కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అయోమయంలో పడింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కచ్చితంగా తెలియదు. విడుదల ఎప్పుడు వీలవుతుందో అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘‘అవతార్ అనుకున్న సమయానికే వస్తాడు’’ అంటున్నారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. 2009లో వచ్చిన ‘అవతార్’ సినిమాకు రెండు మూడు సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నారు కామెరూన్.
మొదటి సీక్వెల్ ను వచ్చే ఏడాది డిసెంబర్ 17న విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ‘అవతార్’ ఆలస్యం అవుతుంది అనుకున్నారు. ‘‘కరోనా వల్ల మా షూటింగ్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. అయినా సరే అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తాం అనే నమ్మకం ఉంది. చెప్పిన తేదీకే విడుదల చేయగలుగుతాం అనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు కామెరూన్.
Comments
Please login to add a commentAdd a comment