చెట్టు కూలి ఇద్దరి మృతి | Two members are killed in tree crash | Sakshi
Sakshi News home page

చెట్టు కూలి ఇద్దరి మృతి

Published Wed, Sep 17 2014 4:13 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

చెట్టు కూలి ఇద్దరి మృతి

చెట్టు కూలి ఇద్దరి మృతి

మైసూరు :  మైసూరులో ప్రసిద్ధి చెందిన కోటె మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న భారీ రావి చెట్టు ఆలయంపై కుప్పకూలి పోవడంతో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందగా మరి కొందరు గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతులు శైలజ (35), సుశీలమ్మ (60)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... దేవాలయంలో మధ్యాహ్నం అమ్మవారికి పూజలు చేస్తుండగా ఒక్కసారిగా చెట్టు మొత్తం ఆలయంపై వాలిపోయింది. దీంతో ప్రాణభయంతో భక్తులు పరుగులు తీశారు.

అక్కడే పూజలు చేస్తున్న శైలజ, సుశీలమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి విగ్రహం తప్ప దేవాలయంలో అన్ని వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయని అర్చకులు తెలిపారు. జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్, ఎమ్మెల్యే వాసు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. అంతకు ముందు మహారాణి ప్రమోదాదేవి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement