Avatar Movie
-
ఆ సీక్వెల్స్‌కి నేను డైరెక్షన్ చేయకపోవచ్చు!
హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ అనగానే గుర్తొచ్చే చిత్రం ‘అవతార్’. 2009లో రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను పండోరా ప్రపంచంలో విహరించేలా చేసింది. కలెక్షన్స్‌లో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులను సృష్టించింది. దీంతో ‘అవతార్’కు సీక్వెల్స్‌గా ‘అవతార్ 2’, ‘అవతార్ 3’, ‘అవతార్ 4’, ‘అవతార్ 5’లను ప్రకటించారు జేమ్స్ కామెరూన్. ‘అవతార్’ సీక్వెల్‌గా వచ్చిన ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’ (2022) బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం ‘అవతార్ 3’, ‘అవతార్ 4’ సినిమాల చిత్రీకరణలు ఒకేసారి జరుగుతున్నాయి. ‘అవతార్ 3’ ఈ ఏడాదిలో విడుదల కావాల్సింది. కానీ 2025కి వాయిదా వేశారు. 2025 డిసెంబరు 19న‘అవతార్ 3’, 2029లో ‘అవతార్ 4’, 2031లో ‘అవతార్ 5’ సినిమాలు విడుదలకు రెడీ అవుతున్నాయి. కాగా ‘అవతార్’ ఫ్రాంచైజీలో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు కూడా చాన్స్ ఉందని జేమ్స్ కామెరూన్ చెబుతున్నారు. ఇటీవల ఓ అవార్డు ఫంక్షన్లో పాల్గొన్న ఆయన ‘అవతార్’ సినిమా ఫ్రాంచైజీ గురించి మాట్లాడుతూ– ‘‘అవతార్’ ఫ్రాంచైజీలోని ఐదు సినిమాలకు కథలు రెడీగా ఉన్నాయి. ‘అవతార్ 6’, ‘అవతార్ 7’ల గురించిన ఆలోచనలు కూడా ఉన్నాయి. కానీ ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లకు నేను దర్శకత్వం వహించకపోవచ్చు’’ అని చెప్పుకొచ్చారు. హలీవుడ్లో ‘టైటానిక్’, ‘ది టెర్మినేటర్’ వంటి అద్భుత చిత్రాలను కూడా తీసిన జేమ్స్ కామెరూన్ కెరీర్‌ను ‘అవతార్’ ఫ్రాంచైజీ ఒక్కటే డామినేట్ చేయడం ఆయన ఫ్యాన్స్‌కు రుచించడం లేదని హాలీవుడ్లో కథనాలు వస్తున్నాయి. ఇక కామెరూన్ అన్నట్లు భవిష్యత్‌లో ‘అవతార్ 6’, ‘అవతార్ 7’లు సెట్స్‌పైకి వెళితే.. కనీసం ఇద్దరు, ముగ్గురు దర్శకులు కలిసి ఈ సినిమాలను తీయాల్సి ఉంటుందన్నట్లు హాలీవుడ్ సినీ విశ్లేషకులు అభి్రపాయపడుతున్నారట. -
అవతార్-2 ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన టికెట్ రేట్స్
హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన బిగ్గెస్ట్ విజువల్ వండర్ మూవీ ‘అవతార్-2’. డిసెంబర్ 16న విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా అదిరిపోయే కలెక్షన్స్ రాబడుతోంది. ఇండియాలోనూ సెన్సేషన్ క్రియేట్ చేస్తోందీ చిత్రం. పండోరా అనే సరికొత్త గ్రహాన్ని సృష్టించి.. వింతలు, అద్భుతాలతో ఆద్యంతం విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. మరోవైపు ఈ సినిమా టికెట్ రేట్స్ మరీ ఎక్కువగా ఉన్నాయంటూ విమర్శలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవతార్ మూవీ లవర్స్‌కు గుడ్‌న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. అవతార్-2 త్రీడీ వెర్షన్ టికెట్ ధరలు భారీగా తగ్గాయి. IMAX, 4DX వెర్షన్లు కాకుండా 3డీ వెర్షన్ టికెట్ ధరను రూ.150కి తగ్గించారు. ప్రేక్షకుల సంఖ్యను మరింత పెంచేందుకు తాజాగా తీసుకున్న టికెట్ తగ్గింపు నిర్ణయం కలెక్షన్లు పెరిగేందుకు బాగా ఉపయోగపడుతుందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో అవతార్-2 ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి మరి. -
అవతార్ 2 పై RGV మార్క్ రివ్యూ
-
తన ఇద్దరు కొడుకులతో కలిసి అవతార్-2 చూసిన ధనుష్
తమిళసినిమా: పదమూడేళ్ల క్రితం ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలన విజయాన్ని సాధించిన చిత్రం అవతార్. హాలీవుడ్ దర్శక దిగ్గజం జేమ్స్ క్యామరన్ అద్భుత సృష్టి అది. ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. తాజాగా ఆ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన చిత్రం అవతార్ ది వే ఆఫ్ వాటర్. ఇది శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా తెరపైకి వచ్చింది. వరల్డ్ వైడ్‌గా 52 వేల థియేటర్లలో విడుదల కావడం విశేషం. అదే విధంగా చిత్రాన్ని 160 భాషల్లో విడుదల చేసినట్లు సమాచారం. ఇకపోతే ఒక్క ఇండియాలోనే ప్రముఖ నగరాల్లో అడ్వాన్స్ బుకింగ్‌తో రూ. 20 కోట్లు వసూలు చేసింది. దీన్ని హిందీ, ఇంగ్లీష్ తమిళం, తెలుగు, కన్నడం, మలయాళంలో విడుదల చేశారు. చిత్రాన్ని ప్రేక్షకులు మైమరచి చూస్తున్నారు. కోలీవుడ్‌లో పలువురు సినీ ప్రముఖులు అవతార్ – 2 చిత్రాన్ని మొదటి రోజునే చూడడానికి ఆసక్తి కనబరచడం మరో విశేషం. ఆ విధంగా నటుడు ధనుష్ తన ఇద్దరు పిల్లలు లింగా, యాత్రలతో కలిసి అవతార్ ది వే ఆఫ్ వాటర్ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేశారు. ఆయన తన కొడుకులతో చిత్రాన్ని చూసిన ఫొటోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. కాగా ధనుష్ శనివారం అవతార్ –2 చిత్రం గురించి తన ట్విట్టర్లో ఇట్స్ అవతార్ డే అని పేర్కొనడం మరో విశేషం. ITS AVATAR DAY 🤩🤩🤩😍😍😍 — Dhanush (@dhanushkraja) December 16, 2022 View this post on Instagram A post shared by Nikil Murukan (@onlynikil) -
విషాదం.. అవతార్ 2 సినిమా చూస్తూ వ్యక్తి మృతి
ప్రపంచ సినీ ప్రియులంత ఆసక్తిగా ఎదురు చూసిన సినిమా ‘అవతార్ 2: ద వే ఆఫ్ వాటర్’. ఈ సినిమా నిన్న (డిసెంబర్ 16) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం పాజిటివ్ టాక్‌ను తెచ్చుకుంది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహించిన ఈ విజువల్ వండర్‌ను చూడడానికి ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. తెలుగు వారు సైతం ఈ సినిమా చూసేందుకు తెగ ఆసక్తిని చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా చూస్తూ ఓ వ్యక్తి మృతి చెందాడు. ఆంధ్ర ప్రదేశ్‌లో కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఈ విషాదం చోటు చేసుకుంది. లక్ష్మీ రెడ్డి అనే వ్యక్తి తన సోదరుడితో కలిసి అవతార్-2 సినిమాకు వెళ్ళాడు. చదవండి: అవతార్-2 అడ్వాన్స్ బుకింగ్స్‌లో రికార్డుల మోత సినిమా మధ్యలో శ్రీనుకు గుండెపోటు రావడంతో ఒక్కసారిగా అక్కడే కూలిపోయాడు. దీంతో శ్రీను తమ్ముడు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాడు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. కాగా గతంలో అవతార్ ఫస్ట్‌పార్ట్ సమయంలోనూ ఒకరు ఇలాగే గుండెపోటుతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తైవాన్‌కు చెందిన 42 ఏళ్ల వ్యక్తి అవతార్ ఫస్ట్ పార్ట్ సినిమా చూస్తూ 2010లో గుండెపోటుతో మరణించాడు. అతడికి హైబీపీ ఉన్నది. అవతార్ సినిమా చూసి తీవ్ర ఉద్రేకానికి గురైన కారణంగా ఆ వ్యక్తి మరణించినట్టు అతడిని పరీక్షించిన వైద్యులు అప్పుడు చెప్పారు. చదవండి: అందుకే నా ప్రెగ్నెన్సీ విషయాన్ని దాచాను: శ్రియ ఆసక్తికర వ్యాఖ్యలు -
Avtar 2: అవతార్-2 కోసం భారీ త్రీడీ తెర.. ఏ థియేటర్లో అంటే?
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): అవతార్ –2 చిత్రం ఈనెల 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని శైలజా థియేటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా భారీ త్రీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మంగళవారం థియేటర్లో ఏర్పాటు చేసిన త్రీడీ స్క్రీన్‌ను మేనేజర్ బాబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్– 2 సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను కనువిందు చేసేందుకు త్రీడీ తెర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి నిపుణుల పర్యవేక్షణలో థియేటర్లో అమర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2.6 గైన్ నుంచి 3.8 గైన్ స్క్రీన్ అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. అవతార్ సినిమాకు బుకింగ్ ప్రారంభించామని, రోజూ ఐదు షోలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. చదవండి: అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్ -
కళ్లు చెదిరే విజువల్ వండర్స్‌తో అవతార్-2 కొత్త ట్రైలర్
ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా అవతార్-2. 9ఏళ్ల క్రితం వచ్చిన అవతార్ చిత్రానికి సీక్వెల్ ఇది. జేమ్స్ కామెరూన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా డిసెంబర్ 16న విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ భారీ అంచనాలు క్రియేట్ చేయగా తాజాగా మరో కొత్త ట్రైలర్‌ను లాంచ్ చేశారు. కళ్లు మిరిమిట్లు గొలిపే హంగులతో, ఆశ్చర్యానికి గురిచేసే విజువల్ ఎఫెక్ట్స్‌తో ‘అవతార్-ది వే ఆఫ్ వాటర్' ఎలా ఉండబోతుందో ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు డెరెక్టర్. ఇప్పటికే ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో దూసుకుపోతుంది. మరి విడుదలకు ముందే వండర్స్ క్రియేట్ చేస్తున్న ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి. On December 16, experience the motion picture event of a generation. Watch the brand-new trailer and experience #AvatarTheWayOfWater in 3D. Get tickets now: https://t.co/9NiFEIpZTE pic.twitter.com/UitjdL3kXr — Avatar (@officialavatar) November 22, 2022 -
కొత్త వింతలు, విశేషాలతో అవతార్-2.. పండోరా ప్రపంచాన్ని చూశారా?
చందమామ కావాలని మారాం చేసిన బిడ్డను తల్లి ఎలా సముదాయిస్తుంది? చందమామను అద్దంలో బంధించి.. ఆ అద్దాన్ని బిడ్డ చేతికిస్తుంది. ఇది అప్పటి తల్లుల చాతుర్యం. ఇప్పటి మల్టీటాస్కింగ్ మదర్స్‌కి ఆ ప్రెషర్ అవసరం లేదు. ఆ పని హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ చేసిపెట్టాడు. అద్దంలో కాదు ఏకంగా వెండి తెర మీదే! ఒక్క చందమామ రూపాన్నే కాదు.. చందమామ మీదున్న ప్రపంచాన్నంతా తెచ్చిపెట్టాడు. అదే.. పండోరా లోకం. అవతార్‌కి సీక్వెల్.. అవతార్ –2! ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఈ సందర్భంగా మనం కూడా ఓసారి ఆ లోకంలో విహరించొద్దాం. ఫ్యూచర్ కాన్సెప్ట్‌తో తెరకెక్కే కథలన్నిట్లో పెద్ద పెద్ద భవంతులు.. వాటి చుట్టూ ఆధునిక సాంకేతిక వలయాలు.. గాల్లో తేలే వాహనాలు. ఎట్సెట్రా దర్శనమిస్తుంటాయి ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా. కానీ, కామెరూన్ ఆ చట్రాన్ని ఛేదించాడు. ఆ ప్యాటర్న్‌ను మార్చేశాడు. 2154 సంవత్సరంలో నడిచే అవతార్–2 కథలో.. భూమి ఎప్పటిలాగే ఉంటుంది. మనుషులు కూడా అట్లానే ఉంటారు. కానీ, డొల్లగా మారిన భూమి ఎనర్జీ కొరత తీర్చేందుకు.. ఇతర గ్రహాల మీద ఉన్న సహజ సంపదలపై కార్పొరేట్ కంపెనీల కన్నుపడుతుంది. అందులో భాగంగా అంతరిక్షంలో ఎక్కడో దూరంగా ఉన్న ‘పండోరా’ గురించి సైంటిస్టులకి తెలుస్తుంది. అదే అవతార్–2 కథకు వేదికైంది. ఏలియన్స్ అనగానే.. కోడిగుడ్డు ఆకారంలో తల, మెరిసే కనుగుడ్లు, పొట్టికాళ్లతో ఉంటుందని ఊహించేసుకుంటారు చాలామంది. ఆ మూస ఆలోచనలు, ఊహలకు బ్రేక్ వేసి మనిషి తరహా ఏలియన్లకు పురుడుపోశాడు క్రియేటివ్ జీనియస్ జేమ్స్ కామెరూన్ . పది అడుగుల ఎత్తుండే నీలంరంగు బక్కపల్చని ఏలియన్లు.. పొడవుగా ఉండే తోక, ఆ తోక వాళ్ల బ్రెయిన్‌కి ముడిపడి ఉండడం, ఆ తోక ద్వారానే అడవుల్లోని జంతువుల మెదళ్లను కంట్రోల్ చేయడం వంటి ప్రత్యేకతలను పెట్టాడు ఆ ఏలియన్స్‌కి. అలాగే ఆ అత్యంత ఆధునిక సాంకేతికతో ఏ మాత్రం సంబంధంలేని, ప్రకృతిని నమ్ముకుని బతికే అమాయకపు ఆదివాసీ జాతులుగా చూపించాడు. అన్నింటినీ మించి నావి తెగ భావోద్వేగాలు ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. మరి ఆ ఏలియన్ల చుట్టూ ఉండే జీవజాలం సంగతి ఏంటి? అందుకోసం బయాలజిస్టులతో స్టడీ చేయించి కొత్త జాతుల్ని సృష్టించాడు. విచిత్రమైన చెట్ల జాతులు, ఆరు కాళ్ల రైనోలు, భయంకరమైన థానోటర్ మృగాలు, రెక్కల గుర్రాలు, ఎగిరే డ్రాగాన్స్ లాంటి టోరక్లు.. మరి వీటి ఆవాసం? అందుకే ‘పండోరా’ను ఏర్పాటు చేశాడు. అవతార్‌లో ప్రతి పాత్రకూ ప్రాధాన్యం ఉంటుంది. చెట్లు, జంతువులతో సహా. హోమ్ ట్రీ, ట్రీ ఆఫ్ సోల్స్‌తో పాటు రకరకాల చెట్లు అవతార్‌కి ప్రత్యేక ఆకర్షణ. పండోరా మీద బతికే జీవుల్ని.. అక్కడి క్రూరమృగాలు నిబంధనలు పెట్టుకుని మరీ వేటాడుకుని తింటాయి. కానీ, ఆఖరుకు మనుషుల దాడుల్లో నావి ప్రజలు పిట్టల్లా రాలిపోతున్న వేళ.. అడవి తల్లిని కాపాడుకునేందుకు ఆ క్రూరమృగాలే నావిల తరపున నిలబడి మనుషులతో పోరాడుతాయి. ఇప్పటికే అవతార్‌లో కనిపించిన ఈ అంశాలతో పాటు మరిన్ని కొత్త వింతలు, విశేషాలతో కనువిందు చేయబోతోంది అవతార్–2. పండోరా నిజంగానే ఉంది శనిగ్రహం కక్ష్య లోపలి భాగంలో ఉన్న ఉపగ్రహాల్లో ‘శాటరన్ సెవెన్’ ఒకటి. ఇది సహజం ఉపగ్రహం. 1980లో వోయేజ–1 వ్యోమనౌక దీనిని గుర్తించి.. ఫొటోలు తీసి భూమ్మీదకి పంపింది. గ్రీకు పురాణాల ప్రకారం.. దీనికి ‘పండోరా’ అనే పేరు పెట్టారు. అయితే దీని వాతావరణం ఎలాంటిది? జీవం.. జీవనం ఉందా? లేదా? అనే విషయంలోనే స్పష్టత లేదు. ఈ ఉపగ్రహాన్ని ‘అవతార్’ కోసం వాడుకున్నారు. కామెరూన్ ప్రతిసృష్టిలో పండోరా నక్షత్ర వ్యవస్థలో ఆల్ఫా సెంచూరీన్ ఏ సిస్టమ్‌లో ఉంటుంది. భూమి నుంచి దీని దూరం 4.37 కాంతి సంవత్సరాలు. ఇది కాంతివంతంగా ఉండే ఒక ఉపగ్రహం. అందుకే దీనిని మరో చందమామ అంటారు. కామెరూన్ కల్పిత ప్రపంచం స్ఫూర్తితో ఫ్లోరిడాలోని బే లేక్ దగ్గర ఉన్న వాల్ట్ డిస్నీ వరల్డ్ రిసార్ట్ ‘పండోరా ది వరల్డ్ ఆఫ్ అవతార్’ పేరుతో 2017లో 12 ఎకరాలున్న ఒక పార్క్‌ను ప్రారంభించింది. ఇంతలా ప్రభావం చూపించింది కాబట్టే అవతార్ సీక్వెల్స్‌లో పండోరాను మరింత అందంగా చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు కామెరూన్. - భాస్కర్ శ్రీపతి -
అదే తేదీకి అవతార్!
కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇండస్ట్రీ అయోమయంలో పడింది. షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందో కచ్చితంగా తెలియదు. విడుదల ఎప్పుడు వీలవుతుందో అర్థం కావడంలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ‘‘అవతార్ అనుకున్న సమయానికే వస్తాడు’’ అంటున్నారు హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్. 2009లో వచ్చిన ‘అవతార్’ సినిమాకు రెండు మూడు సీక్వెల్స్ సిద్ధం చేస్తున్నారు కామెరూన్. మొదటి సీక్వెల్ ను వచ్చే ఏడాది డిసెంబర్ 17న విడుదల చేయాలనుకున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల వల్ల ‘అవతార్’ ఆలస్యం అవుతుంది అనుకున్నారు. ‘‘కరోనా వల్ల మా షూటింగ్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. అయినా సరే అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేస్తాం అనే నమ్మకం ఉంది. చెప్పిన తేదీకే విడుదల చేయగలుగుతాం అనే అనుకుంటున్నాను’’ అని పేర్కొన్నారు కామెరూన్. -
అవతార్‌కి అవరోధం
దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘ది టెర్మినేటర్’, ‘టైటానిక్’, ‘అవతార్’.. ఈ మూడు చిత్రాలకూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. ఇప్పుడు కామెరూన్ ‘అవతార్’ సీక్వెల్‌తో బిజీగా ఉన్నారు. అయితే కరోనా కారణంగా ‘అవతార్’కి అవరోధం ఏర్పడింది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ లాస్ ఏంజెల్స్‌లో జరుగుతోంది. అలాగే న్యూజిల్యాండ్‌లోని ‘వెటా డిజిటల్’లో విజువల్ ఎఫెక్ట్స్ పనులు మొదలుపెట్టాలనుకున్నారు. దీనికోసం ఒక బృందంతో కలిసి కామెరూన్ న్యూజిల్యాండ్ వెళ్లాలనుకున్నారు. ‘‘శుక్రవారం వెళదామనుకున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయాణం ప్రమాదం. అందుకే విరమించుకున్నాం’’ అని చిత్రనిర్మాత లాండ్యూ పేర్కొన్నారు. -
అవతార్ సీక్వెల్స్‌లో ఎవరంటే...
సాక్షి, సినిమా : సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం అవతార్ అనే అద్భుత లోకాన్ని సృష్టించి.. అందులోని గ్రాపిక్స్ అనే మాయాజాలంతో ప్రపంచాన్ని కట్టిపడేశాడు దర్శకుడు జేమ్స్ కామెరూన్. ఊహకందని ఆ విజువల్స్ గురించి ప్రేక్షకులు అస్సలు ఊహించి ఉండరు. అలాంటిది ఆ చిత్ర సీక్వెల్స్‌ను మొదలుపెట్టి వచ్చే 8 ఏళ్లలో ఒక్కోక్కటిగా విడుదల చేయబోతున్నాడు. అయితే మొదటి పార్ట్ లో పెద్ద నటీనటులనే ఎంచుకున్న ఆయన ఇప్పుడు మాత్రం ఆ పని చేయబోవటం లేదు. సుమారు 6 నుంచి 17 ఏళ్లలోపు వాళ్లనే ప్రధాన తారాగణంగా ఎంచుకుని చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ పోస్టర్‌ను కూడా వదిలారు. ఆ నటుల్లో ఒకరైన బ్రిటైన్ డాల్టన్ తన ట్విట్టర్ పేజీలో ఈ విషయాన్నితెలియజేశాడు. కొద్ది సంవత్సరాల పాటు తాము అవతార్ సినిమాలతోనే గడపబోతున్నామంటూ ప్రకటించాడు. స్టార్ నటీనటులు లేకుండా అవతార్ సిరీస్‌ను తెరకెక్కించాలన్న కామెరూన్ నిర్ణయం చర్ఛనీయాంశంగా మారింది. గతంలో హాలీవుడ్లో నార్నియా సిరీస్ కూడా పిల్లలతో తెరకెక్కి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్న బడ్జెట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఒక బిలియన్ డాలర్లు (దాదాపు 6539 కోట్లు) సీక్వెల్స్ కోసం ఖర్చుచేస్తున్నట్లు నిర్మాత జాన్ లన్డౌ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. తొలి సీక్వెల్ అవతార్-2ను 2020 డిసెంబర్ 18న విడుదల చేస్తుండగా, 2021 డిసెంబర్ 17న అవతార్-3ని, 2024 డిసెంబర్ 20న అవతార్-4, 2025 డిసెంబర్ 19న అవతార్-5ని రిలీజ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు కూడా. -
ఒక కోతి ఆలోచించింది.. ఇంకో కోతి ఆచరించింది..!
సూపర్‌హిట్ హాలీవుడ్ సినిమా ‘అవతార్’ చూశారా? అందులో హైబ్రిడ్ మనుషులను సృష్టించి అవతార్లుగా మార్చడం.. వారి మెదడుని జన్యుపరంగా దగ్గరి సంబంధం ఉండే వ్యక్తి ఆలోచనల ద్వారా నియంత్రించడం.. అద్భుతంగా ఉంటుంది కదూ! అయితే ఇంతదాకా కల్పితమే అయిన ఈ అద్భుతం భవిష్యత్తులో నిజం కాబోతోంది. అవతార్ సినిమా స్ఫూర్తితో పరిశోధన చేపట్టిన హార్వార్డ్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు ఒక కోతి మెదడులోని స్పందనలను ఇంకో కోతికి అనుసంధానం చేసి ఆ కోతిలో 98 శాతం కచ్చితత్వంతో కదలికలు తీసుకువచ్చారు. దీంతో భవిష్యత్తులో పూర్తిస్థాయి శరీరాన్నీ కదిలించవచ్చని, క్రమంగా ఈ టెక్నాలజీని మనుషులకూ ఉపయోగపడేలా అభివృద్ధిపర్చి పక్షవాతం రోగులను పరుగెత్తించవచ్చని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇంతకూ ఎలా చేశారంటే.. తొలుత ఓ కోతిని మాస్టర్ మంకీగా ఎన్నుకుని దాని మెదడులో 100 నాడీకణాల చర్యలను చదివే ఓ ఎలక్ట్రానిక్ చిప్‌ను అమర్చారు. తర్వాత ఆ కోతితో కంప్యూటర్‌పై కర్సర్‌ను కదపడం, జాయ్‌స్టిక్‌ను కదిలించడం వంటివి చేయించారు. మరో కోతిని అవతార్ గా ఎన్నుకుని దాని వెన్నులో 36 ఎలక్ట్రోడ్లను అమర్చారు. తర్వాత మాస్టర్ కోతిలో కదలికల కోసం మెదడు నుంచి వెలువడే విద్యుత్ సంకేతాలను.. అవతార్ కోతి నాడీవ్యవస్థలోకీ ఎలక్ట్రోడ్ల ద్వారా ప్రవేశపెట్టి నాడీవ్యవస్థను ప్రేరేపించారు. దీంతో మాస్టర్ కోతి చేయిని ఎలా కదిలించిందో... అవతార్ కోతి కూడా అచ్చం అలాగే చేయిని కదిలించిందన్నమాట.