగా ఉన్నారు జేమ్స్ కామెరూన్. ఈ చిత్రం 17 డిసెంబరు 2021న విడుదల కానుంది. -
టైటానిక్‌ని అవెంజర్స్ ముంచింది: కామెరూన్
'అవెంజర్స్' సిరీస్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంతటి క్రేజ్ ఉందో అందరికి తెలిసిందే. మార్వెల్ సంస్థ తెరకెక్కించిన సూపర్ హిట్ సిరీస్‌లో చివరి చిత్రమైన ‘అవెంజర్స్ ఎండ్‌గేమ్’ ప్రపంచం వ్యాప్తంగా ఏప్రిల్ 26న విడుదలై వసూళ్ల సునామీని సృష్టిస్తోంది. అవెంజర్స్ ఎండ్‌గేమ్ వసూళ్లపై దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ ట్విటర్లో వెరైటీగా స్పందించారు. టైటానిక్ చిత్రంలో ఐస్‌బర్గ్ షిప్‌ను ముంచేస్తే, వసూళ్లలో అవెంజర్స్ టైటానిక్‌ని ముంచినట్టు ఉన్న ఓ ఫోటోను పోస్ట్ చేశారు. మార్వెల్ సంస్థ అధినేత కెవిన్, వారి టీమ్ సభ్యులను పనితీరును కొనియాడారు. 'నిజమైన టైటానిక్‌ని ఓ ఐస్‌బర్గ్ ముంచేస్తే, నా టైటానిక్‌ని మీ అవెంజర్స్ ముంచేసింది. మా నిర్మాణ సంస్థ లైట్ స్టార్మ్ ఎంటర్టైన్మెంట్లోని ప్రతి ఒక్కరూ మీరు సాధించిన విజయానికి సెల్యూట్ చేస్తున్నారు. సినిమా పరిశ్రమ బతికుండటం కాదు చాలా గొప్పగా ఉందని మీరు ప్రూవ్ చేశారు' అని జేమ్స్ ట్వీట్ చేశారు. pic.twitter.com/zfICH1XDCJ — James Cameron (@JimCameron) May 9, 2019 కాగా, 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. అడియన్స్ ఇంట్రెస్ట్‌కు తగ్గట్లే ‘అవతార్ 2,3,4,5’ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు జేమ్స్ కామెరూన్. తొలుత ‘అవతార్ 2’ చిత్రాన్ని 18 డిసెంబరు 2020న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 17 డిసెంబరు 2021లో విడుదల చేయనున్నట్లు తాజాగా జేమ్స్ కామెరూన్ తెలిపారు. -
మరో ఏడాది ఆగాల్సిందే!
వచ్చే ఏడాది పండోరా ప్రపంచాన్ని వెండితెరపై చూడొచ్చు అని ఆశపడిన ‘అవతార్’ ఫ్యాన్స్‌కు నిరాశ ఎదురైంది. ‘అవతార్ 2’ చిత్రం వాయిదా పడింది. ఈ విషయాన్ని దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. 2009లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎంతటి ప్రభంజనాన్ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రపంచంలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రం ఇదే. దీని బట్టి పండోరా గ్రహం విశేషాలు తెలుసుకోవడానికి ప్రేక్షకులు ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. అడియన్స్ ఇంట్రెస్ట్‌కు తగ్గట్లే ‘అవతార్ 2,3,4,5’ సీక్వెల్స్ తెరకెక్కిస్తున్నారు జేమ్స్ కామెరూన్. తొలుత ‘అవతార్ 2’ చిత్రాన్ని 18 డిసెంబరు 2020న విడుదల చేద్దాం అనుకున్నారు. కానీ 17 డిసెంబరు 2021లో విడుదల చేయనున్నట్లు తాజాగా జేమ్స్ కామెరూన్ తెలిపారు. ‘‘సెట్లో తీరిక లేకుండా ఉన్నా. కానీ ‘అవతార్ 2’ కొత్త రిలీజ్ డేట్ 17 డిసెంబరు 2021 అని చెప్పాలనుకుంటున్నాను’’ అని కామెరూన్ పేర్కొన్నారు. -
‘అవతార్ 2’ రిలీజ్ ఎప్పుడంటే!
ప్రపంచ వ్యాప్తంగా సంచలన విజయం సాధించిన హాలీవుడ్ విజువల్ వండర్ అవతార్. పండోరా గ్రహంలోని వింత జీవులు మానవులతో చేసిన పోరాటమే ఈ సినిమా కథ. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో నాలుగు సీక్వెల్స్‌కు ప్లాన్ చేశారు చిత్రయూనిట్. వరుసగా నాలుగు సీక్వెల్స్‌ను తెరకెక్కిస్తున్నారు. తాజాగా అవతార్ తొలి సీక్వెల్ అవతార్ 2 రిలీజ్ డేట్‌ను ప్రకటించారు చిత్రయూనిట్. 2021 డిసెంబర్ 17న ఈ సినిమా రిలీజ్ అవుతుందంటూ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ముందుగా ఈ సినిమా సీక్వెల్ 2020 డిసెంబర్లోనే రిలీజ్ అవుతుందని భావించినా నిర్మాణం ఆలస్యం కావటంతో ఏడాది పాడు వాయిదా పడింది. 3,4,5 భాగాలను కూడా రెండేళ్ల విరామంతో వరుసగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన అవతార్ 2009లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి వరకు ఉన్న హాలీవుడ్ కలెక్షన్ రికార్డులన్నింటినీ చెరిపేసిన అవతార్ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఆల్‌టైం రికార్డ్‌ను సృష్టించింది. ఇటీవల రిలీజ్ అయిన అవెంజర్స్ : ఎండ్‌గేమ్.. అవతార్ రికార్డ్లను చెరిపేయటం ఖాయంగా కనిపిస్తోంది. మరో అవతార్ 2తో మరోసారి కామెరూన్ ఆల్‌టైం రికార్డ్‌ను సాధిస్తాడేమో చూడాలి. Now scheduled to land on Pandora December 17, 2021 pic.twitter.com/d21QmCwiHC — Avatar (@officialavatar) 7 May 2019 -
సైంటిస్ట్ కరీనా
పండోరా గ్రహంలోకి సైంటిస్ట్ కరీనా మోగ్గా వెళ్తున్నారు మలేషియన్ యాక్ట్రెస్ మిచెల్ వోహ్. జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో 2009లో వచ్చిన ‘అవతార్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనమైన రికార్డ్స్‌ని క్రియేట్ చేసింది. అందుకే అవతార్ సీక్వెల్స్ (ప్రస్తుతానికి ‘అవతార్ 2’ నుంచి ‘అవతార్ 5’)ను రెడీ చేసే పనిలో ఉన్నారు కామెరూన్. నటీనటులను ఎంపిక చేస్తున్నారు. ఆస్ట్రేలియన్ యాక్టర్ బ్రాడెన్ కోవెల్ని ఇటీవలే ‘అవతార్’ ఫ్యామిలీలోకి ఆహ్వానించిన కామెరూన్ తాజాగా మలేషియన్ నటి మిచెల్ వోహ్‌కు స్వాగతం పలికారు. ‘‘అవతార్ సీక్వెల్స్‌లో సైంటిస్ట్ కరీనా మోగి పాత్రలో మలేషియన్ నటి మిచెల్ వోహ్ నటిస్తారు. విభిన్నమైన అద్భుతమైన పాత్రలతో పాటు ఎన్నో గుర్తుండిపోయే సినిమాల్లో ఆమె భాగస్వామ్యం అయ్యారు. మిచెల్‌తో కలిసి వర్క్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను’’ అని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. 1977 జేమ్స్ బాండ్ ఫిల్మ్ ‘టుమారో నెవర్ డైస్’లో నటించారు మిచెల్. కానీ ఎక్కువగా ఆమె హాంకాంగ్ యాక్షన్ బేస్డ్ సినిమాలు చేశారు. ‘యస్, మేడమ్ (1985), పోలీస్ స్టోరీ 3 (1992), సూపర్‌కాప్ (1992) హోలి వెపన్ (19 93)’ చిత్రాలు మిచెల్ నటించిన హాంకాంగ్ యాక్షన్ ఫిల్మ్స్‌లో కొన్ని. ఇక ‘అవతార్ 2, అవతార్ 3’ల చిత్రీకరణ ఒకేసారి జరుగుతుందని తెలిసింది. -
అవతార్ కుటుంబంలోకి స్వాగతం
సినిమా ప్రేక్షకులు ‘అవతార్’ ప్రపంచాన్ని అంత ఈజీగా మర్చిపోలేరు. ఆ సినిమా అంత ప్రభావితం చేసింది. అంచనాలకు మించిన భారీ వసూళ్లు రాబట్టింది. జేమ్స్ కామెరూన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు సీక్వెల్స్‌గా ‘అవతార్ 2, అవతార్ 3, అవతార్ 4’ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అవతార్ 2, అవతార్ 3 లను ఒకేసారి సెట్స్‌పై ఉంచారట టీమ్. ఈ అవతార్ ఫ్యామిలీలోకి ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫేమ్ ఆస్ట్రేలియన్ యాక్టర్ బ్రెండెన్ కోవెల్‌ను తీసుకున్నారు. రచయితగా, దర్శ కుడిగా, నటుడిగా బ్రెండెన్కి మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు ‘అవతార్’లాంటి ప్రతిష్టా త్మక చిత్రంలో నటించబోతున్నం దుకు ఆనందం వ్యక్తం చేశారు బ్రెండెన్. ఈ చిత్రంలో పండోరా గ్రహంలో కెప్టెన్ మిక్ స్కార్స్బీ పాత్రలో కనిపిస్తారాయన. ప్రస్తుతం లైవ్ యాక్షన్ సీన్స్‌ను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించే పనిలో పడ్డారట ‘అవతార్’ టీమ్. ‘అవతార్ 2’ చిత్రాన్ని 2020 డిసెంబర్ 18న విడుదల చేయాలనుకుంటున్నారు. అలాగే 2021 డిసెంబర్ 17న అవతార్ 3, 2024 డిసెంబర్ 20న అవతార్ 4 చిత్రాల విడుదలను ప్లాన్ చేశారు. -
కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం
‘2001ఏ స్పేస్ ఒడిసీ’.. స్టాన్లీ కుబ్రిక్స్ ప్రపంచానికి అందించిన అద్భుతం అని చెప్పవచ్చు. సినిమా రిలీజ్ అయి 50 సంవత్సరాలవుతున్నా ఇంకా సినిమాటిక్ హై ఇస్తూనే ఉంది. సైన్స్ ఫిక్షన్ ఫిల్మ్స్‌లో బెస్ట్ అంటూ చాలామంది డైరెక్టర్స్ కితాబు ఇచ్చిన ఈ సినిమా నాకు నచ్చలేదు అంటున్నారు ‘అవతార్’ సృష్టికర్త జేమ్స్ కెమరూన్. ‘స్పేస్ ఒడిసీ’ ఎందుకు నచ్చలేదో కెమరూన్ వివరిస్తూ ‘‘2001 ఏ స్పేస్ ఒడిసీ’ సినిమా అంటే ఎప్పటికీ ఎనలేని ప్రేమ. కానీ ప్రస్తుతానికి ఆ సినిమాని లైక్ చేయలేకపోతున్నాను. కుబ్రిక్స్ తీసిన ఈ మాస్టర్‌పీస్ నా మీద ఎనలేని ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆర్ట్ వర్క్ ఫామ్‌లో ఆ సినిమా మీద గౌరవం ఉంది. కానీ సినిమాలో ఎమోషనల్ కనెక్ట్ లోపించింది. ఇన్వాల్వ్ అవ్వలేకపోయాను. కానీ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ పరంగా ఈ సినిమా అంటే నాకు చాలా అభిమానం’’ అని ఆయన పేర్కొన్నారు. నచ్చింది అంటూనే నచ్చలేదూ అంటున్న కెమరూన్ ధోరణి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలా అనిపిస్తుందంటున్నారు హాలీవుడ్ సినీప్రియులు. -
టైటానిక్‌కు ముందు నాలుగు పెళ్లిళ్లు!
ప్రఖ్యాత దర్శకుడు జేమ్స్ కేమరూన్ పేరు చెబితే ముందు ‘టైటానిక్’ సినిమా గురించి మాట్లాడాలా, ‘అవతార్’ గురించి మాట్లాడాలా అని ఆలోచిస్తాం. కానీ, అంతకుముందే అద్భుతాలు సృష్టించాడాయన. హాలీవుడ్ సినిమాకు ఒక కొత్త అర్థాన్ని, కొత్త రూపురేఖల్నీ పట్టుకొచ్చిన కేమరూన్, ‘టైటానిక్’కు ముందు ప్రతి విషయానికీ కోపంతో ఊగిపోయేవాడట. ఏదైనా తప్పు జరిగితే అందరి మీదా అరిచేవాడట. ‘టైటానిక్’ విడుదలయ్యాక కొన్నాళ్లు కేవలం సముద్రాలను ఈదడాన్నే పనిగా పెట్టుకున్నాడు కేమరూన్. ఆ సమయంలోనే సినిమాలు ముఖ్యమే కానీ, మనుషులు, జీవితం అంతకంటే ముఖ్యమని తెలుసుకున్నాడట. అప్పట్నుంచీ కేమరూన్ కూల్ పర్సన్. ‘టైటానిక్’కు ముందు నాలుగు పెళ్లిళ్లు బ్రేక్ చేశాడు కేమరూన్. ఆ తర్వాత 2000వ సంవత్సరంలో సుజీ అమిస్ను పెళ్లాడి, ఇప్పటికీ ఆవిడతోనే హ్యాపీగా ఉన్నాడు. అంతకుముందు పెళ్లిళ్లు ఎందుకు బ్రేక్ చేశారు? అనడిగితే, కేమరూన్ ఒక ఆసక్తికర విషయం చెప్పుకొచ్చాడు – ‘‘నా కథల్లో స్ట్రాంగ్ వుమెన్ ఉంటారు. ఇండిపెండెంట్ ఉంటారు. అలాంటి అమ్మాయిలంటే నాకు బాగా ఇష్టం. లైఫ్‌లోనూ అలాంటి అమ్మాయిలే ఉండాలని కోరుకున్నా. అయితే స్ట్రాంగ్, ఇండిపెండెంట్ అమ్మాయిలతో సమస్య ఏంటంటే, వాళ్లకు నాలాంటి వాడి అవసరం ఉండదు’’ అన్నారు. సుజీ అమిస్ గురించి మాట్లాడుతూ, ‘‘తనకు మాత్రం నేనెందుకో అవసరమయ్యా!’’ అంటూ తన ఐదు పెళ్లిళ్ల గురించి చెబుతున్నాడు జేమ్స్ కేమరూన్. ప్రస్తుతం ‘అవతార్’ సీక్వెల్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడాయన. -
‘టైటానిక్’ రీ–యూనియన్
‘‘జేమ్స్ కేమరూన్ సినిమాలో మళ్లీ నటించే అవకాశం వస్తే మాత్రం ఈసారి ఎక్కువ రెమ్యునరేషన్ అడుగుతా!’’ 20 ఏళ్ల క్రితం, తన 22 ఏళ్ల వయసులో కేట్ విన్స్లెట్ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ‘టైటానిక్’ సినిమా బ్లాక్‌బస్టర్ అయిన సందర్భంగా అందులో నటించిన కేట్, ఆ సినిమా దర్శకుడు జేమ్స్ కేమరూన్‌తో సినిమా అంటే ఏ స్థాయిలో కష్టపడాలో చెబుతూ సరదాగా ఈ మాట అన్నారు. ‘టైటానిక్’ 1997లో విడుదలైతే.. ఈ ఇరవై ఏళ్లలో కేట్ విన్స్లెట్ చాలా సినిమాల్లో నటించి, తిరుగులేని స్టార్డమ్ సంపాదించుకున్నారు. మరోపక్క దర్శకులకే ఒక మార్గదర్శకుడు, వరల్డ్ పాపులర్ డైరెక్టర్‌గా ఎదిగిన జేమ్స్ కేమరూన్ మాత్రం ఈ ఇరవై ఏళ్లలో ఒకే ఒక్క సినిమా తీశారు. అదీ 2009లో వచ్చిన సినిమా వండర్ ‘అవతార్’. ‘అవతార్’ విడుదలైన ఇన్నేళ్లకు ఆ సినిమాకు నాలుగు సీక్వెల్స్ రెడీ చేస్తోన్న కేమరూన్ ప్రస్తుతం ‘అవతార్ 2’ పనులను మొదలుపెట్టేశారు. మరి రెమ్యునరేషన్ తన మార్కెట్ కంటే ఎక్కువే అడిగారో లేదో కానీ కేట్ విన్స్లెట్ ‘అవతార్ 2’లో నటిస్తున్నారు. అయితే ఇందులో ఆమెది కీ రోల్ మాత్రమే! కథను మలుపు తిప్పే పాత్రట. ఈ సినిమా కోసమే ప్రస్తుతం డైవింగ్ కూడా నేర్చుకుంటున్నారు కేట్! 2020 డిసెంబర్లో ‘అవతార్ 2’ విడుదల కానుంది. -
అవతార్ రిటర్న్స్ టు టెర్మినేటర్!
టెర్మినేటర్ అంటే తెలుగు ప్రేక్షకులకూ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గరే గుర్తొస్తారు. ఇప్పటివరకు ‘టెర్మినేటర్’ సిరీస్ (ఐదు సిన్మాల్లో)లో ఈ ఇంగ్లీష్ హీరో అంతలా ఇరగదీసి నటించారు. అయితే... ‘టెర్మినేటర్’కి, ‘అవతార్’కి లింక్ ఏంటబ్బా? అని ఆలోచిస్తున్నారా! ‘అవతార్’ అంటే ముందుగా గుర్తొచ్చేదెవరు? ఆ చిత్రదర్శకుడు జేమ్స్ కామెరూన్. ‘టెర్మినేటర్’ సిరీస్‌లో ఫస్ట్ రెండు సిన్మాలకు దర్శకుడూ ఆయనే. కామెరూన్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించిన ‘టెర్మినేటర్–2’ ఆల్మోస్ట్ 525 మిలియన్ డాలర్స్ కలెక్ట్ చేసింది. సెకండ్ పార్ట్ విడుదలైన పన్నెండేళ్లకు వచ్చిన మూడో పార్ట్ ‘టెర్మినేటర్ 3: రైజ్ ఆఫ్ ద మెషీన్స్’ (2003) గానీ, తర్వాత ‘టెర్మినేటర్ సాల్వేషన్’ (2009) గానీ, ఐదో పార్ట్ ‘టెర్మినేటర్ జెనిసిస్’ (2015) గాని రెండో పార్ట్ వసూళ్లను దాటలేదు. కారణం అదేనో... మరొకటో... ఆరో పార్ట్ హక్కులు మళ్లీ కామెరూన్ చేతికి వచ్చాయి. అయితే... ‘టెర్మినేటర్–2’కి సీక్వెల్‌గా రూపొందనున్న ఈ సినిమాకి ఆయన దర్శకత్వం వహించడం లేదు. కథారచయితగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. బిల్లీ రేతో కలసి కథ రాసిన కామెరూన్, డేవిడ్ ఎల్లీసన్తో కలసి ‘టెర్మినేటర్–6’ను నిర్మిస్తున్నారు. ‘డెడ్‌పూల్’ ఫేమ్ టిమ్ మిల్లర్ దర్శకుడు. స్క్రిప్ట్ అండ్ ప్రీ–ప్రొడక్షన్ వర్క్స్ మొదలై చాలా రోజులైంది. వచ్చే ఏడాది మార్చిలో షూటింగ్ స్టార్ట్ చేస్తారట! ద బ్రెయిన్ బిహైండ్ టెర్మినేటర్... కామెరూన్ మళ్లీ ఆర్నాల్డ్ ష్వార్జ్నెగ్గర్తో కలవడంతో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి. ఇంతకీ ఆరో ‘టెర్మినేటర్’ ఎప్పుడు వస్తుందో తెలుసా? 2019లో. -
జాక్ చనిపోయి ఉండాల్సింది కాదు!
‘రోజ్... నువ్వు బతకాలి. నాకోసం నువ్వు బతకాలి’. ‘జాక్ నువ్వు లేకపోతే నేను బతకలేను. నాకు నువ్వు కావాలి’ ‘రోజ్.. నాకు నువ్వు బతకడమే కావాలి.. నన్ను వదిలెయ్. నా చేయి వదిలేయ్’. రోజ్ వదల్లేక వదల్లేక జాక్ చేతిని వదిలేస్తుంది. ‘టైటానిక్’ సినిమా చివర్లో గాఢ ప్రేమికులు జాక్–రోజ్ల సంఘర్షణ ఇది. బండరాయిని ఢీ కొని, ప్రమాదానికి గురైన టైటానిక్ ఓడ సాక్షిగా సముద్రంలోనే సమాధి అయినవాళ్లు, ప్రాణాలను కాపాడుకున్నవాళ్లూ ఉన్నారు. విరిగిపోయిన ఓ ముక్క మీద రోజ్ ఉంటుంది. జాక్ మునిగిపోతాడు. వాళ్ల ప్రేమ అలా విషాదంగా ముగిసిపోతుంది. 20 ఏళ్ల క్రితం వచ్చిన ‘టైటానిక్’లో లియొనార్డో డికాప్రియో (జాక్), కేట్ విన్స్లెట్ (రోజ్) తమ నటనతో మైస్మరైజ్ చేశారు. సినిమా చూసిన వాళ్లందరూ దర్శకుడు జేమ్స్ కేమరూన్ కొంచెం కనికరించి, జాక్‌ని బతికించి ఉంటే బాగుండేదనుకున్నారు. కేట్ విన్స్లెట్ మనసులో కూడా ఇదే అభిప్రాయం ఉంది. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న కేట్ ఈ విషయాన్ని వ్యక్తపరిచారు. ‘‘విరిగిన ముక్క మీద జాక్కి కూడా చోటు ఉంది. కానీ, జేమ్స్ కామెరూన్ అతన్ని చనిపోయినట్లు చూపించాలనుకున్నారేమో. ఆ సీన్ చేస్తున్నప్పుడు ఏమీ అనిపించలేదు కానీ, సినిమా విడుదలైన 20 ఏళ్లకు జాక్ చేతిని రోజ్ వదలాల్సింది కాదు అనిపిస్తోంది’’ అన్నారు కేట్. అంత గాఢమైన ప్రేమకథలో నటించారు కాబట్టి.. ‘టైటానిక్’ తీస్తున్న సమయంలో ఒకరి పట్ల మరికొరికి ఆకర్షణ ఏదైనా ఉండేదా? అన్న ప్రశ్నకు –‘‘అదేంటో కానీ, మా మధ్య అలాంటిదేం జరగలేదు. అప్పుడు మేమిద్దరం చాలా చిన్నవాళ్లం. సినిమాలో గాఢమైన రొమాంటిక్ సీన్స్ ఉన్నాయి కాబట్టి, మా మధ్య ఎట్రాక్షన్ మొదలై ఉంటుందని ఊహించారు. ఇప్పటికీ ఆ ఊహలోనే ఉన్నారు. బట్.. సారీ మా మధ్య అలాంటిదేం లేదు. 20 ఏళ్లుగా మేం మంచి స్నేహితులుగా ఉండిపోయాం’’ అన్నారు కేట్ విన్స్లెట్. -
అండర్ వాటర్... ఆరు నెలలు శిక్షణ!
లెక్క లేదు. హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన సినిమాలకు వచ్చిన అవార్డులు, రివార్డులకు లెక్కే లేదు. విమర్శకులు సైతం ఆయన సినిమాలను మెచ్చుకోకుండా ఉండరు. అల్మోస్ట్ 20ఏళ్ల క్రితం 1997లో జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో వచ్చిన ‘టైటానిక్’ ప్రపంచ సినిమా చరిత్రలో ఓ చెరగని ముద్ర వేసింది. ఆ తర్వాత 2009లో ఆయన రూపొందించిన ‘అవతార్’ సినిమా ప్రేక్షకులను ఓ సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లిందని చెప్పడం అతిశయోక్తి కాదు. ‘అవతార్’కు నాలుగు స్వీక్వెల్స్ను జేమ్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. 2020 డిసెంబర్ 18న ‘అవతార్ 2’, 2021 డిసెంబర్ 17న ‘అవతార్ 3’, 2024 డిసెంబర్ 20న ‘అవతార్ 4’ ఫైనల్‌గా 2025 డిసెంబర్ 19న ‘అవతార్ 5’ చిత్రాలను రిలీజ్ చేయనున్నట్లు డేట్స్‌తో సహా అనౌన్స్ చేశారు. ఇప్పుడు కొన్ని ఆసక్తికర అంశాలను బయటపెట్టారు జేమ్స్ కామెరూన్. ‘‘ఇప్పటివరకూ ఎవరూ కనీ వినీ ఎరుగని రీతిలో ‘అవతార్’ సీక్వెల్స్‌ను తెరకెక్కించబోతున్నాం. అండర్ వాటర్ మోషన్ క్యాప్చర్ సిస్టమ్‌ను వినియోగించనున్నాం. ఇందుకు డిఫరెంట్ టెక్నాలజీతో కూడిన పవర్ఫుల్ కెమెరాను వందల సంఖ్యలో వాడాలి. అండర్ వాటర్ సీన్స్‌ను పర్ఫెక్ట్గా క్యాప్చర్ చేయడం అంత ఈజీ కాదు. టైమ్ పడుతుంది. ఏడాదిన్నరగా ఈ విషయంపైనే టీమ్ అంతా ఎంతో ఏకాగ్రతగా వర్క్ చేస్తున్నాం. ఈ నెల 14న అండర్ వాటర్ టెస్ట్ షూట్ చేశాం. అవుట్‌పుట్ బాగా వచ్చింది. ఐదుగురు టీనేజర్స్, ఏడేళ్ల బాలుడు షూట్లో పాల్గొన్నారు. నీళ్ల అడుగు భాగంలో ఊపిరి తీసుకునేందుకు వారికి మేం ఆరు నెలల పాటు ప్రత్యేక శిక్షణ ఇప్పించాం. మూడు, నాలుగు భాగాల్లో ముఖ్యమైన అండర్ వాటర్స్ సీన్స్ ఉన్నాయి’’ అని జేమ్స్ కామెరూన్ పేర్కొన్నారు. -
20 ఏళ్ల తరువాత అవతార్ సీక్వల్ లో.!
టైటానిక్.. విడుదలైన ప్రతీచోటా సంచలన విజయం సాధించిన రొమాంటిక్ ఎంటర్ టైనర్. హాలీవుడ్ టాప్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హీరో హీరోయిన్లు గా నటించిన లియోనార్డో డికాప్రియో, కేట్ విన్స్ లెట్ లా జీవితాలను మార్చేసింది. అయితే సినిమా రిలీజ్ అయిన ఇరవైయ్యేళ్ల తరువాత మరోసారి ఇదే కాంబినేషన్ రిపీట్ అవ్వబోతోంది. అవతార్ సినిమాతో మరో భారీ విజయాన్ని సాధించిన కామరూన్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వల్ ను రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం కేట్ విన్స్ లెట్ మరోసారి కామరూన్ దర్శకత్వంలో నటించనున్నారు. ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమాను 2020 డిసెంబర్ 18న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అయితే అవతార్ 2తో పాటు 3, 4, 5లను కూడా రూపొందిస్తామని ప్రకటించారు చిత్రయూనిట్. రెండో భాగంలో నటించనున్న కేట్ విన్స్ లెట్ తరువాత సీక్వల్స్ లో నటిస్తుందీ లేనిదీ ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. -
ఆరోసారి వస్తున్న టెర్మినేటర్
లాస్ఏంజెల్స్: ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించి, హాలీవుడ్ హీరో ఆర్నాల్డ్ ష్వాజ్ నెగర్ కు కోట్లాది అభిమానులను సంపాదించి పెట్టిన టెర్మినేటర్‌కు మరో సీక్వెల్ రాబోతోంది. ష్వాజ్ నెగర్ హీరోగా టెర్మినేటర్-6 ను 2019 లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చురుగ్గా సాగుతున్నాయి. సారా కానర్‌గా టెర్మినేటర్-1లో నటించి మెప్పించిన లిండా హామిల్టన్నే ఇందులోనూ స్వ్కార్జ్నెగ్గర్తో పాటు నటించనున్నారు. సినిమా విడుదలకు 2019 జూలై 26 వ తేదీని ఖరారు చేశామని ప్రొడ్యూసర్ జేమ్స్ కామెరాన్ తెలిపారు. అయితే, కథకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు. ఈ సినిమా డైరెక్టర్ టిమ్ మిల్లర్, స్క్కిప్ట్ రైటర్‌గా కామరూన్ వ్యవహరిస్తున్నారు. -
అవతార్ సీక్వెల్.. ఫస్ట్‌లుక్ చూశారా?
లాస్ఏంజిలెస్: నిత్యం వినూత్న సినిమాలు అందించే జేమ్స్ కామెరూన్ ఏది చేసినా సంచలనమే! 1980ల్లో వచ్చిన టెర్మినేటర్ నుంచి 2009లో వచ్చిన అవతార్ వరకు కామెరూన్ చేసిన ప్రతి సినిమా అత్యద్భుత దృశ్యకావ్యాలుగా నిలిచిపోయాయి. తాజాగా అవతార్ సీక్వెల్ గురించి మరో వార్త సంచలనంగా మారింది. మంగళవారం నుంచి అవతార్ నాలుగు సీక్వెల్స్‌కు సంబంధించిన ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. దాదాపు ఒక బిలియన్డాలర్ల కన్నా ఎక్కువ ఖర్చుతో వీటిని నిర్మిస్తున్నారన్నది ఆ వార్త సారాంశం. అంటే భారత కరెన్సీలో దాదాపు రూ.6,539 కోట్ల పైమాటే! మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సీక్వెల్స్ ఎపుడు విడుదల చేసేది కూడా ముందే ప్రకటించారు కామెరూన్. 2020 డిసెంబరులో ‘అవతార్ 2’ విడుదల కాబోతోంది. 2021 డిసెంబరులో అవతార్ 3’, 2024 డిసెంబరులో ‘అవతార్ 4’, 2025 డిసెంబరులో ‘అవతార్ 5’ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
అవతార్ కు నాలుగు సీక్వెల్స్
లాస్ వెగాస్: అద్భుత గ్రాఫిక్స్ తో వచ్చిన అవాతార్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించింది. ఇప్పుడు ఆసినిమాకు ఏకంగా నాలుగు సీక్వెల్స్ ను తీసే ఆలోచన ఉన్నట్టు అవతార్ దర్శకుడు జేమ్స్ కేమరాన్ తెలిపారు. ''మా సినిమా కథపై ఉన్న పరిమితులను అధిగమించి పని చేయాలని నిర్ణయించుకున్నాము. ప్రతీ సీక్వెల్ కూడా దేనికదే ప్రత్యేకంగా ఉంటుందిని, అవతార్-2 సినిమా2018లో తర్వాత వరుసగా 2020, 2022, 2023లో నిర్మిస్తామని కామెరాన్ తెలిపారు. ప్రపంచంలోని నలుగురు టాప్ రచయితలతో అవతార్ సీక్వెల్స్ ను నిర్మించ దలుచుకుంటున్నానని అన్నారు. అవతార్ సినిమాల సీక్వెల్స్ లలో్ కొత్త కల్చర్, పర్యావరణం అంశాలు ఉంటాయని కేమరాన్ అన్నారు. Four sequels , Avatar, James Cameron, అవతార్, నాలుగు సీక్వెల్స్, జేమ్స్ కేమరాన్ -
2017లో ‘అవతార్ 2’
ఆరేళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంత మెప్పించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని కామెరూన్ ఎప్పుడో ప్రకటించారు. అభిమానుల నిరీక్షణ ఫలించనుంది. ‘‘మూడు స్క్రిప్టులకు తుది మెరుగులు దిద్దుతున్నాం. ప్రొడక్షన్ డిజైనింగ్ పనులు చూస్తు న్నాం. ఇక, చిత్రీకరణే ఆలస్యం. 2017 డిసెంబర్లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అని కామెరూన్ తెలిపారు. -
వరల్డ్ సినిమాకి నార్త్... ఈస్ట్... వెస్ట్... సౌత్
జేమ్స్ కామెరూన్, స్టీవెన్ స్పీల్బర్గ్, జాన్‌వూ, క్వెంటిన్ టెరెంటినో... ఈ నలుగురూ ప్రపంచ సినిమాకి నాలుగు దిక్కులు. ఒకరు వెస్ట్ అయితే, ఇంకొకరు ఈస్ట్. ఒకాయన సౌత్ అయితే, మరొకరు నార్త్. నలుగురివీ నాలుగు మార్గాలు. ఎవరు ఏ మార్గంలో నడిచినా ప్రపంచం మొత్తం వీరి సినిమాలంటే పడి చచ్చిపోతుంది. అసలు ఈ నలుగురు జగదేక దర్శకులు ఇప్పుడేం చేస్తున్నారు? భవిష్యత్తులో ఎలాంటి అద్భుతాలు సృష్టించడానికి సిద్ధమవుతున్నారు?... జస్ట్ లుక్. 1. జేమ్స్ కామెరూన్ అవతార్! ‘టెర్మినేటర్’లో రోబోల విధ్వంసం ఎలా ఉంటుందో ఒళ్లు గగుర్పొడిచేలా చూపించాడు. ‘టైటానిక్’తో ప్రేక్ష కుల గుండెలు కరిగేలా చేశాడు. ‘అవతార్’ సినిమాతో అత్యున్నత సాంకేతిక అద్భుతాన్ని తెర మీద ఆవిష్కరించి, ‘అరె ఇలా కూడా సినిమా తీయొచ్చా’ అని వెండితెరకు సరికొత్త గమనాన్ని నిర్దేశించిన దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆయన లేట్‌గా తీసినా లేటెస్ట్గా తీస్తాడని ప్రతీతి. ‘అవతార్’ తర్వాత ‘టైటానిక్-త్రీడీ’ వెర్షన్ కార్యకలాపాల్లో కొన్నాళ్లు నిమగ్నమైన కామెరూన్ ఇప్పుడేం చేస్తున్నట్టు? ప్రస్తుతం ఆయన ‘అవతార్’ సీక్వెల్స్ పనుల్లో చాలా చాలా బిజీగా ఉన్నారు. ‘అవతార్-2’, ‘అవతార్-3’ ఇలా వరుసగా సినిమాలు తీస్తానని ఆయన ఇంతకు ముందే ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే ‘అవతార్-2’ను సిద్ధం చేస్తున్నారు. ఆ ‘అవతార్ ’ను మించిన కథాకథనాలు, గ్రాఫిక్స్ ఈ సీక్వెల్లో ఉంటాయట. అండర్‌వాటర్ సీక్వెన్సెస్ ‘అవతార్-2’లో ప్రేక్షకులకు కనువిందు చేస్తాయని కామెరూన్ పేర్కొన్నారు. 2016లో ఈ చిత్రాన్ని విడుదల చేద్దామనుకున్నారు. అయితే, సాంకేతిక కారణాల వల్ల ఈ రెండో ‘అవతార్’ని 2017 డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తారు. 2. స్పైస్ స్పీల్బర్గ్ ‘జాస్’, ఈటీ (ఎక్స్ట్రా టెరస్ట్రియల్), ‘జురాసిక్ పార్క్’, ‘ద లాస్ట్ వరల్డ్’... ఈ సినిమాల పేర్లు వింటే టక్కున గుర్తుకువచ్చే దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. ఈ దిగ్దర్శకుని చిత్రాల కోసం ఎన్నేళ్లయినా ఎదురుచూసే అభిమానులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారంటే అతిశయోక్తి కాదేమో. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థలు స్టీవెన్‌తో కలిసి పనిచేయాలని ఇప్పటికీ ఉవ్విళ్లూరుతుంటాయి. ఇటీవల వచ్చిన ‘జురాసిక్ వరల్డ్’ చిత్రానికి స్టీవెన్ స్పీల్బర్గ్ కేవలం ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మాత్రమే. ఈ చిత్రానికి ఆయన శిష్యుడు కొలిన్ ట్రావె ర్రో దర్శకత్వం వహించారు. కానీ టైటిల్ కార్డ్ మీద స్టీవెన్ స్పీల్బర్గ్ అనే పేరు మంత్రంలా పనిచేసి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించింది. ప్రపంచంలోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా మూడో స్థానంలో నిలిచింది. మరి... స్పీల్బర్గ్ ఇప్పుడేం చేస్తున్నారు...? ఏ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు....? నిర్మాతగా ఫుల్ బిజీగా ఉంటూనే, ఆయన ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అదే ‘బ్రిడ్జ్ ఆఫ్ స్పైస్’. టామ్ హ్యాంక్స్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. 2016 అక్టోబర్ 16న ఈ చిత్రం విడుదల కానుంది. ఈలోగా మరో చిత్రానికి కూడా సన్నాహాలు చేస్తున్నారాయన.. అదే ‘రెడీ ప్లేయర్ వన్’. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. ఎర్నస్ట్ క్లయిన్ రాసిన ‘రెడీ ప్లేయర్ వన్’ అనే సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ నవలను అదే పేరుతో తెరకెక్కించనున్నారు స్పీల్బర్గ్. ఈ చిత్రం 2017 డిసెంబర్ 15న తెర మీదకు రానుంది. 3. థ్రిల్లింగ్ మ్యాన్ జాన్ వూ యాక్షన్ చిత్రాల స్పెషలిస్ట్‌గా ప్రపంచ సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన దర్శకుడు జాన్ వూ. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను కట్టిపడేయడం జాన్ వూ ప్రత్యేకత. ‘ఫేస్ ఆఫ్’, ‘మిషన్ ఇంపాజిబుల్-2’, బ్రోకెన్ యారో, పే చెక్... ఈ చిత్రాలన్నీ ఆయన ప్రతిభకు తార్కాణాలు. 2008లో విడుదలైన ‘రెడ్ క్లిఫ్’, దానికి సీక్వెల్‌గా విడుదలైన ‘రెడ్‌క్లిఫ్-2’, 1949 అంతర్యుద్ధం నేపథ్యంలో తీసిన ‘క్రాసింగ్’, దీనికి సీక్వెల్ అయిన ‘క్రాసింగ్-2’... ఇవన్నీ జాన్ వూ స్థాయిని పెంచాయి. 69 ఏళ్ల జాన్ వూ ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? 1976లో విడుదలైన జపనీస్ థ్రిల్లర్ ‘మ్యాన్ హంట్’ చిత్రాన్ని రీమేక్ చే సే సన్నాహాల్లో ఉన్నారు. 4. క్వెంటిన్ టెరెంటినో న్యూ డెఫినిషన్ వైవిధ్యమైన సినిమాలకు కేరాఫ్ అడ్రస్ క్వెంటిన్ టొరెంటినో. ఎంత పాత కథలనైనా ఇంత కొత్తగా కూడా చూపించవచ్చా అని ఆశ్చర్యపోయే స్థాయిలో స్క్రీన్‌ప్లేను కొత్త పుంతలు తొక్కించారీ దర్శకుడు. అయితే, ఆయన చిత్రాల్లో మితిమీరిన హింస, పోరాట సన్నివేశాలు ఎక్కువగా ఉంటాయని విమర్శకుల వాదన. అయినప్పటికీ తన శైలిని మార్చుకోలేదు. ఎందుకంటే, ప్రేక్షకులు ఇష్టపడినవి ఇవ్వడమే తన ధ్యేయమని అంటారు క్వెంటిన్. తన సక్సెస్ సీక్రెట్ అదే అంటారాయన. క్వెంటిన్ దర్శకత్వం వహించిన చిత్రాల్లో విజయాల శాతమే ఎక్కువ. ముఖ్యంగా ‘కిల్ బిల్’ సిరీస్, ‘ఇన్గ్లోరియస్ బాస్టర్డ్స్’, ‘ద జాంగో అన్చైన్డ్’... ఇలాంటి చిత్రాల ద్వారా క్రైమ్ థ్రిల్లర్స్‌కు సరికొత్త డెఫినిషన్ ఇచ్చారు. కొత్త దర్శకులు ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటారు. ప్రస్తుతం క్వెంటిన్ ‘ద హేట్‌ఫుల్ ఎయిట్’ చిత్రాన్ని తెరకెక్కించే పనుల్లో చాలా బిజీగా ఉన్నారు. డిసెంబరు 25న ఈ చిత్రం విడుదల కానుంది. -
వెయిట్ ఫర్ ‘అవతార్-2’
‘అవతార్’ చిత్రంలో పండోరా గ్రహాన్ని సృష్టించి, సరికొత్త ప్రకృతి అందాలను తెరపై ఆవిష్కరించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఆ చిత్రాన్ని ప్రపంచ సినీ అభిమానులు మర్చిపోలేరు. ఇప్పుడా చిత్రానికి సీక్వెల్స్ రెడీ చేస్తున్నారాయన. 2016లో రెండో భాగాన్ని, 2017, 18 సంవత్సరాల్లో మూడు, నాలుగు భాగాలను విడుదల చేస్తున్నట్లు ప్రకటించేశారు కూడా. కానీ, వచ్చే ఏడాది ఈ చిత్రం విడుదలయ్యే అవకాశం లేదట. 2017 డిసెంబర్లో క్రిస్మస్ సందర్భంగా మొదటి సీక్వెల్‌ను, 2018, 2019 సంవత్సరాల్లో తర్వాతి భాగాలను విడుదల చేస్తామని ఇప్పుడు తాజాగా చెప్పారు కామెరూన్. అంటే ‘అవతార్’ పార్ట్2 కోసం మరో రెండేళ్లు నిరీక్షించక తప్పదు. -
ఎదురుచూపులన్నీ... ఈ అయిదింటి మీదే!
డైనోసార్ విధ్వంసాలు (‘జురాసిక్ పార్క్’)... ఒళ్లు గగుర్పొడిచే సాహసాలు (‘మిషన్ ఇంపాజిబుల్’ సినిమాలో ఈథెన్ హంట్ గుర్తున్నాడుగా)... జేమ్స్ బాండ్ సినిమాల్లోని యాక్షన్ ఘట్టాలు.... రోబోల మధ్య యుద్ధం (‘టెర్మినేటర్’)... గగన వీధుల్లో మంచికి, చెడుకు మధ్య జరిగే పోరాటాలు.... హాలీవుడ్ సినిమాను తలుచుకోగానే సగటు ప్రేక్షకుల మనోఫలకాల్లో కదలాడే సన్నివేశాలు ఇవన్నీ. ఇలాంటి సినిమాలు ఎన్ని వచ్చినా ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు మళ్లీ మళ్లీ ఎదురుచూస్తూ ఉంటారు. అలాంటి సినిమాలు కొన్ని హాలీవుడ్లో ఈ ఏడాది వస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అందరి కళ్ళూ ఆ సినిమాల మీదే. ఈ చిత్రాల మీద ఎన్నెన్నో ఆశలు, అంచనాలు ఉన్నాయి. వాటి గురించి ఓ సారి...! రానున్న కొద్ది నెలల్లో రానున్న అలాంటి అయిదు సినిమాల గురించి...! జురాసిక్ వరల్డ్ ‘జురాసిక్ పార్క్’... హాలీవుడ్ సినీ చరిత్రలో ఓ సంచలనం. స్టీవెన్ స్పీల్బర్గ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం తర్వాత మరో రెండు భాగాలు వచ్చాయి. వీటికి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు స్పీల్బర్గ్ నిర్మాణ సారథ్యంలో ‘జురాసిక్ వరల్డ్’ సినిమా రానుంది. చిత్ర కథ ప్రకారం... 22 ఏళ్ల తర్వాత జురాసిక్ వరల్డ్ థీమ్ పార్క్ ఓపెన్ చేస్తారు. శాస్త్రవేత్తల సృష్టితో తయారైన ఓ డైనోసార్ ఆ పార్క్‌లో ఎలాంటి విధ్వంసం సృష్టించిందన్న దానికి తెరరూపం ఇచ్చారు. ఈ చిత్రం ‘జురాసిక్ పార్క్’కు సీక్వెల్ అని దర్శకుడు కొలిన్ ట్రెవెర్రో చెప్పారు. ఇందులో మరో విశేషం ఏంటంటే మన హిందీ సినీ నటుడు ఇర్ఫాన్ ఖాన్ జురాసిక్ పార్క్ సీఈవోగా కీలక పాత్రను పోషిస్తున్నారు. మిషన్ ఇంపాజిబుల్-రోగ్ నేషన్ టామ్ క్రూజ్ హీరోగా నటించిన ఈ సిరీస్‌లో ఇప్పటిదాకా వచ్చిన నాలుగు భాగాలు బాక్సాఫీస్‌ను షేక్ చేశాయి. ముఖ్యంగా నాలుగో భాగం ‘ఘోస్ట్ ప్రొటోకాల్’ కనకవర్షం కురిపించింది. త్వరలో ఐదో భాగం రాబోతోంది. ‘రోగ్ నేషన్’ టైటిల్‌తో రాబోతున్న ఈ చిత్రాన్ని టామ్‌క్రూజ్, జె.జె. అబ్రమ్స్, బ్రియాన్ బర్క్ కలిసి నిర్మిస్తున్నారు. క్రిస్టొఫర్ మెక్‌క్వారీ దర్శకుడు. రెబెకా ఫెర్గూసన్ కథానాయికగా నటిస్తున్నారు. ఎప్పటి లాగే ఈ చిత్రం కోసం ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాల్లో టామ్ క్రూజ్ నటించారు. విమానం మీద చేసిన యాక్షన్ సీక్వెన్స్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారాయి. ఈ చిత్రం రానున్న జూలై 31న విడుదల కానుంది. స్పెక్టర్ ‘‘మై నేమ్ ఈజ్ బాండ్... జేమ్స్ బాండ్’’...అనగానే ప్రతినాయకులతో బాండ్ చేసే పోరాటాలు, గాళ్స్‌తో రొమాన్స్ గుర్తొస్తాయి. బాండ్ ఎవరైనా ఈ బ్రాండ్ డైలాగ్, ఆ సినిమాలకున్న బ్రాండ్ ఎప్పటికీ మారదు. అంత కొత్తగా తీస్తారు. ఇప్పటిదాకా 23 బాండ్ సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. తాజాగా 24వ సినిమా ‘స్పెక్టర్’ రానుంది. డేనియల్ క్రెగ్ కథానాయకునిగా నటిస్తున్న ఈ చిత్రంలో మోనికా బెలూసీ, లీ సీడక్స్ బాండ్ గాళ్స్గా నటిస్తున్నారు. శామ్ మెండెస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది నవంబర్ 6న విడుదల కానుంది. టెర్మినేటర్ జెనిసిస్ హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జేమ్స్ కామెరూన్ నుంచి వచ్చిన అద్భుతమైన చిత్రాలలో టెర్మినేటర్ ఒకటి. ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగర్ హీరోగా నటించిన ఈ చిత్రం ఇప్పటిదాకా వచ్చిన రోబో చిత్రాలకు మార్గదర్శి. ఇప్పటిదాకా నాలుగు భాగాలు విడుదలయ్యాయి. వాటిలో మూడు భాగాలకు జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించారు. ఈ ఐదో భాగానికి ‘థోర్’ చిత్ర ఫేమ్ అలెన్ టేలర్ దర్శకుడు. ఎమీలియా క్లార్క్, జై కోర్టినీ, క్రిస్టియన్ బేల్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం జూలై 1న విడుదల కానుంది. స్టార్ వార్స్- ద ఫోర్స్ ఎవేకెన్స్ దర్శక, రచయిత జార్జ్ లూకాస్ 1977లో అనుకుని ఉండరేమో... తన ఊహాసృష్టి ‘స్టార్ వార్స్’ పెను మార్పుకు దారితీస్తుందని! ఆయన దర్శకత్వం వహించిన ‘స్టార్ వార్స్’ ఫస్ట్‌పార్ట్ అప్పట్లో పెను సంచలనం. అది ఓ ఫ్రాంచైజ్‌గా మారిపోయింది. తర్వాత వరుసగా ఏడు వచ్చాయి. ఇప్పుడు ఎనిమిదో సినిమా కూడా రానుంది. హ్యారిసన్ ఫోర్డ్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రానికి జె.జె. అబ్రమ్స్ దర్శకుడు. రానున్న డిసెంబర్ 18న ఈ చిత్రం రిలీజవుతోంది. -
'2017లో అవతార్ సీక్వెల్'
అమెరికా : తాను తీస్తున్న 'అవతార్' సినిమా సీక్వెళ్ల విడుదలకు మరో మూడేళ్లు సమయం పడుతుందని ఆ చిత్ర దర్శకుడు జేమ్స్ కామెరూన్ వెల్లడించారు. ఆ చిత్ర మొదటి సీక్వెల్ 2017 లో విడుదల చేస్తామని తెలిపారు. ఈ చిత్రం నిర్మాణం కోసం చాలా అంకిత భావంతో పనిచేయాల్సి ఉందన్నారు. ఈ మూడు చిత్రాల నిర్మాణంలో కొంత వ్యత్యాసం ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెలాఖరు లోపు స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేసి షూటింగ్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు కామెరూన్ వివరించారు. అలాగే ఈ మూడు చిత్రాల షూటింగ్ సమాంతరంగా జరిపేందుకు ప్రయత్నాలు ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఈ మూడు చిత్రాలు ఒకదానికి ఒకటి సంబంధం కలిగి ఉంటాయని.... ఈ చిత్రాలన్నింటిని న్యూజిలాండ్‌లో షూటింగ్ జరుపుతామన్నారు. ఈ చిత్రాల మాతృక అయిన అవతార్ చిత్రం కూడా న్యూజిలాండ్‌లోనే షూటింగ్ జరిపిన సంగతిని జేమ్స్ కామెరూన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. -
మరో ఆరు వారాల్లో ‘అవతార్’ కథలు రెడీ!
ఒక సినిమాని ఒక సంవత్సరం.. మహా అయితే రెండు మూడేళ్లు తీస్తారు. హాలీవుడ్ సినిమా అయితే ఇంకో ఏడాది అదనంగా అవ్వొచ్చు. కానీ, ‘అవతార్’ చిత్రాన్ని జేమ్స్ కామరూన్ దాదాపు ఇరవైఏళ్లు తీశారు. ఈ సినిమా నిర్మాణంలో ఉన్నప్పుడు ‘ఇదేం విడ్డూరం.. ఇన్నేళ్లా’ అనుకున్నవాళ్లూ ఉన్నారు. కానీ, సినిమా విడుదలైన తర్వాత ‘అద్భుతమైన సాంకేతిక మాయాజాలం’ అని ఒప్పుకున్నారు. మరో, 20, 30 ఏళ్ల వరకు ఇలాంటి అద్భుతాన్ని చూడలేమని కూడా అన్నారు. అప్పటివరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులన్నింటినీ ఈ చిత్రం బద్దలు కొట్టింది. ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్స్ తీయడానికి సిద్ధమవుతున్నారు కామరూన్. సీక్వెల్ 2, 3, 4 చిత్రాలను ఏకకాలంలో రూపొందించనున్నారు. ‘ఆస్క్ మీ ఎనీథింగ్’ అనే కార్యక్రమంలో పాల్గొన్న కామరూన్ ఈ విషయం చెప్పారు. మరో ఆరు వారాల్లో ఈ సీక్వెల్స్‌కి సంబంధించిన కథలు పూర్తవుతాయని పేర్కొన్నారు. తొలి భాగంలో ఆర్నాల్డ్ స్క్వాజ్‌నెగ్గర్ నటించారు కదా.. ఈ సీక్వెల్స్‌లోనూ ఆయన ఉంటారా? అనే ప్రశ్నకు.. ‘‘ఈ మూడు కథల్లో ఆర్నాల్డ్‌కి నప్పే పాత్ర లేదు. అందుకని ఆయన ఉండకపోవచ్చు’’ అన్నారు. కొత్త సినిమా అయినా, సీక్వెల్ అయినా.. ఏదైనా ఒత్తిడికి గురి చేస్తుందని, తన కెరీర్ మొత్తం ఈ ఒత్తిడ్ని అనుభవిస్తూ వస్తున్నానని, ఇప్పుడూ అదే స్థితిలో ఉన్నానని కామరూన్ తెలిపారు. ప్రస్తుతం ఈ సీక్వెల్స్ కోసం భారీ సెట్స్ వేయిస్తున్నామని, అలాగే, గ్రాఫిక్స్‌లో పలు కేరక్టర్లను సృష్టిస్తున్నామని చెప్పారు. -
జేమ్స్ కామరూన్ 3 అవతార్లు
‘ది టెర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’లాంటి అద్భుతమైన చిత్రాల ద్వారా ప్రపంచ సినీ ప్రేక్షకులను అలరించిన జేమ్స్ కామరూన్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు. వరుసగా మూడేళ్ల పాటు సినీ ప్రియులకు మంచి అనుభూతినివ్వడం కోసం ఆయన సన్నాహాలు చేస్తున్నారు. ప్రేక్షకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్లిన ‘అవతార్’కి మూడు సీక్వెల్స్ రూపొందించనున్నారాయన. 2016లో ఒకటి, 2017లో మరొకటి, 2018లో మరో సీక్వెల్‌ను విడుదల చేయాలనుకుంటున్నారు. డిసెంబర్ నెలలోనే ఈ చిత్రాలు విడుదలవుతాయి. కాగా, ఈ మూడు చిత్రాలను న్యూజిలాండ్‌లోనే తీయాలనుకుంటున్నారు. ఎందుకంటే, తొలి భాగాన్ని న్యూజిలాండ్‌లో చిత్రీకరించినప్పుడు కామరూన్‌కి మంచి అనుభూతి లభించిందట. అందుకని, మూడు సీక్వెల్స్‌ని అక్కడే షూట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాల షూటింగ్ తమ దేశంలో జరగడం గౌరవప్రదంగా భావిస్తున్న న్యూజిలాండ్ ప్రభుత్వం వీలైనన్ని సౌకర్యాలు సమకూర్చాలనుకుంటోంది. అలాగే, లొకేషన్స్‌ని కూడా తక్కువ ధరకే ఇవ్వనున్నారట. ఇదిలా ఉంటే... పండోరా గ్రహం నేపథ్యంలో తొలి భాగం సాగుతుంది. కాగా, ఈ సీక్వెల్స్‌లో ఆ గ్రహంలో గల సముద్ర జలాల అందాలను ఆవిష్కరించాలనుకుంటున్నారట కామరూన్. నీటి లోపలి సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో చిత్రీకరించాలనుకుంటున్నామని ఓ ప్రకటనలో పేర్కొన్నారాయన. సాంకేతికంగా ‘అవతార్’ని మించే స్థాయిలో ఈ సీక్వెల్స్ ఉంటాయని ఆయన తెలిపారు. ‘అవతార్’ని నిర్మించిన లైట్‌స్టామ్ ఎంటర్టైన్మెంట్, ట్వంటీయత్ సెంచురీ ఫాక్స్ సంస్థలు ఈ సీక్వెల్స్‌ని నిర్మించనున్నాయి. -
‘అవతార్’కి మరో మూడు సీక్వెల్స్
వరల్డ్ ఫేమస్ డెరైక్టర్ జేమ్స్ కేమరూన్ సినిమా అంటేనే ఓ అద్భుతం. ఆయన ప్రతి సినిమా ఓ క్లాసిక్కే. ‘టైటానిక్’ గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగే ఇతర చిత్రాలు టెర్మినేటర్, ఏలియన్స్, లేటెస్ట్ ‘అవతార్’ కూడా సెన్సేషనల్ మూవీసే. ప్రస్తుతం ఈ సంచలనాత్మక దర్శకుడు ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ‘అవతార్’కి సీక్వెల్స్ రూపొందించాలన్నదే ఆ నిర్ణయం. అవతార్ 2, 3, 4 చిత్రాలను ప్రేక్షకులకు అందించే పనిలో ఉన్నారాయన. 2016లో ఒకటి, 2017లో మరొకటి, 2018లో మరో సీక్వెల్ రానున్నాయట. ‘అవతార్’ ఓ అద్భుతం అయితే, దాన్ని మించేలా ఈ సీక్వెల్స్ ఉండాలనే పట్టుదలతో ఉన్నారట కేమరూన్. ఉన్నత సాంకేతిక విలువలతో, ఊహకందని మలుపులతో ఈ సీక్వెల్స్ ఉంటాయని కేమరూన్ పేర్కొన్నారు. ‘అవతార్’ చిత్రం క్లయిమాక్స్ వరకు ఏయే పాత్రలు బతికి ఉన్నాయో ఈ కొనసాగింపు చిత్రాల్లో ఆ పాత్రలన్నీ ఉంటాయట. మూడేళ్ల క్రితం విడుదలైన ‘అవతార్’ని ఇంకా ప్రేక్షకులు మర్చిపోలేదు. ఈలోపు ఈ సీక్వెల్స్ ప్రకటన కామరూన్ సినిమాల అభిమానులను ఆనందానికి గురి చేస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.