guy
-
ఇక్కడి అమ్మాయి.. అక్కడి అబ్బాయి (ఫొటోలు)
మైసూరు: ప్రేమ ఎల్లలు దాటింది. మైసూరుకు చెందిన యువతి, నెదర్లాండ్‌కు చెందిన యువకుడి మధ్య చిగురించిన ప్రేమ ఫలించింది. దీంతో పెద్దల సమక్షంలో హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. నగరంలోని హూటగళ్లికి చెందిన విద్య, నెదర్లాండ్‌కు చెందిన యువకుడు రుటైర్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఈ విషయాన్ని ఇరు కుటుంబాల పెద్దలకు తెలియపరచగా వారి పెళ్లికి అంగీకరించారు. దీంతో నగరంలోని కల్యాణ మండపంలో చెన్నగిరి తాలూకాలోని పాండోమట్టి విరక్త మఠం డాక్టర్ గురుబసవ స్వామీజీ నేతృత్వంలో విద్యా మెడలో రుటైర్ తాళి కట్టాడు. అనంతరం పెళ్లికి వచ్చిన అతిథులు వారిని ఆశీర్వదించి శుభాశీస్సులు పలికి విందు భోజనం ఆరగించారు. -
థియేటర్ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్ గయ్ మామూలోడు కాదు..
సోషల్ మీడియా దేన్నయినా సాధ్యం చేస్తోంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా తమ నైపుణ్యాలతో ఓవర్‌నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. ఊహించని రీతిలో గొప్ప అవకాశాలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. సరిగ్గా ఇలాగే సినిమా థియేటర్లో పాప్‌కార్న్ అమ్ముకునే జాసన్ గ్రోస్‌బోల్ అనే యువకుడు ఆస్కార్ వేడుకలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఆస్కార్ వేడుకలో అతిథులకు పాప్‌కార్న్ సర్వ్ చేస్తున్నాడు. టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీలోని సెంచరీ 16 థియేటర్లో పనిచేస్తున్న గ్రోస్‌బోల్ పాప్‌కార్న్ సర్వ్ చేయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శించి టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ వేడుకలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్‌కు తన స్నేహితుడొకరు గ్రోస్‌బోల్ గురించి చెప్పడంలో రెండు నెలల క్రితం తన చానల్లో లైవ్ నిర్వహించినప్పుడు అతన్ని లైవ్‌లోకి తీసుకున్నారు. అతని పాప్‌కార్న్ సర్వింగ్ నైపుణ్యాలకు అబ్బురపడిన కిమ్మెల్ అతన్ని డాల్బీ థియేటర్లో జరుగనున్న ఆస్కార్ వేడుకలో పాప్‌కార్న్ అందించేందుకు ఆహ్వానించారు. -
విజయనగరం: కబడ్డీ ఆటలో యువకుడు మృతి
-
నగ్నంగా బైక్‌పై హల్చల్ : పోలీసుల వేట!
-
నగ్నంగా బైక్‌పై హల్చల్ : పోలీసుల వేట!
సాక్షి, సిటీబ్యూరో: అతడో బైక్‌ను చోరీ చేశాడు... దానిపై నగ్నంగా రెండు కమిషనరేట్ల పరిధిలో సంచరించాడు... పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో వాహనం వదిలి పారిపోయాడు. ఆ ‘నగ్న చోరుడి’ కోసం ఇప్పుడు హైదరాబాద్, సైబరాబాద్ పోలీసులు గాలిస్తున్నారు. చిక్కితే ఓ చోరీ కేసు ఇప్పటికే సిద్ధంగా ఉండగా, మెంటల్ హెల్త్ యాక్ట్ ప్రకారం మరో కేసు నమోదు చేయడానికి సిద్ధమవుతున్నారు. వివరాల్లోకి వెళితే..ఓ గుర్తుతెలియని యువకుడు గత వారం లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనాన్ని చోరీ చేశాడు. దీనిపై స్థానిక పీఎస్‌లో కేసు నమోదైంది. ఆ చోరుడు మూడు రోజుల క్రితం పట్టపగలు ఆ వాహనాన్ని తీసుకుని నగ్నంగా షికారుకు బయలుదేరాడు. తొలుత హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లోని బోయిన్పల్లి పరిధిలోకి వచ్చే కంటోన్మెంట్ ఏరియాలో హల్చల్ చేశాడు. ఆపై బొల్లారంలోని మిలటరీ ప్రాంతంలో సంచరించాడు. అక్కడి నుంచి బేగంపేట వచ్చిన ఈ ‘న్యూడ్ రైడర్’ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పక్కన నాలాపై ఉన్న వంతెన మీదుగా బల్కంపేటకు, అట్నుంచి సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోకి వచ్చే సనత్‌నగర్ ప్రాంతానికి చేరుకున్నాడు. ఈ ఠాణా పరిధిలోనే ఎక్కువసేపు సంచరించాడు. దీనిని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రంగంలోకి దిగిన గస్తీ బృందాలు సనత్‌నగర్ ఎస్ఆర్టీ ప్రాంతంలోని నెహ్రు పార్క్ వద్ద ఆ నగ్న యువకుడిని గుర్తించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు, స్థానికులు అతడిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన సదరు యువకుడు వాహనాన్ని అక్కడే పడేసి వారిపై రాళ్ల దాడికి దిగాడు. అదను చూసుకుని పార్క్ లోపలికి వెళ్లిన అతను అక్కడి నుంచి తప్పించుకున్నాడు. సతన్‌నగర్ పోలీసులు ఆ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అది రిజిస్టరై ఉన్న చిరునామా, ఫోన్ నంబర్ ఆధారంగా అతడిని గుర్తించాలని ప్రయత్నించారు. అయితే ఆ వాహనం చోరీపై లంగర్‌హౌస్ ఠాణాలో కేసు నమోదై ఉన్నట్లు తేలింది. దీంతో సనత్‌నగర్ పోలీసులు వాహనాన్ని బుధవారం ఆ పోలీస్ స్టేషన్ అధికారులకు అప్పగించారు. సదరు యువకుడి కోసం చోరీ కేసు ఉండటంతో లంగర్‌హౌస్ అధికారులు, న్యూసెన్స్ చేసినందుకుగాను మెంటల్ హెల్త్ యాక్ట్ కింద కేసు పెట్టాలని సనత్‌నగర్ పోలీసులు గాలిస్తున్నారు. మూడు కమిషనరేట్ల పరిధిలోనూ ఈ గాలింపు కొనసాగుతోంది. ప్రధానంగా లంగర్‌హౌస్ సహా వివిధ ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో నమోదైన ఫీడ్‌ను పరిశీలిస్తున్నారు. ఆ యువకుడు నగ్నంగా బైక్ నడుపుతుండగా మిలటరీ ఏరియాలో వెనుక నుంచి వెళ్తూ కొందరు వాహన చోదకులు వీడియో తీశారు. ఆ ప్రయత్నంలో అతడిని పిలుస్తున్నా పలకకుండా, తల కూడా తిప్పకుండా వేగంగా వెళ్లిపోయాడు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో హల్చల్ చేశాయి. అతగాడు మతిస్థిమితం లేక ఇలా చేశాడా? స్నేహితులు లేదా పరిచయస్తులతో పందాలు కాసి అలా ప్రవర్తించాడా? అనేదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
యువకుడి మృతి
నకిరేకల్æ: నకిరేకల్‌లో పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతూ ఒక యువకుడు మృతి చెందిన సంఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండకు చెందిన ఎండీ.ఖయీముద్దీన్ (30) నకిరేకల్‌లోనే ఎలక్ట్రికల్ షాప్ నడుపుతూ స్థానిక పోలీస్‌స్టేషన్ సమీపంలోని పెద్ద మసీద్ పక్కన పైఅంతస్తులో అద్దెకు ఉంటున్నాడు. కొన్ని రోజులుగా పచ్చకామర్ల వ్యాధితో బాధపడుతున్నాడు. అద్దెకు ఉంటున్న గదిలోనే మృతి చెందాడు. పైఅంతస్తు కావడంతో ఆ గదిలోకి ఎవ్వరు వెళ్లలేదు. ఆదివారం పైఅంతస్తు గదిలో నుంచి దుర్వాసన రావడంతో చుట్టు పక్కల వారు వెళ్లి చూడగా ఆ గదిలో ఖయీముద్దీన్ మృతదేహం కుళ్లిపోయి ఉంది. కాగా, మృతుడి సోదరి షైనాబేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని హెడ్ కానిస్టేబుల్ యాదగిరిరెడ్డి తెలిపారు. మూడు రోజుల క్రితమే మృతి చెందడం వల్లే మృతదేహం కుళ్లిపోయి ఉందని పేర్కొన్నారు. కామర్ల వ్యాధితో బాధపడుతున్నట్లు కుటుంబీకులు తెలిపారని వివరించారు. -
రూ.250 కోసం వ్యక్తి పై దాడి
-
విద్యుదఘాతంతో యువకుడి మృతి
వెంకట్రాంపురం(కోదాడరూరల్) మంచి నీరు తాగేందుకు వెళ్లి ఓ యువకుడి విద్యుదఘాతానికి గురై మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని వెంకట్రాంపురంలో బుధవారం చోటుచేసుకుంది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాలప ప్రకారం గ్రామానికి చెందిన రావెళ్ల వెంకటయ్య, సూరమ్మ దంపతలు చిన్న కుమారుడు గోపి(18) తల్లిదండ్రులతో కలిసి కూలి పనులకు వెళ్తుంటాడు. ఈ క్రమంలో గ్రామ సమీపంలో వరి నారు పంచేందుకు వెళ్లాడు. కూలీలు నాటువేస్తుండగా మంచి నీరు తాగేందుకు సమీపంలో ఉన్న గ్రామపంచాయతీ బోరు వద్దకు వెళ్లాడు. నీరు తాగిన అనంతరం అక్కడే ఉన్న షెడ్ నీడకు వెళ్లికూర్చొని పక్కనే ఉన్న మోటార్ పైప్‌పై చేయి వేయగా దానికి విద్యుత్‌సరఫరా కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అవివాహితుడు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్ఐ విజయ్‌ప్రకాశ్ తెలిపారు. -
ఓ అమ్మాయికి అంబానీ అందమైన జవాబు
న్యూఢిల్లీ: బిలియనీర్ భర్త కావాలన్న భారతీయ అమ్మాయికి రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఓ అందమైన జవాబు ఇచ్చారు. విజయవంతమైన వ్యాపార వేత్తగా అందాన్ని, డబ్బును విశ్లేషిస్తూ నొప్పించక తానొవ్వక అన్నట్టు ఉన్న ఆయన సమాధానం ఇపుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. పూజా చౌహాన్ అనే యువతి సంధించిన ప్రశ్నలు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేతను సైతం కదిలించాయి. ఆయన సమాధానం చెప్పకుండా ఉండలేకపోయారు. దీంతో స్వయంగా ముఖేష్ అంబానీయే డైరెక్ట్ గా ఆ అమ్మాయి సందేహాలను నివృత్తి చేస్తూ సమాధానాలు రాశారు. ఇది అందరికీ షాకింగ్ గా ఉండొచ్చు. కానీ ఆ షాకింగ్ నుంచి కాసేపు తేరుకుని అసలు ఆ అమ్మాయి ప్రశ్నలకు ముఖేష్ అంబానీ ఏమని సమాధానమిచ్చారో మీరూ ఓ సారి చదవండి.... పూజ రాసిన లేఖ నా వయస్సు 25 ఏళ్లు. చాలా అందమైన అమ్మాయిని. మంచి అభిరుచులను కూడా కలిగి ఉన్నాను. ఇంత బాగున్న నాకు, సంవత్సరానికి 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ జీతం తెచ్చే అబ్బాయిని పెళ్లి చేసుకోవాలని ఉంది. ఏడాదికి రెండు కోట్ల జీతమొస్తే చాలనకుంటే ఈ కాలంలో ఆ మొత్తాన్ని మిడిల్ క్లాస్ గానే పరిగణిస్తున్నారు. అందుకే నేను ఆశపడటంలో ఏమాత్రం తప్పులేదు. ఎక్కువగా కూడా ఏమి కోరుకోవడం లేదు. ఈ కాలంలో రూ. 100 కోట్ల జీతం వచ్చే వాళ్లు ఎవరైనా ఉన్నారా? ఉంటే వారందరూ ఎక్కడ ఉన్నారు? వారందరూ పెళ్లిచేసుకున్న వాళ్లేనా? బ్యాచ్ లర్సా? నేను మీలాగా అధిక ధనవంతుడిని పెళ్లి చేసుకోవాలంటే ఏమి చేయాలో చెప్పండి. నేను డేట్ చేసిన వాళ్లందరిలో రూ.50 కోట్ల వేతనం మాత్రమే ఎక్కువ. అదే పెద్ద మొత్తంగా నేను చూశా. విలాస భవంతుల్లో, ప్రాంతాల్లో నివసించాలంటే రూ.50 కోట్లు సరిపోవని నా ఉద్దేశ్యం. నేను నిజాయితీగా కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా దయచేసి సమాధానం చెప్పండి పెళ్లికాని ధనవంతులు ఎక్కడ ఉన్నారు? ఏ గ్రూప్ లను నేను టార్గెట్ చేస్తే కోటీశ్వరులు దొరుకుతారు? ఎందుకు ధనవంతుల భార్యలు సాధారణంగా ఉంటారు? కాని వారు పెద్ద పెద్ద ధనవంతుల్ని పెళ్లిచేసుకున్నారు. ఎలా నిర్ణయించుకుంటారు ఈమె నా భార్య, ఈమె నా గర్ల్ ఫ్రెండ్ అని.. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. -మిస్ పూజా చౌహాన్ డియర్ మిస్ పూజా, నేను మీ పోస్ట్ ను చాలా ఆసక్తితో చదివాను. నీకున్న ఆశలే చాలామంది అమ్మాయిలకీ ఉంటాయి. కానీ వారు బయటపడరు. ఒక ప్రొఫెషనల్ పెట్టుబడిదారుడిగా నేను నీ పరిస్థితిని విశ్లేషించాలనుకుంటున్నాను. నా ఏడాది జీతం రూ.100 కోట్ల కంటే ఎక్కువ. నీవు కోరుకున్న దానికి నా జీతం సరితూగుతుంది. కాబట్టి నేను ఇక్కడ సమయాన్ని వృథా చేయట్లేదని మీరు నమ్ముతున్నారని ఆశిస్తున్నాను. నేను ఈ ప్రశ్నలకు సమాధానమివ్వడానికి సరియైన వాడినే. నా దృష్టిలో నిన్ను పెళ్లి చేసుకోవడం అనేది బాడ్ డెసిషన్. అందానికి, పెళ్లికి సంబంధించి ఎక్కువగా నీవు అడిగావు. అందమనేది క్రమంగా అంతరించిపోతుంది. అదే డబ్బైతే ఎలాంటి కారణాలు లేకుండా నశించదు. నిజమేమిటంటే నా ఆర్థికవేతనం ఏటేటా పెరుగుతుందే తప్ప తగ్గదు. కానీ నీవు మాత్రం ఏడాది తర్వాత అందహీనురాలివి అవుతావు. వయస్సు పెరిగే కొద్దీ అందం నశిస్తుంది. ఇది జగమెరిగిన సత్యం. ఆర్థిక పరిభాషలో నన్ను పెరిగే ఆస్తిగా పరిగణిస్తే నిన్ను తరిగిపోయే ఆస్తిగా లెక్కకడతారు. సాధారణ తరుగుదలగా కూడా కాదు విశేషణమైన తరుగుదలుగా గుర్తిస్తారు. 10 ఏళ్ల తర్వాత నీవు అసలు విలువే లేని ఆస్తిగా పరిగణించబడతావు. తరిగిపోతున్న ఆస్తిని ఎవరైనా కోరుకుంటారా చెప్పు. కచ్చితంగా దాన్ని అమ్మడానికే ప్రయత్నిస్తారు. నిన్ను కూడా అంతే. చెప్పడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నా నీ మంచి కోరి చెబుతున్నా విను. రూ.100 కోట్ల ఏడాది జీతం కలిగి ఉన్నోడేమి పిచ్చోడు కాదు. అతను నిన్ను పెళ్లిచేసుకోవాలనుకోడు కేవలం నీతో డేటింగ్ మాత్రమే చేస్తాడు. కాబట్టి నేను నీ నీకిచ్చే సలహా ఒక్కటే ఈ ఆలోచన మానుకుని, నీవే రూ.100 కోట్లు సంపాదించేలా ప్రణాళికలు వేసుకో. జీవితంలో ఉన్నత స్థానాలకు ఎదగలవు. నా సమాధానం నీకు సాయం చేస్తుందని ఆశిస్తూ.. -ముఖేష్ అంబానీ -
యువకుడిని బయటకు తోసేసిన ప్రీతీ జింటా
బాలీవుడ్ నటి ప్రీతీ జింటాకు కోపం వచ్చింది. అది ఏ రేంజ్లో అంటే.....ఓ యువకుడిని సినియా థియేటర్ నుంచి బలవంతంగా బయటకు తోసేటంత. జాతీయ గీతం వస్తున్నప్పుడు ఓ యువకుడు లేచి నిలబడేందుకు నిరాకరించటం ప్రీతి జింతాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే హృతిక్ రోషన్ తాజా చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా చూసేందుకు ప్రీతి మంగళవారం ఓ థియేటర్‌కు వెళ్లింది. ఈ సందర్భంగా సినిమా మొదలయ్యే ముందు జనగణమణ గీతం వస్తుండగా సినిమాకు వచ్చిన ఓ యువకుడు లేచి నిలబడలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ప్రీతికి అతడిని బలవంతంగా థియేటర్ నుంచి తోసేసింది. ఈ సంఘటనను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది.మరోవైపు ప్రీతి చర్యపై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమెకు దేశభక్తి ఉండచ్చు కాని మరీ ఇంత తలబిరుసు తనం పనికిరాదని బాధితుడి తరపున వ్యాఖ్యలు చేశారు.