యువకుడిని బయటకు తోసేసిన ప్రీతీ జింటా
బాలీవుడ్ నటి ప్రీతీ జింటాకు కోపం వచ్చింది. అది ఏ రేంజ్లో అంటే.....ఓ యువకుడిని సినియా థియేటర్ నుంచి బలవంతంగా బయటకు తోసేటంత. జాతీయ గీతం వస్తున్నప్పుడు ఓ యువకుడు లేచి నిలబడేందుకు నిరాకరించటం ప్రీతి జింతాకు ఆగ్రహం తెప్పించింది. దాంతో ఆమె ఈ చర్యకు పాల్పడింది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ట్విట్టర్లో పోస్ట్ చేసింది. వివరాల్లోకి వెళితే హృతిక్ రోషన్ తాజా చిత్రం 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా చూసేందుకు ప్రీతి మంగళవారం ఓ థియేటర్కు వెళ్లింది.
ఈ సందర్భంగా సినిమా మొదలయ్యే ముందు జనగణమణ గీతం వస్తుండగా సినిమాకు వచ్చిన ఓ యువకుడు లేచి నిలబడలేదు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ప్రీతికి అతడిని బలవంతంగా థియేటర్ నుంచి తోసేసింది. ఈ సంఘటనను ఆమె ట్విట్టర్లో పోస్ట్ చేసింది.మరోవైపు ప్రీతి చర్యపై సోషల్ మీడియాలో ఓ వర్గం నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ఆమెకు దేశభక్తి ఉండచ్చు కాని మరీ ఇంత తలబిరుసు తనం పనికిరాదని బాధితుడి తరపున వ్యాఖ్యలు చేశారు.