Authority of Advanced rulings
-
ఇకపై పాప్‌కార్న్ కొనాలంటే చుక్కలే!
సాక్షి, న్యూఢిల్లీ: సాధారణంగా టైంపాస్ కోసం తినే ఆహార జాబితాలో పాప్‌కార్న్ ముందుంటుంది. ఇందుకోసం జేజే కంపెనీ వారి రెడీ టూ ఈట్ పాప్‌కార్న్‌కు మార్కెట్లో మంచి ఆదరణ ఉంది. ఇది రుచితో పాటు తక్కువ ధరకే లభిస్తుంది. అయితే ఇకపై జేజే పాప్‌కార్న్ కొనాలంటే చుక్కలు చూడాల్సిందే. ఇది 18 శాతం జీఎస్టీ పరిధిలోకి వస్తుందని అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్(ఏఏఆర్) గురువారం ప్రకటించింది. ఇప్పటికే రేడి టూ ఈట్ పరోటాను కూడా 18 శాతం జీఎస్టీ జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్లు ఆసహనం కూడా వ్యక్తం చేశారు. అదే మాదిరిగా ఇప్పడు జేజే పాప్‌కార్న్ కూడా 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చబడినట్లు ఏఏఆర్ తాజా ఉత్తర్వులో పేర్కొంది. (పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ!) దీనిపై సూరత్‌కు చెందిన జేజే ఎంటర్ప్రైజెస్ యాజమాని జె జలారామ్ తమ ఉత్పత్తులపై విధించే జీఎస్టీపై స్పష్టత కోసం ఏఏఆర్ను సంప్రదించగా అకా పాప్‌కార్న్ ఉత్పత్తులు అన్ని కూడా 18 శాతం కిందకు వస్తాయని ఏఏఆర్ స్పష్టం చేసింది. దీంతో జేజే తాము నిల్వ పదార్థాలు తయారిలో వాడే నూనె, పసుపు, సుగంధ ద్రవ్యాలు ముదలైన పదార్థాలతో తయారు చేసే ఉత్పత్తులు అన్ని కూడా 5 శాతం పన్ను కిందకే వస్తాయని, అందువల్ల పాప్‌కార్న్‌పై కూడా అదే పన్ను ను కొనసాగించాలని ఏఏఆర్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు ఏఏఆర్ ఆంగీకరించకపోగా 18 శాతం జీఎస్టీని తప్సనిసరిగా వర్తింపచేయాలని హెచ్చరించింది. రెడీ టూ ఈట్‌కు సంబంధించిన ప్యాక్డ్ నిల్వ ఆహార పదార్థాలు అన్ని కూడా 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లోకే వస్తాయని, అంతేగాక జేజే పాప్‌కార్న్ తృణ ధాన్యాలు వేయించడం ద్వారా తయారు చేసినట్లు తమ తయారి విధానంలో పేర్కొందని, అందువల్ల ఈ పాప్‌కార్న్‌ను 18 శాతం జీఎస్టీ స్లాబ్‌లో చేర్చబడిందని ఏఏఆర్ తెలిపింది. (పన్ను ఎగవేతదారుల పప్పులుడకవు) -
పరోటాపై అధిక పన్నులు.. కేంద్రం క్లారిటీ!
న్యూఢిల్లీ: పరోటాలపై అధిక జీఎస్టీ విధిస్తున్నారనే వార్తలపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు స్పష్టతనిచ్చాయి. నిల్వ చేసి అమ్మే పరోటాలపైనే 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపాయి. రెడీ టు ఈట్ పరోటాలపై 5 శాతం జీఎస్టీ మాత్రమే ఉంటుందని జీఎస్టీ అధికారులు వెల్లడించారు. నిల్వ ఉంచి, ప్యాకింగ్ చేసి అమ్మే పరోటాలు మామూలుగా అధిక ధరల్లో ఉంటాయని, వాటిని సంపన్నశ్రేణివారే కొనుగోలు చేస్తారని అధికారులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పన్ను శ్లాబులను పరిశీలించే.. ప్యాక్డ్ ఆహార వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపారు. ప్యాకింగ్ ఆహార పదార్థాలైనందున చౌక ధర బిస్కట్లు, కేకులు, బేకింగ్ వస్తువులపై కూడా 18 శాతం జీఎస్టీ విధిస్తున్న విషయాన్ని గ్రహించాలని పేర్కొన్నారు. టెట్రా ప్యాక్ పాలు, ఘనీభవించిన పాల ప్యాకెట్ల ధరల్లో తేడాలు దీనికి ఉదాహరణ అని తెలిపారు. (చదవండి: పరోటా పంచాయితీపై ఆనంద్ మహింద్రా ట్వీట్) కాగా, అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ (కర్ణాటక బెంచ్) పరోటాలపై 18 శాతం తప్పదని ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. అయితే, సాధారణ రోటీలపై 5 శాతం జీఎస్టీ ఉంటుందని, నిల్వ చేసి అమ్మే బ్రాండెడ్ ఆహార వస్తువులపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని స్పష్టం చేసింది. దాంట్లో భాగంగానే మూడు నుంచి ఐదు రోజులపాటు సంరక్షించి అమ్మే పరోటాలపై 18 శాతం పన్ను వేస్తున్నామని వెల్లడించింది. ఇక పరోటాలపై అధిక జీఎస్టీ విధిస్తున్నారని సోషల్ మీడియాలో నెటిజన్లు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. పరోటాలపై పగబట్టి 18 శాతం పన్నులు వసూలు చేస్తున్నారని, రోటీ వర్గానికి చెందిన పరోటాలపై ఈ వివక్ష ఎందుకని వారంతా కేంద్రాన్ని ప్రశ్నించారు. ఉత్తర భారతంలో రోటీ ఎక్కువగా తింటారని, దక్షిణ భారతంలో పరోటా ఎక్కువ తింటారని, ఇవి కక్షపూరితంగా చేస్తున్న చర్యలని మరికొందరు పేర్కొన్నారు. పరోటాలపై 18 జీఎస్టీ విధించడం చాలా బాధగా ఉందని మహింద్రా అండ్ మహింద్రా చైర్మన్ ఆనంద్ మహింద్రా కూడా ట్విటర్లో చెప్పుకొచ్చారు. హ్యాండ్సాఫ్ పరోటా హాష్టాగ్ ట్విటర్లో ట్రెడింగ్లో ఉంది. -
‘పరోటాతో దేశం ముందు మరో సవాల్’
న్యూఢిల్లీ: పరోటా, రోటీ పంచాయితీపై మహింద్రా అండ్ మహింద్రా చైర్మన్ ఆనంద్ మహింద్రా స్పందించారు. దేశం ముందు కొత్తగా పరోటా సవాల్ వచ్చి చేరిందని ట్విటర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాగా, రోటీ కోవాకు చెందిన పరోటాపై 18 శాతం జీఎస్టీ తప్పదని అథారిటీ ఫర్ అడ్వాన్స్ రూలింగ్స్-కర్ణాటక బెంచ్ (ఏఏఆర్) తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. రోటీ కేటగిరీలో పరోటాను చేర్చలేమని స్పష్టం చేసింది. ఇక ఏఏఆర్ ప్రకటనతో పరోటా ఉనికికే ప్రమాదం వచ్చిందని ఆనంద్ మహింద్రా వ్యాఖ్యానించారు. రోటీ వర్గం నుంచి పరోటాను వేరుచేయడం బాధించిందని అన్నారు. అయితే, భారత్‌లో కొత్తగా ‘పరోటీస్’ అనే వెరైటీ కూడా పుట్టుకొస్తుంది కావొచ్చని పేర్కొన్నారు. విషయమిది.. బెంగుళూరుకు చెందిన ఐడీ ఫ్రెష్ ఫుడ్స్సంస్థ ఇటీవల అథారిటీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్స్ (కర్ణాటక బెంచ్)ను ఆశ్రయించింది. రోటీ కేటగిరికి చెందిన పరోటాపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారని, దాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి చేసింది. రోటీపై 5 శాతం జీఎస్టీ విధిస్తుండగా.. పరోటాపై 18 శాతం పన్ను వసూలు చేస్తున్నారని పేర్కొంది. జీఎస్టీ కేటగిరి 1905 లోనే పరోటాను కూడా చేర్చాలని కోరింది. అయితే, పరోటా, రోటీ తయారీలో తేడాలున్నాయని, 1905 కేటగిరీలో పరోటాను చేర్చలేమని ఏఏఆర్ వెల్లడించింది. 2106 కేటగిరీ ప్రకారం పరోటాపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నామని తెలిపింది. ఇక పరోటాపై అధిక పన్నులు తగవని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. రుచికరమైన పరోటాపై పగబట్టారని సోషల్ మీడియాలో మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. దీంతో ట్విటర్లో హ్యాండ్సాఫ్ పరోటా హాష్టాగ్ ట్రెడింగ్లో ఉంది. With all the other challenges the country is facing, it makes you wonder if we should be worrying about an existential crisis for the ‘Parota.’ In any case, given Indian jugaad skills, I’m pretty sure there will be a new breed of ‘Parotis’ that will challenge any categorisation! https://t.co/IwHXKYpGHG — anand mahindra (@anandmahindra) June 12, 2020 -
‘మ్యాట్’ వివాదానికి... విదేశీ ఇన్వెస్టర్లే కారణం
‘పాత పన్నుల’ వివాదాలపై షా కమిటీ దృష్టి... * కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లపై (ఎఫ్ఐఐ) కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) విధింపునకు సంబంధించి కీలకమైన పాత కేసులన్నింటినీ జస్టిస్ షా కమిటీ పరిశీలిస్తుందని జైట్లీ తెలిపారు. ఇదే అంశంపై పరస్పరం భిన్నమైన తీర్పులు రావడం వల్ల వివాదం ఏర్పడిందని పేర్కొన్నారు. 2012లో అథారిటీ ఆఫ్ అడ్వాన్స్డ్ రూలింగ్స్‌ను (ఏఏఆర్) ఆశ్రయించడం ద్వారా విదేశీ ఇన్వెస్టర్లు స్వయంగా మ్యాట్ సమస్యను తెచ్చిపెట్టుకున్నారని జైట్లీ వ్యాఖ్యానించారు. ఇది ప్రస్తుతం న్యాయస్థానం పరిధిలో ఉన్నందున తమ ప్రభుత్వం భవిష్యత్‌లో మినహాయింపులు ఇవ్వడం తప్ప...పాత కేసుల విషయంలో చేయగలిగిందేమీ లేదని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో కార్యాలయాలు లేని విదేశీ కంపెనీలకు మ్యాట్ వర్తించదంటూ 2010లో ఉత్తర్వులిచ్చిన ఏఏఆర్.. ఆ తర్వాత 2012లో క్యాజిల్‌టన్ సంస్థ తమ మారిషస్ విభాగం నుంచి సింగపూర్ విభాగానికి షేర్లను బదలాయించినప్పుడు నమోదైన లాభాలపై మ్యాట్ కట్టాలంటూ ఆదేశాలిచ్చింది. ఇలాంటి భిన్నమైన ఉత్తర్వుల వల్ల తలెత్తిన పరిస్థితులు, కీలకమైన పాత పన్నుల వివాదాలను నిష్పక్షపాతంగా అధ్యయనం చేసేందుకే షా కమిటీని ఏర్పాటు చేసినట్లు జైట్లీ పేర్కొన్నారు. తమ ప్రభుత్వం పాత లావాదేవీలపై పన్నులు విధించడం లేదని (రెట్రాస్పెక్టివ్), ప్రస్తుతం వివాదాస్పద మైనవన్నీ కూడా పాత కేసులు మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు. గత లాభాలపై మ్యాట్ పేరిట.. సుమారు 68 ఎఫ్ఐఐలకు పన్నుల శాఖ రూ.603 కోట్ల మేర ట్యాక్సులు కట్టాలంటూ నోటీసులు పంపడం వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. అవినీతి నిరోధక చట్టంలోనే లోపాలు.. అవినీతి నిరోధక చట్టంలోనే ప్రాథమికంగా లోపాలున్నాయని జైట్లీ వ్యాఖ్యానించారు. ఉద్దేశపూర్వకమైన అవినీతి నిర్ణయాలను, తప్పిదాలను ఇది ఒకే గాటన కడుతోందని ఆయన చెప్పారు. దీనివల్లే పలువురు ప్రభుత్వాధికారులు, నియంత్రణ సంస్థల అధికారులు సీబీఐ విచారణలు ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. దీంతో సరళీకరణకు ముందు 1988లో రూపుదిద్దుకున్న ఈ చట్టాన్ని సవరించే ప్రక్రియను కేంద్రం ప్రారంభించిందని వివరించారు. పలు నియంత్రణ సంస్థల అధికారులు, ఇతర ప్రభుత్వాధికారులపై అవినీతి ఆరోపణల కింద సీబీఐ విచారణ జరుపుతుండటం, వీటిలో చాలా మటుకు కేసులను ఆ తర్వాత ఉపసంహరిస్తుండటం మొదలైన పరిణామాల నేపథ్యంలో జైట్లీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మాజీ చైర్మన్ సీబీ భవే కూడా ఇలా సీబీఐ విచారణ ఎదుర్కొనాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. ఇలాంటి పరిణామాల వల్లే 1991 తర్వాత ప్రభుత్వాధికారులు నిర్ణయాలు తీసుకోవడమనేది చాలా క్లిష్టంగా మారిందని జైట్లీ పేర్కొన్నారు. త్వరలో షాంఘైకి కామత్ న్యూఢిల్లీ: ప్రస్తుతం నిర్వహిస్తున్న పదవీ బాధ్యతల నుంచి త్వరలో వైదొలగి, బ్రిక్స్ బ్యాంక్ కేంద్ర కార్యాలయం ఉన్న షాంఘైలోని పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అక్కడకు వెళ్లనున్నట్లు కె.వి.కామత్ వెల్లడించారు. ఆయన బ్రిక్స్ బ్యాంక్ తొలి ప్రెసిడెంట్‌గా నియమితులవడం తెలిసిందే. కామత్ ప్రస్తుతం ఐసీఐసీఐ, ఇన్ఫోసిస్లకు నాన్-ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉన్నారు.