
నూతన ఏర్పాటు చేసిన త్రీడీ టెక్నాలజీతో కూడిన తెర
ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి నిపుణుల పర్యవేక్షణలో థియేటర్‌లో అమర్చినట్లు చెప్పారు.
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): అవతార్ –2 చిత్రం ఈనెల 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని శైలజా థియేటర్‌లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా భారీ త్రీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మంగళవారం థియేటర్‌లో ఏర్పాటు చేసిన త్రీడీ స్క్రీన్‌ను మేనేజర్ బాబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్– 2 సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను కనువిందు చేసేందుకు త్రీడీ తెర ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి నిపుణుల పర్యవేక్షణలో థియేటర్‌లో అమర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2.6 గైన్ నుంచి 3.8 గైన్ స్క్రీన్ అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. అవతార్ సినిమాకు బుకింగ్ ప్రారంభించామని, రోజూ ఐదు షోలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు.
చదవండి: అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్