
మైసూరు యువతితో నెదర్లాండ్ యువకుడి పెళ్లి
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్‌కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్‌కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు.
ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు.