Popcorn
-
ఒక్క మొక్కజొన్న గింజ.. 8.7 కోట్ల వీక్షణలు
సామాజిక మాధ్యమాల్లో కొత్తరకంగా కనిపించే ప్రతి ఒక్క వీడియోను కోట్ల మంది చూస్తారనడానికి నిదర్శనం ఈ వీడియో. అలోనా లోయివెన్ అనే యువతి కంటెంట్ క్రియేటర్‌గా పేరొంది ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియోలు చేస్తోంది. తాజాగా ఈమె చేసిన కొత్త రకం వీడియోను జనం అదేపనిగా చూస్తున్నారు. అసలు ఆ వీడియో చివర్లో ఏం జరుగుతుందా అని వీడియో చివరికంటా చూసి కోట్లాది మంది అవాక్కయ్యారు. అలా ఒకరి తర్వాత మరొకరు షేర్ చేస్తూ పోవడంతో ఇప్పుడా వీడియో వీక్షణలు ఏకంగా 8.7 కోట్లు దాటిపోయాయి. View this post on Instagram A post shared by Alona Loewen (@alonaloewen)ఏముందా వీడియోలో? మొక్కజొన్న పొత్తును ఒలిచి అందులో ఒకే ఒక్క గింజను తీసుకుని వేడి నాన్‌స్టిక్ పెనం మీద వేసింది. దానిపై చాలా చిన్నగా ఉన్న చెంచాతో ఒకే ఒక్క చుక్క నూనె వేసింది. తర్వాత కాసింత ఉప్పు వేసి దోరగా కాల్చడం మొదలెట్టింది. గింజ కింద పడిపోకుండా మధ్యలో రంధ్రం ఉన్న చెక్క చెంచాను తీసుకుని దాని మధ్యలోకి గింజ వచ్చేలా చేసి గింజను బాగా వేడెక్కించింది. అలా గింజ వేడెక్కినంత సేపూ వీడియో చూస్తున్న ఇన్‌స్టా గ్రామ్ ఆప్ వీక్షకులు అలాగే కన్నార్పకుండా చూశారు. చిట్టచివరికి అది ఒక్కసారిగా పగిలి పాప్‌కార్న్ అయింది. అంతే.. View this post on Instagram A post shared by Alona Loewen (@alonaloewen)వ్యాఖ్యానాల వెల్లువ కొద్ది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చూసి నవ్వుకున్న వారు కొందరైతే చిర్రెత్తిపోయిన వారు మరికొందరు. అసలు ఇందులో ఏముంది? అని ప్రశ్నించిన వారూ లేకపోలేదు. అయితే రోజువారీ రోటీన్ జీవితంలో బోరు కొట్టిన మాలాంటి వాళ్లకు ఒక్క మొక్కజొన్న గింజ మహా ఉపశమనం కలి్పంచిందని నవ్వుతూ కామెంట్లు పెట్టినవాళ్లు కూడా ఉన్నారు. తమ సహనాన్ని పరీక్షించిందని ఆగ్రహం వ్యక్తంచేసిన వాళ్లకు కొదువేలేదు. ‘‘చివరిదాకా సస్పెన్స్ నన్ను చంపేసింది’అని ఒకతను పోస్ట్చేశాడు. ‘ఒక్క గింజ పేలడం చూడ్డం కోసం ఇంత సేపు వీడియో చూశానా!’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘డైటింగ్ తొలి రోజు ఇంతే తినాలి’, ‘ఎట్టకేలకు అది పేలింది’, ‘మొత్తం వీడియో చూసే సరికి నా ఓపిక మొత్తం పోయింది’అని ఎవరికి నచి్చనట్లు వాళ్లు కామెంట్లు చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పొటాటో పాప్ కార్న్.. ఇలా చేస్తే భలే రుచిగా ఉంటాయి
పొటాటో పాప్ కార్న్ తయారీకి కావల్సినవి: బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) చాట్ మసాలా – పావు టీ స్పూన్, కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ఉప్పు – తగినంత, కారం – కొద్దిగా, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ విధానమిలా: ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. -
థియేటర్ లో పాప్ కార్న్ రేట్ల పై తేజ సంచలన కామెంట్స్
-
థియేటర్ నుంచి ఆస్కార్‌కు.. ఈ పాప్‌కార్న్ గయ్ మామూలోడు కాదు..
సోషల్ మీడియా దేన్నయినా సాధ్యం చేస్తోంది. చిన్న చిన్న పనులు చేసుకునేవారు కూడా తమ నైపుణ్యాలతో ఓవర్‌నైట్‌లో స్టార్లు అయిపోతున్నారు. ఊహించని రీతిలో గొప్ప అవకాశాలు అందుకుంటున్నారు. ఇదీ చదవండి: Oscar Awards: ఆస్కార్ నామినీలకు ఆస్ట్రేలియాలో భూమి! కానీ.. సరిగ్గా ఇలాగే సినిమా థియేటర్లో పాప్‌కార్న్ అమ్ముకునే జాసన్ గ్రోస్‌బోల్ అనే యువకుడు ఆస్కార్ వేడుకలో అడుగుపెట్టే ఛాన్స్ కొట్టేశాడు. ఇప్పుడు జరుగుతున్న ఆస్కార్ వేడుకలో అతిథులకు పాప్‌కార్న్ సర్వ్ చేస్తున్నాడు. టెక్సాస్‌లోని కార్పస్ క్రిస్టీలోని సెంచరీ 16 థియేటర్లో పనిచేస్తున్న గ్రోస్‌బోల్ పాప్‌కార్న్ సర్వ్ చేయడంలో వైవిధ్యాన్ని ప్రదర్శించి టిక్‌టాక్‌లో ఫేమస్ అయ్యాడు. ఆస్కార్ వేడుకలో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న జిమ్మీ కిమ్మెల్‌కు తన స్నేహితుడొకరు గ్రోస్‌బోల్ గురించి చెప్పడంలో రెండు నెలల క్రితం తన చానల్లో లైవ్ నిర్వహించినప్పుడు అతన్ని లైవ్‌లోకి తీసుకున్నారు. అతని పాప్‌కార్న్ సర్వింగ్ నైపుణ్యాలకు అబ్బురపడిన కిమ్మెల్ అతన్ని డాల్బీ థియేటర్లో జరుగనున్న ఆస్కార్ వేడుకలో పాప్‌కార్న్ అందించేందుకు ఆహ్వానించారు. -
నిర్మాతగా మారడానికి ఇదే సరైన కథ! – అవికా గోర్
‘‘నిర్మాతని కావాలని నా 21వ ఏటనే అనుకున్నాను.. నిర్మాతగా మారడానికి ‘పాప్ కార్న్’ సరైన కథ. అందుకే ఈ చిత్రంతో తొలి అడుగు వేశాను’’ అని అవికా గోర్ అన్నారు. సాయి రోనక్ హీరోగా మురళి గంధం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పాప్ కార్న్’. ఈ చిత్రంలో అవికా గోర్ హీరోయిన్గా నటించడంతో ΄ాటు నిర్మాతగా (సహ నిర్మాత) మారారు. ఎంఎస్ చలపతి రాజు సమర్పణలో భోగేంద్ర గుప్త నిర్మించిన ఈ చిత్రం నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా అవికా గోర్ చెప్పిన విశేషాలు. ♦ డైరెక్టర్ మురళి చెప్పిన ‘పాప్ కార్న్’ కథ ఆసక్తిగా అనిపించింది. 90 శాతం లిఫ్ట్‌లో జరిగే కథ ఇది. ఇప్పుడు ఆడియెన్స్ కి మంచి కంటెంట్ లేదా మాస్ మసాలా కావాలి. ఆ రెంటినీ బ్యాలన్స్ చేస్తూ ‘పాప్ కార్న్’ తీశారు మురళి. ♦ చిత్రపరిశ్రమలో నాకు గాడ్‌ఫాదర్స్ లేరు. అందుకే నేను నిర్మాతగా చేస్తానని చెప్పగానే ముందు సందేహం వ్యక్తం చేశారు మా పేరెంట్స్. కానీ, ఇది నా కల అని చెప్పగానే వాళ్లు ఒప్పుకున్నారు. నిర్మాతగా సినిమా ఎలా వస్తోంది? ఎలా ప్రమోట్ చేయాలి? అని ఆలోచించడం కొత్తగా అనిపించింది. నాప్రొడక్షన్ హౌస్‌లో మరో సినిమా షూటింగ్ చేశాం. అలాగే ఇంకో మూవీ ప్రీప్రొడక్షన్ జరుగుతోంది. ♦ ప్రస్తుతం తెలుగులో కొన్ని సినిమాలు చేస్తున్నాను. ‘1920’ అనే చిత్రంతో బాలీవుడ్లో అడుగుపెడుతున్నాను. -
Recipe: నోరూరించే పొటాటో పాప్‌కార్న్.. ట్రై చేయండిలా!
భిన్న రుచులు ట్రై చేయడం అలవాటా? అయితే, ఇంట్లో ఇలా పొటాటో పాప్ కార్న్ చేసి చూడండి! కావలసినవి: ►బంగాళదుంపలు – 3 (తొక్క తీసి.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి) ►చాట్ మసాలా – పావు టీ స్పూన్ ►కార్న్ పౌడర్ – 1 టేబుల్ స్పూన్ ►ఉప్పు – తగినంత ►కారం – కొద్దిగా ►నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ►ముందుగా బంగాళదుంప ముక్కల్ని నీటిలో ఐదు నిమిషాల పాటు ఉడికించి..ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ►కాస్త చల్లారాక మెత్తటి క్లాత్‌తో పైపైన ఒత్తుకుని.. తడి లేకుండా చేసుకోవాలి. ►అనంతరం వాటిని ఒక బౌల్లో వేసుకుని.. కొద్దిగా ఉప్పు, చాట్ మసాలా, కార్న్ పౌడర్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని.. బౌల్‌తోనే అటు ఇటు కుదపాలి. ►అప్పుడే కార్న్ పౌడర్, చాట్ మసాలా, ఉప్పు.. ముక్కలకు బాగా పడతాయి. ►తర్వాత వాటిని కాగుతున్న నూనెలో దోరగా వేయించుకుని.. ఒక ప్లేట్లోకి తీసుకుని.. వాటిపైన కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం జల్లి.. సర్వ్ చేసుకోవాలి. చదవండి: తెలంగాణ రెడ్ చికెన్.. చపాతీ, రోటీలకు మంచి కాంబినేషన్ అరిశెలు మెత్తగా రావాలంటే ఇలా చేయండి! ఇక పూతరేకులు.. -
థియేటర్లలో పాప్ కార్న్ 500 రూపాయలా..?
బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ ఓ ఆసక్తికర అంశంపై మాట్లాడారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో సమావేశంలో ఆయన తన మాటలతో కాసేపు నవ్వులు పూయించారు. యూపీలో షూటింగ్‌లు జరపాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బాలీవుడ్ ప్రముఖులతో ముంబైలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు జాకీ ష్రాఫ్ సీఎం యోగిని అభ్యర్థించారు. థియేటర్లలో పాప్‌కార్న్ ధరను తగ్గించాలని జాకీ ష్రాఫ్ యోగి ఆదిత్యనాథ్‌ను కోరారు. పాప్‌కార్న్ 500 రూపాయలు తీసుకుంటున్నారని తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది కాస్తా వైరల్ కావడంతో నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. జాకీ ష్రాఫ్ మాట్లాడుతూ.. 'థియేటర్లలో పాప్‌కార్న్ కోసం రూ.500 తీసుకుంటున్నారు. దయచేసి పాప్‌కార్న్ ధర తగ్గించండి. సినిమా తీస్తున్నాం. స్టూడియోలు కడుతున్నాం. కానీ సినిమా టికెట్ కంటే ఎక్కువగా పాప్ కార్న్ ధరలు ఉంటే థియేటర్‌కు వచ్చేదేవరు?' అని అడిగారు. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా నవ్వారు. ఉత్తరప్రదేశ్‌లోని సినిమాల షూటింగ్‌పై హిందీ చిత్రనిర్మాతలతో సీఎం యోగి ఆదిత్యనాథ్ సమావేశమయ్యారు. CM योगी से बोले जैकी श्रॉफ़- घर का खाना चाहिए तो मिल जाएगा. थिएटर में पॉपकॉर्न की कीमत कम करो. pic.twitter.com/dqXFXXhrPo — UnSeen India (@USIndia_) January 6, 2023 -
మల్టీప్లెక్స్‌లలో ప్రేక్షకులకు చుక్కలు చూపిస్తున్న పాప్ కార్న్ ధరలు!
చారాణా కోడి పిల్లకు బారాన మసాలా అంటే ఇదేనేమో. వీకెండ్ ఎంజాయ్ చేద్దామని సినిమాకెళ్తే అక్కడ రెండు సినిమాలు చూపిస్తున్నారు. ఒకటి థియేటర్లో..ఇంకోటి ఇంటర్వెల్లో. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. సినిమాకి వెళ్తే చాలు తమకు నచ్చిన రేట్లేసి చుక్కలు చూపిస్తున్నారు. వారమంతా కష్టపడ్డ సామాన్యుడు.. కాస్తంత రిలాక్స్ అయ్యే మంత్రం సినిమా. ఇప్పుడు అదే సినిమా థియేటర్లో స్నాక్స్ రేట్లు చూసి భయపడుతున్నారు. రేట్లు తగ్గించాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సినిమా థియేటర్లో ముఖ్యంగా పాప్కాన్ కాస్ట్లీపై పీవీఆర్ ఛైర్మన్ అండ్ మేనేజిండ్ డైరెక్టర్ అజయ్ బిజ్లీ స్పందించారు. థియేటర్లలో పెరిగిపోతున్న శ్నాక్స్ ధరల్ని వ్యతిరేకిస్తున్న వినియోగదారుల్ని నిందించలేం. అయితే, మనదేశంలో సింగిల్ స్క్రీన్ నుంచి మల్టీఫ్లెక్స్‌ల వరకు ఫుడ్ అండ్ బేవరేజెస్(ఆహారం,కూల్ డ్రింక్స్)ధరలలో ఎటువంటి మార్పు ఉండదని బిజిలీ చెప్పారు. నిర్వహణ ఖర్చుల కోసం మల్టీప్లెక్స్‌లోని స్నాక్స్‌ను అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిపారు. మనదేశంలో ఫుడ్ & అండ్ బేవరేజెస్ మార్కెట్ రూ.1500కోట్లుగా ఉంది. మల్టీప్లెక్స్‌లలో ఎక్కువ స్క్రీన్ల కారణంగా ప్రొజెక్షన్ రూమ్‌లు,సౌండ్ సిస్టమ్‌ల అవసరం ఎక్కువే. కాబట్టే ఖర్చులు "4 నుండి 6 రెట్లు" పెరుగుతాయని అన్నారు. ఫోయర్లు కూడా ఫుల్ ఏసీతో ఉండడంతో ఎయిర్ కండిషనింగ్ అవసరం కూడా పెరిగిందన్నారు. కాగా ఈ ఏడాది ప్రారంభంలో పీవీఆర్- ఐనాక్స్ మెర్జ్ అయిన విషయం తెలిసిందే. చదవండి👉ఓటీటీ దెబ్బకు ఇండియన్ బిగెస్ట్ సినిమా బ్రాండ్ల విలీనం..! -
Recipe: మష్రూమ్ పాప్ కార్న్ ఇలా చేసుకుంటే టేస్ట్ అదిరిపోద్ది!
పుట్టగొడుగు కర్రీ బోర్ కొట్టిందా.. అయితే.. మష్రూమ్ పాప్‌కార్న్‌ను ఇలా ఇంట్లోనే తయారు చేసుకుని కొత్త రుచిని ఆస్వాదించండి. మష్రూమ్ పాప్ కార్న్ తయారీకి కావలసినవి: ►పుట్టగొడుగులు – 15 నుంచి 20 లోపు(శుభ్రం చేసుకుని, ముక్కల్లా కట్ చేసుకుని పెట్టుకోవాలి) ►అల్లం–వెల్లుల్లి పేస్ట్ – 2 టేబుల్ స్పూన్లు, కారం, ►చాట్ మసాలా – 1 టీ స్పూన్ చొప్పున ►మైదా , నిమ్మరసం, జీలకర్ర పొడి, గరం మసాలా ►పాలు – 1 టేబుల్ స్పూన్ చొప్పున ►ఓట్స్ పౌడర్, బ్రెడ్ పౌడర్ – 5 టేబుల్ స్పూన్లు చొప్పున(రెండు కలిపి పెట్టుకోవాలి) ►గుడ్లు – 2 (ఒక గుడ్డుని పాలలో కలిపి పెట్టుకోవాలి) ►ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకి సరిపడా మష్రూమ్ పాప్ కార్న్ తయారీ: ►ముందుగా ఒక గిన్నెలో పుట్టగొడుగు ముక్కలు వేసుకోవాలి. ►అందులో అల్లం–వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, కారం, చాట్ మసాలా, తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ నూనె, ఒక గుడ్డు వేయాలి. ►ఆ మిశ్రమాన్ని ముక్కలకు బాగా పట్టించి 20 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం ఒక చిన్న బౌల్లో ఓట్స్, జీలకర్ర పొడి, గరం మసాలా, మైదా వేసుకొని బాగా కలిపి ఉంచాలి. ►కళాయిలో నూనె వేడి చేసుకుని, ఒక్కొక్క పుట్టగొడుగు ముక్కను మొదట గుడ్డు–పాల మిశ్రమంలో, ఆపై ఓట్స్–బ్రెడ్ పౌడర్ మిశ్రమంలో ముంచి బాగా పట్టించి నూనెలో దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇది కూడా ట్రై చేయండి: Mutton Rogan Josh Recipe In Telugu: అన్నం, రుమాలీ రోటీలోకి అదిరిపోయే మటన్ రోగన్ జోష్! -
అడ్డగోలు దోపిడీ.. ప్రేక్షకులపై తిను‘బండ’రాలు
సాక్షి, అమరావతి బ్యూరో: వినోదం కోసం సినిమా థియేటర్లకు వెళ్లిన ప్రేక్షకులకు అక్కడ విక్రయించే తినుబండారాల ధరలను చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఆ థియేటర్, ఈ థియేటర్ అనే తేడా లేదు. థియేటర్ స్థాయి బట్టి ధరలు మోతమోగుతున్నాయి. సినిమా టికెట్టుకంటే స్నాక్స్, పాప్‌కార్న్, టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ ధరలే అధికం. విజయవాడలో ఏసీ, నాన్ ఏసీ థియేటర్లతో పాటు మల్టీప్లెక్స్‌లు వెరసి 46 వరకు ఉన్నాయి. థియేటర్లలో అన్ని తరగతుల వారికి వారి స్థాయిని బట్టి టికెట్ల ధరలుంటాయి. సినిమా హాళ్ల క్యాంటీన్లలో విక్రయించే తినుబండారాలకు మాత్రం అలాంటి భేదం లేదు. చదవండి: Andhra Pradesh: ఏకగ్రీవ పంచాయతీలకు రూ.134.95 కోట్లు ఏ క్లాస్‌కు వెళ్లిన వారి కైనా ఒకటే బాదుడు. ఇంటర్వెల్ సమయంలో ప్రేక్షకులకు పది నిమిషాల పాటు విరామం ఉంటుంది. ఆ సమయంలో క్యాంటీన్లకు వచ్చి తినుబండారాలు, కూల్ డ్రింక్స్, టీ, కాఫీ కొనుగోలు చేయడం రివాజు. కుటుంబ సమేతంగా వెళ్లిన వారు పిల్లలకు తినుబండారాలు కొనివ్వక తప్పదు. లేదంటే వారు మారం చేస్తారు. క్యాంటీన్లలో విక్రయించే ధరలు బయట దొరికే రేట్లకు ఏ మాత్రం పొంతన ఉండదు. ఉదాహరణకు 200 మిల్లీలీటర్ల కూల్ డ్రింక్ బాటిల్ ధర మార్కెట్లో రూ.14 (గాజు బాటిల్), రూ.20 (ప్లాస్టిక్ బాటిల్) ఉండగా థియేటర్లలో రూ.60 నుంచి 79 వరకు వసూలు చేస్తున్నారు. బయట రూ.30కి దొరికే 150 గ్రాముల పాప్‌కార్న్ రూ.180, రూ.20 విలువచేసే స్వీట్‌కార్న్ రూ.60, రూ.20కే దొరికే ఐస్క్రీంను రూ.50కి, రూ.20ల కేక్, పఫ్ రూ.50 చొప్పున విక్రయిస్తున్నారు. బయట రూ.10లకే దొరికే టీ సినిమా హాళ్ల క్యాంటీన్లలో కొన్నిచోట్ల రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో టీ, కాఫీ, లెమన్ టీలు ఏదైనా రూ.50 చొప్పున పిండుతున్నారు. సినిమా హాళ్ల క్యాంటీన్లలో నాలుగైదు రెట్ల అధికంగా అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మరో విచిత్రమేమిటంటే.. థియేటర్లలో విక్రయించే కొన్ని తినుబండారాలపై ప్రత్యేక ఎమ్మార్పీలుంటాయి. ఎవరైనా గట్టిగా నిలదీస్తే ‘ఎమ్మార్పీకే విక్రయిస్తున్నాం’ అని క్యాంటీన్ల నిర్వాహకులు దబా యిస్తుంటారు. థియేటర్లలో ధరలు భరించలేని వారెవరైనా బయట నుంచి తినుబండారాలను తీసుకెళ్లడానికి అనుమతించరు. కనీసం మంచి నీళ్ల బాటిల్‌ను కూడా తీసుకెళ్లనీయరు. గేటు బయటే అలాంటి వాటిని తిరస్కరిస్తారు. విధి లేని పరిస్థితుల్లో ప్రేక్షకులు చేతి చమురు వదిలించుకోవాల్సి వస్తోంది. కుటుంబానికి రూ.వెయ్యి ఖర్చు నలుగురు సభ్యులు ఉన్న కుటుంబం సినిమాకు వెళ్తే కనీసం రూ.వెయ్యి ఖర్చవుతోంది. మామూలు థియేటర్ టికెట్టు ధర రూ.100 ఉంటే నలుగురికి రూ.400 అవుతుంది. థియేటర్లో తినుబండారాలకు పొదుపుగా ఖర్చు చేస్తే మరో రూ.600 అయినా వెచ్చించక తప్పదు. ఇలా ఒక మధ్య తరగతి కుటుంబం సినిమాకి వెళ్లాలంటే రాను, పోను ఖర్చులు కాకుండా రూ.వెయ్యి భారం పడుతోంది. -
బీట్రూట్ పాప్ కార్న్ ఎప్పుడైనా తిన్నారా? మరీ బెల్గావి స్వీట్.. ఇంట్లోనే ఈజీగా
ఇంట్లో తయారు చేసిన స్నాక్స్ ఆరోగ్యానికి మేలు చేయడమేకాకుండా డబ్బును ఆదా చేస్తుంది. వెరయిటీగా ఈ వంటకాల తయారీని ప్రయత్నించి చూద్దాం.. బెల్గావి స్వీట్ చదవండి: ఎడమచేతివాటం వారు ఈ విషయాల్లో నిష్ణాతులట.. మీకు తెలియని ఎన్నో ఆసక్తికర విషయాలు. కావల్సిన పదార్థాలు ►వెన్నతీయని పాలు – కప్పు ►పంచదార – అర కప్పు ►కోవా – ముప్పావు కప్పు ►పెరుగు – టేబుల్ స్పూను ►జీడిపప్పు పలుకులు – నాలుగు టేబుల్ స్పూన్లు ►యాలకుల పొడి – అరటీస్పూను. తయారీ విధానం ►స్టవ్ మీద నాన్‌స్టిక్ బాణలి పెట్టి పంచదార వేయాలి. ►మీడియం మంట మీద పంచదార బ్రౌన్ కలర్లోకి మారేంత వరకు వేయించాలి. ►రంగు మారగానే మంట తగ్గించి పాలు పోయాలి. ►ఇప్పుడు మీడియం మంట మీద పాలు కాగనివ్వాలి. పాలుకాగాక, పెరుగు వేసి తిప్పాలి. పాలు విరిగినట్లుగా అవుతాయి. అప్పుడు కోవా వేసి బాగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని 20 నిమిషాలపాటు ఉడికించాలి. నీళ్లన్నీ ఇగిరి దగ్గర పడుతున్నప్పుడు జీడిపప్పు, యాలకుల పొడి వేసి తిప్పితే బెల్గావి రెడీ. బీట్రూట్ పాప్ కార్న్ కావల్సిన పదార్థాలు ►బీట్రూట్ – 1 (ముక్కలు కట్ చేసుకుని, ఒక గ్లాసు వాటర్ కలిపి, మిక్సీ పట్టి, వడకట్టుకుని రసం తీసుకోవాలి) ►పంచదార – అర కప్పు ►మొక్కజొన్న గింజలు – 1 కప్పు ►యాలకుల పొడి – కొద్దిగా ►రెయిన్బో స్ప్రింకిల్స్ – 1 టేబుల్ స్పూన్లు (అభిరుచిని బట్టి) ►నూనె – 2 టేబుల్ స్పూన్లు తయారీ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని, పాత్రలో పంచదార, బీట్రూట్ జ్యూస్ వేసుకుని గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఈలోపు మరో స్టవ్ మీద కుకర్‌లో నూనె వేసుకుని, మొక్కజొన్న గింజలు వేసుకుని పాప్‌కార్న్ చేసుకోవాలి. తర్వాత అందులో పంచదార, బీట్ రూట్ జ్యూస్ మిశ్రమాన్ని వేసి, పాప్ కార్న్‌కి బాగా పట్టించాలి. చివరిగా రెయిన్బో స్ప్రింకిల్స్ వేసుకుని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చదవండి: ఈ వాటర్ బాటిల్ ధర సీఈవోల జీతం కంటే ఎక్కువే!.. రూ.45 లక్షలు.. -
పాప్‌కార్న్ సినిమా: ఆ తర్వాత ఏమైంది?
హీరోయిన్ అవిగా గోర్ నిర్మాతగా పరిచయమవుతున్న చిత్రం ‘పాప్ కార్న్’. సాయి రోనక్, అవికా గోర్ జంటగా యాడ్ ఫిల్మ్ మేకర్ మురళీ నాగ శ్రీనివాస్ గంధం దర్శకత్వంలో తెరకెక్కుతోంది. భోగేంద్రగుప్తా నిర్మిస్తున్న ఈ చిత్రానికి అవికా గోర్, ఎంఎస్ చలపతిరాజు సహనిర్మాతలు. బుధవారం (జూన్ 30) అవికా పుట్టినరోజు సందర్భంగా టైటిల్ ప్రకటించి, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. ‘‘సరికొత్త కథాకథనాలతో రూపొందుతున్న చిత్రమిది. అవికా గోర్ నిర్మాణ భాగస్వామ్యంలో ఈ సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది’’ అన్నారు భోగేంద్రగుప్తా మడుపల్లి. ‘‘మెలోడ్రామా జానర్లో సాగే చిత్రమిది. ఒకరిపై మరొకరికి విపరీతమైన ద్వేషం గల ఓ అమ్మాయి, ఓ అబ్బాయి... తప్పించుకోవడానికి వీలు లేని పరిస్థితిలో చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏమైంది అనేది చిత్రకథ’’ అన్నారు మురళీ నాగ శ్రీనివాస్ గంధం. ఈ చిత్రానికి సంగీతం: శ్రవణ్ భరద్వాజ్. View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) -
పాప్‌కార్న్‌తో ప్రయోజనాలెన్నో!
సినిమా అనగానే గుర్తుకొచ్చేది పాప్‌కార్న్. ఇప్పుడంటే పాప్‌కార్న్ అని నైసుగా పిలుస్తున్నారు కానీ, ఒకప్పుడు పేలాలంటూ తెగ తినేవాళ్లం. నిన్నమొన్న దాకా కరోనా కారణంగా సినిమాకు తెరపడింది. ఈ మధ్య కాలంలో తెరుచుకుంటున్న థియేటర్లలో సినిమా చూసేందుకు సినీ ప్రియులు ఆవురావురుమంటూ మల్టీప్లెక్సులపై దండయాత్రకు సిద్ధమవుతున్నారు. సినిమా చూస్తూ పాప్‌కార్న్ తింటుంటే ఆ మజానే వేరు. అయితే పాప్‌కార్న్ కేవలం మజా కోసమే కాదని, ఆరోగ్యానికి కూడా అవసరమని నిపుణులు చెబుతున్నారు. పాప్‌కార్న్‌లో ఉన్న ఆరోగ్య ప్రయోజనాలు గురించి తెలుసుకోవాలంటే.. సినిమాల్లోలాగే కాస్త ఫ్లాష్‌బ్యాక్‌కు వెళ్లాల్సిందే. అమెరికాకు చెందిన నెబ్రాస్కా రాష్ట్రంలో ఓ ప్రధాన నగరం ఒమాహా. ఆ నగరంలోని ఓ ప్రఖ్యాత పరిశోధన కేంద్రమే ‘సెంటర్ ఫర్ న్యూట్రిషన్’. అక్కడ జరిగింది... పాప్‌కార్న్ మీద ఓ పరిశోధన! ఆ పరిశోధనలో వెల్లడైన విషయాలు ఎంత ఆసక్తికరంగా ఉన్నాయో తెలిస్తే. వెంటనే మీరు సినిమాకు వెళ్లాల్సిందే అని పట్టుపడతారు. ఒకవేళ సినిమాకు వెళ్లడం కుదరకపోయినా, కనీసం ఇంట్లోనైనా పాప్‌కార్న్ చేసుకుని తిందాం అనుకుంటారు. ఎందుకంటారా? రోజూ పాప్‌కార్న్ తినేవారికి ప్రాసెస్ చేయని ముడిధాన్యాలు తినేవారికి కలిగిన ఆరోగ్య ప్రయోజనాలే సమకూరతాయి. పాప్‌కార్న్ తిననివారితో పోలిస్తే తినేవారిలో ఈ తరహా ప్రయోజనం 250 శాతం ఎక్కువ. ‘పేలాల’ విషయంలో ఇంకా బలంగా ‘పేలిపోయిన’ వార్త ఏమిటంటే... పాప్‌కార్న్‌కు సాధారణంగా పొట్టుతీయని ధాన్యాలు వాడుతుంటారు కాబట్టి... పాప్‌కార్న్ తిననివారి కంటే తినేవాళ్లలో పీచుపదార్థం (ఫైబర్) 22 శాతం అధికంగా లభ్యమవుతుంది. అందుకే పాప్‌కార్న్ తినండి. కానీ పరిమితంగా మాత్రమే. పరిమితంగా అన్న క్లాజ్ ఎందుకో? పాప్‌కార్న్ తయారు కావడానికీ, దానికి మరింత రుచి చేకూరడానికీ వెన్నగానీ, నూనెగానీ లేదా కొవ్వులు ఎక్కువగా ఉండే నెయ్యిలాంటి కృత్రిమ నూనెలనూ వాడుతుంటారు. దాన్ని వేయించడం కోసం వాడే ఈ వెన్న/నూనె/కృత్రిమనూనెల వల్ల గుండెకు రక్తాన్ని సరఫరా చేసే ధమనిలో కొవ్వు పేరుకునే అవకాశాలు ఎక్కువ. మరీ భయపడాల్సిన అవసరం లేదుగానీ... మితంగా తింటే ఏసమస్యా రాదు. ఆరోగ్యాన్ని దష్టిలో పెట్టుకుని పాప్‌కార్న్ తినాలంటే..ఇంట్లోనే తయారుచేసుకోదగ్గ పొడిపేలాలు... ఇంగ్లిష్‌లో చెప్పాలంటే అనారోగ్యకరమైన వాటిని దూరంగా ఉంచడం కోసం ‘ఎయిర్ పాప్డ్ కార్న్స్’ చేసుకుని తినాలి. జలుబుకూ మందు పాప్‌కార్నే... ‘సెంటర్ ఫర్ న్యూట్రిషన్’ కథ అలా ఉంటే, మరో నగరమైన ‘పెన్సిల్వేనియాలోని’ యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్’లోని పరిశోధన ఫలితాల కథ మరోలా ఉంది. ఇక్కడ జరిగిన అధ్యయనాల్లో పాప్‌కార్న్‌లోని పాలీఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ వల్ల జలుబు చాలా తేలిగ్గా తగ్గుతుందని తేలింది. కొన్నిరకాల పండ్లలో కంటే కూడా పాప్‌కార్న్‌లో ఉండే పాలీఫిలాన్స్లో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అన్నట్టు ఇక్కడి వారూ ఓ హెచ్చరిక కూడా చేశారు. అదేమిటంటే... పాప్‌కార్న్ తయారీ లో ఉప్పు వేసుకోకూడదట. ఉప్పు వేస్తే జలుబును తగ్గించే విషయంలో ప్రయోజనం ఉండదని పెన్సిల్వేనియా పరిశోధకులు చెబుతున్నారు. -
ఇకపై పాప్‌కార్న్ కొనాలంటే చుక్కలే!
సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా టైంపాస్ కోసం తినే ఆహార జాబితాలో పాప్‌కార్న్ ముందుంటుంది. ఇందుకోసం జేజే కంపెనీ వారి రెడీ టూ ఈట్ పాప్‌కార్న్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఇది రుచితో పాటు తక్కువ ధరకే లభిస్తుంది. అయితే ఇకపై జేజే పాప్‌కార్న్ కొనాలంటే చుక్కలు చూడాల్సిందే. ఇది 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్(ఏఏఆర్) గురువారం ప్రకటించింది. ఇప్పటికే రేడి టూ ఈట్ పరోటాను కూడా 18 శాతం జీఎస్టీ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసహనం కూడా వ్యక్తం చేశారు. అదే మాదిరిగా ఇప్పడు జేజే పాప్‌కార్న్ కూడా 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చబడినట్లు ఏఏఆర్ తాజా ఉత్తర్వులో పేర్కొంది. (పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ!) దీనిపై సూరత్‌కు చెందిన జేజే ఎంటర్ప్రైజెస్ యాజమాని జె జలారామ్ తమ ఉత్పత్తులపై విధించే జీఎస్టీపై స్పష్టత కోసం ఏఏఆర్ను సంప్రదించగా అకా పాప్‌కార్న్ ఉత్పత్తులు అన్ని కూడా 18 శాతం కిందకు వస్తాయని ఏఏఆర్ స్పష్టం చేసింది. దీంతో జేజే తాము నిల్వ పదార్థాలు తయారిలో వాడే నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు ముదలైన పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తులు అన్ని కూడా 5 శాతం పన్ను కిందకే వస్తాయని, అందువల్ల పాప్‌కార్న్‌పై కూడా అదే పన్ను ను కొనసాగించాలని ఏఏఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు ఏఏఆర్ ఆంగీకరించకపోగా 18 శాతం జీఎస్టీని తప్సనిసరిగా వర్తింపచేయాలని హెచ్చరించింది. రెడీ టూ ఈట్‌కు సంబంధించిన ప్యాక్డ్ నిల్వ ఆహార పదార్థాలు అన్ని కూడా 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకే వస్తాయని, అంతేగాక జేజే పాప్‌కార్న్ తృణ ధాన్యాలు వేయించడం ద్వారా తయారు చేసినట్లు తమ తయారి విధానంలో పేర్కొందని, అందువల్ల ఈ పాప్‌కార్న్‌ను 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చబడిందని ఏఏఆర్ తెలిపింది. (పన్ను ఎగవేతదారుల పప్పులుడకవు) -
ప్రాణం మీదకు తెచ్చిన పాప్‌కార్న్..!
లండన్: బ్రిటన్‌కు చెందిన 41 ఏళ్ల ఆడమ్ మార్టిన్ పంటిలో సెప్టెంబర్‌లో పాప్‌కార్న్ ఇరుక్కుంది. దీంతో దానిని బయటకి తీయడానికి పెన్, టూత్‌పిక్, వైరు ముక్క, నెయిల్ కట్టర్ ఇలా అనేక సామగ్రిని పాప్‌కార్న్‌పై ప్రయోగించాడు. దీంతో మార్టిన్ చిగుళ్లకి ఇన్ఫెక్షన్ సోకింది. అదీ కాస్తా పెరిగి పెరిగి ఎడోకార్డిటిస్ అనే గుండె వ్యాధికి దారి తీసింది. రాత్రిళ్లు నిద్రలో బాగా ఇబ్బందిగా ఉండటంతో వైద్యుడి వద్దకు వెళ్లగా గుండె దెబ్బతిందని చెప్పారు. చిగుళ్ల ఇన్ఫెక్షన్ రక్త నాళాల ద్వారా గుండెకు చేరి రక్తం గడ్డకట్టిందని వివరించారు. సరైన సమయానికే గుర్తించడంతో ఓపెన్ హార్ట్ సర్జరీ చేసి ఇన్ఫెక్షన్ను తొలగించారు. నరకానికి చాలా దగ్గరగా వెళ్లి అదృష్టం కొద్ది బయటపడ్డానని, ఇకపై పాప్‌కార్న్ జోలికి మాత్రం పోనని మార్టిన్ అంటున్నాడు -
జలుబు చేసిందా... పాప్‌కార్న్ తిని చూడండి!
ఈసారి మీకు జలుబు చేసినట్లు అనిపించగానే ఏ ట్యాబ్లెట్ కోసమో మందులషాపుకు పరుగులు తీయకండి. ఆన్‌కౌంటర్ మెడిసిన్ కొని ఆరోగ్యాన్ని పాడుచేసుకోకండి. ఈసారి జలుబు చేసినప్పుడు పాప్‌కార్న్ తిని చూడండి. ఇలా చేయడం వల్ల జలుబు తగ్గుతుందనేది పెన్సిల్వేనియాలోని ‘యూనివర్సిటీ ఆఫ్ స్క్రాంటన్’కు చెందిన అధ్యయనవేత్తలు చెబుతున్న మాట. పాప్‌కార్న్‌లో పాలీఫినాల్స్ అనే యాంటీ ఆక్సిడెంట్ పాళ్లు ఎక్కువగా ఉంటాయనీ, అవి జలుబును తగ్గిస్తాయని వాళ్లు పేర్కొంటున్నారు. మరో విషయం ఏమిటంటే ఇలా పాప్‌కార్న్‌లో లభ్యమయ్యే ఈ యాంటీఆక్సిడెంట్స్ మోతాదులు కొన్ని పండ్ల నుంచి లభ్యమయ్యే వాటి కంటే కూడా చాలా ఎక్కువని వారు అంటున్నారు. పనిలో పనిగా మరో జాగ్రత్త కూడా చెబుతున్నారు. ఇలా పాప్‌కార్న్ తినే సమయంలో అందులో ఉప్పు వేసుకోకపోవడం చాలా మంచిదని సూచిస్తున్నారు. ఉప్పు వేయడం వల్ల పాప్‌కార్న్ వల్ల ఒనగూరే ప్రయోజనాలు తగ్గిపోతాయని, పైగా దేహానికి కూడా కొత్త సమస్యలు వస్తాయని కూడా వారు హెచ్చరిస్తున్నారు. -
‘అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే’
సాక్షి, న్యూఢిల్లీ : దక్షిణ భారత దేశంలో ‘ఎస్పీఐ సినిమాస్’ హాళ్లను ‘పీవీఆర్ సినిమాస్’ కొనుగోలు చేసిందనే వార్త సోషల్ మీడియాలో ఆందోళన రేకెత్తిస్తోంది. ‘సత్యం సినిమా హాళ్లతో మాకున్న అనుబంధాన్ని, తీపి గుర్తులను ఎలా మరచిపోయేది?’ అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్పీఐ సినిమాస్‌ను సాధారణంగా సత్యం సినిమాస్‌గా వ్యవహరిస్తారు. వెన్న చిలకరించిన వివిధ ఫ్లేవర్ల పాప్‌కార్న్ ఇక తినే భాగ్యం లేదా ? అంటూ ఎక్కువ మంది బాధ పడుతున్నారు. ఈ సత్యం థియేటర్లలో పాప్‌కార్న్ చాలా పాపులర్. అది అత్యంత రుచికరంగా ఉంటుంది. అది అమెరికాలోని ఓ రైతు సహకార సంఘం ఆధ్వర్యంలో పండిస్తున్న అధికోత్పత్తి రకం పాప్‌కార్న్ కావడం వల్ల అది ఎంతో రుచిగా ఉంటుందని ఎస్పీఐ సినిమాస్‌లోని ‘ఎక్స్పీరియన్నెస్ విభాగం’ అధ్యక్షుడు భవేశ్ షా తెలిపారు. భారత్‌లో దొరికే పాప్‌కార్న్ తక్కువ దిగుబడినిచ్చే వంగడం నుంచి వచ్చేదని, ఇది లావుగా ఉండి, కాస్త గట్టిగా ఉంటుందని ఆయన చెప్పారు. అమెరికా నుంచి దిగుమతి చేసుకొనే పాప్‌కార్న్ కాస్త సన్నగా, మృదువుగా ఉండి ఎంతో రుచిగా ఉంటుందని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, ముంబైలోని ఎస్పీఐ సినిమాస్‌లో 71.7 శాతం వాటాను అంటే, 222,711 ఈక్విటీ వాటాను 633 కోట్ల రూపాయలను చెల్లించి కొనుగోలు చేసినట్లు దేశంలోనే అతిపెద్ద సినిమా థియేటర్ల చైన్‌ను కలిగిన పీవీఆర్ సినిమాస్ ఆదివారం నాడు ప్రకటించిన విషయం తెల్సిందే. దీంతో దేశంలోని 60 నగరాల్లో పీవీఆర్‌కు సినిమా హాళ్ల సంఖ్య 703కు చేరుకుంది. ఎస్పీఐ సినిమాస్ వ్యవస్థాపకులైన కిరణ్ ఎం రెడ్డి, స్వరూప్ రెడ్డిలు తమ వ్యాపారంతో కొనసాగుతారని పీవీర్ యాజమాన్యం వెల్లడించింది. ఈ విక్రయంపై ట్విట్టర్ వినియోగదారులు తమదైన శైలిలో స్పందించారు. ‘ఇది విచారకరమైన వార్త. చెన్నై వాసులకు సత్యం ఒక ఆత్మ, ఒక అనుభూతి... మీరు మీ థియేటర్లను ఎవరికైనా అమ్ముకోండి. వారు వాటికి ఏ పేరైనా పెట్టుకోనియ్యండి, మా దృష్టిలో మాత్రం అవి ఎప్పటికీ సత్యం థియేటర్లే... పీవీఆర్ అనేది ఓ పేరు మాత్రమే. సత్యం అన్నది మా భావోద్వేగం’ అంటూ కొందరు స్పందించగా ఎక్కువ మంది ‘మా పాప్ కార్న్ జోలికి రాకండి’ అంటూ అది అలాగే కొనసాగాలని ఎక్కువ మంది కోరుకున్నారు. వారి కోరిక మేరకు సత్యం సినిమా హాళ్లలో పాత ఫుడ్ చైన్‌ను అలాగే కొనసాగిస్తామని పీవీఆర్ చీఫ్ ఫైనాన్సియల్ ఆఫీసర్ నితిన్ సూద్ స్పష్టం చేశారు. -
ఈ థియేటర్లకు ఏమైంది?
మధురవాడ ప్రాంతానికి చెందిన రాజేష్ తన కుటుంబ సభ్యులతో కలసి సీఎంఆర్ సెంట్రల్‌లోని మల్టీప్లెక్స్ థియేటర్‌కు వెళ్లాడు. నలుగురు సభ్యులకు రూ.150 చొప్పున ఆన్లైన్లో టికెట్లు బుక్ చేశాడు. ట్యాక్స్‌తో కలిపి రూ. 687 అయింది. విరామ సమయంలో బయటకు పిల్లలను తీసుకుని వచ్చి రెండు పాప్‌కార్న్‌లు, రెండు కూల్ డ్రింక్‌లు ఇవ్వమన్నాడు. వాస్తవానికి వాటి ధర రూ.200కు మించి ఉండదని రాజేష్ ఊహించాడు. కానీ రూ.900 బిల్లు వేసి అతని చేతిలో వాటిని పెట్టారు. ఒక్కసారిగా కంగుతిన్న రాజేష్ పిల్లలను బాధపెట్టలేక ఆ సమయానికి డబ్బులు చెల్లించేశాడు. ఇది ఆయన ఒక్కడికే కాదు.. మల్టీప్లెక్స్ థియేటర్లకు వినోదం కోసం వెళుతున్న ప్రతి ఒక్క ప్రేక్షకుడికి ఎదురవుతున్న అనుభవం. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న తనకు వచ్చే జీతంలో 15 శాతం ఒక్క సినిమాకు ఖర్చు అయ్యిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. జగదాంబ ప్రాంతంలోని ఓ సినిమా థియేటర్‌కు లక్ష్మణ్ తన భార్యతో సినిమాకు వెళ్లాడు. సినిమా టికెట్ రూ.118( ఇద్దరి రూ.236), బైక్ పార్కింగ్ రూ.20, కూల్ డ్రింక్రూ.60 (ఇద్దరికి రూ.120), సమోసాలు రూ.30 (నాలుగు), పాప్‌కార్న్ రూ.30 (ఇద్దరికి రూ.60) ఖర్చు అయింది. రూ. 500 నోటుతో వెళ్లిన ఆయనకు తిరిగి వచ్చేటప్పుడు కాస్తా చిల్లర మిగిలింది. సినిమా పూర్తయ్యేలోగా ఆయనకు సినిమా కనిపించింది. సినిమా ప్రేక్షకుడి ప్రస్తుత పరిస్థితిని సంఘటనలే తేటతెల్లం చేస్తున్నాయి. టికెట్ల ధరలతో పాటు తినుబండారాల విషయంలో ప్రేక్షకుడు నిలువునా దోపిడీకి గురవుతున్నాడు. పైగా జీఎస్టీ బాధుడు. ఎమ్మార్పీకే తినుబండారాలు విక్రయించాలన్న అధికారుల ఆదేశాలు ఎక్కడా అమలు కావడం లేదు. బీచ్‌రోడ్డు (విశాఖ తూర్పు): అలసిన మనసుకు సాంత్వన చేకూర్చేది వినోదం. అందులోనూ ప్రతి ఒక్కరినీ రంజింపజేసే మాధ్యమం సినిమా. అలాంటి సినీ వినోదం మరింత ఖరీదైపోయింది. సింగిల్ థియేటర్ల స్థానాన్ని మల్టీప్లెక్స్‌లు ఆక్రమిస్తున్న తరుణంలో సగటు ప్రేక్షకుడిని దోపిడీ చేయడమనేది సర్వసాధారణమైపోయింది. పార్కింగ్ కష్టాలు మొదలుకొని, టికెట్ ధరలు, ఫుడ్ అండ్ బేవరేజెస్ వరకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఐదుగురు సభ్యులున్న ఓ కుటుంబం సినిమాకు సొంత కారులో వెళ్లిరావాలంటేనే రూ.2వేల వరకు ఖర్చవుతున్నాయి. అందులో టికెట్లకు రూ.600 అయితే, మిగిలినదంతా ఫుడ్ అండ్ బేవరేజెస్కే! అలాగని ఇంటి నుంచి బిస్కెట్ ప్యాకెట్టో, వాటర్ బాటిలో తీసుకువెళ్దామంటే థియేటర్ డోర్ దగ్గరే ఆపేస్తున్నారు. దాంతో రెండున్నర గంటల వినోదానికి వేలల్లో వదిలించుకోవాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితి నుంచి ఉపశమనం కలిగిస్తూ ముంబై హైకోర్టు మల్టీప్లెక్స్‌ల్లోకి స్నాక్స్ తీసుకువెళ్లేందుకు అనుమతించాల్సిందేనని ఆదేశించింది. మార్గదర్శకాలు రూపొందించాలని సూచించడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు ఒకటి నుంచి మల్టీప్లెక్స్‌ల్లో బయట ఫుడ్ అనుమతించాలని స్పష్టం చేసింది. ఈ తీర్పుతో సినీ ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని థియేటర్లలో బయట ఫుడ్ అనుమతించాలని ప్రేక్షకులు కోరుతున్నారు. నగరంలోని కొన్ని థియేటర్లలో ప్రత్యేకంగా చిప్స్ ప్యాకెట్లను రూ.10 నుంచి విక్రయిస్తున్నారు. ఇవి బయట మార్కెట్లో కనిపించవు. వాటి నాణ్యతను బట్టి చూస్తే రూ.5 కూడా ఎక్కువే. నాణ్యత లేని తినుబండారాలను నచ్చిన ధరకు అమ్ముతూ ప్రేక్షకుల జేబులను ఖాళీ చేస్తున్నారు. సీఎంఆర్ లాంటి అతి పెద్ద మాల్లో మనకు నచ్చిన పాప్‌కార్న్ ప్లేవర్ రూ.25 మాత్రమే. కానీ సినిమా థియేటర్లలో రూ.30(మల్టీప్లెక్స్‌లో రూ.60 నుంచి). నగరంలో ఎక్కడ తీసుకున్న సమోసా ధర రూ.5 నుంచి రూ.7. మల్టీప్లెక్స్‌లో మాత్రం వీటి ధర ఒక్కొక్కటి రూ.50. ఎగ్ పఫ్ ప్రముఖ ఫుడ్ జోన్ల్లో రూ.15 దాటదు. కానీ సినిమా థియేటర్లలో రూ. 30. కేఎఫ్సీలో రూ.80లకు మీడియం సైజ్ కూల్ డ్రింక్‌తో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ వస్తుంది. కానీ థియేటర్లలో కేవలం ఫ్రెంచ్ ఫ్రైస్ రూ.60కు అమ్ముతున్నారు. స్వీట్ కార్న్ నగరంలోని ఎక్కడైనా రూ.10 నుంచి రూ.20 వరకు ఉంటుంది. కాని సినిమా థియేటర్లలో మాత్రం రూ.50. మిగతా తినుబండారాలు కూడా ఇలానే విక్రయిస్తున్నారు. ఫుడ్ అండ్ బేవరేజెస్ మీదే అధికాదాయం ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పు మల్టీప్లెక్స్‌లు, థియేటర్లకు పెనుభారంగా పరిణమించే అవకాశముందన్నది మల్టీప్లెక్స్ మేనేజర్ల మాట. మల్టీప్లెక్స్‌ల ఆదాయంలో 30 శాతం ఫుడ్ అండ్ బేవరేజెస్ అమ్మకాల ద్వారానే లభిస్తోంది. ఈ కారణం వల్లే ఆదాయం మరింత పెంచుకోవడానికి లైవ్ కిచెన్ కౌంటర్లు, ఎఫ్ అండ్ బీ మెనూ వంటి కార్యక్రమాలను చేపడుతు న్నాయి. ఫిక్కీ–కేపీఎంజీ 2017లో విడుదల చేసిన అధ్యయనంలోనూ ఎఫ్ అండ్ బీ ఆదాయం ద్వారానే మల్టీప్లెక్స్‌లు తమ ఆదాయం స్థిరంగా వృద్ధి చేసుకుంటున్నాయని వెల్లడించింది. కోర్టు తీర్పు ఇచ్చినా మారని యాజమన్యాలు సినిమా థియేటర్లలో ప్రత్యేక ప్యాకేజీల ధరలతో తినుబండారాలను గతంలో విక్రయించేవారు. దీనిపై వినియోగదారుల కోర్టు గతేడాది నవంబర్‌లో ఆగ్రహం వ్యక్తం చేసింది. 2018 జనవరి నుంచి అన్ని థియేటర్లలో సాధారణ ధరలకే తినుబండారాలను విక్రయించాలని ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల మేరకు కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ అన్ని థియేటర్ల యాజమాన్యాలను పిలిచి సాధారణ ధరలకే తినుబండారాలు విక్రయించాలని సూచించారు. మొదట్లో వాటర్ బాటిల్ మాత్రమే ఎమ్మార్పీకి విక్రయించారు. తర్వాత కోర్టు, కలెక్టర్ ఆదేశాలకు తమకు వర్తించవు అన్నట్టు వ్యవహరిస్తున్నారు. కాగా..వాణిజ్య సంస్థల్లో, సినిమా థియేటర్లలో పార్కింగ్ ఫీజు వసూళ్లకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేవని కోర్టు చెప్పినా.. థియేటర్ల యాజమాన్యాలు మాత్రం విచ్చలవిడిగా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఫిర్యాదులు చేస్తే తనిఖీలు చేస్తారటా.. ప్రేక్షకుల నుంచి థియేటర్ల యాజమాన్యాలు అడ్డంగా దోచుకుంటున్నా.. తమకు ఏం సంబంధం లేదన్నట్టు వ్యవహరిస్తున్నారు ఉన్నతాధికారులు. సినిమా థియేటర్లపై నియంత్రణకు కలెక్టరేట్లో సీ సెక్షన్ ఉంది. వారు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేస్తుండాలి. యాజమాన్యాలు తమ కార్యాలయాలకు పిలిపించుకుని మాట్లాడటం తప్పితే.. ఇటీవల కాలంలో థియేటర్లను తనిఖీలు చేసిన దాఖలాలే లేవు. థియేటర్లలో జరుగుతున్న ధరల దోపిడీపై వివరణ అడిగితే.. వారు చెప్పే సమాధానం ‘మాకు ఎవరూ ఫిర్యాదు చేయలేదు’. ఫిర్యాదు చేస్తే అప్పుడు తనిఖీలు చేస్తాం అంటూ సెలవిస్తున్నారు. వారు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో థియేటర్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తూ వ్యాపారుల ఆగడాలను కట్టడి చేయాల్సిన తూనికలు, కొలతల శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. సినిమా హాళ్లకు వెళ్లి తినుబండరాలను కొనేవారికి కళ్లు బైర్లు కమ్మే పరిస్థితి ఉందని అందరికీ తెలిసినా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ఇంత ధరలతో వినోదమా.. వినోదాన్ని ఎవరు కోరుకోరు. కానీ మరి ఇంత మూల్యానికా.. ధరలు పెంచడం వలనే పైరసీ చూడడానికి జనాలు ఇష్టపడుతున్నారు. సరసమైన ధరలు ఉంటే ప్రతీ ఒక్కరూ సినిమా థియేటర్లకు వచ్చే అవకాశం ఉంటుంది. టికెట్లు, తినుబండారాల ధరలు పెరిగితే సామాన్యుడు థియేటర్ల వైపు చూడడు. –దినేష్, ప్రేక్షకుడు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం ఏ సినిమా థియేటర్లలో అయినా అధిక ధరలకు తినుబండారాలను విక్రయిస్తున్నట్టు 1100, 18004250082, 18004252977 నంబర్లకు ఫిర్యాదు చేస్తే తనిఖీలు చేస్తాం. నిజంగానే అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం. అప్పుడప్పుడు తూనికలు– కొలతల అధి కారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. – ఆర్.నరసింహమూర్తి, సి–సెక్షన్ సూపరింటెండెంట్ చుక్కలు చూపిస్తున్నారు సరదాగా సినిమా కోసం వస్తే ప్రత్యేక ధరలంటూ చుక్కలు చూపిస్తున్నారు. కుటుంబంతో కలసి సినిమాకు రావాలంటే భయం వేస్తుంది. మా నుంచి యాజమాన్యాలు అడ్డగోలుగా దోచుకుంటున్నా.. అధికారులు పట్టించుకోకపోవడం దారుణం. అధికారులు ఎప్పటికప్పుడు సినిమా థియేటర్లను తనిఖీ చేయాలి. –కల్యాణ్,ప్రేక్షకుడు థియేటర్లను తనిఖీ చేయాలి సినిమా థియేటర్లలో లభించే ఆహార పదార్థాలు తినాలంటే భయం వేస్తుంది. ఒక వైపు అధికంగా ధరలు ఉంటే మరో వైపు ఎలాంటి నాణ్యత లేకుండా తయారు చేస్తున్నారు. కొన్ని చిప్స్ ప్యాకెట్ల థియేటర్లలో తప్పితే.. ఎక్కడా లభించవు. వాటిని తినడం వల్ల రోగాలు వచ్చే అవకాశం ఉంది. అధికారులు ఎప్పటికప్పుడు థియేటర్లను తనిఖీ చేయాలి. –కిశోర్ వర్మ, ప్రేక్షకుడు -
పాప్‌కార్న్ మిషన్‌లో బంగారం
టీ.నగర్: దుబాయ్ నుంచి చెన్నైకు వచ్చిన విమానంలో పాప్‌కార్న్ మిషన్‌లో తీసుకొచ్చిన బంగారాన్ని బుధవారం అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్ నుంచి చెన్నైకు ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానంలో వచ్చిన ప్రయాణి కుల వద్ద కస్టమ్స్ అధికారులు తనిఖీలు జరిపారు. నవాజ్ మాకింగల్ గెయిత్పాయిల్ అనే వ్యక్తి లగేజీని తనిఖీ చేయగా హానర్ పాప్‌కార్న్ మిషన్, తోషిబా రేడియో కనిపించాయి. వీటి బరువులో వ్యత్యాసం ఉండడంతో అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. పాప్‌కార్న్ మిషన్‌లో తొమ్మిది రేకులు, రేడియోలో 27 రేకులు సిల్వర్ కలర్లో కనిపించాయి. వీటిని పరిశీలించగా అవన్నీ 24 క్యారెట్ బంగారంగా తెలిసింది. వీటి బరువు 782 గ్రాములు. విలువ రూ.23లక్షలుగా తెలిసింది. బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకుని నవాజ్ మాకింగల్ గెయిత్పాయిల్‌ను అరెస్టు చేశారు. -
మల్టీ దోపిడీ!
మల్టీప్లెక్స్‌లలో ధరల మాయాజాలం నడుస్తోంది. రొటీన్‌కు భిన్నంగా సినీ‘మాల్స్’లో మూవీ చూద్దామని వెళ్తున్న ప్రేక్షకుల జేబులకు చిల్లు పడుతోంది. టిక్కెట్ ధరల నుంచి పార్కింగ్..తినుబండారాల ధరలు ప్రేక్షకులను గడగడలాడిస్తున్నాయి. ‘బాబోయ్...మరోసారి ఇక్కడికి రావొద్దు..’అనే స్థాయికి తీసుకువస్తున్నాయి. ఒక్కో వస్తువు ధర బయటి ధరల కంటే పది..ఇరవై రెట్లు ఎక్కువగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడు. పది రూపాయల పాప్‌కార్న్ ధర రూ.215 ఉందంటే పరిస్థితి ఏ రీతిన ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ధరలు నియంత్రించాల్సిన అధికారగణం నిర్లక్ష్యం వహిస్తోందని సగటు ప్రేక్షకుడు ఆరోపిస్తున్నాడు. గ్రేటర్‌లోని పీవీఆర్..బిగ్ సినిమాస్.. ఐనాక్స్.. ఐమాక్స్.. ఇలా అన్ని మల్టీప్లెక్స్ థియేటర్లలోనూ ధరల దోపిడీ కొనసాగుతోంది. – బంజారాహిల్స్ -సీన్ వన్... యూసుఫ్‌గూడకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి బంజారాహిల్స్ రోడ్ నం.2లోని మల్టీప్లెక్స్‌లో సినిమాకు వెళ్లాడు. సినిమా విరామ సమయంలో పిల్లలకు పాప్‌కార్న్ తెద్దామని ఫుడ్ కోర్టుకు వచ్చాడు. పావుకిలో బరువున్న పాప్‌కార్న్ ధర రూ.215 అని చెప్పడంతో నివ్వెరపోయాడు. అంతేకాకుండా అర లీటర్ వాటర్ బాటిల్ రూ.50, రెండు సమోసాలకు రూ.100 ధర ఉండటంతో ఆశ్చర్యానికి గురయ్యాడు. చేసేదేమీ లేక వాటిని కొనుగోలు చేశాడు. బయట రూ.10 మాత్రమే విలువ చేసే పాప్‌కార్న్‌ను ఏకంగా రూ. 215కు అమ్మడం ఏంటో అర్థం కాక నిట్టూరుస్తూ వచ్చి సీట్లో కూర్చున్నాడు. -సీన్ టు.. బేగంపేటకు చెందిన యువకుడు ఫ్రెండ్స్‌తో కలిసి నెక్లెస్‌రోడ్‌లో మల్టీప్లెక్స్ థియేటర్‌కు వచ్చాడు. వెజ్బర్గర్ కోసం రూ.160 సమర్పించుకోవాల్సి వచ్చింది. ఇక కూల్ డ్రింక్స్ ఒక్కోదానికి రూ. 210 ఖర్చుచేయాల్సి వచ్చింది. సినిమా చూసిన ఆనందం కంటే జేబుకు పడ్డ చిల్లును చూసి ఉసూరుమంటూ బయటకు వచ్చారు. ఈ రెండు ప్రాంతాల్లోనే కాదు నగరంలోని మల్టీప్లెక్స్‌ల్లో యథేచ్ఛగా ప్రేక్షకులను దోచుకుంటున్నారు. బంజారాహిల్స్: బంజారాహిల్స్ రోడ్‌నం 2లోని ఆర్కే సినీప్లెక్స్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో కూల్‌డ్రింక్స్, వాటర్ బాటిళ్లు, పాప్‌కార్న్ పేరుతో ప్రేక్షకులను అడ్డంగా దోచుకుంటున్నట్లు ‘సాక్షి’ పరిశీలనలో వెల్లడైంది. నెక్లెస్ రోడ్డులోని ఐమాక్స్, బంజారాహిల్స్ రోడ్ నం.1లోని జీవీకే మాల్లోని ఐనాక్స్, పంజగుట్ట హైదరాబాద్ సెంట్రల్‌లోని పీవీఆర్ సినిమాస్, అమీర్‌పేటలోని బిగ్ సినిమాస్, కూకట్‌పల్లిలోని సుజనా ఫోరమ్ మాల్, కాచిగూడలోని బిగ్ సినిమాస్.. ఇలా ఎక్కడ చూసినా దోపిడీ కొనసాగుతూనే ఉంది. రూ.10కి దొరికే పాప్‌కార్న్‌ను ఆకర్షణీయమైన ప్యాక్‌లో వేసి రూ.215కు అమ్ముతున్నారు. ఇక ఇరానీ హోటల్లో రూ.10కి ఒకటి చొప్పున దొరికే సమోసాలకు ఏ మాత్రం తీసిపోకుండా అందమైన బాక్సుల్లో పెట్టి రూ.50కి అమ్మడం మల్టీప్లెక్స్ నిర్వాహకులకే చెల్లింది. అంతా మా ఇష్టం... ఏదైనా వస్తువు కానీ తినుబం«డారాలు కానీ తయారు చేసి వాటిని విక్రయించేందుకు ఎమ్మార్పీని నిర్ణయిస్తారు. ఆ వస్తువు నాణ్యత, ముడి పదార్థాల విలువకు కొంతమేర లాభాన్ని జోడించి ఎమ్మార్పీ నిర్ణయిస్తారు. అయితే మల్టీప్లెక్స్‌ల్లో వీటిని నిర్ణయించే తీరు మాత్రం ఎవరికీ అంతుబట్టడం లేదు. ఉదాహరణకు ఆలుగడ్డ, మైదాపిండి తదితర వస్తువులతో తయారు చేసే సమోసాను సుమారు రూ.10 నుంచి రూ.15 ఖర్చుతో తయారు చేçస్తుంటారు. ఈ సమోసాలను ఏకంగా రూ.50కి అమ్మడం ఎంతవరకు సమంజసం అని సాధారణ ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నామమాత్రపు దాడులు.. ప్రేక్షకులను నిలువుదోపిడీ చేస్తున్నా...నిలువరించే అధికారం తమకు లేదని తూనికలు కొలతల శాఖ చేతులెత్తేస్తోంది. అడ్డగోలుగా రేట్లను నిర్ణయించి అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకునే అధికారం అధికారులకు లేకుండాపోయింది. కేవలం ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయించినపుడు, లేదా కొలతల్లో వ్యత్యాసం ఉంటేనే తాము దాడులు చేయగలమని వారు అంటున్నారు. అప్పుడప్పుడు దాడులు నిర్వహించి జరిమానాలు విధించడం, నోటీసులు జారీ చేయడం మినహా గట్టి చర్యలు తీసుకునే అధికారం ఈ శాఖకు లేదని మాల్స్ నిర్వాహకులకు తెలియడంతో వారి ఆగడాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. ‘సేల్స్ సెలెక్టివ్ చానెల్ ఓన్లీ’ అనే ఆప్షన్‌ను ఉపయోగించుకుని సొంతంగా ఎమ్మార్పీలు నిర్ణయించుకుని అధిక ధరలకు అమ్ముకునే వీలు ఉండడంతో.. బయట రూ.20కి దొరికే వాటర్ బాటిల్ మాల్స్, మల్టీ ప్లెక్స్‌లు, ఎయిర్‌పోర్టులు, స్టార్ హోటళ్లు తదితర ప్రాంతాల్లో రూ.60గా ప్రింట్ చేసుకుని అమ్మేస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలు ప్రాంతాల్లో చీటింగ్ కేసులు కూడా నమోదు చేశారు. ఓ రెస్టారెంట్లో రూ. 20 ఉన్న వాటర్ బాటిల్‌ను రూ. 9 అధికంగా అమ్మిన నిర్వాహకుడిపై మాదాపూర్‌లో కేసు నమోదైంది. బంజారాహిల్స్‌లోని ఓ హోటల్లో అధిక ధరకు వాటర్ బాటిల్ అమ్మినందుకు రూ. 20 వేల జరిమానా విధించారు. అలాగే మలీప్లెక్సుల్లో విక్రయాలపై కూడా నియంత్రణ ఉండాలని, సరైన ధరలకే అమ్మేలా చర్యలు తీసుకోవాలని ప్రేక్షకులు కోరుతున్నారు. వామ్మో ఇవేం ధరలు.. ఆర్కే సినీప్లెక్స్‌లోని పీవీఆర్ సినిమాస్‌లో రేట్లు ఇలా ఉన్నాయి.. అరలీటర్ వాటర్ బాటిల్ = రూ. 50 అరలీటర్ పెప్సీ గ్లాస్ = రూ. 210 రెండు సమోసాలు = రూ. 100 పాప్‌కార్న్ రెగ్యులర్ = రూ. 230 కోల్డ్ కాఫీ = రూ. 130 టీ = రూ. 130 వెజ్ బర్గర్ = రూ. 160 చికెన్ బర్గర్ = రూ. 170 పన్నీర్ టిక్కా = రూ. 160 స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నాం... ఎమ్మార్పీ కంటే అధికంగా విక్రయిస్తే చర్యలు తీసుకునే అధికారం మాకుంది. వచ్చే ఏడాది జనవరి 1 నుంచి రోడ్డుపక్కన బడ్డీకొట్టు నుంచి స్టార్ హోటల్లోని రెస్టారెంట్ వరకు ఒకేధరకు ప్యాక్డ్ వస్తువులు విక్రయించేలా చట్టంలో సవరణ అమల్లోకి రానుంది. ఆ తర్వాత పరిస్థితిలో కొంత మార్పు వస్తుంది. – భాస్కర్‌రెడ్డి, అసిస్టెంట్ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ -
పాప్‌కార్న్ రూ.200 పది కిలోల మక్కలు 150
సాక్షి, హైదరాబాద్: అందరికీ నోరూరించే పాప్‌కార్న్.. బడా షాపింగ్‌మాళ్లు, మల్టీప్లెక్స్‌లు, సినిమా హాళ్లలో పాప్‌కార్న్ ప్యాకెట్‌ను రూ.200 చొప్పున అమ్ముతున్నారు. బడా మాల్స్‌లో సినిమా టికెట్‌తో కలిపి కొంటే కాంబో ఆఫర్ పేరుతో రూ.175కు తగ్గించి ఇస్తున్నారు. గ్రేటర్లో ఖరీదైన జీవనానికి అలవాటుపడ్డ నగరవాసులకు ఇందులో వింతేముంది అనిపించొచ్చు..! కానీ పాప్‌కార్న్ తయారీకి వాడే మొక్కజొన్న(మక్కలు) పం డించిన రైతు ఈ ధర వింటే బిత్తరపోవటం ఖాయం. రైతులు 4 నెలలు చెమటోడ్చితే మొక్కజొన్న పంట చేతికందుతుంది. కంకులు ఒలిచి.. ఎండబెట్టిన మక్కలను మార్కెట్‌కు తరలించేందుకు రైతులు పడే ఇబ్బందులు అన్నిఇన్నీ కావు. ఇప్పుడున్న ధరల ప్రకారం మార్కెట్లో క్వింటాలు మక్కలమ్మితే రైతుకు రూ.1,300 నుంచి రూ.1,500 చేతికందుతున్నాయి. ప్రభుత్వం మొక్కజొన్న కు రూ.1,365 మద్దతుధర నిర్ణయించింది. దళారుల దందా, మార్కెట్ల వరకు రవాణా ఖర్చులు, పడిగాపులన్నీ లెక్కేసుకుంటే ఈ సీజన్లో రైతుకు రూ.1,300కు మించి ధర రాలేదు. అవే మక్కలతో తయారు చేసే పాప్‌కార్న్‌ను కొనాలంటే మాత్రం కళ్లు బైర్లు కమ్ముతాయి. ఒక పాప్‌కార్న్ ప్యాకెట్లో సగటున 50 గ్రాముల నుంచి వంద గ్రాముల మక్కలుంటాయి. రైతు అమ్మిన ధరతో పోలిస్తే మక్కలకు.. పాప్ కార్న్‌కు అసలు పొంతనే లేదు. నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.. కరెంటు ఖర్చు.. చిటికెడు ఉప్పు.. ఒక స్పూన్ నూనె.. అందమైన బొకే లాంటి ప్యాకెట్.. అన్నీ కలిపినా పాప్ కార్న్ ధర పది రూపాయలు దాటదు. కానీ.. పది కిలోల మక్కలు అమ్మితే రైతుకు వచ్చేది రూ.150 కంటే.. అదనంగా మరో రూ.50 వడ్డించ డమే కార్పొరేట్ కాసుల దందా అంటే..! -
సీజన్ బతుకులు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : తన రాష్ట్రం వదిలి పొట్టచేత పట్టుకుని మరొక రాష్ట్రంలోకి వచ్చిన ఆ వ్యక్తి సీజన్ (కాలాని)కి తగ్గట్టు వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఉత్తర ప్రదేశ్‌లోని మెన్పురి జిల్లా అలీపుర్ఖెడా గ్రామానికి చెందిన రామ్‌బహుదూర్ 16 ఏళ్ల క్రితం అనంతపురం వచ్చాడు. వేసవిలో ఐస్‌క్రీమ్, శీతాకాలంలో మొక్కజొన్న కంకులు, పాప్‌కార్న్ హాట్ హాట్‌గా విక్రయిస్తున్నాడు. ఇక్కడ తనతోపాటు తన కుమారుడు, కోడలుతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. తన వద్ద ముగ్గురు వర్కర్లు ఉన్నారని, వారికి కూడా తోపుడు బండ్లు ఇచ్చి ఇదేవ్యాపారం చేయిస్తున్నాడు. ప్రతిరోజూ 300–400 రూపాయల వ్యాపారం జరుగుతోంది. అందులో పెట్టుబడి పోను మిగతాది కుటుంబ పోషణకు సరిపోతోందని రామ్‌బహుదూర్ తెలిపాడు. ప్రతి ఏడాదీ దీపావళి, హోళీ పండుగలకు మాత్రమే స్వగ్రామానికి వెళ్లి వస్తామని చెప్పాడు. -
మల్టిఫ్లెక్స్‌లో పాప్‌కార్న్ ఇక దొరకదా?
హైదరాబాద్ : నగరంలో మల్టిఫ్లెక్స్‌లు ఎంతైనా కొంచెం కాస్ట్లీనే... పార్కింగ్ కాస్ట్.. సినిమానే కాదు.. ఇటు పాప్‌కార్న్ వంటి తినే స్నాక్స్ ధరలు కూడా ఎక్కువగానే ఉంటున్నాయి. ఈ ధరల మోతను భరించలేని కొందరు హైదరాబాదీలు మల్టిఫ్లెక్స్‌లో పాప్‌కార్న్‌ను బాయ్‌కాట్ చేయాలని సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. సినిమా హాల్స్‌లో పాప్‌కార్న్ ధరలు మరీ చుక్కలు చూపిస్తున్నాయని, మిడ్ సైజ్ ప్యాక్ ధర రూ.190, టబ్ రూ.270 వరకు ఉంటున్నాయని వాపోతున్నారు. జీహెచ్ఎంసీ ప్రమేయంతో మల్టిఫ్లెక్స్‌లో రేట్లను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. మీడియం ప్యాక్ రూ.210 అంటే, ఒక్కో కార్న్ ధర ఒక్క రూపాయి అన్నమాట. ఇంత భారీ మొత్తంలో ధరలను ఎవరు నిర్ణయించారని సినిమా చూడటానికి వెళ్తున్న ప్రేక్షకులు వర్తకులను ప్రశ్నిస్తున్నారు. ఈ ధరలు మరీ ఎక్కువగా ఉన్నాయని వర్తకులతో వాదనకు దిగుతున్నారు. అయినా మల్టిఫ్లెక్స్‌లో ధరలు మాత్రం దిగిరావడం లేదని ప్రేక్షకులు చెబుతున్నారు. ఒక్క పాప్‌కార్న్ ప్యాక్ ధర రూ.50 కంటే మించదని, ఇతరాత్ర వ్యయాలను కలుపుకున్నా.. వర్తకులు అదనంగా రూ.20 నుంచి రూ.30 చార్జ్ చేయొచ్చని ప్రేక్షకులంటున్నారు.కానీ వర్తకులు మరీ ఘోరంగా 300 శాతం అదనపు రేట్ విధిస్తున్నారని పేర్కొంటున్నారు. దీంతో సులభంగా ఒక్క షోకు రూ.15వేల నుంచి రూ.20వేల వరకు వర్తకులు ఆర్జిస్తున్నారని చెప్పారు. ప్రేక్షకులకు ధరలు బాదుతూ రోజుకి లక్షల్లో వీరు అక్రమంగా సంపాదిస్తున్నారని పలువురు వాపోతున్నారు. ఈ ధరలపై విసుగెత్తిన కొందరు హైదరాబాదీలు సోషల్ మీడియాలో ప్రచారం ప్రారంభించారు. మల్టిఫ్లెక్స్‌లో ధరలు దిగిరావాలని, లేనిపక్షంలో వాటిని బాయ్‌కాట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.అయితే ధరలు తగ్గించమని అడగడానికి బదులుగా..పాప్‌కార్న్ కొనుగోలు చేయడం మానేయడంటూ వారిపై వర్తకులు మండిపడుతున్నారు. మల్టిఫ్లెక్స్‌లో తినే ఉత్పత్తులపై ధరలు నిర్ణయించడానికి జీహెచ్ఎంసీకి ఎలాంటి పాత్ర లేదని, ఇవి బిల్డింగ్ ఓనర్‌కు, కాంట్రాక్టర్‌కు మధ్య కుదిరిన ఒప్పందం అంటూ ఖరాకండీగా చెబుతున్నారు. ప్రేక్షకుల డిమాండ్ కు దిగొవచ్చి జీహెచ్ఎంసీ మల్టిఫ్లెక్స్‌లో వర్తకులు విధిస్తున్న ఈ స్నాక్ ఐటమ్స్ ధరలు నియంత్రిస్తుందో లేదో చూడాలి. -
కేఎఫ్‌సీ భోజనంలో పురుగులు!
కేఎఫ్‌సీ.. తన వినియోగదారులకు షాకుల మీద షాకులిస్తోంది. సాయంత్రం సరదాగా అలా బయట తిందామని వెళ్లిన వారికి కేఎఫ్‌సీ పాప్‌కార్న్ చికెన్ మీల్లో పురుగులు కనిపించడంతో ఆశ్చర్యం, అసహ్యం రెండూ కలిగాయి. ఇటీవలి కాలంలో కేఎఫ్‌సీ మీద పలు సందర్భాల్లో ఆరోపణలు వచ్చాయి. ఇటీవల ఇండియాలో హైదరాబాద్, మంగుళూరు తదితర ప్రాంతాల్లో కేఎఫ్‌సీ బర్గర్లలో పురుగులు రావడం, చికెన్‌లో బ్యాక్టీరియా ఉండటం కనిపించాయి. తాజాగా 27 ఏళ్ల జెన్నిఫర్ ఆల్డెర్సన్ తన కుమార్తె లిడియా హోనేతో కలసి బిషప్ ఆక్లాండ్ లోని దుర్హామ్ ప్రాంతంలో ఉన్న కేఎఫ్‌సీకి వెళ్లారు. అక్కడ చికెన్ పాప్‌కార్న్ మీల్ కోసం ఆర్డర్ ఇచ్చారు. తీరా లిడియా తింటున్న పాప్‌కార్న్‌లో పురుగు కనిపించడంతో జెన్నిఫర్ షాకయ్యింది. ఒకేవారంలో ఇలా కేఎఫ్‌సీ ఆహారంలో క్రిములు కనిపించడం ఇది రెండోసారని అక్కడే ఉన్న మరో మహిళ చెప్పడం.. అగ్నికి ఆజ్యం పోసింది. పురుగు కనిపించిన తర్వాత జెన్నిఫర్ కుటుంబ సభ్యులు.. మిగిలిన పదార్థాలను తినలేకపోయారు. పదార్థాలన్నింటినీ వాపస్ ఇచ్చేసిన ఆల్డెర్సన్.. కేఎఫ్‌సీ సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పదార్థాలను చుట్టి ఫ్రిజ్ లో పెట్టిన తర్వాత పురుగులు ఎలా వస్తాయని, మీ అజాగ్రత్త వల్లే ఇలా జరిగిందని మండిపడింది. దీంతో కేఎఫ్‌సీ సిబ్బంది మరోసారి ఇలా జరగకుండా చూస్తామంటూ క్షమాపణలు చెప్పారు.. అయితే మొక్కజొన్న వంటి సహజ ఉత్పత్తుల విషయంలో దురదృష్టవశాత్తు అరుదుగా ఇలా అవుతుందని, గింజలను తొలిచి క్రిములు లోపల ఉండటంతో కనపడవని కేఎఫ్‌సీ సిబ్బంది సంజాయిషీ ఇస్తున్నారు. ఇలాంటి తప్పులు జరిగితే తాము ఆర్డర్ పూర్తిగా వాపస్ తీసుకుంటామని, తమ కస్టమర్ కేర్ సిబ్బంది కూడా అందుబాటులో ఉండి ఎటువంటి సహాయం కావాలన్నా అందిస్తారని చెప్తున్నారు. ఆహార భద్రతాధికారులు కూడా ఒకే వారంలో రెండుసార్లు ఇలాంటి ఘటనలు జరగడంపై కేఎఫ్‌సీని వివరణ కోరారు. -
మిస్సవుతారు... మీ ఇష్టం మరి!
పాప్‌కార్న్... భలే ఉంటుంది. కరకర... ఆలూ... ఎలా వండినా... ఊ.. లలలా! ఆవకాయ... కారం, కమనీయం. మంచూరియా... ఓ మారియా! ఓ మారియా! పరాఠా... పొరల పొరలుగా.. హాట్ హాట్‌గా.. సూప్... స్మూత్ అండ్ స్వీట్. వీటన్నిటినీ... క్యాలీఫ్లవర్‌తో చేస్తే? క్యాలీఫ్లవర్తోనా!! అవును కాలీఫ్లవర్తోనే. బాగుంటాయ్ చేసుకోండి. బాబోయ్ వద్దు అంటారా? మిస్సవుతారు.. మీ ఇష్టం మరి. గోబీ మంచూరియా కావలసినవి: క్యాలీఫ్లవర్ - 1, మైదా పిండి - కప్పు, కార్న్ ఫ్లోర్ - కప్పు, పచ్చి మిర్చి - 6, అల్లం తురుము - టీ స్పూను, వెల్లుల్లి ముద్ద - టీ స్పూను, ఉప్పు - తగినంత, ఉల్లి తరుగు - కప్పు, ఉడికించిన బఠాణీ - కప్పు, సోయా సాస్ - టీ స్పూను, అజినమోటో - అర టీ స్పూను, నూనె - డీప్ ఫ్రైకి సరిపడా, ఉల్లికాడల తరుగు - పావు కప్పు తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా నీళ్లతో కడిగి చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసి కొద్దిగా ఉడికించాలి. మిక్సీలో పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి వేసి మెత్తగా చేయాలి. పెద్ద పాత్రలో క్యాలీ ఫ్లవర్ తరుగు, అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి ముద్ద, ఉడికించిన బఠాణీ, ఉల్లి తరుగు, ఉప్పు వేసి బాగా కలపాలి. కార్న్‌ఫ్లోర్, మైదా పిండి వేసి పకోడీల పిండిలా కలపాలి (నీళ్లు పోయకూడదు) బాణలిలో నూనె కాగాక క్యాలీఫ్లవర్ మిశమ్రన్ని చిన్న చిన్న మంచూరియాలుగా వేసి దోరగా వేయించి కిచెన్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి. వేరొక బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక వెల్లుల్లి రేకలు, అల్లం తురుము, పచ్చి మిర్చి తరుగు, ఉల్లి కాడల తరుగు వేసి వేయించాలి. తయారయిన మంచూరియాలను వేసి అన్నీ కలిసేలా కలుపుతుండాలి. చిన్న గిన్నెలో కొద్దిగా కార్న్‌ఫ్లోర్, తగినన్ని నీళ్లు వేసి పల్చగా పిండి కలిపి, బాణలిలోని మంచూరియాల మీద వేసి కలపాలి. సోయాసాస్, అజినమోటో వేసి మరోమారు కలిపి రెండు నిమిషాలలో దింపేసి, టొమాటో సాస్‌తో సర్వ్‌చేయాలి. ఆలూ గోబీ కావలసినవి: నూనె - టేబుల్ స్పూను, జీలకర్ర - టీ స్పూను, వెల్లుల్లి రేకలు - 4, అల్లం తురుము - టీ స్పూను, ఆలుగడ్డలు - 2 (ఉడికించి తొక్క తీసి, పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి), పసుపు - అర టీ స్పూను, కారం - అర టీ స్పూను, జీలకర్ర పొడి - టీ స్పూను, కరివేపాకు - 2 రెమ్మలు, ఉప్పు - తగినంత, క్యాలీఫ్లవర్ - చిన్నది (1), కొత్తిమీర తరుగు - టీ స్పూను, తయారీ: బాణలిలో నూనె వేడయ్యాక జీలకర్ర, వెల్లుల్లి రేకలు, అల్లం తురుము వేసి వేయించాలి. ఆలుగడ్డ ముక్కలు వేసి బాగా కలపాలి. పసుపు, కారం, జీలకర్ర, గరం మసాలా, ఉప్పు, కరివేపాకు వేసి క లిపి, సుమారు ఆరేడు నిమిషాలు మధ్యమధ్యలో కలుపుతుండాలి. క్యాలీఫ్లవర్, కొత్తిమీర తరుగు జత చేసి బాగా కలపాలి. మూత పెట్టి పది నిమిషాలు ఉడికించి దింపేయాలి. క్యాలీఫ్లవర్ చరిత్ర ఈ పూలు క్రీ.పూ.6 వ శతాబ్దానికి చెందినవి. ఈ పదం కాలిస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. కాలిస్ అంటే క్యాబేజీ అని అర్థం. ఈ పువ్వు భారతదేశంలోకి1822లో ఆంగ్లేయుల ద్వారా ప్రవేశించింది. క్యాలీఫ్లవర్‌ను ఉడికించుకోవచ్చు, వేయించుకోవచ్చు, ఆవిరి మీద ఉడికించనూ వచ్చు. పచ్చిగానూ తినచ్చు. పాప్‌కార్న్ క్యాలీఫ్లవర్ కావలసినవి: పంచదార - 4 టీ స్పూన్లు, పప్పు - టీ స్పూను, కారం - టీ స్పూను, పసుపు - టీ స్పూను, ఉల్లి పొడి - అర టీ స్పూను, వెల్లుల్లి పొడి - అర టీ స్పూను, క్యాలీఫ్లవర్ - చిన్న పువ్వు, కుకింగ్ స్ప్రే - తగినంత (ఇందులో పదార్థాలు సూపర్ మార్కెట్లలో కాని బేకరీలలో కాని దొరుకుతాయి) తయారీ: ముందుగా అవెన్‌ను 400 డిగ్రీల ఫారెన్‌హీట్ దగ్గర వేడి చేసుకోవాలి. బేకింగ్ షీట్ మీద అల్యూమినియం ఫాయిల్ వేయాలి. ఒక పాత్రలో పంచదార, ఉప్పు, కారం, పసుపు, ఉల్లి పొడి, వెల్లుల్లి పొడి వేసి బాగా కలపాలి. క్యాలీఫ్లవర్‌ను చిన్న చిన్న ముక్కలుగా తరిగి వేడి నీళ్లలో శుభ్రంగా కడిగి తడిపోయే వరకు నీడలో ఆరబెట్టాలి. బేకింగ్ షీట్ మీద క్యాలీ ఫ్లవర్ తరుగు పల్చగా పరవాలి. కుకింగ్ స్ప్రేను అన్నిటి మీద తేలికగా స్ప్రే చేయాలి. కలిపి ఉంచుకున్న మసాలాను వీటి మీద చల్లాలి. సుమారు 30 నిమిషాలు అవెన్‌లో ఉంచి తీసి వేడివేడిగా అందించాలి. క్యాలీఫ్లవర్ పాప్‌కార్న్ సిద్ధమయినట్లే. క్యాలీఫ్లవర్ పరాఠా కావలసినవి: క్యాలీఫ్లవర్ - చిన్నది-1, పచ్చి మిర్చి ముద్ద - టీ స్పూను, ధనియాల పొడి - టీ స్పూను, ఉప్పు - తగినంత, నూనె - తగినంత, గోధుమపిండి - 3 కప్పులు. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను చిన్నచిన్న ముక్కలుగా కట్‌చేసి, గోరువెచ్చని నీటిలో పది నిమిషాలు ఉంచి తీసేయాలి. తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి మెత్తగా ఉడికించాలి. పెద్ద పాత్రలో గోధుమపిండి, ఉడికించిన క్యాలీఫ్లవర్, పచ్చి మిర్చి ముద్ద, ధనియాల పొడి, ఉప్పు వేసి చపాతీలా కలపాలి (అవసరమనుకుంటేనే నీళ్లు జత చేయాలి). పెద్ద నిమ్మకాయ పరిమాణంలో ఉండలు చేసి పక్కన ఉంచాలి. ఒక్కో ఉండను పరాఠాలా జాగ్రత్తగా ఒత్తి, పెనం మీద వేసి రెండు వైపులా నూనె వేసి కాల్చాలి. కుర్మాతో కాని, పెరుగుతో కాని తింటే రుచిగా ఉంటాయి. క్యాలీఫ్లవర్ ఆవకాయ కావలసినవి: క్యాలీఫ్లవర్ తరుగు - మూడు కప్పులు, ఆవాలు - ఒకటిన్నర టీ స్పూన్లు, మెంతులు - అర టేబుల్ స్పూను, నిమ్మరసం - 2 టేబుల్ స్పూన్లు, కారం - 100 గ్రా., నువ్వుపప్పు నూనె - పావు కేజీ, పసుపు - పావు టీ స్పూను, ఉప్పు - తగినంత, వెల్లుల్లి రేకలు - 10. తయారీ: ముందుగా క్యాలీఫ్లవర్‌ను శుభ్రంగా కడగాలి. ఉప్పు జత చేసిన నీళ్లు గోరు వెచ్చని నీళ్లలో క్యాలీఫ్లవర్ తరుగును సుమారు పది నిమిషాలు ఉంచాక, నీళ్లను వడకట్టాలి. తడి పూర్తిగా పోయేవరకు క్యాలీఫ్లవర్‌ను నీడలో ఆరబెట్టాలి. బాణలిలో నూనె పోసి కాగాక, క్యాలీఫ్లవర్ తరుగు వేసి సన్న మంట మీద సుమారు ఐదు నిమిషాలు వేయించి, నూనె తీసి పక్కన ఉంచాలి. (నూనెలోనే ఉంచితే ముక్కలు మెత్తబడిపోతాయి) బాణలిలో నూనె లేకుండా మెంతులు వేయించి, చల్లారాక పొడి చేసి పక్కన ఉంచుకోవాలి. ఆవాలను ఎండ బెట్టి, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి. పెద్ద పాత్రలో క్యాలీఫ్లవర్ ముక్కలు, పక్కన ఉంచిన నూనె వేసి కలపాలి. ఆవ పొడి, మెంతి పొడి, కారం, ఉప్పు, పసుపు, మెత్తగా చేసిన వెల్లుల్లి వేసి బాగా కలపాలి. నిమ్మరసం వేసి మరోమారు కలపాలి. తడి లేని జాడీలో నిల్వ చేసుకోవాలి. ఫ్రిజ్లోఉంచితే నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. విడిగా ఉంచితే 15 రోజులు మాత్రమే నిల్వ ఉంటుంది. వేడివేడి అన్నంలో, కమ్మటినెయ్యితో క్యాలీఫ్లవర్ ఆవకాయ అందిస్తే రుచిగా ఉంటుంది. ఉల్లిపాయ క్యాలీఫ్లవర్ సూప్ కావలసినవి: రౌండ్ బ్రెడ్ - 1 స్లైసులు, వెన్న-2 టేబుల్ స్పూన్లు (కరిగించాలి) సూప్ కోసం: ఉల్లితరుగు - కప్పు, క్యాలీఫ్లవర్ తరుగు - కప్పు, వెల్లుల్లి రేకలు - 2 (సన్నగా తరగాలి), బటర్ లేదా ఆలివ్ ఆయిల్ - 2 టేబుల్ స్పూన్లు, మైదా పిండి - టేబుల్ స్పూను, ఉడికించిన కూరగాయల నీళ్లు (వెజిటబుల్ స్టాక్) - 2 కప్పులు, పాలు - కప్పు (చిక్కటివి), కుంకుమ పువ్వు - చిటికెడు, ఉప్పు - తగినంత, మిరియాల పొడి - 2 టీ స్పూన్లు. తయారీ: బ్రెడ్ బౌల్, బ్రెడ్ పై భాగంలో గుండ్రంగా కట్ చేసి బౌల్ మాదిరి చేసుకోవాలి. కరిగించిన బటర్‌ను బ్రెడ్ లోపలి భాగమంతా పూతలా పూయాలి. అవెన్‌ను 350 డిగ్రీల దగ్గర ప్రీహీట్ చేసి, బ్రెడ్ బౌల్స్‌ను సుమారు 20 నిమిషాలు బేక్ చేయాలి. సూప్ తయారీ: పాన్‌లో బటర్ లేదా ఆలివ్ ఆయిల్‌ను వేడి చేసి వెల్లుల్లి రేకలు వేసి కొద్ది సేపు వేయించాలి. ఉల్లి తరుగు, క్యాలీఫ్లవర్ తరుగు జత చేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి. మైదా పిండి వేసి బాగా కలపాలి. వెజిటబుల్ స్టాక్ జత చేసి బాగా కలపాలి. పాలలో కలిపిన కుంకుమ పువ్వు, ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి, మరిగాక సన్నని మంట మీద సుమారు పది నిమిషాలు ఉంచితే సూప్ బాగా చిక్కబడుతుంది. సూప్‌ను బ్రెడ్ బౌల్స్‌లో వేసి వేడివేడిగా అందించాలి. (బ్రెడ్ బౌల్స్ అవసరం లేదనుకుంటే, మామూలు పాత్రలో సూప్ సర్వ్ చేసుకోవచ్చు)