Birch tree
-
ఎండిన ఆకులకు జీవ'కళ'
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): చెట్ల నుంచి రాలిన ఆకులు వాడిపోయి ఎండిపోతాయి. కొన్నాళ్లకు కుళ్లిపోతాయి. ప్రకృతిలో నిత్యం మనం చూసే తంతే. కానీ..లీఫ్ ఆర్టిస్ట్ శ్రావణ్ చేతిలో ఆ ఎండిన ఆకులే జీవం పోసుకుంటాయి. కళాఖండాలై చిగురిస్తాయి. నిత్య నూతనత్వాన్ని సంతరించుకుంటాయి. శాశ్వతమై నిలిచిపోతాయి. రావి చెట్టు ఆకుల అస్థిపంజరాల (లీఫ్ స్కెలిటన్‌పై) చూడచక్కని బొమ్మలు గీస్తూ అరుదైన ఈ కళ (లీఫ్ఆర్ట్)ను పోషిస్తున్నాడు విజయవాడ నగరానికి చెందిన శ్రావణ్. లీఫ్ ఆర్ట్.. రావి చెట్టు పచ్చి ఆకులను సేకరించాలి. వాటిని కొద్దిరోజులపాటు నీటిలో నానబెట్టాలి. బాగా నాని కుళ్లిన తర్వాత ఆకు ఈనెలపై ఉండే గుజ్జును సున్నితంగా బ్రష్‌తో తొలగించాలి. ఆకుపై గుజ్జును పూర్తిగా తొలగించిన తర్వాత అది స్కెలిటన్గా (అస్థిపంజరం) మారుతుంది. దానిని పేపర్ల మధ్య పెట్టి డ్రై చేయాలి. అలా డ్రై చేసిన తరువాత ఏర్పడే ‘లీఫ్ స్కెలిటన్’ ఉల్లిపొరలా పలుచగా తయారవుతుంది. వాటిపై అందమైన బొమ్మలను గీయడం ‘లీఫ్ ఆర్ట్. రావి చెట్టు ఆకు స్కెలిటన్‌పై డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రం ఆకు స్కెలిటన్‌పై మహాత్మాగాం«ధీ, స్వామి వివేకానంద, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, మదర్‌థెరిసా, ఛత్రపతి శివాజీ, పొట్టి శ్రీరాములు, ఏపీజే అబ్దుల్ కలాం, మహానేత వైఎస్సార్, సీఎం వైఎస్ జగన్ చిత్రాలు గీశాడు శ్రావణ్. రాజకీయ నాయకులు, దేవతలు, సినీ తారలే కాకుండా వ్యక్తులు కూడా తమ బొమ్మలను ఆకులపై గీయించుకుని ఫ్రేమ్ తయారు చేయించి భద్రపరుచుకుంటున్నారు. స్కూల్ విద్యార్థులకు శిక్షణ ఇస్తా.. ఆకులను పుస్తకాల మధ్యలో పెట్టి కొన్నాళ్ల తర్వాత తీస్తే వాటిలో పత్రహరితం పోయి ఎండిపోయి కనిపించేవి. అలా ఓ చిన్న పాప చేయడం చూసి వీటిపై బొమ్మలు గీస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అప్పటి నుంచి బొమ్మలు గీయడం స్టార్ట్ చేశాను. లీఫ్ స్కెలిటన్ ఆర్ట్ చేస్తే బాగుంటుందని భావించి ఇలా చేస్తున్నా. నాకు తెలిసిన ఈ కళను మళ్లీ ప్రాచుర్యంలోకి తేవాలని పట్టుదలతో పనిచేస్తున్నా. తెలిసిన కళను చిన్నారులకు నేర్పిస్తున్నా. ఆసక్తి ఉన్న పిల్లలకు ప్రస్తుతం ఉచితంగా శిక్షణనిస్తున్నా. ఈ కళలో అద్భుతాలు సృష్టించి ఆర్ట్ గ్యాలరీ ఏర్పాటు చేయలనేది నా కల. – ఇట్టా శ్రావణ్, లీఫ్ ఆర్టిస్ట్ పర్యావరణ హితం.. లీఫ్ ఆర్ట్ చేయాలంటే ఎంతో ఓపిక కావాలి. అంతకంటే ఎక్కువ నైపుణ్యం ఉండాలి. ఉల్లిపొరలా పలుచగా, సున్నితంగా తయారైన లీఫ్ స్కెలిటన్‌ను జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. ఏ మాత్రం అటుఇటైనా ఆకు చిరిగిపోతుంది. పైగా పెన్నుతో ఆర్ట్ వేయాల్సి ఉంటుంది. బొమ్మ వేయడం ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ఏకాగ్రత ఉండాలి. ఈ కళలో శ్రావణ్ అద్భుతాలు సృష్టిస్తున్నాడు. – శ్రీనివాస్, స్ఫూర్తి క్రియేటివ్ ఆర్ట్స్ -
రావి చెట్టుకు ‘చంద్ర’ గ్రహణం
సాక్షి, అనంతపురం: కరువు.. చంద్రబాబు.. కవలలు అనేది నిజమనే విషయం మరోసారి నిరూపితమైంది. 2018 ఆగస్టు నెలలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాప్తాడు నియోజకవర్గం లోని పేరూరు డ్యాంను సందర్శించారు. అక్కడి ఓ రావి చెట్టు కింద కూర్చొని గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహించారు. రెండేళ్లు గడిచేసరికి ఆ గ్రామం అంతా పచ్చగా ఉన్నా.. చంద్ర బాబు సేదతీరిన ఆ రావి చెట్టు మాత్రం పూర్తిగా ఎండిపోయింది. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఎటుచూసినా పచ్చని ప్రకృతి పురివిప్పి ఆడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ ఆ ఒక్క చెట్టు మాత్రమే మోడువారి కనిపిస్తుండటం చూస్తే చంద్రబాబు కాలు మోపితే ఇంతేనంటూ స్థానికులు చర్చించుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అనంతపురం: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యావ్యవస్థను నిర్వీర్యం చేశారని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఎస్కేయూ అధ్యక్షుడు రాధాకృష్ణ యాదవ్ విమర్శించారు. ఎస్కేయూలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రభుత్వం వీసీల నియామకాల్లో అన్ని సామాజిక వర్గాల వారికి అవకాశం కల్పించిందన్నారు. రూ.1000 కోట్ల విలువైన భూముల్ని అప్పనంగా గీతం వర్సిటీకి అప్పగించిన ఘనత చంద్రబాబు నాయుడిదని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్ధి విభాగం నాయకులు క్రాంతి కిరణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
స్నానం.. దానం.. దీపం.. ఉపవాసం...
నెలంతా.. పండగే తెలుగు మాసాలలో విశిష్టమైనది కార్తీకమాసం. ముఖ్యంగా కైలాస నిలయుడైన పరమశివునికి ప్రీతిపాత్రం ఇది. ఆధ్యాత్మికపరంగా ఆరోగ్యప్రదమైన మాసం. ఈ మాసంలో సోమవారంనాడు ఉపవాసం చేసి, రాత్రి నక్షత్ర దర్శనం చేసి భోజనం చేస్తారు. తద్వారా అష్టైశ్వర్యప్రాప్తి కలుగుతుందని ‘ధర్మసింధువు’ గ్రంథం తెలుపుతున్నది. ఈ మాసంలో ప్రతిరోజూ పర్వదినమే! అయినప్పటికీ కొన్ని ముఖ్యమైన పర్వదినాలు మరింత ఫలప్రదమైనవి. అవే భగినీ హస్తభోజనం, నాగులచవితి, నాగపంచమి, ఉత్థాన ఏకాదశి, క్షీరాబ్ధి ద్వాదశి, కార్తీక పౌర్ణమి మొదలైనవి. ఆధ్యాత్మిక ఆరోగ్యవాసం: పగలంతా ఉపవాసం చేసి సాయంత్రం శివాలయానికి వెళ్లి శివ దర్శనం చేసి - శిఖరం లేక గోపుర ద్వారం వద్ద నేతితో గానీ, మంచి నూనెతోగానీ - ఇప్ప - నారింజ నూనెతో గానీ దీపారాధన చేయాలి. శివారాధన ముఖ్యమైనది. ఈ మాసంలో పగటి పూట వేడి - రాత్రి చల్లదనం ఉంటాయి. వాత-పైత్య-శ్లేష్మాలు వస్తాయి. అందువలన ఒక్క పొద్దు భోజనం శ్రేష్ఠం. వీటిని చాదస్తంగా భావించక ఆరోగ్యపరంగా ఆలోచించాలి. దీర్ఘవ్యాధుల నివారణలో ఉపవాసం తిరుగులేని మందు. మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికరంగా ఆలోచనలో, ఆవేశాలపరంగా సమతౌల్యం సాధించడానికి ఉపవాస నిర్ణయం ఎంతో గొప్పది. ఉపవాసంలో స్వల్పంగా ఆహారం-నీరు-తీసుకుంటే మనస్సు స్థిరంగా ఉంటుంది. దైవం పట్ల స్థిరచిత్తం ఏర్పడుతుంది. ‘ఉప’ అంటే దగ్గరలో, వాసం అంటే ఉండడం అంటే భగవంతునికి దగ్గరగా ఉండడం, సాత్త్వికాహారం, మితాహారం-దైవార్పితం చేసి తీసుకోవాలి. న్యాయార్జితాహారం పొందాలని శాస్త్రం. వృద్ధులకు, రోగులకు మినహాయింపు: వృద్ధులు - మానసిక - మెదడు వ్యాధిగ్రస్థులు - గర్భిణులు- క్షయరోగులు - మధుమేహగ్రస్థులు - క్రీడాకారులు ఉపవాసం చేయరాదు. శాస్త్రప్రకారం వారికి మినహాయింపు ఉంది. శరదృతువు ఇది. బ్రాహ్మీ ముహూర్తంలో నదీ స్నానం చేస్తే మంచిది. ప్రవాహస్నానం పవిత్రం. దైవధ్యానం జపం - గ్రంథపఠనం - పురాణాలు చదవడం - వినడం చేయాలి. వృక్షారాధనం విశేషం: అశ్వత్థం విష్ణురూపం - వటవృక్షం రుద్రరూపం. పలాశ వృక్షం బ్రహ్మరూపం. అశ్వత్థ వృక్షాన్ని (రావి చెట్టును) ఆశ్రయించి ఉండమని విష్ణువు లక్ష్మీదేవిని ఆదేశించాడు. రావి చెట్టు శీతల గుణం కలిగి ఉంటుంది. పైత్య దోషాన్ని నివారిస్తుంది. స్త్రీలు ఈ మాసంలో తులసిని పూజించి దీపాలు వెలిగించాలి. తులసిమూలంలో సర్వతీర్థాలు - మధ్యకాండంలో దేవతలు - చివుళ్ళలో సర్వవేదాలూ ఉన్నాయని శాస్త్రవచనం. విష్ణు పత్ని తులసి మాత పూజ పాపాలను హరించి, ధర్మార్థ, కామమోక్షాలు కలిగిస్తుంది. దీపారాధనం.. మోక్షకరం: ఈ మాసం అంతా శివాలయాలలో ఆకాశ దీపాలు వెలిగించాలి. దీపదానం చేయాలి. నదీ ప్రవాహాలలో దీపాలు వెలిగించి వదలాలి. శివ కేశవుల ప్రీతి కోసం దీపదానం చేస్తే వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది. దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం దీపేనా సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే ॥ దీపారాధన చీకటిని తొలగించి వెలుగునిస్తుంది. జ్ఞానవ్యాప్తికి - వితరణకు సంకేతం. వాతావరణం తేమగా ఉండి క్రిమికీటకాలు వ్యాప్తి చెందుతాయి కాబట్టి, దీపం వెలిగించడం వల్ల అవి నశిస్తాయి. వాతావరణం శుభ్రం అవుతుంది. జ్ఞానాన్ని వితరణ చేయడం దీపదానంలోని విశిష్టత. ప్రమిదలో వత్తులు వేసి - నువ్వుల నూనె వేసి తాళ్ల సాయంతో దీపాలు వెలిగించమే ఆకాశదీపం. విశిష్టమైన వనభోజనాలు: కార్తీకమాసంలో వన భోజనాలకు ఎంతో విశిష్టత ఉంది. వన భోజనాలు శాస్త్రీయమైనవి. ఉసిరిచెట్టు నీడన, పనస ఆకులో భోజనం చేయాలి. ఉసిరిని ఔషధీ భాషలో ‘ధాత్రి’ అంటారు. ధాత్రీదేవి నమస్తుభ్యం సర్వపాప క్షయంకరి పుత్రక దేహి మహాప్రాజ్ఞే యవోదేహి బలం చ మే ॥ ఉసిరి చెట్టు క్రింద చిత్రాన్నాలు చేసుకొని హరికి నివేదించి, పండిత భోజనం చేయించాలి. బంధువులతో కలిసి భుజించడం వల్ల మహాఫలం లభిస్తుంది. దేవతలు-ఋషులు-సర్వతీర్థాలు అచటనే ఉంటాయని, ఈ మాసంలోనే హరి జాగరణ చేయాలని శాస్త్రం. ఈ కార్తిక మాసంలో శివ - విష్ణ్వాలయదర్శనాలు చేయాలి. అవిలేని చోట ఇతర దేవాలయాల్లో రావి చెట్టు మొదట - తులసి వనంలో విష్ణుచరితలు పాడాలి. దేవపూజ ప్రశస్తం. దీప దానం చేయాలి. తులసి మంజరులచే హరిహరులను అర్చిస్తే ముక్తి లభిస్తుంది. తులసిచే అలంకృతమైన గృహానికి యమకింకరులు కూడా రాలేరనీ తులసీ మాహాత్మ్యం తెలుపుతుంది. ఈ మాసంలో మంత్ర దీక్ష జన్మరాహిత్యం కలిగిస్తుంది. ఈ నెలలో విష్ణువు దామోదర నామంతో పూజింపబడతాడు గాన సంకల్పంలో ‘కార్తీక దామోదర ప్రీత్యర్థం’ అని చెబుతారు. అన్ని దానాలు ఒక వైపు, దీపదానం ఒక వైపు అని శాస్త్రం. ‘ఏకతస్సర్వదాని - దీపదానం తథైకతః’ అని శాస్త్రవచనం. ఉసిరికాయపై వత్తిని పెట్టి వెలిగించడం విష్ణువుకు ప్రీతికరం. వేకువనే విష్ణు-శివ-గంగ-సూర్యదేవతల ఉపాసన చేయాలి. శివాయ విష్ణురూపాయ - శివరూపాయ విష్ణవే నమో వైబ్రహ్మ నిధయే - వాసిష్ఠాయ నమోన్నమః ॥ క్షీరాబ్ధికన్నియకు...శ్రీ మహావిష్ణువుకు... ఈ మాసంలోనే క్షీరాబ్ధి ద్వాదశి. అదే కార్తిక శుద్ధ ద్వాదశి. ఆ రోజు క్షీరసాగరశయనుడైన విష్ణువు లక్ష్మీయుతుడై తులసి వనానికి వస్తాడని చెబుతాడు. బృందావనంలో సంచరించే విష్ణువు భోగభోగ్యాలనందిస్తాడు. ఈ మాసంలో శివార్చన - అభిషేకం - ఉపవాసం - సాయంపూజ అన్నాదుల నివేదన నక్షత్ర దర్శనం ఎంతో పుణ్యప్రదం. భగినీ హస్తభోజనం... ఈ నెలలోనే యమ విదియ. ఆ రోజున సోదరి చేతివంట తినడమే భగినీ హస్తభోజనం. గోష్టాష్టమి రోజున గోవులను పూజించి ప్రదక్షిణం చేయాలి. శివదీక్షలు - విష్ణు ఆరాధనలకు కార్తిక మాసం పుణ్యఫల మాసంగా చరిత్రలో ప్రసిద్ధమైన కలిజనులకు భక్తినీ ముక్తినీ ప్రాప్తింపజేస్తుంది. కార్తిక పురాణం పఠనం చేయాలి. - పి.వి.బి. సీతారామమూర్తి -
యాదాద్రిలో కూలిన భారీ వృక్షం
యాదగిరికొండ(నల్లగొండ): యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో బుధవారం రాత్రి కురిసిన వర్షానికి విష్ణు పుష్కరిణి సమీపాన ఉన్న భారీ వృక్షం నేల కూలింది. చుట్టుపక్కల ఎవరూ లేక పోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఏన్నో ఏళ్లుగా ఉన్న ఈ రావి చెట్టు యాదాద్రిలో పూజలందుకుంటోంది. చెట్టు కూలడంతో విష్ణు పుష్కరిణిలో స్నానానికి వెళ్లలేక భక్తులు వెనుదిరిగారు. -
150 ఏళ్ల మహావృక్షమే.. మృత్యుపాశమైంది
తాతపూడి (కపిలేశ్వరపురం) : తరతరాలుగా సేదదీర్చిన మహావృక్షమే మృత్యువులా విరుచుకుపడింది. నీడనిచ్చిన కొమ్మలే మారణాస్త్రాలుగా రెండు నిండుప్రాణాలను బలిగొంది. కపిలేశ్వరపురం మండలం తాతపూడిలో 150 ఏభై ఏళ్ల నాటి రావి చెట్టు విరిగి పడి.. గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ బొక్కా నాగేశ్వరరావు (50), రైతు ఈదర సత్యనారాయణ (70) ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనలో మరో పదిమంది గాయపడ్డారు. వారిలో చెట్టు నీడన ఆడుకునేందుకు వచ్చిన పిల్లలు ఉన్నారు. తాతపూడిలో గోదావరి గట్టు సమీపంలో కాలువ గట్టుపై భారీ రావిచెట్టు ఉంది. బలమైన మానుతో, గుబురైన ఆకులతో ఉండే ఈ మహావృక్షం కొమ్మల్లో కొన్ని గ్రామం వైపూ, కొన్ని కాలువ వైపూ విస్తరించాయి. చెట్టు చుట్టూ గ్రామస్తులు రచ్చబండతో పాటు చిన్నగుడినీ నిర్మించుకున్నారు. ఆదివారం ఉదయం చెట్టు కాండం మధ్య భాగంలో చీలిక రావడాన్ని గ్రామస్తులు గమనించారు. ఊరి వైపున్న కొమ్మల్లో కొన్నింటిని నరికివేస్తే తలబరువు తగ్గి విరిగిపడే ప్రమాదాన్ని నివారించవచ్చని భావించారు. గ్రామం వైపు విస్తరించిన కొమ్మలను నరికేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో అక్కడకు వచ్చిన పలువురు నరికే కొమ్మలు ఎక్కడ మీద పడతాయోనని కాలువ వైపు కొమ్మల కిందకు చేరారు. అదే వారి పాలిట మృత్యువుతో చెలగాటమైంది. అప్పటికే కాండం లోపల డొల్లబారి ఉండడంతో చెట్టు..కాలువ వైపు భాగంగా ఫెళఫెళా విరిగి పడింది. అంత మహావృక్షం అనూహ్యంగా విరుచుకుపడుతుంటే జనం భీతావహులై, తలోదిక్కూ పరిగెత్తబోయారు. భారీ కొమ్మ పడడంతో తలపగిలిన బొక్కా నాగేశ్వరరావు, తలకు తీవ్రగాయమైన ఈదర సత్యనారాయణ అక్కడికక్కడే మరణించారు. యింటూరు వీర్రాజు, కొరిపెల్ల సత్యనారాయణల కాళ్ళు విరిగిపోయాయి. వీరితో గాయపడ్డ యింటూరి పోలయ్య, ఠానేలంక శ్రీనివాస్‌లను రాజమండ్రి లోని ప్రైవేటు ఆస్పత్రికి, గుత్తుల సూర్యనారాయణ, నడిపల్లి సత్యనారాయణ, బాలలైన అంగర మణికంఠస్వామి, కడియాల సాల్మన్‌రాజు, రాపాక వంశీ, రాపాక రాములను మండపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అన్నదమ్ములైన వంశీ, రాము ఆడుకోవడానికి చెట్టు కిందకు వచ్చి గాయాల పాలయ్యారు. ఊరే నివ్వెరబోయింది.. తాతముత్తాతల నాటి నుంచి చల్లనినీడతో, గాలితో.. అమ్మలా నిమిరిన మహావృక్షమే మహమ్మారిలా ఇద్దరిని పొట్టన పెట్టుకోవడాన్ని తాతపూడి గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిత్యం ఎందరో ముచ్చటించుకునే రచ్చబండే వధ్యశిలగా మారిన చేదు నిజం వారిని విషాదంలో ముంచింది. భారీ కొమ్మల అడుగున విగతజీవులైన వారిని చూసి భీతావహులయ్యారు. గాయాల పాలైన వారిని హుటాహుటిన 108 పైనా, ప్రైవేటు వాహనాలపైనా ఆస్పత్రులకు తరలించడంతో అసలు ఆ సమయంలో చెట్టు వద్ద ఎవరున్నారు, గాయపడి ఆస్పత్రుల పాలైంది ఎవరు అన్నది వెంటనే స్పష్టం కాక కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మృత్యువాత పడిన నాగేశ్వరరావు, సత్యనారాయణల కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. కూలి చేసి కుటుంబాన్ని పోషించే నాగేశ్వరరావుకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య కన్నుకు సంబంధించిన, కుమార్తె కాలుకు సంబంధించిన వైకల్యంతో బాధ పడుతున్నారు. ‘మమ్మల్ని ఒంటరి చేసి వెళ్లిపోతావా’ అంటూ వారు గుండెలు బాదుకుంటూ రోదించారు. పెద్దదిక్కును కోల్పోయామని సత్యనారాయణ కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. హుటాహుటిన సహాయక చర్యలు.. దుర్ఘటన గురించి తెలియగానే.. ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు, రామచంద్రపురం ఆర్డీఓ సుబ్బారావు, కపిలేశ్వరపురం, మండపేట తహశీల్దార్లు జి.చిన్నిబాబు, శ్రీనివాస్‌లు, మండపేట సీఐ పీవీ రమణ, అంగర ఎసై్స ఎం.డి.అష్ఫక్ తాతపూడి చేరుకున్నారు. కాకినాడ, రామచంద్రపురం, మండపేట అగ్నిమాపకాధికారులు రామకృష్ణ, బాబూరావు, చిన్నిబాబుల ఆధ్వర్యంలోని సిబ్బంది చెట్టు కొమ్మలను తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. వీఆర్వో టి.వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాలకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం రామచంద్రపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
చెట్టు కూలి ఇద్దరి మృతి
మైసూరు : మైసూరులో ప్రసిద్ధి చెందిన కోటె మారెమ్మ దేవాలయం వద్ద ఉన్న భారీ రావి చెట్టు ఆలయంపై కుప్పకూలి పోవడంతో ఇద్దరు మహిళా భక్తులు మృతి చెందగా మరి కొందరు గాయపడిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. మృతులు శైలజ (35), సుశీలమ్మ (60)గా పోలీసులు గుర్తించారు. పోలీసుల వివరాల మేరకు... దేవాలయంలో మధ్యాహ్నం అమ్మవారికి పూజలు చేస్తుండగా ఒక్కసారిగా చెట్టు మొత్తం ఆలయంపై వాలిపోయింది. దీంతో ప్రాణభయంతో భక్తులు పరుగులు తీశారు. అక్కడే పూజలు చేస్తున్న శైలజ, సుశీలమ్మ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అమ్మవారి విగ్రహం తప్ప దేవాలయంలో అన్ని వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయని అర్చకులు తెలిపారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి వీ.శ్రీనివాస్ ప్రసాద్, ఎమ్మెల్యే వాసు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున నష్టపరిహారం ప్రకటించారు. అంతకు ముందు మహారాణి ప్రమోదాదేవి కూడా సంఘటన స్థలాన్ని పరిశీలించారు.