సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా టైంపాస్ కోసం తినే ఆహార జాబితాలో పాప్‌కార్న్ ముందుంటుంది. ఇందుకోసం జేజే కంపెనీ వారి రెడీ టూ ఈట్ పాప్‌కార్న్‌కు మార్కెట్‌లో మంచి ఆదరణ ఉంది. ఇది రుచితో పాటు తక్కువ ధరకే లభిస్తుంది. అయితే ఇకపై జేజే పాప్‌కార్న్ కొనాలంటే చుక్కలు చూడాల్సిందే. ఇది 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్(ఏఏఆర్) గురువారం ప్రకటించింది. ఇప్పటికే రేడి టూ ఈట్ పరోటాను కూడా 18 శాతం జీఎస్టీ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసహనం కూడా వ్యక్తం చేశారు. అదే మాదిరిగా ఇప్పడు జేజే పాప్‌కార్న్ కూడా 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చబడినట్లు ఏఏఆర్ తాజా ఉత్తర్వులో పేర్కొంది. (పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ!)
దీనిపై సూరత్‌కు చెందిన జేజే ఎంటర్‌ప్రైజెస్ యాజమాని జె జలారామ్ తమ ఉత్పత్తులపై విధించే జీఎస్టీపై స్పష్టత కోసం ఏఏఆర్‌ను సంప్రదించగా అకా పాప్‌కార్న్ ఉత్పత్తులు అన్ని కూడా 18 శాతం కిందకు వస్తాయని ఏఏఆర్ స్పష్టం చేసింది. దీంతో జేజే తాము నిల్వ పదార్థాలు తయారిలో వాడే నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు ముదలైన పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తులు అన్ని కూడా 5 శాతం పన్ను కిందకే వస్తాయని, అందువల్ల పాప్‌కార్న్‌పై కూడా అదే పన్ను ను కొనసాగించాలని ఏఏఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు ఏఏఆర్ ఆంగీకరించకపోగా 18 శాతం జీఎస్టీని తప్సనిసరిగా వర్తింపచేయాలని హెచ్చరించింది. రెడీ టూ ఈట్‌కు సంబంధించిన ప్యాక్డ్ నిల్వ ఆహార పదార్థాలు అన్ని కూడా 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకే వస్తాయని, అంతేగాక జేజే పాప్‌కార్న్ తృణ ధాన్యాలు వేయించడం ద్వారా తయారు చేసినట్లు తమ తయారి విధానంలో పేర్కొందని, అందువల్ల ఈ పాప్‌కార్న్‌ను 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చబడిందని ఏఏఆర్ తెలిపింది. (పన్ను ఎగవేతదారుల పప్పులుడకవు)
Comments
Please login to add a commentAdd a comment