sailaja
-
స్టేజి మీద పాడాలి అంటే అన్నయ్య కి చాలా టెన్షన్
-
జీజేరెడ్డి షేర్లు శైలజా కిరణ్ పేరిట అక్రమంగా మార్పు
-
లారీ ఢీకొని.. నాలాలో కూరుకుపోయి..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలం మేకలగండి వద్ద హైవే నంబర్ 44లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వన్‌వేలో గుర్తు తెలియని భారీ వాహనం ప్రయాణికులతో వెళ్తున్న ఆటోను వెనుకనుంచి ఢీకొనడంతో రహదారికి సుమారు 20 అడుగుల దూరంలో ఉన్న పెద్ద నాలాలో ఆటో కూరుకుపోయింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం చెందగా, ఐదుగురు గాయాలపాలయ్యారు. ప్రత్యేక ప్రార్థనలకు వెళ్లివస్తూ.. ఆదిలాబాద్‌కు చెందిన ఆటోడ్రైవర్ కుటుంబం, మరో కుటుంబంతో కలిసి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇచ్చోడలోని చర్చిలో ప్రత్యేక ప్రార్థనల కోసం శుక్రవారం రాత్రి బయల్దేరి వెళ్లింది. శనివారం వేకువజామున 3 గంటల ప్రాంతంలో ప్రార్థనలు పూర్తి కావడంతో ఆదిలాబాద్‌కు తిరుగు ప్రయాణం అయ్యారు. ఇచ్చోడ బైపాస్ దాటుకుని హైవే పైనుంచి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ ఏముల పొచ్చన్న (58) ఆయన భార్య గంగమ్మ (48), కూతురు శైలజ (28), మరో కుటుంబానికి చెందిన మడావి సోంబాయి (63) సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఆటోను ఢీకొన్న తర్వాత భారీ వాహనం ఆగకుండా వెళ్లిపోయింది. పోలీసులు ఆ వాహనం ఆచూకీ కనుక్కునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనా స్థలి నుంచి కొద్ది దూరంలోనే కొద్ది నెలల కిందటే జరిగిన ప్రమాదంలో నలుగురు చనిపోయారు. ప్రధానంగా ఈ మార్గం పల్లంగా ఉండటంతో లారీలు న్యూట్రల్లో నడుపుతారు. ఈ ప్రమాదానికి కూడా అదే కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృత్యువును జయించిన చిన్నారులు ఈ ప్రమాదంలో మృతి చెందిన శైలజ కుమార్తెలు కూడా అదే ఆటోలో ఉన్నారు. మూడేళ్ల వయసున్న ఆరాధ్య, ఎనిమిది నెలల పసిబిడ్డ అర్పిత ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడినప్పటికీ వారి తల్లి మృతిచెందడం చూస్తున్నవారిని కంటతడి పెట్టించింది. -
Avtar 2: అవతార్-2 కోసం భారీ త్రీడీ తెర.. ఏ థియేటర్లో అంటే?
గాంధీనగర్(విజయవాడ సెంట్రల్): అవతార్ –2 చిత్రం ఈనెల 16వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గాంధీనగర్‌లోని శైలజా థియేటర్లో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇందు కోసం ప్రత్యేకంగా భారీ త్రీడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. మంగళవారం థియేటర్లో ఏర్పాటు చేసిన త్రీడీ స్క్రీన్‌ను మేనేజర్ బాబీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవతార్– 2 సినిమా విడుదల సందర్భంగా ప్రేక్షకులను కనువిందు చేసేందుకు త్రీడీ తెర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ముంబై నుంచి ప్రత్యేకంగా తయారు చేయించి నిపుణుల పర్యవేక్షణలో థియేటర్లో అమర్చినట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 2.6 గైన్ నుంచి 3.8 గైన్ స్క్రీన్ అప్‌గ్రేడ్ చేసినట్లు తెలిపారు. అవతార్ సినిమాకు బుకింగ్ ప్రారంభించామని, రోజూ ఐదు షోలు ప్రదర్శించనున్నట్లు చెప్పారు. చదవండి: అవతార్-2కి డైలాగ్స్ రాసిన అవసరాల శ్రీనివాస్ -
పెళ్లయిన వారానికే నవ వధువు ఆత్మహత్య.. అదే కారణమా..?
సాక్షి, హైదరాబాద్(కుషాయిగూడ): ఇష్టం లేని పెళ్లి చేశారని మనస్థాపం చెందిన ఓ నవవధువు.. కాళ్ల పారాణి ఆరక ముందే ఆత్మహత్యకు పాల్పడింది. కుషాయిగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఎస్ఐ సాయికుమార్ తెలిపిన వివరాల ప్రకారం..వరంగల్ జిల్లా, చెన్నరావుపేట మండలం, లింగగిరికి చెందిన ఏకాంతం నగరానికి వచ్చి ప్రైవేటుగా ఉద్యోగం చేసుకుంటూ చర్లపల్లి, ఈసీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. అతడి కూతురు శైలజ (22)ను మేనల్లుడు సతీష్‌కిచ్చి ఈ నెల 17న వారి ఊళ్లోనే బంధువుల సమక్షంలో వివాహం జరిపించాడు. పెళ్లయిన వారం రోజుల తర్వాత అంతా కలిసి ఈ నెల 22న ఈసీనగర్‌కు వచ్చారు. బుధవారం ఉదయం సతీష్ ఉద్యోగానికి వెళ్లాడు. అదే సమయంలో తల్లి ఉన్న బెడ్రూంకు గడియ పెట్టి హాల్లో సీలింగ్‌ఫ్యాన్‌కు ఉరి వేసుకొని శైలజ ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. తనకు ఇష్టం లేని వివాహం చేయడం వల్లనే శైలజ ఆత్మహత్యకు పాల్పడిందని తల్లిదండ్రులు పోలీసులకు వివరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: (ప్రేమ వివాహం: ఐదు నెలల తర్వాత గ్రామానికి వచ్చి.. ఊరు శివార్లలో..) -
KK Shailaja: ‘రాక్‌స్టార్’ మంత్రికి నిరాశ
తిరువనంతపురం: కేరళలో రెండో విడత సీఎంగా బాధ్యతలు చేపట్టనున్న సీఎం పినరయి విజయన్(77) కొత్త కేబినెట్ కూర్పులో అనూహ్య మార్పులు చేపట్టారు. కేరళలో కరోనా మొదటి వేవ్ సమయంలో తీసుకున్న చర్యలతో అందరి మన్ననలు పొందిన ‘రాక్‌స్టార్’ ఆరోగ్య మంత్రి కేకే శైలజకు ఈసారి చోటు కల్పించకపోవడం చర్చనీయాంశమైంది. పినరయి విజయన్ అల్లుడు మొహమ్మద్ రియాస్‌కు మంత్రివర్గంలో బెర్త్ దక్కడం గమనార్హం. మంగళవారం తిరువనంతపురంలో జరిగిన సమావేశంలో సీపీఎం సీనియర్ నేత విజయన్ను సీపీఎం శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. కొత్త కేబినెట్లో సీఎం విజయన్ మినహా 11 మంది కొత్త వారి పేర్లను సీపీఎం ఆమోదించింది. కూటమి భాగస్వామి పార్టీ సీపీఐ కొత్తగా ఎన్నికైన నలుగురిని కేబినెట్‌కు నామినేట్ చేయనుంది. పదవి ఖాయమని భావించినా.. 2020లో దేశంలోనే మొదటి కరోనా కేసు కేరళలోనే నమోదైంది. అనంతరం రాష్ట్రంలో ఈ మహమ్మారిని కట్టడి చేయడంలో మంత్రిగా కేకే శైలజ(64) తీసుకున్న పలు చర్యలు ‘రాక్‌స్టార్ ఆరోగ్య మంత్రి’గా ఆమె పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాయి. కరోనా మహమ్మారి మరోసారి విజృంభించడంతో గత అనుభవం దృష్ట్యా ఆమెకు ఈ దఫా కూడా మంత్రి పదవి ఖాయమని అందరూ భావించారు. కానీ, అందరి అంచనాలను తలకిందులు చేస్తూ శైలజకు మంత్రి పదవి దక్కలేదు. శెలజ పార్టీ విప్‌గా కొనసాగుతారని సీపీఎం తెలిపింది. మొదటిసారి మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్న ముఖ్యమంత్రి అల్లుడు రియాస్ ప్రస్తుతం డెమొక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డీవైఎఫ్ఐ) జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఎల్డీఎఫ్ ప్రభుత్వ కేబినెట్ ఈ నెల 20న ప్రమాణ స్వీకారం చేయనుంది. మొత్తం 21 మందితో కూడిన కేబినెట్లో 12 మంది సీపీఎం, నలుగురు సీపీఐ, కేరళ కాంగ్రెస్(ఎం), జనతా దళ్ (ఎస్), ఎన్సీపీ తరఫున ఒక్కొక్కరు ఉంటారని ఇప్పటికే స్పష్టత వచ్చింది. -
ఆమె బిరుదు ‘కోవిడ్ రాణి’
తిరువనంతపురం: గల్ఫ్ దేశాల నుంచి రాష్ట్రానికి తిరిగి రావాలని ఆశిస్తున్న ప్రవాసులకు కరోనా రహిత ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరి చేస్తూ.. కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ప్రవాసుల పట్ల ప్రభుత్వానికి దయ లేదంటూ కేరళ కాంగ్రెస్ అధ్యక్షుడు ముల్లపల్లి రామచంద్రన్ విమర్శించారు. రాష్ట్ర ఆరోగ్య మంత్రి కేకే శైలజను ‘కోవిడ్ రాణి’ అంటూ ఎగతాళి చేశారు. అంతేకాక ఆమె ప్రజల ప్రాణాలను కాపాడటానికి ఆసక్తి చూపడం లేదని ఆరోపించారు. ఆమెకు రికార్డులు, పురస్కారాల మీద ఉన్న ప్రేమ జనాల ఆరోగ్యం గురించి లేదన్నారు. కేరళ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆయన ఒక రోజు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆరోగ్య మంత్రి కేకే శైలజ గతంలో ‘నిపా రాజకుమారి’ టైటిల్ పొందారు.. ఇప్పుడు ‘కోవిడ్ రాణి’ బిరుదు కోసం ప్రయత్నిస్తున్నారు’ అని మండిపడ్డారు. గత మూడు నెలల్లో కరోనా కారణంగా గల్ఫ్‌లో 200 మందికి పైగా ప్రవాసులు మరణించారు. ఈ మరణాలకు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలని రామచంద్రన్ డిమాండ్ చేశారు. ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘విదేశాల్లో ఉన్న మా ప్రజలు తిరిగి రావాలని కోరుకుంటున్నారు. కానీ ప్రభుత్వం కరోనా కేసుల సంఖ్య గురించి భయపడుతోంది. కేరళ అభివృద్ధి కోసం పాటుపడిన పేద ప్రవాసులను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. కేవలం వారి గురించి మొసలి కన్నీరు కారుస్తుంది’ అన్నారు. అయితే కేరళ కాంగ్రెస్ చీఫ్ వ్యాఖ్యల పట్ల సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం అవుతోంది. దాంతో ఆయన దిద్దుబాటు చర్యలకు దిగారు. తాను స్త్రీలను అవమానించలేదని.. కేవలం ప్రభుత్వాన్ని, విధులు సరిగ్గా నిర్వహించిన మంత్రిని మాత్రమే విమర్శించానని తెలిపారు. -
అత్తారింట్లో ఎలా ఉండాలో నేర్పాలి
చిత్తూరు అగ్రికల్చర్: ఆడపిల్లలు అత్తవారింట్లో ఎలా మెలగాలన్న విషయాలను నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సీనియర్ సివిల్ జడ్జి నాగశైలజ తెలిపారు. స్థానిక డీఆర్డీఏ కార్యాలయ సమావేశ భవనంలో ఆదివారం ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళలతో సమావేశం నిర్వహించారు. ఇందులో జడ్జి నాగశైలజ, కలెక్టర్ సతీమణి కావ్యశ్రీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. జడ్జి మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలు, నైతిక విలువలను పిల్లలకు నేర్పించడంలో తల్లి ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల పిల్లలకు అన్ని విషయాలను పెద్దలు నేర్పించేవారన్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేనందున తల్లిదండ్రులే ఆ బాధ్యతను తీసుకోవాలని సూచించారు. ముఖ్యంగా ఆడపిల్లలు, అత్త, మామలతో మెలగాల్సిన తీరును వివరించాలని సూచించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రతి మహిళకు ఉచిత న్యాయ సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. మహిళల చట్టాలపై ప్రతి మహిళా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కలెక్టర్ సతీమణి కావ్యశ్రీ మాట్లాడుతూ స్త్రీగా జన్మించడం అదృష్టమని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని మహిళలు ఇప్పుడు నిరూపిస్తున్నారని చెప్పారు. గతంతో పోలిస్తే నేడు మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారని తెలిపారు. జేసీ–2 చంద్రమౌళి, డీఆర్డీకే పీడీ మురళి మాట్లాడుతూ మహిళలు డ్వాక్రా సంఘాల ద్వారా బ్యాంకు రుణాలు పొంది ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారని తెలిపారు. ఐసీడీఎస్ పీడీ ఉషాఫణికర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న పౌష్టికాహారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం వారు పోషణ్ అభియాన్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో నాబార్డ్ ఏజీఎం ప్రశాంత్‌బాబు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లీలావతి, పట్టుపరిశ్రమశాఖ జేడీ అరుణకుమారి, డీఎస్‌డబ్ల్యూవో రాజేశ్వరి, సప్తగిరి గ్రామీణ బ్యాంకు మేనేజర్ మహేశ్‌బాబు, డెప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో రమాదేవి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమా పాల్గొన్నారు. మహిళా సంరక్షణ కార్యదర్శులకు డీజీపీ శుభాకాంక్షలు తిరుమల : మహిళ సంరక్షణ కార్యదర్శులు, పోలీస్ కుటుంబ సభ్యులతో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం ఈస్ట్ పోలీస్‌స్టేషన్‌లో ఈ కాన్ఫరెన్స్‌కు హాజరైన వారితో ఆయన మాట్లాడుతూ, దిశ పోలీస్ స్టేషన్ గురించి, అక్కడనున్న సదుపాయాలను గురించి తెలుసుకున్నారు. దిశ చట్టంపై ప్రతి ఒక్కరిలో అవగాహన తీసుకురావాలన్నారు. మహిళలదే అగ్రస్థానం తిరుపతి తుడా: అన్ని రంగాల్లో మహిళలే అగ్రస్థానంలో ఉన్నారని జిల్లా కలెక్టర్ డాక్టర్ నారాయణ భరత్‌గుప్తా అన్నారు. తిరుపతి స్విమ్స్ ఆడిటోరియంలో సెట్విన్, మహిళా వైద్యకళాశాల సంయుక్తంగా ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ మాట్లా డుతూ అనేక రంగాల్లో మహిళలు ఉన్నతంగా రాణిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. మహిళలు ఆర్థికంగా ఎదిగితే ఆ కుటుంబం ఉన్నతంగా అభివృద్ధి చెందేందుకు దోహదపడుతుందన్నారు. తిరుపతిలోని మహిళా వైద్యకళాశాలకు దేశంలోనే గుర్తింపు ఉందన్నారు. వైద్యులుగా ఎదిగే ఏ ఒక్కరూ లింగనిర్ధారణ పరీక్షలను పూర్తిగా వ్యతిరేకించాలన్నారు. ఆడబిడ్డల శాతం తగ్గడానికి ఇది ఒక కారణమన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. సెట్విన్ సీఈవో మురళీకృష్ణతోపాటు వైద్యులు పద్మావతి, వనజ, సుధారణి, మాధవి, రజనీ, ఉమామహేశ్వరీ, డ్వామా పీడీ పద్మలత, అగ్రికల్చరల్ ఆఫీసర్ లక్ష్మీదేవి, లెక్చరర్ హేమలతలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్విమ్స్ ఇన్చార్జ్ డైరెక్టర్ డాక్టర్ రాం, రిజిస్ట్రార్ డాక్టర్ శ్రీధర్ పాల్గొన్నారు. -
రెండో పెళ్లి చేసుకున్న భర్తను ఉతికి ఆరేసింది..
సాక్షి, కొత్తగూడెం: మొదటి భార్యకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడిని ఉతికి ఆరేశారు. విడాకులు ఇవ్వకుండా, మరదలిని పెళ్లి చేసుకున్న అతగాడిని మొదటి భార్య అందరి ముందు దేహశుద్ది చేసింది. వివరాల్లోకి వెళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రామవరానికి చెందిన సాంబశివరావుకు నాలుగేళ్ల క్రితం శైలజతో వివాహం అయింది. అయితే ఆమెకు పిల్లలు పుట్టడం లేదని వేధింపులకు గురి చేయడంతో భరించలేక ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో సాంబశివరావు భార్యకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయం ఆలస్యంగా తెలుసుకున్న శైలజ తన బంధువులతో కలిసి భర్త ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగేవరకూ అక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదని తెగేసి చెప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. -
సస్పెన్స్ థ్రిల్లర్
ఇంటర్నేషనల్ మోడల్స్ సమీర్ ఖాన్, శైలజలను హీరో హీరోయిన్లుగా పరిచయం చేస్తూ షేర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కెఎస్ 100’. చంద్రశేఖరా మూవీస్ పతాకంపై వెంకట్ రెడ్డి నిర్మించిన ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షేర్ మాట్లాడుతూ– ‘‘కెఎస్100’ టైటిల్‌కి తగ్గట్టుగానే వైవిధ్యమైన కథతో తెరకెక్కిన చిత్రం. హారర్, సస్పెన్స్ థ్రిల్లర్, రొమాంటిక్ జానర్స్‌లో ప్రేక్షకులను అలరించేలా తెరకెక్కించాం. యువతను, మహిళలను ఆకట్టుకునే అంశాలుంటాయి. గోవా, హైదరాబాద్, మహారాష్ట్రలోని హిరంబుల్లోని అందమైన ప్రదేశాల్లో షూటింగ్ జరిపాం. చాలామంది మోడల్స్‌ను మా సినిమాలో పరిచయం చేస్తున్నాం. తెలుగులో ఎక్కువ మోడల్స్‌ని పరిచయం చేస్తున్న తొలి చిత్రం మాదే. త్వరలోనే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. అక్షిత, అషి, సునీత, శ్రద్ధా, నందిని, కల్పనా అజీమ్, పూరివి, సుమన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: వంశీ, సంగీతం: నవనీత్ చారి. -
పెళ్లి చేసుకుని ముఖం చాటేసిన యువకుడి అరెస్టు
చోడవరం టౌన్: ప్రేమిస్తున్నానని మాయమాటలు చెప్పి, గుడిలో పెళ్లి చేసుకుని ఆ తరువాత ముఖం చాటేసిన యువకుడిని అరెస్టు చేసినట్టు ఎస్ఐ పి.మల్లేశ్వరరావు తెలిపారు. మండలంలో నర్సయ్యపేటకు చెందిన బంటు నాగేశ్వరరావు అనే యువకుడు అదే గ్రామానికి చెందిన శైలజ అనే యువతిని ప్రేమించాడు. ఇటీవల పాడేరు తీసుకువెళ్లి అక్కడ ఆంజనేయ స్వామి గుడిలో పెళ్లి చేసుకున్నాడు. కొద్దిరోజుల తరువాత ముఖం చాటేయడంతో శైలజ గతనెల 18న పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి, నాగేశ్వరావుని బుధవారం అరెస్టు చేసికోర్టులో హాజరు పరిచినట్టు ఎస్ఐ తెలిపారు. 14 రోజులు రిమాండ్ విధించారని తెలిపారు. -
నేను మగాడినే.. కోర్టులో నిరూపిస్తా..
సాక్షి, చిత్తూరు: ‘ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 45 రోజుల పాటు నా కన్నతల్లిని చూడకుండా చేశారు. పైగా నేను మగాడ్ని కాదంటూ, సంసారానికి పనికిరాడని నాపై అభాండాలు వేశారు. నేను మగాడ్నే. మెడికల్ బోర్డు కూడా నా లైంగిక పటుత్వ పరీక్షలు పరీక్షించి ఎలాంటి లోపం లేదని నివేదిక ఇచ్చింది..’ అంటూ జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన ఉపాధ్యాయుడు రాజేష్ పేర్కొన్నాడు. గంగాధరనెల్లూరుకు చెందిన శైలజను వివాహమాడిని ఉపాధ్యాయుడు రాజేష్‌కు మగతనం లేదని గుర్తించి చెప్పడంతో దాడి చేశాడనే ఆరోపణలపై పోలీసులు నిందితుడితో పాటు అతని తండ్రిని సైతం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. రాజేష్, అతని తండ్రికి న్యాయస్థానం బెయిల్ ఇవ్వడంతో శుక్రవారం చిత్తూరు నగరంలోని జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. అనంతరం రాజేష్ మీడియాతో మాట్లాడుతూ తన నిర్దోషిత్వంపై న్యాయ పోరాటం చేసి నిరూపించుకుంటానన్నాడు. పోలీసుల దర్యాప్తునకు తాను పూర్తిగా సహకరిస్తానన్నాడు. శైలజ తనపై చేసిన ఆరోపణలన్నీ అబద్దమన్నాడు. తనను శాడిస్ట్‌తో పోల్చొద్దంటూ కోరాడు. గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్.. వి.కోటలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అతడికి నవంబర్ 1న గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన శైలజతో పెళ్లైంది. సంసార జీవితానికి పనికిరాడంటూ ఆరోపణలు చేయడంతో తొలిరాత్రి నాడే భార్యపై దాడిచేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. పెళ్లిళ్లు ఆగిపోతున్నాయి.. ఈ ఉదంతంతో తమ ఊరి అబ్బాయిలను పెళ్లాడేందుకు అమ్మాయిలు భయపడుతున్నారని మోతరంగనపల్లి వాసులు అంటున్నారు. ఇప్పటికే మూడు పెళ్లి సంబంధాలు వెళ్లిపోయాయని తెలిపారు. సంసారానికి పనికిరాడంటూ రాజేష్‌పై నిందలు వేశారని, పటుత్వ పరీక్షలో అతడికి ఎటువంటి లోపం లేదని తేలిందన్నారు. పదేపదే పనికిరానివాడంటూ, శాడిస్టు మొగుడంటూ ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అతడిపై నిందలు వేసినవారు ఇప్పుడు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. ఎవరో చేసిన పనికి తమ ఊరి పరువు తీయొద్దని కోరుతున్నారు. -
శాడిస్ట్ మొగుడు రాజేష్‌కు బెయిల్ మంజూరు
-
శాడిస్ట్ మొగుడు రాజేష్‌కు బెయిల్
సాక్షి, చిత్తూరు : తొలిరాత్రిని కాళరాత్రిగా మార్చిన శాడిస్ట్ భర్త రాజేష్‌కు బెయిల్ మంజూరైంది. పటుత్వ పరీక్షల రిపోర్టులో రాజేష్ సంసార జీవితానికి పనికి వస్తాడని తేలడంతో అతనితో పాటు అతని తల్లిదండ్రులకు కూడా చిత్తూరు జిల్లా కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్‌పై విడుదలైన అనంతరం మీడియాతో మాట్లాడిన రాజేష్ తల్లిదండ్రులు శైలజ కావాలనే రాజేష్‌ను జీవితాన్ని నాశనం చేశారని ఆరోపించారు. గతేడాది నవంబర్ 1తేదీన గంగాధర నెల్లూరు మండలం దామరగుంటకు చెందిన మునికృష్ణా రెడ్డి కుమార్తె శైలజను, జీడి నెల్లూరు మండలం మోతరంగనపల్లికి చెందిన రాజేష్‌కు ఇచ్చి వివాహం చేశారు. అయితే, తొలిరాత్రి నాడు రాజేష్ సంసార జీవితానికి పనికి రాడంటూ శైలజ తల్లిదండ్రులకు చెప్పారు. దీంతో రాజేష్ మృగంలా మారిపోయాడు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. అతడి వికృత చేష్టలకు తీవ్రంగా గాయపడింది శైలజ. తొలిరోజే ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో నవ వధువు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ముఖం గుర్తించలేనంతగా గాయాలతో కమిలిపోయింది. పెళ్లిపీటలపై అందంగా కనిపించిన శైలజ అదే రోజు రూపం మారిపోయి చిత్తూరు ఆస్పత్రిలో చేరారు. -
తొలిరాత్రే మృగమయ్యాడు
పెళ్లయిన తొలిరోజు రాత్రే ఆమెకు కాళరాత్రిగా మారింది. శాడిస్టు భర్త చేతిలో చిత్రహింసలకు గురైంది. నరకాన్ని చవి చూసింది. తీవ్ర గాయాలతో బయట పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. భర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గంగాధరనెల్లూరు: పెళ్లంటే పందిళ్లు..సందళ్లు.. తాళాలు..తలంబ్రాలు..అంటారు కవులు.. ఆ అమ్మాయి కూడా ఇలానే భావించింది. 24 గంటలు తిరగక మునుపే నరకం ఎలా ఉంటుం దో ప్రత్యక్షంగా చూసింది. తాళి కట్టిన వాడే రాక్షసుడై దాడి చేయడంతో తేరుకోలేకపోయింది. ఎన్నో ఆశలతో కన్నోళ్లు పెళ్లి చేస్తే మర్నాడే ఆ బంధం దారుణంగా చెదరిపోతుందని భావించలేకపోయింది శైలజ. గంగాధరనెల్లూరు మండలం పెద్ద దామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి వ్యవసాయం చేసుకుంటారు. ఆడబిడ్డను బాగా చదవాలని భావించారు. డిగ్రీతో సరిపెట్టకుండా కుమార్తె శైలజను ఎంబీఏ కూడా చదవుకోమని ప్రోత్సహించారు. ఈలోగా కుమార్తెకు ఓ టీచరు సంబంధం వచ్చింది. ప్రభుత్వ ఉద్యోగికిస్తే జీవితానికి భద్రత ఉంటుందనుకున్నారు. అప్పోసప్పో చేసి వియ్యంకుల వారి డిమాండ్లు తీర్చారు. వి.కోట మండలంలో పనిచేసే టీచరు రాజేష్‌తో కుమార్తెకు పెళ్లి సంబంధం నిశ్చయం చేసుకున్నారు. ఇతనిది జీడీ నెల్లూరు మండలం మోతరంగనపల్లి. అబ్బాయి బాగానే ఉన్నాడని భావించారందరూ. అతడు సంసార జీవితానికి పనికి రాడ నే విషయం దాచిపెట్టినట్లు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. రాజేష్‌తో శుక్రవారం ఉదయం బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేశారు. అదే రోజు తొలిరాత్రి శైలజకు కాళరాత్రి ఎదురైంది. భర్త అసలు విషయం తెలుసుకుని తల్లిదండ్రుల వద్ద వాపోయింది. దీంతో రాజేష్ మృగంలా మారిపోయాడు. ఆమె పట్ల పైశాచికంగా ప్రవర్తించాడు. అతడి వికృత చేష్టలకు తీవ్రంగా గాయపడింది శైలజ. తొలిరోజే ఇలాంటి సంఘటన ఎదురవ్వడంతో నవ వధువు తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. ముఖం గుర్తించలేనంతగా గాయాలతో కమిలిపోయింది. పెళ్లిపీటలపై అందంగా కనిపించిన శైలజ అదే రోజు రూపం మారిపోయి చిత్తూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనను నిలువునా వంచించాడంటూ కుంగిపోయింది. నిందితుడు రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నట్లు గంగాధరనెల్లూరు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. -
తొలిరాత్రే ఆమెకు నరకం చూపించాడు..
సాక్షి, చిత్తూరు : మూడు ముళ్లు వేసి... 24 గంటల గడవక ముందే ఓ శాడిస్ట్ భర్త చేతిలో నవ వధువు తీవ్రంగా గాయపడింది. తొలిరాత్రే... ఆ వధువు చేదు అనుభవాన్ని చవిచూసింది. దెబ్బలకు తాళలేక నవవధువు చేసిన ఆర్తనాదాలకు భయపడిన తండ్రి... తలుపులు తీయాలన్నాడు. దీంతో... తలుపులు తీసి భర్త పరారయ్యాడు. లైట్లు వేసిన తండ్రికి.. కూతురు తీవ్రగాయాలతో పడి వున్న విషయాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు. భర్త వికృత చేష్టలతో ప్రస్తుతం ఆమె తీవ్ర గాయాలతో చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం మోతరంగనపల్లిలో శుక్రవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మోతరంగనపల్లికి చెందిన కుమారస్వామిరెడ్డి కుమారుడు రాజేష్‌కు, చిన్నదామరగుంటకు చెందిన మునికృష్ణారెడ్డి కుమార్తె శైలజతో శుక్రవారం పెళ్లి జరిగింది. రాజేష్... వి.కోట మండలం ఆదినపల్లెలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తుండగా.... శైలజ ఎంబీయే సెకండ్ ఇయర్ చదువుతోంది. శుక్రవారం ఉదయం జీడీ నెల్లూరు మండలం కొత్తపల్లిమిట్ట కళ్యాణమండపంలో వైభవంగా శైలజ పెళ్లి ఘనంగా జరిగింది. పెళ్లి తరువాత... కాణిపాకం వెళ్లి నవదంపతులు దేవుడిని దర్శించుకున్నారు. అనంతరం పెద్దదామరగుంటలోని వధువు ఇంట శుక్రవారం మొదటిరాత్రి ఏర్పాటు చేశారు. అయితే రాజేష్ సంసార జీవితానికి పనికిరాడని తెలుసుకున్న శైలజ కాస్సేపటి తర్వాత బయటకు వచ్చేసింది. తల్లితండ్రులకు విషయాన్ని వివరించింది. అయినా తల్లితండ్రులు నచ్చజెప్పారు. తిరిగి గదిలోకి ఆమెను పంపారు. జీవితానికి పనికిరాననే విషయాన్ని తల్లితండ్రులకు చెప్పిందనే కోపంతో రాజేష్ రాక్షసంగా ప్రవర్తించాడు. నవ వధువును విచక్షణా రహితంగా కొట్టాడు. అంతేగాకుండా పంటితో విపరీతంగా కొరికి గాయపరిచాడు. నోట్లో గుడ్డలు కుక్కి కళ్లు, ముఖం వాచేలా చిత్రహింసలకు గురిచేశాడు. భర్త దెబ్బలు తట్టుకోలేక.. శైలజ కేకలు వేయటంతో ఆమె తండ్రి కంగారుపడిపోయాడు. గది తలుపులు తీయాలంటూ చెప్పాడు. దీంతో గది తలుపులు తీసిన భర్త రాజేష్.... శైలజ తండ్రిని చూసి అక్కడి నుంచి పారిపోయాడు. మొదటిరాత్రి రోజే.. అల్లుడి శాడిజాన్ని చూసిన శైలజ తల్లిదండ్రులు గంగాధరనెల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని, రాజేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. కాగా పెళ్లి నిమిత్తం రూ. 20లక్షల వరకూ కట్నకానుకలు ముట్టజెప్పినట్టు తెలిసింది. తనపై జరిగిన దారుణ ఘటనను తలచుకుని శైలజ భయంతో వణికిపోతోంది. కావాలనే రాజేష్ తనపై దాడి ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు ఆమె కన్నీటిపర్యంతమైంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తొలిరాత్రే భార్యకు నరకం చూపించాడు..
-
స్టార్ స్టార్ సూపర్ స్టార్ - ఎస్పీ శైలజ
-
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
-
అల్లరి చేస్తున్నాడని చిన్నారికి వాతలు
కృష్ణా: అల్లరి చేస్తున్నాడన్న కోపంతో వాళ్ల పెద్దమ్మ ఓ చిన్నారికి వాతలు పెట్టింది. యనమనలకుదురు ప్రియదర్శినినగర్‌కు చెందిన కోవెల ప్రభు, శైలజ దంపతులకు రాజ్‌కుమార్(6), శివకుమార్(4) ఉన్నారు. నాలుగురోజుల క్రితం ఊరెళుతూ రాజ్‌కుమార్‌ను ఇంటి పక్కనే ఉండే మేడే భవానికి అప్పజెప్పి వెళ్లింది. మంగళవారం రాజ్‌కుమార్ అల్లరి ఎక్కువగా చేస్తుండటంతో విసుగు చెందిన భవాని గరిట కాల్చి చేతులు, కాళ్లపై వాతలు పెట్టింది. ఊరు నుంచి వచ్చిన తర్వాత బిడ్డకు గాయాలైనా పట్టించుకోకుండా వదిలేసింది శైలజ. కాగా, కాలిన గాయాలతో స్ధానిక అంగన్వాడీ కేంద్రానికి మంగళవారం ఉదయం బాలుడు వచ్చాడు. బాలుడి శరీరంపై ఉన్న గాయాలను చూసిన అంగన్వాటీ కార్యకర్త ఏమైందని ప్రశ్నించగా.. జరిగిన విషయాన్ని చెప్పాడు. దీంతో బాలుడిని హింసించిన ఘటనను నవజీవన్ బాల భవన్ కార్యకర్తల దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే అంగన్వాడీ కేంద్రానికి చేరుకున్న బాలుడిని ఆసుపత్రికి తరలించారు. బాలుడి తల్లి శైలజ, పెద్దమ్మ భవానీలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పిల్లలపై ప్రేమలేని శైలజ వారి ఆలనాపాలనలను చూడటం మానేసింది. గతంలో ఓ సారి పిల్లలను వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది శైలజ. దీంతో విజయవాడ చైల్డ్‌లైన్ నిర్వాహకులు పిల్లల్ని తీసుకువెళ్లి సంరక్షించారు. కొంతకాలం తర్వాత తిరిగి వచ్చి పిల్లల్ని తీసుకుని వెళ్లినట్లు తెలిసింది. కేసును విచారించిన పోలీసులు శైలజ, భవానీలను అదుపులోకి తీసుకున్నారు. -
చెట్టు కూలి ఇద్దరి మృతి
మైసూరు : మైసూరులో ప్రసిద్ధి చెందిన కోటె మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న భారీ రావి చెట్టు ఆలయంపై కుప్పకూలి పోవడంతో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందగా మరి కొందరు గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతులు శైలజ (35), సుశీలమ్మ (60)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... దేవాలయంలో మధ్యాహ్నం అమ్మవారికి పూజలు చేస్తుండగా ఒక్కసారిగా చెట్టు మొత్తం ఆలయంపై వాలిపోయింది. దీంతో ప్రాణభయంతో భక్తులు పరుగులు తీశారు. అక్కడే పూజలు చేస్తున్న శైలజ, సుశీలమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి విగ్రహం తప్ప దేవాలయంలో అన్ని వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయని అర్చకులు తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్, ఎమ్మెల్యే వాసు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. అంతకు ముందు మహారాణి ప్రమోదాదేవి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
నేను జయలలిత చెల్లిని..
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన అక్కని చెబుతూ సుమారు 60 ఏళ్ల శైలజ గురువారం బెంగళూరులో ఓ కన్నడ న్యూస్ ఛానెల్లో సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. తానెలా నిరాదరణకు గురైంది చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శైలజ చెబుతున్న ప్రకారం..‘అలనాటి నటి సంధ్యారాణి, జయరామన్ దంపతులకు ముగ్గురు సంతానం. జయలలిత పెద్ద కుమార్తె కాగా, నేను, జయకుమార్ మిగిలిన బిడ్డలం. నేను మూడో నెల గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. నేను జన్మించాక అప్పటి ప్రఖ్యాత కళాకారుడు దామోదర్ పిళైకి దత్తత ఇచ్చారు. సంధ్యారాణి అసలు పేరు వేదమ్మ. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. మైసూరు సంస్థానాధీశుల ఆశీస్సులతో ఆమె చిత్ర రంగంలోకి ప్రవేశించింది. నేను బెంగళూరులో ఉన్న విషయం అక్కకు తెలుసు. ఆమె అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటే, నేను పేదరికంలో మగ్గుతున్నాను’ అని శైలజ చెప్పుకొచ్చారు. -
నేను జయలలిత చెల్లిని..
టీడీ ఛానెల్ ఇంటర్వ్యూలో శైలజ సాక్షి ప్రతినిధి, బెంగళూరు: తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తన అక్కని చెబుతూ సుమారు 60 ఏళ్ల శైలజ గురువారం బెంగళూరులో ఓ కన్నడ న్యూస్ ఛానెల్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. తానెలా నిరాదరణకు గురైంది చెబుతూ కన్నీటి పర్యంతమయ్యారు. శైలజ చెబుతున్న ప్రకారం..‘అలనాటి నటి సంధ్యారాణి, జయరామన్ దంపతులకు ముగ్గురు సంతానం. జయలలిత పెద్ద కుమార్తె కాగా, నేను, జయకుమార్ మిగిలిన బిడ్డలం. నేను మూడో నెల గర్భంలో ఉన్నప్పుడే తండ్రి చనిపోయాడు. నన్ను అప్పటి ప్రఖ్యాత కళాకారుడు దామోదర్ పిళైకి దత్తత ఇచ్చారు. సంధ్యారాణి అసలు పేరు వేదమ్మ. స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా. నేను బెంగళూరులో ఉన్న విషయం అక్కకు తెలుసు. ఆమె అష్టైశ్వర్యాలతో తులతూగుతుంటే, నేను పేదరికంలో మగ్గుతున్నాను’ -
ఆ ఒక్కరు ఎవరో..
జెడ్పీ చైర్పర్సన్ రేసులో ముగ్గురు సాక్షిప్రతినిధి, వరంగల్ : జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఎన్నిక దగ్గరపడుతోంది. మరో రెండు రోజుల్లో కొత్త చైర్పర్సన్ ఎవరనేది తేలిపోనుంది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ పదవి ఈసారి షెడ్యూల్ కులాల(ఎస్సీ) మహిళకు రిజర్వ అయింది. జిల్లాలో 50 జెడ్పీటీసీ స్థానాలు ఉండగా.. 9 స్థానాలను ఎస్సీలకు కేటాయించారు. వీటిలో ఐదు ఎస్సీ మహిళలకు రిజర్వ అయ్యాయి. ఎస్సీ మహిళకు రిజర్వు అయిన వాటిలో దేవరుప్పుల, కొడకండ్ల, గోవిందరావుపేట జెడ్పీటీసీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. నర్మెటలో టీఆర్ఎస్, రాయపర్తిలో టీడీపీ అభ్యర్థులు జెడ్పీటీసీలుగా గెలిచారు. ఎస్సీ జనరల్‌కు కేటాయించి న నెక్కొండ, పర్వతగిరి జెడ్పీటీసీలుగా ఈ వర్గానికి చెందిన మహిళా అభ్యర్థులే గెలిచారు. పర్వతగిరిలో టీఆర్ఎస్ అభ్యర్థి మాదాసి శైలజ, నెక్కొండలో కాంగ్రెస్‌కు చెందిన బక్కి కవిత జెడ్పీటీసీలుగా ఎన్నికయ్యారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ మ ధ్య పోటీ నెలకొంది. 24 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీ... సాధారణ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత నుంచీ క్యాంపు నిర్వహిస్తోంది. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నేతృత్వంలో జరుగుతున్న ఈ క్యాంపులో ఎస్సీ వర్గానికి చెందిన నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బక్కి కవిత, గోవిందరావుపేట జెడ్పీటీసీ సభ్యురాలు ఎన్.విజయలక్ష్మీ ఉన్నారు. దేవరుప్పుల, కొడకండ్ల జెడ్పీటీసీ సభ్యులు ఈ క్యాంపులో చేరలేదు. అరుుతే నర్సంపేట నియోజకవర్గంలోని నెక్కొండ జెడ్పీటీసీ సభ్యురాలు బి.కవితను కాంగ్రెస్ తమ జెడ్పీ చైర్ పర్సన్ అభ్యర్థిగా చెబుతోంది. కాంగ్రెస్ క్యాంపులో ప్రస్తుతం 24 మంది ఉన్నారని, ఇతర సభ్యుల మద్దతుతో జెడ్పీ పీఠం తామే దక్కించుకుంటామని ఈ పార్టీ నేతలు చెబుతున్నారు. టీఆర్ఎస్లో ఇద్దరు.. తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లాలో 18 జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకుంది. టీఆర్ఎస్ జెడ్పీటీసీ సభ్యులలో నర్మెట, పర్వతగిరి నుంచి గెలిచిన జెడ్పీటీసీ సభ్యులు చైర్ పర్సన్ పదవికి పోటీ పడుతున్నారు. ఎస్సీ జనరల్‌కు కేటాయించిన పర్వతగిరిలో మాదాసి శైలజ జెడ్పీటీసీ సభ్యురాలిగా గెలిచారు. 24 ఏళ్ల వయసులోనే ఈమె జెడ్పీటీసీగా గెలిచారు. పర్వతగిరి వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి సొంత మండలం కావడం.. శైలజకు చైర్పర్సన్ పద వి విషయంలో అనుకూలంగా మారింది. శైలజ భర్త మాదాసి సుధాకర్ టీఆర్ఎస్లో క్రియాశీలంగా పనిచేస్తున్నారు. ఏడాదిన్నర క్రితం వర్ధన్నపేట టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జీగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అరూరి రమేశ్‌కు సుధాకర్ దగ్గరయ్యారు. శైలజకు జెడ్పీ చైర్పర్సన్ పీఠం దక్కేలా చూసేందుకు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నా రు. వరంగల్ లోక్‌సభ సభ్యుడు కడియం శ్రీహరి, ముఖ్యమంత్రి కేసీఆర్ వ ద్ద చేసే ప్రయత్నాలతోనే శైలజకు జెడ్పీ పీఠం దక్కే అవకాశాలను ఉన్నాయ ని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. టీఆర్ఎస్ నుంచి జెడ్పీ చైర్పర్సన్ పీఠం కోసం నర్మెట్ట జెడ్పీటీసీ సభ్యురాలు గద్దల పద్మ కూడా పోటీలో ఉన్నా రు. పద్మ గతంలో ఎంపీటీసీగా కూడా పని చేశారు. పద్మ భర్త నర్సింగరావు టీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలో పని చేస్తున్నారు. జెడ్పీ చైర్పర్సన్ పదవి తన నియోజకవర్గానికి దక్కేలా జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి టీఆర్ఎస్ అధినేత వద్ద తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చైర్ పర్సన్ పదవి కోసం పోటీ పడేవారు ఇద్దరు ఉండడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీఆర్ఎస్ క్యాం పులో ప్రస్తుతం 25 మంది జెడ్పీటీసీ సభ్యులు ఉన్నారని, మరో ముగ్గురు కాంగ్రెస్ సభ్యులు మద్దతు ఇస్తారని గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు. విప్ పత్రాలను అందజేసిన కాంగ్రెస్ జిల్లా పరిషత్ : జిల్లాలోని ఎంపీపీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు విప్ జారీ చేసే అధికారం జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డికి ఇస్తూ తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఉత్తర్వులు జారీ చేశారు. విప్ అధికారం కల్పిస్తూ జారీ చేసిన పత్రాలను కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు జయప్రకాశ్, యువజన కాంగ్రెస్ నాయకుడు ఈవీ.శ్రీనివాస్‌రావు బుధవారం జెడ్పీ ఇంచార్జ్ సీఈఓ వెంకటేశ్వర్లుకు అందించారు. -
తపాలా: సెండాఫ్ పార్టీ
నేను ప్రస్తుతం ఒక గృహిణిని. చాలా యేళ్ల క్రితం ఒక ఆఫీస్‌లో జాబ్ చేసేదాన్ని. అప్పట్లో మా డిపార్ట్మెంట్లో నేనొక్కదాన్నే అమ్మాయిని. మిగిలినవాళ్లంతా అబ్బాయిలే. ఎవరితో మాట్లాడాలన్నా, ఏది అడగాలన్నా మొదట్లో చాలా ఇబ్బందిగా ఉండేది. నాతో పాటు వేరే డిపార్ట్మెంట్లో అమ్మాయి ట్రైనింగ్ పీరియడ్‌లో ఫ్రెండ్ అయింది. ఇక లంచ్ టైమ్‌లో వాళ్లతో పాటు లంచ్ చేసేదాన్ని. వాళ్లలో చాలామంది అమ్మాయిలున్నారు. వాళ్లు కూడా ఫ్రెండ్సయ్యారు. టీ బ్రేక్‌లో, లంచ్ టైమ్‌లో బాగా ఎంజాయ్ చేసేవాళ్లం. రాను రాను మా డిపార్ట్మెంట్ కొలీగ్స్ కూడా క్లోజయ్యారు. మాదే చివరి పెద్ద హాల్. అందులోనే ప్రతి డిపార్ట్మెంట్ సపరేట్గా ఉండేవారు. మాది మూలన కావటంతో బాగా అల్లరి చేసేవాళ్లం. అస్సలు ఆఫీస్‌కి వెళ్లినట్టు ఉండేది కాదు. కాలేజ్‌లో ఎంజాయ్ చేస్తున్నట్టుండేది. కాకపోతే అక్కడ వర్క్ ప్రజర్ ఎక్కువగా ఉండేది. టార్గెట్స్ రీచ్ అవ్వాలి. అలాగే ఓటీలు కూడా చేయాల్సి వస్తుంటే, మాకు మాత్రం ఫుల్‌గా జోక్స్ వేసుకుంటూ జాలీగా వర్క్ చేసేవాళ్లం. నా పక్క సీట్లో ముస్లిం అబ్బాయి, ఇద్దరు హిందువులు, నేను క్రిస్టియన్. నలుగురం ఒకే వరుసలో కూర్చునేవాళ్లం. ప్రతిదీ పంచుకునేవాళ్లం. ఇంక మా డిపార్ట్‌మెంట్‌వాళ్లు సీనియర్స్. వాళ్లతో పాటే ఆఫీస్ స్టార్ట్ అయింది. బర్త్‌డే పార్టీస్‌కి కంపల్సరీగా ఎక్కడికైనా రెస్టారెంట్లోనో, బేకరీలోనో పార్టీ చేసుకునేవాళ్లం. అది చాలా హ్యాపీగా జరిగేది. ప్రతి శనివారం కలర్ఫుల్గా వెళ్లేవాళ్లం. నా పక్క ముస్లిం అబ్బాయి రంజాన్‌కి రోజా ఉండేవాడు. నేను హలీమ్ అడిగితే, పిస్తా హౌస్‌కి రమ్మని ఎగ్గొట్టేవాడు. ‘నువ్వు చాలా పిసినారి’వని మేం తనని వెక్కిరించేవాళ్లం. అయితే మార్చి 2005లో అనుకుంటా, ఏదో పనిమీద మా మేనేజర్ రూమ్‌కి వెళ్లా. అందరూ చూశారు. ‘ఎందుకెళ్లావు?’ అంటే రిజైన్ లెటర్ ఇవ్వడానికి అని చెప్పా. అందరూ షాకయ్యారు. ‘ఎందు’కని అడిగారు. ‘ఏమో రిజైన్ చేయాలనిపించి ఇచ్చా’ అని చెప్పాను. ఒక నెల ముందు లెటర్ ఇవ్వాలి. సో! అలా అందరూ కొంచెం అప్సెట్ అయ్యారు. నేను అందరినీ బాగా ఆటపట్టించేదాన్ని. అలా రోజులు గడుస్తున్నాయి. ‘నా చివరి రోజు మార్చి 31’ అని చెప్పా. అందరూ అలాగే అనుకున్నారు. అయితే వేరే డిపార్ట్మెంట్లో అమ్మాయి ఈ ముస్లిం అబ్బాయి కొంచెం క్లోజయ్యారు. సెండాఫ్ పార్టీ వాళ్లు 31న అని చెప్పారు. సరే, అదే నాకు ఆఖరి రోజు. మార్చి 31న ఆఫీస్ అయిపోయాక, వాళ్లు నాకు బేకరీలో పార్టీ ఇచ్చారు. పార్టీ అయ్యాక, గుడ్‌బై చెప్పి ఇంటికెళ్లిపోయా. తెల్లారి ఉదయం ఏప్రిల్ ఫస్టున అందరికంటే ముందెళ్లి చివరి వరుస సీట్లో కూర్చున్నా. అందరూ షాక్. ‘ఏంటీ నిన్నే నీకు చివరిరోజు కదా’ అన్నారు. వాళ్లందర్నీ నేను ఏప్రిల్ ఫూల్ చేసినట్టు తెలిసి, తెగ ఫీలయ్యారు. - శైలజ, మల్కాజ్గిరి, హైదరాబాద్ చంద్రముఖి నక్షత్రం! నా పేరు భారతి. మా ఊరు గుంటూరు జిల్లా భట్టిప్రోలు పరిధిలోని ఓలేరు. మా బాబు పేరు మాధవ్. అల్లరిలో ‘అరవీర భయంకర చిచ్చర పిడుగు’ అనే బిరుదాంకితుడు. ఇప్పుడు ఫస్ట్ క్లాస్ చదువుతున్నాడు. వాడు ఏదో ఒక అల్లరిపని చేస్తూనేవుంటాడు. ఏ పనీ లేకపోతే ఆవుదూడ పలుపు ఊడదీసి, దానితో సమానంగా పరుగెడుతూ ఉంటాడు. వాడికి మూడేళ్లు ఉన్నప్పుడు అనుకుంటా. ఓ రోజు రాత్రిపూట ఎత్తుకొని తిప్పుతూ అన్నం తినిపించే ప్రయత్నంలో ఉన్నాను. ‘‘ఒరేయ్ మాధవా! అదిగో ఆకాశంలో చందమామ దగ్గరలో బ్రైట్‌గా కనిపిస్తోందే... దాన్ని ‘అరుంధతి’ నక్షత్రం అంటారు నాన్నా’’ అని చెప్పాను. దానికి వాడు సమాధానంగా, ‘‘అమ్మా! దాని పక్కన ఇంకోటి బ్లైట్గా ఉందే, మరి అది ‘చంద్రముఖి’ నక్షత్రమా?’’అని అడిగాడు. వాడి సినిమా పరిజ్ఞానం అలా ఉంది మరి! - ఎన్.భారతీకిషోర్ ఓలేరు ఇది మీ కోసం పెట్టిన పేజీ. మీ అనుభవాలు, అనుభూతులు, ఆలోచింపజేసిన సంఘటనలు, మీ ఊరు విశేషాలు, మీ పిల్లల ముద్దుమాటలు, వారి అల్లరి చేష్టలు... అవీ ఇవీ అని లేదు, ఏవైనా మాకు రాసి పంపండి. మా చిరునామా: తపాలా, ఫన్డే, సాక్షి తెలుగు దినపత్రిక, 6-3-249/1, రోడ్ నం.1, బంజారాహిల్స్, హైదరాబాద్ - 34. funday.sakshi@gmail.com -
డిసెంబర్ నుంచి ఇందిరమ్మ హస్తం ప్రారంభం
జోగిపేట, న్యూస్‌లైన్: జిల్లాలో కొత్తగా మూడు ప్రాజెక్టుల పరిధిలో ఇందిరమ్మ అమృత హస్తం పథకాన్ని డిసెంబర్ 1నుంచి ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు డెరైక్టర్ శైలజ తెలిపారు. శుక్రవారం జోగిపేటలో నిర్వహించిన అంగన్వాడీ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ మొదటి విడతగా జిల్లాలో ఐదు ప్రాజె క్టుల పరిధిలో ఈ పథకాన్ని కొనసాగిస్తూ రెండో విడతగా జోగిపేట, దుబ్బాక, గజ్వేల్ ప్రాజెక్టుల్లో ప్రారంభిస్తున్నామని తెలిపారు. జిల్లాలో సిద్దిపేట, పటాన్చెరు, సదాశివపేట ప్రాజెక్టుల్లో ఈ పథకం ప్రారంభం కాలేదన్నారు. గతంలో బాలింతలు, గర్భిణుల ఇళ్లకు వెళ్లి పౌష్టికాహారాన్ని పంపిణీ చేసేవారమని, అలా పంపిణీ చేయడం వల్ల పారదర్శకత లోపిస్తోందని భావించి ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లోనే వారికి వండి పెడతామని నెలకు 25 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అంగన్వాడీ టీచర్లు నిర్వహిస్తారన్నారు. ఐకేపీ వారు పాలు, కూరగాయలు, పోపు సామాన్లు సరఫరా చేస్తారని వీటికి గాను ఐసీడీఎస్ తరఫున డబ్బులను వారి ఖాతాల్లో వేస్తామన్నారు. కందిపప్పు, బియ్యం, ఆయిల్, గుడ్లు ఐసీడీఎస్ తరఫున పంపిణీ చేస్తామన్నారు. శిశుమరణాలు తగ్గించేందుకు పుట్టిన బిడ్డ బరువు పెంచేందుకు, రక్త హీనతను తగ్గించేందుకు ఈ పథకం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి ఐసీడీఎస్ సీడీపీఓ ఎల్లయ్య అధ్యక్షత వహించారు. ప్రాజెక్టు పరిధిలో బాలామృతం పథకం ఏడు నెలల నుంచి 3 సంవత్సరాలలోపు పిల్లలకు ప్రతినెల బాలామృతం పథకం క్రింద రెండున్నర కిలోల పోషక పదార్థాల పాకెట్‌ను పంపిణీ చేస్తామని ప్రాజెక్టు అధికారి ఎల్లయ్య తెలిపారు. ప్రతి రోజు 20 గ్రాముల చొప్పున దీనిని పిల్లలకు పట్టించాల్సి ఉంటుందన్నారు. ఏపీ ఫుడ్ పంపిణీ చేసే మాడిఫైడ్ థెరఫ్యూటిక్ ఫుడ్‌ను డిసెంబర్ 1నుంచి ప్రాజెక్టు పరిధిలోని పిల్లలకు అందించనున్నట్లు తెలిపారు. -
అధికారులవల్లే ప్రభుత్వ పథకాలు విఫలం
తొగుట,న్యూస్‌లైన్: ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇందిరమ్మ పచ్చతోరణం కింద చెట్టూ పట్టా కార్యక్రమాన్ని అమలు చేస్తే ఎన్ఆర్ఈజీఎస్ అధికారుల నిర్లక్ష్యం మూలంగా లక్ష్యం నెరవేరకుండా పోతోందని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే చెరుకు ముత్యంరెడ్డి పథకం నిర్వహణ ప్రత్యేక కమిషనర్ సైదులు దృష్టికి తీసుకవచ్చారు. మండలంలోని తుక్కాపూర్ కాశితుర్క కాలనీలో, ఎల్లారెడ్డిపేటలో పథకంలో చేపట్టిన పనులను సోమవారం కమిషనర్ సైదులుతో కలిసి ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ముత్యంరెడ్డి మాట్లాడుతూ పథకం కింద చేపడుతున్న పనులను పరిశీలించడానికి కనీసం రెండు నెలలకు ఒకసారైనా ఏపీడీ ఏగొండస్వామి రావడం లేదని ఫిర్యాదు చేశారు. ఏపీఓ శైలజ తీరు మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా మార్పు రావడం లేదని ఎమ్మెల్యే ముత్యంరెడ్డి పేర్కొన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో నిర్మించుకున్న వ్యక్తిగత మరుగుదొడ్ల బిల్లులను సకాలంలో చెల్లించక పోవడంతో గ్రామాల్లో చాలా మంది ముందుకు రావడం లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా రోడ్లవెంట మొక్కలు నాటే పథకానికి సీఎం కిరణ్‌తో మాట్లాడి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించుకున్నామన్నారు. ఫలితంగా కాలుష్య నివారణతో పాటు, ప్రయాణికులకు అహ్లాదకరమైన వాతావరణం అందించటంతోపాటు వలసల నివారణకు ఈ పథకం ఎంతో దోహదపడుతుందన్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా నాటిన మొక్కల్లో సగం కూడా దక్కకుండా పోతున్నాయన్నారు. ప్రత్యేక కమిషనర్ సైదులు మాట్లాడుతూ ఇందిరమ్మ పచ్చతోరణం పథక నిర్వహణ విషయంలో నిర్లక్ష్య వైఖరి అవలంబించే అధికారులు ఎంతటి హోదాలో ఉన్న ఉపేక్షించేదిలేదని హెచ్చరించారు. వారం రోజుల్లో మండలంలో మళ్లీ పర్యటిస్తానని ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని ఈజీఎస్ అధికారులను హెచ్చరించారు. పర్యావరణ పరిశుభ్రత కోసం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలకు ముందుగా సొంత డబ్బులు ఖర్చు చేసి నిర్మాణాలు చేయిస్తున్న తుక్కాపూర్ సర్పంచ్ చెరుకు విజయ్‌రెడ్డిని కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ మధుసూదన్, తహశీల్దార్ నజీబ్ అహ్మద్, సీఐ అశోక్‌బాబు, సర్పంచ్ బుర్ర అనితా నర్సింలుగౌడ్, డీసీసీ కార్యదర్శి గాంధారి నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ‘చెట్టు పట్టా’ అమలులో జిల్లా వెనుకంజ మిరుదొడ్డి: చెట్టు పట్టా కార్యక్రమం అమలులో దుబ్బాక నియోజక వర్గం వెనుకంజలో ఉందని ఇందిరమ్మ పచ్చతోరణం జిల్లా జాయింట్ కమిషనర్ సైదులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మిరుదొడ్డి మండల పరిధిలోని అల్వాలలో సోమవారం చెట్టు పట్టా కార్యక్రమాన్ని దుబ్బాక ఎమ్మెల్యే ముత్యంరెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం మిరుదొడ్డి ఎంపీడీఓ కార్యలయంలో ఈజీఎస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెట్టు పట్టా కార్యక్రమం విజయవంతం కావడానికి ఈజీఎస్ అధికారులు కృషి చేయాలన్నారు. పథకంపై సర్పంచ్‌లకు అవగాహన కల్పించి విజయవంతం చేయాలన్నారు. రాష్ట్రంలో 18 లక్షల మొక్కలను ఈజీఎస్ ద్వారా పంపిణీ చేశామన్నారు. చెట్టు పట్టా కార్యక్రమంలో పని చేసిన కూలీలకు 3 నెలలుగా డబ్బులు చెల్లించడంలో నిర్లక్ష్యం ఎందుకని ఏపీడీ శ్రీనివాస్‌ను ప్రశ్నించారు. నియోజక వర్గంలో చెట్టు పట్టా పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి అధికారులు చొరవ చూపాలన్నారు. ఎమ్మెల్యే ముత్యంరెడ్డి మాట్లాడుతూ చెట్టు పట్టా పథకం ద్వారా పర్యావరణంతో పాటు బడగు బలహీన వార్గాలకు ఉపాధి లభిస్తుందన్నారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ కొంగరి రాజయ్య, మిరుదొడ్డి ఏఎంసీ చైర్మన్ నేరండ్ల భూమాగౌడ్, మాజీ ఎంపీపీ నమిలె భాస్కరాచారి వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
శైలజా రాగం
-
వివాహిత ఆత్మహత్య
అట్లూరు, న్యూస్‌లైన్ : కడుపునొప్పి తాళలేక అట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన శైలజ(20) మంగళవారం మధ్యాహ్నం ఉరేసుకుని మృతి చెందింది. స్థానిక ఎస్ఐ బొజ్జప్ప వివరాల మేరకు.. అట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన ఈరి మురళి, గోపాలమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. మూడేళ్ల క్రితం మురళి మృతి చెందారు. ఆరు నెలల క్రితం రెండవ కుమార్తె శైలజను చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం ఆంజనేయపురానికి చెందిన వెంకటసుబ్బయ్యకు ఇచ్చి వివాహం చేశారు. అనంతరం గోపాలమ్మ బతుకు దెరువు నిమిత్తం కువైట్‌కు వెళ్లింది. ఒక నెల రోజులపాటు భార్యభర్తలు కలసి ఉన్నా మళ్లీ శైలజ పుట్టింటికి వచ్చింది. నాలుగు నెలలక్రితం కడుపు నొప్పి అని ఆత్మహత్య చేసుకోబోగా బంధువులు రక్షించారు. కాగా మంగళవారం మధ్యాహ్నం కడుపు నొప్పి అధికంకావడంతో ఇంట్లో ఎవరూలేని సమయంలో ఇంటి దూలానికి చున్నీతో ఉరివేసుకుని మృతి చెందినట్లు మృతురాలి అన్న మాదవ తెలిపినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నట్లు ఆయన తెలిపారు.