సామాజిక మాధ్యమాల్లో కొత్తరకంగా కనిపించే ప్రతి ఒక్క వీడియోను కోట్ల మంది చూస్తారనడానికి నిదర్శనం ఈ వీడియో. అలోనా లోయివెన్ అనే యువతి కంటెంట్ క్రియేటర్‌గా పేరొంది ఇన్‌స్టా గ్రామ్‌లో వీడియోలు చేస్తోంది. తాజాగా ఈమె చేసిన కొత్త రకం వీడియోను జనం అదేపనిగా చూస్తున్నారు. అసలు ఆ వీడియో చివర్లో ఏం జరుగుతుందా అని వీడియో చివరికంటా చూసి కోట్లాది మంది అవాక్కయ్యారు. అలా ఒకరి తర్వాత మరొకరు షేర్ చేస్తూ పోవడంతో ఇప్పుడా వీడియో వీక్షణలు ఏకంగా 8.7 కోట్లు దాటిపోయాయి.
ఏముందా వీడియోలో?
మొక్కజొన్న పొత్తును ఒలిచి అందులో ఒకే ఒక్క గింజను తీసుకుని వేడి నాన్‌స్టిక్ పెనం మీద వేసింది. దానిపై చాలా చిన్నగా ఉన్న చెంచాతో ఒకే ఒక్క చుక్క నూనె వేసింది. తర్వాత కాసింత ఉప్పు వేసి దోరగా కాల్చడం మొదలెట్టింది. గింజ కింద పడిపోకుండా మధ్యలో రంధ్రం ఉన్న చెక్క చెంచాను తీసుకుని దాని మధ్యలోకి గింజ వచ్చేలా చేసి గింజను బాగా వేడెక్కించింది. అలా గింజ వేడెక్కినంత సేపూ వీడియో చూస్తున్న ఇన్‌స్టా గ్రామ్ ఆప్ వీక్షకులు అలాగే కన్నార్పకుండా చూశారు. చిట్టచివరికి అది ఒక్కసారిగా పగిలి పాప్‌కార్న్ అయింది. అంతే..
వ్యాఖ్యానాల వెల్లువ
కొద్ది సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో చూసి నవ్వుకున్న వారు కొందరైతే చిర్రెత్తిపోయిన వారు మరికొందరు. అసలు ఇందులో ఏముంది? అని ప్రశ్నించిన వారూ లేకపోలేదు. అయితే రోజువారీ రోటీన్ జీవితంలో బోరు కొట్టిన మాలాంటి వాళ్లకు ఒక్క మొక్కజొన్న గింజ మహా ఉపశమనం కలి్పంచిందని నవ్వుతూ కామెంట్లు పెట్టినవాళ్లు కూడా ఉన్నారు. తమ సహనాన్ని పరీక్షించిందని ఆగ్రహం వ్యక్తంచేసిన వాళ్లకు కొదువేలేదు. ‘‘చివరిదాకా సస్పెన్స్ నన్ను చంపేసింది’అని ఒకతను పోస్ట్‌చేశాడు. ‘ఒక్క గింజ పేలడం చూడ్డం కోసం ఇంత సేపు వీడియో చూశానా!’అని ఇంకొకరు వ్యాఖ్యానించారు. ‘‘డైటింగ్ తొలి రోజు ఇంతే తినాలి’, ‘ఎట్టకేలకు అది పేలింది’, ‘మొత్తం వీడియో చూసే సరికి నా ఓపిక మొత్తం పోయింది’అని ఎవరికి నచి్చనట్లు వాళ్లు కామెంట్లు చేశారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment