సోషల్ మీడియా దేన్నయినా సాధ్యం చేస్తోంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా తమ నైపుణ్యాలతో ఓవర్‌నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. ఊహించని రీతిలో గొప్ప అవకాశాలు అందుకుంటున్నారు.
ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ..
సరిగ్గా ఇలాగే సినిమా థియేటర్‌లో పాప్‌కార్న్ అమ్ముకునే జాసన్ గ్రోస్‌బోల్ అనే యువకుడు ఆస్కార్ వేడుకలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఆస్కార్ వేడుకలో అతిథులకు పాప్‌కార్న్ సర్వ్ చేస్తున్నాడు. టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీలోని సెంచరీ 16 థియేటర్‌లో పనిచేస్తున్న గ్రోస్‌బోల్ పాప్‌కార్న్ సర్వ్ చేయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శించి టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యాడు.
ఆస్కార్ వేడుకలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్‌కు తన స్నేహితుడొకరు గ్రోస్‌బోల్ గురించి చెప్పడంలో రెండు నెలల క్రితం తన చానల్‌లో లైవ్ నిర్వహించినప్పుడు అతన్ని లైవ్‌లోకి తీసుకున్నారు. అతని పాప్‌కార్న్ సర్వింగ్ నైపుణ్యాలకు అబ్బురపడిన కిమ్మెల్ అతన్ని డాల్బీ థియేటర్‌లో జరుగనున్న ఆస్కార్ వేడుకలో పాప్‌కార్న్ అందించేందుకు ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment